Saturday, November 16, 2019

కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం !!!

కార్తీక మాసం అంటేనే అదొక స్పెషల్ ఎందుకంటే ఎటు చూసినా శివ, నామ స్మరణతో ఆలయాలు, సంవత్సరం అంత పడిన కష్టంతో ప్రకృతిలో సేద తీరటనికి వన భోజనాలు చూడటానికి చాలా బాగుంటుంది
      ఆధ్యాత్మిక విహార యాత్రలు, కుటుంబ సమేతంగా వెళ్లే యాత్రలకు కార్తీక మాసం ఎంతో అనువైనది
అందుకే ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం చాలా ప్రత్యేకం.

Saturday, November 2, 2019

ఏందిరా ఈ జీవితం !!!

నా జీవితం నాకు ఎప్పుడు నన్ను ఎక్కిరిస్తూనే ఉంటుంది
అన్ని బాగున్నాయి అనే సమయానికి ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం సాధించిన తరువాత ఎదో రకంగా నిలదొక్కుకుంటున్నాం అన్నంత లోపులోనే కుటుంబ ఆర్ధిక సమస్యలు
అదే కాకుండా ఇటీవల పెళ్లి కూడా అయ్యింది ఇంటిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదు ఉండటానికి చేతి పని ఉన్న దానిలో అన్ని నష్టాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది
ఈ జీవితం మొత్తం ఇలాగే ఉంటుందా అని
ఈ సమస్య నా ఒక్కడికే నేను అనుకోను ఎందుకంటే ఇది ప్రతి మధ్య తరగతి జీవితాల్లో ఉండే సమస్యే

ప్రతి దానికీ ఓర్పు కావలంటారు నిజమే కానీ ఆ ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటినా తరువాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి
ఏదైనా ఒక మంచి ఉద్యోగం కుటుంబ సమస్యలు తలెత్తకుండా మన ఖర్చులకు సంబందించి సంపాదించుకోవడం చాలు ఈ జీవితానికి అంతకు మించి ఏముంది
కానీ అదే ప్రశ్నర్థకం గా మారింది చూద్దాం అంతకు మించి మనం చేసేది ఏమి ఉండదు నాకు తెలిసిన ఒక మంచి మాట ఉంది
" నిరుత్సాహం మనిషిని మరింత బలహీనుణ్ణి చేస్తుంది"

అందుకే సాధ్యమైనంత వరకు నేను నా దగ్గరికి నిరుత్సాహం రాకుండ చూస్తాను అదే నా సమస్యకు
మొదటి పరిష్కారం !!!

Thursday, October 31, 2019

నాగుల చవితి శుభాకాంక్షలు !!!

నాగుల చవితి ఈ పేరు వింటే కొంత ఆనందం, కొంత ఉత్సుకత ఉంటుంది ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి పుట్ట కు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పాలు పోసి కొద్దిగా సలివిడితో కొద్దిగా ప్రసాదం చేసి కొంచెం పుట్టలో వేసి పూజ కార్యక్రమాలు చేసి కొద్దిగా పుట్ట మన్ను తీసుకుని చెవులకు పెట్టుకుని ఇంకా కొద్దిగా తీసుకుని ఇంటిలో వాళ్ళకి ఇచ్చి
దీపావళి లో మిగిలిపోయిన మందు సామగ్రిని అంటే కాకర పొవ్వొత్తులు, మతాభిలు లాంటివి పేల్చి మనం ఇంటికీ తిరుగుచేస్తాం
  మీకు మొదట్లో చెప్పినట్టు ఆనందం అంటే ఇది మరీ ఉత్సుకత అంటే మనం సాధారణంగా ఏ పండగైన ఇంటి దగ్గర చేసుకుంటాము కానీ నాగుల చవితి మాత్రం పచ్చని పొలాల మధ్య, చెట్ల దగ్గర ఉండే పుట్టలు దగ్గర ఈ పండగ చేసుకుంటాము
ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే వారికి కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది
ఇక పూజ అయిన తరువాత ఇంటికి వస్తే ఈ రోజు చాలామంది ఉపవాసం ఉంటారు ఆహా ఇంకా టీవీలలో అన్ని నాగరాజు సినిమాలే సినిమాలు !!!

Thursday, October 10, 2019

Friday, September 6, 2019

Thursday, September 5, 2019

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!

జీవితానికి వెలుగునిచ్చే విద్యను ప్రసాదించి
వారు నేర్పే అక్షరాలతో మనిషిలోని అజ్ఞాన అంధకారాన్ని
తొలగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దే
ఉపాధ్యాయుల్ని స్మరించుకుంటూ
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !!!💐💐💐

మీ తెలుగు వికాసం 🙏🙏🙏

మేటి మాట


Saturday, August 31, 2019

Wednesday, August 28, 2019

Wednesday, August 21, 2019

Saturday, August 17, 2019

Thursday, August 15, 2019

Thursday, August 8, 2019

Wednesday, March 27, 2019