26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

అల్లరి నరేష్ నటించిన "నాంది" సినిమా పై నా అభిప్రాయం !!!!

 అల్లరి నరేష్ పేరు వింటే మనకు హాస్యం మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ తనలో మంచి నటుడు ఉన్నాడన్న విషయం కొన్ని సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది 

అవి ప్రాణం, గమ్యం, విశాఖ express, మహర్షి, శంభో శివ శంభో సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది

ఇక కథ విషయానికి వస్తే ఏ నేరం చేయని వ్యక్తిని ఒక హత్య కేసు లో ఇరికిస్తే అతడు ఎలా బయటపడ్డాడో అనేది సినిమా కథాంశం 

ఏ విషయం సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కానీ ఈ సినిమా లో ముఖ్యంగా నరేష్ నటనను మెచ్చు కోవాల్సిందే 

ఇటువంటి సినిమాలు చాలానే వచ్చాయి కానీ సినిమా మాత్రం ఒక్కసారి చూడవచ్చు

లాయర్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బాగా నటించింది 

సినిమా మాత్రం average అని చెప్పవచ్చు !!!

24, ఫిబ్రవరి 2021, బుధవారం

రామ్ నటించిన "RED" సినిమాపై నా అభిప్రాయం !!!

 రామ్ నటించిన Red సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై  నిన్న sun nxt అప్ లో స్ట్రీమింగ్ అయ్యింది అయితే ఆ సినిమా ఎలా ఉందో చూద్దామని నిన్న చూసాను 

కథ విషయానికి వస్తే రామ్ 2 పాత్రల్లో ఈ సినిమాలో నటించాడు ఒక పాత్ర సిద్ధార్థ సాఫ్ట్ కారెక్టర్ మరొకటి ఆదిత్య రఫ్ కారెక్టర్ సినిమా మూస ధోరణిలో అలా అలా సాగుతుంటే 

ఒక మర్డర్ జరుగుతుంది ఆ మర్డర్ ఇద్దరిలో ఎవరు చేశారు అనే దాని మీద సినిమా 2 హాఫ్ నడుస్తుంది

ఈ సినిమా చూడటానికి రక రకాలుగా ఉంటుంది ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు మళ్ళీ ఇద్దరికి సమస్య వస్తే ఇద్దరు కలిసి పోతారు 

అంతా వెరైటీ సినిమా మ్యూజిక్ మాత్రం బాక్గ్రౌండ్ మణిశర్మ అదరగొట్టాడు

సినిమా కొంచెం confuse గా కొంచెం clumpsy గా ఉంది !!

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మేటి మాట !!!


 

మేటి మాట !!!


 

విశాల్ నటించిన " చక్ర " సినిమా పై నా అభిప్రాయం !!!

 విశాల్ మన తెలుగు వాడు అయినప్పటికీ తమిళ్ సినిమాలు ఎక్కువుగా నటిస్తూ అక్కడే స్థిరపడ్డాడు అయితే విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ అవుతూ వచ్చింది 

మొన్న శుక్రవారం విడుదల అయిన చక్ర సినిమా చూసాను సినిమా ఎలా ఉందో చూద్దాం

కథ విషయానికి వస్తే విశాల్ మిలటరీ లో పని చేస్తుంటాడు అయితే వాళ్ళ కుటుంబం అంతా మిలట్రీ లో పనిచేసి వీరమరణం పొందినవారే అయితే విశాల్ వాళ్ళ నాన్న మిలట్రీ లో అత్యున్నత పథకం అశోక చక్ర లభిస్తుంది

అయితే కొంతమంది దొంగలు ఆగస్టు 15 న వరుస దొంగతనాలకు పాల్పడతారు విశాల్ వాళ్ళ ఇంటిలో ఉన్న అశోక చక్ర ను వాళ్ళు దొంగిలిస్తారు

ఆ తరువాత ఆ దొంగల్ని విశాల్ ఎలా పట్టుకున్నాడు ఆ దొంగ ఎవరు అనేది అసలు సినిమా కథ 

గత సినిమాలతో పోలిస్తే విశాల్ ఈ సినిమా average అని చెప్పవచ్చు మొదట ట్రైలర్ చూసి మరో అభిమన్యుడు సినిమా లాగా ఉంటుందని భావించాను

కానీ అంతలాగా ఏమి లేఎస్ప్ఏఎట్ సినిమా కానీ విశాల్ నటించిన సినిమా లు ఒక్క సారి చూడవచ్చు అనే ఉద్దేశ్యంతో చూసాను

Expectation తో మాత్రం సినిమా చూడకండి !!!

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

తణుకు లోని సూర్య దేవాలయం రథ సప్తమి వేడుకలు (వీడియో ) !!!

 ఆంధ్ర ప్రదేశ్ లో సూర్య దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లోని సూర్య దేవాలయం రథ సప్తమి వీడియో మీ కోసం 

" Midnight Murders " సినిమా పై నా అభిప్రాయం !!!

 Midnight Murders ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో వచ్చిన సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రతి scene మంచి ఆసక్తి కలిగించేలా ఉండాలి

ఇక కథ విషయానికి వస్తే మాములు రొటీన్ స్టోరీ రివెంజ్ స్టోరీ నగరంలో పోలీసులు హత్యలు జరుగుతుంటాయి ఆ పోలీసులు మరణానికి గల కారణాలు తెలుసుకోవటమే ఈ సినిమా కథ 

అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు దానికి గల కారణం ఏమిటి అన్నది సినిమా కథ

నాకు తెలిసి ఈ సినిమా మలయాళ సినిమా ఆహా లో విడుదల అయ్యింది ఒక్క సారి టైం పాస్ కోసం చూడవచ్చు

క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది !!!

17, ఫిబ్రవరి 2021, బుధవారం

మేటి మాట !!!


 

ఉప్పెన " సినిమాపై నా అభిప్రాయం !!!

 ఉప్పెన ఈ సినిమా సంవత్సరం క్రితం 2020 ఏప్రియల్ నెలలో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా ఏ సినిమా వాయిదా పడుతూ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యింది

ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు విజయ సేతుపతి యాక్టింగ్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ అసలు ఎలాంటి పాత్రను ఒప్పుకోవడం మెచ్చుకోవాలి

కథ విషయానికి వస్తే ఒక ధనవంతురాలి కుటుంబం నుండి వచ్చిన ఆడపిల్ల ఒక పేద జాలరి లో కుటుంబంలో జన్మించిన అబ్బాయి ప్రేమ కథ

కులానికి సంబంధించి పరువు భంగం కాకుండా ఎంతటి పని అయిన చేస్తాడు విలన్ విజయ్ సేతుపతి అయిన ప్రేమ కు అటువంటిది ఏమి ఉండదు అని ఇద్దరు ప్రేమించుకుంటారు

వారి విషయం విలన్ కి తెలుస్తుంది హీరో నాన్న ని చంపేస్తాడు హీరోని సంసారానికి పనికి రాకుండా చేస్తాడు 

అసలు ఒక హీరోకి ఇంట్రడక్షన్ సినిమా కి ఇలాంటి పాత్ర వస్తే ఎవరైనా కొంచెం భయపడతారు కానీ కిలాంటి పాత్రను చేయటం మెచ్చుకోవాల్సిన విషయం

సినిమాకు ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన, పాటలు కూడా బాగా ఉన్నాయి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన మొదటి సినిమాలోనే విజయం అయినట్టే 

సినిమా అయితే చూడొచ్చు పరవాలేదు బాగానే ఉంది !!!

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

Mi Note 4 battery images !!!



 Mi Note 4 battery models !!!

" 30 రోజుల్లో ప్రేమించటం ఎలా " సినిమా పై నా అభిప్రాయం !!!

 బుల్లితెర లో బాగా పాపులర్ అయిన మేల్  యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రదీప్ అని అందరికి తెలుసు ఇక ప్రదీప్ తన హీరోగా నటించిన మొదటి సినిమా 

 " 30 రోజుల్లో ప్రేమించటం ఎలా " అనే సినిమా ఆ సినిమా ఇవాళ చూసాను ఆ సినిమా ఎలా ఉందంటే

స్వాతంత్రం రాక ముందు ఒక ప్రేమ జంట ప్రేమలో చిన్న గొడవలు ద్వారా విడిపోతారు అలా విడిపోవడం వల్ల ఆ ఇద్దరు చనిపోతారు 

మరల కొన్ని సంవత్సరాల తరువాత ఒకే కాలేజ్ లో వారిద్దరూ జాయిన్ అవుతారు ఆ ఆతరువాత వారిద్దరి మధ్య కూడా గొడవలు అవుతూనే ఉంటాయి 

ఇలా జరుగుతుండగా వాళ్ళు అరకులోని దగ్గరలోగల ఒక ఏరియా కి excurtion కి వెళ్తారు అనూహ్యంగా అక్కడ ఒక దేవుడి దగ్గర వారి ఒకరి శరీరంలోకి ఒకరు మారతారు 

అక్కడ ఒక స్వామి 30 రోజులు తరువాత తమను తిరిగి మాములుగా మారుస్తానని చెబుతాడు 30 రోజులు అయిన తరువాత తిరిగి అక్కడికి వెళ్తారు కానీ ఆ స్వామిజీ చనిపోతారు

ఆ తరువాత వారిద్దరూ ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు వారు తిరిగి ప్రేమించుకున్నారా లేదా వారికి తిరిగి ఎవరి రూపంలోకి వారు తిరిగి వచ్చారో లేదా అని సినిమాలో చూడాలి

పునర్జన్మల నేపథ్యంలో ఉంటుంది ఈ సినిమా నాకు కొంచెం రొటీన్ గా అనిపించింది ఆ ఒక్క పాట మాత్రం చాలా బాగుంది నాకు తెలిసి సినిమా అంతగా ఏమి లేదు కానీ ప్రదీప్ కోసం ఒక్కసారి చూడొచ్చు సినిమా !!!

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనలోని అభిరుచి +ఆసక్తి = ఆదాయం (యూట్యూబ్, బ్లాగ్ ) !!!

 అవును మీరు విన్నది sorry చదివింది నిజం మనిషికి ఎన్నో ఇష్టాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో సరదాలు, మరెన్నో అభిరుచులు ఇదే జీవితం

ప్రతి మనిషికి తన జీవితంలో ఏదొక అభిరుచి, ఆసక్తి ఉంటుంది అదే మన జీవితానికి సరదాలని, సంతోషాల్ని తెస్తుంది 

ఇక సోది అంతా ఆపేసి అసలు విషయానికి వస్తే ముందుగా మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం 

యూట్యూబ్ నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అంటే తెలియని వారు ఉండరు నేడు మనిషికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునేది మొదటగా గూగుల్, ఆ తరువాత యూట్యూబ్ లో చూస్తున్నారు నాకు తెలిసి సుమారుగా 4, 5 సంవత్సరాలు క్రితం 4g టెక్నాలజీ రావటంతో అందరికి ఇంటర్నెట్ బాగా దగ్గరైంది ప్రతి ఒక్కరికి ఆన్లైన్, ఇంటర్నెట్ అంటే ఒక అవగాహన ఏర్పడింది

మనకు ఏ విషయం మీదనైన ఆసక్తి, అభిరుచి ఉంటే దానికి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ సంపాదించవచ్చు దానికి కావాల్సింది

మనకు తెలిసిన విషయం మీద అవగాహన కలిగి ఉండటం అలాగని మరొకరి వీడియోలు కాపీ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేస్తే దానికి ఎటువంటి మనీ రాదు మన సొంతంగా తయారు చేసిన లేదా తీసిన వీడియోలు మాత్రమే అప్లోడ్ చెయ్యాలి

ఇక దీనికి 4000 గంటలు వాచ్ టైం ఉండాలి, 1000 మంది subscribers ఉండాలి ఈ రెండింటిని మీరు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి అప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ approve అయ్యి మీ వీడియో ల మీద యాడ్స్ వస్తాయి తద్వారానే మీకు మనీ వస్తుంది

ఇక రెండోవది బ్లాగ్ ఇది కూడా అటువంటిదే మీకు ఏ విషయం గురించి నైనా అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా రాయ గలిగితే మీకు మీ బ్లాగ్ ద్వారా మనీ సంపాదించవచ్చు

ఇది కూడా మీ సొంత కంటెంట్ మాత్రమే ఉండాలి ఇక్కడ కూడా మీకు మీ బ్లాగ్ ok అయితే మీ బ్లాగ్ లో యాడ్స్ వేస్తారు గూగుల్ అవి ఎక్కుమంది చూస్తే మీకు తద్వారా మనీ వస్తుంది 

కాబట్టి మన అభిరుచి, ఆసక్తి అదే మన ఆదాయ వనరుగా మారుతుంది 

చివరగా ఒక్క మాట యూట్యూబ్, బ్లాగ్ అనేది వీటిలో success కావటానికి చాలా టైం పడుతుంది అలాగే కష్ట పడాలి కూడాను !!!

Oppo Mobile A7 battery pics !!!



 Oppo mobile A7 (CPH-1901) model battery pics 


13, ఫిబ్రవరి 2021, శనివారం

మేటి మాట !!!


 

డిస్నీ హాట్ స్టార్ లోని "Live Telecast" వెబ్ సీరీస్ పై నా అభిప్రాయం !!!

 ఇవాళ మా ఊరిలో ఓట్లు ఎలక్షన్ పండగ పొద్దున్నే లేచి స్నానం చేసి నీట్ గా రెడి అయ్యి ఓటు స్లిప్ అట్టుకుని ఓటు వేయటానికి వెళ్ళాను నా ముందర ఖాళీ గానే ఉంది 

వెంటనే 10 నిమిషాలలో ఓటు వేసి బయటకు వచ్చేసాను ఈ రోజు ఖాళీగా ఉండి ఏం చేద్దామా అని ఆలోచిస్తే వెంటనే టి. వి చూస్తే అందులో మంచి హార్రర్ గా కనిపించింది

కాజోల్ అగర్వాల్ నటించిన " Live telecast " ట్రైలర్ కనిపించింది ఈ రోజు చూద్దామని ఒక లుక్ ఏసా చూసాను చెపుతాను

ఈ కథ మాములు రొటీన్ గానే ఉంది అన్ని ఎపిసోడ్స్ మొత్తం ఒకేసారి చూసాను మొత్తం కలిపి 3 గంటల 43 నిమిషాల నిడివి ఉంది 

మనకు మామూలుగానే హార్రర్ మూవీస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ట్ 

ఇక కథ విషయానికి వస్తే ఒక ఛానల్ లో పనిచేసే ఒక ఒక టీం నిజంగా జరిగిన విషయాలకు కొద్దిగా ఇంకా భయం వేసేలా ఎపిసోడ్స్ తయారు చేసి టెలికాస్ట్ చేస్తుంటారు ఇదంతా ఆ ఛానల్ TRP కోసం అలాగే ఒకసారి హార్రర్ తో కూడిన కొంచెం బోల్డ్ గా ఒక ఎపిసోడ్ షూట్ చేస్తారు అయితే ఆ ఎపిసోడ్ వల్ల మొత్తం ఆ ఛానల్ trp పడిపోతుంది దానితో ఆ ప్రోగ్రాం అక్కడితో ముగించాలని సిద్దపడుతుంది ఛానల్

ఇక దానితో వారికి పనిలేక ఖాళీగా ఉంటారు అప్పుడు అందరికి ఒక ఐడియా వస్తుంది అదే haunted house లో live టెలికాస్ట్ చేస్తే మళ్ళీ ఆ ఛానల్ కి TRP పెరుగుతుందని భావించి ఒక haunted house లో షూటింగ్ ప్రారంభిస్తారు

ఆ తరువాత ఆ షూటింగ్ లో వారికి ఎదురైన అనుభవాలు, పరిస్థితులు , ఈ సిరీస్ లో చూడాలి 

మొత్తం ఈ సిరీస్ 7 భాగాలుగా ఉంటుంది డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆయన తీసిన సినిమాలు సూర్య రాక్షసుడు సినిమా ఎలా హారర్ ఫీల్ అవ్వుతామో ఆ విధంగా ఈ సినిమాలో కూడా కొంచెం హార్రర్ ఎక్స్పర్ట్ చేయొచ్చు

ఎక్కువ ఇంగ్లీష్ హార్రర్ మూవీస్ చూసే వారికి అంతగా భయం అనిపించదు కానీ ఈ సిరీస్ మాత్రం మంచి టైం పాస్ గా చూడవచ్చు !!!

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మేటి మాట !!!


 

ప్రేమకు ఒక రోజు " ప్రేమికుల రోజు " !!!

 ప్రేమ ఇది మనిషిలో ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు అసలు ప్రేమంటే ఇది అని ఎవ్వరూ స్పష్టంగా చేప్పలేరు 

కానీ ఒక్కటి మాత్రం నిజం ప్రేమ అంటే ఇష్టం ,ప్రేమంటే త్యాగం, ప్రేమంటే నిరీక్షణ, ఇవి మాత్రం స్వచ్ఛమైన ప్రేమలో కనపడతాయి


కానీ ఈ రోజుల్లో అటువంటి ప్రేమ ఎక్కడ కనపడటంలేదు

ప్రేమకు వయస్సు లేదు మనస్సు మాత్రమే ఉంది

కానీ నిజం అసలైన ప్రేమ చరిత్రలో ఉంటుంది  కొంతమంది పెద్దవారిలో కనపడుతుంది 

అందుకే లవ్ స్టొరీ లు ఎప్పుడు కొత్త గానే ఉంటాయి ప్రేమ ఎప్పుడు స్వచ్ఛ మైనదే 

నిజమైన ప్రేమికులందరికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు !!!


11, ఫిబ్రవరి 2021, గురువారం

"పంచాయితీ పర్వం "

 ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఈ చలికాలంలో కూడా మంచి వేడిని కల్గిస్తున్నాయి 

కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయితే మరికొన్ని చోట్ల నువ్వా నేనా అనేట్టు సాగుతున్నాయి ఈ సోది అంతా మాకెందుకు అనుకుంటున్నారు కదూ మీరు 

నేను నాలో నాతో అనుకునేది ఈ బ్లాగ్ ద్వారా పంచుకుంటాను

అసలు ఎన్నికలు అంటే ఏంటో నాకు కూత ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి

ఎన్నికలు, గుర్తులు, పార్టీలు,  వార్డ్ మెంబెర్లు,సర్పంచ్,

నాకు తెలినవారు, నాకన్నా చిన్న వారు ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు

ఏది ఏమైనా ఊరంతా జనం, అందులో మనం అదే ఎన్నికల పంచాయతీ పర్వం 

ఎప్పుడో జరుగాల్సినవి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు అది మీకు తెలుసు !!!


10, ఫిబ్రవరి 2021, బుధవారం

మేటి మాట !!!


 

లక్ష్మీ పురం ( పెదవేగి మండలం) సాయి బాబా గుడి ఫోటోలు !!!

 నేటికి సరిగ్గా వారం క్రితం రాట్నాలకుంట రాట్నాలమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మాకు ఒక చోట సాయి బాబా గుడి కనిపించింది 

చుట్టూ తోటలు , ఒక నందన వనంలాగా ఉంది చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ఒక స్తూపం ఉంది అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ స్థూపాన్ని తాకటానికి వీలుంటుంది అంటా

ఆ స్తూపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ గోడ మీద రాసి 

మీరు ఒక లుక్ వెయ్యండి ఆ ఫోటోలు కింద ఉన్నవి గమనించగలరు !!!









9, ఫిబ్రవరి 2021, మంగళవారం

" జి -జాంబీ " సినిమా పై నా అభిప్రాయం !!!

 జాంబీ సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువుగా వస్తాయి కానీ ఇప్పుడు మన తెలుగులో కూడా ఈ హవా మొదలైంది 

అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు క్రితం తమిళ్ సినిమా జయం రవి నటించిన యమపాశం సినిమా లో జాంబీలు చూసాం 

మరలా ఇప్పుడు తెలుగులో ఈ నెలలో అప్పుడే రెండు జాంబీ తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి అందులో ఒకటి "జి -జాంబీ" సినిమా

ఇక ఈ కథ విషయానికి వస్తే ఒక డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్ గా పనిచేసే ఒక అమ్మాయి చాలా ప్రయోగాలు చేసి విజయవతమయ్యాయి అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ మనిషిలో ఇమ్మ్యూనిటి పవర్ పెంచటానికి ఒక మెడిసిన్ కనిపెడుతుంది

ఆ మెడిసిన్ మనుషులు మీద నేరుగా ప్రయత్నించటానికి permission అడుగుతుంది పెద్ద డాక్టర్ ని మొదట ఆ డాక్టర్ వద్దంటాడు కానీ ఆ తరువాత ఒప్పుకుంటాడు 

అయితే దానికి హీరో ని కూడా తమ వెంట తీసుకువెళ్లాలని కండిషన్ పెడతాడు ఆ ప్రయోగం ఒక క్రిమినల్ మీద ప్రయోగిస్తారు కానీ ఆ ప్రయోగం వికటించి ఆ క్రిమినల్ జాంబీ గా మారుతాడు

ఆ తరువాత ఏమైంది అనేది కథ ఇది వినటానికి బాగానే ఉంది చూడటానికి అంతగా ఏమి బాగోలేదు కానీ వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు

కానీ సినిమా మాత్రం అంతగా ఆసక్తి లేదు !!!

ఆహా OTT లో విడుదలైన" మెయిల్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 మెయిల్ ఇప్పుడు అయితే అందరికి తెలుసు కానీ ఒకప్పుడు మెయిల్ అంటే ఎవరికి అర్థం అయ్యేది కాదు అప్పుడు మెయిల్ ఏంటి కంప్యూటర్ అంటేనే కొత్త ఇదే అంశాన్ని కథగా తీసుకుని ఈ స్టోరీ ఉంటుంది

ఇక కథ విషయానికి వస్తే అప్పటిలో కంప్యూటర్ అంటే ఇష్టం ఉన్న అబ్బాయికి ఇంటర్ పాస్ అవుతాడు డిగ్రీ లో కంప్యూటర్ ఉండే కోర్స్ తీసుకుందామని అనుకుంటాడు కానీ ఆ కోర్స్ ఆ ఊరిలో ఉండదు 

అప్పుడే ఆ ఉరిలోకి కంప్యూటర్ నెట్ సెంటర్ కొత్తగా పెడతాడు ప్రియదర్శి ఆ సెంటర్ లో జాయిన్ అవుతాడు ఆ అబ్బాయి 

ఆ తరువాత ప్రియదర్శి కంప్యూటర్ గురించి ఒక్కొక్క విషయం ఆ అబ్బాయికి చెబుతాడు అలా మెయిల్ గురించి చెబుతాడు 

ఒక మెయిల్ అకౌంటును create చేసి ఇస్తాడు ఆ అబ్బాయికి ఆ తరువాత ఆ మెయిల్ ఆ అబ్బాయి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో అదే కథ 

చూడటానికి simpleగా భలే ఉంది కథ మంచి టైం పాస్ మూవీ సినిమా అయితే బాగుంది సూపర్ !!!

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

మేటి మాట !!!


 

"జాంబీ రెడ్డి" సినిమా పై నా అభిప్రాయం !!!

 నేను ఎప్పుడు సినిమాలు ఎక్కువ చూస్తుంటాను నేను చూసిన సినిమాలు గురించి మీతో చెపుతాను ఈ సోది అంతా ఎందుకంటే ఇప్పుడే నేను ఒక సినిమా చూసాను ఆ సినిమా పేరు జాంబీ రెడ్డి మంచి వెరైటీ సినిమలాగా ఉంది కదా నాక్కూడా !!!

ఇక కథ విషయానికి వెల్దామా 

హైదరాబాద్ లో గేమ్ desighn  చేస్తుంటాడు  హీరో మారియో అతని 3 స్నేహితులతో కలిసి ఒక గేమ్ create చేస్తాడు ఆ గేమ్ బాగానే సక్సెస్ అవుతుంది కాకపోతే ఆ గేమ్ లో కొన్ని bugs వస్తాయి 

దానిని రికవర్ చేయటానికి తన 3 స్నేహితులలో ఒకడైన కళ్యాణ్ కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ తనకు అకస్మాత్తుగా పెళ్లి కుదిరింది అని రాయలసీమ రుద్రవరం అని చెప్పి ఫోన్ పెట్టేసాడు

హీరో ఆ గేమ్ ను ఎలాగైనా క్రాష్ అవ్వకుండా ఉండటానికి తన స్నేహితులతో కలిసి రాయలసిమ లోని రుద్రవరం బయలుదేరతాడు 

ఆ తరువాత జాంబీ లు ఎలా వచ్చాయి వాటి నుండి ఆ ఊరును ఎలా కాపాడాడు అనేది కథ ఇంకో విషయం ఏమిటంటే ఇందులో ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్ కి జాంబీ లకు కథ కలిసేలా కధ రాసుకున్నాడు దర్శకుడు

కానీ ఎందుకో ఎక్కడో కథలో ఎదో మిస్సయ్యింది టైం పాస్ కి చూడవచ్చు ఓవర్ expectations తో సినిమాకు వెళ్లొద్దు

జాంబీ సినిమాలు మనం ఇంగ్లీష్ సినిమాలు ఎన్నో చూసాం కానీ మన తెలుగులో బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాను

గెటప్ సీను, మహేష్ విట్ట కామెడీ బాగానే ఉంది పరవాలేదు ఒక్కసారి చూడవచ్చు !!!

బహుశా దీనికి పార్ట్ 2 కూడా ప్లాన్ చేసినట్టు ఉన్నారు డైరెక్టర్ !!!

"క్రాక్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 మాస్ మహరాజ్ రవి తేజ నటించిన రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై మంచి విజయం సాధించింది

కిందటి సంవత్సరం విడుదల అయిన రవితేజ "డిస్కో రాజా " కొంచెం నిరాశకు గురి చేసింది కానీ ఈ సంవత్సరం విడుదల అయిన క్రాక్ సినిమా మాత్రం బాగుంది

చాలా బాగుంది సినిమా కథ విషయానికి వస్తే రొటీన్ కధ అయిన సరే టేకింగ్ బాగుంది ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ బాగా నటించారు

ఒకానొక టైం లో రవితేజ సాధారణ మూస పద్దతిలో సినిమాలు చేసుకుని వచ్చారు కానీ ఇప్పుడు కొద్దిగా స్లో అండ్ స్టడీ గా సినిమాలు తీస్తున్నారు రవితేజ

నా దృష్టిలో సినిమా అయితే మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది ఈ సినిమాలో 

Tiktok లో దుర్గారావు కూడా ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఈ సినిమా అయితే సంక్రాంతి విన్నర్ అని చెప్పవచ్చు తమన్ background స్కోర్ బాగుంది 

హీరో elevation కూడా బాగా చూపించారు విలన్ పాత్రలో సముద్రఖని బాగా చేశారు ఇక హీరోయిన్ శృతి హాసన్ తనదైన శైలిలో బాగా నటించింది సినిమా సూపర్ !!!

రాట్నాలమ్మ గుడి దగ్గర తీసిన కొన్ని ఫోటోలు !!!

 ఈ మధ్య కాలంలో రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది అక్కడ తీసిన కొన్ని ఫోటోలు మీ కోసం 












మేటి మాట !!!


 

5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

నారింజ మిఠాయి సినిమాపై నా అభిప్రాయం !!!

 నారింజ మిఠాయి ఈ డబ్బింగ్ సినిమా ఆ టైటిల్ చూసి నేను ఏదో సినిమా అనుకున్నాను కానీ మరి ఇంకో సినిమా 

నాలుగు జీవితాలు వాటి మధ్య జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు ఇలాంటి సినిమా మన తెలుగులో చందమామ కథలు సినిమలాగా ఉంటుంది

ఈ సినిమా పర్వాలేదు టైం పాస్ సినిమా  ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి

నేను అయితే ఎదో cute లవ్ స్టొరీ అనుకుని సినిమా చూసాను కానీ కాదు 

Expectation బట్టి సినిమా చూడొద్దు కానీ ఒక మంచి సినిమా !!!

భౌతిక దూరం భారం అయ్యెను , మాస్కులు మాయమయ్యెను !!!

కరోనా యావత్తు ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది ఎందరో మనుషుల్ని జీవితాల్ని నాశనం చేసింది కొందరికి అయితే అసలు జీవితమే లేకుండా చేసింది
  కిందటి సంవత్సరం ఈ రోజుల్లో చైనాలో వైరస్ గురించి ఆందోళన మొదలైంది ముందర ప్రపంచ దేశాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ తరువాత జరిగిందంతా మీకు తెలిసిందే
ఇక అసలు విషయానికి వస్తే అసలు కరోనా ఉందొ లేదో కూడా తెలియటం లేదు ప్రస్తుతం కొంచెం వైరస్ బలహీన పడిందో లేక మనుషులకు వైరస్ పై భయం పోయిందో అర్థం కావటం లేదు
ఎవరు ఎక్కడ సామాజిక దూరం పాటించటం లేదు , మాస్కులు కూడా ధరించటం లేదు బహుశా అందరికి కరోనా అంటే ఒక జ్వరం లాంటిది అని అనుకుంటున్నారేమో 
ఏది అయితేనేమి ఒక విపత్తు అనేది వచ్చిన తరువాత దాని నుండి బయటపడటానికి కొంత కాలం జాగ్రత్త ఉండాలి 
మన జాగ్రత్తే మనకు శ్రీ రామ రక్ష !!!

3, ఫిబ్రవరి 2021, బుధవారం

రాట్నాలమ్మ వారి దేవస్థానం రాట్నాలకుంట !!!

 ఈ రోజు మా కుటుంబం మొత్తం రాట్నాలకుంట రాట్నాలమ్మ వారిని దర్శించుకోవటం జరిగింది

ఈ ఆలయం ఏలూరు నుండి సుమారు 20 km దూరంలో ఉంది ఈ దేవాలయంలో ఎక్కువుగా దర్శించుకునే భక్తులు పొయ్యిమీద క్షీరాన్నం వండి అమ్మ వారికి నైవేద్యంగా పెడతారు

మేము ఈ ఆలయం దర్శించుకునేటప్పటికి ఉదయం 7.30 సమయం అవుతుంది చాలా ఖాళీగా ప్రశాంతంగా దర్శనం అయ్యింది 

పూర్వం ఇక్కడ పాత గుడి ఉండేది అంటా ఆ గుడి ప్రాంగణం అంతా మండపం సుందరంగా తీర్చి దిద్దుతున్నారు

చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు నీరు కూడా చాలా తక్కువుగా ఉంది ఇది బాగా మేరక ప్రాంతంలాగా ఉంది

వచ్చే దారిలో అన్ని మొక్క జొన్న తోటలు, నిమ్మ తోటలు ,కోకో తోటలు ఎక్కువ ఉన్నాయి ఎర్ర నేల ఇది

ఈ గుడికి సంబందించిన కొన్ని ఫోటోలు క్రింద ఉన్నాయి గమనించగలరు











మేటి మాట !!!


 

కొన్ని సినిమాలు, కొన్ని కార్యక్రమాలు ఎందుకు తీస్తారో తెలియదు ??

 వెండితెరపై కొన్ని సినిమాలు, బుల్లి తెరపై కొని కార్య క్రమాలు వాటి కాన్సెప్టులు జనాలకు నచ్చవని కూడా తెలిసి తీస్తుంటారు అసలు అలా ఎందుకు తీస్తారో తెలియదు

ఇవి ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష చేసేలా ఉంటాయి ఎన్నో ఒత్తిడిలను,మరెన్నో కష్టాలను నిత్యం నిజ జీవితంలో చూసే సామాన్య ప్రజానీకానికి కాస్త ఊరట నిచ్చే అంశం ఏదైనా ఉందంటే అది సినీ వినోదమే

నేను ఈ విషయాన్ని ఎవరిని నొప్పించటానికి చెప్పటలేదు కొన్ని నేను చూసాను కాబట్టి మీతో పంచుకుంటున్నాను ప్రతి మనిషికి ఎదురయ్యేదే ఇది ఏమి కొత్త విషయం కాదు 

నా మనసులో నేను అంటుకుంటున్న విషయం మరొక్కసారి చెబుతున్నాను ఎవ్వరిని నొప్పించటానికి కాదు దయచేసి గమనించగలరు !!!


1, ఫిబ్రవరి 2021, సోమవారం

కరోనా అన్నది ఒక పీడ కల !!!

 గత సంవత్సరం 2020 అందరికి ఒక పీడ కల లాగా మిగిలింది అసలు సంవత్సరం ఎలా గడిచిందంటే అలా గడిచింది march నెలాఖరుకు మొదలైన కరోనా కల్లోలం దాదాపు ఆ సంవత్సరం చివరి దాకా ఎంతో మంది బాధకు కారణం అయ్యింది

కరోనా కారణంగా వచ్చిన సెలవులు మొదట అందరూ బాగా ఎంజాయ్ చేశారు డబ్బు ఉన్నవాడికి సరే మరి లేనివాడి పరిస్థితి ఏమిటి ?

కరోనా రోజుల్లో టీవీ చూస్తుంటే మనసుకు చాలా బాధ వేసింది వలస కూలీలా బతుకు చిత్రాలు, ఆసుపత్రులలో రోగుల హర్తా నాధాలు , తినటానికి తిండి లేక ఎన్నో జీవితాలు ఛిద్రం అయ్యాయి

ఈ కరోనా ఏమో కాని ఆ భయం తోనే చాలా మంది మరణించారు ఇక ఇప్పుడిప్పుడే కొద్దిగా కొలుకుంటుంది ప్రపంచం మొత్తం 

మానవులు చేసిన తప్పిదాలే మన మనుగడకు ప్రశ్నర్ధకం గా మారింది

మొత్తానికి కరోనా అనేది అందరికి ఒక మరువలేని పీడ కల లాగా మారింది !!!


Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...