28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఆహా ott లో విడుదల అయిన "జల్లికట్టు" webseries పై నా అభిప్రాయం !!!

తమిళ్ డైరెక్టర్ వెట్రిమరాన్ కథ స్క్రీన్ప్లే లో వచ్చిన జల్లికట్టు webseries AHA OTT లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఈ వెబ్ series మొదటి భాగం కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఊరిలో తామర కులం అని పెద్ద జమిందార్ కుటుంబం ఉంటుంది అదే ఊరు పక్క ఊరిలో ముత్తయ్య అనే అవుల మంద మేపుకునే వాళ్ళు ఉంటారు పూర్వ కాలంలో ఈ తామర కులం వారి కింద ముత్తయ్య వాళ్ళ పూర్వీకులు పనిచేసేవారు అయితే తామర కులం వారికి ముత్తయ్య వాళ్ళ పూర్వీకులకు చిన్న గొడవలు అయి వారికి దూరంగా ఉండేవారు ముత్తయ్య వాళ్ళు అయితే ముత్తయ్య కి మేనల్లుడు పాండు యే ఊరిలో జరిగిన జల్లి కట్టులో నైన పాల్గొని ఎద్దుని ఓడించేవాడు

అయితే ఒకసారి తామర కులం వారి ఎద్దుని పాండు ఒడిస్తాడు అయితే ఆ ఏద్దు నూతిలో పడి చనిపోతుంది అప్పటి నుండి పాండు నీ ఎలాగైనా చంపేయాలని తామర కులం వారు పగ పడతారు అయితే చివరికి పాండు నీ చంపేస్తారు ఆ తరువాత ముత్తయ్య తామర కులం జమీందారు మీద పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ 

మొత్తం 5 గంటలు పైనే ఉంటుంది webseries మొదటి పార్ట్  బాగానే ఉంది కానీ అక్కడక్కడ సాగదీత గా ఉంది ఒక తక్కువ కులం వారిని జమీందారు కులం ఎలా అనచి వేసింది దానికి బదులుగా వాళ్ళు ఏమి చేశారు అన్నది ఈ వెబ్ series దీనికి జల్లి కట్టుని ఆయుధంగా తీసుకున్నారు 

మొత్తానికి పరవాలేదు కాలక్షేపానికి బాగుంది !!!

27, ఏప్రిల్ 2023, గురువారం

నాని దసరా సినిమా యే ott తెలుసా మీకు ?

 Natural star నాని నటించిన మాస్ సినిమా దసరా సినిమా మార్చ్ 30 తేదీన theatre లలో విడుదల అయింది ఇక ఈ cinema ఇప్పుడు ott time వచ్చింది ఇవాళ అనగా ఏప్రియల్ 7 తేదినుండి Netflix ott లోకి వచ్చింది 

నాని మాస్ సినిమా బొగ్గు గనులు నేపథ్యంలో 1990 ప్రాంతంలో నడి చే కథ !!!

"Kannai nambathe " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఉదయనిధి స్టాలిన్ హీరో గా వచ్చిన సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా కన్నై నంబితే అంటే తెలుగులో కనులను నమ్మవద్దు అని అర్థం వస్తుంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ లోకి వెళ్దాం !!!

ఇందులో హీరో ఒక అద్దె ఇల్లు కోసం తిరుగుతుంటాడు అయితే అంతకు ముందున్న ఇంటి ఓనర్ కూతుర్ని ప్రేమిస్తున్నాడు అన్న నెపంతో ఆ ఇల్లును ఖాళీ చేపిస్తాడు అయితే ఒక చోట ఒక ఇల్లు దొరుకుతుంది కానీ ఆ ఇంటిలో మరొక వ్యక్తి ఉంటాడు హీరో అతను ఒకే ఇంటిలో ఉంటారు అయితే ఇలా కథ ముందుకు వెళ్తుండగా ఒక సారి వీళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు అయితే అక్కడకు భూమిక చిన్న ప్రమాదం జరుగుతుంది కారులో అయితే తను డ్రైవ్ చేయలేనని చెప్పి హీరో కనపడితే హీరోని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెబుతుంది హీరో భూమికను డ్రాప్ చేసిన తరువాత హీరోని వర్షం పడుతుందని కారుని ఇంటికి తీసుకెళ్ళి రేపు తీసుకురమ్మని చెబుతుంది హీరో అలాగే తను ఉంటున్న ఇంటికి వెళ్తాడు జరిగిందంతా రూం మేట్ కి చెబుతాడు 

ఆ తరువాత హీరో పడుకున్న తరువాత కారులో ఉన్న పేపర్స్ లో అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తాడు మరో వ్యక్తి అక్కడ భూమిక తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అయితే అనుకోకుండా భూమిక చనిపోతుంది ఆ తరువాత ఆ హత్య ని ఆ వ్యక్తి హీరో చేసినట్టుగా చిత్రీకరిస్తారు ఆ తరువాత కథ ఎలా మలుపు తిరిగింది అన్నది సినిమా కథ 

కథ అలా ముందుకు సాగుతుండగా ట్విస్ట్ ట్విస్ట్ లు ఉంటాయి కథలో అసలు విలన్ ఎవరు అన్నది మిగిలిన కథ సస్పెన్స్ సినిమాలు ఇష్టపడేవారు నచ్చుతుంది సినిమా !!!

22, ఏప్రిల్ 2023, శనివారం

విరూపాక్ష సినిమా పై నా అభిప్రాయం !!!

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా నిన్న థియేటర్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక 1979 ప్రాంతం లో ఒక పల్లెటూరు అక్కడ ఇద్దరు భార్య భర్త చేతబడి చేస్తున్నారని ఆ ఊరి ప్రజలు చెట్టుకి కట్టేసి నిప్పంటించి తగలబెట్టి చంపేస్తారు అయితే అప్పటి నుండి పుష్కర కాలం తరువాత ఆ ఊరంతా వల్లకాడు అయిపోతుందని శాపం పెడతారు ఆ తరువాత పుష్కర కాలం తరువాత ఆ ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటారు 

అయితే హీరో అక్కడికి తన బందువులు ఇంటికి వస్తాడు తన తల్లితో కలిసి ఆ ఊరిపెరు రుద్ర వనం అయితే అక్కడి చావులు ఒకరి తరువాత ఒకరు చనిపోతునే ఉంటారు అక్కడ ఆ ఊరిలో నందిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు అయితే అక్కడ మరణాలకు ఆ ఊరి పూజారి అష్ట దిగ్బంధనం చేయాలి బయట నుండి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాలని చెబుతాడు అయితే ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ ఆ మరణాలకు కారణం హీరో కనిపెట్టాడా అన్నది సస్పెన్స్ తో కూడిన సినిమా బాగుంది సినిమా తప్పక చూడ వచ్చు మిస్టరీ సినిమాలు ఇష్టపడేవారు కి నచ్చుతుంది !!!

 

17, ఏప్రిల్ 2023, సోమవారం

విడుదల పార్ట్ 1 సినిమా పై నా అభిప్రాయం !!!


ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా వెట్రిమరన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది అయితే ఇందులో విజయ సేతుపతి, సూరి,గౌతమ్ వాసదేవ మీనన్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

ఒక అటవీ ప్రాంతంలో అభివృద్ధి అని పేరుచెప్పి ఖనిజాలు ఉండే ప్రాంతాన్ని  గవర్నమెంట్ అక్కడ ఉన్న కొందలనితవ్వి బయటకు తీయాలని చూస్తుంది వాటిని ఎదురించి కొంతమంది ప్రజా దళం పేరుతో పోరాటం చేస్తారు దానికి నాయకుడు విజయ సేతుపతి అయితే విజయ సేతుపతి ఎలాగైనా పట్టుకోవాలి చూస్తారు అక్కడకొంతమందిని పోలీసుల్ని కాపలాగా ఉంచుతారు అక్కడకు సురి డ్రైవర్ గా వస్తాడు అయితే 

ఆ మావోయిస్ట్ దళానికి పోలీసులకు కాల్పులు జరుగుతునే ఉంటాయి ఇదిలా ఉంటే సూరి అమాయకమైన పోలీస్ కానిస్టేబుల్ ఆ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అయితే ఆ మావోయిస్ట్ నాయకుడ్ని ఎలాగైనా పట్టుకోవలనీ పోలీసులు ఆ చుట్టుపక్కల ఉండే వారిని తీసుకు వచ్చి హింసిస్తుంటారు అందులో సూరి ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది సూరి ఒక సారి విజయ సేతుపతి ఒక చోట చూస్తాడు ఆ ఆ నాయకుడ్ని వాళ్లకు అప్పగిస్తే తను ప్రేమించిన అమ్మాయి బయట పడుతుందని ఎంతో కష్టపడి పట్టుకుంటాడు ఆ తరువాత కథ ఏమిటి అన్నది 2 పార్ట్ లో ఉండబతుంది

ఇందులో గౌతమ్ వాసుదేవ మీనన్ dsp పాత్రలో చేయటం జరిగిందీ కథ మామూలుగా ఉన్నప్పటికీ ఎమోషన్ పండించడంలో దిట్ట వెట్రిమరన్ బాగా తీశాడు బాగుంది సినిమా !!!

15, ఏప్రిల్ 2023, శనివారం

"Romancham " సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది ఒక మలయాళం డబ్బింగ్ సినిమా డిస్నీ hotstar లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది హార్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా బెంగళూర్  శివారు ప్రాంతంలో ఒక 7 గురు బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఉంటారు అందులో హీరో ఒకడు కథ అంత బ్యాచిలర్ లైఫ్ లో జరిగినట్టు జరుగుతుంది అయితే అందులో హీరో కి ఒక ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళింట్లో ఆత్మలతో మాట్లాడే ohuja borad గురించి తెలుసుకుంటాడు అయితే అదే ప్రయత్నం తన మిగతా 6 గురు ఫ్రెండ్స్ తో చెబుతాడు కానీ మొదట్లో ఎవరు పట్టించుకోరు అయితే తన ఉండే రూంలో carram board ఉంటే దానిని ohuja board కింద మార్చి అత్మలని పిలుస్తాడు మొదట్లో ఆత్మ వచ్చినట్టు నటిస్తాడు కానీ ఆ తరువాత నిజంగానే వస్తుంది Romancham telugu movie review,

అబద్దం అనుకున్న ఆత్మ నిజంగానే ఉంటుంది ఆ తరువాత ఎలాంటి పరిస్థితుల్ని ఆ 7 గురు ఫ్రెండ్స్ ఎదుర్కొన్నారు అన్నది సినిమా కథ

కథ ముందర హీరో హాస్పిటల్ కోమ నుండి బయటకు వచ్చిన తరువాత నర్స్ కి  తన కథ ను చెప్పటంతో మొదలవుతుంది 

సినిమా కామెడీ గా ఉంటూనే సీరియస్ లోకి వెళ్తుంది అన్నట్టు దీనికి కొనసాగింపు పార్ట్ 2 కూడా ఉంది బాగుంది సినిమా చూడ వచ్చు !!!

11, ఏప్రిల్ 2023, మంగళవారం

రవితేజ నటించిన "Ravanasura" సినిమా పై నా అభిప్రాయం !!!

రవితేజ ఈ సంవత్సరం waltair వీరయ్య సినిమా తరువాత వచ్చిన సినిమా Ravanasura ఏప్రియల్ 7 తారికున theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో మొత్తం 5 గురు హీరోయిన్స్ ఉంటారు హీరో ఒక హీరోయిన్ దగ్గర అసిస్టెంట్ లాయర్ లాగా పనిచేస్తుంటాడు అయితే అక్కడికి మరొక హీరోయిన్ వస్తుంది తన తండ్రి ఎవరినో చంపినట్టు వీడియో ఉంటుంది కానీ తన తండ్రి ఎవరిని చంపలేదు అని వాదించమని అడుగుతుంది కానీ తన తండ్రి మర్డర్ చేసినట్టు ప్రూఫ్ కూడా ఉంటుంది అయితే ఆ లాయర్ వాదించనని చెబుతుంది అయితే మొదట చూపులోనే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు ఎలాగైనా ఆ case ను take-up చేసేలా చేస్తాడు అయితే ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది మిగతా ముగ్గురు హీరోయిన్ లు పాత్ర ఏమిటి అన్నది సినిమా కథ బాగుంది సినిమా రోటీన్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారుకి నచ్చుతుంది సినిమా ఒకసారి ట్రై చేయవచ్చు !!!

8, ఏప్రిల్ 2023, శనివారం

కిరణ్ అబ్బవరం "మీటర్"సినిమా పై నా అభిప్రాయం !!!

 యంగ్ హీరోలలో స్పీడ్ గా సినిమాలు తీస్తున్న హీరోలలో కిరణ్ ఆబ్బవరం ఒకరు అని చెప్పవచ్చు అయితే కిరణ్ నటించిన చిత్రం మీటర్ సినిమా థియేటర్ లలో నిన్న విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Meter movie review,

ఇందులో హీరో తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే నిజాయతీగా పని చేయటం వల్ల ఎదుగు బోదుగు లేకుండా అలాగే ఉండి పోతాడు అయితే తన కొడుకుని si నీ చేయాలని చూస్తుంటాడు కానీ తన తండ్రి పడుతున్న అవమానాలు బాధలు చూసి తనకు పోలీస్ జాబ్ అంటేనే ఇష్టం ఉండదు తండ్రి కోరిక మేరకు si అవ్వటానికి ప్రయత్నిస్తాడు అయితే అది విజయం వంత మవుతుంది si అవుతాడు కానీ అలా అయిన తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ ఉద్యోగాన్ని ఎలా ముందుకు వెళ్ళాడు హోం మినిస్టర్ తో గొడవ పెట్టుకుంటాడు అయితే కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ అంతా రోటీన్ గానే ఉంది పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు కథలో మాస్ గా ట్రై చేద్దాం అనుకుని ప్రయత్నించిన సినిమా లాగా ఉంది !!!

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

రంగ మార్తాండ ott లో విడుదల అయింది ?

 కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ,బ్రహ్మానందం,ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా విడుదల అయిన 15 రోజులు కాకముందే ott లోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది !!!

3, ఏప్రిల్ 2023, సోమవారం

సందీప్ కిషన్ మైఖెల్ సినిమాపై నా అభిప్రాయం !!!


సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా మైఖేల్ అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1990 లో జరిగే కథ ముంబై లోక పెద్ద స్మగ్లర్ డాన్ ఉంటాడు ఆ డాన్ నీ మన  హీరో  చిన్నప్పుడు శత్రువులు నుండి కాపాడతాడు అప్పటినుండి హీరోని తన దగ్గర పెరుగుతాడు అయితే తన శత్రువుని ఒకరిని చంపమని చెబుతాడు హీరో కి డాన్ దాని కోసం ఢిల్లీ పంపుతాడు అయితే అక్కడ హీరో డాన్ శత్రువు కూతుర్ని ప్రేమిస్తాడు అనూహ్యంగా డాన్ వాళ్ళ అబ్బాయి హీరో చేతిలో చనిపోతాడు

అప్పటినుండి ఆ డాన్ హీరోని చంపటానికి ప్రత్నిస్తాడు అసలు బాగోలేదు సినిమా టైం waste !!!

Vijay సేతుపతి character ఉంటుంది కానీ అంతగా ఏమి లేదు సినిమాలో

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...