Thursday, November 29, 2018

ఫోన్ నెంబర్ మారకుండానే వేరే నెట్వర్క్ లోకి (M.N.P) ఎలాగో తెలుసా ?

ఇప్పుడు ఏ నెట్వర్క్ చూసిన incoming కు out going కు ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి రీఛార్జి చేయించాలి అయితే మన నెంబర్ మారకుండానే వేరే నెట్వర్క్ లోకి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ M.N.P ఎలాగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !
 
మీ మొబైల్ లో message ఓపెన్ చేసి create message లోకి వెళ్లి PORT అని capital letters టైప్ చేసి space ఇచ్చి 1900 నెంబర్ కు message పంపించండి 
ఇలా ఈ నెంబర్ కు message పంపిస్తే  మీకు ఒక కోడ్ వస్తుంది ఇది మీరు మారాలనుకుంటున్న నెట్వర్క్ ఆపరేటర్ ఆఫీస్ కి వెళ్తే వారు M.N.P ప్రాసెస్ చేస్తారు

దీనికి కనీసం ఒక వారం లేదా 5 రోజులు టైం పడుతుంది !!!

Wednesday, November 28, 2018

కస్టమర్ కేర్ నుండి వచ్చే కాల్స్, messages బ్లాక్ చేయటం తెలుసా మీకు?


మనం రోజువారీ చేసే పనిలో బిజీగా ఉన్నప్పుడు మనకు కస్టమర్ కేర్ నుండి కాల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి అలాగే message లు అనవసరమైన message లు వచ్చి ఫోన్ message inbox అంతా నిండి పోయి ఉంటుంది
ఇలాంటప్పుడు మనకు చాలా అసహనం కలుగుతుంది ఇలా అనవసరమైన కాల్స్ , message లను బ్లాక్ చేయటానికి ఒక పరిష్కారం ఉంది అదేంటో చూద్దాం
 మీ మొబైల్ message లోకి వెళ్లి create message లో START అని కాపిటల్ లెటర్స్ లో type చేసి space ఇచ్చి 0 (జీరో) అని టైప్ చేసి 1909 అనే నెంబర్ కు mesaage పంపండి ఇది పూర్తిగా ఉచితం
అలా పంపిన తరువాత మీకు కంపెనీ నుండి తిరిగి message వస్తుంది
అనవసరమైన కాల్స్, messages బ్లాక్ అవటానికి మీకు 7 రోజులు టైం పడుతుంది ఇలా పంపిన వెంటనే మీకు కాల్స్ బ్లాక్ అవ్వవు కనీసం 10 రోజులు టైం పడుతుంది
  ఆ తరువాత మీకు కస్టమర్ కేర్ నుండి ,message, కాల్స్ పూర్తిగా block అవుతాయి !!!

Facebook లో షేర్, like చేయటం వల్ల ఎవరికి మేలు కలుగుతుంది !!!


ఈ రోజుల్లో facebook , whatsapp అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే మీడియా కంటే ముందుగా సోషల్ మీడియా లొనే ఈ విషయం అయిన ముందుగా తెలుస్తుంది అనటంలో సందేహం లేదు
 అయితే ఫేస్బుక్ విషయానికి వస్తే చాలామంది కాలక్షేపానికి open చేస్తుంటారు అదే పనిగా చేస్తే అదే అలవాటుగా మారుతుంది కూడా ఫేస్బుక్ open చేయగానే ఒక రైతు ఫోటోనో, లేదా దేవుడి ఫోటో, లేదా ముసలి వారి ఫోటో పెట్టి నచ్చితే షేర్ చేయండి లేదా like చేయండి మీ విలువైన సలహాను కామెంట్ లో రాయండి అనేది మనం ప్రతి ఫేస్బుక్ లో చూస్తుంటాం
ఇలా చేయటం వల్ల ఆ పోస్ట్ పైన ఒక ఫేస్బుక్ పేజీ ఉంటుంది మీరు like, share, comment చేయటం వల్ల మీ ఫ్రెండ్స్ అందరికి అది ఫార్వార్డ్ అవుతుంది తద్వారా facebook, పేజీకి followers. పెరుగుతారు !!!

Tuesday, November 27, 2018

ఇప్పటి సినిమాలు యువత చూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయా ?

ఒకప్పుడు సినిమాలు కుటంబ సమేతంగా చూసే విధంగా ఉండేవి కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించటం లేదు
ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు యువతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి
   ఇదివరకు సినిమా అంటే వినోదం పంచేది కుటుంబం మొత్తం పండగకు సినిమాకు వెళ్లేవారు కానీ రాను రాను పరిస్థితులు మారాయి థియేటర్ టికెట్ ఛార్జిలు పెరిగాయి అది కాకుండా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు కూడా అడపా, దడపా వస్తున్నాయి
   అందుకే దర్శకులు, నిర్మాతలు కూడా యువతకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్న సినిమాలు పైనే మక్కువ చూపిస్తున్నారు !!!

Sunday, November 25, 2018

ప్రయాణం (కథ)

ఉదయం 10 గంటలు అవుతుంది తన బైకుపై ఆఫీస్ కి వెళ్తున్నాడు నరేష్ ఇంతలో ఫోన్ మొగుతుంది కానీ ట్రాఫిక్ లో ఉండటం వల్ల ఫోన్ సౌండ్ వినిపించలేదు కాసేపటికి ఆఫీస్ కి చేరుకున్నాడు ఇంతలో మరొకసారి ఫోన్ వచ్చింది
ఫోన్ చేసింది నరేష్ వాళ్ళ నాన్న సుబ్బారావు ఆఫీస్ కి 3 రోజులు సెలవు తీసుకుని ఇంటికి రమ్మని చెప్పాడు నరేష్ ఎందుకు అని అడిగాడు
కుటుంబం అంతా తిరుపతికి వెళ్దాం అనుకున్నాను అది ఇప్పుడు కుదిరింది అని చెప్పాడు సరే మా manager దగ్గరికి వెళ్లి అడుగుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు
Manager దగ్గరకి వెళ్ళి సెలవు కోసం చెప్పాడు manager మొదట కుదరదు అన్నాడు కానీ ఎలాగోలా చివరికి ఒప్పుకున్నాడు
తన ఊరు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు రాత్రి 8 గంటలు సమయం అవుతుంది బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అంతలో ఒక పెద్దాయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అది చూసి ఒక అమ్మాయి బస్సు అపమని అరిచింది బస్సు ఆగింది ఇంతలో ఆ పెద్దాయన బస్సు ఎక్కాడు బస్సు బయలుదేరింది
కాసేపటికి బస్సులో అందరూ నిద్ర పోతున్నారు ఇంతలో ఒకసారి బస్సు కుదుపులకు గురి అయినట్టు అందరూ ఒక్కసారి నిద్ర లేచి చూసారు ఏమైంది అని అడిగారు డ్రైవర్ ని బస్సు టైర్ ఫంక్చర్ పడింది అని చెప్పాడు టైం పడతుంది అందరూ కిందికి దిగండి అని చెప్పి డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు
అందరు కిందకి దిగారు ఆ అమ్మాయి కూడా కిందకి దిగింది ఒక్కసారిగా ఆ అమ్మాయి నరేష్ వైపు రావటం గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు
ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కొంచెం భయం గానే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి ఇంటికి కాల్ చేసి చెబుతాను అని చెప్పి ఫోన్ తీసుకుంది
నరేష్ ఫోన్ ఇచ్చాడు కాసేపు ఫోన్ మాట్లాడి మారాల తీసుకొచ్చి నరేష్ కి ఫోన్ ఇచ్చేసింది మీ పేరేమిటి అని అడిగాడు నరేష్
నా పేరు రాధ అని చెప్పి వెళ్ళిపోయింది ఏ ఊరు మీది అని అడిగాడు కానీ అటువైపు నుండి ఏ సమాధానం రాలేదు డ్రైవర్ అందరిని బస్సు ఎక్కమని చెప్పాడు అంటారు బస్సు ఎక్కారు నరేష్ ఆ అమ్మాయిని చూసాడు కానీ ఏమీ మాట్లాడలేదు
కాసేపటికి నరేష్ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం 7 గంటలు అవుతుంది నరేష్ కొద్దీ సేపటికి తాను దిగవాల్సిన స్టాప్ వచ్చింది తను దిగుతున్నాడు ఒక్కసారి ఆ అమ్మాయి వైపు చూసాడు ఆ అమ్మాయి కూడా దిగుతోంది
నరేష్ బస్సు దిగగానే వల్ల తమ్ముడు ప్రతాప్ అక్కడకు బైకుపై వెంటనే బైకుపై తన ఇంటికి వెళ్ళాడు వెనుక రాధ వస్తుంది ప్రతాప్ ఎవరు ఆ అమ్మాయి మన ఊరు లో ఎప్పుడు చూడలేదు అని అడిగాడు దానికి ప్రతాప్ వాళ్ళ నాన్న గారు పోస్టుమాన్ కొత్తగా మన ఉరికి వచ్చారు అని చెప్పాడు అంతేకాదు వాళ్ళది మన ఇంటి పక్కనే అద్దెకు వుంటున్నారు అని చెప్పాడు
రేపు తిరుపతి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పాడు మాటల్లోనే ఇంటిని చేరుకున్నారు
ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలు అవుతుంది కుటుంబం అంతా బయలు దేరింది , వాళ్ళతో పాటు రాధ వాళ్ళ అమ్మగారు, రాధ తమ్ముడు , రాధ కూడా వస్తున్నారు వాళ్ళ నాన్న గారు రావటం లేదు
అందరూ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు అంతా బాగానే ఉంది
ఎలాగైనా రాధతో మాట్లాడాలని అనుకున్నాడు రైల్వే భోగి అంతా ఖాళీ గానే ఉంది ఒక విండో సీట్ దగ్గర కూర్చున్నాడు ఇంతలో రాధ అక్కడకు వచ్చింది
చూసి నవ్వుకున్నారు ఒకరికి ఒకరు
మీ పేరేమిటి అని అడిగింది రాధ నా పేరు నరేష్
మీరు ఏమి చేస్తారు అని అడిగింది నేను ఒక అకౌంట్ ఆఫీస్ లో పని చేస్తున్నాను అని చెప్పాడు
మీరు ఏమి చేస్తారు అని అడిగాడు నరేష్
నేను M. B. A పూర్తి అయింది అని చెప్పింది
అలా వారి మాటలుతో ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడింది


Tuesday, November 20, 2018

ఎవరు (కథ )


ఉదయం సమయం 7 గంటలు అవుతుంది ఫోన్ మోగుతుంది కాసేపటికి ఫోన్ అందుకున్నాడు ప్రకాష్ రేపు మా ఇంటిలో ఫంక్షన్ ఉంది తన ఫ్రెండ్ సుందరం  రమ్మని వారం రోజులుగా చెబుతున్నాడు మరొకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేసాడు సరే వస్తాను అని చెప్పాడు
    కొంచెం త్వరగా బయలుదేరి రా రాత్రి పూట ప్రయాణం మా ఊరిలోఎమి దొరకవు అని చెప్పాడు వెంటనే లేచి స్నానం చేసి తన షాప్ కి తాను వెళ్ళాడు ప్రకాష్ ఒక మొబైల్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు సాయంత్రం 6 గంటలు అవుతుంది తన షాపులో పెర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లి స్నానం చేసి బయలుదేరాడు
  తన ఫ్రెండ్ సుందరం ఇంటికి ఎప్పుడో ఒకసారి వెళ్ళాడు ప్రకాష్ వెళ్లి 5 సంవత్సరాలు పైనే అవుతుంది అది బాగా పల్లెటూరు సాయంత్రం 8 గంటలకి అందరూ పడుకుంటారు అంతా చీకటిగానే  ఉంది  మెల్లగా తన బైకుపై వెళ్తున్నాడు ఇంతలో ఎవరో  పిలిచినట్టు ఒక కేక వినిపించింది వెంటనే బైక్ అపి వెనకకు తిరిగి చూసాడు ఎవరు కనిపించలేదు మరలా బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు
ఈ సారి తన బైక్ ఆగిపోయింది చుట్టూ చూసాడు కనీసం కనుచూపు మేరలో ఎవరు కనిపించలేదు వెంటనే తన ఫ్రెండ్ సుందరంకి ఫోన్ చేసాడు  చాలా సేపు కలవలేదు కాసేపటికి కలిసింది సరే ఇప్పుడు నువ్వు ఎక్కడఉన్నావు అని అడిగాడు సుందరం
నేను వేట్ల దాటిన తరువాత కొంచెం దూరం లో ఉన్నాను అని చెప్పాడు సరే నేను వస్తున్నాని ఫోన్ పెట్టేసాడు

కాసేపటికి అక్కడకి చేరుకున్నాడు కానీ అక్కడ ప్రకాష్ లేడు తన బైక్ మాత్రం ఉంది చుట్టూ చూసాడు ఎక్కడ కనిపించలేదు తన మొబైల్ కి ఫోన్ చేసాడు ఎక్కాడు దూరంగా చెట్టు పొదలలో వినబడుతుంది ఆ పక్కనే పది ఉన్నాడు ప్రకాష్
వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు సుందరం కాసేపటికి మెలకువ లోకి వచ్చాడు ప్రకాష్
ఏమి జరిగింది అని అడిగాడు సుందరం
నేను నీకు ఫోన్ చేసిన తరువాత కొద్దీ సేపటికి ఎవరో కారు మీద వచ్చారు నేను ఆపడానికి ప్రయత్నించాను కానీ ఆ కారు ఆపలేదు కొంచెం దూరంలో ఆ కారు ఆగింది అంతలో నేను కారు దగ్గరికి వెళ్ళాను ఎవరినో బలవంతంగా తీసుకెళ్తున్నారు నేను వెంటనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంతలో ఎవరో నన్ను బలవంతంగా వెనుక నుండి కొట్టారు నేను స్పృహ తప్పి పడిపోయాను ఇది జరిగింది వెంటనే పోలీస్ లకి ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పారు !!!

Sunday, November 18, 2018

డైరీ చెప్పిన ప్రేమ కథ (కథ)


శేఖర్ కొత్తగా పెళ్లి అయ్యింది తను హైద్రాబాద్ లోని ఒక కంపెనీలో అకౌంటెంట్ గా 3 సంవత్సరాలు నుండి పనిచేస్తున్నాడు ఇప్పటివరకు బ్యాచిలర్ కాబట్టి హాస్టల్లో కలిసి ఉండేవాడు
కానీ తనకు పెళ్లి అయ్యింది తన భార్య కూడా తనతో ఉంటుంది కాబట్టి తన ఆఫీస్ కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు
శేఖర్, తన భార్య రమ్య తో కలిసి ఆ ఇంటిలోకి అద్దెకు వచ్చారు ఆ ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉంది దానిని శుభ్రం చేశారు
అంతా బాగానే ఉంది 2 రోజులు తరువాత పైన అటక మీద ఎదో శబ్దం వినబడుతుంది ఏమిటి అని శేఖర్ పైకి చూసాడు ఇంతలో పిల్లి కనిపించింది తనను చూసి పారిపోయింది
వెంటనే కిందికి దిగుదామని చూసాడు అంతలో అతనికి ఒక డైరీ కనిపించింది వెంటనే ఆ డైరీని తెరిచి చూసాడు
అందులో ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో ఎవరిదో కాదు తన స్నేహితుడు రమేష్
శేఖర్ కాసేపు అలానే ఉండిపోయాడు అసలు ఎక్కడో ఉన్న రమేష్ కి ఈ డైరీ కి సంబంధం ఏమిటి అని ఆలోచించాడు
వెంటనే డైరీ ఓపెన్ చేసి చూసాడు అందులో ఎవరో ఒక అమ్మాయి తను గురించి వివరిస్తూ రాసి ఉంది తన పేరు మల్లిక అని తనది గుంటూరు దగ్గర చిన్న గ్రామం అని తనకు పెళ్లి చేసి హైద్రాబాద్ పంపించారు అని చెప్పి తన తనను సరిగ్గా పట్టించుకోవటం లేదని ఆ డైరీ లో రాసి ఉంది
  ఐతే ఈ డైరీ కి ఈ ఫోటోకి సంబంధం ఏమిటి అని ఎంత ఆలోచించిన శేఖర్ కి అర్థం కాలేదు వెంటనే రమేష్ నెం ఫోన్ చేసాడు కానీ కలవటం లేదు

వెంటనే శేఖర్ తన ఊరు బయలుదేరాడు శేఖర్ ఆ ఊరిలో మొబైల్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు దూరం నుండి చూసిన వెంటనే రమేష్ శేఖర్ ని పలకరించాడు
కాసేపు మాట్లాడుకున్నారు
ఆ తరువాత శేఖర్ జరిగిన విషయాన్ని, ఆ డైరీ గురించి చెప్పాడు రమేష్ మల్లిక  స్నేనేహితులు గా ఉండేవాళ్ళం తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది ఆ విషయం ఆ అమ్మాయి కూడా చెప్పానని కానీ ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డాను ఆ తరువాత మల్లిక ఎక్కడ కనిపించలేదని బాధపడుతూ చెప్పాడు
కొన్ని ప్రేమ కథలకు ముగింపు బాధతోనే మొదలవుతుంది !!!