30, జనవరి 2022, ఆదివారం

గుడ్ లక్ సఖి సినిమా పై నా అభిప్రాయం !!!

కీర్తి సురేష్, జగపతి బాబు, అది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో చేసిన సినిమా  గుడ్ లక్ సఖి సినిమా జనవరి 28 న విడుదల అయ్యింది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక పల్లెటూరు అందులో ఒక తండా అమ్మాయి పేరు సఖి తాను ఏమి చేసినా చివరకు బ్యాడ్ లక్ ఎదురవుతుంది అయితే ఆ ఉరిలోకి జగపతి బాబు కల్నల్ వస్తాడు అక్కడ ఆ ఊరిలో ఉండేవారికి షూటింగ్ నేర్పించి వాళ్లలో గొప్ప షూటర్ ని తయారు చేసి దేశానికి వాళ్ళ ప్రతిభను తెలిసేలా చేయలనుకుంటాడు 

ఆ ఊరిలో అది పినిశెట్టి నాటకాలు వేస్తూ ఉంటాడు సఖి చిన్నప్పటి స్నేహితుడు అది అయితే ఆ కల్నల్ దగ్గరికి సఖి ని తీసుకువెళ్తాడు అది సఖి చిన్నప్పుడు గోళీల ఆట గురి చూసి కొడుతోంది అదే షూటింగ్ లో చేస్తుంది అనూహ్యంగా షూటింగ్ లో కూడా గురి చూసి కొట్ట గల్గుతుంది చివరికి సఖి మంచి గన్ షూటర్ అయ్యిందా లేదా అన్నది సినిమా కథ !!!

25, జనవరి 2022, మంగళవారం

జీ. వి ప్రకాష్ కుమార్ Batchler సినిమా పై నా అభిప్రాయం !!!

 

జి.వి ప్రకాష్ కుమార్ హీరో గా ప్రధాన పాత్రల్లో చేసిన తమిళ్ డబ్బింగ్ సినిమా batchler సినిమా sony లివ్ ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇక కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో కొంచెం ఆటిట్యూడ్ person లాగా ఉంటాడు ఒక it కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా చేస్తుంటాడు 

అయితే అక్కడ హీరోయిన్ కూడా పనిచేస్తుంటుంది వాళ్లిద్దరూ పనిచేసేది బెంగళూరు లో అయితే హీరోయిన్, హీరో ఒకే గదిలో ఉంటారు ఆ తరువాత ఇద్దరు కలుస్తారు ఇలా మాటి మాటికి శృంగారం లో పాల్గొంటారు అయితే హీరో వాళ్ళ సొంతూరు వెళ్తాడు అపుడు హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది

హీరో abortion చేసుకోమంటాడు కానీ హీరోయిన్ వద్దు అంటుంది ఇలా వీరి మధ్య గొడవలు మొదలై చివరికి కోర్ట్ దాకా వెళ్తతుంది అయితే చివరకు ఏమి జరిగింది అన్నది మిగిలిన కథ

కథ అంత boaring గా ఉంటుంది చాలా స్లోగా నడుస్తుంది యూత్ ని దృష్టిలో చూసే సినిమా ఇది అంతగా ఏమి లేదు జస్ట్ ok అంతే !!!

కీర్తి సురేష్ " గుడ్ లక్ సఖి" ట్రైలర్ చూసారా ?

 కీర్తి సురేష్, అది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి ట్రైలర్ చూడండి !!!

23, జనవరి 2022, ఆదివారం

Sony liv Ott లో విడుదల అయిన " churuli" సినిమా పై నా అభిప్రాయం !!!

 

సోనీ లివ్ లో విడుదల అయిన సినిమా మలయాళీ డబ్బింగ్ సినిమా ఇక ఈ సినిమా కథ ఒకసారి చూద్దాం !!!
ఒక ఇద్దరు పోలీసులు ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి churuli అనే ఊరు వెళతారు అయితే అక్కడ ఆ క్రిమినల్ ఎంత వేదికిన దొరకడు చివరకు అక్కడే ఒక సారాయి కొట్టులో పనిచేస్తుంటాడు
అయితే వాళ్లలో ఒక పోలీస్ కి ఎలియాన్ లు కనపడుతుంటాయి అక్కడ మనుషులు కూడా అంతా దుర్మార్గంగా ఉంటారు 
అయితే చివరకు ఏమి జరిగింది ఆ క్రిమినల్ ని పట్టుకున్నారా లేదా అనేది సినిమా కథ
ఎదో ఆసక్తిగా ఉంది గా అని చూసాను గాని సినిమా లో ఏమి లేదు ఎదో అలా సోసో గా సాగుతుంది అంతగా ఏమి ఉండదు కథ బోరింగ్ గా ఉంటుంది !!!

21, జనవరి 2022, శుక్రవారం

ఇది దెయ్యమా నాకు అనుమానమే ? వీడియో

 ఎక్కడో విదేశాలలో జరిగే కొన్ని సంఘటనలు నిజమా లేదా మాయ అనేది అసలు తెలీదు ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఇక్కడ ఒక వీడియో ఉంది అది నిజమే కాదో మీరే తెలుసుకోండి ?

20, జనవరి 2022, గురువారం

16, జనవరి 2022, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన The american dream సినిమా పై నా అభిప్రాయం !!!

ఈ సినిమా ఆహా ott లో జనవరి 14 నుండి స్ట్రీమ్ అవుతుంది ప్రిన్స్, శుభలేఖ సుధాకర్, ప్రధాన పాత్రలో నటించటం జరిగింది ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!
ప్రిన్స్ ఒక below middle క్లాస్ అబ్బాయి తాను అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు తన ఫ్రెండ్ ద్వారా ఎలాగైతే వెళ్తాడు శుభలేఖ సుధాకర్ ప్రిన్స్ తండ్రి పాత్రలో చేసాడు 
అలా అమెరికా చేరుకున్న ప్రిన్స్ అక్కడ బాత్రూం లు కడగడం, హోటల్ లో పనిచేయటం లాంటివి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఎలాగైనా అక్కడ ఎం.స్ చేసి అక్కడే ఉద్యోగం పొందాలని అనుకుంటాడు 
అలా డబ్బులు సరిపోక అప్పులు చేస్తూ చివరకు తాగుబోతుల తయారు అవుతాడు
అయితే అక్కడే ఉండే రియా వర్మ అనే తెలుగు అమెరికా అమ్మాయి కి పరిచయం అవుతాడు వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అవుతారు శారీరకంగా కూడా కలుస్తారు అలాంటి పరిస్థితుల్లో ప్రిన్స్ రియా  వర్మ కార్ తో ఒక ఆక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని చంపేస్తాడు 
ఆ తరువాత చివరకు ఏమి అయ్యింది అన్నది సినిమా కథ సినిమా లో సగం ఇంగ్లీష్ మాటలే అమెరికా కాబట్టి అలా వాడరేమో
ఏది అయితేనేం సినిమా జస్ట్ average !!!

 

15, జనవరి 2022, శనివారం

ప్రాణాలను తీసే " Killer beach" The sand సినిమా !!!

ప్రాణాలను తీసే ఒక బీచ్ అంటే ఆ బీచ్ ఇసుకలో కాలు పెడితే వాళ్ళను చంపేస్తుంది ఇది హాలీవుడ్ సినిమా ఈ సినిమా ఇవాళ చూసాను ఈ సినిమా కథ ఒకసారు చూద్దాం !!!
కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి బీచ్ లో పార్టీ చేసుకుంటారు ముఖ్యంగా ఈ సినిమా 18plus సినిమా అంటే పెద్దవారికి మాత్రమే  తెల్లవారే సరికి  అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అయితే అనుకోకుండా ఆ బీచ్ లో కాళ్ళు పెడితే వాళ్ళను ఇసుకులోకి లాగేస్తుంది  వాళ్ళను చంపేస్తుంది ఇలా వాళ్లలో చాలా మంది చనిపోతారు 
అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఆ బీచ్ లో ఏముంది అన్నది సినిమా కథ సినిమా క్లైమాక్స్ లో తెలుస్తుంది ఆ ఇసుకలో అసలు ఏముందో అని సస్పెన్సు సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది
1 గంట 30 నిమిషాలు ఉంది సినిమా బాగుంది !!!

 

14, జనవరి 2022, శుక్రవారం

అంతఃపురం సినిమా పై నా అభిప్రాయం !!!

 అంతఃపురం సినిమా సుందర్ .C డైరెక్షన్ లో వచ్చిన సినిమా చంద్రకళ, కళావతి, తరువాత వచ్చిన సినిమా అంతఃపురం సినిమా కథ ఎలా ఉందో చూద్దాం


తమిళ్ లో విడుదల అయిన చంద్ర కళ, కళావతి తరహాలోనే ఈ సినిమా ఉంటుంది ఒక పెద్ద అంతఃపురం అందులో ఉండే ఒక ఫ్యామిలీ చిన్న పిల్లకు దెయ్యం కనబడుతూ బయపెడుతూ ఉంటుంది అలాగే మెల్లగా అందరికి కనబడుతుంది ఆ దెయ్యం ఆ ఇంటిలోకి ఎలా వచ్చింది ఆ అంతఃపురం కి దెయ్యానికి ఏమిటి సంబంధం అన్నది సినిమా కథ 

ఆర్య,రాశి ఖన్నా, ఆండ్రియా, సుందర్ .సి ,యోగి బాబు ప్రధాన పాత్రల్లో చేశారు రొటీన్ గానే ఉంటుంది సినిమా జస్ట్ average హాలీవుడ్ హార్రర్ మూవీస్ చూసేవారికి అంతగా ఏమి అనిపించదు గ్రాఫిక్స్ పర్వాలేదు  !!!

11, జనవరి 2022, మంగళవారం

"సీతారాం బేనోయ్" సినిమా పై నా అభిప్రాయం !!!

సీతారాం బేనోయ్ కన్నడ డబ్బింగ్ సినిమా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!
సీతారాం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక చోటు వేరే ఊరు నుండి అరకు వాలీ కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ ఊరిలో అనుకోకుండా దొంగతనాలు జరుగుతాయి సీతారాం ఉండే ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది  అయితే ఆ కేస్ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది
ఆ ఊరిలో ఉండే ముగ్గురు వ్యక్తులు మీద అనుమానం వస్తుంది అయితే ఇంతలో సీతారాం భార్య ని ఎవరో చంపేస్తారు ఇంతకీ ఆ దొంగతనాలు ఎందుకు
జరుగుతున్నాయి ఆ మర్డర్ ఎవరు చేశారు అన్నది సినిమా కథ అంతగా ఏమి లేదు సినిమా జస్ట్ average అంతే !!!

9, జనవరి 2022, ఆదివారం

డిస్నీ hotstar ott లో విడుదల అయిన "పరంపర " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 


నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఆమని ప్రధాన పాత్రల్లో చేసిన పరంపర వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ఇక session 1 కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒకానొక టైం లో వీర నాయుడు అనే ఒక పెద్ద మనిషి వైజాగ్ సిటీ మొత్తం తన గుప్పిటలో ఉండేది అయితే తాను మాత్రం మంచి కోసం తప్ప చెడు కోసం ఎప్పుడు వాడలేదు అయితే తనకు ఒక కొడుకు నాయుడు చిన్నప్పుడు తనని చెరువులో పడినప్పుడు మోహన్ అనే అబ్బాయి కాపాడతాడు అప్పటి నుండి వీర నాయుడు ఆ అభిమానంతో మోహన్ ని దత్తత తీసుకుని పెద్ద కొడుకు లాగా పెంచుతాడు అది ఎందుకో నాయుడు కి నచ్చదు వీర నాయుడు ని శత్రువులు చంపేసిన తరువాత ఆ స్థానం ఎలాగైనా నాయుడు దక్కించుకోవాలని చూస్తాడు మోహన్ ఒక ఇంటిలో మనిషి గా చూస్తాడు తప్పించి అన్నగా ఎప్పుడు చూడడు వారసత్వ పరంపర కోసం జరిగే యుద్ధమే ఈ వెబ్ సిరీస్ 
తన నాన్న ని తక్కువ చేసి చూస్తున్నాడు అని నాయుడు అంటే మోహన్ రావు కొడుకు గోపి కి ఇష్టం ఉండదు 
ఇలా ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటారు చివరకు ఎవరిది పై చెయ్యి అన్నది session 1 కథ ఇంతటితో అవ్వలేదు session 2 కూడా ఉంది 
పర్వాలేదు బాగుంది వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ చూసిన తరువాత ఆటోమేటిక్ గా మిగతా ఎపిసోడ్ లను చూడాలి అనిపిస్తుంది బాగుంది ఒక సారి try చేయవచ్చు !!!

8, జనవరి 2022, శనివారం

కొత్త సినిమా రూటు మారింది ?

 అవును అప్పుడెప్పుడో అంటే ఒక 5, 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా విడుదల అయ్యింది అంటే థియేటర్ లో మిస్ అయ్యింది అంటే మళ్ళీ అది T. V లో ప్రసారం అయ్యేదాక చూసేవారం

కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒక కొత్త సినిమా విడుదల థియేటర్ లో తప్పితే ott లో అది తప్పితే T. V లో ఎక్కడో ఒక చోట మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది

నాకు తెలిసి ఇది మంచి విషయమే సినిమా ప్రియులకు సినిమా అంటే ఎన్నో ఒత్తిళ్లతో సాగిస్తున్న మనిషి జీవితానికి కొద్దిగా ఉపశమనం  అంటే రిలాక్స్ అవునా కదా 

మొబైల్ వచ్చిన తరువాత T. V వాడకం కూడా తగ్గింది బహుశా ఇదంతా ఒక మాయ  !!!

4, జనవరి 2022, మంగళవారం

" అర్జున ఫల్గుణ " సినిమా పై నా అభిప్రాయం !!!

2021 లో డిసెంబర్ 31 తేదీన విడుదల అయిన సినిమా అర్జున ఫాల్గుణ సినిమా శ్రీ విష్ణు హీరోగా చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!
గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు అందులో 4 స్నేహితులు చిన్నప్పటి నుండి కలిసి ఉండేవారు అందులో హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండేది అయితే ఆ 4 స్నేహితులతో ఒకరికి బాంక్ లో అప్పు తీసుకుని చెల్లించకపోవటంతో  వాళ్ళ ఇల్లుని జప్తి చేస్తారు  వాళ్ళ డబ్బు ఎలాగైనా తేర్చేయాలని వాళ్ళతో గోడవపడతాడు హీరో
 అలా వాళ్ళ అప్పుని తీర్చటానికి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి smuggling చేయటానికి సిద్ధపడతాడు అలాంటి పరిస్తుతుల్లో హీరో కి ఒక పోలీస్ ఆఫీసర్ సుబ్బరాజ్ వాళ్ళను పట్టుకుంటాడు అయితే ఆ తరువాత కథ ఏమి జరిగింది అన్నది మిగతా కథ బాగానే ఉంది మిడిల్ క్లాస్ స్టోరీ ఒక సారి చూడవచ్చు !!!

3, జనవరి 2022, సోమవారం

ఆహా OTT లో విడుదల అయిన సేనాపతి సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఆహా ott లో విడుదల అయింది సేనాపతి సినిమా రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రలో నటించటం జరిగింది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!
ఇందులో హీరో తాను చెయ్యని హత్యకు తన చిన్నప్పుడు. పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ జైల్ లొనే బాగా చదువుకుని మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు అయితే పోలీస్ స్టేషన్ లో ఒక క్రిమినల్ ని పట్టుకునే నేపథ్యంలో తన సర్వీస్ గన్ పోతుంది 
హీరో తన పై అధికారులు తనను సస్పెండ్ చేస్తారు ఎలాగైనా ఆ పోయిన గన్ ను సంపాదించాలని అన్వేషిస్తాడు అనూహ్యంగా ఆ పోయిన గన్ నుండి బుల్లెట్ ద్వారా ముగ్గురు చనిపోతారు ఇంతకీ ఇదంతా చేస్తుంది రాజేంద్ర ప్రసాద్
ఇంతకీ రాజేంద్ర ప్రసాదుకి ఆ గన్ కి సంబంధమేమిటి ఇంతకీ ఆ హత్యలు ఎందుకు చేసాడు అన్నది మిగిలిన కథ సినిమా అయితే బాగుంది ఒక్కసారి చూడవచ్చు ఆ పోయిన గన్ గురించే ఈ కథ అంతా  బాగుంది సినిమా !!!

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...