31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 💐💐💐

 కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరి ఆశలు నెరవేరాలని కాంక్షిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 !!!

" శ్యామ్ సింగ రాయ్ " సినిమా పై నా అభిప్రాయం !!!


శ్యామ్ సింగ రాయ్ నాకు ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనిపించింది ఇక నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా డిసెంబర్ 24 విడుదల అయింది థియేటర్ లలో ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!

ఈ సినిమా మొదట వాసుదేవ్ అనే మన హీరో నాని సినిమా అంటే చాలా ఇష్టం చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి దానిని మంచి ప్రొడ్యూసర్ కి చూపించి తద్వారా సినిమా రంగంలోకి అడుగుపెడదాం అనుకుంటాడు ఆ క్రమంలోనే హీరోయిన్ కృతి శెట్టి పరిచయం అవుతుంది ఆమెతో సినిమా తీస్తాడు అది బాగా నచుతుంది ప్రొడ్యూసర్ కి వెంటనే సినిమా కూడా తీస్తారు ఈ క్రమంలో హీరో, హీరోయిన్ లో ప్రేమ లో పడతారు
ఇంతలోనే ఒక అనూహ్యమైన మార్పు వస్తుంది హీరో నాని ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే తను తీసింది బెంగాల్ రచయిత శ్యామ్ సింగ రాయ్ రాసిన నవలా నుండి కాపీ కొట్టినట్టు కేస్ వేస్తారు
అక్కడినుండి అసలు కథ మొదలవుతుంది అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు, శ్యామ్ సింగ రాయ్ కి, వాసుదేవ్ ఏంటి సంబంధం అన్నది మిగతా కథ పునర్జన్మ నేపథ్యంలో ఉంటుంది సాయి పల్లవి పాత్ర కూడా బాగుంటుంది సినిమా అయితే బాగుంది ఒక సారి చూడ వచ్చు 
1960 ,1970 ఆ టైంలో బెంగాల్ లో జరిగిన సంఘటనలు, శ్యామ్ సింగ రాయ్ ఎలా ఎదిరించాడు అసలు శ్యామ్ సింగా రాయ్ చివరకు ఏమి అయ్యాడు అన్నది సినిమా కథ 👍👍👍


 

 

తలా అజిత్ " వాలిమై" ట్రైలర్ చూసారా ?

 తమిళ్ యాక్టర్ లలో మంచి పేరున్న యాక్టర్ అజిత్ మన తెలుగు హీరో rx 100 కార్తికేయ విలన్ గా వస్తున్న సినిమా వాలిమై ట్రైలర్ ఎలాగ ఉందొ చూడండి 

గమనిక : ట్రైలర్ తమిళ్ లో ఉంది గమనించగలరు 


28, డిసెంబర్ 2021, మంగళవారం

"మిన్నల్ మురళి " సినిమా పై నా అభిప్రాయం !!!


మలయాళం డబ్బింగ్ సినిమా మిన్నల్ మురళి netflix ott లో తెలుగులో అందుబాటులో ఉంది టవినో thamos హీరోగా చేసిన సినిమా ఇక కథ గురించి చూద్దాం !!!
ఒక ఊళ్ళో ఉండే ఇద్దరు వ్యక్తులు వాళ్ళవి వేరు, వేరు జీవితాలు వాళ్ళ పేర్లు శిభూ,జైసన్ ఇద్దరు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు అయితే అనుకోకుండా ఒక రోజు వేరు వేరు ప్రదేశాల్లో వీరిద్దరి మీద మెరుపు మెరిసి పిడుగు పడుతుంది అప్పటి నుండి వాళ్ళకి కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయి అందులో జైసన్ మంచి కోసం వాడితే శిబూ మాత్రం తన స్వార్థం కోసం వాడతాడు వాళ్ళిద్దరికి శక్తులు వచ్చాయని వాళ్ళ గ్రహిస్తారు వాళ్ళు ఇద్దరు ఎలా కలిశారు వారిద్దరికీ ఒకరికి ఒకరు పోటీ ఎలా వచ్చింది చివరికి గెలుపు ఎవరిది అన్నది సినిమా కథ 
చూస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా, ఆశ్చర్యంగా ఉంది సినిమా బాగుంది బలే సరదాగా ఉంది నిజంగా ఇలాగ జరుగుతుందా అని ఫాంటసీ లాగా ఉంది కాని బాగుంది సినిమా 👍👍👍

మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది సినిమా !!!


 

26, డిసెంబర్ 2021, ఆదివారం

శింబు "మనాడు " సినిమా పై నా అభిప్రాయం !!!


శింబు, sj సూర్య , ప్రేమ్ జీ ప్రధాన పాత్రల్లో చేసిన తమిళ్ సినిమా మనాడు తమిళ్ లో హిట్ గా నిలిచింది అయితే దీనిని తెలుగులో కూడా విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకో విడుదల అవలేదు నిన్న sony liv ott లో విడుదల అయింది అది తెలుగులో ఉంది 
ఇక ఈ సినిమా కథ ఒకసారి చూద్దాం దుబాయ్ నుండి ఇండియాకి ఫ్రెండ్ పెళ్లి కోసం వస్తాడు హీరో అదే ఫ్లైట్ లో హీరోయిన్ కూడా ఉంటుంది అయితే ఫ్లైట్ scene మాత్రం హైలైట్ సినిమా కి ఎందుకంటే ప్రతి scene చివరకు అక్కడి నుండి మొదలవుతుంది మీకు సీసీ కెమెరా లు లూప్ మోడ్ లో పెడితే ఎలాగ ఉంటుందో ఈ సినిమా అలానే ఉంటుంది ముందరికి వెళ్తుంది మరల వెనకకు వస్తుంది హీరో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తాడు అక్కడి పెళ్లి కూతురిని తన వేరే ఫ్రెండ్ తో పెళ్లి చేద్దాం అనుకుంటాడు అంతలో పోలీస్ ఆఫీసర్ సీఎం ని చంపడానికి ఒక మనిషిని errange చేస్తాడు అనుకుండా ఆ వ్యక్తి ఇతని కారు కింద పడి గాయలపాలవుతాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తి ప్లేస్ లోకి హీరోని పంపిస్తాడు ఇలా ఈ scene రిపీట్ అవుతూనే ఉంటుంది


ఇలా కథ ముందుకు వెళ్తుంది మరల ఫ్లైట్ scene లో వెళుతుంది ఇలా రిపీట్ అవుతుంది ఈ సినిమా కొంచెం confuse గా ఉన్న మొత్తానికి బాగుంది వెంకట్ ప్రభు సినిమాలు అన్ని ఇలాగ డిఫరెంట్ గానే ఉంటాయి బహుశా ఇది తెలుగులో రీమేక్ చేస్తారు ఏమో అందుకే తెలుగులో థియేటర్ లో విడుదల అవ్వలేదు 
ఏదైతేనేం సినిమా బాగుంది కానీ ఏకాగ్రత తో సినిమా చూడాలి హీరోకి, విలన్ కి ఒక రోజు మాత్రమే రిపీట్ అవుతుంది  👍👍👍


 

24, డిసెంబర్ 2021, శుక్రవారం

"రాధే శ్యామ్ " ట్రైలర్ చూసారా ?

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత దాదాపు 3 సంవత్సరాలు తరువాత వస్తున్న సినిమా ఇది ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది ఎలా ఉందో చూద్దాం !!!

22, డిసెంబర్ 2021, బుధవారం

" 420 IPC " సినిమా పై నా అభిప్రాయం !!!

420 IPc సినిమా జీ 5 ott లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

ఒక సాధారణ చార్టెడ్ అకౌంటెంట్ పై తను పని చేసే ఒక కంపెనీ లో చెక్ దొంగతనం జరుగుతుంది అయితే ఆ దొంగతనం చేయలేదు కానీ తానే చేసినట్టు ఆధారాలు అన్ని ఉంటాయి

అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న లాయర్ ఆ కేస్ ని వాదిస్తాడు అయితే చివరకు ఏమి జరిగింది అన్నది కథ చూడటానికి simple గా ఉన్న ఇందులో కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి 

బాగుంది మంచి టైం పాస్ చూడ వచ్చు

తాను చెక్ దొంగతనం చెయ్యడు కానీ అంతకన్నా పెద్ద దే చేస్తాడు అయితే ఈ కేస్ గురించి వివరాలు లాగితే అవి బయట పడతాయి బాగుంది ఫస్ట్ కొంచెం స్లో గా ఉన్న తరువాత బాగానే ఉంది !!! 

నాని " శ్యామ్ సింగరాయ్ " ట్రైలర్ చూసారా ?

 Natural స్టార్ నాని , సాయి పల్లవి, కృతి శెట్టి తాజాగా చేసిన సినిమా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ విడుదల అయ్యింది అది ఒక లుక్ వేద్దాం 👇👇👇

ఈ సినిమా ట్రైలర్ !!!


20, డిసెంబర్ 2021, సోమవారం

పుష్ప 1 సినిమా పై నా అభిప్రాయం !!!

 పుష్ప part 1 సినిమా december 17 తేదీన పాన్ ఇండియా సినిమా గా విడుదల అయింది అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఈ సినిమా 1990 2000 సంవత్సరం లో జరిగినట్టు సుకుమార్ చూపించారు కథ ఏమిటంటే శేషాచల అడవుల్లో మాత్రమే దొరికే ఎర్ర చందనం smugling చేసే చిన్న పాటి కూలి నుండి వాటిని మొత్తం ఆ సామ్రాజ్యాన్ని ఏలే smuggler దాకా ఎలా చేరాడు అన్నది పుష్ప పార్ట్ 1

అయితే అలా smuggling లో ఎంతమంది పెద్ద తలకాయలు ఉన్న వారిని అందరిని దాటి  చివరకు ఎలా సాధించాడు అయితే వారి అందరి కన్నా ఒక పోలిస్ ఆఫీసర్ కి పుష్ప రాజ్ కి మధ్య గొడవ ఎలా జరగబోతుంది అన్నది 2 వ భాగంలో చూపించా బోతున్నాడు సుకుమార్

సునీల్ ఇందులో విలన్ పాత్రలో బాగానే చేసాడు అనసూయ సునీల్ భార్య పాత్రలో పాత్రకు న్యాయం చేసింది

అరవింద్ ఘోష్, రావు రమేష్, ముఖ్యంగా మలయాళం లో బాగా పేరున్న యాక్టర్ ఫాహాద్ ఫాసిల్ ఇందులో పోలీస్ పాత్రలో నటించాడు

మొత్తానికి చెప్పుకుంటే పరవాలేదు ఒక సారి చూడ వచ్చు ఇక రెండవ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి కానీ బడ్జెట్ కి సంబంధించి ఆ విలువలు ఎక్కడ కనిపించ లేదు సినిమా లో 

ఏది ఏమైనా సుకుమార్ లెక్క ఎక్కడో తప్పింది !!!

17, డిసెంబర్ 2021, శుక్రవారం

" కురుప్ " సినిమా పై నా అభిప్రాయం !!!


Dulqar సల్మాన్ హీరో గా చేసిన మలయాళం సినిమా  కురుప్ ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం సల్మాన్ ఏ పాత్ర అయిన చాలా బాగా నటిస్తాడు ఇక ఈ సినిమా కథ చూద్దాం !!!
ఈ కథ పోలీస్ స్టేషన్ రిటైర్ అవుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్స్ కొత్తగా వచ్చిన ఒక పోలీస్ కురుప్ ఫైల్ చూడటం జరుగుతుంది కురుప్ ఒక క్రిమినల్  ఒక క్రైమ్ చేసి డబ్బులు చాలా లాజిక్ గా సంపాదిస్తాడు అక్కడి నుండి వేరొక చోటికి మరొక పేరు తో చలామణి అవుతాడు ఇలాగ పోలీస్ లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు
సినిమా చివరకు దొరికాడా లేదా అన్నది క్లైమాక్స్ లో చూడాలి సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా సాగుతుంది 2 హాఫ్ నుండి అసలు కథ మొదలవుతుంది 
చూడటానికి బాగుంది సినిమా !!!

బహుశా ఇది నిజంగా జరిగిన కథ అనుకుంటా కానీ బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు   !!!

 

15, డిసెంబర్ 2021, బుధవారం

Netflix లో విడుదల అయిన " she " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 


She వెబ్ సిరీస్ netflix లో అందుబాటులో ఉంది ఇక ఈ కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ముంబాయ్ లో జరిగే డ్రగ్స్ దందా యొక్క ఆశలు నాయకుడిని కనుగొనడానికి ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ని call girl లాగా రంగం లోకి దించుతారు 

ఈ వెబ్ సిరీస్ పెద్ద వారికి మాత్రమే   అయితే ఆ కానిస్టేబుల్ ఆ నాయకుడిని కనుక్కుందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ కథ అంత చాలా అడల్ట్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ 

అయితే దీనికి కోన సాగింపు కూడా ఉంది !!!

"Chumbak" సినిమా పై నా అభిప్రాయం !!!


Chumbak సినిమా చిన్న కథ సోనీ లివ్ ott లో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ముంబై లో ఒక చిన్న టీ కొట్టులో పనిచేసే కుర్రోడు తాను సొంతగా తన ఊరిలో జ్యూస్ షాప్ పెట్టుకుని బ్రతుకుదాం అనుకుంటాడు దానికి కొంచెం అమౌంట్ పోజేసుకుంటాడు అయితే తన ఫ్రెండ్ ఒకడు ఆ అమౌంట్ ని ఒక కంపెనీ లో డిపాసిట్ చేస్తే డబల్ అవుతుంది అని నమ్మించి అందులో కట్టిస్తాడు

అయితే ఆ కంపెనీ మొత్తానికి దివాళా తీస్తుంది తాను మోస పోయానని తెలుసుకుని చాలా బాధ పడతాడు తన బెస్ట్ ఫ్రెండ్ మరొకడు మోసాన్ని, మోసంతో జయించాలని చెప్పి లాటరి అని చెప్పి అందరికి మెసేజ్ లో పంపిస్తాడు 

ఆ మెసేజ్ చూసి ఒక అమాయకుడు వారిని సంపాదిస్తాడు అయితే ఆ అమయకుడ్ని వల్ల ఎలా మోసం చేశారు, చివరకు కథ ఏమి అయ్యి ఉంటుంది అన్నది మిగతా కథ 

మరి అంత దారుణంగా లేదు బాగానే ఉంది ఒకసారు చూడ వచ్చు !!!

13, డిసెంబర్ 2021, సోమవారం

" మా ఊరి పొలిమేర " సినిమా పై నా అభిప్రాయం !!!

 

మా ఊరి పొలిమేర ఈ సినిమా డిస్నీ hotstar ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం ఇందులో గెటప్ సీను, సత్యం రాజేష్, బాలదిత్య ప్రధాన పాత్రలో చేశారు ఇక కథ ఎలా ఉందో చూద్దాం !!!

రాజేష్, బాలదిత్య అన్నదమ్ములు, గెటప్ శీను కూడా వీళ్ళతో పాటు కలిసే పక్క పక్కనే ఉంటారు ఇక చిన్న పల్లెటూరు అయితే ఆ ఊరిలో కొందరు చనిపోతుంటారు అయితే అక్కడక్కడ చేత బడి చేసినట్టు నిమ్మకాయలు, ముగ్గులు, పుర్రెలు ఇవన్నీ కనిపిస్తాయి

అయితే ఈ సినిమా కొన్ని సన్నివేశాలు పెద్దలకు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన వారు చూడాలి ఈ సినిమా అదే ఊరిలో ఒక గర్భవతి కూడా చనిపోతుంది రాజేష్ ని అనుమానించి అతడిని ఆ చితిలోనే వేసి చంపేస్తారు ఇంతకీ ఆ చేతబడులు చేసేది సత్యం రాజేష్ అని అతడిని చంపేస్తారు

బాలదిత్య పోలీస్ కానిస్టేబుల్ తన అన్నయ్య చావుకు కారణం ఏమిటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అందులో నిజాలు తెలుసుకుంటాడు ఇంతకీ ఆ ఊరిలో చేతబడులు చేసేది వాళ్ళ అన్నయ్య రాజేష్ కానీ పైకి మాత్రం మంచివాడిలా నటిస్తాడు అసలు ఎందుకు ఇలా చేసాడు అన్నది చూడాలి సినిమా దీనికి కోన సాగింపుగా 2 పార్ట్ కూడా ఉంది క్లైమాక్స్ లో చూపిస్తాడు వాళ్ళ అన్నయ్య బ్రతికే ఉంటాడు అది కూడా కేరళలో చూపిస్తాడు పర్వాలేదు చిన్న సినిమా అయినా బాగానే డీల్ చేశారు over Expertation తో కాకుండా మాములుగా కళాక్షేపం కోసం ఒక సారి చూడవచ్చు 

కొన్ని scene లు మాత్రం పెద్దవారికి మాత్రమే !!!

11, డిసెంబర్ 2021, శనివారం

"కొండ పొలం " సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఉప్పెన సినిమా మంచి విజయం సాదించింది ఆ సినిమా తర్వాత హీరో vishnav తేజ్ హీరోగా చేసిన రెండవ సినిమా కొండ పొలం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, క్రిష్ జాగర్లమూడి direction లో వచ్చిన సినిమా ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

ఈ కథ ఒక నవల ఆధారంగా తీసిన సినిమా అని మొదటి టైటిల్స్ లో చెప్పటం జరిగింది హీరో సివిల్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కి వెళ్తాడు అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం బాగా చెప్తాడు అయితే అక్కడ నీ గురించి చెప్పు అనేకడికి హీరో తన కథ గురించి చెప్పటం జరుగుతుంది

హీరో వాళ్ళ కుటుంబం గొర్రెల మేపుకునే కుటుంబం వాళ్ళ గ్రామం ఎక్కడో అడవులు దగ్గర ఉంటుంది అయితే వర్షాలు సరిగ్గా పడక ఆ ఊరిలో గొర్రెలు మేపుకునేవారు కొన్నాళ్ళు పాట గొర్రెలని అడవులలోకి కొడలపైకి తొలికెళ్తారు మరల వాన వచ్చి అంతా సక్క బడ్డక వస్తారు అయితే వాళ్ళ కుటుంబం లో అందరికంటే హీరో ఎక్కువ చదువుకుంటాడు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు 

హీరో వాళ్ల తాత హీరో ని వాళ్ల నాన్నతో పాటు తోడు వెళ్ళమని చెబుతాడు ఆ వెళ్ళేవారిలో హీరోయిన్ కూడా ఉంటుంది అయితే ఆ అడవిలో గొర్రెలు మెపే వారి కష్టాలు గురించి దొంగలు, గొర్రెల మందులను పెద్ద పులి నుండి కాపాడటం ఇది commercial సినిమా కాదు మన చుట్టూ ఉండే పరిసరాలను మనం కపడుకోకపోతే మన మనుగడకు ముప్పు ఎలా వస్తుంది అన్నది కథ


అయితే హీరో ఈ కథ నుండి ఏమి తెలుసుకున్నాడు అన్నది కథ హంగులతో, ఆర్భాటలు గురించి చూసే సినిమా కాదు ఇది వర్షం పడక, అసలు పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అడవులు ఇష్టం వచ్చినట్టు నరికేయటం వల్ల ఏమి జరుగుతుంది అని చెప్పే కథ !!!



 


9, డిసెంబర్ 2021, గురువారం

RRR ట్రైలర్ చూసారా 👌!!!

 రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన rrr సినిమా ట్రైలర్ ఇప్పుడే విడుదల అయ్యింది ట్రైలర్ బాగుంది

రాజమౌళి ప్రేక్షకుడి ఆలోచన విధానాన్ని అంచనా వేయడంలో దిట్ట అందుకే దర్శకధీరుడు అంటారు రోమాలు నిక్క పొడిచేలా ఉంది ట్రైలర్ 

ఇక ఫాన్స్ గురించి చెప్పక్కరలేదు ఇంతకీ ఆ ట్రైలర్ ఇక్కడ ఉంది చూడండి 👇👇👇


" స్కైలాబ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 


స్కైలాబ్ సినిమా డిసెంబర్ 4 తేదీన విడుదల అయింది మన పెద్ద వాళ్ళు చెప్పేవారు కదా ఒకప్పుడు అదేదో స్కైలాబ్ అని ఆకాశం నుండి భూమి మీదకి పడిపోతుంది అని అప్పట్లో కోళ్లు, మేకలు కోసుకుని తినేసేవారు అని అదే కధాంశంతో వచ్చింది ఈ సినిమా ట్రైలర్ చూడటానికి ఆసక్తి గా ఉంది ఇక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

 అది బండ లింగంపల్లి అనే పల్లెటూరు ఆ ఉరిలోకి చిన్న మెడికల్ క్లినిక్ పెట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు సత్య దేవ్ అదే ఊరిలో ఉండే ఒకప్పుడు బాగా బతికిన రాహుల్ రామ కృష్ణ ఊరిలో అంత అప్పులు చేసి అందరూ చేత తిట్టులు తిడుతుండేవారు ఇక వీళ్లిద్దరూ కలిసి ఎలాగైనా క్లినిక్ పెడతాం అనుకుంటారు 

హీరోయిన్ నిత్యా మీనన్ పత్రికలకు ఏవో పిచ్చి కథలను పంపించి ఎలాగైనా మంచి రచయిత్రి కావాలని అనుకుంటుంది  అప్పుడే 1979 వ సంవత్సరం అప్పుడు స్కైలాబ్ ఉరి మీద పడింది అని చెప్పి రేడియో లో వినిపిస్తుంది 

అదే సమయంలో స్కైలాబ్ పడుతుంది అన్న వార్త విని ఆ ఊరిలో అందరూ కంగారు పడుతుంటారు సినిమా తీసుకున్న కథ బాగానే ఉంది కాని తీయటం లో ఎక్కడో ఏదో మిస్ అయింది 

స్క్రీన్ మీద అంతా ఆసక్తిగా అయితే లేదు అలా స్లో గా నడుస్తుంది అయితే చివరకు స్కై లాబ్ ఏమి అయింది అన్నది సినిమా కథ

జస్ట్ average అంతే పెద్ద సినిమా ఏమి బాగోలేదు మామూలుగానే ఉంది !!!

8, డిసెంబర్ 2021, బుధవారం

Netflix లో విడుదల అయిన "స్క్విడ్ గేమ్" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 ఇది బహుశా కొరియన్ సినిమా అనుకుంటా ఇటీవల ఈ సినిమా పేరు ఎక్కడ విన్న వినిపించేది ఇది ఎప్పుడో విడుదల అయింది కానీ మొన్న తెలుగులో డబ్ చేశారు netflix లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!

కొరియా లో అవసరానికి డబ్బులు అప్పు తీసుకుని తీర్చలేని వారిని , డబ్బు అవసరం ఉండే వారిని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారితో ఆటలు ఆడిస్తా


రు అయితే ఇక్కడ ఆటలో గెలిచిన వారు పైన ఆటలకు వెళ్తారు ఓడిన వారు పై లోకాలకు వెళ్తారు అదే వాళ్ళని చంపేస్తారు 


ఇది చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు లాగే ఉంటాయి కానీ చాలా డేంజర్ గా ఉంటాయి ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్ లు ఉంటాయి అందులో ఓడిన వారిని వెంటనే చంపేస్తారు

చాలా ఆసక్తిగా ఉంటుంది సిరీస్ అంతా దాదాపు 8 గంటలు పైనే ఉంటుంది కానీ ప్రతి ఎపిసోడ్ బాగుంటుంది



బహుశా ఇది చిన్న పిల్లలు చూడకపోవటం మంచిది ఎందుకంటే హింస బాగా ఎక్కువుగా ఉంది ఇందులో ముందర అందరూ కొరియన్ ఓకే లాగా ఉంటారు చూసే కొద్దీ ఎవరెవరు అని తెలుస్తుంది అయితే సిరీస్ అయితే బాగుంది చూడ వచ్చు 👍👍👍

 

4, డిసెంబర్ 2021, శనివారం

" మంచి రోజులొచ్చాయి " సినిమా పై నా అభిప్రాయం !!!

 

మంచి రోజులొచ్చాయి మారుతి direction లో వచ్చిన సినిమా ఆహా ott లో కూడా అందుబాటులో ఉంది మెహరిన్, సంతోష్ శోభన్ హీరో, హీరోయిన్ గా చేసిన సినిమా ఎలా ఉందో కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మారుతి అంటే రొమాన్స్, కామెడీ, చిన్న message తో కలిపిన కథ

హీరోయిన్ వాళ్ళ నాన్న ప్రతి విషయానికి బయపడుతుంటాడు వాళ్ళ పక్కన ఉన్న చుట్టూ పక్కల ఇద్దరు వాళ్ళ నాన్నని తన కూతురు తప్పు చేస్తుంది అని మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది అని ఎప్పుడు బయపెడుతుంటారు

చివరకు తన కూతురు ప్రేమను ఎలా అర్థం చేసుకున్నాడు అన్నది సినిమా కథ ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు ప్రతి లవ్ స్టొరీ లో ఉండే కథే

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు అమ్మాయి వాళ్ళ నాన్న కి ఇది ఇష్టం ఉండదు చివరకు అబ్బాయి ఎలాగోలా అమ్మాయి తండ్రి ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు ఇదే కథ ఇందులో కొత్తదనం ఏమి లేదు కొద్దిగా కామెడీ, కొద్దిగా సెంటిమెంట్ అదే లవ్ స్టొరీ అంతే

రొటీన్ గానే ఉంది సినిమా !!!

2, డిసెంబర్ 2021, గురువారం

"అనుభవించు రాజా " సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజ్ తరుణ్ హీరో గా చేసిన సినిమా అనుభవించు రాజా సినిమా ఎలా ఉందో కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో రాజ్ తరున్ హైద్రాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు అక్కడే ఒక it కంపెనీ లో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తాడు అయితే ఆమె హీరోయిన్ ఆమె కూడా హీరోని it కంపెనీ పనిచేసే వాడు అనుకుని ప్రేమిస్తుంది అయితే ఇలా జరుగుతుండగా

ఒక రోజు రాజ్ తరుణ్ మీద హత్య ప్రయత్నం జరుగుతుంది అయితే ఇది ఎవరు చేశారు అన్నది అసలు కథ 

తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు భీమవరం దగ్గర యాండ గండి ఒక రాజుల వంశం తన తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ బతుకుతాడు అక్కడ లగ్జరీ గా బతికేవాడు హైద్రాబాద్ లో సెక్యురిటి గార్డ్ గా పని చేస్తాడు అసలు ఏమి జరిగింది అన్నది సినిమా కథ 

పెద్దగా ఏమి లేదు జస్ట్ average అంతే !!!


30, నవంబర్ 2021, మంగళవారం

" పెద్దన్న " సినిమా పై నా అభిప్రాయం !!!

 సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన సినిమా పెద్దన్న నయన తార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా దీపావళి సందర్భంగా విడుదల చేసిన సినిమా ఇక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం !!!

పెద్దన్న ఆ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో పెద్ద మనిషి ఒక్కగానొక్క చెల్లెలు కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం తనకి పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకుంటాడు చాలా సంబంధాలు చూస్తాడు చివరికి ప్రకాష్ రాజ్ కుటుంబం తో సంబంధం కుదుర్చుకుంటాడు

ప్రకాష్ రాజ్, పెద్దన్న కి ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి కానీ పెద్దన్న మంచితనం చూసి సంబంధం కలుపుకోవాలని చూస్తాడు

అయితే ఊహించిన విధంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుని అంతా అనుకునే లోపు కీర్తి సురేష్ ఇంటిలినుండి బయటకు వెళ్లి పోతుంది అసలు ఎందుకీ ఇలా చేసింది అన్నది షాక్ లో ఉంటారు అందరూ

అయితే ఇలా ఎందుకు జరిగింది అన్నది మిగిలిన సినిమా కథ !!!

27, నవంబర్ 2021, శనివారం

" దృశ్యం 2 "సినిమా పై నా అభిప్రాయం !!!

 


దృశ్యం ఈ సినిమా చాలా మంది చూసే ఉంటారు ఇంకా దీనికి కొనసాగింపుగా దృశ్యం 2 అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో నటించారు ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మొదటి దృశ్యం సినిమా మీకు గుర్తిందిగా తన అమ్మాయి కోసం వచ్చిన వరుణ్ అనే అబ్బాయిని హత్య చేసి కొత్తగా నిర్మాణం లో ఉన్న పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెడతారు అది ఎవరికి తెలియదు అనుకుంటారు 

తరువాత 6 సంవత్సరాలకు ఆ కేస్ గురించి విచారణ జరుగుతూనే ఉంటుంది అయితే ఈ సారి పోలీస్ కానిస్టేబుల్ ని అండర్ కవర్ ఆపరేషన్ లి భాగంగా రాంబాబు వాళ్ళ ఇంటి ముందే మాములు మనుషులు లాగే ఉంటారు రాంబాబు ఫ్యామిలీ లో కలిసిపోతారు వాళ్లకు తెలియకుండానే వారి ఇంట్లో మాట్లాడుకునే మాటల్ని విటుంటారు

అంతే కాకుండా రాంబాబు మొదటి పార్ట్ లో వరుణ్ ని హత్య చేసి పోలీస్ స్టేషన్ లో పూడ్చి బయటకు వస్తున్నప్పుడు జనార్దన్ అనే వ్యక్తి చూస్తాడు అతడు అంతకుముందే అతని బావ మరిదిని చంపేసి పారి పోతుండగా అప్పుడే రాంబాబును అక్కడ చూస్తాడు అది ఎవరికి అయిన చెబుదాం అనుకునే లోపు పోలీస్ లు అతడిని అరెస్ట్ చేసి జైలులో వేస్తారు 

మళ్ళీ 6 సంవత్సరాలు తరువాత విడుదల అయ్యి బయటకు వస్తాడు రాంబాబు కేస్ విషయం తెలుసుకుని పోలీసులకు ఈ విషయం చెబుతాడు 5 లక్షలు డబ్బులు కోసం వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అతడికి ఇస్తారు అప్పుడు చెబుతాడు రాంబాబు కొత్తగా కడుతున్న పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు చూసాను అని మళ్ళీ కేస్ ఫైల్ చేసి విచారణ కోసం రాంబాబు ఫ్యామిలీ ని విచారిస్తారు

ఆఖరికి రాంబాబు ఒప్పుకుంటాడు ఆ హత్య తానే చేశానని కానీ ఇకనుండి కథ చెప్పటం కుదరదు ఎందుకంటే ఇదే మీరు చూడవాల్సింది 


బహుశా దీనికి 3 వ పార్ట్ కూడా ఉంది అనుకుంటున్నాను

బాగానే ఉంది సినిమా పరవాలేదు చూడ వచ్చు !!!


 

26, నవంబర్ 2021, శుక్రవారం

Sivaranjanium innum sela pengalum సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా పేరు మళ్ళీ చెప్పమంటే నేను చెప్పలేను కానీ ఈ సినిమా sony liv లో ఉంది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా ముఖ్యంగా 3 ఆడవాళ్లు గురించి తీసిన సినిమా మొదటిగా ఒక భార్య, భర్త, ఒక చిన్న పాప పేద కుటుంబం అయితే భర్త సంపాదన ఉండదు భార్య అలాగే సంసారం నడిపిస్తుంది అయితే ఒకసారి భర్త భార్య ని కొడతాడు అయితే గట్టిగా కొట్టొద్దు అంటుంది అంటే భర్త అప్పటినుండి కోపముతో ఉంటాడు ఆ తరువాత నుండి అతను కనిపించడు అక్కడితో ఒక కథ

రెండవది ఒక కుటుంబం అమ్మ, నాన్న, ఇద్దరు కొడుకులు, వాళ్ల భార్యలు ఇదే కుటుంబం అయితే ఇంటి పెద్ద కోడలు ఇంటిలోనే ఉంటుంది రెండవ కోడలు జాబ్ చేస్తుంది అయితే ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక డైరీ రాస్తోంది ఆసలు ఆ డైరీలో ఏముంది అన్నది ఇంట్లో వాళ్లు తెలుసుకోవాలి అనుకుంటారు కానీ దానికి ఆమె ఒప్పుకోదు  చివరికి ఆ డైరీని కాలుస్తుంది అంతే అక్కడితో రెండవ కథ


మూడోవది college లో బాస్కెట్ బాల్ topper కి marraige చేస్తారు అప్పటినుండి తాను బాస్కెట్ బాల్ మానేస్తుంది ఇంట్లో వంట పనులు, సమయానికి అందరికి అన్ని అందించటం భర్తను, అత్తగారిని చూసుకోవడం, పిల్లను చూసుకోవడం ఇదే ఆమె దిన చర్య  ఇది మూడోవ కథ

ఈ సినిమా మొదట్లో అవార్డ్లు వచ్చినట్టు చూపిస్తారు ఇందులో కథ చాలా సాధారణంగా, ఉంటుంది అంతగా ఏమి ఉండదు 

ఆడవారి జీవితాలలో ఉండే వాటిని గురించి ఈ సినిమాలో చూపించటం జరిగింది !!!

RRR నుండి జనని సాంగ్ చూసారా !!!

 RRR బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరు కలిస్తే అనే ఉహాజనీతమైన కథతో వస్తుంది 

ఈ సినిమా జనవరి 7 న 2022 విడుదల అవుతుంది ఈ సినిమా నుండి ఇవాళ ఒక సాంగ్ విడుదల అయింది అది ఎలా ఉందో చూద్దాం !!!

24, నవంబర్ 2021, బుధవారం

" Most eligible బ్యాచ్ లర్" సినిమాపై నా అభిప్రాయం !!!

అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలెజిబుల్ బ్యాచ్ లర్ సినిమా పూజ హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం అన్నట్టు ఈ సినిమా ఆహా ott లో విడుదల అయ్యింది 
అమెరికాలో జాబ్ చేస్తుంటాడు అఖిల్ ఇండియాలో పెద్ద కుటుంబం తనకు 20 పెళ్లి సంబంధాలు ను చూస్తారు వాటిలో తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లి అమెరికాలో settle అవుదామని అనుకుంటాడు 
పెళ్లి చూపులు చూడటానికి అమెరికా నుండి ఇండియా కి వస్తాడు ఆ 20 మంది అమ్మాయిలలో ఒక అమ్మాయి పూజ హెగ్డే ఉంటుంది అయితే జాతకాలు కలవు లేవని ఆ ఫోటో తిరిగి ఇచ్చేయటానికి వెళ్తాడు అయితే అనుకోకుండా ఆ ఫోటో మిస్ అవుతుంది వాళ్ల నాన్న ఆ ఫోటో కోసం చాలా గొడవ పెడతాడు
ఈ క్రమంలో హీరోయిన్ ని కలుస్తాడు హీరోయిన్ ఆటిట్యూడ్ కి హీరో ఫిదా అయిపోతాడు అప్పటి నుండి ఎన్ని సంబంధాలు చూసిన నచ్చవు
పెళ్లి కి ముందు కాదు పెళ్లి తరువాత కాపురాలు ఏ విధంగా ఉంటాయి  అసలు పెళ్లి అయిన తరువాత భార్య భర్తలు మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే కథాంశం తో తీశారు ఈ సినిమా 
ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది avereage సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

23, నవంబర్ 2021, మంగళవారం

ఫ్యామిలీ డ్రామా సినిమా పై నా అభిప్రాయం !!!


 ఫ్యామిలీ డ్రామా Sony liv ott లో విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

అనగనగా ఒక ఫ్యామిలీ ఒక తండ్రి, తల్లి, ఇద్దరు కొడుకులు ,వాళ్ళ భార్యలు అందులో పెద్ద కొడుకు సుహాస్ అంటే కలర్ ఫోటో సినిమాలో నటించిన సినిమా ఇందులో నెగిటివ్ రోల్ చేసాడు

సీరియల్ కిల్లర్ పాత్రలో, సైకో పాత్రలో చాలా బాగా చేసాడు  వాళ్ళ తండ్రి సుహాస్ ని ఇంటి నుండి బయటకు పంపించేస్తాడు వాళ్ళ నాన్న ఎప్పుడు అందరిని తిడుతూ వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటాడు

అయితే సుహాస్ వాళ్ళ నాన్నకి, పక్షవాతం వచ్చేలా చేసి ఎలాగైనా ఇంటిలోకి ప్రవేశిస్తాడు అయితే మర్డర్ లు తానే కాకుండా వాళ్ళ తమ్ముడు కుడా మర్డర్లు చేస్తాడు 

ఈ విషయం వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న భార్యలకు తెలుస్తుంది వాళ్లకు తెలిసిన విషయం అన్న దమ్ముళ్లకు తెలుస్తుంది 

అయితే తరువాత కథ ఏమి అయ్యింది అన్నది సినిమా కథ ఫ్యామిలీ మొత్తం సైకో గాళ్ళు ఎక్కువ అది మీకు లాస్ట్ తెలుస్తుంది 

రొటీన్ కు భిన్నంగా ఉంటుంది కానీ బాగుంది సినిమా పరవాలేదు !!!

22, నవంబర్ 2021, సోమవారం

" ఒక చిన్న ఫామిలీ స్టోరీ" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 ఒక చిన్న ఫామిలీ స్టోరీ  జీ 5 ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!!!

ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అబ్బాయి, ఒక బామ్మ ఈ కుటుంబం అంతా నడిచేది నాన్న సంపాదన మీదే అయితే హీరోకి ఏ పని చెయ్యడు ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న చనిపోతాడు అప్పుడు తెలుస్తుంది హీరోకి ఇంట్లో దేనికి ఎంత ఖర్చు అవుతుందో అప్పుడే ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది వాళ్ళ నాన్న 25 లక్షలు లోన్ తీసుకున్నాడని దానిని తీర్చాలంటే డబ్బులు ఎలా వస్తాయి చివరకు ఉద్యోగం చేస్తాడా లేదా ఆ 25 లక్షలు వాళ్ళ నాన్న ఏమి చేశాడు 

ఆ బాకిని ఎలా తీర్చాడు అన్నది కథ హీరోయిన్ పక్క ఇంటిలోనే ఉంటుంది ఇది కథ చాలా సింపుల్ గా ఉంది కాని బాగుంది సినిమా కామెడీ, బాగుంది

ప్రతి సామాన్యుడి జీవితంలో జరిగే సన్నివేశాలు తెరపై బాగా చూపించారు బాగుంది మంచి ఎంటర్టైనర్ అందరూ చూడ వచ్చు 👍👍👍

21, నవంబర్ 2021, ఆదివారం

"Lift " తమిళ్ హార్రర్ సినిమా పై నా ఆభిప్రాయం !!!

 Lift తమిళ్ సినిమా ఈ సినిమా ఇవాళ చూడటం జరిగింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో బెంగళూరు లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తుంటాడు ట్రాన్స్ఫర్ మీద చెన్నై వస్తాడు అయితే అక్కడ ఒక రోజులో జరిగిన కథ గురించి ఈ సినిమా ఇందులో హీరోయిన్ H. R లాగా పనిచేస్తుంది అయితే అంతకుముందే వారిద్దరికీ పరిచయం ఉంటుంది

హీరో కి వాళ్ళ బాస్ నైట్ extra వర్క్ ఇస్తాడు అయితేవర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు హీరో అంతలో లిఫ్ట్ లో ఇరుక్కుపోతాడు 

అయితే అక్కడినుండి అసలైన కథ మొదలవుతుంది అలిఫ్టు లో రక, రక ల సౌండ్ లు, అరుపులు వస్తాయి ఇంతలో లిఫ్ట్ పనిచేస్తుంది కానీ పైకి, కిందకి వెళుతుంది మెట్ల మీద వెళ్లిన సరే మళ్ళీ అక్కడికే వస్తారు

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అక్కడ ఏమైనా దెయ్యం ఉందా అనేది సినిమా కథ ఆ రాత్రి హీరోయిన్ కూడా అక్కడే ఒక రూమ్ లో చిక్కుకుని ఉంటుంది అసలు అక్కడ ఏమి జరుగుతుంది చివరికి వారిద్దరూ బయట పడ్డారా లేదా ఆన్నది సినిమా కథ హార్రర్ సస్పెన్స్ తో కూడిన సినిమా low బడ్జెట్ లో బాగా తీశారు సినిమా బాగానే ఉంది హార్రర్ అంటే ఇషాపడే వారికి నచ్చుతుంది

ఈ సినిమా కథ అంతా ఒక రోజులో జరిగినట్టు చూపించారు చివరికి ఆ దెయ్యం ఎవరు అలా ఎందుకు చేస్తుంది అన్నది తెలుస్తుంది బాగానే ఉంది సినిమా 👌👌👌

నా గురించి నేను ?

 నా గురించి నేను చెప్పుకోవడానికి పెద్ద ఏమి లేదు కానీ నా మనసులో మాట చెప్పుకోవడానికి దొరికిన చిన్న అవకాశం 

నా పేరు సుబ్రమణ్యం నేను చదివింది డిగ్రీ బికామ్ అది ఆంధ్ర university దూర విద్య విధానం ద్వారా చదువుకున్నాను నాకు 30 సంవత్సరాలు వయసు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు ఒక చిన్న పాపా కూడా ఉంది నేను చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు

ఎందుకంటే అప్పుడెప్పుడో దాదాపు 12 సంవత్సరాలు క్రితం ఒక బ్రాండెడ్ మొబైల్ షాప్ లో చేసాను అప్పుడు ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సరిగ్గా చదువుకోలేదు అలాగే ప్రైవేట్ గానే కడుతూ డిగ్రీ పరీక్షలు రాసాను సాధారణ మార్కులతో పాస్ అయ్యాను ఇప్పుడు అదే పని

వేరే మొబైల్ షాపులో చేస్తున్నాను చాలి చాలని జీతంతో, మీకు ఇది చదివిన తరువాత ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అని మీకు సందేహం రావచ్చు

కానీ నా అలచనలు పంచుకుంటున్నాను అంతే కాని ఒక్కటి మాత్రం నిజం ఎవరి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా మారుతుంది ఆ మార్పు కోసమే ప్రతి మనిషి ఆరాటం, ప్రతి రోజు పోరాటం !!😢😢😢☺️☺️☺️


19, నవంబర్ 2021, శుక్రవారం

నాని "శ్యామ్ సింగరాయ్" టీజర్ చూసారా ?

 Natural star నాని నటించిన కొత్త చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ డిసెంబర్ 24 తేదీన విడుదల అవుతుంది ఈ సినిమా టీజర్ విడుదల చేసారు నాని గత రెండు సినిమాలు అమెజాన్ ott లో విడుదల అయ్యాయి ఈ సినిమా మాత్రం థియేటర్ లో విడుదల అవుతుంది మీరూ ఒక లుక్ వెయ్యండి !!!

16, నవంబర్ 2021, మంగళవారం

"Scam 1992 " webseries పై నా అభిప్రాయం !!!

 Scam 1992 ఇది జరిగినప్పుడు బహుశా నాకు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటాయి అప్పట్లో మనకు ఏమి తెలియదు కాని 2005 ,2006 ఆ టైం లో అనుకుంటా వార్తల్లో అడపా, దడపా స్కాం 1992 గురించి, హర్షద్ మెహతా గురించి వార్తల్లో వచ్చేది ఇక ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం !!!

Sensex అసలు ఇది ఏమిటో ఎన్ని సార్లు అర్థం చేసుకోవాలని చూసినా ఇది ఒక puzzle ల ఉండేది ఇప్పుడు అంతే ఇక విషయానికి వద్దాం హర్షద్ మెహతా ఒక గుజరాతీ అయితే వ్యాపార నిమిత్తం బొంబాయి లో ఉంటారు అయితే దిగువ మధ్య తరగతి కుటుంబం వీరిది శాంతి లాల్ మెహతా కి ఇద్దరు కొడుకులు ఒకరు హర్షద్ మెహతా, మరొకరు అశ్విన్ మెహతా అయితే శాంతి లాల్ మెహతా బట్టల వ్యాపారం చేసి మోసపోయి దివాళా తీసి ఉన్నాడు అపుడు ఇంటికి పెద్ద కొడుకు హర్షద్ మెహతా  బంగారం వ్యాపారం చేసేవాడు అలా కాదు అని నిర్ణయించుకుని 

Bombay stock exchange గురించి తెలుసుకుని ఎలాగోలా. అందులో మెళకువలు నేర్చుకుంటాడు హర్షద్, అశ్విన్ ఇద్దరు మెల్లగా స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు

అలా హర్షద్ మొత్తానికి షేర్ మార్కెట్ కింగ్ అవుతాడు ఆ తరువాత మరో మనీ మార్కెట్ లోకి కూడా అడుగు పెడతాడు మొత్తానికి బాగానే సంపాదిస్తాడు

అది చూపి బ్యాంక్ లో లోన్ తీసుకుని వాటిని బ్యాంక్ ఖాతాలలో చూపకుండా చేస్తాడు ఇది మీకు చెబితే అర్థం కాదు మీరు చూడాలి 

ఇందులో వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు కాని సిరీస్ అయితే బాగుంది

అసలు హర్షద్ మెహతా ఎలా షేర్ మార్కెట్ లోకి ప్రవేశించాడు, ఎలా బ్యాంక్ లని మోసం చేసాడు, హర్షద్ మెహతా వెనుక ఎవరు ఉన్నారు,ఈ మోసం ఎలా బయట పడింది చివరకు హర్షద్ మెహతా ఎలా చనిపోయాడు అన్నది కథ బాగుంది మొత్తం 8 గంటలు పైనే ఉంది కాని బాగుంది !!!👍👍👍

14, నవంబర్ 2021, ఆదివారం

" అఖండ " మూవీ ట్రైలర్ చూసారా ?

 బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న నందమూరి బాలకృష్ణ  నటించిన కొత్త చిత్రం అఖండ ట్రైలర్ విడుదల చేసారు మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది 

శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తాడు జగపతిబాబు ఒక పాత్రలో తళుక్కున మెరిసాడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2 విడుదల అవుతుంది 

ఇక ట్రైలర్ ఒక లుక్ వెయ్యండి !!!

పుష్పక విమానం సినిమా పై నా అభిప్రాయం !!!

 పుష్పక విమానం విజయ దేవరకొండ ఆనంద్ దేవరకొండ నటించిన 3 వ సినిమా నవంబర్ 12 న ఈ సినిమా థియేటర్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా కొంచెం వెరైటీ గా బాగుంది అందుకే చూసాను ఇక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

సుందర్ ( ఆనంద్ దేవరకొండ ) ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తాను ఉండే ఇంటికి తీసుకువస్తాడు అయితే కొన్ని రోజుల తరువాత ఆ ఆమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లెటర్ రాసి అయితే అప్పుడు ఏమి చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన భార్య ఇంట్లోనే ఉన్నట్టు అందరిని నమ్మిస్తాడు

అయితే స్కూల్ లో పనిచేసే కొంతమంది టీచర్స్ సుందర్ భార్యని చూపించమని అడుగుతారు  అప్పుడు సుందర్ ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ ని తన భార్య గా నటించి మంటాడు తాను అలాగే చేస్తుంది

ఇంతలో అసలైన తన భార్య ఎక్కడ ఉందా అని enquiry చేస్తాడు చివరకు తనని ఎవరో చంపేస్తారు అక్కడి నుండి కథ వేరేలా ఉంటుంది 

చివరకు తన భార్య ను చంపింది ఎవరు సుందర్ ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు అయితే అసలు కథ ఏంటి అన్నది మిగిలిన సినిమా కథ

పెళ్ళాం లేచిపోయిన మొగుడిగా బాగానే నటించాడు ఆనంద్ మంచి వెరైటీ కాన్సెప్ట్ తో బాగానే అలరించాడు

పర్వాలేదు సినిమా బాగానే ఉంది 👍 !!!

9, నవంబర్ 2021, మంగళవారం

జయ లలిత బయోపిక్ " తలైవి " సినిమా పై నా అభిప్రాయం !!!

 జయ లలిత బయో పిక్ తలైవి సినిమా జీ5 ott లో అందుబాటులో ఉంది బహుశా మీకు ఇది తెలిసే ఉంటుంది ఇక ఈ సినిమా ఈ రోజు చూడటం జరిగింది ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !

జయ లలిత తమిళ్ నాడు ముఖ్యమంత్రి గానే మనకు తెలుసు కానీ ముఖ్యమంత్రి అవటానికి ముందు అసలు తన జీవితంలో జరిగిన సంఘటనలు,అసలు సినిమాలలో ఉండే జయ లలిత రాజకీయాలలో కి ఎలా వెళ్లారు అన్నది సినిమా కథ 

ఇక ఇందులో జయ లలిత పాత్రలో కంగనా చాలా నటించారు MJR లాగా అరవింద్ స్వామి నటన, సంద్రఖని, నాజర్ ప్రముఖుల పాత్రల్లో బాగా చేశారు ఈ సినిమా చూస్తే నిజంగా జయ లలిత అంత బాగా పాలించారు అనిపించింది వాస్తవాలు ఏమిటో మనకు తెలీదు కానీ సినిమా బయో పిక్ మాత్రం బాగానే ఉంది

అసెంబ్లీ లో జరిగిన జయ లలిత అవమానం సీన్ తో మొదలవుతుంది సినిమా తన చీరను లాగి అవమానించిన అధికార పక్షం శపథం చేసి ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ లో అడుగు పెడతానని అలాగే ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ లో అడుగు పెట్టడం జరుగుతుంది

సినిమా అయితే బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు నేనైతే అసలు జయ లలిత జీవితంలో జరిగిన సంఘటనలు పేపర్ లలో రోజు చదివేవాడిని అలాగే ఉంది సినిమా !!!

" Uncaged" సినిమా పై నా అభిప్రాయం !!!

 


హాలీవుడ్ డబ్బింగ్ తెలుగులో కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది సినిమా పేరు uncaged ఇక సినర్మ కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా amsterdam అనే ఒక సిటీ లో జరిగేది ఒక సింహం ఆ సిటీ లో ఉండే మనుషుల్ని చంపి తినేస్తుంది దానిని ఎలా పట్టుకున్నారో అదే సినిమా కథ ఇందులో చూడటానికి చిన్న సినిమా కథ లాగే కనిపిస్తుంది కానీ సినిమా పర్వాలేదు 
ఆ సింహాన్ని ఎలా బంధించాలని చూసిన చివరకు దాని చేతిలో చాలా మంది చనిపోతారు అయితే దానిని చివరికి చంపరా లేదా అన్నది సినిమా కథ హాలీవుడ్ అంటే ఇలాంటి సినిమా లకు పెట్టింది పేరు  పరవాలేదు సినిమా బాగానే ఉంది 
బహుశా సినిమా గురించి నా లాగా చిన్నగా ఎవరు చెప్పరేమో నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు దానిని అటు లాగి, ఇటు లాగి చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఏదైతే అదే చెప్తాను 😊😊😊

8, నవంబర్ 2021, సోమవారం

పెద్ద నోట్ల రద్దు నేటితో 5 సంవత్సరాలు పూర్తి ?

 అది నవంబర్ 8 తారీఖు 2016 వ సంవత్సరం నాకు తెలిసి నేను అప్పడే జీతం తీసుకున్నాను మధ్య తరగతి జీవితాలలో జీతం తీసుకున్న రోజే పండగ అసలైన పండగ ఎంతో సంతోషంగా ఉన్నాను

అప్పుడు పడ్డాది అసలైన పిడుగు నేను తీసుకున్న జీతం మొత్తం 500, 1000 రూపాయల కాగితాలు ఆ రోజు నుండి పెద్ద నోట్లు రద్దు అని ప్రకటన చేశారు కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయింది ఆ తరువాత బ్యాంక్ లు చుట్టూ తిరిగి ఎలాగైతే ఏం ఆఖరికి పని అయ్యింది కానీ బ్యాంక్ లు చుట్టూ తిరిగి, తిరిగి నిజంగా ఒక రకం అంతే 

నేను అంత పెద్ద మేధావిని కాదు గాని అసలు నోట్లు రద్దు వల్ల ఇబ్బంది పడింది మాత్రం సామాన్య ప్రజలు నిజముగా ఇది నిజం

నేటితో ఆ పీడ కలకి 5 సంవత్సరాలు అయ్యింది అప్పుడు చూడాలి పాత 500, 1000 రూపాయలు నోట్లు గురించి హాస్య ఛలోక్తులు, ఫన్నీ వేషాలు నిజంగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది నిజంగా

చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆరోజుల్లో నేను అనే కాదు బహుశా జీతం మీద ఆధారపడి బ్రతికే ప్రతివాడు నాలాగే బాధ పడుంటాడు😞😞😞

7, నవంబర్ 2021, ఆదివారం

"బిమ్లా నాయక్ " టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల !!!

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బిమ్లా నాయక్ సినిమా నుండి టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల అయ్యింది అది ఎలాగ ఉందొ పైన ఉంది సాంగ్ చూడండి అన్నట్టు దీనికి లిరిక్స్ త్రివిక్రమ్ అందించారు
ఈ రోజు త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు !!!

6, నవంబర్ 2021, శనివారం

"వరుణ్ డాక్టర్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 వరుణ్ డాక్టర్ శివ కార్తికేయన్ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఇది netflix ott లో అందుబాటులో ఉంది ఇక కథ గురించి ఇప్పుడు చూద్దాం !

ఆర్మీ లో డాక్టర్ గా పనిచేస్తుంటాడు వరుణ్ (శివ కార్తికేయన్) పెళ్లి సంబంధం కోసం ఇంటికి వస్తాడు అక్కడ హీరోయిన్ కి తనకి పెళ్లి సంబంధం కుదురుతుంది అయితే హీరోయిన్ తనని పెళ్లి చేసుకొనని చెపుతుంది తనకు ఎమోషన్స్ లేవని ఫీలింగ్స్ లేవని రిజెక్ట్ చేస్తుంది అయితే అప్పుడే హీరోయిన్ వాళ్ల అన్నయ్య వాళ్ళ పాపని ఎవరో కిడ్నాప్ చేస్తారు అక్కడి నుండి 

ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారు అలాగే చిన్న పిల్లల్ని చాలా మంది కిడ్నాప్ కు గురి అవుతారు

ఇదంతా చేస్తుంది ఎవరు అని వరుణ్ ఎలా కనుక్కుంటాడు, ఈ కిడ్నాప్ లు అన్ని ఎదుకు జరుగుతున్నాయి చివరకు ఆ పాపను కాపాడరా లేదా అన్నది మిగిలిన కథ

బాగానే ఉంది ఒకసారి చూడ వచ్చు !!!

4, నవంబర్ 2021, గురువారం

సూర్య నటించిన "జై భీమ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 జై భీమ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే వాస్తవాలకి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా ఇక కథ గురించి ఇప్పుడు చూద్దాం !

సూర్య ఈ సినిమాలో నటించలేదు జీవించాడు అని చెప్పాలి పోలీస్ లో విచారణలో సరైన దోషులు దొరకకపోతే పాపం ఏ ఆధారం లేని గిరిజనుల్ని అందులో ఇరికించి వాళ్ళను చిత్ర హింసలు చేసి చివరకు వాళ్ళను చంపి తప్పించుకుని పారిపోయారు అని నిరూపించి

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉంది కాని ఒక మాటలో చెప్పే సినిమా కాదు కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది

ఎలాంటి doubt లేదు కాక పోతే సినిమా నిడివి 2 గంటలు 44 నిమిషాలు ఉంది కాని సినిమా బాగుంది ఇందులో సూర్య న్యాయం కోసం పోరాటం చేసే ఒక అసలైన న్యాయవాది చాలా బాగా చేశారు 

బాగుంది సినిమా 👍👍👍👍

దీపావళి శుభాకాంక్షలు !!!

 దీపావళి అంటే పండుగలలో ఒక ప్రత్యేకమైన పండగ అని చెప్పవచ్చు ఎందుకంటే  ప్రతి పండగ ఇదొక ప్రత్యేకత కల్గి ఉంటుంది దీపావళి కూడా అలాంటిదే 

చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంతో, సంతోషంతో, ఆహ్లాదంతో చేసుకునే పండగ దీపావళి 

మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపోవొత్తులు, అగ్గిపెట్టెలు, పాము బిల్లలు, టపాసులు ఎలాగ ఎన్నో మన ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయి

అందుకే దీపావళి అంటే ఒక స్పెషల్ అలాగే ఇంకొక మాట డబ్బులు ఉన్న లేకున్నా ఎవరి స్తోమత కు తగ్గట్టు వారు మందులు పేలుస్తారు

అందరి మరొక సారి దీపావళి శుభాకాంక్షలు !!!💐💐💐

30, అక్టోబర్ 2021, శనివారం

Zee 5 ott లో విడుదల అయిన "afat e ishq " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా పేరు నోరు తిరగటం లేదు, రాద్దామన్న తప్పుగానే వస్తుంది కానీ ఈ సినిమా zee 5 ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా కథ కొంచెం confuse గానే ఉంటుంది లల్లు అనే ఒక అమ్మాయి ఒక పెద్ద వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది తన చిన్నప్పుడే లల్లు వల్ల అమ్మ, నాన్న వదిలేసి వెళ్ళిపోతారు అయితే చిన్నప్పటి నుండి అక్కడే పెరుగుతుంది

తనకి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం దొరుకుతుంది అందులో రెడ్ ఫెయిరీ అనే దేవకన్య గురించి చదువుతుంది అప్పటి నుండి తన నిజముగా ప్రేమించేవారు కాకుండా ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళు చనిపోతారు 

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నట్టు ఇందులో చనిపోయిన ఆత్మ ఒకటి తనకు మాత్రమే కనిపిస్తుంది

చివరకు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నది కథ నిజంగానే రెడ్ ఫెయిరీ ఉందా ఏమిటి అన్నది సినిమా చూడాలి

నేను ఏదో హార్రర్ మూవీ అనుకుని చూసాను కానీ నాకు అలాగా ఏమి అనిపించ లేదు !!!


27, అక్టోబర్ 2021, బుధవారం

" గల్లీ రౌడి" సినిమా పై నా అభిప్రాయం !!!

 గల్లి రౌడి సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా కామెడీ లైనప్ తో విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా కథ అంటే రోటీనగానే మొదలవుతుంది వైజాగ్ లో సందీప్ కిషన్ ఫ్యామిలీ మొత్తం రౌడీలు కానీ కొంచెం మంచి రౌడిలు వాళ్ళ తాత, నాన్న సందీప్ కిషన్ చిన్నప్పుడే చనిపోతాడు వాళ్ళ తాత కూడా తిరిగే బైరాగి అనే రౌడి సందీప్ కిషన్ వల్ల తాతకి ఎదురు తిరిగి వాళ్ళ తాతను అవమానిస్తాడు అప్పటి నుండి వాళ్ళ తాత పక్కన ఉండే పోసాని ఎలాగైనా తన మనవడ్ని పెద్ద రౌడి ని చేసి ఆ బైరాగిన చంపి చాలని చూస్తాడు 

సందీప్ చదువును మధ్యలోనే అపి వేసి ఒక రౌడి లాగా తయారుచేస్తాడు అదే టైంలో హీరోయిన్ ఫామిలీ కూడా బైరాగి వల్ల ఇబ్బందులు పాలు అవుతారు అయితే బైరాగి హీరోయిన్ వల్ల స్థలాన్ని kabza చేస్తాడు బైరాగి

అయితే హీరోయిన్ కోసం , వాళ్ల తాత కోసం సందీప్ ఆ బైరాగి ని కిడ్నప్ చేద్దాం అనుకుంటారు కానీ అంతలోనే ఎవరో బైరాగిని షూట్ చేసి చంపేస్తారు

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు అంతా రొటీన్ గానే ఉంటుంది

చిన్న సినిమా కొద్దిగా టైం పాస్ అంతే !!!

23, అక్టోబర్ 2021, శనివారం

Heads & Tales సినిమా పై నా అభిప్రాయం !!!

 Zee5 ott లో విడుదల అయిన heads & tails సినిమా సునీల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చెప్పుకోదగ్గ సినిమా ఏమి కాదు చిన్న సినిమా  ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!

సునీల్ కారెక్టర్ ఇందులో ఒక దేవుని కారెక్టర్ లో ఉంటుంది ఒక దేవుడ్ని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంటాడు అప్పడు ఆ దేవుడు అదే సునీల్ ముగ్గురు అమ్మాయిల జీవితాలు వారికి తెలియకుండా వారి మధ్య సంబంధం ఏమిటి అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు కథ ఏమిటి అన్నది కథ ఈ సినిమా లో సుహాస్ ఒక పాత్రలో కనిపిస్తాడు

చెప్పుకోవడానికి పెద్ద కథ ఏమి లేదు మామూలుగానే ఉంది మళ్ళీ దీనికి 2 వ పార్ట్ కూడా ఉంది అని చివర చూపిస్తారు 

పెద్దగా కథ అయితే ఏమి లేదు ఒక నైట్ లో ముగ్గురు అమ్మాయిల కథ వాళ్ళు ఉన్న పరిస్థితి నుండి ఎలా బయట పడ్డారు అన్నది కథ !!!


20, అక్టోబర్ 2021, బుధవారం

" Cold Case " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా ott లో విడుదల అయిన Cold case సినిమా హార్రర్ suspence కూడిన సినిమా ఇది మలయాళం డబ్బింగ్ సినిమా 

ఒక చెరువులో ఒక పుర్రె దొరుకుతుంది దానికి సంబంధించి ఆ మనిషి ఎవరు ఎలా చెరువులో చనిపోయింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆఫీసర్ పృద్వి రాజ్

అటువంటి పరిస్థితులలో మిర్రర్ అనే ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఒక ఇంటికి అద్దెకు దిగుతోంది అయితే అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి 

ఆ పోలీస్ ఆఫీసర్ కి, ఈ జర్నలిస్ట్ కి ఏమిటి సంబంధం వారిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేసేది చివరికి ఆ చనిపోయిన  ఆ వ్యక్తి ఎవరు అన్నది సినిమా కథ

కథ మొత్తం చెప్పేస్తే ఏముంటుంది అందుకే అందులో ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పటం జరిగింది నాకెందుకో ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రెస్టిటింగ్ గా ఉంది 2 హాఫ్ కొద్దిగా డల్ అయ్యింది 

కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు బాగానే ఉంది !!!

15, అక్టోబర్ 2021, శుక్రవారం

" విజయ దశమి " శుభాకాంక్షలు !!!

 మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ జగన్మాత ఆశీస్సులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ "విజయ దశమి "శుభాకాంక్షలు !!!

12, అక్టోబర్ 2021, మంగళవారం

రాజ రాజ చొర సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజ రాజ చొర సినిమా శ్రీ విష్ణు హీరో గా నటించిన సినిమా ఇక ఈ సినిమా గురించి అదే కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

హీరో శ్రీ విష్ణు ఒక xerox షాప్ లో పనిచేస్తుంటాడు అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తనకు మాత్రం తను software ఇంజినీర్ అని చెప్పి మోసం చేస్తుంటాడు ఇదిలా ఉండగా రాత్రులు దొంగతనం కూడా చేస్తాడు అయితే తనకి అంతకుముందే పెళ్లి అవుతుంది ఒక బాబు కూడా ఉంటాడు 

అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడుఅన్నది మనకు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు

బాగానే ఉంది సినిమా !!!

5, అక్టోబర్ 2021, మంగళవారం

" నూటొక్క జిల్లాల అందగాడు " సినిమాపై నా అభిప్రాయం !!!

 అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా నూటొక్క జిల్లాల అందగాడు ఈ సినిమా ఇటీవల విడుదల అయింది 

అయితే ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం ఇందులో చెప్పటానికి ఏమి లేదు ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల బట్ట తలతో ఉంటాడు అయితే దానిని కవర్ చేయటానికి విగ్ ని వాడతాడు ఇంటిలో కూడా టోపి పెట్టుకుని తిరుగుతాడు 

అసలు విగ్ లేకుండా బయటకు రాడు అలాంటిది తాను పని చేస్తున్న కంపెనీ లో ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది తనని పరిచయం చేసుకుని ప్రేమిస్తుంది అయితే హీరోది సొంత జుట్టు కాదని విగ్ అని తెలిసిపోతుంది 

అయితే ఆ తరువాత హీరోయిన్ ఏమి చేసింది తిరిగి హీరో ని ప్రేమించిందా లేదా అన్నది సినిమా కథ అవసరాల శ్రీనివాస్ సొంత కథ అనుకుంటా చూడటానికి ok one time watch మూవీ !!!

4, అక్టోబర్ 2021, సోమవారం

"సిండ్రెల్లా " సినిమా పై నా అభిప్రాయం !!!

 బహుశా ఈ చిన్న సినిమా కి రివ్యూ రాసేవాడు నేనె అనుకుంటా ఎందుకంటే ఈ సినిమా విడుదల ఎప్పుడు అయిందో ఎవరికి తెలియకపోవచ్చు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు గాని కథ ఎలాగ ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం !!!

రాయ్ లక్ష్మీ సినిమాలో హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి అడవిలోని ఒక ప్రత్యేకమైన పక్షులు అరుపులు రికార్డ్ చేయటానికి వెళ్తుంది అయితే అక్కడ ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో వుంటారు వారందరూ అయితే అక్కడ అనుకోకుండా కొన్ని హత్యలు జరుగుతాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఆ హత్యలు రాయ్ లక్ష్మీ చేసినట్టు ఆధారాలు లభిస్తాయి అయితే తనకు ఆ హత్యలకు సంబంధం ఉండదు

అయితే ఆ హత్యలు ఎందుకు జరిగాయి ఎవరు చేశారు అన్నది సినిమా కథ అంత సినిమా టైటిల్ లొనే ఉంది మీకు సిండ్రెల్లా కథ గుర్తుందా చిన్నప్పుడు చదివే ఉంటారు కథ 

ఒక ధనిక కుటుంబంలో ఒక అందమైన అమ్మాయి పని మనిషిలాగా పని చేస్తుంది అయితే ఆ ధనిక కుటుంబంలోని వారు ఆమెను హింసలు పెడుతుంటారు ఆ ధనిక కుటుంబంలో  ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానకి వచ్చిన యువరాజు సిండ్రెల్లా ని చూసి ప్రేమలో పడతాడు అదే ఈ సినిమా కథ 

ఆ సిండ్రెల్లా కథ ఈ సినిమా కి ఎలా మ్యాచ్ అయింది అన్నది కథ !!!

3, అక్టోబర్ 2021, ఆదివారం

ముప్పై దాటితే ముగిసిపోయినట్టేనా ?😢😢😢

 వయసు ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని తీసుకువస్తుందో ఎవరికి తెలియదు పెళ్లి కావాలన్న, మంచి ఉద్యోగం పొందలన్నా, జీవితంలో settle అవ్వాలన్న ఏదైనా సరే 30 సంవత్సరాలురాకముందే జరిగిపోవాలి లేదంటే వింత మనుషుల్ని, చూసినట్టు చూస్తున్నారు జనం

ఈ విషయం మనం అంటే నేను ముప్పై లోకి అడుగుపెట్టిన తరువాత తెలిసింది చేస్తున్న జాబ్ లో డబ్బులు రానప్పుడు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినప్పుడు నీకు ముప్పై దాటింది కాబట్టి ఉద్యోగం రావటం కష్టం, దేవుడి దయ వల్ల పెళ్లి 2 సంవత్సరాల క్రితమే లేదంటే ముప్పై లో అవ్వటం చాలా కష్టం అంటే లైఫ్ మంచి ఉద్యోగం పొందినవారికి ఇది సులువు కానీ నాలాంటి వర్షాకాలం చదువులు చదివి ఎదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ పాసయ్యను అది దూర విద్య విధానంలో

కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది పిల్లలు వారి భవిష్యత్ ను తలుచుకుంటేనే భయమేస్తోంది చాలి చాలని జీతాలు ఆశగా ఎదురు చూసే చూపులు ఏదైనా అద్భుతం జరగక మనదా అని చూసే చూపులు ఇలా ప్రతి అంశంలో నిరాశే మిగులుతుంది ఎప్పుడు మారుతుందో జీవితం

ఎదురు చూడటం తప్ప మనం చేసేది ఏమి లేదు కానీ ఒక్కటి మాత్రం సీరియస్ గా చెప్పగలను మనం తీసుకునే ఏ నిర్ణయం అయిన మన భవిష్యత్ ని నిర్ణయిస్తుంది ఇది మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను !!!

27, సెప్టెంబర్ 2021, సోమవారం

"లవ్ స్టొరీ "సినిమా పై నా అభిప్రాయం !!!

 లవ్ స్టొరీ నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్ గా నటించిన శేఖర్ కమ్ముల direction లో వచ్చిన సినిమా లవ్ స్టొరీ september 24 థియేటర్ లో విడుదల అయ్యింది ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం 

హీరో రేవంత్ (నాగ చైతన్య ) ఒక బలహీన వర్గం కులంలో పుడతాడు చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూ హైద్రాబాద్ లో ఒక డాన్సింగ్ fitness సెంటర్ లో నడుపుతూ ఉంటాడు ఆ ఇంటి పక్కింటిలో మౌనిక ( సాయి పల్లవి ) తన ఫ్రెండ్ ఇంటిలోకి ఉద్యోగం కోసం అక్కడికి వస్తుంది అక్కడ పక్కనే అందరికి డాన్స్ లు నేర్పిస్తుంటాడు అలా వారిద్దరికీ పరిచయం పెరుగుతుంది చివరికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది

ఇద్దరిది ఒకే ఊరు కానీ మౌనిక ఉన్నత కులం, రేవంత్ డి లేని కులం వాళ్ళ ఇంటిలో అసలు ఒప్పుకోరు అయితే చివరకు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారా లేదా అన్నది సినిమా కథ

ఈ సినిమా బాగానే ఉంది కాని క్లైమాక్స్ అంతగా బాగోలేదు కానీ ఓవర్ expertation తో సినిమా చూడొద్దు సాయి పల్లవి డాన్స్ బాగా చేసింది, నాగ చైతన్య కూడా డాన్స్ బాగా చేసాడు 

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఫ్యామిలీ తో పాటు చూసే సినిమా లే ఉంటాయి ఇది కూడా అంతే బాగుంది సినిమా చూడ వచ్చు !!!

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

" Thittam irandu" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన Thittam irandu సినిమా sony liv ott లో విడుదల అయింది ఈ సినిమా సస్పెన్స్ కాదు ట్విస్ట్ లతో కూడుకున్న సినిమా ఇక ఈ సినిమా కథ గురించి మాట్లాడుదాం !!!

ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ ఐస్వర్య రాజేష్ ఈ సినిమా లో పోలీస్ పాత్రలో నటించింది ఐస్వర్య, తన స్నేహితురాలు దీప సూర్య చిన్ననాటి స్నేహితులు college చేరిన తరువాత ఇద్దరు విడిపోతారు అయితే ఐస్వర్య పోలీస్ ఆఫీసర్ అవుతుంది దీప సూర్య పెళ్లి చేసుకుని settle అవుతుంది అయితే ఒక రోజు దీప సూర్య మిస్సింగ్ అవుతుంది ఆ కేస్ విచారణ ఐస్వర్య తీసుకుంటుంది 

అలా ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా ఒక ప్రమాదం లో దీప సూర్య చనిపోయింది అని తెలుస్తుంది ఐటీఐ విచారణ లో పూర్తిగా చేస్తే అసలు చనిపోయింది సూర్య కాదని ఎవరో అమ్మాయి అని తెలుస్తుంది 

అయితే చివరి దీప సూర్య బ్రతికి ఉందా, లేదా అసలు ఏమైనట్టు అన్నది సినిమా కథ 

ఈ కథ చెప్పటం కంటే చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది బాగానే ఉంది సినిమా అసలు మామూలుగానే సాగుతుంది అనుకుంటాం కానీ సినిమా ట్విస్ట్ లు క్లైమాక్స్ ట్విస్టుతో మొత్తం కథ తెలుస్తుంది

సినిమా అయితే ఒకసారి చూడ వచ్చు బాగుంది సినిమా !!!

25, సెప్టెంబర్ 2021, శనివారం

ఆకాశవాణి సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆకాశవాణి సినిమా sony liv ott లో విడుదల అయింది సంద్రఖని తప్ప మిగతా వారందరూ కొత్త నటులే ఇక ఈ సినిమా గురించి చూద్దాం 

ఒక అటవీ ప్రాంతంలో నివాసం ఉండే గిరిజన ప్రజలు వాళ్ళకి బయట ప్రపంచం గురించి అసలు తెలియదు ఆ ప్రాంతంలో వాళ్ళను బానిసలుగా చేసుకుని వారిని పాలించే ఒక దొర వాళ్ళను బానిసలుగా కాకుండా వారికి ఆ దొర దేవుడిగా వాళ్లకు మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు ఆ దొరకి ఎదురు తిరిగినవారని దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి వాళ్ళని చంపిస్తాడు

ఒక ఊరిలో టీచర్ ఉద్యోగం చేస్తుంటాడు సముద్ర ఖని అయితే పట్టణానికి బదిలీ అవుతాడుఅప్పుడు తన కుమారుడు దగ్గర ఉన్న పాత రేడియో ని బయట పడేస్తాడు అయితే అది మారి, మారి చివరకు ఆ అటవీ ప్రాంతంలో గిరిజనులు ఉండే ప్రాంతానికి చేరుకుంటుంది అయితే ఆ రేడియో ని వాళ్ళు కొత్త దేవుడిగా పూజిస్తారు 

ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి ఇది ఒక వెరైటీ కథ చూడటానికి హాస్యం గా ఉన్న ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాగే జరుగుతుంది ఏమో బహుశా కానీ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు

పేద్ద బడ్జెట్ కాకుండా బాగానే ఉంది మంచి ప్రయోగం !!!

18, సెప్టెంబర్ 2021, శనివారం

నితిన్ " మాస్ట్రో " సినిమా పై నా అభిప్రాయం !!!

 నితిన్ నటించిన మాస్ట్రో సినిమా డిస్నీ hotstar ott లో నిన్న విడుదల అయింది ఇక ఆ సినిమా కథ గురించి చూద్దాం !!!

నితిన్ ఈ సినిమాలో కళ్ళు లేని అంధుడు పాత్రలో నటిస్తాడు కానీ నితిన్ కి కళ్ళు కనిపిస్తాయి పియానో వాయిస్తూ ఉంటాడు 

అయితే తమన్నా, నరేష్ భార్య భర్తలు నరేష్ ఒకప్పటి హీరో తరవాత తమన్నాని పెళ్లి చేసుకుంటాడు ఒక రెస్టారెంట్ లో పియానో వాయిస్తున్న నితిన్ చూసి తరువాత రోజు తన marriage anniversary అని తన ఫ్లాట్ కి రమ్మంటాడు 

ఆ మరుసటి రోజు హీరో నరేష్ వాళ్ల ఇంటికి వెళ్తాడు నితిన్ అయితే అక్కడ తమన్నా ఉంటుంది నరేష్ ని హత్య చేస్తారు కానీ నితిన్ కి మర్డర్ కనిపిస్తుంది కానీ తాను blind కాబట్టి ఆ విషయం బయటకు చెప్పకూడదు ఆ మర్డర్ తమన్నా చేస్తుంది 

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి చూడటానికి ఇంట్రెస్టిటింగ్ గా ఉంది ఇందులో హీరోయిన్ నభ natesh రెస్టారెంట్ ఓనర్ కూతురు పాత్రలో చేస్తుంది తనకి కథలో పెద్ద ఇంపోర్టెన్స్ లేదు కానీ సినిమా పర్వాలేదు 

ఒకసారి చూడ వచ్చు !!!

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

" పాగల్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 పాగల్ విశ్వక్ సేన్ హీరో గా చేసిన పాగల్ సినిమా గురించి తెలుసుకుందాం !!!

ప్రేమ్ ( విస్వక్ సేన్) చిన్నప్పటి నుండి తన అమ్మ (భూమిక) చాలా ఇష్టం కానీ కాన్సర్ తో వాళ్ళ అమ్మ చనిపోతుంది అయితే అప్పటి నుండి తనను తన అమ్మలాగా ప్రేమించే అమ్మాయి కోసం తాను ప్రతి అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే ప్రతి అమ్మాయి తనని రిజెక్ట్ చేస్తుంది

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగతా కథ చివరకు తనను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ఆ తరువాత తన జీవితంలో ఏమి మార్పులు జరిగాయి అన్నది మిగతా కథ 

మరీ అంత దారుణంగా లేదు సినిమా బాగానే ఉంది సినిమా ఒక సారి చూడవచ్చు  ఫస్ట్ హాఫ్ అంత కామెడీ బాగానే ఉంది కాని expectations తో సినిమా చూడొద్దు జస్ట్ బాగుంది అంతే !!!

" టక్ జగదీష్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 టక్ జగదీష్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

థియేటర్ లోకాకుండా ott లో విడుదల అయిన సినిమా టక్ జగదీష్ ఒక అందమైన భూదేవిపురం అనే ఊరు ఆ ఊరిలో ఒక రెండు కుటుంబాల మధ్య గొడవలు అందులో ఒక కుటుంబం లోని వ్యక్తి జగదీష్ (నాని) అవతల కుటుంబం విలన్ కుటుంబం ఎప్పుడు ఊరిలో ఉన్న పొలాలన్ని ఆక్రమించి గొడవలు పడుతుంటారు అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏమి హీరో వల్ల కుటుంబం లో కూడా ఆస్తిలో వాటల్లో మనస్పర్థలు వస్తాయి 

ఇందులో హీరో నాని అన్నయ్య గా జగపతి బాబు నటించారు హీరో వాళ్ళ నాన్న నాజర్ చనిపోయేదాక మంచిగా నటిస్తూ తరువాత ఆస్తి మొత్తం తన పేరుకు మర్పించు కుంటాడు 

హీరో వాళ్ళ అన్నయ్య ని తన కుటుంబంలో వచ్చిన ఆస్తి తగదాలును అలాగే విలన్ చేసే అకృత్యాలు ఎలా పరిష్కరించాడు అన్నది సినిమా కథ

ఇందులో కొత్తగా చెప్పుకోవాటినికి ఏమి లేదు నాని తన సినిమాలు మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటాడు కానీ ఈ సినిమా థియేటర్ లో ఎందుకు విడుదల కాకపోవడం మంచిది అయింది

మరి అంత ఓవర్ expectations తో సినిమా చూడొద్దు జస్ట్ average అంతే సినిమా 

కానీ ఫామిలీ మొత్తం చూడవచ్చు !!!

11, సెప్టెంబర్ 2021, శనివారం

" నెట్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన zee5 ott లో వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన సినిమా నెట్ ఇక ఈ సినిమా కథ ఎలాగ ఉందొ చూద్దాం ?

మనిషికి వ్యసనం రోజువారీ దినచర్య గా మారితే అది చెడు వ్యసనం అయితే ఎలా జీవితం మారుతుందో తెలిపే సినిమా

ఒక apartment లో ఒక couple జీవనం. సాగిస్తుంటారు అలాగే ఒక మధ్య తరగతి భర్త (రాహుల్ రామకృష్ణ ) ఒక భార్య ఉంటారు రాహుల్ ఆ ఊరిలో మొబైల్ షాప్ నిర్వాహిస్తుంటాడు 

ఫోన్ లో ఆశ్లేల చిత్రాల చూడటం రాహుల్ కి అలవాటు అలాగే ఒక సారి bathroom లో ఆ నీలి చిత్రాలు చూస్తుంటాడు అనుకోకుండా ఆ సైట్ నుండి లైవ్ టెలికాస్ట్ అయ్యే సైట్ ఓపెన్ అవుతుంది 

అది ఆ apartment లో ఉండే ఆ couple ఇలాగ ప్రతిరోజు వాళ్ళ జీవితంలోఎమి జరుగుతుందా అని చూస్తుంటాడు

తన దగ్గర డబ్బులు కాకుండా అప్పు తెచ్చి మరి వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో చూస్తుంటాడు అయితే వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి 

ఆ తరువాత ఏమైంది అన్నది మిగతా కథ ఫోన్, నెట్ ప్రపంచం మనిషిని ఏ స్థాయి కి తీసుకెళ్తుందో చెప్పే సినిమా మంచి ఆసక్తిగా ఉంది 

సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు రాహుల్ రామకృష్ణ బాగా నటించాడు !!!

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయక చవితి శుభాకాంక్షలు !!!

 వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అని తేడా లేకుండా సంబరాలు లో మునుగుతుంటారు వినాయకుడు అంటే అంత ఇష్టం అలాంటి వినాయక చవితి ఈ రోజు

ఆ గణనాథుడు ఆశీస్సులు మనందరికీ అందాలని ఆసిస్తూ కుటుంబమంతా ఆనందంగా వుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు !!!

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

" Family Man " session 2 వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది సెషన్ 1 లో ఎంత ఇంట్రెస్ట్ ఉందొ సెషన్ 2 లో కూడా ఏమాత్రం తీసిపోకుండా బాగా తీశారు సెషన్ 1 లో కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులను ఎలా తిప్పి గొట్టారో సెషన్2 లో తమిళ్ నాడు లోని కొంతమంది శ్రీ లంక రెబల్స్ ఉగ్రవాద  గురించి చూపటం జరిగింది

సెషన్ 2 లో ముఖ్యంగా తమిళ్ నాడులో శ్రీ లంక టెర్రరిస్ట్ లు మన భారత దేశ ప్రధాని పై దాడికి ప్రయత్నిస్తారు దానిని ఎలా తిప్పికొట్టారు అన్నది సెషన్ 2 లో ముఖ్యంగా సమంత కీలక పాత్రలో కనిపించారు

కానీ యాక్షన్ మాత్రం సెషన్2 లో చాలా బాగుంది సెషన్2 మొత్తం 9 ఎపిసోడ్ లు ఉన్నాయి 3 సెషన్ కూడా ఉంటుంది అనుకుంటా సెషన్ 2 లో 3 వ సెషన్ కి సంబంధించి లీడ్ వదిలారు 

కానీ మంచి ఇంట్రెస్టిటింగ్ ఉంది వెబ్ సిరీస్ బాగుంది 👌👌👌

31, ఆగస్టు 2021, మంగళవారం

" తిమ్మరసు " సినిమా పై నా అభిప్రాయం !!!

 తిమ్మరసు సినిమా సత్యదేవ్  తెలుగులో ఒక మంచి నటుడు అని చెప్పు కోవచ్చు అలాంటి సత్య దేవ్ హీరో గా నటించిన సినిమా తిమ్మరసు 

సత్య దేవ్ లాయర్ పాత్రలో నటించాడు ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం 

ఒక క్యాబ్ డ్రైవర్ మర్డర్ జరుగుతుంది ఆ డ్రైవర్ మర్డర్ కేస్ ఒక అమాయకుడు అయిన అబ్బాయి మీద పోలీస్ లు మోపి తాను చేయని నేరానికి తనకు 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు 

అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది , ఎవరు చేశారు అన్నది లాయర్ సత్యదేవ్ ఆ కేస్ ని సాల్వ్ చేస్తాడు ఇదే సినిమా కథ కానీ సినిమా బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు 

సత్య దేవ్ తన పాత్ర లో న్యాయం చేశాడు బాగుంది సినిమా !!!

30, ఆగస్టు 2021, సోమవారం

S.R. కల్యాణ మండపం సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజవారు రాణి గారు సినిమా హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా s. r కల్యాణ మండపం ఆ సినిమా లో కిరణ్ యాక్టింగ్ బాగానేఉంటుంది అది చూసి ఇది ఎలాగ ఉంటాదో చూద్దామని చూశాను ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

రాయలసీమ ప్రాంతంలో ఒక ఊరిలో ఉంటుంది S. R. కల్యాణ మండపం దానిని తర తారా లుగా హీరో కిరణ్ ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది అయితే హీరో వాళ్ళ నాన్న సాయి కుమార్ తాగుడు,పేకాట కు బానిసై ఊళ్ళో ఉన్న ఆస్తులన్ని అమ్మేసి చివరకు కల్యాణ మండపం కూడా తాకట్టు పెట్టాలని చూస్తాడు ఆ కల్యాణ మండపం మొత్తం బీర్ సీసాలతో చాలా గలీజ్ గా తయారు అవుతుంది వాటిలో పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ముందుకు ఎవరు రారు అలా ఉంటే ఎవరు వస్తారు

అయితే హీరో పక్కన ఉన్న టౌన్ లో college లో చదువుతుంటాడు ఈ విషయం వాళ్ళ అమ్మ హీరో కి చెబుతుంది 

వెంటనే హీరో అక్కడికి వచ్చి ఎలాగైనా ఆ కల్యాణ మండపాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఎలాగైతే sucsess సాధిస్తాడు అప్పుడే తన ప్రేమించే అమ్మాయి వేరొక అబ్బాయితో పెళ్లి అదే కల్యాణ మండపం లో బుక్ అవుతుంది ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి 

ఈ కథలో కొత్తదనం ఏమి లేదు రొటీన్ గానే ఉంటుంది జస్ట్ average నాకు 1 గంట సినిమా చూసే సరికి బోర్ గా అనిపించింది కానీ నేను మాత్రం exppertation టోన్ సినిమా చూసాను కానీ అది రీచ్ కాలేదు !!!😢😢😢

28, ఆగస్టు 2021, శనివారం

" వివాహ భోజనంబు " సినిమా పై నా అభిప్రాయం !!!

 వివాహ భోజనంబు కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా  ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

హీరో సత్య ఒక పిసినారి lic లో జాబ్ చేస్తుంటాడు అయితే హీరోని ఒక ధనవంతురాలు అయిన అమ్మాయి ప్రేమిస్తుంది అయితే హీరోకి ఏ విధమైన ఆస్తి, అందం, లేదని హీరోయిన్ వాళ్ళ నాన్న రిజెక్ట్ చేద్దామనకుంటాడు అయితే హీరోయిన్ తాత హీరో వాళ్ళ ఇంటి పేరు ఇష్టమని చెప్పి ఆ సంబంధం ఖాయం చేస్తాడు

అయితే ఎలాగోలా పెళ్లి అవుతుంది అయితే ఆ తురువాత కరోనా లోక్డౌన్ పెడుతుంది గవర్నమెంట్ అప్పుడు పిసినారి అయిన హీరో హీరోయిన్ ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా లోక్డౌన్ ఉన్న రోజులు ఎలా పోషించాడు అన్నది , హీరోయిన్ వాళ్ళ నాన్న ని ఎలా ఒప్పించాడు అన్నది మిగతా కథ 

ఈ సినిమా లో లోక్డౌన్ లో మనం వార్తల్లో చూసిన సరదా సన్నివేశాలు కనిపిస్తాయి

ఈ సినిమాలో చెప్పటానికి ఏమి లేదు రొటీన్ కథే కాకపోతే కొద్దిగా కరోనా కామెడీ కలిపి తీసిన సినిమా !!!

27, ఆగస్టు 2021, శుక్రవారం

" భూమిక " సినిమా పై నా అభిప్రాయం !!!

 భూమిక తమిళ్ డబ్బింగ్ సినిమా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!

ఈ కథలో ఐశ్వర్య భర్త ఒక అరసీటెక్చర్ ఒక పురాతనమైన పాడుబడిన ఒక అడవి ఆ అడవి మధ్యలో  అక్కడక్కడ ఇల్లులు, స్కూల్ లు పాడు బడి ఉంటాయి వాటిని అందంగా తీర్చి దిద్ది ఆ ప్రదేశాన్ని టౌన్ షిప్ గా తయారు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడు దానికి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు వెళ్తాడు 

అయితే అక్కడికి వెళ్లినప్పటినుండి అక్కడ ఆ ఇంట్లో ఎదో గందర గోళంగా ఉంటుంది కార్ accident లో చనిపోయిన తన ఫ్రెండ్ కృష్ణ మొబైల్ నుండి message లు వస్తుంటాయి 

మొదట ఆ message లు కృష్ణ పంపుతున్నాడు అనుకుంటారు కానీ చివరికి ఒక పాప message పంపిస్తుంది అసలు ఆ పాప కి వాళ్ళు ఉండే ప్రదేశానికి ఏమిటీ సంబంధం అసలు ఆ పాప ఎవరు ఎందుకు message పంపిస్తుంది అన్నది సినిమా కథ !!!

మరి అంతా ఓవర్ expectation తో సినిమా చూడ వద్దు పరవాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

24, ఆగస్టు 2021, మంగళవారం

" 200 Halla ho సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది హిందీ డబ్బింగ్ ఈ సినిమా కథ కొంచెం ఇంచుమించు మన వకీల్ సాబ్ సినిమాను పోలి ఉంటుంది ఇక కథ గురించి చూద్దాం !!!

ఈ కథ కోర్ట్ లో సుమారు 200 మంది ఆడవాళ్లు ముసుగులు వేసుకుని ఒక ఖైదీని అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపేస్తారు

అసలు ఎందుకు అంత దారుణంగా చంపారన్నది అంటే ఆ నెరస్తుడు ముంబైలోని ఒక బస్తీలో ఉండే దళిత జాతి స్త్రీలను అత్యచారం చేసి ఎదురు తిరిగినా వారిని అతి క్రూరంగా చంపేసేవాడు అక్కడ పెద్ద పెద్ద పొలిటీషన్స్ అతనికి పరిచయాలు ఉండేవి , పోలీస్ లతో కూడా అందుకే వాళ్ళు అతడిని ఏమి చేసేవారు కాదు 

ఆ నెరస్తుడ్ని పొడిచి చంపేసింతరువతా కొంతమందిని దళిత స్త్రీ లను అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు చూపెట్టి వాళ్లకు జీవిత ఖైదీ పడేలా చేశారు

చివరకు ఆ మహిళలను ఎలా బయటకు తీసుకు వచ్చారు అన్నది మిగతా కథ 

సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు 👍👍👍 !!!

22, ఆగస్టు 2021, ఆదివారం

నయనతార నటించిన " నేత్రికన్ " సినిమాపై నా అభిప్రాయం !!!

 నేత్రికన్ తమిళ్ డబ్బింగ్ సినిమా నయనతార ప్రధాన పాత్రలో నటించింది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు ఎలాగ ఉందొ చూద్దాం !!!

నయనతార ఒక సీబీఐ ఆఫీసర్ అయితే ఒక accident లో తన రెండు కళ్ళు పోగొట్టుకుంటుంది విలన్ ఒక సైకో 

డాక్టర్ లాగా పనిచేస్తూ అమ్మాయిల్ని వీడియో తీస్తూ blackmail చేస్తూ వాళ్ళని లోబర్చ్ కుంటూ వాళ్ళని చిత్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు 

అయితే విలన్ కన్ను నయనతార మీద పడుతుంది ఆ తరువాత ఆ విలన్ నుండి ఆ అమ్మాయిల్ని, ఎలా కాపాడింది, చివరికి ఆ సైకో విలన్ ని ఎలా పోలీస్ లకు పట్టించింది అన్నది మిగతా కథ 

చూడటానికి బాగుంది సినిమా ఒక సారి చూడవచ్చు !!!

రొటీన్ గానే ఉంది గాని సినిమా బాగుంది 👍👍👍

21, ఆగస్టు 2021, శనివారం

"ఆదివారం పండగొస్తే - ఆదివారం వానొస్తే "

 మనకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టమైన రోజు ఏదైనా ఉందంటే అది ఆది వారమే ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి కానీ ఆ రోజు పండగ వచ్చిన, లేదా వాన వచ్చిన చాలా బాగోదు

ఎందుకంటే పండగంటే సెలవు కానీ ఆ పండగ ఆదివారం వస్తే ఎందుకో నచ్చదు మిగిలిన వారాలు అన్ని ఉండగా ఒక ఆదివారం మాత్రమే పండగ వచ్చిన లేదా ఆ రోజు వాన వచ్చిన నచ్చదు ఎందుకంటే వారమంత కష్టపడి ఆదివారం ఎన్నో ప్లాన్స్ తో ఉంటారు బయటకు వెల్దామని షాపింగ్ కి వెల్దామని ఇలా ఎన్నో ఉంటాయి 

కానీ ఆరోజు వానోచ్చిన పండగ వచ్చిన అసలు ఇష్టం ఉండదు కానీ స్కూల్ లైఫ్ లో రాఖీ పండగ ఆదివారం వస్తే మాత్రం చాలా ఆనంద పడేవారము ఎందుకంటే ఆదో సరదా అంతే 

అన్నట్టు రేపు రాఖీ పండగ మరియు ఆదివారం కదా అందరికి 

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు !!!💐💐💐

18, ఆగస్టు 2021, బుధవారం

" ఒరేయ్ బామ్మర్ది " సినిమాపై నా అభిప్రాయం !!!

 బిచ్చగాడు సినిమా తీసిన శశి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఒరేయ్ బామ్మర్ది సిద్దార్థ ,జీ. వి.ప్రకాష్ కుమార్ నటించిన సినిమా ఇక ఈ కథ చూద్దాం !!!

ఒక అక్క , ఒక తమ్ముడు ( జీ. వి ప్రకాష్ కుమార్ ) చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు అయితే వాళ్ళను వాళ్లే చూసుకుని జాగ్రత్తగా పెరుగుతారు వాళ్లకు ఒక అత్త కూడా ఉంటుంది ఆవిడ కూడా సహాయపడుతుంటుంది ప్రకాష్ బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అలాగే ఒక సారి బైక్ రేసింగ్ లో పాల్గొంటే ట్రాఫిక్ పోలీస్ సిద్దార్థ్ ప్రకాష్ ను పట్టుకుని అతనికి సిగ్గు పడి మరల రేసింగ్ వెళ్లకుండా  నైటీ వేసి అది వీడియో తీసి యూట్యూబ్ లో పెడతాడు 

అది పగను పెంచుకుని సిద్దార్థ పై పగను పెంచుకుంటాడు ప్రకాష్ అయితే అనుకోకుండా తన అక్కకు భర్త గా సిద్దార్థ తో పెళ్లి జరుగుతుంది

అయితే ఆ పెళ్లి ప్రకాష్ కి ఇష్టం ఉండదు అయితే ప్రకాష్ ని సిద్దార్థ్ ఎలా ఒప్పించాడు వారిద్దరూ ఎలాగ కలిశారు అనేది మిగతా కథ 

సినిమా అంతా సెంటిమెంట్ మీద నడుస్తుంది పరవాలేదు ఒకసారి చూడ వచ్చు !!!

15, ఆగస్టు 2021, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన "చతుర్ముఖం " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా లో విడుదల అయింది చతుర్ముఖం సినిమా మలయాళ డబ్బింగ్ సినిమా కానీ సినిమా మాత్రం మంచి exciting గా ఉంది సినిమా కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

ఇందులో హీరోయిన్ , హీరో సి.సి కెమెరా బిసినెస్ చేస్తుంటారు అయితే హీరోయినికి ఫోన్ వాడకం చాలా ఇష్టం సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది అయితే అనుకోకుండా తన వాడుతున్న ఫోన్ నీళ్లలో పడి చెడిపోతుంది అయితే ఆన్లైన్ లో తక్కువుగా ఫోన్ వస్తుంది అని ఒక కొత్త రకం ఫోన్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంది 

ఆ ఫోన్ రానే వస్తుంది కానీ ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి తన జీవితంలో అనుకోని సంఘటనలు, ఎప్పుడు ఉహించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చివరకు తనకు ఆ ఫోన్ వచ్చిన 21 రోజులలో చనిపోతుంది అని తెలుస్తుంది 

ఇటువంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కువున్నది అన్నది సినిమా కథ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా బాగుంది ఖచ్చితంగా ఒక సారి చూడ వచ్చు బాగుంది సినిమా 👍👍👍👌👌👌 !!!

12, ఆగస్టు 2021, గురువారం

ఆహా Ott లో విడుదల అయిన " సూపర్ డీలక్స్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా కథ కొంచెం విచిత్రంగా, విడ్డురంగా ఉంటుంది ఒక నలుగురు కుటుంబాలకు సంబంధించిన కథ ఇక కథ గురించి మాట్లాడుకుందాం !!!

కథలో మొదటి కుటుంబం సమంత, ఫాహాద్ ఫాసిల్ భార్య భర్తలు అయితే వీరిద్దరి సరి అయిన ప్రేమ అనురాగలు ఉండవు అయితే సమంత తన college చదివే రోజుల్లో బాయ్ ఫ్రెండు తో సాన్నిహిత్యం గా ఉంటుంది రూమ్ లో కలుసుకుంటారు కూడా  అయితే ఈ విషయం తన భర్తకు తెలిసిపోతుంది ఆ తరువాత ఏమి జరుగుతుంది అన్నది కథ

కథలో రెండవ కుటుంబం కట్టుకున్న భార్యను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు భర్త అయితే చాలాకాలం తరువాత తిరిగివస్తాడు ఎంతో కాలం ఎదురుచూసిన భార్య, కొడుకు, తన భర్త వస్తాడు కానీ ఒక హిజ్రా లాగా అది చూసి అందరూ షాక్ తింటారు ఆ తరువాత ఆ కుటుంబం లో ఏర్పడిన పరిస్థితులు మిగతా కథ

కథలో మూడవ భాగం కొంతమంది చదుకునే అబ్బాయిలు కలిసి బ్లూ ఫిల్మ్ లు చూస్తారు అయితే అనుకోకుండా  ఫిల్మ్ లో ఒక అబ్బాయి తల్లి నటిస్తుంది ఆ తరువాత ఏమి జరిగింది అన్నది కథ

ఇందులో హిజ్రా పాత్రలో చేసిన విజయ్ సేతుపతి acting గురించి కచ్చితంగా చెప్పుకోవాలి 

ఇందులో నటించిన వారు చాలా బాగా చేశారు కానీ సినిమా మాత్రం కథ ఇలాగ ఉంటుంది అని conclusion కి మాత్రం రాలేము 

జస్ట్ టైం పాస్ అంతే సినిమా !!!

8, ఆగస్టు 2021, ఆదివారం

"ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా ఎప్పుడో 2019 విడుదల అయ్యింది ఎప్పటి నుండో చూద్దాం అనుకుని నిన్న చూసాను ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక nsa ఆఫీసర్ మిలట్రీ కి సంబంధించింది అయితే తన తల్లి తండ్రుల్ని కశ్మీర్ క్లో అన్యాయంగా చంపేస్తాడు పాకిస్తాన్ తీవ్రవాది ఘజి బాబా అయితే అది దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మిలో జాయిన్ అవుతాడు అది ఎంతో కష్టపడి చివరికి ఘజి బాబా ను పట్టుకుంటాడు 

కానీ ఆ తరువాత అతన్ని వదిలెనుచటానికి ఘజి బాబా ముఠా సభ్యులు ఒక మినిస్టర్ కూతుర్ని కిడ్నప్ చేసి తద్వెరా ఘజి బాబా ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు

ఆ తరువాత చివరకు కథ ఏమిటన్నది మిగతా కథ కథ రోటీనగానే ఉంది కొత్తదనం ఏమి లేదు కానీ దేశం గురించి సినిమా కాబట్టి ఒకసారి చూడ వచ్చు !!!

6, ఆగస్టు 2021, శుక్రవారం

ఫేక్ message లు ఎందుకు ఫార్వర్డ్ చేస్తారో ?

 అవును సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏది ఫాక్ట్, ఏది ఫేక్ అసలు అర్థం కావటం లేదు 2000 రూపాయలు త్వరలో రద్దు అవ్వటం, ఒక్కొక్కరికి 1 లక్ష 30 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందంటూ అసలు ఇలాంటి message లు ఎందుకు ఫార్వర్డ్ అవుతున్నాయో అర్థం కావటం లేదు

ఇలా అయితే నిజమైన message లు కూడా ఫేక్ గా కనిపిస్తాయి  !!!

2, ఆగస్టు 2021, సోమవారం

" barot house " సినిమాపై నా అభిప్రాయం !!!

 Barot house జీ5 ott లో విడుదల అయింది ఇక ఏ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

ఓ పెద్ద హౌస్ అందులో ఒక ఫామిలీ భార్య భర్తలు, 3 ఆడ పిల్లలు, 1 అబ్బాయి, నానమ్మ , బాబాయి అంత సాఫీగానే సాగుతున్న జీవితంలో అనుకోకుండా పెద్ద అమ్మాయి చనిపోతుంది , ఆ తరువాత 2 వ అమ్మాయి చనిపోతుంది 

అసలు ఇంతకీ ఈ మర్డర్ లు ఎవరు చేస్తున్నారు ఎందుకు ఇలాగ జరుగుతుంది అన్నది సినిమా కథ 

తప్పకుండా ఒక సారి చూడ వచ్చు క్రైమ్ థ్రిల్లర్ మూవీ !!!

31, జులై 2021, శనివారం

సారపట్టు పరంపర సినిమా పై నా అభిప్రాయం !!!

 సర్పట్టు పరంపర తమిళ్ డబ్బింగ్ సినిమా ఆర్య ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇక కథ విషయం గురించి చూద్దాం

స్వాతంత్రం వచ్చిన తరువాత తమిళ్ నాడులోని మద్రాస్ లో కొంతమందికి ఆంగ్లేయులు తమ సరదా కోసం బాక్సింగ్ నేర్పించే వారు అలాగే కొంతమంది ఆ ఇష్టంతో అలాగే తమ తరువాతి తరాలు వారికి నేర్పించేవారు

చిన్న ఊళ్ల మధ్య పోటీలు జరుగుతాయి అలాంటి చిన్న ఊరు సారపట్టు పరంపర ఎన్నో బాక్సింగ్ యుద్దాలు చేసి ఓటమి పాలు అయ్యేవారు అప్పుడు హీరో ఆర్య ఎంతో ఇష్టం బాక్సింగ్ అంటే కానీ వాళ్ళ అమ్మ కి ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న బాక్సింగ్ లోకి వెళ్లి తరువాత రౌడి అయ్యి చంపేసారని తనని బాక్సింగ్ వైపు వెళ్లకుండా చూసేది 

కానీ హీరో ఆర్య ఎలాగైతే బాక్సింగ్ లో స్తానం సంపదిస్తాడు ఆ తరువాత అతను ఎదురొకొన్న పరిస్తుతులు అవన్నీ మిగతా కథ నిజంగా మంచి కిక్ ఇచ్చే సినిమా చాలా బాగుంది 

నిజంగా బాక్సింగ్ గురించి చాల బాగా చూపించారు !!!👌👌👌

30, జులై 2021, శుక్రవారం

"UIlu " OTT లో విడుదల అయిన " Tandoor " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం.!!!

 Ullu  ott బహుశా ఇది పెద్దవారికి మాత్రమే అని చెప్పా వచ్చు ఇక tandoor సిరీస్ గురించి మాట్లాడుకుందాం !!!

Tandoor అవును ఈ మాట వినగానే మీకు గుర్తుకు వచ్చేది చికెన్ tandoor గుర్తుకు వస్తాది ఈ కథ కూడా 

ఇందులో హీరో, హీరోయిన్ ని చంపేసి ఆ శవాన్ని ఒక డాబా లోని tandoor చేసే స్థలంలో తగల పెట్టేస్తారు దానితో అక్కడ పెద్ద మంట వస్తుంది దానిని చూసి పోలీస్ లకి ఎలాగో అక్కడికి చేరుకుని అక్కడ శవం కాలుస్తున్నారని తెలుసుకుని అక్కడ ఉన్న డాబా సెర్వెంట్ ని అరెస్ట్ చేస్తారు

కానీ అప్పటికే అక్కడి నుండి హీరో పరారీలో ఉంటాడు ఆ  తరువాత పోలీస్ లు అతన్ని ఎలా పట్టుకున్నారు అన్నది అసలు అతను ఎందుకు చంపాడు అన్నది సినిమా కథ 

చూడటానికి బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!

27, జులై 2021, మంగళవారం

ఆహా ott లో విడుదల అయిన నీడ సినిమా పై నా అభిప్రాయం !!!

 నీడ డబ్బింగ్ సినిమా సస్పెన్సు thriiler జోనర్ లో విడుదల అయ్యింది ఇక ఈ సినిమా ఇప్పుడు ఎలాగ ఉందొ చూద్దాం 

నీడ సినిమా కథ హీరో ఒక జడ్జి అయితే అతనికి ఫ్రెండ్ అమ్మాయి చైల్డ్ psychlogy  డాక్టర్

 ఒక అబ్బాయి 8 సంవత్సరాలు ఉంటాయి అతడు క్రైమ్ స్టోరీ లు చెబుతాడు కాకపోతే అవి నిజంగా జరుగుతుంటాయి అసలు ఆ 8 సంవత్సరాల అబ్బాయికి ఆ క్రైమ్ స్టోరీ లు ఎలాగ తెలుసు పైగా అవన్నీ నిజంగా జరిగిన కథలుగా దర్శనం ఇస్తాయి 

అలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగతా సినిమా కథ అయితే ఇందులో ఆ బాబు తల్లి పాత్రలో నయనతార నటించింది

చూడటానికి బాగానే ఉంది మంచి టైం పాస్ స్టోరీ కొత్తగా ఉంది ఇందులో హీరోకి ఓపెనింగ్ scene లో accident  జరుగుతుంది అయితే అప్పటి నుండి అతనికి వర్షం రాకపోయినా వర్షం పడినట్టు అనిపిస్తుంది చూడటానికి కథ కొత్తగా ఉంటుంది 

బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!

25, జులై 2021, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన హీరో సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది కన్నడ డబ్బింగ్ సినిమా హీరో రిషిబ్ శెట్టి అంటే మనకు ఆ హీరో కొత్త ఎప్పుడు చూడలేదు ట్రైలర్ చూసాను ఎదో కాలేక్షేపం కోసం మూవీ చూసాను ఇప్పుడు ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం

కథ ఏమిటంటే సింపుల్ హీరో హీరోయిన్ ని ప్రేమిస్తాడు అయితే హీరోయిన్ హీరో ని కాకుండా అనుకోని విలన్ ని పెళ్లి చేసుకుంటుంది అయితే ఆ బాధతో హీరో హీరోయిన్ పై పగ పెంచుకుని ఎలాగైనా చంపేద్దాం అనుకుంటాడు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటాడు

అయితే విలన్ ఒక అడవిలో ఒక అద్బుతమైన బంగ్లాలో ఉంటాడు ఎలాగైనా హీరోయిన్ ని చంపేద్దాం అనుకుని హీరో ఆ బంగ్లా లోకి సవరం చేసే వాడిలాగా ఆ బంగ్లా లోకి వెళ్తాడు అయితే అక్కడ హీరోయిన్ ఆనందంగా ఉంది అనుకుని ఎలాగైనా చెంపేద్దాం అనుకుంటాడు కానీ అక్కడ హీరోయిన్ విలన్ చేత దెబ్బలు తింటుంది అది ఆ దెబ్బలు తట్టుకోలేక హీరోయిన్ విలన్ ని చంపేస్తుంది అప్పుడే హీరో ఆ బంగ్లా లోకి ప్రవేశిస్తాడు 

ఆ తరువాత ఏమి జరిగింది అన్నది సినిమా కథ కొంచెం కామెడీ, కొంచెం డ్రామా అదే సినిమా కథ జస్ట్ average సినిమా !!!

21, జులై 2021, బుధవారం

" నారప్ప" సినిమా పై నా అభిప్రాయం !!!

 నారప్ప విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇది తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి రీమేక్ 

ఇక ఈ సినిమా ఎలాగ ఉందొ ఇప్పుడు చూద్దాం బహుశా వెంకీ మామా సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ చేసిన సినిమా అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చింది 

కథ ఏమిటంటే నారప్ప ,తన భార్య సుందరమ్మ 

( ప్రియమణి) , మని కర్ణ, చిన్నప్ప, చిన్న పాపా, వాళ్ళ మావయ్య సాంబయ్య (రాజీవ్ కనకాల) ఒక ఊరిలో తమకున్న 3 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు అయితే ఆ ఊరిలో భూస్వామి పండు స్వామి ఆ ఊరిలో ఉన్న పొలాలన్ని తీసుకుని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచిస్తాడు 

దానికి నారప్పకు ఉన్న 3 ఎకరాలు కూడా ఇవ్వమని అడుగుతాడు కానీ దానికి ఒప్పుకోడు నారప్ప దానితో వారిద్దరికీ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి 

నారప్ప పెద్ద కొడుకు మనికర్ణ ఆవేశ పరుడు తన తండ్రిని నారప్పని అవమానించారని పండు స్వామి ని చెప్పు తో కొడతాడు దానిని జీర్ణించుకోలేని పండు స్వామి మని కర్ణ ని చంపిస్తాడు 

ఆ తర్వాత మని కర్ణ తమ్ముడు మని కర్ణ తమ్ముడు చిన్నప్ప పండు స్వామి ని చంపేస్తాడు అంతే ఆ తరువాత కథ ఏమిటన్నది చూడాలి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు నారప్ప గతం ఎలాంటిది అనేది సినిమా కథ

రాయల సీమ భాషలో అడ్డాల శ్రీకాంత్ మాస్ చాలా బాగా డీల్ చేసాడు వెంకటేష్ తన నటనా చాలా బాగుంది

ఓవరాల్ గా సినిమా బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

20, జులై 2021, మంగళవారం

" The Family man " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 The Family man వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది బహుశా 2019 లో విడుదల అయ్యింది అనుకుంటా నేను మొత్తం 7 గంటల పైనే నిడివి ఉంది అంత ఓకేసారి చూడలేము కాబట్టి అప్పుడప్పుడు చూసాను 

ఇక ఈ వెబ్ సిరీస్ session 1 లో ఎలా మొత్తం 10 పార్ట్ లుగా ఉంది  నేను ఫ్యామిలీ మాన్ అంటే కుటుంబ బాధ్యతలు కు సంబంధించిన కథ ఏమో అనుకున్నాను కానీ ఇది ఎంత మాత్రం కాదు

కథ విషయానికి వస్తే శ్రీకాంత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ తన భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే శ్రీకాంత్ తన పని ఏమిటంటే ఉగ్రవాదులు కదలికలు గురించి దేశాన్ని ఎలా కాపాడాలి అదే విధంగా తన కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడనేది సినిమా కథ 

ఉగ్రవాదులు మన దేశంపై చేస్తున్న కుట్రలను ఎలా తిప్పి కొట్టడానేది నిజంగా చాలా బాగా చూపించారు నిజంగా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది ఇందులో సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు 

ఉగ్రవాదులు తమ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి తో ఎలా దేశాన్ని న్యూ ఢిల్లీ నగరాన్ని అంతం చేయాలని చూసారో అనే ముగింపు తో మొదటి సెషన్ ఎండ్ అవుతుంది

రెండో session కూడా వచ్చింది అది చూసిన తరువాత దాని గురించి మాట్లాడుకుందాం హీరో భార్యగా ప్రియమణి చాలా బాగా యాక్ట్ చేశారు 

ఓవరాల్ గా వెబ్ సిరీస్ చాలా బాగుంది ఆ లొకేషన్ లు కూడా పాకిస్తాన్ చాలా natural గా చూపించారు కానీ మంచి కిక్ వస్తుంది వెబ్ సిరీస్ చూసినప్పుడు ఇది మాత్రం నిజం !!!

18, జులై 2021, ఆదివారం

అలవాటు పడితే అంతే మరి !!!

 అవును మనం ఒక సారి దేనికైనా అలవాటు పడితే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం నేను దేని గురించి చెబుతున్నానో మీకు తెలుసు కోవాలంటే చదవండి

మే మొదటి వారం నుండి అనుకుంటా ఏపీలో కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటలవరకు విధించారు దాదాపు 2 వారాలు హాయిగా మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలు మూసివేసి హాయిగా ఇంటికి వెళ్లి ఉండేవాళ్ళం ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలు దాకా పొడిగించారు

అది 2 వారాలు సాగింది ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు వరకు వెసులుబాటు ఇచ్చారు ఆ ఆతరువాత ప్రస్తుతం రాత్రి 9 గంటలు దాకా ఉంది ఆ 12, 2, 5 గంటలు అలవాటు అయ్యి రాత్రి 9 గంటలు దాకా ఉండాలి అంటే నిజంగా చాలా కష్టంగా ఉంది

ఎంతైనా ఒకసారి సుఖానికి అలవాటు పడినవారు తమ అలవాటును పోదు

14, జులై 2021, బుధవారం

" State of siege Temple attack " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా zee5 ott లో విడుదల అయ్యింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన దేశ సైనికులకు జరిగే ఒక కథ కొంతమంది పాకిస్తానీ టెర్రరిస్ట్లు మన ఇండియా లోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయంపై దాడి చేసి చాలామంది భక్తుల్ని చంపేసి , మరికొంత మందిని కిడ్నాప్ చేసి మనదేశంలో ఉన్న తమ టెర్రరిస్ట్ విడుదల కోసం ప్రయత్నం చేస్తారు

అయితే ఈ సమస్య నుండి మన సైనికులు వాళ్ళను ఎలా కాపాడారు అన్నది కథ చూడటానికి రౌటీన్ అయిన కథ బాగుంది 

ఈ సినిమా చూస్తున్నంత సేపు నాగార్జున హీరోగా నటించిన గగనం సినిమా గుర్తుకు వచ్చింది కానీ సినిమా బాగుంది ఒక సారి చూడవచ్చు !!!

12, జులై 2021, సోమవారం

ఏపీలో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు !!!

 కొన్ని జిల్లాలకు మాత్రమే మినహాయింపులు ఇచ్చిన ఇప్పుడు ఏపీలో అన్ని జిల్లాలకు ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటలకు వరకు సడలింపులు ఇచ్చారు

రాత్రి 10 గంటలు నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలిఅని లేని యెడల 100 రూపాయలు ఫైన్  !!!

10, జులై 2021, శనివారం

విజయ్ సేతుపతి " విక్రమార్కుడు " సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ సేతుపతి తమిళ్ లో మంచి follwing ఉన్న హీరో ఇక ఆయన నటించిన విక్రమార్కుడు సినిమా ఆహా ott లో విడుదల అయింది ఇక ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

జుంగా (విజయ సేతుపతి) ఒక బస్ కండక్టర్ అయితే ఒక చిన్న ప్రేమ కథ వల్ల కొంతమంది ఆకతాయిల చేతిలో దెబ్బలు తింటాడు 

ఆ తరువాత వాళ్ళని జుంగా కొడతాడు దెబ్బలు తిని ఇంటికి వెళ్లిన జుంగా కి వాళ్ళ అమ్మ జుంగా వల్ల నాన్న, తాత పెద్ద డాన్ అని చెబుతుంది

అప్పట్లో చెన్నైలో జుంగాకి పూర్వీకులకి ఒక థియేటర్  ఉండేది అప్పట్లో దానిని తక్కువ రేట్ కి రెడ్డి కి అమ్మేస్తాడు వాళ్ళ నాన్న ,తాత

అయితే దానిని తిరిగి జుంగా ఎలాగ సంపాదించాడు అన్నది కథ అంత routeen గా ఉంటుంది కథలో కొత్తదనం ఏమి లేదు కానీ కామెడీ గా బాగుంది సినిమా 

అయితే విజయ్ సేతుపతి తగ్గ సినిమా అయితే కాదు ఒక సాధారణ సినిమా !!!

9, జులై 2021, శుక్రవారం

" crrush"సినిమా పై నా అభిప్రాయం (పెద్దలకు మాత్రమే ) !!!

 Crrush సినిమా టీనేజ్ వయసులో వచ్చే  ఫీలింగ్స్ గురించి చెప్పే సినిమా అడల్ట్ కామెడీ 

ఇక కథ విషయానికి వస్తే పై చదువులకు అమెరికా వెళ్లే ముగ్గురు టీనేజ్ యువకులు అక్కడ చదువుకుంటున్న ఒక అబ్బాయి అక్కడి పరిస్థితులు అక్కడ సెక్స్ కు సంబంధించి అక్కడ టీనేజర్స్ అసలు సెక్స్ లో చిన్న వయసులోనే పాల్గొంటారని ఇక్కడి నుండి వచ్చే ఇండియన్స్ కి సెక్స్ అవగాహన ఉండదని మీరు ఇక్కడ ఆ అనుభూతి పొంది అక్కడకు అమెరికా కు వస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు

అయితే ఆ తరువాత ఆ ముగ్గురు సుఖం కోసం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కువున్నారు అన్నది సినిమా కథ ఇది కేవలం పెద్దలకు మాత్రమే  

అడల్ట్ కామెడీ సినిమా పెద్దలకు మాత్రమే ఈ సినిమా కామెడీ బాగుంది కొన్ని సీన్లు రవి బాబు అల్లరి సినిమా గుర్తొస్తుంది !!!

మేటి మాట !!!


 

7, జులై 2021, బుధవారం

" Thaen" సినిమా పై నా అభిప్రాయం !!!

 Thaen సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా ఏ సినిమా కథ బాగుంది మంచి ఆర్ట్ ఉన్న సినిమా 

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక అందమైన అడవి అడవి చుట్టూ అందమైన కొండలు ఆ కొండలలో నివాసిస్తుంటారు అక్కడ కొంతమంది ప్రజలు అందులో హీరో తేనె తీసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తాడు

హీరోయిన్ ఒక పేదింటి కుటుంబంలో సాధారణ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుంటుంది అయితే వారిద్దరు మనసులు కలిసి పెళ్లి చేసుకుంటారు అయితే అనుకోకుండా హీరోయిన్ ఆరోగ్యం పాడు అవుతుంది అక్కడ నుండి సినిమా చూడాలి 

ఎందుకంటే అక్కడి నుండి సినిమా అసలు కథ మనుషులు తమ స్వార్థం కోసం ఎటువంటి తప్పుడు పనులు చేస్తారు అన్నది సినిమా కథ

చాలా బాగుంది కథ ఒకసారి మాత్రం చూడొచ్చు !!!

5, జులై 2021, సోమవారం

Ap లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు !!!

 కరోనా కేస్ లు క్రమేపి తగ్గుతుండటంతో కర్ఫ్యూ వేళల్లో సమయాన్ని పెంచుతుంది అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 7 గంటలు వరకు వెసులుబాటు ఇచ్చింది

అయితే దుకాణాలన్ని సాయంత్రం 6  మూసివేసి 7 గంటలకు కర్ఫ్యూ మొదలవుతుంది మిగతా జిల్లాలకు మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటల వరకు తెరుచు కోవచ్చును 

ఈ వేళలు జులై 7 తారీకు నుండి అమలు లోకి వస్తాయని తెలిపారు !!!

Netflix " బేతాల్ " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 బేతాల్ వెబ్ సిరీస్ netflix లో అందుబాటులో ఉంది ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

కథ విషయానికి వస్తే ఒక కాంట్రాక్టర్ తన స్వార్థం కోసం ఒక పురాతనమైన సొరంగ మార్గం తవ్వటానికి ప్రయత్నిస్తాడు అయితే అక్కడున్న ప్రజలు దానికి అడ్డుపడుతారు

అయితే మిలట్రీ ఫోర్స్ ని దింపి వల్ల చేత అక్కడున్న ప్రజల్ని చంపించి ఆ సొరంగ మార్గం తెరుస్తారు తెరిచినప్పుడే తరువాత తెలుస్తుంది అక్కడ ఒక  బ్రిటిష్ కాలం నాటి ప్రేతాత్మ అందరిని చంపేస్తుంది

అయితే అసలు ఆ ప్రేతాత్మ అక్కడకు ఎలా వచ్చింది ఆ సొరంగంలో ఎలా ఉంది వాళ్ళు దాని నుండి బయట పడ్డారా లేదా అన్నది కథ

హార్రర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు ఇది ముగింపు కాదు ఇంకా సెషన్ లు ఉన్నాయి 

ఆ ప్రేతాత్మ లు హాలీవుడ్ జాంబీ లను పోలి ఉంటాయి😂😂😂

బాగుంది మంచి టైం పాస్ !!!

3, జులై 2021, శనివారం

తాప్సి నటించిన "హసీనా- దీలరుబా " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా netflix విడుదల అయ్యింది తెలుగులో కూడా ఉంది 

ఇక కథ విషయానికి వస్తే హీరో జ్వాలాపూర్ అనే ఊరిలో ఇంజినీర్ గా పని చేస్తుంటాడు హీరో కొంచెము మెతక గా ఉంటాడు హీరోయిన్ తాప్సి మోడరన్ గర్ల్ స్పీడ్ గా ఉంటుంది అయితే వీరిద్దరి పెళ్లి జరుగుతుంది అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ మాన్స్పర్థలతో దూరంగా ఉంటారు

ఇంతలో హీరో వాళ్ళ పిన్ని కొడుకు నీల్ అక్కడకు వస్తాడు అతడు ప్రవర్తన స్పీడ్ చూసి హీరోయిన్ కి అతను మీద మనసు పడుతుంది తప్పుకుడా జరుగుతుంది

అయితే శారీరకంగా ఇద్దరు కలుసుకున్నా తరువాత నీల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే హీరోయిన్ నీల్ వెళ్లి పోయిన సంగతి తెలుసుకుని తన భర్త తో మొత్తం విషయం చెబుతుంది

ఆ తర్వాత కథ ఏమి జరిగింది అని సినిమా చూడాలి సినిమా ఓపెనింగ్ ఒక బాంబ్ బ్లాస్టింగ్ తో మొదలవుతుంది

తన భర్తను తానే చంపింది అని హీరోయిన్ ని పోలీస్ లు విచారిస్తుంటారు అయితే సినిమా బాగుంది భర్త తనతో సరిగ్గా ఉండటం లేదని వేరే మగాడిని కోరుకుంటే ఏమి జరుగుతుంది అన్నది కథ

బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!👍👍👍

30, జూన్ 2021, బుధవారం

" బాలా " పరదేశి సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ డైరెక్టర్ బాలా సినిమా చూడాలంటే ఒక విధమైన ఆర్ట్ ఉండాలి నిజంగా నిజాన్ని తనదైన శైలిలో ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు

జీవితాలను కళ్లెదుటే కట్టినట్టు చూపిస్తాడు ఇక 2013 వ సంవత్సరంలో విడుదల అయిన పరదేసి సినిమా ఒక అద్భుతం

ఇక కథ విషయానికి వస్తే స్వాతంత్ర్య రాక ముందు బానిస బతుకులు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం దక్షిణ భారతదేశంలో సాలూరు అనే ఒక ఊరిలో కొండ జాతి ప్రజలు నివాసిస్తుంటారు 

వారికి డబ్బులు, ఆశ చూపి ఒక దళారి టీ ఎస్టేట్ లో రాళ్లు రప్పలతో కూడిన ప్రదేశాలు చదును చేయటం ఆ ఎస్టేట్ లోకి వస్తే పైకి పోవటం తప్పించి బయట పడలేం అదే ఈ సినిమా కథ

నిజంగా డైరెక్టర్ బాలా గారికి హ్యాట్సాఫ్ cheppali commercial సినిమాలు చూసి చూసి విసిగి చెందినవారికి బాలా సినిమాలు చూపించాలి

జీవితం నిజంగా ఇంత దుర్భరంగా ఉంటుందా అని  పిస్తుంది బాలా సినిమాలు ,శివ పుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని , ఇలా చాలా సినిమాలు ఉన్నాయి 

ఈ సినిమాలు చూసినప్పుడు ఆ రోజు లేదా రెండు రోజులు ఆ సినిమా కథ గురించి ఆలోచిస్తాం అలా ఉంటాయి మరి సినిమాలు 

ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది చూడవలసిన వారు ఒక సారి చూడండి !!!

29, జూన్ 2021, మంగళవారం

" jeepers creepers " సినిమా పై నా అభిప్రాయం !!!

 Jeepers creepers సినిమా హాలీవుడ్  సినిమా హార్రర్ సినిమా 

ఇక కథ విషయానికి వస్తే అడవి దారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని చంపేసే ఒక నర హాంతకుడి కథ హంతకుడు మనిషి కాదు గబ్బిలంగా ఉంటాడు ఆకారం దీనిని పార్ట్ పార్ట్ లుగా తీశారు

చూడటానికి సస్పెన్సు థ్రిల్లర్ గా బాగుంది సినిమా హార్రర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది

మంచి థ్రిల్ ఉన్న సినిమా బాగుంది చూడండి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి ఈ సిరీస్

మొదటి పార్ట్ కొనసాగింపుగా 2 వ పార్ట్ కూడా ఉంటుంది 3వ పార్ట్ కూడా ఉంది !!!

ఆనందయ్య మందు వాడే పద్దతి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !!!

 కరోనా నివారణకు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందని ఆ నోటా ఈ నోటా పాకీ వార్తల్లో వింటూ చివరికి మా ఊరు వచ్చింది ఆ మందు ఇవాళ ఉదయం వేసుకున్నాను

గోంగూర పచ్చడి మాదిరి పుల్ల పుల్లగా ఉంది ఇక దానికి సంబంధించి వాడే పద్దతి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీటి లో ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం !!!

1. మందు "బఠాని గింజంత" తీసుకుని నాలుకపై పెట్టుకుని చప్పరించి తరువాత మంచి నీరు తాగాలి,

2.ఉదయం ,రాత్రి 2 రోజులు వాడాలి

3.మందు వేసుకునే ముందు ఒక గంట ఏమి తిన రాదు,త్రాగ రాదు

వేసుకున్న తరువాత 1 గంట ఏమి తిన రాదు, త్రాగ రాదు

4.ఒక ప్యాకెట్ మందు ఐదుగురు కి సరిపోతుంది 

5.మందు తీసుకునే రెండు రోజులు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి, పల్చటి మజ్జిగ త్రాగాలి, మాంసాహారం తీసుకోరాదు

6.7 సంవత్సర లోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, మెన్సస్ సమయంలో స్త్రీలు వాడ రాదు

7.మందు ఫ్రిడ్జ్ లో ఉంచరాదు , అలాగే 3 రోజులు మించి నిలువ ఉంచారాదు

8.వేరే జబ్బులున్నవారు ఆ మందులకు ఈ ముందుకు కనీసం 1 గంట సమయం వ్యవధి ఉండాలి

9 మందు ప్యాకెట్ నుండి తీసి ఎండలో కానీ,గాలిలో గాని అరబెడితే మంచిది

10. ఈ రెండు రోజులు టీ, కాఫీ లు త్రాగ రాదు

  ఈ పద్ధతులు పాటిస్తే మంచిది అని చీటిలో రాసి ఉంది ఏది ఏమైనా ఉచితంగా వస్తుంది కాబట్టి ఏ పుట్టాలో ఏమి పాము ఉందొ తెలియదు కాబట్టి ఒకసారి ప్రయత్నిస్తే తప్పు లేదు ఏమంటారు ?

27, జూన్ 2021, ఆదివారం

ఆస్కార్ అవార్డ్ కి ఎంపిక అయిన " విచారణ" సినిమా పై నా అభిప్రాయం !!!

 విచారణ ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ మూవీ ఈ కథ ఒక ఆటో డ్రైవర్ రాసిన నవల నుండి తీసింది ఈ సినిమా చూస్తే మీకు పోలీస్ ఇంత దారుణంగా ఆలోచిస్తారా అనిపిస్తుంది అసలు కథ ఇప్పుడు చూద్దాం

పని కోసం పొరుగు రాష్ట్రం నుండి 4 గురు యువకులు వచ్చి పనిచేస్తుంటారు అయితే వారికి ఉండటానికి ఇల్లు ఉండదు పార్క్ లో పడుకుని అక్కడే స్నానము చేసి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తారు అయితే అనుకోకుండా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు చేస్తారు ఒక దొంగతనం కేస్ లో వాళ్ళని ఇరికిద్దామని అయితే ఎంత చిత్ర హింసలు పెట్టిన వాళ్ళు ఒప్పుకోరు 

ఆ తరువాత వల్ల జీవితాలు ఎలా మారాయి అన్నది కథ చూస్తున్నంత సేపు పోలీస్ లు వాళ్ల స్వార్థం కోసం సామాన్యుల జీవితాలతో ఇలా ఆడుకుంటారా అనిపిస్తుంది 

ఈ కథ నిజంగా జరిగినట్టుంది చివరిలో చూపిస్తాడు డైరెక్టర్ !!!

మేటి మాట !!!


 

25, జూన్ 2021, శుక్రవారం

దండుపాళ్యం 1,2,3, సినిమా లపై నా అభిప్రాయం !!!

 దండుపాళ్యం మొదటి పార్ట్ చూసినప్పుడు ఎప్పుడో 2013 లో చూసాను దండుపాళ్యం 2,3 సినిమాలు ఈ రెండు రోజుల్లో చూసాను

ఎప్పుడో వచ్చిన సినిమాలు కానీ ఇప్పుడు చూసాను ఏమి సినిమాలు రా బాబు మైండ్ పోతుంది లోపల 😱 మొదటి పార్ట్ లో అసలు దొంగతనాలు, రేప్ లు ఎలా చేసేవారు అని చూపించారు నిజంగా మొదటి పార్ట్ చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే భయంవేసింది నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అని మొదటి పార్ట్ లో వారిని పోలీస్ ఆఫీసర్ వాళ్ళను పట్టుకుంటాడు

ఇక రెండవ పార్ట్ లో వాళ్ళకి ఉరి శిక్ష పడేలా చేస్తాడు ఇంతలో ఒక జర్నలిస్ట్ వాళ్ళను అమాయకులు ను చేసిపోలీసులు వారిని ఇరికించారు అని వల్ల దగ్గర అసలు  జరిగింది ఏమిటి అని వాళ్ళని అడుగుతుంది వాళ్ళు మేము అమాయకులు అని కథలు చెబుతారు వాళ్ళను నమ్మి జర్నలిస్ట్ వాళ్ళ మీద సానుకూలంగా క్రైమ్ స్టోరీ రాస్తోంది

ఇక మూడవ పార్ట్ లో అసలు ఈ హంతకులు ఎవరు వీళ్ళ పుట్టుపూర్వోత్తలు గురించి ఆ జర్నలిస్ట్ చెబుతాడు పోలీస్ ఆఫీసర్ 

మొత్తానికి సినిమా మొదటి పార్ట్ చూసినవారికి రెండు, మూడు పార్ట్ లు పెద్ద భయంగా లేవు కానీ ఈ సినిమా పెద్దవారు మాత్రమే చూడాలి !!!


Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...