30, నవంబర్ 2021, మంగళవారం

" పెద్దన్న " సినిమా పై నా అభిప్రాయం !!!

 సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన సినిమా పెద్దన్న నయన తార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా దీపావళి సందర్భంగా విడుదల చేసిన సినిమా ఇక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం !!!

పెద్దన్న ఆ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో పెద్ద మనిషి ఒక్కగానొక్క చెల్లెలు కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం తనకి పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకుంటాడు చాలా సంబంధాలు చూస్తాడు చివరికి ప్రకాష్ రాజ్ కుటుంబం తో సంబంధం కుదుర్చుకుంటాడు

ప్రకాష్ రాజ్, పెద్దన్న కి ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి కానీ పెద్దన్న మంచితనం చూసి సంబంధం కలుపుకోవాలని చూస్తాడు

అయితే ఊహించిన విధంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుని అంతా అనుకునే లోపు కీర్తి సురేష్ ఇంటిలినుండి బయటకు వెళ్లి పోతుంది అసలు ఎందుకీ ఇలా చేసింది అన్నది షాక్ లో ఉంటారు అందరూ

అయితే ఇలా ఎందుకు జరిగింది అన్నది మిగిలిన సినిమా కథ !!!

27, నవంబర్ 2021, శనివారం

" దృశ్యం 2 "సినిమా పై నా అభిప్రాయం !!!

 


దృశ్యం ఈ సినిమా చాలా మంది చూసే ఉంటారు ఇంకా దీనికి కొనసాగింపుగా దృశ్యం 2 అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో నటించారు ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మొదటి దృశ్యం సినిమా మీకు గుర్తిందిగా తన అమ్మాయి కోసం వచ్చిన వరుణ్ అనే అబ్బాయిని హత్య చేసి కొత్తగా నిర్మాణం లో ఉన్న పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెడతారు అది ఎవరికి తెలియదు అనుకుంటారు 

తరువాత 6 సంవత్సరాలకు ఆ కేస్ గురించి విచారణ జరుగుతూనే ఉంటుంది అయితే ఈ సారి పోలీస్ కానిస్టేబుల్ ని అండర్ కవర్ ఆపరేషన్ లి భాగంగా రాంబాబు వాళ్ళ ఇంటి ముందే మాములు మనుషులు లాగే ఉంటారు రాంబాబు ఫ్యామిలీ లో కలిసిపోతారు వాళ్లకు తెలియకుండానే వారి ఇంట్లో మాట్లాడుకునే మాటల్ని విటుంటారు

అంతే కాకుండా రాంబాబు మొదటి పార్ట్ లో వరుణ్ ని హత్య చేసి పోలీస్ స్టేషన్ లో పూడ్చి బయటకు వస్తున్నప్పుడు జనార్దన్ అనే వ్యక్తి చూస్తాడు అతడు అంతకుముందే అతని బావ మరిదిని చంపేసి పారి పోతుండగా అప్పుడే రాంబాబును అక్కడ చూస్తాడు అది ఎవరికి అయిన చెబుదాం అనుకునే లోపు పోలీస్ లు అతడిని అరెస్ట్ చేసి జైలులో వేస్తారు 

మళ్ళీ 6 సంవత్సరాలు తరువాత విడుదల అయ్యి బయటకు వస్తాడు రాంబాబు కేస్ విషయం తెలుసుకుని పోలీసులకు ఈ విషయం చెబుతాడు 5 లక్షలు డబ్బులు కోసం వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అతడికి ఇస్తారు అప్పుడు చెబుతాడు రాంబాబు కొత్తగా కడుతున్న పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు చూసాను అని మళ్ళీ కేస్ ఫైల్ చేసి విచారణ కోసం రాంబాబు ఫ్యామిలీ ని విచారిస్తారు

ఆఖరికి రాంబాబు ఒప్పుకుంటాడు ఆ హత్య తానే చేశానని కానీ ఇకనుండి కథ చెప్పటం కుదరదు ఎందుకంటే ఇదే మీరు చూడవాల్సింది 


బహుశా దీనికి 3 వ పార్ట్ కూడా ఉంది అనుకుంటున్నాను

బాగానే ఉంది సినిమా పరవాలేదు చూడ వచ్చు !!!


 

26, నవంబర్ 2021, శుక్రవారం

Sivaranjanium innum sela pengalum సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా పేరు మళ్ళీ చెప్పమంటే నేను చెప్పలేను కానీ ఈ సినిమా sony liv లో ఉంది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా ముఖ్యంగా 3 ఆడవాళ్లు గురించి తీసిన సినిమా మొదటిగా ఒక భార్య, భర్త, ఒక చిన్న పాప పేద కుటుంబం అయితే భర్త సంపాదన ఉండదు భార్య అలాగే సంసారం నడిపిస్తుంది అయితే ఒకసారి భర్త భార్య ని కొడతాడు అయితే గట్టిగా కొట్టొద్దు అంటుంది అంటే భర్త అప్పటినుండి కోపముతో ఉంటాడు ఆ తరువాత నుండి అతను కనిపించడు అక్కడితో ఒక కథ

రెండవది ఒక కుటుంబం అమ్మ, నాన్న, ఇద్దరు కొడుకులు, వాళ్ల భార్యలు ఇదే కుటుంబం అయితే ఇంటి పెద్ద కోడలు ఇంటిలోనే ఉంటుంది రెండవ కోడలు జాబ్ చేస్తుంది అయితే ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక డైరీ రాస్తోంది ఆసలు ఆ డైరీలో ఏముంది అన్నది ఇంట్లో వాళ్లు తెలుసుకోవాలి అనుకుంటారు కానీ దానికి ఆమె ఒప్పుకోదు  చివరికి ఆ డైరీని కాలుస్తుంది అంతే అక్కడితో రెండవ కథ


మూడోవది college లో బాస్కెట్ బాల్ topper కి marraige చేస్తారు అప్పటినుండి తాను బాస్కెట్ బాల్ మానేస్తుంది ఇంట్లో వంట పనులు, సమయానికి అందరికి అన్ని అందించటం భర్తను, అత్తగారిని చూసుకోవడం, పిల్లను చూసుకోవడం ఇదే ఆమె దిన చర్య  ఇది మూడోవ కథ

ఈ సినిమా మొదట్లో అవార్డ్లు వచ్చినట్టు చూపిస్తారు ఇందులో కథ చాలా సాధారణంగా, ఉంటుంది అంతగా ఏమి ఉండదు 

ఆడవారి జీవితాలలో ఉండే వాటిని గురించి ఈ సినిమాలో చూపించటం జరిగింది !!!

RRR నుండి జనని సాంగ్ చూసారా !!!

 RRR బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరు కలిస్తే అనే ఉహాజనీతమైన కథతో వస్తుంది 

ఈ సినిమా జనవరి 7 న 2022 విడుదల అవుతుంది ఈ సినిమా నుండి ఇవాళ ఒక సాంగ్ విడుదల అయింది అది ఎలా ఉందో చూద్దాం !!!

24, నవంబర్ 2021, బుధవారం

" Most eligible బ్యాచ్ లర్" సినిమాపై నా అభిప్రాయం !!!

అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలెజిబుల్ బ్యాచ్ లర్ సినిమా పూజ హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం అన్నట్టు ఈ సినిమా ఆహా ott లో విడుదల అయ్యింది 
అమెరికాలో జాబ్ చేస్తుంటాడు అఖిల్ ఇండియాలో పెద్ద కుటుంబం తనకు 20 పెళ్లి సంబంధాలు ను చూస్తారు వాటిలో తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లి అమెరికాలో settle అవుదామని అనుకుంటాడు 
పెళ్లి చూపులు చూడటానికి అమెరికా నుండి ఇండియా కి వస్తాడు ఆ 20 మంది అమ్మాయిలలో ఒక అమ్మాయి పూజ హెగ్డే ఉంటుంది అయితే జాతకాలు కలవు లేవని ఆ ఫోటో తిరిగి ఇచ్చేయటానికి వెళ్తాడు అయితే అనుకోకుండా ఆ ఫోటో మిస్ అవుతుంది వాళ్ల నాన్న ఆ ఫోటో కోసం చాలా గొడవ పెడతాడు
ఈ క్రమంలో హీరోయిన్ ని కలుస్తాడు హీరోయిన్ ఆటిట్యూడ్ కి హీరో ఫిదా అయిపోతాడు అప్పటి నుండి ఎన్ని సంబంధాలు చూసిన నచ్చవు
పెళ్లి కి ముందు కాదు పెళ్లి తరువాత కాపురాలు ఏ విధంగా ఉంటాయి  అసలు పెళ్లి అయిన తరువాత భార్య భర్తలు మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే కథాంశం తో తీశారు ఈ సినిమా 
ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది avereage సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

23, నవంబర్ 2021, మంగళవారం

ఫ్యామిలీ డ్రామా సినిమా పై నా అభిప్రాయం !!!


 ఫ్యామిలీ డ్రామా Sony liv ott లో విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

అనగనగా ఒక ఫ్యామిలీ ఒక తండ్రి, తల్లి, ఇద్దరు కొడుకులు ,వాళ్ళ భార్యలు అందులో పెద్ద కొడుకు సుహాస్ అంటే కలర్ ఫోటో సినిమాలో నటించిన సినిమా ఇందులో నెగిటివ్ రోల్ చేసాడు

సీరియల్ కిల్లర్ పాత్రలో, సైకో పాత్రలో చాలా బాగా చేసాడు  వాళ్ళ తండ్రి సుహాస్ ని ఇంటి నుండి బయటకు పంపించేస్తాడు వాళ్ళ నాన్న ఎప్పుడు అందరిని తిడుతూ వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటాడు

అయితే సుహాస్ వాళ్ళ నాన్నకి, పక్షవాతం వచ్చేలా చేసి ఎలాగైనా ఇంటిలోకి ప్రవేశిస్తాడు అయితే మర్డర్ లు తానే కాకుండా వాళ్ళ తమ్ముడు కుడా మర్డర్లు చేస్తాడు 

ఈ విషయం వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న భార్యలకు తెలుస్తుంది వాళ్లకు తెలిసిన విషయం అన్న దమ్ముళ్లకు తెలుస్తుంది 

అయితే తరువాత కథ ఏమి అయ్యింది అన్నది సినిమా కథ ఫ్యామిలీ మొత్తం సైకో గాళ్ళు ఎక్కువ అది మీకు లాస్ట్ తెలుస్తుంది 

రొటీన్ కు భిన్నంగా ఉంటుంది కానీ బాగుంది సినిమా పరవాలేదు !!!

22, నవంబర్ 2021, సోమవారం

" ఒక చిన్న ఫామిలీ స్టోరీ" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 ఒక చిన్న ఫామిలీ స్టోరీ  జీ 5 ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!!!

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అబ్బాయి, ఒక బామ్మ ఈ కుటుంబం అంతా నడిచేది నాన్న సంపాదన మీదే అయితే హీరోకి ఏ పని చెయ్యడు ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న చనిపోతాడు అప్పుడు తెలుస్తుంది హీరోకి ఇంట్లో దేనికి ఎంత ఖర్చు అవుతుందో అప్పుడే ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది వాళ్ళ నాన్న 25 లక్షలు లోన్ తీసుకున్నాడని దానిని తీర్చాలంటే డబ్బులు ఎలా వస్తాయి చివరకు ఉద్యోగం చేస్తాడా లేదా ఆ 25 లక్షలు వాళ్ళ నాన్న ఏమి చేశాడు 

ఆ బాకిని ఎలా తీర్చాడు అన్నది కథ హీరోయిన్ పక్క ఇంటిలోనే ఉంటుంది ఇది కథ చాలా సింపుల్ గా ఉంది కాని బాగుంది సినిమా కామెడీ, బాగుంది

ప్రతి సామాన్యుడి జీవితంలో జరిగే సన్నివేశాలు తెరపై బాగా చూపించారు బాగుంది మంచి ఎంటర్టైనర్ అందరూ చూడ వచ్చు 👍👍👍

21, నవంబర్ 2021, ఆదివారం

"Lift " తమిళ్ హార్రర్ సినిమా పై నా ఆభిప్రాయం !!!

 Lift తమిళ్ సినిమా ఈ సినిమా ఇవాళ చూడటం జరిగింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో బెంగళూరు లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తుంటాడు ట్రాన్స్ఫర్ మీద చెన్నై వస్తాడు అయితే అక్కడ ఒక రోజులో జరిగిన కథ గురించి ఈ సినిమా ఇందులో హీరోయిన్ H. R లాగా పనిచేస్తుంది అయితే అంతకుముందే వారిద్దరికీ పరిచయం ఉంటుంది

హీరో కి వాళ్ళ బాస్ నైట్ extra వర్క్ ఇస్తాడు అయితేవర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు హీరో అంతలో లిఫ్ట్ లో ఇరుక్కుపోతాడు 

అయితే అక్కడినుండి అసలైన కథ మొదలవుతుంది అలిఫ్టు లో రక, రక ల సౌండ్ లు, అరుపులు వస్తాయి ఇంతలో లిఫ్ట్ పనిచేస్తుంది కానీ పైకి, కిందకి వెళుతుంది మెట్ల మీద వెళ్లిన సరే మళ్ళీ అక్కడికే వస్తారు

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అక్కడ ఏమైనా దెయ్యం ఉందా అనేది సినిమా కథ ఆ రాత్రి హీరోయిన్ కూడా అక్కడే ఒక రూమ్ లో చిక్కుకుని ఉంటుంది అసలు అక్కడ ఏమి జరుగుతుంది చివరికి వారిద్దరూ బయట పడ్డారా లేదా ఆన్నది సినిమా కథ హార్రర్ సస్పెన్స్ తో కూడిన సినిమా low బడ్జెట్ లో బాగా తీశారు సినిమా బాగానే ఉంది హార్రర్ అంటే ఇషాపడే వారికి నచ్చుతుంది

ఈ సినిమా కథ అంతా ఒక రోజులో జరిగినట్టు చూపించారు చివరికి ఆ దెయ్యం ఎవరు అలా ఎందుకు చేస్తుంది అన్నది తెలుస్తుంది బాగానే ఉంది సినిమా 👌👌👌

నా గురించి నేను ?

 నా గురించి నేను చెప్పుకోవడానికి పెద్ద ఏమి లేదు కానీ నా మనసులో మాట చెప్పుకోవడానికి దొరికిన చిన్న అవకాశం 

నా పేరు సుబ్రమణ్యం నేను చదివింది డిగ్రీ బికామ్ అది ఆంధ్ర university దూర విద్య విధానం ద్వారా చదువుకున్నాను నాకు 30 సంవత్సరాలు వయసు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు ఒక చిన్న పాపా కూడా ఉంది నేను చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు

ఎందుకంటే అప్పుడెప్పుడో దాదాపు 12 సంవత్సరాలు క్రితం ఒక బ్రాండెడ్ మొబైల్ షాప్ లో చేసాను అప్పుడు ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సరిగ్గా చదువుకోలేదు అలాగే ప్రైవేట్ గానే కడుతూ డిగ్రీ పరీక్షలు రాసాను సాధారణ మార్కులతో పాస్ అయ్యాను ఇప్పుడు అదే పని

వేరే మొబైల్ షాపులో చేస్తున్నాను చాలి చాలని జీతంతో, మీకు ఇది చదివిన తరువాత ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అని మీకు సందేహం రావచ్చు

కానీ నా అలచనలు పంచుకుంటున్నాను అంతే కాని ఒక్కటి మాత్రం నిజం ఎవరి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా మారుతుంది ఆ మార్పు కోసమే ప్రతి మనిషి ఆరాటం, ప్రతి రోజు పోరాటం !!😢😢😢☺️☺️☺️


19, నవంబర్ 2021, శుక్రవారం

నాని "శ్యామ్ సింగరాయ్" టీజర్ చూసారా ?

 Natural star నాని నటించిన కొత్త చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ డిసెంబర్ 24 తేదీన విడుదల అవుతుంది ఈ సినిమా టీజర్ విడుదల చేసారు నాని గత రెండు సినిమాలు అమెజాన్ ott లో విడుదల అయ్యాయి ఈ సినిమా మాత్రం థియేటర్ లో విడుదల అవుతుంది మీరూ ఒక లుక్ వెయ్యండి !!!

16, నవంబర్ 2021, మంగళవారం

"Scam 1992 " webseries పై నా అభిప్రాయం !!!

 Scam 1992 ఇది జరిగినప్పుడు బహుశా నాకు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటాయి అప్పట్లో మనకు ఏమి తెలియదు కాని 2005 ,2006 ఆ టైం లో అనుకుంటా వార్తల్లో అడపా, దడపా స్కాం 1992 గురించి, హర్షద్ మెహతా గురించి వార్తల్లో వచ్చేది ఇక ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం !!!

Sensex అసలు ఇది ఏమిటో ఎన్ని సార్లు అర్థం చేసుకోవాలని చూసినా ఇది ఒక puzzle ల ఉండేది ఇప్పుడు అంతే ఇక విషయానికి వద్దాం హర్షద్ మెహతా ఒక గుజరాతీ అయితే వ్యాపార నిమిత్తం బొంబాయి లో ఉంటారు అయితే దిగువ మధ్య తరగతి కుటుంబం వీరిది శాంతి లాల్ మెహతా కి ఇద్దరు కొడుకులు ఒకరు హర్షద్ మెహతా, మరొకరు అశ్విన్ మెహతా అయితే శాంతి లాల్ మెహతా బట్టల వ్యాపారం చేసి మోసపోయి దివాళా తీసి ఉన్నాడు అపుడు ఇంటికి పెద్ద కొడుకు హర్షద్ మెహతా  బంగారం వ్యాపారం చేసేవాడు అలా కాదు అని నిర్ణయించుకుని 

Bombay stock exchange గురించి తెలుసుకుని ఎలాగోలా. అందులో మెళకువలు నేర్చుకుంటాడు హర్షద్, అశ్విన్ ఇద్దరు మెల్లగా స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు

అలా హర్షద్ మొత్తానికి షేర్ మార్కెట్ కింగ్ అవుతాడు ఆ తరువాత మరో మనీ మార్కెట్ లోకి కూడా అడుగు పెడతాడు మొత్తానికి బాగానే సంపాదిస్తాడు

అది చూపి బ్యాంక్ లో లోన్ తీసుకుని వాటిని బ్యాంక్ ఖాతాలలో చూపకుండా చేస్తాడు ఇది మీకు చెబితే అర్థం కాదు మీరు చూడాలి 

ఇందులో వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు కాని సిరీస్ అయితే బాగుంది

అసలు హర్షద్ మెహతా ఎలా షేర్ మార్కెట్ లోకి ప్రవేశించాడు, ఎలా బ్యాంక్ లని మోసం చేసాడు, హర్షద్ మెహతా వెనుక ఎవరు ఉన్నారు,ఈ మోసం ఎలా బయట పడింది చివరకు హర్షద్ మెహతా ఎలా చనిపోయాడు అన్నది కథ బాగుంది మొత్తం 8 గంటలు పైనే ఉంది కాని బాగుంది !!!👍👍👍

14, నవంబర్ 2021, ఆదివారం

" అఖండ " మూవీ ట్రైలర్ చూసారా ?

 బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న నందమూరి బాలకృష్ణ  నటించిన కొత్త చిత్రం అఖండ ట్రైలర్ విడుదల చేసారు మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది 

శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తాడు జగపతిబాబు ఒక పాత్రలో తళుక్కున మెరిసాడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2 విడుదల అవుతుంది 

ఇక ట్రైలర్ ఒక లుక్ వెయ్యండి !!!

పుష్పక విమానం సినిమా పై నా అభిప్రాయం !!!

 పుష్పక విమానం విజయ దేవరకొండ ఆనంద్ దేవరకొండ నటించిన 3 వ సినిమా నవంబర్ 12 న ఈ సినిమా థియేటర్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా కొంచెం వెరైటీ గా బాగుంది అందుకే చూసాను ఇక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

సుందర్ ( ఆనంద్ దేవరకొండ ) ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తాను ఉండే ఇంటికి తీసుకువస్తాడు అయితే కొన్ని రోజుల తరువాత ఆ ఆమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లెటర్ రాసి అయితే అప్పుడు ఏమి చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన భార్య ఇంట్లోనే ఉన్నట్టు అందరిని నమ్మిస్తాడు

అయితే స్కూల్ లో పనిచేసే కొంతమంది టీచర్స్ సుందర్ భార్యని చూపించమని అడుగుతారు  అప్పుడు సుందర్ ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ ని తన భార్య గా నటించి మంటాడు తాను అలాగే చేస్తుంది

ఇంతలో అసలైన తన భార్య ఎక్కడ ఉందా అని enquiry చేస్తాడు చివరకు తనని ఎవరో చంపేస్తారు అక్కడి నుండి కథ వేరేలా ఉంటుంది 

చివరకు తన భార్య ను చంపింది ఎవరు సుందర్ ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు అయితే అసలు కథ ఏంటి అన్నది మిగిలిన సినిమా కథ

పెళ్ళాం లేచిపోయిన మొగుడిగా బాగానే నటించాడు ఆనంద్ మంచి వెరైటీ కాన్సెప్ట్ తో బాగానే అలరించాడు

పర్వాలేదు సినిమా బాగానే ఉంది 👍 !!!

9, నవంబర్ 2021, మంగళవారం

జయ లలిత బయోపిక్ " తలైవి " సినిమా పై నా అభిప్రాయం !!!

 జయ లలిత బయో పిక్ తలైవి సినిమా జీ5 ott లో అందుబాటులో ఉంది బహుశా మీకు ఇది తెలిసే ఉంటుంది ఇక ఈ సినిమా ఈ రోజు చూడటం జరిగింది ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !

జయ లలిత తమిళ్ నాడు ముఖ్యమంత్రి గానే మనకు తెలుసు కానీ ముఖ్యమంత్రి అవటానికి ముందు అసలు తన జీవితంలో జరిగిన సంఘటనలు,అసలు సినిమాలలో ఉండే జయ లలిత రాజకీయాలలో కి ఎలా వెళ్లారు అన్నది సినిమా కథ 

ఇక ఇందులో జయ లలిత పాత్రలో కంగనా చాలా నటించారు MJR లాగా అరవింద్ స్వామి నటన, సంద్రఖని, నాజర్ ప్రముఖుల పాత్రల్లో బాగా చేశారు ఈ సినిమా చూస్తే నిజంగా జయ లలిత అంత బాగా పాలించారు అనిపించింది వాస్తవాలు ఏమిటో మనకు తెలీదు కానీ సినిమా బయో పిక్ మాత్రం బాగానే ఉంది

అసెంబ్లీ లో జరిగిన జయ లలిత అవమానం సీన్ తో మొదలవుతుంది సినిమా తన చీరను లాగి అవమానించిన అధికార పక్షం శపథం చేసి ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ లో అడుగు పెడతానని అలాగే ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ లో అడుగు పెట్టడం జరుగుతుంది

సినిమా అయితే బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు నేనైతే అసలు జయ లలిత జీవితంలో జరిగిన సంఘటనలు పేపర్ లలో రోజు చదివేవాడిని అలాగే ఉంది సినిమా !!!

" Uncaged" సినిమా పై నా అభిప్రాయం !!!

 


హాలీవుడ్ డబ్బింగ్ తెలుగులో కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది సినిమా పేరు uncaged ఇక సినర్మ కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా amsterdam అనే ఒక సిటీ లో జరిగేది ఒక సింహం ఆ సిటీ లో ఉండే మనుషుల్ని చంపి తినేస్తుంది దానిని ఎలా పట్టుకున్నారో అదే సినిమా కథ ఇందులో చూడటానికి చిన్న సినిమా కథ లాగే కనిపిస్తుంది కానీ సినిమా పర్వాలేదు 
ఆ సింహాన్ని ఎలా బంధించాలని చూసిన చివరకు దాని చేతిలో చాలా మంది చనిపోతారు అయితే దానిని చివరికి చంపరా లేదా అన్నది సినిమా కథ హాలీవుడ్ అంటే ఇలాంటి సినిమా లకు పెట్టింది పేరు  పరవాలేదు సినిమా బాగానే ఉంది 
బహుశా సినిమా గురించి నా లాగా చిన్నగా ఎవరు చెప్పరేమో నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు దానిని అటు లాగి, ఇటు లాగి చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఏదైతే అదే చెప్తాను 😊😊😊

8, నవంబర్ 2021, సోమవారం

పెద్ద నోట్ల రద్దు నేటితో 5 సంవత్సరాలు పూర్తి ?

 అది నవంబర్ 8 తారీఖు 2016 వ సంవత్సరం నాకు తెలిసి నేను అప్పడే జీతం తీసుకున్నాను మధ్య తరగతి జీవితాలలో జీతం తీసుకున్న రోజే పండగ అసలైన పండగ ఎంతో సంతోషంగా ఉన్నాను

అప్పుడు పడ్డాది అసలైన పిడుగు నేను తీసుకున్న జీతం మొత్తం 500, 1000 రూపాయల కాగితాలు ఆ రోజు నుండి పెద్ద నోట్లు రద్దు అని ప్రకటన చేశారు కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయింది ఆ తరువాత బ్యాంక్ లు చుట్టూ తిరిగి ఎలాగైతే ఏం ఆఖరికి పని అయ్యింది కానీ బ్యాంక్ లు చుట్టూ తిరిగి, తిరిగి నిజంగా ఒక రకం అంతే 

నేను అంత పెద్ద మేధావిని కాదు గాని అసలు నోట్లు రద్దు వల్ల ఇబ్బంది పడింది మాత్రం సామాన్య ప్రజలు నిజముగా ఇది నిజం

నేటితో ఆ పీడ కలకి 5 సంవత్సరాలు అయ్యింది అప్పుడు చూడాలి పాత 500, 1000 రూపాయలు నోట్లు గురించి హాస్య ఛలోక్తులు, ఫన్నీ వేషాలు నిజంగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది నిజంగా

చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆరోజుల్లో నేను అనే కాదు బహుశా జీతం మీద ఆధారపడి బ్రతికే ప్రతివాడు నాలాగే బాధ పడుంటాడు😞😞😞

7, నవంబర్ 2021, ఆదివారం

"బిమ్లా నాయక్ " టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల !!!

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బిమ్లా నాయక్ సినిమా నుండి టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల అయ్యింది అది ఎలాగ ఉందొ పైన ఉంది సాంగ్ చూడండి అన్నట్టు దీనికి లిరిక్స్ త్రివిక్రమ్ అందించారు
ఈ రోజు త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు !!!

6, నవంబర్ 2021, శనివారం

"వరుణ్ డాక్టర్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 వరుణ్ డాక్టర్ శివ కార్తికేయన్ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఇది netflix ott లో అందుబాటులో ఉంది ఇక కథ గురించి ఇప్పుడు చూద్దాం !

ఆర్మీ లో డాక్టర్ గా పనిచేస్తుంటాడు వరుణ్ (శివ కార్తికేయన్) పెళ్లి సంబంధం కోసం ఇంటికి వస్తాడు అక్కడ హీరోయిన్ కి తనకి పెళ్లి సంబంధం కుదురుతుంది అయితే హీరోయిన్ తనని పెళ్లి చేసుకొనని చెపుతుంది తనకు ఎమోషన్స్ లేవని ఫీలింగ్స్ లేవని రిజెక్ట్ చేస్తుంది అయితే అప్పుడే హీరోయిన్ వాళ్ల అన్నయ్య వాళ్ళ పాపని ఎవరో కిడ్నాప్ చేస్తారు అక్కడి నుండి 

ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారు అలాగే చిన్న పిల్లల్ని చాలా మంది కిడ్నాప్ కు గురి అవుతారు

ఇదంతా చేస్తుంది ఎవరు అని వరుణ్ ఎలా కనుక్కుంటాడు, ఈ కిడ్నాప్ లు అన్ని ఎదుకు జరుగుతున్నాయి చివరకు ఆ పాపను కాపాడరా లేదా అన్నది మిగిలిన కథ

బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు !!!

4, నవంబర్ 2021, గురువారం

సూర్య నటించిన "జై భీమ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 జై భీమ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే వాస్తవాలకి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా ఇక కథ గురించి ఇప్పుడు చూద్దాం !

సూర్య ఈ సినిమాలో నటించలేదు జీవించాడు అని చెప్పాలి పోలీస్ లో విచారణలో సరైన దోషులు దొరకకపోతే పాపం ఏ ఆధారం లేని గిరిజనుల్ని అందులో ఇరికించి వాళ్ళను చిత్ర హింసలు చేసి చివరకు వాళ్ళను చంపి తప్పించుకుని పారిపోయారు అని నిరూపించి

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉంది కాని ఒక మాటలో చెప్పే సినిమా కాదు కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది

ఎలాంటి doubt లేదు కాక పోతే సినిమా నిడివి 2 గంటలు 44 నిమిషాలు ఉంది కాని సినిమా బాగుంది ఇందులో సూర్య న్యాయం కోసం పోరాటం చేసే ఒక అసలైన న్యాయవాది చాలా బాగా చేశారు 

బాగుంది సినిమా 👍👍👍👍

దీపావళి శుభాకాంక్షలు !!!

 దీపావళి అంటే పండుగలలో ఒక ప్రత్యేకమైన పండగ అని చెప్పవచ్చు ఎందుకంటే  ప్రతి పండగ ఇదొక ప్రత్యేకత కల్గి ఉంటుంది దీపావళి కూడా అలాంటిదే 

చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంతో, సంతోషంతో, ఆహ్లాదంతో చేసుకునే పండగ దీపావళి 

మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపోవొత్తులు, అగ్గిపెట్టెలు, పాము బిల్లలు, టపాసులు ఎలాగ ఎన్నో మన ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయి

అందుకే దీపావళి అంటే ఒక స్పెషల్ అలాగే ఇంకొక మాట డబ్బులు ఉన్న లేకున్నా ఎవరి స్తోమత కు తగ్గట్టు వారు మందులు పేలుస్తారు

అందరి మరొక సారి దీపావళి శుభాకాంక్షలు !!!💐💐💐

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...