29, జూన్ 2022, బుధవారం

కమల్ హాసన్ " విక్రమ్" ott విడుదల ఎప్పుడో తెలుసా మీకు !!!

 లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన విక్రమ్ సినిమా మంచి విజయం సాధించింది

కమల్ హాసన్ కి మంచి విజయాన్ని అందించింది లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా విక్రమ్ అయితే ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ott లో అందుబాటులో కి జులై 8 తేదీనుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!

28, జూన్ 2022, మంగళవారం

"Nenjuku Needhi" సినిమాపై నా అభిప్రాయం !!!

nenjuku needhi ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా ఉదయ నిధి స్టాలిన్ హీరో గా చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో police Asp అయితే తనని కులాలు గురించి గొడవలు పడుతూ ఉంటారు అలాటి ఊరిలోకి హీరో వెళ్తాడు అయితే అప్పుడే ఒక ముగ్గురు తక్కువ కులంలో పుట్టిన ముగ్గురు అమ్మయిలు కనబడకుండా పోతారు అయితే అందులో ఇద్దరిని ఉరి వేసి చెట్టుకు వెలాడు తీస్తారు అయితే ఆ మూడో అమ్మాయి ఏమైనది అసలు ఆ ఊరిలో ఉన్న ప్రజలే కాకుండా పోలీసుల్లో కూడా కులాలు గురించి హెచ్చు తగ్గులు చూపిస్తారు ఇలాంటి పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కువున్నాడు

అక్కడ ఉన్న పరిస్తుతుల్ని ఎలా సరిదిద్దాడు అన్నది మిగిలిన కథ పరవాలేదు బాగానే ఉంది average !!!

26, జూన్ 2022, ఆదివారం

చోర్ బజార్ సినిమా పై నా అభిప్రాయం !!!

 చోర్ బజార్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన సినిమా చోర్ బజార్ మొన్న శుక్రవారం థియేటర్ లలో విడుదల అయినది ఇక ఈ సినిమా కథ క్లుప్తంగా చూద్దాం !!!

 చోర్ బజార్ ఇది మనం ఎక్కడో విన్నట్టు ఉంది కదా ఇది సినిమాలో చోర్ బజార్ ఉంటుంది దానిని మన హీరో కంట్రోల్ లో ఉంటుంది అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది చిన్నప్పటి నుండి ప్రేమిస్తాడు తనకు మాటలు రావు ఇలా కథ జరుగుతుండగా ఒక మ్యూజియం లో ఒక 200 కోట్లు విలువ చేసే ఒక వజ్రం అపహరణకు గురవుతుంది  

అసలు ఆ వజ్రం ఎవరు కొట్టేశారు ఆ వజ్రానికి హీరో కి సంబంధం ఏమిటి చివరకు కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథలో కొత్తదనం ఏమి లేదు జస్ట్ బీలో average అంతే ఈ సినిమా !!!

25, జూన్ 2022, శనివారం

అంటే సుందరానికి Ott Release ఎప్పుడో తెలుసా ?

 Natural స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి విడుదలై 15 రోజులు అవుతుంది అయితే ఈ సినిమా జులై మొదటి వారంలో ott netflix లోఅందుబాటులో ఉంటుంది !!!

24, జూన్ 2022, శుక్రవారం

జీ5 ott లో విడుదల అయిన " రెక్కీ" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 

ఇది జీ5 ott లో అందుబాటులో ఉందిఇక ఈ వెబ్ సిరీస్ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

తాడి పత్రి లో మున్సిపల్ చైర్మన్ వరదరాజులు ఉంటాడుఅదే ఊరిలో si లెనిన్ ఉంటాడు అయితే ఈ వెబ్ సిరీస్ మొదటలో ఒక వ్యక్తికి ఆ వరద రాజులుని చంపడానికి మరొక వ్యక్తి సూపరి ఇస్తాడు అయితే ఒక మున్సిపల్ చైర్మన్ చంపడం అంత easy కాదు కదా అందుకే ఆ వ్యక్తి తో పాటు చంపడంలో మంచి నైపుణ్యం ఉన్న మరో నలుగుర్ని చూసుకుంటారు

మొత్తం ఈ నలుగురు వరద రాజులుని చంపడానికి రెక్కీ మొదలు పెడతారు ఒక  సందర్భం లో చంపడానికి స్కెచ్ వేస్తారు కానీ అది మిస్ అవుతుంది అప్పుడే అర్థం అవుతుంది 

వరద రాజులుని చంపమని చెప్పింది సూపరి ఇచ్చింది వరద రాజులు కొడుకు చలపతి అని అసలు తన కన్న కొడుకు వరద రాజులుని ఎందుకు చంపాలనుకున్నాడు అయితే చివరికి వరద రాజులుని చంపేస్తారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది చలపతి కూడా ఒక 6 నెలలు తరువాత చనిపోతాడు 

ఈ కేస్ ని si లేనిని సాల్వ్ చేస్తాడు పరవాలేదు బాగానే ఉంది చూడ వచ్చు 3 గంటలు పైనే ఉంది బోర్ కొట్టదులే బాగానే ఉంది వెబ్ సిరీస్ 👍!!!

20, జూన్ 2022, సోమవారం

" అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన సుజల్ వెబ్ సిరీస్ పి నా అభిప్రాయం !!!

ఇది తమిళ్ డబ్బింగ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 గంటలు పైనే ఉంది ఇక అసలు కథ ఏమిటో చూద్దాం !!!

ఒక ఊరిలో అమ్మవారి జాతర జరుగుతుంది అలాగే ఆ ఊరిలో ఒక ఫ్యాక్టరీ లో ఫైర్ accident జరిగి మొత్తం కాలిపోతుంది ఆ ఫ్యాక్టరీ లో పనిచేసే union  leader షణ్ముగం తమ తోటి కార్మికులు కోసం పోరాడుతుంటాడు అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో షణ్ముగం చిన్న కూతురు కనబడకుండా పోతుంది 

ఆ ఊరిలోని రెజినా అనే పోలీస్ ci పనిచేస్తుంటుంది తన కింద si చక్రవర్తి పనిచేస్తుంటాడు అతడే హీరో అసలు ఆ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం ఎవరు చేశారు, షణ్ముగం చిన్న కూతురు ఏమైంది, అసలు కథ ఏమిటి అన్నది చాలా ఆసక్తి గా బాగానే ఉంది మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్  ఒక వెబ్ సిరీస్ పై 6 గంటలు చడాలంటే ఎంత గ్రిప్పింగ్ గా ఉండాలి కథ అలాగే ఉంది బాగుంది మీరు కూడా చూడండి !!!

17, జూన్ 2022, శుక్రవారం

సత్య దేవ్ " గాడ్సే " సినిమా పై నా అభిప్రాయం !!!

 సత్య దేవ్ టాలీవుడ్ నటులలో ఒక విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తుంటాడు ఒక మంచి నటుడు ఇక సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమా ఇవాళ విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో మూడు ముక్కల్లో చెప్పుకుందాం !!!

మీకు నారా రోహిత్ ప్రతినిధి సినిమా చూసారా same కాకపోయినా కొద్దిగా అలాగే ఉంటుంది సినిమా కొంతమంది రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని kidnap చేస్తాడు హీరో ఈ కేస్ ను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువువంటి హీరోయిన్ కి అప్ప చెబుతారు అయితే తాను ఇంతకుముందు టేక్ up చేసిన కేస్ లో ఒక గర్భిణీ చనిపోతుంది అప్పటి నుండి ఉద్యోగం మానేస్తుంది  ఆ తరువాత మరలా ఇదే కేస్ టేక్ up చేస్తుంది అయితే హీరో ఎందుకు ఇలాగ ప్రముఖుల్ని kidnap చేసాడు అసలు అతని లక్ష్యం ఏమిటి అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ఎందుకు ఇలా తయారు అయ్యాడు 

ప్రస్తుతం మన సమాజంలో రాజకీయ నాయకులు నిరుద్యోగులుతో ఎలా అడ్డుకుంటున్నారు అన్నది సినిమా కథ పరవాలేదు బాగానే ఉంది  expectations తో వద్దు మాములుగా చూడండి సినిమా !!!

"Innale vare" సినిమా పై నా అభిప్రాయం !!!

Innale vare మలయాళ డబ్బింగ్ సినిమా సోనీ లివ్ ott లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పడు చూద్దాం !!!
ఒక హీరో ఉంటాడు బయట అప్పుడప్పుడే సినిమాలో ఎదుగుతున్న హీరో కానీ అతడు చేసిన కొన్ని సినిమాలు సరిగ్గా ఆడక అప్పులు బాధలు ఎక్కువ అవుతాయి కాకపోతే అవి బయట ఎవరికి తెలియవు ఇలా హీరో తన వ్యక్తిగత విషయాలు జరుగుతాయి కానీ అప్పుడే హీరోని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా తెలివిగా kidnap చేస్తారు తనను విడుదల చేయాలంటే తమకు ఒక కోటిన్నర ఇవ్వాలని హీరోకి చెబుతాడు 
తన దగ్గర డబ్బులు లేవన్న సరే వాళ్ళు వినరు 
చివరకు వాళ్ళ దగ్గర నుండి హీరో ఎలా బయట పడ్డాడు అసలు ఆ హీరోనే ఎందుకు kidnap చేశారు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ ఫస్ట్ లో స్లో గా ఉన్న తరువాత జరిగే కొద్దీ కథ మంచి ఆసక్తిగా ఉంటుంది మొత్తానికి పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

 

14, జూన్ 2022, మంగళవారం

" చార్లీ " సినిమా పై నా అభిప్రాయం !!!

 చార్లీ రక్షిత్ శెట్టి హీరోగా చేసిన సినిమా  ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఫ్యాక్టరీ లో పనిచేస్తుంటాడు తనకంటూ ఎవరు ఉండరు తన ఒక్కడే ఉంటాడు చిన్నప్పుడే తన కుటుంబం చిన్న ప్రమాదంలో అందరూ చనిపోతారు అలా రోజు గడిచే కొద్దీ ఒక కుక్క ఎక్కడి నుండో వస్తుంది హీరో తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని చెత్త బుట్టలో వేస్తాడు అది ఆ కుక్క తింటుంది 

ఒక సారి కుక్కకు చిన్న ప్రమాదం జరిగి కాలు విరుగుతుంది అప్పుడే హీరో దానిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు

అప్పటి నుండి ఆ కుక్క తనకు అలవాటు పడుతుంది మొదట్లో అయిష్టం గానే దానిని పెంచుతాడు క్రమ క్రమంగా వాళ్లిదరికి మంచి బంధం ఏర్పడుతుతుంది అంత బాగుంది అనే టైం లో ఆ కుక్కకు కాన్సర్ అని తెలుస్తుంది అది ఇంకా ఎన్నాళ్ళు బ్రతకదు అని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన మంచు ని చుపించటానికి హిమాలయాలకు తీస్కుళ్తాడు

అయితే చివరకు కథ ఏమి అయి ఉంటుంది అన్నది మిగిలిన కథ జంతు ప్రేమికులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది 

ఈ సినిమాలో ఎమోషనల్ చాలా బాగుంది మంచి ఫీల్ ఉన్న సినిమా తప్పకుండా చూడవలసిన సినిమా 👍👍👍

12, జూన్ 2022, ఆదివారం

" అంటే సుందరానికి " సినిమాపై నా అభిప్రాయం !!!

natural స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా తరువాత మొన్న విడుదల అయిన అంటే సుందరానికి సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ట్రైలర్ చూస్తే ఇది పూర్తిగా కామెడీ సినిమా ఇక కథలోకి వెళ్ళితే సుందరం (నాని) ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆచారాలు, సంప్రదాయాలు, పాటిస్తూ ఒక గానొక్క వంశోద్ధారకుడు అయితే ఇంటిలో ఎప్పుడు ఆచారాలు సంప్రదాయాలు అంటూ ఉంటారు అయితే అవన్నీ విసిగి చెందుతాడు అయితే నాని చిన్నప్పుడు ఒక సినిమా వేషం విషయంలో అమెరికా వెళ్లే అవకాశం వస్తుంది కానీ అది నిజం కాదని తెలుసుకుంటాడు 

ఎలాగైనా అమెరికా వెళ్లాలని అనుకుంటాడు కానీ వాళ్ళ ఇంటిలో సముద్రాలు దాటితే నష్టం జరుగుతుందని నాని వెళ్ల నివ్వరు ఇలా కథ జరుగుతుండగా 

హీరోయిన్ ఒక క్రిస్టియన్ అయితే వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరు అంటే ఒకరికి ఇష్టం అయితే వాళ్ళ కుటుంబాలు మతాలు వేరు దానికి వాళ్ళ ఇంటిలో వారు ఒప్పుకోరు అయితే చివరికి వారిద్దరూ వాళ్ళ ప్రేమను ఎలా గెల్పించు కున్నారు నాని చివరికి అమెరికా వెళ్లాడా లేదా అన్నది అసలు సినిమా కథ 

నాని సినిమా అంటే ఫ్యామిలీ సినిమా minimum గ్యారంటీ పర్వాలేదు బాగానే ఉంది సినిమా లవ్ స్టొరీ అండ్ కామెడీ బాగానే ఉంది మీరు ఒక లుక్ వేయండి కాకపోతే సినిమా నిడివి బాగా ఎక్కువుగా ఉంది  !!!

11, జూన్ 2022, శనివారం

"జన గణ మన " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది మలయాళం డబ్బింగ్ సినిమా పృద్వి రాజ్  ప్రధాన పాత్రలో చేసిన సినిమా మమత మోహన్ దాస్, ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక university లో పని చేసే ఒక ప్రొఫెసర్ హత్య జరుగుతుంది అది రేపే అండ్ మర్డర్ శవాన్ని కలుస్తారు అది ఎవరో కాదు మమతా మోహన్ దాస్ అయితే అప్పటి నుండి అది పెద్ద వార్త లాగా మొత్తం దేశం మొత్తం దాని గురించే చర్చ జరుగుతుంది ుునివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం ధర్నా చేస్తుంటారు అయితే అప్పుడే ఒక పొలిస్ ఆఫీసర్ ఆ కేస్ ను టేక్ up చేసి నిందితుల్ని పట్టుకుంటారు అయితే వాళ్లని దారి మద్యాలొనే encounter చేస్తారు 

అందరూ సంతోషిస్తారు కానీ ఆ కేస్ కోర్ట్ లో వాదనలు జరుగుతాయి కానీ వాళ్ళు హంతకులు కాదు కాని ఆ పోలీస్ ఎందుకు encounter చేసినట్టు ఇందులో పృద్వి రాజ్ లాయర్ పాత్రలో చివరి భాగంలో కేస్ వాదిస్తాడు అయితే ఇందులనే అసలు హంతకులు ఎవరు అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!👍👍👍

7, జూన్ 2022, మంగళవారం

విక్రమ్ సినిమా పై నా అభిప్రాయం !!!

కమల్ హాసన్, ఫేహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో చేసిన విక్రమ్ సినిమా విడుదల అయింది ఇక ఈ  సినిమా ఎలా ఉందో కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం లోకేష్ కనకరాజ్ direction లో వచ్చిన చిత్రం ఇది

ఇందులో 4 ముసుగు దొంగలు కొంతమందిని కిడ్నప్ చేసి చంపుతుంటారు అయితే వారిని పట్టుకోవడానికి ఫాహాద్ ఫాసిల్ స్పెషల్ టీం లో ఉండి అసలు ఆ హంతకులు ఎవరు అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అయితే అలా చనిపోయిన వారిలో కమల్ హాసన్ కూడా ఉంటాడు ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంటుంది అయితే చివరికి ఆ నలుగురిలో ఒకరు దొరుకుతాడు కానీ అసలు విషయం ఏమిటంటే అందులో కమల్ హాసన్ ఉంటాడు అదేంటి చనిపోయాడు అనుకున్న మనిషి ఎలా బ్రతికాడు అసలు కథ ఏమిటి ఇందులో విజయ్ సేతుపతి విలన్ కారెక్టర్ లో చేస్తాడు

అయితే ఈ కథలో అసలు కమల్ హాసన్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది చాలా సస్పెన్సు తో కూడుకున్న సినిమా ఇందులో మళ్ళీ లోకేష్ కనకరాజ్ చేసిన ఖైదీ సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి నిజం గా డైరెక్టర్ తెలివికి మెచ్చుకోవాలి బాగానే ఉంది కాని ఒకసారి చూడ వచ్చు అన్నట్టు ఇందులో చివరలో సూర్య కూడా ఉన్నాడు !!!

3, జూన్ 2022, శుక్రవారం

మేజర్ సినిమా పై నా అభిప్రాయం!!!

 అడవి శేష్ హీరోగా చేసిన తాజా చిత్రం మేజర్ సినిమా ఇవాళ విడుదల అయింది తాను నటించిన ఎవరు, క్షణం, గూఢచారి సినిమాలు తరువాత అడవి శేష్ నుండి వస్తున్న మరొక సినిమా మేజర్ ఇక ఈ సినిమా నిజ జీవిత ఆధారంగా తీసిన సినిమా ఇక కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం !!!

ఈ సినిమా లో హీరో కి నేవీ లో పని చెయ్యాలని ఆసక్తి ఉంటుంది కానీ తన తల్లి తండ్రులకి ఇష్టం ఉండదు తన ప్రయత్నం తాను చేస్తుండగా ఇంతలో హీరొయిన్ పరిచయం అవుతుంది తన చొరవతోనే చివరికి ఆర్మీ లో చేరతాడు అయితే అక్కడ ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు 

అలాటి పరిస్థితుల్లో 26/11 ముంబయి ఉగ్రదాడి జరుగుతుంది ఉగ్రవాదులకు వ్యూహాలు ను హీరో ఎలా తిప్పి కొట్టాడు చివరకు ఏమి జరిగింది అన్నది సినిమా కథ 26/11 దాడి పై చాలా సినిమాలు వచ్చాయి కానీ అందులో ప్రాణాలు వదిలిన ఎంతో మంది వీర మరణం పొందిన వారు ఉన్నారు వారిలో ఒక వ్యక్తి తన ధైర్య సాహసాలు ఎలా ప్రదర్శించాడు అన్నది సినిమా కథ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!👍

కాకపోతే అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంది సినిమా !!!

2, జూన్ 2022, గురువారం

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...