31, ఆగస్టు 2021, మంగళవారం

" తిమ్మరసు " సినిమా పై నా అభిప్రాయం !!!

 తిమ్మరసు సినిమా సత్యదేవ్  తెలుగులో ఒక మంచి నటుడు అని చెప్పు కోవచ్చు అలాంటి సత్య దేవ్ హీరో గా నటించిన సినిమా తిమ్మరసు 

సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం 

ఒక క్యాబ్ డ్రైవర్ మర్డర్ జరుగుతుంది ఆ డ్రైవర్ మర్డర్ కేస్ ఒక అమాయకుడు అయిన అబ్బాయి మీద పోలీస్ లు మోపి తాను చేయని నేరానికి తనకు 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు 

అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది , ఎవరు చేశారు అన్నది లాయర్ సత్యదేవ్ ఆ కేస్ ని సాల్వ్ చేస్తాడు ఇదే సినిమా కథ కానీ సినిమా బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు 

సత్య దేవ్ తన పాత్ర లో న్యాయం చేశాడు బాగుంది సినిమా !!!

30, ఆగస్టు 2021, సోమవారం

S.R. కల్యాణ మండపం సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజవారు రాణి గారు సినిమా హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా s. r కల్యాణ మండపం ఆ సినిమా లో కిరణ్ యాక్టింగ్ బాగానేఉంటుంది అది చూసి ఇది ఎలాగ ఉంటాదో చూద్దామని చూశాను ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

రాయలసీమ ప్రాంతంలో ఒక ఊరిలో ఉంటుంది S. R. కల్యాణ మండపం దానిని తర తారా లుగా హీరో కిరణ్ ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది అయితే హీరో వాళ్ళ నాన్న సాయి కుమార్ తాగుడు,పేకాట కు బానిసై ఊళ్ళో ఉన్న ఆస్తులన్ని అమ్మేసి చివరకు కల్యాణ మండపం కూడా తాకట్టు పెట్టాలని చూస్తాడు ఆ కల్యాణ మండపం మొత్తం బీర్ సీసాలతో చాలా గలీజ్ గా తయారు అవుతుంది వాటిలో పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ముందుకు ఎవరు రారు అలా ఉంటే ఎవరు వస్తారు

అయితే హీరో పక్కన ఉన్న టౌన్ లో college లో చదువుతుంటాడు ఈ విషయం వాళ్ళ అమ్మ హీరో కి చెబుతుంది 

వెంటనే హీరో అక్కడికి వచ్చి ఎలాగైనా ఆ కల్యాణ మండపాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఎలాగైతే sucsess సాధిస్తాడు అప్పుడే తన ప్రేమించే అమ్మాయి వేరొక అబ్బాయితో పెళ్లి అదే కల్యాణ మండపం లో బుక్ అవుతుంది ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి 

ఈ కథలో కొత్తదనం ఏమి లేదు రొటీన్ గానే ఉంటుంది జస్ట్ average నాకు 1 గంట సినిమా చూసే సరికి బోర్ గా అనిపించింది కానీ నేను మాత్రం exppertation టోన్ సినిమా చూసాను కానీ అది రీచ్ కాలేదు !!!😢😢😢

28, ఆగస్టు 2021, శనివారం

" వివాహ భోజనంబు " సినిమా పై నా అభిప్రాయం !!!

 వివాహ భోజనంబు కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా  ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

హీరో సత్య ఒక పిసినారి lic లో జాబ్ చేస్తుంటాడు అయితే హీరోని ఒక ధనవంతురాలు అయిన అమ్మాయి ప్రేమిస్తుంది అయితే హీరోకి ఏ విధమైన ఆస్తి, అందం, లేదని హీరోయిన్ వాళ్ళ నాన్న రిజెక్ట్ చేద్దామనకుంటాడు అయితే హీరోయిన్ తాత హీరో వాళ్ళ ఇంటి పేరు ఇష్టమని చెప్పి ఆ సంబంధం ఖాయం చేస్తాడు

అయితే ఎలాగోలా పెళ్లి అవుతుంది అయితే ఆ తురువాత కరోనా లోక్డౌన్ పెడుతుంది గవర్నమెంట్ అప్పుడు పిసినారి అయిన హీరో హీరోయిన్ ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా లోక్డౌన్ ఉన్న రోజులు ఎలా పోషించాడు అన్నది , హీరోయిన్ వాళ్ళ నాన్న ని ఎలా ఒప్పించాడు అన్నది మిగతా కథ 

ఈ సినిమా లో లోక్డౌన్ లో మనం వార్తల్లో చూసిన సరదా సన్నివేశాలు కనిపిస్తాయి

ఈ సినిమాలో చెప్పటానికి ఏమి లేదు రొటీన్ కథే కాకపోతే కొద్దిగా కరోనా కామెడీ కలిపి తీసిన సినిమా !!!

27, ఆగస్టు 2021, శుక్రవారం

" భూమిక " సినిమా పై నా అభిప్రాయం !!!

 భూమిక తమిళ్ డబ్బింగ్ సినిమా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!

ఈ కథలో ఐశ్వర్య భర్త ఒక అరసీటెక్చర్ ఒక పురాతనమైన పాడుబడిన ఒక అడవి ఆ అడవి మధ్యలో  అక్కడక్కడ ఇల్లులు, స్కూల్ లు పాడు బడి ఉంటాయి వాటిని అందంగా తీర్చి దిద్ది ఆ ప్రదేశాన్ని టౌన్ షిప్ గా తయారు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడు దానికి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు వెళ్తాడు 

అయితే అక్కడికి వెళ్లినప్పటినుండి అక్కడ ఆ ఇంట్లో ఎదో గందర గోళంగా ఉంటుంది కార్ accident లో చనిపోయిన తన ఫ్రెండ్ కృష్ణ మొబైల్ నుండి message లు వస్తుంటాయి 

మొదట ఆ message లు కృష్ణ పంపుతున్నాడు అనుకుంటారు కానీ చివరికి ఒక పాప message పంపిస్తుంది అసలు ఆ పాప కి వాళ్ళు ఉండే ప్రదేశానికి ఏమిటీ సంబంధం అసలు ఆ పాప ఎవరు ఎందుకు message పంపిస్తుంది అన్నది సినిమా కథ !!!

మరి అంతా ఓవర్ expectation తో సినిమా చూడ వద్దు పరవాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

24, ఆగస్టు 2021, మంగళవారం

" 200 Halla ho సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది హిందీ డబ్బింగ్ ఈ సినిమా కథ కొంచెం ఇంచుమించు మన వకీల్ సాబ్ సినిమాను పోలి ఉంటుంది ఇక కథ గురించి చూద్దాం !!!

ఈ కథ కోర్ట్ లో సుమారు 200 మంది ఆడవాళ్లు ముసుగులు వేసుకుని ఒక ఖైదీని అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపేస్తారు

అసలు ఎందుకు అంత దారుణంగా చంపారన్నది అంటే ఆ నెరస్తుడు ముంబైలోని ఒక బస్తీలో ఉండే దళిత జాతి స్త్రీలను అత్యచారం చేసి ఎదురు తిరిగినా వారిని అతి క్రూరంగా చంపేసేవాడు అక్కడ పెద్ద పెద్ద పొలిటీషన్స్ అతనికి పరిచయాలు ఉండేవి , పోలీస్ లతో కూడా అందుకే వాళ్ళు అతడిని ఏమి చేసేవారు కాదు 

ఆ నెరస్తుడ్ని పొడిచి చంపేసింతరువతా కొంతమందిని దళిత స్త్రీ లను అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు చూపెట్టి వాళ్లకు జీవిత ఖైదీ పడేలా చేశారు

చివరకు ఆ మహిళలను ఎలా బయటకు తీసుకు వచ్చారు అన్నది మిగతా కథ 

సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు 👍👍👍 !!!

22, ఆగస్టు 2021, ఆదివారం

నయనతార నటించిన " నేత్రికన్ " సినిమాపై నా అభిప్రాయం !!!

 నేత్రికన్ తమిళ్ డబ్బింగ్ సినిమా నయనతార ప్రధాన పాత్రలో నటించింది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు ఎలాగ ఉందొ చూద్దాం !!!

నయనతార ఒక సీబీఐ ఆఫీసర్ అయితే ఒక accident లో తన రెండు కళ్ళు పోగొట్టుకుంటుంది విలన్ ఒక సైకో 

డాక్టర్ లాగా పనిచేస్తూ అమ్మాయిల్ని వీడియో తీస్తూ blackmail చేస్తూ వాళ్ళని లోబర్చ్ కుంటూ వాళ్ళని చిత్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు 

అయితే విలన్ కన్ను నయనతార మీద పడుతుంది ఆ తరువాత ఆ విలన్ నుండి ఆ అమ్మాయిల్ని, ఎలా కాపాడింది, చివరికి ఆ సైకో విలన్ ని ఎలా పోలీస్ లకు పట్టించింది అన్నది మిగతా కథ 

చూడటానికి బాగుంది సినిమా ఒక సారి చూడవచ్చు !!!

రొటీన్ గానే ఉంది గాని సినిమా బాగుంది 👍👍👍

21, ఆగస్టు 2021, శనివారం

"ఆదివారం పండగొస్తే - ఆదివారం వానొస్తే "

 మనకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టమైన రోజు ఏదైనా ఉందంటే అది ఆది వారమే ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి కానీ ఆ రోజు పండగ వచ్చిన, లేదా వాన వచ్చిన చాలా బాగోదు

ఎందుకంటే పండగంటే సెలవు కానీ ఆ పండగ ఆదివారం వస్తే ఎందుకో నచ్చదు మిగిలిన వారాలు అన్ని ఉండగా ఒక ఆదివారం మాత్రమే పండగ వచ్చిన లేదా ఆ రోజు వాన వచ్చిన నచ్చదు ఎందుకంటే వారమంత కష్టపడి ఆదివారం ఎన్నో ప్లాన్స్ తో ఉంటారు బయటకు వెల్దామని షాపింగ్ కి వెల్దామని ఇలా ఎన్నో ఉంటాయి 

కానీ ఆరోజు వానోచ్చిన పండగ వచ్చిన అసలు ఇష్టం ఉండదు కానీ స్కూల్ లైఫ్ లో రాఖీ పండగ ఆదివారం వస్తే మాత్రం చాలా ఆనంద పడేవారము ఎందుకంటే ఆదో సరదా అంతే 

అన్నట్టు రేపు రాఖీ పండగ మరియు ఆదివారం కదా అందరికి 

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు !!!💐💐💐

18, ఆగస్టు 2021, బుధవారం

" ఒరేయ్ బామ్మర్ది " సినిమాపై నా అభిప్రాయం !!!

 బిచ్చగాడు సినిమా తీసిన శశి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఒరేయ్ బామ్మర్ది సిద్దార్థ ,జీ. వి.ప్రకాష్ కుమార్ నటించిన సినిమా ఇక ఈ కథ చూద్దాం !!!

ఒక అక్క , ఒక తమ్ముడు ( జీ. వి ప్రకాష్ కుమార్ ) చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు అయితే వాళ్ళను వాళ్లే చూసుకుని జాగ్రత్తగా పెరుగుతారు వాళ్లకు ఒక అత్త కూడా ఉంటుంది ఆవిడ కూడా సహాయపడుతుంటుంది ప్రకాష్ బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అలాగే ఒక సారి బైక్ రేసింగ్ లో పాల్గొంటే ట్రాఫిక్ పోలీస్ సిద్దార్థ్ ప్రకాష్ ను పట్టుకుని అతనికి సిగ్గు పడి మరల రేసింగ్ వెళ్లకుండా  నైటీ వేసి అది వీడియో తీసి యూట్యూబ్ లో పెడతాడు 

అది పగను పెంచుకుని సిద్దార్థ పై పగను పెంచుకుంటాడు ప్రకాష్ అయితే అనుకోకుండా తన అక్కకు భర్త గా సిద్దార్థ తో పెళ్లి జరుగుతుంది

అయితే ఆ పెళ్లి ప్రకాష్ కి ఇష్టం ఉండదు అయితే ప్రకాష్ ని సిద్దార్థ్ ఎలా ఒప్పించాడు వారిద్దరూ ఎలాగ కలిశారు అనేది మిగతా కథ 

సినిమా అంతా సెంటిమెంట్ మీద నడుస్తుంది పరవాలేదు ఒకసారి చూడ వచ్చు !!!

15, ఆగస్టు 2021, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన "చతుర్ముఖం " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా లో విడుదల అయింది చతుర్ముఖం సినిమా మలయాళ డబ్బింగ్ సినిమా కానీ సినిమా మాత్రం మంచి exciting గా ఉంది సినిమా కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

ఇందులో హీరోయిన్ , హీరో సి.సి కెమెరా బిసినెస్ చేస్తుంటారు అయితే హీరోయినికి ఫోన్ వాడకం చాలా ఇష్టం సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది అయితే అనుకోకుండా తన వాడుతున్న ఫోన్ నీళ్లలో పడి చెడిపోతుంది అయితే ఆన్లైన్ లో తక్కువుగా ఫోన్ వస్తుంది అని ఒక కొత్త రకం ఫోన్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంది 

ఆ ఫోన్ రానే వస్తుంది కానీ ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి తన జీవితంలో అనుకోని సంఘటనలు, ఎప్పుడు ఉహించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చివరకు తనకు ఆ ఫోన్ వచ్చిన 21 రోజులలో చనిపోతుంది అని తెలుస్తుంది 

ఇటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కువున్నది అన్నది సినిమా కథ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా బాగుంది ఖచ్చితంగా ఒక సారి చూడ వచ్చు బాగుంది సినిమా 👍👍👍👌👌👌 !!!

12, ఆగస్టు 2021, గురువారం

ఆహా Ott లో విడుదల అయిన " సూపర్ డీలక్స్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా కథ కొంచెం విచిత్రంగా, విడ్డురంగా ఉంటుంది ఒక నలుగురు కుటుంబాలకు సంబంధించిన కథ ఇక కథ గురించి మాట్లాడుకుందాం !!!

కథలో మొదటి కుటుంబం సమంత, ఫాహాద్ ఫాసిల్ భార్య భర్తలు అయితే వీరిద్దరి సరి అయిన ప్రేమ అనురాగలు ఉండవు అయితే సమంత తన college చదివే రోజుల్లో బాయ్ ఫ్రెండు తో సాన్నిహిత్యం గా ఉంటుంది రూమ్ లో కలుసుకుంటారు కూడా  అయితే ఈ విషయం తన భర్తకు తెలిసిపోతుంది ఆ తరువాత ఏమి జరుగుతుంది అన్నది కథ

కథలో రెండవ కుటుంబం కట్టుకున్న భార్యను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు భర్త అయితే చాలాకాలం తరువాత తిరిగివస్తాడు ఎంతో కాలం ఎదురుచూసిన భార్య, కొడుకు, తన భర్త వస్తాడు కానీ ఒక హిజ్రా లాగా అది చూసి అందరూ షాక్ తింటారు ఆ తరువాత ఆ కుటుంబం లో ఏర్పడిన పరిస్థితులు మిగతా కథ

కథలో మూడవ భాగం కొంతమంది చదుకునే అబ్బాయిలు కలిసి బ్లూ ఫిల్మ్ లు చూస్తారు అయితే అనుకోకుండా  ఫిల్మ్ లో ఒక అబ్బాయి తల్లి నటిస్తుంది ఆ తరువాత ఏమి జరిగింది అన్నది కథ

ఇందులో హిజ్రా పాత్రలో చేసిన విజయ్ సేతుపతి acting గురించి కచ్చితంగా చెప్పుకోవాలి 

ఇందులో నటించిన వారు చాలా బాగా చేశారు కానీ సినిమా మాత్రం కథ ఇలాగ ఉంటుంది అని conclusion కి మాత్రం రాలేము 

జస్ట్ టైం పాస్ అంతే సినిమా !!!

8, ఆగస్టు 2021, ఆదివారం

"ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా ఎప్పుడో 2019 విడుదల అయ్యింది ఎప్పటి నుండో చూద్దాం అనుకుని నిన్న చూసాను ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక nsa ఆఫీసర్ మిలట్రీ కి సంబంధించింది అయితే తన తల్లి తండ్రుల్ని కశ్మీర్ క్లో అన్యాయంగా చంపేస్తాడు పాకిస్తాన్ తీవ్రవాది ఘజి బాబా అయితే అది దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మిలో జాయిన్ అవుతాడు అది ఎంతో కష్టపడి చివరికి ఘజి బాబా ను పట్టుకుంటాడు 

కానీ ఆ తరువాత అతన్ని వదిలెనుచటానికి ఘజి బాబా ముఠా సభ్యులు ఒక మినిస్టర్ కూతుర్ని కిడ్నప్ చేసి తద్వెరా ఘజి బాబా ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు

ఆ తరువాత చివరకు కథ ఏమిటన్నది మిగతా కథ కథ రోటీనగానే ఉంది కొత్తదనం ఏమి లేదు కానీ దేశం గురించి సినిమా కాబట్టి ఒకసారి చూడ వచ్చు !!!

6, ఆగస్టు 2021, శుక్రవారం

ఫేక్ message లు ఎందుకు ఫార్వర్డ్ చేస్తారో ?

 అవును సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏది ఫాక్ట్, ఏది ఫేక్ అసలు అర్థం కావటం లేదు 2000 రూపాయలు త్వరలో రద్దు అవ్వటం, ఒక్కొక్కరికి 1 లక్ష 30 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందంటూ అసలు ఇలాంటి message లు ఎందుకు ఫార్వర్డ్ అవుతున్నాయో అర్థం కావటం లేదు

ఇలా అయితే నిజమైన message లు కూడా ఫేక్ గా కనిపిస్తాయి  !!!

2, ఆగస్టు 2021, సోమవారం

" barot house " సినిమాపై నా అభిప్రాయం !!!

 Barot house జీ5 ott లో విడుదల అయింది ఇక ఏ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

ఓ పెద్ద హౌస్ అందులో ఒక ఫామిలీ భార్య భర్తలు, 3 ఆడ పిల్లలు, 1 అబ్బాయి, నానమ్మ , బాబాయి అంత సాఫీగానే సాగుతున్న జీవితంలో అనుకోకుండా పెద్ద అమ్మాయి చనిపోతుంది , ఆ తరువాత 2 వ అమ్మాయి చనిపోతుంది 

అసలు ఇంతకీ ఈ మర్డర్ లు ఎవరు చేస్తున్నారు ఎందుకు ఇలాగ జరుగుతుంది అన్నది సినిమా కథ 

తప్పకుండా ఒక సారి చూడ వచ్చు క్రైమ్ థ్రిల్లర్ మూవీ !!!

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...