31, జనవరి 2021, ఆదివారం

"గ్రామం" సినిమా పై నా అభిప్రాయం !!!

 నేను చూసిన ప్రతి సినిమా గురించి నా అభిప్రాయం గురించి మీతో పంచుకుంటున్నాను ఈ రోజు నేను సినిమా గ్రామం చిన్న సినిమా కాకపోతే కొంచెం ఆసక్తి కలిగిస్తుంది కానీ మంచి విషయం ఉన్న సినిమా 

ఇక కథ విషయానికి వస్తే ఒక 6 గురు మెడికల్ విద్యార్థులు మూఢ నమ్మకాలు ముఖ్యంగా చేతబడి, లాంటివి ఏమి ఉండవని నిరూపించటానకి అస్సాం లోని మయుంగ్ అనే ప్రాతంలో ఎక్కువగా చేతబడి చేస్తుంటారు అని విని 6 గురు సభ్యులు ఒక సభ్యుడు అక్కడే ఉండమని మిగతా వారు ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలు, తను వేసుకున్న వస్త్రం చిన్న గుడ్డ ముక్క తీసుకుని ఆ ఊరు భయలుదేరతారు 

ఆ తరువాత వారు ఎటువంటి పరిస్థితిలో ఇరుక్కున్నారు అసలు చేత బడి అన్నది ఉందా లేదా అన్నది సినిమా చూడాలి

ఒకింత కొంచెం ఆసక్తిగా ఉంటుంది ఈ సినిమా పరవాలేదు ఒకసారి చూడవచ్చు !!!

ఈ సినిమా youtube లో ఉంది కావాల్సిన వారు చూడవచ్చు !!!

https://youtu.be/Q6dSJUOMOG4

మేటి మాట !!!


 

మేటి మాట !!!


 

30, జనవరి 2021, శనివారం

మమ్ముట్టి "నాన్న ప్రేమ" ఒక అద్భుతమైన సినిమా !!!

 మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన నాన్న ప్రేమ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా మాత్రం బాగుంది

ఇక కథ విషయానికి వస్తే చాలా కాలం దుబాయిలో పనిచేసిన మమ్ముట్టికి ఇండియా కు తిరిగి వస్తాడు అప్పటికే పుట్టుకతో  అంగవైకల్యం తో ఉన్న ఒక కూతురు ఉంటుంది ఆ కూతురుతో పడలేక వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో వారికి  ఎవరికి ఆ మమ్ముట్టి కూతురు అంటే  ఇష్టం ఉండదు చుట్టూ పక్కల వారందరు తరచు ఇల్లు ఖాళీ చేయమని గోడవపడతారు

చివరికి ఆ ఇంటి నుండి హీరో తన కూతురుతో బయటికి వచ్చేస్తాడు ఆ తరువాత ఎదురుకొన్న పరిస్థితులు, సంఘటనలు మనసు హత్తుకునేల చేస్తాయి

ఈ సినిమా మొదట అరగంట సేపు చూసేసరికి బోర్ కొట్టింది కానీ అలా చూస్తూ ఉండిపోయాను యాక్షన్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు కానీ ఫీల్ గుడ్ మూవీ 

ఈ సినిమా అందరికి నచ్చదు కానీ నాకు మాత్రం నచ్చింది ఆ అమ్మాయి నటన కూడా చాలా బాగా చేసింది సినిమా మాత్రం చాలా బాగుంది !!!

నేడు అమర వీరుల సంస్మరణ దినోత్సవం, జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు !!!

 అఖండ భారత వనికి బ్రిటిష్ వారి బానిస సంకెళ్లు నుండి విముక్తి కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో అమర వీరులకు మా నివాళులు

అలాగే ఈ రోజు సత్య, అహింస మార్గాలతో స్వరాజ్యం స్వేచ్ఛను ప్రసాదించిన మన భారత దేశ జాతి పిత మహాత్మ గాంధీకి ఇవే నివాళులు 

ఎందరో మహానుభావులు అందరికి నా పదాభివందనాలు !!!

29, జనవరి 2021, శుక్రవారం

ఆచార్య టీజర్ బాగుంది కానీ ?

 మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా టీజర్ విడుదల అయ్యింది కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం 

చూడటానికి కనులకు పండగగా ఉంది  మెగాస్టార్ అంటే డాన్స్, ఫైట్ టీజర్ లో అవి ఏమి చూపించేంత టైం ఉండదు కాబట్టి ఫైట్స్ బాగున్నట్టున్నాయి 

సహజ సిద్ద మాటల రచయిత కాబట్టి కొరటాల శివ నుండి మంచి మాటలు ఆశించవచ్చు

ఇప్పుడు చెప్పేది అభిమానులకు ఇబ్బంది పెట్టవచ్చు నేను ఒక అభిమానిగా చెబుతున్నాను

టీజర్ లో మెగాస్టార్ ఫేస్ zoom చేసినప్పుడు ముఖం కొద్దిగా ముసలి ముఖంగా ముడుతలు కనిపించాయి అది కొంచెం చూడటానికి బాగోలేదు నాకు మాత్రం అనిపించింది 


 ఇది ఎవరిని అవమానించాలి అని కాదు నా మనసుకు అనిపించింది 

ఈ మాట ఎవరినైనా నొప్పిస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను !!!

ఎందుకంటే నేను అన్నయ్య అభిమానిని !!!


2 వారాలకే "OTT" లో విజయ్ "మాస్టర్ "సినిమా !!!

 సంక్రాంతి మన తెలుగు వాళ్ళ పెద్ద పండగ ప్రతి సంక్రాంతి ఎన్నో సంప్రదాయాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళ సందడి, అలాగే అందరూ వినోదం పొందే అంశం ఏదైనా ఉందంటే అది సినిమా 

ఇక ఈ సోది అంతా ఎందుకు అసలు విషయానికి వస్తే ఈ సంక్రాంతి కి విడుదల అయిన సినిమాలలో విజయ్ మాస్టర్ ఒకటి సినిమా మాత్రం చూడవచ్చు ఇదంతా రివ్యూ లో చెప్పాను ఇక విషయానికి వస్తే

విడుదల అయ్యి 2 వారాలు అవుతుంది అప్పుడే OTT లోకి విడుదల చేసారు ఇది ఒకందుకు మంచిదే కానీ కొత్త సినిమాలకు థియేటర్ లో దొరికే అవకాశం ఉంటుంది !!!

28, జనవరి 2021, గురువారం

మేటి మాట !!!



 

అనుపమ పరమేశ్వరన్ నటించిన " freedom@Midnight " షార్ట్ ఫిల్మ్ పై నా అభిప్రాయం !!!

 ఈ షార్ట్ ఫిల్మ్ ఉండేది 30 నిమిషాలు లోపే offcourse అన్ని షార్ట్ ఫిల్మ్ లు అంతే టైం ఉంటాయి కానీ ఆ ముప్పై నిమిషాలలో ఒక భార్యగా,గృహిణిగా చాలా బాగా నటించారు అనుపమ

ఇక కథ విషయానికి వస్తే ఒక భార్య తన భర్త చేసే తప్పులు గురించి తనకు తెలియచేయలనుకుని తనలో తాను మదను పడుతుంది 

ఇంతకీ తన భర్తకు తెలిపిందా లేదా అనేది చూడాలి పెద్ద టైం కాదు కాబట్టి ఒకసారి చూడవచ్చు ఈ షార్ట్ ఫిల్మ్ లో రెండు పాత్రలు మాత్రమే మనకు కనబడతాయి 

కానీ ఒక్కసారి మాత్రం చూడవచ్చు !!!



మేటి మాట !!!


 

27, జనవరి 2021, బుధవారం

అల్లరి నరేష్ నటించిన "బంగారు బుల్లోడు " సినిమా పై నా అభిప్రాయం !!!

 అల్లరి నరేష్ ఈ పేరు వింటే కామెడీకి మరో పేరు ఎన్నో కామెడీ చిత్రాలను చూసాం ఇక ఈ వారం విడుదల అయిన బంగారు బుల్లోడు సినిమా గురించి తెలుసుకుందాం !!!

అల్లరి నరేష్ బ్యాంక్ లో గోల్డ్ సెక్షన్లో పనిచేస్తుంటాడు వాళ్ళ తాత తనికెళ్ళ భరణి కి ముగ్గురు మనవళ్ళు అందులో ఇద్దరు బేవర్సు అందులో మూడోవాడే మన హీరో నరేష్ వాళ్ళ తాత బంగారం పని చేస్తారు 

ఊళ్ళో ఉన్న గ్రామ దేవత కు నగలు చేసే పని వల్ల తాతకు చెబుతారు ఆయన కూడా నగలు తయారు చేస్తారు కానీ అనూహ్యంగా నరేష్ వాళ్ళ అమ్మ నాన్నలకు ప్రమాదం జరుగుతుంది అప్పుడు నరేష్ కడుపులో ఉంటాడు వాళ్ళ నాన్న చనిపోతాడు వాళ్ళ అమ్మను బతికించుకోవటానికి వాళ్ళ తాత దగ్గర డబ్బులు ఉండవు అందుకే అమ్మ వారి నగలు అమ్మి ఎలాగైనా బతికించాలి అని చూస్తాడు కానీ నరేష్ బతుకుతాడు వల్ల అమ్మ చనిపోతుంది

ఊరిలో జనం అమ్మ వారి నగలు అడుగుతారు అయితే గిల్టు నగలు తయారు చేసి ఇస్తారు అమ్మ వారికి

ఈ విషయం నరేష్ కి వల్ల తాత చెబుతాడు ఆ తరువాత నరేష్ అసలు నగలు ఎలా తయారు చేసాడు అన్నది మిగతా కధాంశం దానిని స్క్రీన్ పై చూడాలి

అల్లరి నరేష్ కామెడి అంతగా అనిపించదు కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం చూడొచ్చు హీరోయిన్ పర్వాలేదు 

మిగతా నటులు కూడా పర్వాలేదు సినిమా చూడొచ్చు కానీ కామెడీ బాగా ఎక్సపెక్ట్ చేసి మాత్రం వెళ్లొద్దు సాదా సీదా గా ఉంది కామెడీ !!!

25, జనవరి 2021, సోమవారం

మేటి మాట !!!


 

విజయ్ నటించిన "మాస్టర్" సినిమా పై నా అభిప్రాయం !!!

విజయ్ , విజయ సేతుపతి నటించిన మాస్టర్ సినిమా ఈ సంక్రాంతి కి విడుదల అయ్యింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సినిమా నేను ఈ మధ్యనే చూసాను అందుకే ఈ సినిమా గురించి మీతో పంచుకుందామని 
ఇక సినిమా విషయానికి వస్తే ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తాడు విజయ్ స్టుడెంట్స్ కి విజయ్ అంటే చాలా ఇష్టం కాలేజి అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అలాగే ఒకసారి కాలేజ్ లో గొడవ జరుగుతుంది మిగతా లెక్చరర్లు కి విజయ్ అంటే పెద్ద ఇష్టం ఉండదు విజయ్ ఈ సినిమాలో కొంచెం మాస్ గా కనిపిస్తాడు ఇదే అదునుగా చూసుకుని విజయ్ ని కాలేజ్ నుండి 3 నెలలు సస్పెండ్ చేస్తారు
ఆ కాలేజ్ హెడ్ విజయ్ ని 3 నెలలు పాటు జైలు లో ఉండే స్కూల్ లో పాఠాలు చెప్పటానికి విజయ్ ని అక్కడ పంపిస్తాడు
అక్కడ విజయ్ కి ఎటువంటి సంఘటనలు జరిగేవి అన్నది సినిమా 
ఈ సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సేపు చూడటానికి సినిమా అంతా ఇంట్రెస్ట్ట్ ఉండదు 
ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది
విలన్ గా విజయ్ సేతుపతి నటన కూడా బాగుంటుంది భారీ ఉహగనాలతో సినిమా చూడొద్దు పర్వాలేదు ఒకసారి చూడవచ్చు !!!

24, జనవరి 2021, ఆదివారం

"Super over" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ రోజుల్లో మనిషికి ఏదైనా కొద్దిపాటి వినోదం ఉందంటే అది ఖచ్చితంగా సినిమా వారం రోజులు కష్టపడి ఒకరోజు సినిమా చూసి ఆ కష్టాన్ని అంతా దూరం చేస్తుంది 

ఆ ఈ సొల్లు అంత ఎందుకులేండి అసలు విషయానికి వస్తే సూపర్ ఓవర్ సినిమా గురించి చెప్పుకుందాం

ఈ సినిమాలో హీరో బాగా అప్పుల్లో కురుకుపోతాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని హైద్రాబాద్ స్నేహితులు దగ్గరికి వెళ్తాడు ఆ అప్పు తీర్చడానికి కొద్దీ టైం మాత్రమే ఉంటుంది అమెరికా వెళ్ళటానికి వీసా ప్రయత్నాలు చేస్తాడు కానీ అవి ఫలించవు

చివరికి తెలుసుకున్న హీరో క్రికెట్ బెట్టింగ్ అడుతాడు అనూహ్యంగా కోటి డబ్భై లక్షలు గెలుస్తాడు ఆ తరువాత ఆ కధ ఏంటో మీకు సినిమా చూడాలి 

సినిమా మాత్రం ఒకసారి చూడవచ్చు మంచి థ్రిల్లింగ్ ఉంటుంది !!!

మేటి మాట !!!


 

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...