Sunday, June 28, 2020

శక్తి (హీరో) సినిమా పై నా అభిప్రాయం !!!

అభిమన్యుడు సినిమా తరువాత p. S మిత్రన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం శివ కార్తికేయన్ నటించిన చిత్రం శక్తి యాక్షన్ కింగ్ అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు
నేటి మన విద్య వ్యవస్థకు విధి విధానాలకు అద్దం పట్టేలా ఉంది
అలాగే విద్యార్థి యొక్క ఆసక్తి ఏంటో తెలుసుకోకుండా వారిని మూస పద్దతిలో ఉండే ఎలాగ ఉంటుందో ఈ చిత్రంలో తెలుస్తుంది
మన విద్య వ్యవస్థ గురించి చక్కగా చూపించారు ఈ చిత్రంలో ఒక్క విద్యార్థి లో ఉన్న నైపుణ్యాలను బట్టి దానికి మెరుగు పరిస్తే ఎలా రాణిస్తారో తెలుస్తుంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడవాల్సింది

మేటి మాట !!!


Sunday, June 21, 2020

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు !!!

యోగ మనిషి యొక్క ఆరోగ్యానికి ,మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు, ఆత్మ స్టిర్యాన్ని పెంచటానికి యోగ అనేది ఒక ఉత్తమమైన మార్గం

ప్రపంచానికి యోగ పరిచయం చేసింది మన భారత దేశం దీనికి మనమందరం ఎంతో గర్వపడాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు !!!

పితృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

నాన్న అంటే నమ్మకం
నాన్న అంటే నడవడిక
నాన్న అంటే గౌరవం
నాన్న అంటే ఇష్టం
నాన్న అంటే మన గమ్యానికి దిశ నిర్దేశం చేసే మార్గదర్శి
నాన్న అంటే త్యాగానికి రూపం
నాన్న అంటే నన్ను ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి
   మంచి సంస్కారం, నడివాడికలను నేర్పే ప్రతి నాన్నకు పితృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

Saturday, June 20, 2020

ఏపీ లో పది తరగతి పరీక్షలు రద్దు

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మరితో పోరాడుతుంది చిన్న,పెద్ద తేడా లేదు ఉన్న వాడ, లేనివాడ అనే తారతమ్యం లేదు ప్రతి ఒక్కరినీ కబళించేస్తుంది
చిన్న పిల్లలకు, వృద్దులకు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని మనకు తెలుసు
   ఇలాంటి తీవ్ర పరిస్థితులలో చదువు అంటే చిన్న పిల్లలకు మరింత కష్టం అలాంటిది పరీక్షలు అంటే అది కత్తి మీద సాము లాంటిదే ముందు ప్రాణాలు దక్కితే పరీక్షలు తరువాత అయిన రాసుకోవచ్చు
ఎంతైనా పిల్లల గురించి ఆలోచించి మంచి పని చేసింది గవర్నమెంట్ ఇది చాలా మంచి నిర్ణయం !!!

Friday, June 19, 2020

పెంగ్విన్ సినిమా పై నా అభిప్రాయం !!!

దాదాపు 3 నెలలు నుండి ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పని చేయటం లేదు ఇంకా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో సమస్యలు ఉన్నా సగటు మనిషికి వినోదం అందించే ఏకైక మార్గం సినిమా
  ఆ సినిమా థియేటర్లలు కూడా మూతపడే ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లలో సినిమాలు విడుదల చేస్తున్నారు ఇంకా ఇవాళ విడుదల అయిన పెంగ్విన్ చిత్రం సస్పెన్సు థ్రిల్లర్గ మన ముందుకు వచ్చింది అయితే సినిమా అంతా కొద్దీ నెమ్మదిగా నడుస్తుంది
ఈ సినిమాలో కీర్తి సురేష్ తప్ప మిగతా వారు కొత్తవారు
బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది
సినిమా రెండవ భాగంలో కీర్తి సురేష్ నటనకు స్కోప్ ఉంది ధైర్యవతురాలైన గర్భవతిగా మంచి నటన చేశారు
కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు కానీ సినిమా ఒక్కసారి చూడొచ్చు
కథ మాత్రం రొటీన్ గానే, నెమ్మది గానే సాగుతుంది 

Thursday, June 18, 2020

కరోనా పై పోరులో మన భద్రత మనదే ?

ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న , భయపడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది కరోనా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా , తన పని తాను చేసుకుంటూ పోతుంది
ప్రభుత్వాలు కూడా ఎంతవరకు చెయ్యాలో అంత చేసింది
కానీ లోక్డౌన్ నుండి సడలింపులో భాగంగా మన జాగ్రత్త, మన భద్రత మనమే చూసుకోవాలి

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, భౌతిక దూరం పాటించటం, వ్యక్తిగత శుభ్రత పాటించటం ఇవే మన దగ్గర ఉన్న ఆయుధాలు 

అందుకే అవసరానికి , తప్ప బయట తిరగటం తగ్గించుకోవాలి 

Wednesday, June 17, 2020

మేటి మాట !!!


చైనా ను దెబ్బ కొట్టలేమా ?

చైనా ఈ పేరు వింటే ప్రతి భారతీయుడికి ఒళ్ళు మండిపోతుంది చైనా వస్తువులను బహిష్కరించటం ప్రతి భారతీయుడు చేయవలసిన మొదటి పని ప్రపంచం మొత్తం మీద చైనా వస్తువులను వినియోగం ఎక్కువ భారత దేశంలోనే ఉంటుంది
కాబట్టి సాధ్యమైనంతవరకు చైనా వస్తువులను బహిష్కరించటం
చైనా వైరస్ కోవిడ్ 19 తో బాధ పడుతుంటే మరల సరిహద్దు కవ్వింపు చర్యలు దానికి తోడు పాకిస్తాన్ కూడా వత్తాసు పాడుతోంది
అందుకే చైనా వస్తువులను బహిష్కరిద్దాం వారి ఆర్థిక మూలాల పై దెబ్బ కొట్టాలి !!!
జై హింద్

Sunday, June 14, 2020

కనులు కనులు దోచయంటే సినిమా పై నా అభిప్రాయం !!!

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే విధంగా మోసాలు కూడా జరుగుతున్నాయి సినిమా అంటే ఒక ఆలోచనకు అందమైన రూపం ఇవ్వటం
ఈ సినిమాలో ముఖ్యంగా ఆర్డర్ పెట్టిన వస్తువులు విడి భాగాలు తీసి దానిలో పాత భాగాలను పెట్టి మళ్ళీ వాపస్ ఇవ్వటం జరుగుతుంది
కానీ ఈ సినిమా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అద్దం పట్టేలా ఉంటాయి 
ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు

Monday, June 8, 2020

మేటి మాట !!!

మూగ జీవాలపై ఇంత పైశాచికత్వమా ??

మొన్న కేరళలో జరిగిన సంఘటన మానవత్వం అనేది రోజు రోజుకి దిగజారి పోయేలా చేస్తుంది మూగ జీవాలపై అంత చిన్న చూపు ఎందుకు వాళ్ళు మనుషుల లేక రాక్షసుల మరి ఇంత దారుణమా 
మళ్ళీ అది చూసి ఆవు కు కూడా ఆ విధంగా చేశారు ఉండగా ఉండగా అసలు మనవత్వమే నశించి పోయేలా ఉంది
మనిషి బాధ వచ్చిన, సంతోషం వచ్చిన చెప్పుకుంటారు కానీ మూగ జీవులు వాటి భావాలను ఎలా వ్యక్త పరుస్తాయి
ఈ సంఘటన చాలా దారుణం !!!

Sunday, May 31, 2020

లోక్డౌన్ మళ్ళీ పొడిగింపు??? కానీ ఫలితం సున్నా ???

పేరుకే లోక్డౌన్ కానీ సాధారణ జీవన స్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా భౌతిక దూరం అక్కరకు రావటం లేదు కనీసం మాస్కులు కూడా ధరించటం లేదు
అసలు కరోనా ఉందనే ఊసే లేదు మాములుగా సాధారణ జీవనం ఎలా సాగుతుందో అలాగే ఉంటుంది ఇంకెందుకు లాక్ డౌన్ 
పేరుకే పనికి మాత్రం కాదు 

మేటి మాట !!!

మేటి మాట !!!

Thursday, May 21, 2020

మేటి మాట !!!

మనసులో ప్రశాంతత లేనప్పుడు ఆలోచనలు మన అధీనంలో ఉండవు !!!

Sunday, May 17, 2020

Train to busan సినిమా గురించి నా అభిప్రాయం

Train to busan సినిమా  చూస్తున్నంతసేపు ఈ ప్రపంచం ఎప్పుడు ఏదొక చోట ప్రమాదాలు, మానవ తప్పిదాలు జరుగుతుంటాయి అర్థం అవుతుంది సినిమాలో సెంటిమెంట్ కూడా బాగుంటుంది
మనిషి చేసే తప్పులు గురించి తెలుస్తుంది
ప్రస్తుతం కరోనా పరిస్థితులకు అర్థం పట్టేలా ఉంటుంది
ఒక వైరస్ ఒక దేశాన్ని ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఈ సినిమా లో తెలుస్తుంది
కానీ ఒక్కసారి చూడవచ్చు ఈ సినిమా !!!

Sunday, May 10, 2020

Madha సినిమా గురించి నా అభిప్రాయం

  • ఇవాళ ఆదివారం సెలవు లభించడంతో madha సినిమా చూడటం జరిగింది 
  • ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం confuse గా ఉన్న సెకండ్ హాఫ్ తరువాత ఈ సినిమా కథ అర్థం అవుతుంది
  • సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనుకున్నాను కానీ ఈ సినిమా పాత సినిమాలో మాదిరిగానే రొటీన్ గానే ఉంటుంది
  • అంత చూడదగ్గ ఆసక్తి కరమైన సన్నివేశాలు లేవు
  • సినిమా పోస్టర్ చూసి ట్రైలర్ చూసి సినిమా పై ఆసక్తి పెంచుతాయి కానీ సినిమాలో మేటర్ లేనప్పుడు ఎంత హంగులు అద్దిన అది వ్యర్ధమే
  • ఇది ఎవ్వరిని కించ పరచటానికి కాదు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

అమ్మ ప్రేమకు పోటీ లేదు
అమ్మ అనురాగనికి సాటి లేదు
మన ఆనందంలో తన ఆనందం చూసుకుంటుంది
అలాంటి అమ్మకు, అమ్మలకు 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

Sunday, April 26, 2020

Tumbbad సినిమా నా అభిప్రాయం !!!

Tumbbad సినిమా ఉరుకుల పరుగుల జీవితంలో కొద్దిగా సమయం దొరికింది ఈ లాక్ డౌన్ వల్ల ఏమి చెయ్యాలో తెలియక ఏదైనా మంచి interesting సినిమా ఏదైనా ఉందొ చూసాను అప్పుడు చూసాను tumbbad ట్రైలర్ నాకు నచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని చూసాను
ఈ సినిమా చూడటానికి మనకు స్వాతంత్రం రాకముందు చెందింది సినిమా సస్పెన్స్ తో కూడుకుని ఉంటుంది మనిషి అత్యాశకు పోతే జీవితం ఏ విధంగా ఉంటుందో తెలిపే చిత్రం
కానీ సినిమా మాత్రం ఒకసారి చూడొచ్చు నిజంగా జరిగిందో లేదో తెలియదు కాని వాస్తవ ఘటనలు చూసినట్తు ఉంది

Thursday, April 23, 2020

లోక్డౌన్ నెల రోజులు !!!

లోక్డౌన్ విధించి నెలరోజులు అవుతుంది మధ్య తరగతి జీవి లాంటి మా లాంటి వాళ్ళు బ్రతికేదెలా మధ్యతరగతి జీవితాలు ఈ విపత్తు వచ్చిన ముందర దాని ఫలితం పడుతుంది
నెల రోజులు డబ్బులు లేకుండా ఎలా జీవించాలి ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయమేస్తోంది చిన్న ఉద్యోగాలు చేసే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ?
మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది కానీ దానికి మా లాంటి వారికి ప్రత్యామ్నాయం చూపించాలి 

Wednesday, April 22, 2020

Tuesday, April 7, 2020

మేటి మాట !!!


కరోనా నానా హైరానా !!!

కరోనా నీ వల్ల చాలా నేర్చుకున్నాం
  నీ వల్ల మనుషుల మద్య దూరం పెంచావు,
  అడుగు బయట పెట్టకుండా చేసావు,
  మందు బాబులకు మద్యం చేసావు,
  మనుషుల ముఖాల్ని పరదాలతో దాచుకునేల చేసావు,      క్షణం తీరిక లేకుండా గడిపేవారికి ప్రతి నిమిషం విలువ      తెలిసేలా చేసావు,
  ప్రకృతిని ప్రక్షాళన చేసావు,
  నదులను శుభ్రం చేసావు,
  వాయు కాలుష్యాన్ని తగ్గించావు,
నేతి మాటలు కాదు మనసు విలువ తెలిసేలా చేసావు,
ప్రతి రూపాయి విలువ తెలిసేలా చేసావు,
శుభ్రత విలువ తెలిసేలా చేసావు,
  ప్రకృతికి కోపం వస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించావు !!!Saturday, April 4, 2020

Thursday, April 2, 2020

మేటి మాట !!!


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!

శ్రీ రామ ఈ పేరు వింటే మనస్సులోఎంత అలజడిగా ఉన్న కొంత ప్రశాంతత సంతరించుకుంటుంది రాముడు కుటుంబం లోని ప్రతి వ్యక్తి తమ యొక్క బాధ్యతకు ఆదర్శం
రామాయణం లో ప్రతి ఘట్టం మానవ విలువలకు, మనిషి ఎలా జీవించాలో చెప్పే  గొప్ప వేదం !!!
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!

                               !!!జై శ్రీ రామ్ !!!

Wednesday, March 25, 2020

కరోనా నీకు కొంచమైనా కనికరం లేదా ?

కరోనా ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన మాయదారి మహమ్మారి రోజు రోజుకి దీని ప్రభావం మరి ఎక్కువ అవుతుంది
దీనిని నివారించే, నిలువరించే మార్గం కనబడటం లేదు మన జాగ్రత్తలు తప్ప అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం 😧😧😧
నీ వల్ల ఉద్యోగాలు లేవు, పని లేదు, డబ్బు లేదు, పలకరించే మనిషే ఉండటం లేదు
ఉన్నవాడికి పరవాలేదు లేనివాడి పరిస్థితి ఏంటి రెక్కడితేగాన్ని డొక్కాడని జీవితాలు గడిపే వారి పరిస్థితి ఏంటి కొంచమైనా కనికరించవమ్మా 😧😧😧😷😷😷


Saturday, November 16, 2019

కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం !!!

కార్తీక మాసం అంటేనే అదొక స్పెషల్ ఎందుకంటే ఎటు చూసినా శివ, నామ స్మరణతో ఆలయాలు, సంవత్సరం అంత పడిన కష్టంతో ప్రకృతిలో సేద తీరటనికి వన భోజనాలు చూడటానికి చాలా బాగుంటుంది
      ఆధ్యాత్మిక విహార యాత్రలు, కుటుంబ సమేతంగా వెళ్లే యాత్రలకు కార్తీక మాసం ఎంతో అనువైనది
అందుకే ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం చాలా ప్రత్యేకం.

Saturday, November 2, 2019

ఏందిరా ఈ జీవితం !!!

నా జీవితం నాకు ఎప్పుడు నన్ను ఎక్కిరిస్తూనే ఉంటుంది
అన్ని బాగున్నాయి అనే సమయానికి ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం సాధించిన తరువాత ఎదో రకంగా నిలదొక్కుకుంటున్నాం అన్నంత లోపులోనే కుటుంబ ఆర్ధిక సమస్యలు
అదే కాకుండా ఇటీవల పెళ్లి కూడా అయ్యింది ఇంటిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదు ఉండటానికి చేతి పని ఉన్న దానిలో అన్ని నష్టాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది
ఈ జీవితం మొత్తం ఇలాగే ఉంటుందా అని
ఈ సమస్య నా ఒక్కడికే నేను అనుకోను ఎందుకంటే ఇది ప్రతి మధ్య తరగతి జీవితాల్లో ఉండే సమస్యే

ప్రతి దానికీ ఓర్పు కావలంటారు నిజమే కానీ ఆ ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటినా తరువాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి
ఏదైనా ఒక మంచి ఉద్యోగం కుటుంబ సమస్యలు తలెత్తకుండా మన ఖర్చులకు సంబందించి సంపాదించుకోవడం చాలు ఈ జీవితానికి అంతకు మించి ఏముంది
కానీ అదే ప్రశ్నర్థకం గా మారింది చూద్దాం అంతకు మించి మనం చేసేది ఏమి ఉండదు నాకు తెలిసిన ఒక మంచి మాట ఉంది
" నిరుత్సాహం మనిషిని మరింత బలహీనుణ్ణి చేస్తుంది"

అందుకే సాధ్యమైనంత వరకు నేను నా దగ్గరికి నిరుత్సాహం రాకుండ చూస్తాను అదే నా సమస్యకు
మొదటి పరిష్కారం !!!

Thursday, October 31, 2019

నాగుల చవితి శుభాకాంక్షలు !!!

నాగుల చవితి ఈ పేరు వింటే కొంత ఆనందం, కొంత ఉత్సుకత ఉంటుంది ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి పుట్ట కు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పాలు పోసి కొద్దిగా సలివిడితో కొద్దిగా ప్రసాదం చేసి కొంచెం పుట్టలో వేసి పూజ కార్యక్రమాలు చేసి కొద్దిగా పుట్ట మన్ను తీసుకుని చెవులకు పెట్టుకుని ఇంకా కొద్దిగా తీసుకుని ఇంటిలో వాళ్ళకి ఇచ్చి
దీపావళి లో మిగిలిపోయిన మందు సామగ్రిని అంటే కాకర పొవ్వొత్తులు, మతాభిలు లాంటివి పేల్చి మనం ఇంటికీ తిరుగుచేస్తాం
  మీకు మొదట్లో చెప్పినట్టు ఆనందం అంటే ఇది మరీ ఉత్సుకత అంటే మనం సాధారణంగా ఏ పండగైన ఇంటి దగ్గర చేసుకుంటాము కానీ నాగుల చవితి మాత్రం పచ్చని పొలాల మధ్య, చెట్ల దగ్గర ఉండే పుట్టలు దగ్గర ఈ పండగ చేసుకుంటాము
ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే వారికి కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది
ఇక పూజ అయిన తరువాత ఇంటికి వస్తే ఈ రోజు చాలామంది ఉపవాసం ఉంటారు ఆహా ఇంకా టీవీలలో అన్ని నాగరాజు సినిమాలే సినిమాలు !!!

Thursday, October 10, 2019

Friday, September 6, 2019

Thursday, September 5, 2019

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!

జీవితానికి వెలుగునిచ్చే విద్యను ప్రసాదించి
వారు నేర్పే అక్షరాలతో మనిషిలోని అజ్ఞాన అంధకారాన్ని
తొలగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దే
ఉపాధ్యాయుల్ని స్మరించుకుంటూ
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!💐💐💐

మీ తెలుగు వికాసం 🙏🙏🙏

మేటి మాట


Saturday, August 31, 2019

Wednesday, August 28, 2019

Wednesday, August 21, 2019

Saturday, August 17, 2019

Thursday, August 15, 2019

Thursday, August 8, 2019