Movie review లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movie review లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

Netflix లో విడుదల అయిన inspector zende సినిమా పై నా అభిప్రాయం !!!!

 

ఈ సినిమా Netflix లో విడుదల అయింది ఇన్స్పెక్టర్ zinde సినిమా ఈ సినిమా కామెడీ కింద చూపించటం జరిగింది కానీ ఇది నిజంగా జరిగిన కథ అని ఈ సినిమా మొదట్లో చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక దొంగ జైలులో మత్తు మందు కలిపి అక్కడినుండి. తప్పించుకుని పారిపోతాడు అయితే అతడిని పట్టుకోవటానికి ఇన్స్పెక్టర్ zinde బయలు దేరుతాడు అయితే అతడిని పట్టుకుంది మొదలు కూడా ఇన్స్పెక్టర్ zinde అయితే చివరికి అతడిని మన హీరో పట్టుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ 

ఈ సినిమా కామెడీ ట్రై చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు అనిపించింది అంతగా ఏమి బాగాలేదు ఫ్యామిలీ man web series లో నటించిన మనోజ్ వాజపేయి ఇందులో ప్రధాన హీరో పాత్రలో నటించటం జరిగింది అసలు కథలో కామెడీ అంతగా పండ లేదు జస్ట్ సో సో గా మాత్రమే ఉంది !!!

28, ఏప్రిల్ 2025, సోమవారం

సారంగ పాణి జాతకం సినిమా పై నా అభిప్రాయం !!!


 ప్రియ దర్శి హీరో గా చేసిన సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో కి జాతకం మీద నమ్మకం ఎక్కువ  ఒక కారు షోరూం లో సేల్స్ మెన్ గా పనిచేస్తుంటాడు అయితే అదే షోరూం లో మేనేజర్ గా పనిచేస్తున్న మైథిలి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే ఆ విషయం ఒక మంచి రోజు చూసుకుని మైధిలికి చెబుదామనుకునే అనే టైంలో ఆ మైథిలి తిరిగి i love you చెబుతుంది ఇంకా కథ సుఖాంతం అయ్యే టైంలో ఒక చేయిని చూసి జాతకం చెప్పే అవసరాల శ్రీనివాస్ హీరో చెయ్యి చూస్తాడు అయితే తన జీవితం అంతా బాగానే ఉంటుంది కానీ పెళ్లి జరుగుతుంది కానీ ఒక murder చేస్తావు అని చెబుతాడు అప్పటి నుండి హీరో తన ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తాడు 

అయితే చివరికి murder చేశాడా ? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అన్నది కథ ఏదో కామెడీ గా ట్రై చేసారు ఒక సారి చూడ వచ్చు !!!

21, ఏప్రిల్ 2025, సోమవారం

ETV Win OTT లో విడుదల అయిన టుక్ టుక్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

ETV Win OTT లో ఈ సినిమా అందుబాటులో దాదాపు నెల రోజులు అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా చూడటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు సరదా జీవితం గడుపుతుంటారు కొమరం దశ నుండి యవ్వనం వయసులోకి వచ్చే దశలో ఉండే  కుర్రాళ్ళు అయితే వాళ్ళకి ఒక కెమెరా కొని దానితో షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటారు అయితే దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అయితే దగ్గరలో వినాయక చవితి ఉండటంతో వినాయక చవితి వచ్చిన చందాలతో ఆ కెమెరాను కొనాలని అనుకుంటారు అయితే వినాయక చవితి అయిన తరువాత నిమజ్జనం కోసం వాళ్లకు బండి దొరకదు అయితే వాళ్లకు దగ్గరలో ఒక పాత chetak బండి దానిని కొంచెం మార్పులు చేర్పులు చేసి వినాయక నిమజ్జనం చేస్తారు 

అయితే ఒక రోజు ఆ chetak బండిలో మార్పులు కనిపిస్తాయి ఆటోమేటిక్ గా ఆ బండిలో లైట్స్ వెళ్ళటం బండి హ్యాండిల్ అటు ఇటు తిరగటం అయితే బండి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ  

అయితే ఆ బండిలో ఆ ముగ్గురు కుర్రాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటారు ఇంతకు అందులో ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది ఆ అమ్మాయి కథ ఏమిటి ఆ అమ్మాయి ఆత్మ ఆ బండిలోకి ఎలా వచ్చింది అన్నది మిగిలిన కథ బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

14, ఏప్రిల్ 2025, సోమవారం

Netflix లో విడుదల అయిన Perusu సినిమా పై నా అభిప్రాయం !!!


 Perusu movie review ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ తెలుగులో అందుబాటులో netflix OTT లో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో పరంధామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు తనకు ఇద్దరు కొడుకులు, భార్య తో ఉంటాడు అయితే ఆ ఊరిలో ఒక కుర్రాడిని అడ్వాళ్లు స్నానం చేస్తుండగా చూస్తున్నాడని ఆ కుర్రాడిని కొడతాడు ఆ కుర్రాడు అది మనసులో పెట్టుకుని ఎలాగైన ఆ పరంధామయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు అయితే ఇంటికి వెళ్ళిన తరువాత అనూహ్యంగా చనిపోతాడు ఆ పరంధామయ్య అయితే ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది అది ఏమిటంటే తను చనిపోయిన తరువాత తన అంగం అలాగే లేచి ఉంటుంది అయితే అది ఫ్యామిలీ మెంబెర్స్ మొదట కంగారు పడతారు అయితే ఆ విషయం బయట జనాలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని ఆ వచ్చిన చుట్టాలతో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు 

ఇలాంటి సినిమా అసలు ఎందుకు తీసారో తెలియదు  పిల్లలతో ,కుటుంబంతో అసలు చూడలేము కొద్దిగా అసహ్య భావనతో చూడవలసి వచ్చింది సినిమా ఏదో కామెడీగా ట్రై చేసారు కానీ చూడటానికి కొంచెం ఎబ్బెట్టు గా ఉంది మరి నేనెందుకు చూసాను అనకండి అది నా పిచి సినిమా పిచ్చి !!!

5, ఏప్రిల్ 2025, శనివారం

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!


 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

సిద్దార్థ్ ఒక క్రికెటర్ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం ఆ ఆట కోసం ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇష్టం అయితే చెన్నై లో జరిగే అంతర్జాతీయ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో తను ఒక ప్లేయర్ అయితే అదే అతని చివరి మ్యాచ్ అని అందరూ అనుకుంటారు అయితే తన భార్య మీరా జాస్మిన్  ఒక కొడుకు ఉంటాడు

మరో పక్క మాధవన్, నయన తార భార్య భర్తలు 30 సంవత్సరాలు పైబడిన పిల్లలు పుట్టారు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతారు దానికి కూడా చాలా డబ్బులు కావాలి అయితే మాధవన్ ఒక సైంటిస్ట్ తను తయారు చేసిన ప్రాజెక్ట్ ప్రభుత్వ అనుమతి కోసం ఎన్ని సార్లు ట్రై చేసిన విఫలం అవుతాడు అయితే 50 లక్షలు ఉంటే ఆ ప్రాజెక్ట్ ok చేస్తానని చెబుతాడు అంతకు ముందు కూడా అప్పు చేస్తాడు మరల 50 లక్షలు అంటే ఎలా అని ఆలోచిస్తాడు

అయితే ఇందులో మాధవన్  కి, సిద్దార్థ్ కి అసలు సంబంధం ఏమిటి ఆ చెన్నై లో జరిగే టెస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అన్నది మిగిలిన కథ 

మనిషి కి డబ్బు ఉంటేనే మనిషిని మనిషి గుర్తిస్తుంది ఈ సమాజం ఇందులో మంచివారు , చెడ్డవారు అని ఏమి ఉండదు డబ్బు ఆడే నాటకంలో అందరూ నటులే

ఈ సినిమా మొదట కొంచెం స్లో గా మొదలవుతుంది ఇదేమి సినిమా రా బాబు అనుకునేంతల తరువాత అసలు కథ మొదలవుతుంది డ్రామా గా మొదలవుతూ క్రైమ్ థ్రిల్లర్ గా నడుస్తుంది

మీకు సమయం ఉంటేనే చూడండి లేకపోతే స్కిప్ చేయండి !!!

12, మార్చి 2025, బుధవారం

Chava సినిమా పై నా అభిప్రాయం !!!


 చావా సినిమా ఇది హిందీ సినిమా అయినప్పటికీ అన్ని భాషలలో విడుదల అవ్వాల్సిన సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అయ్యింది అనుకోండి అసలు ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!

ఛత్రపతి శివాజీ మరణం తరువాత మరాఠా సామ్రాజ్యం అంతా తన అధీనంలోకి వచ్చేస్తుంది అనుకుంటాడు ఔరంగా జెబ్ అయితే అప్పుడు వస్తాడు శంభజి మహారాజ్  తన అధీనంలో ఉన్న అన్ని రాజ్యాలు కోసం పొరడతాడు ఛత్రపతి శివాజీ ఔరంగ్ జేబ్  తో ఎంత యుద్ధం చేస్తాడో అలాగే శంబాజీ మహారాజ్ కూడా యుద్ధం చేస్తాడు  కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు అయితే శంభజీ మహారాజ్ నీ ఔరంగజేబు ఎలా పట్టుకున్నాడు 

అలా పట్టు కోవటానికి కారణం ఎవరు ? ఆ తరువాత ఔరంగజేబు షాంబాజీ మహారాజ్ నీ ఎన్ని చిత్ర హింసలు చేశాడు అన్నది మిగిలిన కథ !

మతం మారమని ఎంత ప్రయత్నించినా మార లేదు గోళ్ళు పీకి, ఎర్రగా కాల్చినా చువ్వలతో కంటిలో పొడిచి,నాలుక పీకి ఇంకా చాలా రకాలుగా హింసిస్తాడు అయిన మార లేదు నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండటం చాలా అదృష్టం మతం అంటే అమ్మ తో సమానం అని తను పుట్టిన మతం నుండి వేరొక మతంలోకి మారలేదు 

అయితే యూట్యూబ్ వీడియో లలో అక్కడే తల నరికి తన శరీరాన్ని ముక్కలు ముక్కలు గా నరికి చెరువులో పడవేశారు అని చూపెట్టడం జరిగింది నిజంగా ప్రతి హిందువు తప్పక చూడవలసిన సినిమా బాగుంది !!!

Kingston సినిమా పై నా అభిప్రాయం !!!


 A.R. రెహమాన్ మేనల్లుడు g.v prakash kumar నటించిన సినిమా కింగ్స్టన్ తమిళ్ సినిమా తెలుగులో మార్చ్ 7 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లాసయం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది హార్రర్ కథాంశం తో నిండిన కథగా ఈ సినిమా నడుస్తుంది ఇందులో హీరో వాళ్ళు చేపల పట్టి జీవనం సాగిస్తుంటారు అయితే అనూహ్యంగా హీరో చిన్నప్పటి నుండి వాళ్లకు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు చనిపోతుంటారు అయితే అప్పటినుండి ఆ ప్రాంతంలో ఎవరు చేపలు పట్టటానికి వెళ్ళరు అయితే హీరో ఆ ఊరిలో ఉండే ఒక రౌడీ దగ్గర పనిచేస్తుంటాడు అయితే రౌడీ స్మగ్లింగ్ చేస్తుంటాడు ఆది తెలియక హీరో బృందంలో ఒకరు చని పోతాడు అప్పుడు హీరో తెలుస్తుంది అది డ్రగ్స్ అని ఆ రౌడీ తో గొడవపడి బయటకు వచ్చేస్తాడు హీరో అయితే వాళ్ళ దగ్గర ఉన్న సముద్రం తీర ప్రాంతంలో చేపలకు వెళ్లినవారు ఎందుకు చనిపోతున్నారు అని తెలుసుకోవటానికి హీరో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్తాడు అయితే అక్కడికి వెళ్లిన తరువాత హీరో ఎలాంటి పరిస్థితులు ఎదురుకొన్నాడు 

నిజంగా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయా అసలు ఈ పని ఎవరు చేస్తున్నారున్నది మిగిలిన కథ ఫస్ట్ ఆఫ్ అనత సో సో గా నడుస్తుంది 2nd హాఫ్ నుండి కొద్దిగా పరవాలేదు అనిపించింది సినిమా మొత్తానికి టైం నీ పాడు చేసుకుని చూడవద్దు సినిమా వన్ టైం వాచబుల్ అది కూడా ఏ సినిమా ఖాళీ లేకపోతే చూడండి అంతే ?

23, ఫిబ్రవరి 2025, ఆదివారం

ధనరాజ్ "రామం రాఘవం" సినిమా పై నా అభిప్రాయం !!!

 కమెడియన్ ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


ఈ సినిమా లో సముద్రఖని హీరో ధనరాజ్ తండ్రి పాత్రలో నటించడం జరిగింది ఇంకా అసలు కథ విషయానికి వొస్తే 
ఒక గవర్నమెంట్ రిజిష్టర్ ఆఫీసులో పనిచేస్తుంటారు సముద్రఖని అయితే అసలు లంచం తీసుకోకుండా నిజాయతీ పరుడిగా ఉంటాడు అయితే తనకి ఒక కొడుకు పుడతాడు తన కొడుకుని ఎలాగైనా డాక్టర్ నీ చేయాలనుకుంటాడు కానీ బిడ్డలను అయితే కనగలం గానీ వారి తలరాతను మనం మార్చలేము అన్నట్టుగా తన కొడుకు చిన్నప్పటి నుండి బలాదూర్ గా తిరుగుతుంటాడు చదువును మధ్యలోనే ఆపేస్తాడు బెట్టింగ్, తాగటం ఇలా అన్ని అవలక్షణాలు ఉంటాయి 
ఫ్రెండుతో వ్యాపారం చేద్దామని నాన్న దగ్గర డబ్బు తీసుకుని బెట్టింగ్ లో పోగొట్టుకుంటాడు చివరకు వాళ్ళ నాన్న ఇలా ఇంటిలో చాలా జరుగుతాయి ఇవన్నీ భరించలేక ఇంటిలోనుండి బయటకు వెళ్ళిపోమంటాడు వాళ్ళ నాన్న అయితే బయటకు వెళ్లిన తరువాత వాళ్ళ నాన్న ను చంపాలని అనుకుంటాడు ఇలా ఎందుకు చేశాడు చివరకు వాళ్ళ నాన్న ని చంపడా లేదా అన్నది మిగిలిన కథ స్టోరి రొటీన్ గానే ఉంది కాకపోతే ఒకసారి కాలక్షేపం కోసం చూడవచ్చు !!!


2, ఫిబ్రవరి 2025, ఆదివారం

The secret of shiledars వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!


 The secret of shiledars Web series disney hotstar లో అందుబాటులో అన్డింక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ కథ ఛత్రపతి శివాజీ యొక్క ఖజానా కాపాడటానికి శివాజీ యొక్క సైన్యం అదే shiledars అంటారు వారు ఆ ఖజానా నీ ఎలా కాపాడారు అన్నది మిగిలిన కథ 

ఇందులో హీరో డాక్టర్ శివాజీ సైన్యం అదే shiledars ఒకరు అయిన కోర్టు జడ్జి ఒక మీటింగులో మన హీరో కలుసుంటాడు అయితే హీరో యొక్క చరిత్ర గురించి హీరో కి చెప్పటం జరుగుతుంది అసలు హీరో గటం ఏమిటి ఆ శివాజీ సైన్యానికి, హీరోకి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ  

మొత్తానికి బాగుంది 3 గంటలు 30 నిమిషాలు పైనే ఉంది వెబ్ సిరీస్ నిడివి మొదట్లో కొంచెం నెమ్మదిగా మొదలైన మధ్యలో వెళ్లే కొలది బాగుంది ఖజానా నీ కనుగొనటానికి టాస్క్ లు టాస్క్ లుగా ఉంటుంది మొత్తానికి బాగుంది కాలక్షేపానికి ఒకసారి చూడ వచ్చు !!!

4, జనవరి 2025, శనివారం

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!


 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ?

ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ఒక ప్రేమ జంట వాళ్ళ పెళ్లి ఇంటిలో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ,మరొక జంట వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ నాన్న, ఇద్దరు అన్నలు వాళ్లకు పెళ్ళిళ్ళు అవ్వవు మూడో వాడు తమ్ముడు వాడికీ బ్యాంక్ లో జాబ్ ఉంది కాబట్టి వాడికి పెళ్లి అవుతుంది కానీ వాళ్ళు ప్రైవసీ గా ఉండటానికి కుదరదు 

ఇంకా 3 వ జంట వాళ్లకు ఫారిన్ లో జాబ్ అయితే పెళ్ళికొడుకు తల్లి, తండ్రులు ఉండరు పెళ్లి కూతురు ఆన్లైన్ గేమ్స్ అడి డబ్బులు పోగొట్టుకుంటుంది ఆ డబ్బును పెళ్లి కొడుకు తీర్చాడ లేదా అన్నది మిగిలిన కథ

ఇంకా 4 జంట అంతకు మునుపే పెళ్లి అయ్యి పోలీస్ గా పనిచేస్తున్న ఒక ఆవిడ , బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న ఒక ఆయనకు పెళ్లి జరుగుతుంది అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి కాకముందే ఆయనకి ఒక కొడుకు ఉంటాడు ఇవిడకు ఒక కొడుకు ఉంటాడు వీళ్ళ కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ చాలా స్లో గా ఉంది కథ 

అసలు చూడకండి నాకైతే నచ్చలేదు సినిమా !!!

31, డిసెంబర్ 2024, మంగళవారం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

వెన్నెల కిషోర్,అనన్య నగాళ్ళ,ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షేర్ లాక్ హోమ్స్ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా 1991 కాలంలో జరిగినట్టు చూపించడం జరిగింది అప్పుడు రాజీవ గాంధీ హత్య జరిగిన రోజు వైజాగ్ లో ఒక హత్య జరుగుతుంది అయితే ఆ హత్య గురించి ఆ హంతకులు ఎవరు అన్నది మన షెర్లాక్ హోమ్స్ అదే వెన్నెల కిషోర్ కనిపెట్టాలి 

ఇంతకు పోలీస్ లు ఏమి చేస్తున్నారు అనే కథ మీ ఉద్దేశ్యం అక్కడికి వస్తున్నాను రాజీవ్ గాంధీ హత్య జరిగిన రాజు అన్నాను కదా ఆ కేసు గురించి పైన ఉన్న ఆఫీసర్లు ఎంక్వైరీ కి వస్తారు వాళ్లకు పోలీస్ లు సహాయం చేయాలి మరియు ఆ కేసు ను వారం రోజులలో ఆ హత్య చేసింది ఎవరు అన్నది కనిపెట్టాలి 

మరి వారం రోజులలో ఆ షెర్లాక్ హోమ్స్ హంతకుడు ఎవరు అన్నది కనిపెట్టడ లేదా అన్నది మిగిలిన కథ వెన్నెల కిషోర్ అంటే కామెడీ ఎక్సెప్ట్ చేస్తాం కానీ ఇందులో కామెడీ ఏమి ఉండదు సీరియస్ గానే నడుస్తుంది సినిమా అయితే బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!


Mura మలయాళం డబ్బింగ్ సినిమా పై నా అభిప్రాయం !!!

ఈ సినిమా మలయాళం తెలుగులో అందుబాటులో ఉంది  అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా ఒక నలుగురు కుర్రాళ్ళు రౌడీ లుగా దౌర్జన్యాలు, చేస్తూ ఉంటారు అయితే వాళ్లకు ఒక పెద్ద రౌడీ పరిచయం అవుతాడు అయితే ఆ రౌడీ కి పెద్ద ఒక ముసలావిడ ఆవిడ సెటిల్మెంట్  లు చేస్తూ రౌడీ లును మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది 

అయితే ఈ నలుగురు కుర్రాళ్లు ఆ రౌడీ దగ్గర పనికి జాయిన్ అవుతారు అయితే ఎటువంటి గొడవలు అయిన వీళ్ళు ముందుంటారు అయితే ఒక బ్లాక్ మనీ దాచిన చోట ఆ ముసలావిడ కు తెలుస్తుంది అక్కడకు వీళ్ళను పంపిస్తారు వాళ్లు ఎలాగోలా కష్టపడి ఆ బ్లాక్ money తీసుకొచ్చి  ఆ ముసలావిడ దగ్గర ఉన్న రౌడీ కి అప్పచెబుతారు అయితే అక్కడిని నుండి అసలు కథ మొదలవుతుంది

ఆ తీసుకు వచ్చిన అమౌంట్ లో వాళ్ళు 50 లక్షలు ఒక్కరికీ అడుగుతారు అయితే దానికి వాళ్లకు నచ్చదు అయితే ఆ తరువాత కథ ముందుకు ఏక సాగింది అన్నది మిగిలిన 

కథ మొదలవ్వగానే కొద్దిగా రొటీన్ గా మొదలైన చివరికి సస్పెన్స్ గానే ఉంది సస్పెన్స్ ఇస్తపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది ఈ సినిమా కథ ను బట్టి తెలిసింది ఏమిటంటే డబ్బు మనిషిని ఎలాగైనా మారుస్తుంది 

మంచి వాడిని చెడ్డ వాడిగా చెడ్డ వాడిని  దుర్మార్గుడిగా ఇలా ఎలా అయిన మార్చే గుణం కేవలం డబ్బుకు మాత్రమే ఉంది !!!


22, డిసెంబర్ 2024, ఆదివారం

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

 

అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అని సినిమా చూసిన తరువాత తెలిసింది థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా కథ ఇప్పుడు తెలుసుకుందాం !!!

ఈ సినిమా  సురవరం అని గ్రామంలో తుని దగ్గర ఊరులో ఇందులో హీరో ఒక మొరటోడు మూర్ఖుడు తనకు కావాల్సింది తను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తాడు ఎవరు మాట వినడు తనకు అడ్డొచ్చిన వారిని చితక బాదుతుంటాడు 

అయితే ఈ కథ 1985,1995,2005 జరిగిన కథ లాగా చూపేట్టడం జరిగింది ఇలా  గున్ని సంచులు కుట్టే వ్యాపారంలో సంచులు కుట్టే పని చేస్తుంటాడు

ఇందులో హీరోయిన్ హీరోకి తన తెలిసిన వాళ్ల పెళ్ళిలో పరిచయం అవుతుంది అప్పటి నుండి హీరో లో కొద్దిగా మార్పు వస్తుంది అసలు హీరో ఎందుకు ఇలా మొండోడుగా ఉంటాడు అన్నది మిగిలిన కథ 

ఇందులో హీరో వాళ్ళ నాన్న తన తల్లి కాకుండా వేరే అమ్మాయి తో కలిసి ఉంటాడు ఆ కోపంతో వాళ్ళ నాన్నకు తను చిన్నపాటి నుండి దూరం అవుతూ మందుకు బానిసై అంతా మొరెటొడుగా తయారు అవుతాడు

సినిమా బాగానే ఉంది కానీ climax లో కొంచెం బాధ అనిపించింది !!!

19, డిసెంబర్ 2024, గురువారం

Etv win లో విడుదల అయిన లీల వినోదం సినిమా పై నా అభిప్రాయం !!!


 షణ్ముఖ  ప్రధాన పాత్రలో నటించిన లీల వినోదం సినిమా ఈ రోజు అనగా 19/12/2024 న ఈటీవీ win OTT లో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది ఇందులో హీరో చదువు పూర్తయి పోలీస్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు అయితే ఆ కాలేజీ లోనే మార్క అమ్మాయిని లీల నీ ప్రేమిస్తుంటాడు ఈ కథ తణుకు చుట్టు పక్కన జరుగుతున్నట్లుగా చూపించటం జరిగింది 2008 ఆ సంవత్సరం లో జరుగుతున్న కథ గా చూపించటం జరిగింది  ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడటమే కాకుండా మేసేజ్ లు పంపుతూ ఉంటాడు

అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి లవ్ ప్రపోజ్ చేయమంటారు అయితే హీరో ధైర్యం చేసి ఫోన్ లో మేసేజ్ చేసి ప్రపోజ్ చేస్తాడు  అయితే అటువైపు అమ్మాయి నుండి ఎటువంటి రిప్లై ఉండదు అయితే హీరో ఎక్కువుగా అలోచిస్తూ ఉంటాడు 

అయితే చివరకు ఆ అమ్మాయి ఒప్పుకుందా లేదా అన్నది మిగిలిన కథ పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది కథ అనాథ ముఖ్యంగా తణుకు  చుట్టు పక్కల ప్రాంతం బాగా చూపించారు సినిమాలో 

ఏదో ఉంది అని చూడ కానీ సినిమాలో చివరికి నాకు అంతలగా అనిపించలేదు !!!

జస్ట్ యావరేజ్ అంతే !!!

18, డిసెంబర్ 2024, బుధవారం

Pani movie Review in telugu !!!

 జోజు జార్జ్ నటించిన సినిమా పని మలయాళం సినిమా హీరో జొజు జార్జ్ ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

కేరళలో లో ట్రిస్సూర్ లో ఒక 4 ఫ్యామిలీ లు కలిసి ఉంటాయి అందులో హీరో ఫ్యామిలీ ఆ ఊరిలో రౌడీ లు లాగా సెటిల్మెంట్ లు చేస్తూ ఉంటారు అయితే అదే ఊరిలో ఒక ఇద్దరు కుర్రాళ్ళు ఒక హత్య చేస్తారు ఆ హత్య ఎవరు చేసారు అన్నది ఆ ఊరిలో అందరూ అనుకుంటుంటారు అయితే ఒకరోజు హీరో భార్య నీ షాపింగ్ మాల్ ఆ ఇద్దరు కుర్రాళ్ళు కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తారు అయితే అలా ప్రవర్తించినప్పుడు హీరో వాళ్ళని కొడతాడు అది మనసులో ఉంచుకుని వాళ్లు ఒకరోజు హీరోయిన్ ఇంటి దగ్గరకు వచ్చి హీరోయిన్ నీ బలవంతం చేస్తారు 

ఇలా జరిగిన తరువాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు అని తెలుసుకుని వాళ్లకు వార్నింగ్ ఇస్తాడు అయితే ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఆ హీరో ఫ్ట్రెండ్ నీ చంపేస్తారు ఆ తరువాత హీరో వాళ్ళని ఏ విధంగా చంపాడు పగ తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ

ఇందులో చెప్పుకోవటానికి ఏమి లాడు రొటీన్ రివెంజ్ కథ !!!

13, డిసెంబర్ 2024, శుక్రవారం

హరికథ సంభవామి యుగే యుగే webseries పై నా అభిప్రాయం !!!


 రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ ,పూజిత పొన్నాడ,ప్రముఖ పాత్రలో నటించిన harikatha వెబ్ series తెలుగులో డిస్నీ + hotstar లో అందుబాటులో ఉంది ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1982 ప్రాంతంలో జరిగిన కథ గా చూపించటం జరుగుతుంది అనగనగా అరకు వ్యాలీ లో ఒక చిన్న గ్రామం ఆ ఊరిలో నాటకం వేసే ప్రతి రోజూ ఒక మర్డర్ జరుగుతుంది అక్కడ ఉన్న పోలీస్ లకు అసలు అర్థం కాదు ఆ నాటకంలో చూపించినట్టు  మర్డర్ కూడా అలాగే జరుగుతుంది ఇలా కథ నడుస్తున్న క్రమంలో శ్రీ రామ్ తన భార్యని పోగొట్టుకుని ఆ గ్రామం కి తను ఫ్రెండ్ ఉన్నాడు అని అక్కడకు వస్తాడు అక్కడకు వచ్చిన తరువాత తన స్నేహితుడ్ని కూడా కోల్పోతాడు అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ తను మొదలు పెడతాడు తను కూడా పోలీస్ కాకపోతే భార్యని పోగొట్టుకుని తనకు వినికిడి ప్రాబ్లం ఉంటుంది అందుకే తను పోలీస్ జాబ్ చేయడు తను ఎలాగో కొంతకాలం బ్రతికే ఉంటాడు 

అసలు ఆ మర్డర్ లు ఎందుకు జరుగుతున్నాయి దానికి కారణం ఎవరు అన్నది మిగిలిన కథ కథలో ఒక అంటారిని వర్గానికి చెందిన కుర్రాడు కథ కూడా ఉంటుంది మొత్తానికి 3 గంటలు 15 నిమిషాలు ఉంది బాగానే ఉంది వెబ్ సిరీస్ ఒకసారి చూడవచ్చు !!!

30, నవంబర్ 2024, శనివారం

వికటకవి webseries పై నా అభిప్రాయం !!!

 

Zee5 OTT లో అందుబాటులో ఉన్న వికటకవి వెబ్ సిరీస్ మన తెలుగు వెబ్ సిరీస్ నరేష్ ఆగస్త్య నటించిన webseries అసలు ఆలస్యం అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1960 70 కాలంలో జరిగిన కథ అనగనగా అమరగిరి అనే ఒక ప్రాంతం ఆ ఊరిలో ఒక అడవి ఆ అడవిలోకి వెళ్లిన వారందరూ వాళ్ళ జ్ఞాపకశక్తి కోల్పోతారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా మన హీరో హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు అయితే మన హీరోకి డిటెక్టివ్ అవ్వాలని ఆశ అయితే ఇలాంటి డిటెక్టివ్ ఆ అమరగిరిలో ఉండే ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం అని ఎలా వెళ్ళాడు 

అక్కడికి వెళ్ళిన తరువాత ఆ మిస్టరీ నీ చేధించడా లేదా అన్నది మిగిలిన కథ నాకెందుకో ఎన్నో మిస్టరీ లుని చూసిన ఆ కథ లాగ్ ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ఈ webseries అంటే webseries దాదాపు అన్ని అలాగే ఉంటాయి

సస్పెన్స్ కోరుకునే వారికి అక్కడక్కడ కనిపించింది కాకపోతే పెద్ద ఇంపాక్ట్ గా ఏమి లేదు కథ ను ముందే ఊహించ వచ్చు  సో మీకు ఖాళీ ఉంటే చూడండి లేకపోతే లేదు !!!

7, నవంబర్ 2024, గురువారం

Life stories movie review !!!

 Etv win OTT లో విడుదల అయిన Life stories movie review in Telugu 

ఈ కథ 5 కథలును చూపిస్తుంది ఇలాంటివి మనం ముందర కూడా చాలా చూశాం అలాంటివే కాకపోతే కొత్తగా ఏమి లేదు ఒక వ్యక్తి కార్ బుక్ చేసుకుని కార్ లో బయలుదేరతాడు 

అతడికి డ్రైవర్ కి మంచి ఫ్రెండ్ షిప్ అవుతుంది 

ఇంక 2 వ కథ ఒక వూరిలొ ఒక ముసలావిడ ఒక టీ కొట్టు నడుపుతుంటుంది గిరాకీ లేక డల్ గా నడుస్తుంది అప్పుడే ఒక కార్ లో ఒక వ్యక్తి ఒక కుక్కని దింపేసి వెళ్లి పోతాడు ఆ కుక్కని ఆ ముసలావిడ పెంచుకుంటుంది తద్వారా తన ఆదాయం కూడా బాగా మెరుగు అవుతుంది 

అలా మొత్తం 5 కథలు ఉంటాయి కానీ ఈ సినిమా అంతా ఏమి లేదు జస్ట్ below average movie ఆ 5 కథల్ని చివరికి అందరి పాత్రలు ఒకరికొకరు కలుపుతూ లాస్ట్ కి ఎండ్ చేస్తారు

ఆ ముసలావిడ charcter తప్పించి సినిమాలో అంతగా ఏమి లేదు అసలు !!!

5, నవంబర్ 2024, మంగళవారం

Ka movie review in telugu !!!

 

Ka movie review కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం !

కృష్ణ గిరి అనే ఒక గ్రామం అది 1970 ,80 కాలం ఆ ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడుతుంది ఆ ఊరిలోకి హీరో అభినవ్ వాసుదేవ్ కాంట్రాక్టు పోస్ట్ మెన్ కింద వెళ్తాడు అయితే హీరో ఒక అనాథ అనాథ ఆశ్రమం లో చిన్నప్పటి నుండి పెరుగుతాడు హీరో కి ఎవరు లేకపోవటం వల్ల అక్కడికి వచ్చే లెటర్ లు చదవటం చిన్నప్పటి నుండి చదవటం ఇష్టం 

అలా కృష్ణ గిరికి వెళ్లిన హీరో అక్కడ కు వచ్చిన లెటర్ లు కూడా చదువుతాడు అయితే ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతారు ka movie review 

అయితే అక్కడ హీరోకి అసలు పరిస్థితులు కొత్త కొత్తగా ఉంటుంది అసలు ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుందో తెలీదు అక్కడ పోస్ట్ మాస్టర్ కూతురు తో ప్రేమలో పడతాడు 

అయితే ఇదంతా ఒక kidnaper కి చెబుతాడు హీరో జరిగిన కథంతా

అసలు ఆ ఊరిలో ఏమి జరుగుతుంది అసలు ఆ అమ్మాయిలు మిస్ అవ్వటానికి కారణం ఏమిటి అసలు ka అంటే ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథ కొత్తగా ఉంది కాకపోతే కొద్దిగా లాగ్ ఎక్కువ అనిపించింది మొత్తానికి బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు kiran abbavaram సినిమాలు రొటీన్ సినిమాలు లాగా కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేసాడు సినిమా నాకు తమిళ్ సినిమా చూసినట్టు అనిపించింది 

మొత్తానికి బాగుంది ka movie review!!!

29, అక్టోబర్ 2024, మంగళవారం

Golam movie Review in Telugu !!!

 Golam movie review in Telugu amazon prime OTT లోకి వచ్చిన golam సినిమా మలయాళం ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా నచ్చుతుంది సింపుల్ కథ తో చుట్టు ఉండే పరిధులు ని చూపించటంలో మలయాళం సినిమాలు కి పెట్టింది పేరు ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ok sorry' పైన కూడా అదే మాట చెప్పాను కదా ఇప్పుడు చూద్దాం అని నిజంగా ఇప్పుడు చూద్దాం 

అది ఒక ఫార్మా కంపెనీ ఆఫీసు అందులో కొంతమంది ఉద్యోగస్తులు వాళ్లకు ఒక బాస్ సదా సీద గా రోజులు గడుస్తాయి అయితే అనూహ్యంగా వాళ్ళ బాస్ ఒకరోజు బాత్రూం లోకి వెళ్లి చనిపోతాడు golam movie Review అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది
అసలు వాళ్ళ బాస్ ఎలా చనిపోయాడు ఆత్మ హత్య లేక ఎవరైనా చంపేశారా అన్నది కథ
పోలీస్ లు కేసు ను విచారిస్తూ ఉంటారు అయితే ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు అన్నది మిగిలిన అసలైన కథ ఆ సస్పెన్స్ చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు సంతృప్తి ఉండదు Amazon prime OTT 
మొదట్లో కొద్దిగా స్పీడ్ గా మొదలయి తరువాత మధ్యలో కథ మరొక కోణంలో మారి చివరకు ఎలా ending అయింది అన్నది Malayalam suspence thrillers ఇష్టపడేవారికీ నచ్చుతుంది మీకు ఖాళీగా ఉంటే ఒక లుక్ వేయండి !!!
Golam movie Review in Telugu !!!

Netflix లో విడుదల అయిన inspector zende సినిమా పై నా అభిప్రాయం !!!!

  ఈ సినిమా Netflix లో విడుదల అయింది ఇన్స్పెక్టర్ zinde సినిమా ఈ సినిమా కామెడీ కింద చూపించటం జరిగింది కానీ ఇది నిజంగా జరిగిన కథ అని ఈ సినిమా ...