29, ఏప్రిల్ 2021, గురువారం

ఈ కరోనా క్లిష్ట సమయంలో పెట్రోల్ రేట్ గమనించారా ?

 మొన్న బండిలో పెట్రోల్ కొట్టిద్దామని 100 రూపాయలు కొత్తమన్నాను సాధారణంగా 110 కొట్టిస్తాను కానీ డబ్బులు కొంచెం టైట్ లో ఉండి సరే 100 కొట్టామన్నాను

100 కొట్టాడు చూస్తే కరెక్టుగా 100కి 1 లీ మాత్రమే వచ్చింది సరే అని ఈ రోజు అలాగే 100 కొట్టించాను 1.04 చూపించింది అంటే 1లీ 100 దాటేసినట్టే కదా

ఒకపక్క దేశం అంతా కరోనా కష్టంతో ఉంటే గుట్టు చప్పుడు కాకుండా పెంచిన పెట్రోల్ రేట్లు ఇంకా ఏమి కొనక్కరలేదు, ఏమి తినక్కరలేదు అన్నట్టు ఉంది పరిస్థితి !!!

28, ఏప్రిల్ 2021, బుధవారం

" తగ్గేది లే" అంటున్న కరోనా !!!

 ఎటు చూసినా, ఏమి విన్న, ఏమి మాట్లాడుదమన్నా కరోనా మాటలే, చేతలే ఏ మహమ్మారి రా బాబు న్యూస్ చూస్తుంటే వణుకు పుడుతుంది ఉద్యోగానికి వెళ్లాలంటేనే భయమేస్తోంది

తగ్గి పోయింది అనుకునేలేపు తగ్గేదిలే అన్నట్టు పెరుగుతున్నాయి కరోనా కేసులు నాకు తెలిసి ప్రతి ఒక్కరినీ టచ్ చేసి వెళ్లేలా ఉంది కరోనా

మానసికంగా దృఢంగా ఉన్నవాళ్లు బతికి బట్ట కట్టవచ్చు నిన్న మొన్న మనం చూసిన వారు ఈ రోజు కరోనా కాటుకు బలయిపోతున్నారు

ఏంటి ర బాబు ఇది నరకం అంటే ఎక్కడో లేదు ఇప్పుడు మనం అనుభవిస్తుందే అసలైన నరకం !!!

27, ఏప్రిల్ 2021, మంగళవారం

లయన్ కింగ్ సినిమా ఓ తెలుగు సినిమాకు స్ఫూర్తి ?

 అవును మొన్న ఆదివారం లయన్ కింగ్ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఆ సినిమా ఎంటో మీకు అర్థం అయ్యిందా?

తెలిసే ఉంటాది లెండి అదే మన బాహుబలి నిజంగా ఈ సినిమా బాహుబలి సినిమా లాగే ఉంది కొద్దీ కొద్దిగా మార్పులు చేసి తెలుగులో బాహుబలి తీసినట్టున్నారు అవును మీరే ఆలోచించండి 

ఆ కథ ఈ కథ ఓకేలాగా ఉంటుంది అణా పాలించే రాజ్యం పై తమ్ముడి కన్ను ఇదే కథ ఇంచుమించు అదే కథ బాహుబలి !!!😊😊😊

23, ఏప్రిల్ 2021, శుక్రవారం

" జాగో " సినిమా పై నా అభిప్రాయం !!!

 జాగో ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా శివ కార్తికేయన్, నయనతార జంటగా నటించిన సినిమా ఈ సినిమా ఇప్పుడు అందరూ. చూడాలి సినిమా అయితే బాగుంది

అసలు కథ ఏంటి అంటే ఉద్యోగ ప్రయత్నంలో హీరో కి ఒక ఉద్యోగం దొరుకుతుంది అయితే ఆ ఉద్యోగం వల్ల సామాన్య ప్రజలు, వినియోగదారులు కొన్న వస్తువులు ఈ విధంగా విష పదార్థాలు కలుస్తున్నాయి అన్నది హీరో తెలుసుకుంటాడు

అయితే ఆ కంపెనీ చేసే మోసల్ని ఎలా బయట పెట్టాడు, వారిని ఎలా ఎదురించాడు అన్నది సినిమా సినిమా అయితే చాలా బాగుంది 

అందరూ చూడవలసిన సినిమా ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటాయి సినిమా బాగుంది ఒక సామాన్య మనిషి జీవితంలో ఎదుర్కోనే సంఘటనలు బాగా చూపించారు

కార్పొరేట్ కంపెనీ లు చేసే మోసాలు, మార్కెటింగ్ తెలివితేటలు ఈ సినిమాలో బాగా చూపించారు సినిమా అన్ని వర్గాలు వారు చూసేలా ఉంది తప్పక చూడండి !!!

21, ఏప్రిల్ 2021, బుధవారం

RGV దెయ్యం సినిమా పై నా అభిప్రాయం !!!

 రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటేనే కాంట్రవర్సీ లకు అడ్రస్ అలాంటి rgv నుండి ఒక దెయ్యం సినిమా విడుదల అయ్యింది ఆ సినిమా నిన్న చూసాను ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

ఒక సాధారణ కుటుంబం లో ఉండే ఒక అమ్మాయికి దెయ్యం పడితే ఎలా ఉంటుందో అన్నది కథ ఇందులో రాజ శేఖర్ ఆ దెయ్యం పట్టిన అమ్మాయికి తండ్రిగా నటిస్తాడు

అసలు దెయ్యం ఆ అమ్మాయిని ఎందుకు పట్టింది ? ఆ దెయ్యం ఎవరు అన్నది మిగతా కథ ఈ సినిమా చాలా కాలం క్రితం మొదలు. పెట్టారు rgv ఇందులో ఆహుతి ప్రసాద్, దేవదాస్ కనకాల కూడా నటించారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు

ఈ సినిమాకు మొదటగా పట్టపగలు అనే టైటిల్ పెట్టారు కానీ ఆ తరువాత దెయ్యం అనే పేరు పెట్టారు సినిమా అయితే రొటీన్ గానే ఉంది

ఒక మాదిరి దెయ్యం సినిమా లాగే ఉంది కొత్తదనం అయితే ఏమి లేదు అంతా షరా మాములే చెప్పు కోవడానికి ఒక్క సన్నివేశం కూడా ఆసక్తిగా లేదు !!!

అసలు ఆ దెయ్యం ఆ అమ్మాయి నుండి బయటకు వచ్చిందా లేదా అన్నది కథ ఇది ప్రతి సినిమా లో ఉండే కథే కొత్తేమి కాదు బాగా low బడ్జెట్ లో సినిమా తీశారు అనుకుంటా సినిమా 

సినిమా అయితే రొటీన్ కథే !!!

17, ఏప్రిల్ 2021, శనివారం

The power అనే ఇంగ్లీష్ సినిమా పై నా అభిప్రాయం !!!

 The power ఇంగ్లీష్ సినిమా నేను యూట్యూబ్ లో చూసాను ఈ సినిమా కథ ఏమిటి అంటే ఒక అమ్మాయి ఒక హాస్పిటల్ లో నర్స్ జాయిన్ అవుతుంది ఆ హాస్పిటల్ లో ఒక ఆత్మ ఆ అమ్మాయిని పట్టుకుని పీడిస్తుంది 

ఆ ఆత్మ ఆ హాస్పిటల్ లో ఏమి చేస్తుంది ఆ నర్స్ ని ఎందుకు ఆవహించింది అన్నది సినిమా కథ చూడటానికి బాగానే ఉంది

కానీ అంతా హార్రర్ లేదు కానీ బాగుంది సినిమా ఒకసారి చూడొచ్చు బాగుంది సినిమా !!!

తణుకు లో జరిగిన అంబెడ్కర్ జయంతి వేడుకలు (వీడియో మీ కోసం )

 ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలెబ్రేషన్స్ జరిగినాయి ఆ వీడియో కింద ఉంది చూడండి !!!


14, ఏప్రిల్ 2021, బుధవారం

" వైల్డ్ డాగ్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 నాగార్జున నటించిన ఇటీవల విడుదల అయిన సినిమా వైల్డ్ డాగ్ సినిమా ఎలాగా ఉందొ ఒకసారి చూద్దాం !!!

NIA లో పనిచేసే ఒక ఆఫీసర్ నాగార్జున హైద్రాబాద్ లో కొన్ని చోట్ల బాంబులు పేలి చాలా మంది అమాయకులు చని పోతారు

ఆ కేస్ ను నాగార్జున ఛేదించి నిందితుల్ని ఎలా పట్టుకున్నారు అన్నది సినిమా కథ కథలో కొత్తదనం ఏమి లేదు గాని సినిమా మాత్రం చూస్తున్నంత సేపు కొద్దిగా ఆశక్తిగానే ఉంది 

మన ఇండియాలో పట్టుకోవాల్సిన నిందితుల్ని తప్పించుకుని పారిపోయి నేపాల్ వెళ్లి పోతాడు అక్కడి నుండి వాడిని ఇండియా కి ఎలాగా తీసుకు వచ్చాడు అన్నది కథ

సినిమా పరవాలేదు ఒక్కసారి చూడ వచ్చు సినిమా నేను థియేటర్ లో చూసాను ఎందుకు చెబుతున్నాను అంటే కామెంట్ లో కొంతమంది అడుగుతున్నారు ఈ ott లో సినిమా చూశారని అందుకే చెబుతున్నాను !!!

12, ఏప్రిల్ 2021, సోమవారం

రవితేజ ఖిలాడి టీజర్ చూసారా ?

 మాస్ మహరాజ్ రవితేజ నటించిన క్రాక్ సూపర్ హిట్ తరువాత వస్తున్న ఖిలాడి సినిమా టీజర్ విడుదల అయ్యింది అది ఇప్పుడు చూద్దాం

ఈ సినిమా లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు

రాక్షసుడు సినిమా ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు 


టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు ఎండింగ్ లో మాత్రం రవితేజ ఒక్క డైలాగ్ చెబుతాడు !!!

మేటి మాట !!!

 


10, ఏప్రిల్ 2021, శనివారం

" వకీల్ సాబ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 వకీల్ సాబ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఆజ్ఞతవాసి సినిమా తరువాత దాదాపు 3 సంవత్సరాలు తరువాత విడుదల అయిన సినిమా వకీల్ సాబ్ 

ఈ సోది అంతా ఎందుకులే గాని అసలు విషయానికి వస్తే 3 అమ్మాయిలు తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటనలో జీవించారు

ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ నటించారు సినిమా అయితే చాలా బాగుంది

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కుటున్నా సమస్యలు గురించి ఈ సినిమా ఒక ఉదాహరణ

నిజంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో నటించలేదు జీవించడాని చెప్పాలి

తమన్ మ్యూజిక్ బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది

దర్శకుడు వేణు శ్రీరామ్ బాగా తీసాడు ప్రతి ఫ్రేమ్ బాగుంది

సినిమా చాలా బాగుంది !!!

6, ఏప్రిల్ 2021, మంగళవారం

"సైకో సూదిగాడు "

 సైకో సూదిగాడు ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ అవును ఎప్పుడంటే 2014, 2015 సంవత్సరం అనుకుంటా ఈ పేరు వింటే తస్సదియ్య అందరూ భయపడేవారు

అసలు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో ఏమిటో అసలు ఉలుకు, పలుకు లేదు అప్పట్లో ఏ ఛానల్ చూసిన, ఏ పేపర్ చదివిన ఈ పేరే వినిపించేది, కనిపించేది

ఆటో లో ప్రయాణించాలంటే భయం, ఒంటరిగా ప్రయాణించాలంటే భయం ఆడవాళ్లకు మాత్రమే ఈ సైకో సూదిగాడు ఇంజక్షన్ చేసేవాడు అనేవారు

అప్పట్లో ఆ హడావిడి అంతా ఇంతా కాదు అప్పట్లో సైకో సూదిగాడు ఊహ చిత్రాలు చాలానే వచ్చాయి

కొంతమంది వాడిని పట్టుకున్నారని, కొంతమంది ఇంకా దొరకలేదని చాలా వార్తలు వినిపించాయి

నాకు తెలిసి ఈ విషయం అందరూ మరచి పోయుంటారు నాకెందుకో ఒకసారి గుర్తుకు వచ్చి తలుచుకున్నాను అంతే మరేం కాదండోయ్ ఆయ్ !!!

5, ఏప్రిల్ 2021, సోమవారం

"సుల్తాన్" సినిమా పై నా అభిప్రాయం !!!

 కార్తీ నటించిన సుల్తాన్ సినిమా నిన్న చూసాను అయితే ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి ఆయన కింద కొంతమంది రౌడీలు చిన్న, చిన్న గొడవలు ఆ పెద్ద మనిషికి ఒక కొడుకు పుడతాడు పుట్ట గానే హీరో వాళ్ళ అమ్మ చనిపోతుంది అప్పటి నుండి హీరో ని ఆ రౌడీలే పెంచుతారు 

ఒక ఊరిలో వ్యవసాయం చేయకుండా రైతులకు అడ్డుపడుతుంటాడు విలన్ ఆ విషయం ఈ పెద్ద మనిషికి చెబుతారు రైతులు అప్పుడు ఈయన రైతులకు మాట ఇస్తాడు విలన్ ని ఎలాగైనా చంపేస్తానని

హీరో పెరిగి పెద్దవాడుఅవుతాడు ఆ పెద్ద మనిషి అకస్మాత్తుగా చనిపోతాడు అయితే అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఊరికి వస్తాడు రౌడి లను అందరూ ని encounter లో చంపేస్తాడు హీరో ఆ పోలీస్ officer దగ్గరికి వెళ్లి మా రౌడీలను ఏమి చేయొద్దని ఆ ఆఫీసర్ కి చెబుతాడు దానికి రౌడి ఒక్క పెట్టీ కేస్ లో ఉన్న encounter చేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఆఫీసర్

అయితే హీరో వాళ్ళని గొడవలకు వెళ్లకుండా ఎలాగ వారించాడు ఆ రైతుల సమస్యలను ఎలా పరిష్కరించాడు అన్నది కథ

సినిమా బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు !!!


3, ఏప్రిల్ 2021, శనివారం

ఆహా OTT లో విడుదల అయిన " Y " సినిమా పై నా అభిప్రాయం !!!

 Y సినిమా ఏప్రియల్ 2 తేదీన ఆహా లో విడుదల అయ్యింది శ్రీరామ్, రాహుల్ రమేష్ నటించిన చిత్రం ఇక కథ విషయానికి వెళ్లే ముందు మరొక్కసారి చెబుతున్నాను 

ఈ సినిమా అహలో విడుదల అయ్యింది 

ఇక కథలోకి వెళ్తే శ్రీరామ్ ఒక పెద్ద సినిమా దర్శకుడు అయితే  ఒక సినిమా తీస్తాడు ఆ సినిమా ప్లాప్ అవుతుంది అతడు పెద్దకోపిష్టి అతని భార్య మరొక సినిమా తీయాలని ఆ సినిమా కి రైటర్ వేరే కొత్తవాళ్ళు ఉండాలని అంటుంది 

దానికి శ్రీరామ్ మొదట వద్దు అంటాడు ఆ తురువాత సరే అంటాడు ఆ రైటర్ ఎవరంటే రాహుల్ రామ కృష్ణ  తనని ఇంటికి పిలిపించి కథ వింటారు ఇద్దరు కథ నచ్చు తుంది

నైట్ డిన్నర్ కి రమ్మని స్కిప్ట్ సిద్ధం చేసుకుని అని చెబుతారు అయితే రాత్రి వాళ్ళింటికి వెళతారు రాహుల్ రామకృష్ణ 

ఈ సినిమా కథ కి సంబంధించి తన పేరుని సినిమాలో వేయాలని కోరతాడు రాహుల్ కానీ దానికి శ్రీరామ్ ఒప్పుకొడు వారిద్దరూ మధ్య గొడవ జరుగుతుంది ఆవేశంలో శ్రీరామ్ బీర్ bottle తో రాహుల్ తల పగల కొడతాడు 

ఆ తరువాత సినిమా కథ ఏంటి అన్నది సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది చిన్న సినిమా అయినప్పటికీ సినిమా పరవాలేదు ఒకసారి చూడ వచ్చు 

గంటన్నర సినిమా సినిమా బాగుంది !!!

The Goat life Movie Review !!!

 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ...