23, ఏప్రిల్ 2024, మంగళవారం

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో Satyam Rajesh జాబ్ కోసం హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు అయితే తనకి పెళ్లి అవుతుంది ఆ అపార్ట్మెంట్ లో ఉంటాడు తన భార్య తో కలిసి అయితే అపార్ట్మెంట్ లో తన పక్కన ఉన్న ఫ్లాట్ లో కొంతమంది కుర్రాళ్ళు ఉంటార్ అయితే వాళ్లు గంజాయి తీసుకుంటూ ఉంటారు అయితే హీరో భార్యపై అందులో ఉండే కుర్రాడు మనసు పడుతుంది అయితే దానికి ఎలాంటి పథకం ఆలోచించాడు 

అంతే కాకుండా ఆ కుర్రాళ్ళు రూమ్ లో ఉండే ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో కూడా అలాగే ప్రవర్తిస్తారు అయితే ఈ సినిమా ఆడవాళ్ళకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది అన్నది కాన్సెప్ట్ తో తీసిన సినిమా లాగా ఉంది కానీ ఎక్కడో కొద్దిగా ఆసక్తిగా లేదు ఏదో సో సో గా ఉంది సినిమా !!!

1, ఏప్రిల్ 2024, సోమవారం

Inspector Rishi Movie Review !!!

 

Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉంది ఇప్పుడు లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక ఇన్స్పెక్టర్ అడవిలో అనుమానాస్పదంగా హత్యలు జరుగుతాయి అవి ఎలా అంటే సాలీడు గూడులు కట్టినట్టు మనుషులు అందులో చనిపోయి ఉంటారు అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి చానిపోయే ముందు వాళ్ళకి ఒక వింత ఆకారం కనిపిస్తుంది  

ఇలా ఎందుకు హత్యలు జరుగుతున్నాయి తెలుసుకోవటానికి హీరో అక్కడికి వస్తాడు ఆ తరువాత ఈ పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ మధ్యలో కొద్దిగా బోరింగ్ అనిపించిన చివరకు బాగానే ఉంది కాకపోతే అంత ఆసక్తిగా ఏమి అనిపించలేదు వెబ్ సీరీస్ !!!

30, మార్చి 2024, శనివారం

Mast shades unnayi Ra Movie Review in Telugu !!!

 Mast shades unnayi Ra అభినవ్ గోమతం నటించిన ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో అభినవ్ గొమతం కామెడీ charcter వేసే ఆర్టిస్ట్ ఫస్ట్ టైం హీరోగా నటించడం జరిగింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో ఒక బొమ్మలు వేసే ఆర్టిస్ట్ అయితే తనకు పెళ్లి కుదురుతుంది పెళ్లి కూతురు బాగా చదువుకున్న అమ్మాయి పెళ్ళి పనులు జరుగుతుండగా పెళ్ళికూతురు లేచి వెళ్ళిపోతుంది

ఊరిలో హీరో పరువు మొత్తం పోతుంది ఒక బొమ్మలు వేసే ఆర్టిస్ట్ నీ పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగోదని గ్రహించి ఆ పెళ్లి కూతురు వెళ్ళి పోతుంది mast shades unnayi Ra movie review ఆ పెళ్లి కూతురు మరొక వ్యక్తి ఆఫ్సెట్ ప్రింటర్ ఉన్న మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది అది గ్రహించిన హీరో తను కూడా ఫొటోషాప్ నేర్చుకుని ఆఫ్సెట్ ప్రింటర్ తో ఫ్లెక్స్ బిజినెస్ చేయాలనుకుంటాడు అయితే ఆ తరువాత అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు అక్కడక్కడ కొద్దిగా slow గా ఉంది కానీ చూడ వచ్చు రొటీన్ గానే ఉంటుంది కథ!!!

29, మార్చి 2024, శుక్రవారం

The Goat life Movie Review !!!


 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక సామాన్య కుటుంబం లో జన్మించిన వ్యక్తి తనకంటూ ఒక ఇల్లు సమకూర్చు కొవాలని గల్ఫ్ కంట్రీ కి వెళ్తాడు తనతో పాటు మరొక వ్యక్తి కూడా వస్తాడు అయితే ఇద్దరు కలిసి గల్ఫ్ కంట్రీ వెళ్తారు అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఏజెంట్ తనను మోసం చేశాడని తెలుస్తుంది తన తో పాటు వచ్చిన వ్యక్తిని వేరొక చోట గొర్రెల కాపరిగా చేస్తారు హీరో నీ కూడా ఒంటెలు, గొర్రెలు ఉన్న చోట వేస్తాడు 

అక్కడ ఆ అరబ్ షేక్ మరి దారుణంగా హింసిస్తాడు ఆ అరబ్ షేక్ మాటలు అసలు అర్థం కావు అక్కడినుండి ఎలాగైనా వెళ్లిపోవాలని ప్రయత్నించినా కుదరదు అయితే హీరో చివరికి తను ఊరు ఎలా చేరుకున్నాడు అన్నది సినిమా కథ నిజంగా జరిగిన కథ అని తెలుస్తుంది 

నిజంగా గల్ఫ్ కి వెళ్ళిన వారి కష్టాలు ఎలా ఉంటాయి అని చుపెట్టడం జరిగింది The goat life movie review 

25, మార్చి 2024, సోమవారం

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం 

ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా విడుదల అయింది ముగ్గురు స్నేహితులు ఉంటారు ఒక యూనివర్సిటీ లో డాక్టర్ అవుదామని జాయిన్ అవుతారు అయితే ఆ ముగ్గురు చేసే చిల్లర పనులు భరించలేక వాళ్ళకి డాక్టర్ చేసి వాళ్లకు పట్టాలు ఇచ్చి బయటకు పంపిస్తాడు pricipal అయితే అలా బయటకు వెళ్లిన వాళ్లు భైరవ పురం అనే వూరిలో కి వెళ్తారు 

om bhim bush Movie review ఆ ఊరిలోకి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లు దెయ్యాలను వడిలిస్తానని,లంకె బిందులు ఎక్కడ ఉన్నాయో చెబుతాం అని ఆ వూరి ప్రజలను మోసం చేస్తుంటాడు ఆ విషయం సర్పంచ్ కి తెలియటంతో వాళ్లకు ఆ వూరి సర్పంచ్, కొంతమంది వ్యక్తులు కలిపి ఆ వూరిలో   సంపంగి మహల్ అనే ఒక పాత బంగళా ఉంటుంది అందులో దెయ్యం తో పాటు నిధి కూడా వుందని దానిని తీసుకువస్తే వాళ్ళను నమ్ముతానుఅని చెబుతాడు అయితే ఆముగ్గురు ఆ సంపంగి బంగళా కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తరువాత ఏటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది మిగిలిన కథ నిజంగా ఆ సంపంగి మహల్ లో దెయ్యం ఉందా ? అసలు ఆ దెయ్యం కథ ఏమిటి అన్నది ఫస్ట్ ఆఫ్ కామెడీ గా బాగానే ఉంది క్లైమాక్స్ వచ్చేటప్పటికి సప్పగ సాగింది అని చెప్పాలి అంతగా ఏమి లేదు సినిమాలో ఎన్నో హార్రర్ సినిమాలో చూసే పాత కథ!!!

22, మార్చి 2024, శుక్రవారం

Tantra Movie Review !!!

 Tantra Movie Review in Telugu అనన్య నాగల్ల నటించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా పూర్తిగా క్షుద్ర పూజలకు సంబందించిన సినిమా ఇందులో క్షుద్ర పూజలకు సంబంధించి  వాటి పేర్లను పర్వలుగా విభజించటం జరిగింది ఇందులో అనన్య ఒక పల్లెటూరులో నాన్న,నాన్నమ్మ తో కలిసి జీవిస్తూ ఉంటుంది వాళ్ల నాన్నకు తన అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే తను పుట్టిన వెంటనే తన భార్య చనిపోవటం వలన తన నానమ్మ తో కలిసి జీవిస్తుంది 

Tantra movie review అయితే అనన్య కి ఆత్మలు కనిపిస్తాయి ప్రతి పౌర్ణమి కి రక్తం తాగుతుంది అయితే తనను ఒక అబ్బాయి ప్రేమిస్తాడు ఇలా కథ సాగుతుండగా ఊరిలోకి హీరోయిన్ వాళ్ల అమ్మ చావుకు కారణమైన వ్యక్తి వస్తాడు ఎలాగైనా అనన్య నీ క్షుద్ర దేవతలకు బలి ఇచ్చి మరింత బలం సంపాదించాలి అనుకుంటాడు అయితే అతని కల నెరవేరిందా లేదా అసలు హీరోయిన్ కి ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి అన్నది మిగిలిన కథ మొదటిలో బాగానే ఉన్నా క్లైమాక్స్ కొద్దిగా బోర్ అనిపించింది !!!

21, మార్చి 2024, గురువారం

Abraham ozler Movie review !!!

 Abraham ozler Movie Review In Telugu ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో డిస్నీ hotstar లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది 

ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో జైరాం తన ఫ్యామిలీ తో కలిసి  ఒక ప్రాంతానికి transfer మీద వస్తారు ఇందులో జైరాం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తుంటారు అయితే అక్కడకు వచ్చిన వెంటనే తన పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది ఒక case మీద బయటకు వెళ్తాడు హీరో అయితే బయటకు వెళ్లిన తరువాత అర్థం అవుతుంది తనుకు పోలీస్ స్టేషన్ నుండి కాకుండా బయట నుండి ఎవరో ఫోన్ చేస్తారు ఇంటికి వెళ్ళి చూసే సరికి భార్య,కూతురు కనపడరు

ఆ డిప్రెషన్ లో హీరో కుంగిపోతాడు అయితే కొంతకాలం అయిన తరువాత ఒక murder case వస్తుంది దాని తరువాత వరుస హత్యలు జరుగుతూనే ఉంటాయి అసలు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు,ఎవరు చేస్తున్నారు అన్నది మిగిలిన  Abraham ozler Movie review కథ ఇందులో మమ్ముట్టి కూడా ఒక ప్రధాన పాత్ర చేయటం జరిగింది ఈ సినిమా మొదట కొద్దిగా slow గా ఉండే కొలది బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు !!!

16, మార్చి 2024, శనివారం

Bootaddam bhaskar narayana OTT Release Date

 Bootaddam Bhaskar narayana OTT Release date శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మార్చ్1 న థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది మార్చి 22 నుండి aha ఆహా OTT లోకి రానుంది !!!

14, మార్చి 2024, గురువారం

భ్రమ యుగం OTT విడుదల ?

 మమ్ముట్టి నటించిన భ్రమ యుగం సినిమా థియేటర్ లలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది ఈ సినిమా మార్చి 15 నుండి sony live OTT లోకి రానుంది !!!

10, మార్చి 2024, ఆదివారం

Anweshippin Kandethum సినిమా పై నా అభిప్రాయం!!!


 Anweshippin Kandethum సినిమా తవినో థామస్ నటించిన మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో Netflix OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పరిధిలో ఒక అమ్మాయి కనబడటం లేదని కంప్లైంట్ రావటం తో ఆ case ఎంక్వైరీ మొదలుపెడతాడు ఆ అమ్మాయి నీ ఎవరో చంపేస్తారు  అయితే ఆ case లో ఒక ఆశ్రమం father కు సంబంధం ఉందని  ఆశ్రమం ఎంక్వైరీ కి వెళితే అక్కడ కి అక్కడ ఉన్న ప్రజలు అసలు రానివ్వరు దానికి తోడు తన పై అధికారులు ఆ case లో నిందితుల్ని కాపాడాలని ప్రయత్నిస్తుంటారు అయితే ఎలోగాల ఆ case నీ solve చేస్తాడు నిందితున్ని కూడా పట్టుకుంటాడు అయితే ఆ నిందితుడు తప్పించుకుని పరపోయి చనిపోతాడు 

ఆ నిందితుడు చనిపోవటంతో ఆ case హీరో నీ సస్పెండ్ చేస్తారు అలా సస్పెండ్ అయిన హీరో కొన్నాళ్ళు తరువాత సస్పెండ్ లో వుండగానే s.p ఒక case ను హీరో బృందానికి అప్పచెబుతాడు అయితే అది కూడా ఒక murder case అయితే ఆ case నీ హీరో solve చేశాడు లేదా అన్నది మిగిలిన కథ మొదటగా కొద్దిగా slow గా నడుస్తున్న కథలోకి వెళ్ళే కొద్ది ఇంటరెస్టింగ్ గా ఉంటుంది బాగుంది సినిమా 

Investgation థ్రిల్లర్ ఇష్టపడేవారు నచ్చుతుంది ఈ సినిమా బాగుంది !!!

6, మార్చి 2024, బుధవారం

భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా పై నా అభిప్రాయం !!!

భూతద్దం భాస్కర్ నారాయణ ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
 ఇదొక ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ థ్రిల్లర్ భాస్కర్ నారాయణ అని పిలవబడే భూతద్దం భాస్కర్ చిన్నప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం తన అన్న  ప్రేమించిన అమ్మాయిని ఎవరో చంపేస్తారు ఆ హత్య తన అన్న మీద పడుతుంది అయితే ఆ హత్య తన అన్న చేయకపోయినా ఆ మానసిక వ్యద భరించలేక ఆత్మ హత్య చేసుకుని చనిపోతాడు అప్పటి నుండి అసలు ఆ హత్య ఎవరు చేశారు అన్నది కనిపెట్టడం కోసం డిటెక్టివ్ గా మారతాడు 
ఇలా కథ నడుస్తుంటే అడవిలో తల లేని మొండెం తో వంటిపై దిష్టి బొమ్మ తో శవలు కనపడుతుంటాయి 
కాకపోతే అవి ఎవరు చేశారు అన్నది  ఎటువంటి ఆధారాలు పోలీస్ లకు, డిటెక్టివ్ భాస్కర్ నారాయణకు దొరకదు
అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు ఈ ఉద్దేశం తో చేస్తున్నారు అన్నది మిగిలిన కథ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఈ సినిమా కూడా అంతగా ఏమి లేదనిపించింది మధ్యలో భస్మాసురుడు గురించి ప్రస్తావన ఉంటుంది మరి ఎక్స్పెర్టేషన్ తో కాకుండా మామూలుగా ఒకసారి చూడండి పర్వాలేదు 
ఒకసారి చూడవచ్చు !!!

4, మార్చి 2024, సోమవారం

Amazon prime లో విడుదల అయిన The hand సినిమా పై నా అభిప్రాయం !!!

 

The hand cinema review in Telugu ఈ సినిమా Amazon prime లో అందుబాటులో ఉంది ఇది ఒక కొరియన్ సినిమా ఇంకా లేట్ చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా కేవలం ఒక గంట మాత్రమే ఉంది ఒక wife & husband ఉంటారు husband ఉదయం నిద్ర లేవగానే బాత్ రూం లోకి వెళ్తాడు అయితే అక్కడ బాత్ రూం లో ఒక చెయ్యి వాళ్లకు దర్శనం ఇస్తుంది అది కేవలం చెయ్యి మాత్రమే అది చాలా భయం కారంగా ఉంటుంది దానిని చూసి wife&husband భయ పడతారు సెక్యూరిటీ గార్డ్ నీ ఎమర్జెన్సీ టీమ్ నీ ఫోన్ చేసి పిలుస్తారు

వాళ్లు వచ్చి ఆశ్యర్య పోతారు వాళ్లు వచ్చేలోపు సెక్యూరిటీ గార్డ్ నీ చంపేస్తుంది ఆ చెయ్యి ఎలా ఒకరు తరువాత ఒకరు చనిపోతుంటారు అయితే చివరికి ఆ wife & husband బ్రతికి బట్ట కట్టరా లేదా అనేది మిగిలిన సినిమా అసలు ఆ bathroom kamode లోకి ఆ చెయ్యి ఎలాగ వచ్చింది వాళ్లు బయట పడ్డారా లేదా అన్నది సినిమా ఏదో ఎక్స్పర్టేషన్ తో చూసాను కానీ అంతగా ఏమి లేదు అని చెప్ప వచ్చు !!!

29, ఫిబ్రవరి 2024, గురువారం

తెలుగు దేశం జనసేన కూటమి తాడేపల్లిగూడెం లో జరిగిన బహిరంగ సభ !!!

 వచ్చే ఎన్నికలలో జనసేన,తెలుగుదేశం పార్టీ ల మధ్య పొత్తు కుదిరి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి నిన్న అనగా28/02/2024 న జరిగిన తాడేపల్లిగూడెం లో భారీ బహిరంగ సభ జరిగింది దానికి సంబందించిన వీడియో మీ కొసం !!!

జనసేనాని మాట్లాడుతుండగా తీసిన చిన్న వీడియో క్లిప్ మీకోసం !!!

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మమ్ముట్టి భ్రమ యుగం సినిమా పై నా అభిప్రాయం !!!


 Brama yougam movie review in Telugu మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన భ్రమ యుగం సినిమా తెలుగులో ఫిబ్రవరి 23 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం

ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలో తప్పించుకుని తిరుగుతారు వారు పని చేసే రాజ్యంలో ఏదో యుద్ధం రావటం వలన అయితే అందులో ఒకడుని యక్ష్ణి చంపి తినేస్తుంది మరొక వ్యక్తి ఆ అడవిలో దూరంగా పారిపోతాడు అయితే అలా పారి పోతుండగా ఒక చోట పాడుబడ్డ ఒక ఇల్లు కనబడుతుంది అక్కడికి వెళతాడు అయితే అక్కడ ఒక వంట చేసే వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉంటాడు అయితే ఆ ఇల్లు కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ మనిషి ఈ వ్యక్తిని ఒక పాట పాడమంటాడు పాట పాడతాడు అప్పటి నుండి అక్కడే ఉండిపోమని అంటాడు ఆ ఇల్లు చుట్టూ వాతావరణం తనకి నచ్చదు

అక్కడి నుండి పారిపోవాలని ఎంత ప్రయత్నించినా అది కుదరదు అయితే ఆ ఇంటిలో ఉండే మనుషుల కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

ఈ సినిమా మొత్తం బ్లాక్ & వైట్ లోనే ఉంటుంది మొదట కొంచెం బోరింగ్ అనిపించిన మొత్తానికి అయితే బాగుంది సినిమా horror cinema అని చెప్ప వచ్చు మీకు tumbaad సినిమా చూసి ఉంటే same ఆ సినిమా ఏ గుర్తుకు వచ్చింది మొత్తానికి అయితే నిజంగా ప్రయోగాత్మక సినిమా అని చెప్ప వచ్చు మమ్ముట్టి నటన బాగుంది మిగతా యాక్టర్స్ అంటే కేవలం 4 మాత్రమే కనిపిస్తారు సినిమా అంతా 

మలయాళం సినిమా అంటేనే అంతా అందులో ఒక మేజిక్ ఉంటుంది ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు బాగుంది సినిమా brama yugam movie review!!!

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

మోహన్ లాల్ monster సినిమా పై నా అభిప్రాయం !!!

మోహన్ లాల్ నటించిన monster సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ఇప్పుడు సోది లేకుండా సుత్తి లేకుండా ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఐటీ ఎంప్లాయ్ ఉద్యోగం పోయి ఏక్సిడెంట్ అవ్వటం వలన ఇంటిలోనే ఉంటాడు తనుకు ఒక కూతురు భార్య ఉంటారు భార్య టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంది అయితే ఇలా కథ ముందుకి సాగుతున్న తరుణంలో  ఒక  వ్యక్తి మోహన్ లాల్ తన ఫ్లాట్ అమ్ముకోవటనికి వస్తాడు అయితే అతను ఆ అమ్మాయి టాక్సీ నీ ఒకరోజు బుక్ చేసుకుంటాడు  అయితే రిజిస్ట్రేషన్ కి కొద్ది టైం పడుతుంది అని ఆ టాక్సీ డ్రైవర్ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన నుండి అసలు కథ ముందుకు వెళ్తుంది 

టాక్సీ డ్రైవర్ నీ బయటకు పంపి అక్కడ ఉన్న ఆ కాలు విరిగిన వ్యక్తి నీ మోహన్ లాల్ చంపేస్తాడు అసలు మోహన్ లాల్ ఎందుకు ఆ వ్యక్తిని చంపాడు అన్నది మిగిలిన కథ మొత్తానికి బాగుంది సినిమా అసలు కథ అప్పుడే మొదలవుతుంది 

అసలు ఐటీ ఎంప్లాయ్ నీ ఎందుకు చంపినట్టు ఆ చంపిన case ను వాళ్ల భార్య పైకి వచ్చేలా చేస్తాడు అసలు తను చంపిన వ్యక్తిని తన భార్య పైకి వచ్చేలా ఎందుకు చేశాడు అన్నది మిగిలిన కథ లో ట్విస్ట్ అదే 

బాగుంది సినిమా కథ సింప్లీ superb !!!

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

బూట్ కట్ బాలరాజు OTT లోకి రానుంది ?

 Big boss సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి మొదటివారంలో విడుదల అయింది థియేటర్ లలో ఇప్పుడు ఈ సినిమా ఆహా OTT లో ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

మేటిమాట !!!

 ఆశించి చేసే స్నేహం కన్న

అభిమానించి చేసే స్నేహం చిరకాలం నిలిచిపోతుంది !!!

21, ఫిబ్రవరి 2024, బుధవారం

రేలంగి గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం (దేవాలయం వీడియో)

 భీష్మ ఏకాదశి సందర్భంగా నిన్న అనగా 20/02/2024 మంగళవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం వీడియో లేదు ఆ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయం  వీడియో తీశాను దానికి సంబందించిన వీడియో మీకోసం 


ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరుగుతుంది !!!

డిస్నీ hotstar లో విడుదల అయిన "నేరు " సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఇది మోహన్ లాల్ నటించిన సినిమా నేరు సినిమా డిస్నీ+hotstar OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా గురించి అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో ఒక అంధ అమ్మాయిని ఒక ధనవంతుడు అబ్బాయి మాన భంగం చేస్తాడు దానిని నిరూపించటానికి ఆ అమ్మాయి పడిన వేదన ఎలా ఉంది అని సినిమా కథ మొదట ఈ case ను వాదించటానికి ఎవరు ముందుకు రారు అయితే అప్పుడు ప్రాక్టీస్ మానేసిన  ఒక లాయర్ ఆ case ను వాదించటనికి మొదట సందేహ పడతాడు కానీ ఆ అంధ అమ్మాయిని చూసి చివరకు case ను ఒప్పుకుంటాడు

అయితే ఆ case వాదన ఎలా ముందుకు సాగింది అన్నది సినిమా కథ బాగుంది సినిమా చూడ వచ్చు డిస్నీ+హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది మోహన్ లాల్ యాక్టింగ్ పరంగా బాగుంది ఈ సినిమా neru movie review !!!

ఊరు పేరు భైరవ కోన సినిమా పై నా అభిప్రాయం !!!

 Vuru Peru bairavakona movie review సందీప్ కిషన్ హీరో గా వచ్చిన vi ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊరుపేరు భైరవ కొన సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో హీరో ఒక స్టంట్ మాస్టర్ కింద పనిచేస్తుంటారు అయితే ఒక చోట హీరోయిన్ కనపడుతుంది అప్పటి నుండి హీరోయిన్ నీ ప్రేమిస్తుంటాడు అయితే హీరోయిన్ ఒక గిరిజన తెగ కు సంబందించిన అమ్మాయి ఆ వూరి హీరోయిన్ రావటానికి కారణం ఆ తెగ నివసిస్తున్న ప్రాంతం కబ్జాకు గురవుతుంది దానికి ఆ ప్రాంతం ఎలాగైనా తమదే అని నిరూపించటానికి అక్కడ పూర్వకాలంలో ఖననం చేసిన పుర్రెలు , ఎముకులు తీసుకువస్తుంది 

సినిమా ఆరంభంలో హీరో ఒక పెళ్ళిలో దొంగతనం చేస్తాడు ఆ నగలుతో పారిపోవాలని అనుకుంటాడు అయితే అనుకోకుండా భైరవ కోన అనే వూరిలో అడుగుపెదతాడు ఆ వూరిలో జనం కొంచెం విచిత్రంగా ఉంటారు ఇంతకు తెలిసింది ఏమిటంటే ఆ వూరిలో ఉండే వారు అందరూ అత్మలే  ఆవురిలో ఉండే అత్మలలో తను ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది 

అయితే హీరోయిన్ ఎలా చనిపోతుంది అసలు ఆ ఊరిలో ఆత్మలు ఎందుకు ఉన్నాయి అసలు హీరో దొంగతనం ఎందుకు చేశాడు  ఆ భైరవ కొన కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథలో ఏదో miss అయినట్టు అనిపించింది Vuru Peru bairavakona movie review Telugu ఏదో సో సో గా ఉంటుంది కథ 

పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు అంతా ఊహించినట్టుగానే ఉంటుంది కథ పెద్దగా ఆసక్తి కంబరిచెంత కథ అయితే ఏమి కాదు !!!

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆహా లో విడుదల అయిన భామ కలాపం 2 సినిమా పై నా అభిప్రాయం !!!

 ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భామ కలాపం సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు 2 వచ్చింది మొదటి పార్ట్ లో ఒక వంటలు చేసే గృహిణిగా youtuber పెద్ద పేరు సంపాదించాలి అనుకుని పక్క వారి విషయాలలో వేలు పెట్టే అలవాటు ఉండటం వలన తన భర్త, కుటుంబం కష్టాల్లో నెట్టేది

ఇంకా రెండవ పార్ట్ లో కథ ఏమిటంటే యూట్యూబ్ వీడియో ల వల్ల ఫేమస్ అయిన తరువాత ఆ వచ్చిన డబ్బుతో ఒక హోటల్ పెట్టుకుంటుంది అయితే ఇక నుండి ఎటువంటి గొడవలకు వెళ్లానని భర్తకు ప్రమాణం చేస్తుంది అయితే వేరొక చోటికి వెళ్ళిన తరువాత అక్కడ ఒక హోటల్ నడుపుతుండంగా ఒక క్రిమినల్ నీ అనుకోకుండా పోలీస్ లకు పట్టిస్తుంది అయితే ఆ క్రిమినల్ బయటకు వచ్చి చంపేస్తానని బెదిరిస్తాడు

అయితే అతడిని తప్పించుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ నీ అశ్రయిస్తుంది అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ క్రిమినల్ నిచంపేసి ఆ case నీ ప్రియ మణి పై వేయాలని భావించి ప్రియమణికి బ్లాక్ మెయిల్ చేస్తాడు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ప్రియ మణి నీ అడ్డం పెట్టుకుని తను ఏమి సాధించాలని అనుకుంటున్నాడు చివరికి ఆ కోరిక నేర వెరిందా లేదా అన్నది మిగిలిన కథ 

ఒక సారి చూడ వచ్చు మళ్ళీ దీనికి కొనసాగింపుగా భామ కలాపం 3 కూడా ఉంది !!!

12, ఫిబ్రవరి 2024, సోమవారం

Bakshak Movie Review !!!

 

Netflix OTT లో విడుదల అయిన భక్షక్ సినిమా హిందీ సినిమా ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరోయిన్ ఒక జర్నలిస్ట్ ఒక ఛానల్ కూడా ఉంటుంది కాకపోతే ఆ ఛానల్ నీ ఎవరు పెద్దగా చూడరు అయితే ఒక విషయం తెలుస్తుంది అది ఏమిటి అంటే ఒక బాలిక వసతి గృహంలో బాలికలు పై లైంగిక దాడులు జరుగుతాయి వాటిని బయటపెట్టి దాని వెనుక ఉన్న వ్యక్తిని బండారం బయట పెడదాం అనుకుంటుంది కానీ రాజకీయ అండతో ఆ వ్యక్తి బయట పడడు ఆ వ్యక్తి గా నటించింది cid సీరియల్ లో వచ్చే అభిజిత్ ఇందులో విలన్ లాగా నటించాడు 

అయితే చివరికి ఆ బాలిక వసతి గృహంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు బయట ఎలా పెట్టింది దానికి హీరోయిన్ పడ్డ కష్టం ఏమిటి అన్నది మిగిలిన కథ మొదట కొంచెం ఆసక్తిగా మొదలైన కథ వెళ్ళే కొద్ది బోరింగ్ గా అనిపించింది రొటీన్ గానే ఉంది పెద్దగా ఏమి లేదు సినిమా లో !!!

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

పేరుపాలెం బీచ్ లో సరదాగా కాసేపు ?

 పేరుపాలెం బీచ్ మొగల్తూరు దగ్గరగా ఉన్న బీచ్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉండే బీచ్ కావడంతో ఫ్యామిలీ తో సరదా గా కాసేపు అల వెళ్ళాం దాదాపు మా ప్రయాణం 3 గంటలు పైనే పట్టింది 

బీచ్ అంటే ఒక సరదా ఎన్ని బాధలు ఉన్న ఎన్ని కష్టాలు కాసేపు వాటన్నింటినీ మర్చి పోయే ఒక ఉపశమనం అంతే మేము మంగళవారం ఫిబ్రవరి 6 తారికున 2024 లో వెళ్ళాము 

కాసేపు అలా సెడతీరి కేవలం ఆదివారం మాత్రమే జనం ఉంటారు అనుకున్నాను కానీ మంగళవారం కూడా ఉన్నారు జనం అక్కడ తీసిన కొన్ని ఫోటోలు 



ఇప్పటికే మూడు సార్లు వెళ్లిన కూడా మొదటి సారి వెళ్ళన్నప్పటి లాగే కొంచెం భయంవేసింది తరువాత అలవాటు అయింది కొంచెం కొంచెం భయం తగ్గింది మొత్తానికి ఫ్యామిలీ కి, మనకి కొంచెం ఆట విడుపు గా ఉంది !!!

8, ఫిబ్రవరి 2024, గురువారం

అంబాజి పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పై నా అభిప్రాయం !!!


 కలర్ ఫోటో ఫేం సుహస్ నటించిన సినిమా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2 న థియేటర్లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటారు తన కులపు వృత్తి అయిన పని చేసుకుంటూ ఆ ఊరిలోనే ఉండే ఒక అగ్ర వర్ణం కులపు అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ విషయమే వాళ్ల ఇంటిలో తెలుస్తుంది అయితే హీరోకి ఒక అక్క ఉంటుంది అక్క తను కవల పిల్లలు అయితే తన అక్క బాగా చదివి టీచర్ అవుతుంది

ఆ వూరి స్కూల్ లోనే టీచర్ గానే పనిచేస్తుంది అయితే ఆ టీచర్ జాబ్ ఆ వూరి పెద్ద మనిషి వేయిస్తాడు అయితే ఊరంతా రక రకాలుగా అనుకుంటారు ఆ పెద్ద మనిషి ఒక సారి ఆ స్కూల్ లో సిమెంట్ బస్తాలు వేస్తాడు దానిని ఆ టీచర్ అడ్డుకుంటుంది దానితో మాట మాట పెరిగి చివరికి ఆ వూరి పెద్ద మనిషికి హీరో వాళ్ల అక్కకి పెద్ద గొడవ జరుగుతుంది అంతే కాకుండా ఆ పెద్ద మనిషి  చెల్లెలు,హీరో ప్రేమ విషయం తెలిసిపోతుంది 

ఆ కోపంతో ఆ హీరో వాళ్ల అక్కని వివస్త్ర చేస్తాడు అక్కడి నుండి కథ ఏ విధంగా మలుపు తిరిగింది చివరకు హీరో ఏమి చేశాడు అన్నది మిగిలిన కథ 

ఈ సినిమా 2007 లో జరిగినట్టు చూపించటం జరిగింది ఒక అగ్ర వర్ణానికి,ఒక తక్కువ వర్ణానికి మధ్య కొట్లాట గా ఈ సినిమా లో చూపించటం జరిగింది పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు  ambaji Peta marriage band movie review in Telugu 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

Gunturu karam OTT Release date ?

 Super star మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్ లుగా వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో థియేటర్ లలో విడుదల అయింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇప్పుడు ott లోకి రానుంది ఈ సినిమా Netflix OTT లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Telugu Motivational quotes !!!

 


Paramporul Movie Review In Telugu !!!

 Paramporul Movie Review ETV win OTT లో విడుదల అయిన paramporul మూవీ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో Etv win OTT లో అందుబాటులో ఉంది 

ఈ కథ వ్యవసాయం కోసం భూమి తవ్వుతున్న ఒక రైతుకి ఒక విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహం చాలా పురాతనమైన బుద్దుని విగ్రహం దాదాపు 1000 సంవత్సరాల క్రితం ది అయితే ఆ విగ్రహం ఒక వ్యక్తి ఆ రైతు దగ్గరనుండి ఆరైతు నీ చంపి తీసుకుంటాడు ఆ తరువాత ఆ విగ్రహం ఎలా చేతులు మారింది ఒక డబ్బు అశా ఉండే పోలీస్ ఆఫీసర్ కి,తన చెల్లెలు ఒక వ్యాధితో బాధపడుతుంది తన treatement కోసం హీరో దొంగతనాలు చేస్తుంటాడు వీళ్ళకి ఆ విగ్రహం దొరుకుతుంది
అప్పటినుండి వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నది సినిమా కథ ఈ సినిమా కథ మొదటిలో కొంచెం బోరింగ్ అనిపించిన చూసే కొలది మంచి ఆసక్తి ఏర్పడుతుంది మొత్తానికి అయితే ఒకసారి చూసే సినిమా paramporul movie review in Telugu ఇంటరెస్టింగ్ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారు కి నచ్చుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కి,హీరోకి మధ్య ఆ విగ్రహం ఎలాంటి భేదాలు తీసుకువచ్చింది చివరికి పోలీస్ ఆఫీసర్,హీరో కథ ఎలా ముగిసింది అన్నది సస్పెండ్ తో end చేయటం జరిగింది హీరోయిన్ పెద్ద పాత్ర ఏమి ఉండదు సో సో గా వెళ్ళిపోతుంది 
 ఈ సినిమా ఈటీవీ Win OTT లో అందుబాటులో ఉంది ఈ సినిమా !!!

31, జనవరి 2024, బుధవారం

విక్టరీ వెంకటేష్ సైందవ్ movie OTT లోకి ?

 సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా Saindhav సినిమా ఇప్పుడు ott లోకి రానుంది ఈ సినిమా action entertainer గా వచ్చిన సినిమా జనవరి 13 న విడుదల అయింది 

ఇప్పుడు ఈ సినిమా Amazon prime లో ఫిబ్రవరి మొదటివారంలో వస్తుంది !!!

The beast below Movie Review in Telugu !!!

 The beast below movie Review in Telugu 

ఇది ఒక monster సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది YouTube లో leio పేరుతో అందుబాటులో ఉంది ఇది ఒక థాయ్ లాండ్ సినిమా ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక ర్యాంప్ సింగర్ వాళ్ల తాత చనిపోవడంతో వాళ్ళ ఊరు వెళ్తాడు అక్కడ తన చిన్నప్పటి స్నేహితురాలు అయినటువంటి హీరోయిన్ ఒక youtuber గా చేస్తుంది ఒక ఎడారి లాంటి ప్రదేశంలో నీటి కోసం వేతకమని ఒక పోటీ పెడుతుంది ఆ పోటీకి prizemoney కూడా ఎక్కువగా ఉండటంతో చలమంది ఆ పోటీకి వస్తారు 

హీరో వాళ్ల తాత ది అదే పని కావడంతో హీరోకి చిన్నప్పుడు వాళ్ల తాత ఆ పని నేర్పిస్తాడు అందుకని హీరోకుడా ఆ పోటీలో పాల్గొంటాడు అయితే అక్కడ ఒక monster రాక్షస బల్లి లాంటిది ఆ ఎడారి కింద భాగంలో ఉంటుంది అక్కడికి వచ్చిన వారిని అది కొంతమందిని చంపేస్తుంది కొంతమందిని తీసుకువెళ్ళి కింద దాని స్థావరంలో దాచేస్తుంది

హీరో ఆ రాక్షస భారి నుండి అక్కడకు వచ్చిన వారిని ఎలా కాపాడాడు చివరకు ఏమైంది అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు ఎక్కడ adult సన్నివేశాలు లేవు 

గ్రాఫిక్స్ కూడా బాగుంది చాలా సహజంగా ఉంది సినిమా బాగుంది సినిమా మీకు ఖాళీ టైంలో ఒకసారి చూడ వచ్చు !!!

The beast below movie review 

24, జనవరి 2024, బుధవారం

Victory Venkatesh Saindhav movie review !!!


 Victory Venkatesh Saindhav movie review in Telugu వెంకటేష్ 75 వ సినిమాగా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా జనవరి 13 న థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Hit సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి డైరెక్టర్ ఈ సినిమా హిట్ సినిమా సీరీస్ లాగా ఉంటుంది అనుకున్నాను చంద్రప్రస్తా అనే ప్రాంతంలో కొంతమంది యువకులకు మత్తుమందు,గేమ్స్ తో వాళ్ళను బానిసలు చేసి వారితో అడ్డమైన పనులు చేయించుకునే ఒక విలన్ గ్రూప్ వారికి కావాల్సిన గన్,డ్రగ్స్ తో ఒక container షిప్ యార్డు కి వస్తుంది వాటిని హీరో వాళ్లకు దక్కకుండా అడ్డుపడటాడు

హీరో కి ఒక కూతురు ఉంటుంది తను ఒక వ్యాధి తో బాధపడుతుంది ఆ వ్యాధి నయం అవ్వటానికి ఒక ఇంజెక్షన్ చేయాలి ఆ ఇంజెక్షన్ ఖరీదు 15 కోట్ల రూపాయలు ఆ డబ్బును హీరో ఎలా సంపాదించాడు ఆ విలన్ లని ఎలా అడ్డుకున్నాడు venkatesh movie review Saindhav

అసలు హీరో Saindhav గతం ఏమిటి అన్నది మిగిలిన బహుశా దీనికి కొనసాగింపు గా ఇంకొక భాగం ఉందని తెలుస్తుంది ఇంకా సినిమా విషయానికి వస్తే యాక్షన్ సంబంధించి సినిమా కొద్దిగా సెంటిమెంట్ టచ్ చేశారు

అంతగా ఏమి లేదు just average సినిమా action సినిమాలు ఇష్టపడేవారు వారి ఖాళీ సమయంలో ఒకసారి చూడ వచ్చు !!!

22, జనవరి 2024, సోమవారం

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేడు 22/1/2024 !!!

 

నేడు అనగా 22 జనవరి 2024 లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య లో రామ మందిరం నిర్మాణం అందులో శ్రీ రాములు వారు బాల రాముడుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు

అతిరదుల మహా రథులు కొలువై ఉన్న అందరి సమక్షంలో బాల రాముడు దర్శనం ఇచ్చాడు చూడ ముచ్చట గా ఉన్న ఆ రూపం ముగ్ధ మనోహరమైన ఆ రాముడు చాలా ఘనంగా జరిగాయి 

దాదాపు 500 సంవత్సరాల పోరాట ఫలితం ఇప్పుడు దక్కింది 

జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ !!!

21, జనవరి 2024, ఆదివారం

Animal movie OTT release ?

 Animal movie OTT release Date సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మీక జంటగా వచ్చిన సినిమా Animal movie థియేటర్ లలో విడుదలై పెద్ద రచ్చే చేసింది ఇప్పుడు ఈ సినిమా Netflix OTT లోకి January 26 న విడుదల అవుతుంది !!!

20, జనవరి 2024, శనివారం

ప్రభాస్ సలార్ OTT లోకి వచ్చేసింది !

 రెబల్ స్టార్ ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సలార్ సినిమా డిసెంబర్ లో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి వచ్చింది Netflix OTT లోకి జనవరి 19 నుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!

19, జనవరి 2024, శుక్రవారం

Kota bommali p.s movie Review

 Kota bommali p.s movie review శ్రీకాకుళం జాన పద గేయం లింగిడి లింగీడి పాటతో చాలా ఫేమస్ అయిన సినిమా కోట బొమ్మాళి p.s ఇది థియేటర్ లలో విడుదలై ఇప్పుడు అహ ott లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

కోట బొమ్మాళి p.s లో ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు శ్రీకాంత అక్కడికి  కొత్తగా జాయిన్ అవుతాడు హీరో అయితే అప్పుడే అక్కడ ఎలక్షన్ లు జరుగుతాయి రూలింగ్ పార్టీ కి సంబంధించి ఒక కులపు వ్యక్తిని అనుకోకుండా accident చేస్తారు హీరో, శ్రీకాంత్,హీరోయిన్,ఈ ముగ్గురు ఆ vehicle లోనే ఉంటారు అయితే ఆ ముగ్గురిని పట్టుకుని సస్పెండ్ చేస్తేనే తమ కులపు ఓట్లు పడతాయని హోం మినిస్టర్ ని బెదిరిస్తాడు ఆ కులపువాల్లు

అయితే హోం మినిస్టర్ వీళ్ళను పట్టుకోవటానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నీ పెడతారు వరలక్ష్మి శరత్ కుమార్ అయితే శ్రీకాంత,హీరో,హీరోయిన్ దొరికారా లేదా అన్నది మిగిలిన కథ 

ఈ కథ మొదట సదా సీద గా మొదలైన తరువాత ఆసక్తిగా ఉంటుంది ఎత్తులుకు పై ఎత్తులు గా సాగుతుంది kotabommali p.s movie review Telugu మొత్తానికి బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

15, జనవరి 2024, సోమవారం

Attili subrahmanya swamy sashti 2023

 Attili subrahmanya sashti 2023 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు షష్ఠి కి సంబంధించి వీడియోలు ఇక్కడ ఉన్నాయి చూడండి attili sashti 2023 

ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి వేడుకలు మీరు చూసి తరించండి 

Attili subbarayudi sashti 2023 ఇక్కడ స్వామి వారి షష్ఠి రోజున పెద్ద మొత్తం లో అన్న సమారాధన జరుగుతుంది 15 రోజులు వరుకు వివిధ సాంస్కృతిక కార్య్రమాలతో జరుగుతాయి !!!



Hanuman movie Review హనుమాన్ సినిమా పై నా అభిప్రాయం !!!

Hanuman movie review in telugu ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరో గా వచ్చిన సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 థియేటర్లలో విడుదల అయింది ఈ సినిమా ఇప్పుడు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
సూపర్ పవర్స్ కోసం చిన్నప్పటి నుండి ప్రయత్నిస్తాడు విలన్ అయితే అది సాధించటానికి కన్న తల్లి,తండ్రిని సైతం చిన్నప్పుడే చంపేస్తాడు 
మరోవైపు హీరో అంజనాద్రి అనే ఊరిలో హీరో ఉంటాడు ఒక సాధారణ మనిషి అనుకోకుండా ఒక హనుమాన్ రక్తపు చుక్కతో ఏర్పడిన మణి ఒకటి దొరుకుతుంది అప్పటినుండి తనకు కొన్ని శక్తులు వస్తాయి 
Hanumam movie review ఆ శక్తులతో హీరో విలన్ ఎలా ఎదుర్కొన్నాడు మిగిలిన కథ ఏమిటి అన్నది సినిమా కథ రొటీన్ స్టోరీ అయినప్పటికీ devotional trance లోకి కథలో తీసుకెళ్లటం లో డైరెక్టర్ success అయ్యాడు
బడ్జెట్ తక్కువ అయినప్పటికీ చాలా బాగా తీశాడు
ఈ సంక్రాంతికి ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా బాగుంది గ్రాఫిక్స్ బాగున్నాయి నటి నటులు యాక్టింగ్ కూడా బాగుంది హీరోయిన్ పెద్ద స్కోప్ ఉండదు
బాగుంది సినిమా అందరూ చూడ వచ్చు !!!

Sachi movie Review సాచి సినిమా పై నా అభిప్రాయం !!!

 Amazon prime లో విడుదల అయిన చిన్న సినిమా సాచి ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందని ఎవ్వరికీ తెలియనే తెలీదు ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక నాన్న,అమ్మ, వాళ్ళకి ముగ్గురు కూతుర్లు అయితే వాళ్ళ నాన్న క్షౌర వృత్తిలో ఆ కుటుంబాన్ని నడుపుతుంటారు అయితే అతనికి మాటి మాటికి తలపోటు రావడంతో హాస్పిటల్ లో చూపించడంతో బ్రెయిన్ tumer ఉందని తెలుస్తుంది అయితే చివరకి అతని చనిపోతాడు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య,పెద్ద కూతురు ఆ ఊరిలో పని కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కడ దొరకదు చివరకి పెద్ద అమ్మాయి తన నాన్న కొనసాగించిన క్షౌర వృత్తిలో నే కొన సాగుతుంది 

ఆ అమ్మయి తన వృత్తి జీవితంలో ఎన్ని అవమానాలు,అడ్డంకులు ఎదురయయాయి అన్న మిగిలిన సినిమా కథ చాలా స్లో గా నడుస్తుంది చూసే వారికి చాలా బోరింగ్ గా ఉంటుంది ఇది నిజంగా జరిగిన కథ అయితే అదే ఊరిలో కొన్ని హత్యలు జరుగుతాయి వాటికి కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ sachi movie Review in Telugu 

మీకు టైం ఉంటే చూడండి లేదా వదిలేయండి చాలా అంటే చాలా స్లో గా ఉంటుంది low budget movie కాబట్టి అలా ఉంది అనుకుంటు న్నాను 

10, జనవరి 2024, బుధవారం

90s A middle class biopic webseries Reveiw !!!


 90s A middle class biopic webseries Reveiw శివాజీ,తొలి ప్రేమలో లో పవన్ కళ్యాణ్ చెల్లెలు గా నటించిన వాసుకి జంటగా వచ్చిన webseries ఇది Etv win OTT లో అందుబాటులో ఉంది ఇంకా అసలు ఆలోచించకుండా ఈ webseries ఎలా ఉందో ఒకసారి చూద్దాం !!!

ఇది నిజంగా 90s connect అయ్యే webseries ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ,నాన్న,ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు వాళ్ల ఫ్యామిలీ లో జరిగే సంఘటనలు, ఘర్షణలు,కోపాలు,బుజ్జగింపులు,ఇసాడింపులు,కోరికలు,ఆశలు,అన్ని ఉంటాయి ఫ్యామిలీ అందరూ తప్పక చూడవలసిన కంటెంట్ ఎక్కడ అసభ్యంగా ఉండదు సింప్లీ సూపర్

ఇందులోని పాత్రలు నటించలేదు జీవించారు అని చెప్ప వచ్చు చాలా బాగుంది 90s A middle class biopic webseries Reveiw in Telugu ఒక మధ్య తరగతి కుటుంబ పెద్దగా శివాజీ, అతని భార్యగా వాసుకి తన పిల్లలు నటన చాలా బాగుంది ఒక మధ్య తరగతి వాడు పడేఆర్ధిక ఇబ్బందులు చాలా బాగా ఇందులో చూపించడం జరిగింది !!!

6, జనవరి 2024, శనివారం

Conjuring Kannappan Movie Review !!!

 Conjuring Kannappan Movie Review       ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులొ కుడా అందుబాటులొ ఉంది netflix  OTT  లొ అందుబాటులొ ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ?

Conjuring kannappan Movie Review in Telugu తమిళ్ కామెడీ యాక్టర్ ఇందులో హీరో గా నటించాడు ఈ సినిమా కథ ఒక ఫ్యామిలీ ఉంటుంది అమ్మ,నాన్న,మావయ్య, హీరో అయితే  ఒక సారి స్నానం  చేయటానికి వాళ్ళ ఇంటిలో నీళ్ళు ఉండవు దానితో తన ఇంటి పక్కన ఉన్న బావిలో నీటిని తోడుతున్నప్పడు హీరో కి ఒక వస్తువు దొరుకుతుంది హీరో దానికి ఉన్న ఈక పీకేస్తాడు అప్పటి నుండి తన కలలో ఒక విధమైన బంగాల లో ఉన్నట్టు తను అక్కడి నుండి బయటకు రావటానికి ప్రత్నిస్తాడు అందులో దెయ్యాలు కూడా ఉంటాయి conjuring Kannappan movie Review నిద్ర నుండి బయటకు వచ్చిన కూడా అతనికి ఆ కల తాలూకు దెబ్బలు అలాగే ఉంటాయి 

అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ వస్తువు కున్న ఈకలు పీకేస్తారు  వాళ్ళను ఆ దెయ్యాలు బంగళా నుండి హీరో ఎలా కాపాడాడు అన్నది మిగిలిన కథ ఇందులో నాజర్ ఎక్స్రోసిస్ట్ ఏడుకొండలు పాత్రలో ఉంటాడు ఆ దెయ్యాలు నుండి వాళ్ళను ఎలాగ బయటకు తీసుకురావాలి అని చెబుతుంటారు మొత్తానికి ఇది కామెడీ హార్రర్ సినిమా పెద్దగా ఏమి లేదు  

అసలు ఆ బంగళా లోకి ఆ దెయ్యాలు ఎలా వచ్చాయి ఆ వస్తువు కథ ఏమిటి అన్నది మిగిలిన కథ రొటీన్ గానే ఉన్న కొద్దిగా కొత్తదనం గా ఉంది కాకపోతే  అంత ఆసక్తి గా అయితే లేదు జస్ట్ ఏవరేజ్ అంటే conjuring kannappa movie Review కానీ కామెడీ కోసం ఒకసారి చూడ వచ్చు Netflix Ott లో తెలుగులో అందుబాటులో ఉంది చూడాలనుకున్న వారు ఒకసారి చూసేయండి మరి !

4, జనవరి 2024, గురువారం

కోట బొమ్మాళి PS ఆ OTT లోకి రానుంది ?

 కోట బొమ్మాళి p.s సినిమా శ్రీకాకుళం సాంగ్ తో ఫేమస్ అయిన సినిమా నవంబర్ 24 థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది అహ OTT లో జనవరి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

3, జనవరి 2024, బుధవారం

Calling Sahara movie Review సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర సినిమాపై నా అభిప్రాయం !!!


 Calling sahasra movie review in Telugu సుడిగాలి సుధీర్ నటించిన ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి Amazon prime లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Calling sahasra movie Review ఇందులో ముందుగా ఒక క్రైం వెబ్సైట్ లో కొంతమంది అమ్మాయిల్ని హింసించే ఆనందం పొందుతుంటారు కొంతమంది డబ్బు ఉన్నవాళ్లు అది చూసి అనందపడుతుంటారు ఇది ఇలా ఉంటే 

హీరో సాఫ్టవేర్ లో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా పనిచేస్తుంటారు అయితే తను జాయిన్ అయిన కంపెనీ లో ఒక సిమ్ తీసుకుంటాడు ఆ సిమ్ తీసుకున్న దగ్గర నుండి హీరోకి సహస్ర పేరుతో calls వస్తాయి హీరో వాళ్ల అక్క కుడా అనుమాన స్థితిలో చనిపోతుంది తన అక్కకి పట్టిన గతే ఎవరకు పట్టకూడదని సైబర్ ఎక్స్పర్ట్ గా ఒక resq అనే సాఫ్ట్వేర్ కనిపెడతాడు 

ఇందులో హీరోయిన్ కి పెద్ద స్కోప్ ఉండదు మొదట ఇంట్రెస్ట్ గా సాగుతుంది కథ లోకి వెళ్ళే కొద్ది అంతగా ఇంట్రెస్ట్ ఉండదు calling Sahara movie Review

ఇంతకీ తనకు calls చేసి విసిగిస్తున్న  సహస్ర ఎవరు ఇంతకీ ఆ డార్క్ క్రైం  వెబ్సైట్ కి హీరోకి ఏమిటి సంబంధం అన్నది కథ 

సుడిగాలి సుధీర్ కొద్దిగా acting ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది జస్ట్ average అంతే అంతగా ఏమి ఉండదు!!!


2, జనవరి 2024, మంగళవారం

Annapoorani movie Review అన్న పుర్ని సినిమా పై నా అభిప్రాయం !!!

 

Annapoorani movie Review in Telugu లేడీ సూపర్ స్టార్ నయన తార 75 వ సినిమాగా విడుదల అయిన అన్నపూరని సినిమా తమిళ్ లో విడుదల అయింది ఇప్పుడు Netflix  లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Annapoorani movie Review Telugu ఇందులో హీరోయిన్ ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుడుతుంది వాళ్ల నాన్న గుడిలో ప్రసాదాలు చాలా నిష్టగా చేస్తారు అయితే చిన్నప్పటి నుండి హీరోయిన్ కి వంటలు అంటే ఇష్టం ఆ ఇష్టంతో నే ఇండియా లోనే మంచి shef అవ్వలనుకుంటుంది

ఆ విషయం ఇంటిలో చెబితే shef అయితే nonveg కూడా వండాలని అది మన కుటుంబానికి పడదని వాళ్ళ నాన్న చెబుతాడు అయిన వినకుండా హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవుతుంది అక్కడి నుండి తన ప్రయాణం ఎలా సాగింది దానికి తన ఫ్రెండ్ ఫరాన్ సహాయం ఎలా చేశాడు చివరికి తన గమ్యం చేరు కుందా లేదా అన్నది కథ 

జస్ట్ average అంతే!!!

Annapoorani movie Review Telugu 

1, జనవరి 2024, సోమవారం

12th Fail Movie Review 12th ఫెయిల్ సినిమాపై నా అభిప్రాయం!!!


 12th fail Movie Review in Telugu Disney hotstar లో విడుదల అయిన ఈ సినిమా డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ లో ఉంది ఇంకా ఈ సినిమా వాస్తవ కథ ఆధారంగా తీసిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1997 సంవత్సరం చంబల్ అనే ప్రాంతంలో మనోజ్ అనే కుర్రాడు ఆ ఊరిలో 12 త్ పాస్ అవ్వటానికి చిట్టిలు పెట్టి పాస్ అవుదాం అనుకుంటాడు అయితే అక్కడికి ఒక dsp వచ్చి దానిని ఆపేసాడు అయితే హీరో 12 పాస్ అవ్వడు అయితే కుటుంబం గడపడానికి మనోజ్ తన అన్నతో కలిసి ఆటో నడుపుతాడు అయితే ఆ వూరి ఎమ్మెల్యే గొడవతో తన అన్నని అరెస్ట్ చేస్తాడు అయితే మనోజ్ DSP తో మాట్లాడి తన అన్నని విడిపిస్తడు

అయితే అప్పుడు మనోజ్ ఎలాగైన మంచి పోలీస్ అవ్వాలని అనుకుంటాడు తన నాన్నమ్మ దగ్గర పెన్షన్ డబ్బులతో పట్టణం ప్రయాణం అవుతాడు అయితే దారి ప్రయాణంలో  ఆ డబ్బులు దొంగలిస్తారు 

12th fail Movie Review in Telugu డబ్బులు పోగొట్టుకుని పట్టణం చేరుకుంటాడు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు exams అన్ని cancel అయ్యాయి అని చెబుతాడు తను. సివిల్స్ కి prepare అవుతున్నట్టు చెబుతాడు అయితే హీరో కూడా prepare అవుదాం అని ఢిల్లీ వెళ్తాడు 

12th fail movie Review Telugu ఢిల్లీ కి చేరుకున్న హీరో తన చేతిలో చిల్లి గవ్వ లేకుండా సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యాడు అన్నది సినిమా కథ 

చాలా బాగుంది సినిమా ఇది నిజంగా జరిగిన కథ మనం రోజు చదివే దినపత్రికలో వస్తుంటాయి కదా రైతు బిడ్డ ips, అయ్యాడు ఐఏఎస్ అయ్యాడు అలాంటిదే కథ 

చాలా సహజంగా ఉంది కథ ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు !!!

Happy new Year 2024 !!!


 ఆంగ్ల నూతన సంవత్సర శుభకాంక్షలు 2024

మీ ఆశలు ,కోరికలు, మీ గమ్యాలు నెరవేరాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి 


మేటి మాట !!!