20, డిసెంబర్ 2020, ఆదివారం

అత్తిలి సుబ్రహ్మణ్య షష్టి 2020

 అత్తిలి సుబ్రహ్మణ్య షష్ఠి 2020

మన ఆంధ్ర ప్రదేశ్ లో అత్తిలి షష్ఠి కి చాలా ప్రసిద్ధి చెందింది చుట్టూ పక్కల గ్రామాలు కాకుండా మొత్తం రాష్ట్రం నుండి భక్తులు వేలమంది వస్తుంటారు

కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల దుకాణాలు,ఎక్సిబిషన్ లు లేవు పెద్దగా సందడి గా కూడా లేదు స్వామి వారి కల్యాణం జరిగింది 

స్వామి వారి షష్ఠి వీడియో క్రింద ఉంది గమనించగలరు

15, డిసెంబర్ 2020, మంగళవారం

కరోనా వైరస్ సినిమాపై నా అభిప్రాయం !!!

 భయం వ్యాధి కన్నా భయాంకరమైనది ఇది నిజం ఈ సినిమా చూసినప్పుడు నాకు అదే అనిపించింది ఒక కుటుంబం చిన్న చిన్న గొడవలు మధ్య సాధారణ జీవితం సాగుతుంది 

ఇంతలో ప్రపంచం మొత్తాన్ని వణికించే వైరస్ ఈ కోణంలోనే మొత్తం కధ అంత జరుగుతుంది ఈ వైరస్ మనుషులు మధ్య దూరాన్ని పెంచింది అలాగే మనుషుల మధ్య బంధాన్ని పెంచింది

ఈ సినిమా మొత్తం ఒకే కుటుంబంలో జరిగే వైరస్ వచ్చిన తరువాత ఏమి జరిగిందో చూపించారు సినిమా మొత్తం సినిమాల ఉండదు షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది

కుటుంబంలోకి వైరస్ ప్రవేశించిన తరువాత ఆ వైరస్ ఎవరికి సోకింది అనేది సినిమాలో ట్విస్ట్ కానీ ఆ విషయం సినిమా చూసిన వారికి తెలిసిపోతుంది

కానీ సినిమా మీద expertation పెట్టి మాత్రం సినిమా చూడొద్దు ఒక షార్ట్ ఫిల్మ్ చూసాం అనే కోణంలో మాత్రమే సినిమా చూడండి

పెద్దగా ఆకట్టుకోవడానికి ఏమి లేవు లాక్ డౌన్ సమయంలో జరిగిన విషయాలే ఈ సినిమాలో చూపించారు అంతే !!!

13, డిసెంబర్ 2020, ఆదివారం

అమ్మోరు తల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

 అమ్మోరు తల్లి తమిళ్ సినిమా తెలుగులో కూడా ఉంది తమిళ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ మధ్యకాలంలో కమెడియన్ గా కనిపిస్తున్న rj balaji హీరోగా పరిచయమై విడుదలైన చిత్రం అమ్మోరు తల్లి

సినిమా కథ విషయానికి వస్తే హీరోది మధ్య తరగతి కుటుంబం హీరో చిన్నప్పుడే వల్ల నాన్న కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అలాగే చాలా పెద్ద కుటుంబం కూడా హీరో వాళ్ళ అమ్మ మొక్కు కుల దేవతకు మొక్కుకుంటుంది కానీ ఆ మొక్కు తీర్చకుండా తిరుపతికి వెళ్ళటానికి ప్రత్నిస్తుంది ఎన్ని సార్లు ప్రయత్నించిన చివరి నిరాశ మిగులుతుంది

ఎలాగోలా చివరికి కుల దేవత గుడికి వెళతారు అక్కడ హీరో కి దేవత కనిపిస్తుంది ఆ గుడి ప్రసిద్ధి ఏంటో ఆ దేవత విశిష్టత ఏమిటో హీరో చేత అందరికి తెలిసేలా చేస్తుంది

అలాగే కొంతమంది దొంగ బాబాలు గురించి కూడా ఈ సినిమాలో చూపిస్తారు

సినిమా అంతా రొటీన్ గానే ఉంటుంది ఆహా అనిపించే ఒక్క సన్నివేశం కూడా ఉండదు కొంచెం బోర్ గా ఉంటుంది !!!

మేటి మాట !!!


 

9, డిసెంబర్ 2020, బుధవారం

నిఫా వైరస్ సినిమాపై నా అభిప్రాయం !!!

 నిఫా వైరస్ కరోనా వైరస్ కంటే ముందుగా బయటపడింది మనదేశంలో ముందుగా కేరళ రాష్ట్రంలో బయటపడింది ఈ విషయాన్ని కొన్ని అంశాలు జోడించి సినిమాగా తీయటం జరిగింది

ఈ సినిమా లో ఎక్కడ నిజంగా జరుగుతున్నట్టు ఆ వ్యాధి ఒక్కరినుండి ఒక్కరికి ఎలా సంక్రమించింది అనేది చాలా బాగా చూపించారు

కానీ కొన్నిసార్లు అక్కడక్కడ బోర్ కొట్టింది సినిమా పర్వలేదనిపించింది నటి నటులు అందరూ బాగా చేశారు

చివరికి ఆ వైరస్ ను ఎలా సంక్రమించిందో తెలుసుకున్నారు 

చూడటానికి ఓపిక చేసుకుని ఒకసారి చూడవచ్చు కానీ చాలా ఓపిక కావాలి కానీ సినిమా మాత్రం థ్రిల్లర్ గా ఉండదు 

సదా సీదా గా ఉంటుంది !!!

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...