24, జూన్ 2018, ఆదివారం

సెల్ ఫోన్ కింద పడి on అవ్వకపోతే ?



ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది మానవ శరీర భాగాలలో ఒక భాగం అయింది అనే దానిలో ఎలాంటి అనుమానం లేదు మనం ఏ పనికైనా మొదట ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందంటే అది ఒక్క సెల్ ఫోన్ మాత్రమే లెక్కలు నుండి చెల్లింపులు దాకా అన్ని కార్య కలపాలు సెల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి

సెల్ ఫోన్ లేనిదే ఈ ప్రపంచం ఆగి పోతుంది అన్నట్టుంది ప్రపంచం నేడు అయితే విషయమేమిటంటే పొరపాటునో గ్రహాపాటునో ఒక్కోసారి మొబైల్ చేజారి కిందికి పడిపోతుంది వెంటనే టచ్ మిగిలిపోతుంది ఒక్కోసారి మొబైల్ పడిన వెంటనే ఫోన్ on అవుతుంది ఒక్కోసారి ఫోన్ on అవ్వదు

ఫోన్ on అవ్వకపోతే మొదటగా మనం చేయాల్సింది :::

(1) కింద పడిన వెంటనే మొబైల్ fix చేసి ఛార్జింగ్ పెట్టాలి 15 నిమిషాలు
(2)  అప్పటికి on అవ్వకపోతే బ్యాటరీ రెండు చేతులతో rough చేయాలి ఇలా rough చేయటం వల్ల బ్యాటరీ లోకి ఉష్ణ శక్తి ఏర్పడి ఫోన్ on అయ్యే అవకాశం ఉంటుంది
(3) అప్పటికి ఫోన్ on అవ్వకపోతే బ్యాటరీ నాలుక చివరన పెట్టుకుంటే కొద్దిగా shock తగిలినట్టు ఉంటే బ్యాటరీ పరిస్థితి బాగానే ఉన్నట్టు
(4) అలా ఉండక పోతే బాటరీ discharge అయినట్టు
(5) ఒక వేళ బాటరీ discharge అయితే ఏదైనా మొబైల్ షాప్ లో బ్యాటరీ boosting  పెడితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది !!!

23, జూన్ 2018, శనివారం

మొబైల్ ఫోన్ బంధాలను విడదీస్తుందా ?


మొబైల్ ఫోన్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ చిన్న పరికరంలో దాగి ఉంది అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే మానవ మనుగడలో మొబైల్ ఫోన్ అంత ప్రముఖ పాత్రను నిర్వహిస్తుంది అయితే మొబైల్ ఫోన్ రావటం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంత దుష్ప్రభావం కూడా దాగి ఉంది

ప్రస్తుత పరిస్థితిలో purse లేకున్నా బయటకు వెళ్ళవచ్చు గాని మొబైల్ లేకుండా బయటకు వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది ఈ డిజిటల్ యుగంలో అంతా online లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి బయటకు ఎక్కడకు వెళ్లిన ఫోన్ ద్వారా చెల్లింపులు జరపటం జరుగుతుంది

ప్రజలు కూడా మనీ carry చేయటానికటే మొబైల్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు online లావాదేవీలు వచ్చినప్పటి నుండి పని ఎంత సులువుగా అవుతుందో అంతే ఎక్కువుగా మోసాలు జరుగుతున్నాయి
అయితే ఈ మధ్య కాలంలో online మోసాలు కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తున్నాయి  మొబైల్ ఫోన్ వ్యాపార పరంగా కాకుండా మానవ సంబంధాలు కూడా దెబ్బ తింటున్నాయి ఇదివరలో landline వాడే కాలంలో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది తెలిసిపోయేది కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత అబద్దాలు ఎక్కువ అవుతున్నాయి
అంతే కాకుండా సామాజిక మాధ్యమాలు ద్వారా కూడా అసత్య ప్రచారాలు, వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా తయారయ్యాయి మొబైల్ ఫోన్ ద్వారా మనుషులు దూరంగా ఉన్నవారిని దగ్గర చేయటం అటుంచి అసలు మానవ సంబంధాలు దెబ్బ తీస్తున్నాయి 

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా ఫోన్ పెద్దవాళ్ళు ఫోన్ అలవాటు చేస్తున్నారు దీనివల్ల వారి శారీరక అభివృద్ధి పై సన్నగిల్లుతుంది !!!
మనిషి మీద మనిషికి నమ్మకం తగ్గుతుంది ఈ ఫోన్ వల్లే అనటం లో ఎలాంటి సందేహం లేదు

22, జూన్ 2018, శుక్రవారం

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ( టిఫిన్) మానకూడదు ఎందుకంటే ?


మనం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి బ్రేక్ ఫాస్ట్ అనేది మనం రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత మనలో శక్తిని తిరిగి పొందడానికి బ్రేక్ ఫాస్ట్ చేయాలి అలా క్రమం తప్పకుండా తీసువటం మన ఆరోగ్యానికి చాలా మంచిది

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవటం వల్ల కలిగే దుష్పరిణామలు :::

(1) క్రమంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే మనకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(2) అంతే కాకుండా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(3)  ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటారు
(4) ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది
(5) వయసు రాకుండా వచ్చే అన్ని రోగాలకు మొదటి కారణం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్లే


బ్రేక్ ఫాస్ట్ అంటే ఏది పడితే అది తిన కూడదు నూనె పదార్దాలు తినకుండా ఉంటేనే మంచిది మన పెద్దలలో చాలామంది ఇప్పటికి ఏ అనారోగ్యం రాకుండా ఉంటారు దానికి కారణం వారు తినే తిండి వారు ఎక్కువుగా మంచి మంచి ఆహారపు అలవాట్లు పాటించారు కాబట్టి వారు ఆరోగ్యం గానే ఉంటారు

కాక పోతే తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది !!!

Ear phones తో జర భద్రం !!!



టెక్నాలజీ అన్నది ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే ఎక్కువగా ప్రమాదాలను కొని తెచుకుంటున్నట్టుంది పరిస్థితి మనం సాధారణంగా మొబైల్ వాడేటప్పుడు పాటలు వినటం కోసం ear phones వాడటం జరుగుతుంది
Ear phones వాడటం మంచిదే కానీ అతిగా వాడటం మంచిది కాదు ear phonesలో కొద్దీ సేపు మాత్రమే  పాటలు వినాలి అంతే కదా అని ఎక్కువ సార్లు అదే పనిగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతాయి
ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడేవారికి ear phones వాడటం ఎంతో మంచిది మొబైల్ నుండి వెలువడే రేడియేషన్ తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది


Ear phones లో పాటలు తక్కువ valume తో వినటం మంచిది ట్రాఫిలో ear phones అసలు వాడకూడదు
బైక్ మీద  ear phones లో వాడటం అంత మంచిది కాదు.
అంతే కాకుండా మొబైల్ తో పాటు వచ్చే ear phones కాకుండా వేరే ear phones వాడటం వల్ల మీకు అసౌకర్యంగా ఉంటుంది మొబైల్ లో కూడా సమస్యలు తల ఎత్తే అవకాశం ఎక్కువుగా ఉంటుంది ear phones తో ఎక్కవ సేపు పాటలు వినడం ద్వారా తల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది

Ear phones వాడండి కానీ అవసరం కొరకే వాడండి మొబైల్ కొన్న వెంటనే  ఆ బాక్స్ లో అన్ని accessaries  సరిగా ఉన్నాయో లేదో చూసుకుంటాం కానీ user mannual ఎవరు చదవరు ఆ manual చదివితే ఆ ఫోన్ ఎలా వాడాలో ఏ accassaries ఎలా వాడాలో తెలుస్తుంది !!!

పైన పేర్కొంబడిన విషయాలు మీకు తెలిస్తే పర్వాలేదు కానీ తెలియని వారు ఉంటే వారికి తెలియచేయటనికి !!!


Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...