28, ఏప్రిల్ 2022, గురువారం

షణ్ముక్ జస్వంత్ " సూర్య" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

షణ్ముక్ జస్వంత్ అందరికి పరిచయమే వెబ్ సిరీస్ ద్వారా సూర్య వెబ్ సిరీస్ ని, సినిమా లాగా కూడా ఉంది యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అయితే మొత్తం 10 ఎపిసోడ్ లు ఉన్నాయి సినిమా అయితే మొత్తం నిడివి 2 గంటల 51 నిమిషాలు ఉన్నది ఇక సినిమా ఎలా ఉందో చూద్దాం !!!

ఒక ఫ్యామిలీ లో ఒక అమ్మ, నాన్న, హీరో , వాళ్ళ చెల్లెలు హీరో వాళ్ళ నాన్న  తన కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తాడు అప్పు చేసి అయితే హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకదు చివరకు ఉద్యోగం ఎలా దొరికింది దానికి హీరో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కువున్నాడు అన్నది సినిమా కథ రొటీన్ గా ఉన్న కూడా మధ్య తరగతి జీవితాలలో డబ్బు గురించి ఇబ్బందులు ఎలా ఉంటాయి అన్నవి చూపించాడు

పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!

23, ఏప్రిల్ 2022, శనివారం

" అంత్యాక్షరి " సైకో థ్రిల్లర్ సినిమా పై నా అభిప్రాయం !!!

సోనీ లివ్ ott లో అందుబాటులో ఉన్న మలయాళీ డబ్బింగ్ సినిమా అంత్యాక్షరి సైకో కథతో విడుదల అయిన ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మలయాళీ సినిమాలు కథ ఎక్కడి నుండి మోదలవుతాదో కొంచెం చెప్పటం కష్టం కానీ చివరకు అర్థం అవుతుంది 

కేరళలో ఉండే ఒక పోలీస్ ci దాస్ అతనికి అంత్యాక్షరి పాటలు అంటే ఇష్టం అయితే తాను దగ్గరకు వచ్చిన వారితో పాటలు పాడించి ఆనంద పడుతుంటాడు అయితే అలా కథ జరుగుతుండగా ఒక రోజు వాళ్ల ఇంటిలో ci దాస్ వాళ్ళ అమ్మాయిని ఎవరో సేతస్కోప్ తో చంపాలని అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి బ్రతికే ఉంటుంది 

అసలు హత్య ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది సినిమా కథ ముందే చెప్పినట్టుగా మలయాళం సినిమా పూర్తిగా చూడకపోతే అసలు అర్థం కావు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది 

అసలు ఎందుకు వరుసగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని కానీ మనం అనుకున్నంత థ్రిల్ గా ఏమి లేదు సినిమా జస్ట్ average సినిమా మధ్యలో కొంచెం బోరింగ్ గా ఉంటుంది కానీ పర్వాలేదు ఒక సారి try చేయ వచ్చు !!!

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఆహా ott లో విడుదల అయిన " బ్లడీ మేరీ" సినిమా పై నా అభిప్రాయం !!!

ఆహా ott లో విడుదల అయిన బ్లడీ మేరీ సినిమా కథ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం !!!

వైజాగ్ లో ఒక ముగ్గరు అనాధలు మేరీ, భాషా, ఇంకొక అబ్బాయి అయితే భాషా కు మాటలు రావు, మేరీ కి సరిగ్గా చూపు కనబడదు, ఇంకొకడికి వినబడుదు అయితే ఈ ముగ్గురు ఒక చోట కలిసి ఉంటారు మేరీ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తుంది, భాషా సినిమాలలో ప్రయత్నిస్తాడు, ఇంకొక అబ్బాయి కెమెరా ఫోటో తీయటం అంటే ఇష్టం 

అయితే అనుకోకుండా ఉండే డాక్టర్ ని మేరీ చంపేస్తుంది భాషా సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఒక additions వెళ్తాడు అయితే అక్కడ ఒక అమ్మాయి డైరెక్టర్ ని చంపేస్తుంది అది భాషా చూస్తాడు

ఇంకో అబ్బాయి కెమెరా కొనుక్కుందాం అనుకుంటాడు కొంటాడు కానీ మోసపోతాడు కానీ భాషా వెళ్లిన ప్రాంతానికి వెళితే అక్కడ ఒక కెమెరా దొరుకుతుంది ముగ్గురు ఇంటికి చేరుకుంటారు 

అసలు ఆ కెమెరా ఏమిటి అందులో ఏముంది చివరి ఆ ముర్డర్లు ఎలా జరిగాయి వీటన్నిటికీ అక్కడ ఉన్న సిఐ ఏమిటి సంబంధం అన్నది సినిమా కథ పెద్ద గా ఏమి లేదు జస్ట్ వన్ టైం వాచ్ అంటే టైం పాస్ మూవీ

పెద్దగా experatation అయితే పెట్టుకుని సినిమా చూడవద్దు !!!
 

17, ఏప్రిల్ 2022, ఆదివారం

Kgf -2 సినిమా పై నా అభిప్రాయం !!!

 ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన kgf ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు దానికి కొనసాగింపుగా వచ్చిన kgf 2 సినిమా ఏప్రిల్ 14 తేదీన విడుదల అయి సక్సెస్ టాక్ దక్కించుకుంది ఇక ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

Kgf మొదటి భాగం ఆనంద్ వాసిరాజు చెబితే రెండవ భాగం ప్రకాష్ రాజ్ తో చెప్పించటం జరుగుతుంది kgf మొదటి భాగం ఎక్కడైతే ఎండ్ అవుతుందో రెండవ భాగం అక్కడి నుండి మొదలవుతుంది

గారుడను చంపిన తరువాత రాఖీ మొత్తం తన అధీనం లోకి తీసుకుంటాడు తనకు తిరుగు లేదు అనుకుంటున్న సమయంలో మొదటి భాగంలో చనిపోయాడు అనుకున్న అధీర బ్రతికే ఉంటాడు తన సామ్రాజ్యంలోకి తన తిరిగి రావాలనుకుంటాడు 

కానీ దానిని అడ్డుకుంటాడు అసలు అధీర ఎలా బ్రతికి ఉన్నాడు తనను కాపాడింది ఎవరు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న రాఖీని కొత్తగా ప్రధాని అయిన రమిక సేన్ నుండి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, ఒక వైపు అధీర, మరో వైపు రమిక సేన్ నుండి kgf లోని రాఖీ ఎలా ఎదురించాడు అన్నది సినిమా కథ

ఏలెవషన్ తో కూడుకున్న కథ డైరెక్టర్ కి బాగా తెలుసు అనుకుంటా ప్రేక్షకుడు ఎక్కడ ఏలెవషన్ scene ఉంటే కనెక్ట్ అవుతాడో అని సినిమా అయితే బాగానే ఉంది kgf 1 చూసిన వారు ఖచ్చితంగా kgf 2 ని చూస్తారు బాగుంది సినిమా !!!

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

" బీస్ట్ " సినిమా పై నా అభిప్రాయం !!!

తమిళ్ హీరో విజయ్ చేసిన తాజా చిత్రం బీస్ట్ ఈ సినిమా ఏప్రిల్ 13 తేదీన ప్రపంచ మొత్తం విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఇందులో హీరో ఒక రా ఏజెంట్ ఆఫీసర్ ఒక తీవ్ర వాదిని పట్టుకొనే క్రమంలో ఒక చిన్న పిల్ల చనిపోతుంది దీనికి కారణం తానే అని ఆ ఉద్యోగం మానేస్తాడు

11 నెలలు తరువాత ఒక షాపింగ్ మాల్ మొత్తం హైజాక్ అవుతుంది అందులో మన హీరో ఉంటాడు ఇందులో హీరోయిన్ ఉంటుంది కానీ పెద్దగా స్కోప్ లేదు  అయితే ఆ తీవ్ర వాదులు ఎందుకు హైజాక్ చేశారు అంటే అప్పుడు బంధించిన ఆ తీవ్ర వాదిని విడిపించటానికి మొత్తం షాపింగ్ మాల్ నే హైజాక్ చేస్తారు మిగిలిన తీవ్ర వాదులు 

అయితే హీరో వాళ్ళు అందరిని ఎలా కాపాడాడు చివరకు ఏమి జరిగింది అన్నది సినిమా కథ ఇందులో కొత్తదనం ఏమి కనిపించలేదు గగనం సినిమా ను పోలి ఉంటుంది సినిమా 

సినిమా పెద్దగా ఏమి లేదు జస్ట్ average అంతె రొటీన్ స్టోరీ !!!

13, ఏప్రిల్ 2022, బుధవారం

చిరంజీవి ఆచార్య " ట్రైలర్ చూసారా ?

 సైరా నర్సింహ రెడ్డి సినిమా తరువాత దాదాపు 3 సంవత్సరాలు తరువాత మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఏప్రిల్ 29 న రాబోతుంది ఇక దీని ట్రైలర్ ఒక సారి చూడండి !!!


11, ఏప్రిల్ 2022, సోమవారం

"Taanakkaran " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో తెలుగు లో అందుబాటులో ఉంది ఇంతకీ సినీమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా ఒక పోలీస్ అవ్వాలనుకునే ఒక కుర్రాడు పరీక్ష రాసి అందులో పాస్ అయ్యి పోలీస్ ట్రైనింగ్ కోసం కాంప్ కు వెళ్తాడు అతడితో పాటు కొంతమంది కూడా సెలెక్ట్ అయ్యి వెళ్తారు అక్కడి 40 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ట్రైనింగ్ కోసం వస్తారు అప్పుడెప్పుడో స్పోర్ట్స్ quota లో సెలెక్ట్ అయ్యి ప్రభుత్వం మారడంతో వాళ్ళ ఉద్యోగాలు పెండింగ్ లో పడి చివరికి 40 దాటినా తరువాత వారు ట్రైనింగ్ కోసం వస్తారు హీరో తండ్రి తన కొడుకుని ఎలాగైనా పోలీస్ అవ్వమని అడుగుతాడు

అందుకోసం హీరో పోలీస్ అవుదామని వస్తాడు అయితే శిక్షణ ఇచ్చే దగ్గర రూల్స్ చాలా కఠినంగా, చాలా దారుణంగా ఉంటాయి వాటిని దాటి హీరో ఎలా పోలీస్ అయ్యాడు అన్నది సినిమా కథ 

ఈ సినిమా కథ మొత్తం ట్రైనింగ్ క్యాంప్ లొనే ఉంటుంది కానీ ఎక్కడ బోర్ కొట్టాడు బాగుంది సినిమా ఈ సినిమాలో హీరోయిన్ ఉన్న పెద్ద స్కోప్ ఏమి ఉండదు కానీ సినిమా మాత్రం బాగుంది చూడ వచ్చు 👍👍👍


9, ఏప్రిల్ 2022, శనివారం

వరుణ్ తేజ్ " గని " సినిమా పై నా అభిప్రాయం !!!

 వరుణ్ తేజ్ తనకంటూ ఒక విభిన్నమైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా నిన్న విడుదల అయిన గని సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అసలు బాక్సింగ్ వైపు వెళ్లనని తల్లికి మాట ఇస్తాడు హీరో కానీ అతడి చూపు అంతా బాక్సింగ్ వైపు మాత్రమే ఉంటుంది తండ్రి ఉపేంద్ర స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్  కానీ కొన్ని కారణాల వల్ల తన సొంతం అనుకున్న మనుషుల చేతిలో మోసపోతాడు ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఏమి చేశాడు 

తన తండ్రి కోసం, తల్లి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ ఇందులో కొత్తగా చేపప్పుకోవటానికి ఏమి లేదు ఈ కథ కొంచెం అమ్మ,నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా కథ లాగానే ఉంది కాని కొన్ని మార్పులతో

జస్ట్ average అంతే !!!

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

Djibouti సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ పేరు పలకటం కష్టం కానీ అసలు ఈ పేరు నార్త్ ఆఫ్రికా లో ఒక పట్టణము పేరు Djibouti ఇది ఒక మలయాళం సినిమా ఇక ఈ కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!

కేరళలో ఒక ఊరిలో ఉండే ఇద్దరు యువకులు లూయిస్, aby అనే ఇద్దరికి ఫారెన్ కంట్రీ కి వెళ్లి డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇంతలో ఆ ఊరిలోకి నార్త్ ఆఫ్రికా Djibouti నుండి ఒక అమ్మాయి వస్తుంది అక్కడ తన ఫ్రెండ్ ని కలుసుకోవడానికి ఆ అమ్మాయితో స్నేహం పెంచుకుని ఎలాగైనా అక్కడకు వెళ్ళాలి అనుకుంటారు 

అలాగే వెళ్తారు కూడా అయితే హీరో లూయిస్ ఆ అమ్మాయితో అక్కడ ప్రేమలో పడతాడు అక్కడికి వెళ్లిన తరువాత అక్కడి ఎదుర్కొన్న పరిస్థితులు, ఎలా ఉన్నాయి చివరకు కథ ఏమైంది అన్నది సినిమా కథ

బాగానే ఉంది సినిమా ఒక సారి చూడ వచ్చు!!!

7, ఏప్రిల్ 2022, గురువారం

హే సినామిక సినిమా పై నా అభిప్రాయం !!!

హే సినామిక సినిమా dulqar సల్మాన్ హీరోగా ఆడితిరావు హీరో హీరోయిన్ గా చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!


హీరో హీరోయిన్ మొదటి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు పెళ్లి చేసుకుంటారు 2 సంవత్సరాలు తరువాత హీరోయిన్ కి హీరో మీద అసహ్యం కలుగుతుంది ఎందుకంటే హీరో ఎక్కువగా మాట్లాడుతుంటాడు, అలాగే వంటలు ఎక్కువుగా చేస్తుంటాడు ఈ కారణం వల్ల ఎలాగైనా తాను నుండి విడాకులు తీసుకుని వెళ్లి పోదాం అనుకుంటుంది 

అంతలో వాళ్ళు ఉండే కాలనీ లోకి malar కాజోల్ అగర్వాల్ భార్య , భార్యలు విడదీస్తుంటుంది హీరోయిన్ కాజోల్ దగ్గరికి వెళ్లి నా భర్త ని తనని ఎలాగైనా వలలో వేసుకోమంటుంది అది కారణం గా చూపించి విడాకులు తీసుకుందాం అనుకుంటుంది 

కానీ హీరోని కాజల్ నిజంగానే ప్రేమిస్తుంది ఆ తరువాత కథ ఏమైంది చివరకు ఎలా ముగ్గురి కధ నడిచింది అన్నది సినిమా కథ !!!

 

3, ఏప్రిల్ 2022, ఆదివారం

"Kaun praveen Tambe" సినిమా పై నా అభిప్రాయం !!!

ప్రవీణ్ తాంబే ఎవరు అనేది సినిమా టైటిల్ అసలు ఎవరు ఈ ప్రవీణ్ తాంబే అని మీకు doubt వచ్చింది కదా అసలు ఈ కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!
ప్రవీణ్ తాంబే ఒక మధ్య తరగతి కుటుంబం లోని వ్యక్తి అతడికి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం అతడు ఎలాగైనా రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటాడు కానీ అతని వయసు 30 దాటిపోతుంది కానీ అతడు రంజీ కి సెలెక్ట్ అవ్వడు
ఇది నిజంగా జరిగిన కథ అని మనకు నిజమైన ప్రవీణ్ తాంబే ని చూపిస్తారు చివరిలో  అతను క్రికెట్ లో చివరికి ipl కూడా అడుతాడు అయితే అది 40 సంవత్సరాల వయసులో అది ఎలా సాధ్యపడింది దానికి అతను ఎన్ని అవమానాలు, ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ బాగుంది నిజంగా ఒక క్రికెటర్ ఇంత కష్టపడితే పైకి పేరు వస్తుంది చాలా బాగా చూపించారు !!!👍👍👍

 

2, ఏప్రిల్ 2022, శనివారం

రాధే శ్యామ్ సినిమా పై నా అభిప్రాయం !!!

బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఆ తరువాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా  ఈ సినిమా march 11 విడుదల అయింది  ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఇందులో హీరో ప్రభాస్ ఒక జ్యోతిష్య నిపుణుడు తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అలాగే చాలా మందికి జరుగుతుంది ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా మొదటలో ఇండియా లోనే చూపిస్తూ తరువాత విదేశాలలో చూపిస్తాడు హీరోయిన్ మొదటి చూపులోనే చూసి తనతో కొంత కాలం జీవిద్దామని అనుకుంటాడు హీరో కి ప్రేమ అంటే ఇష్టం ఉండదు 
ఒకసారి హీరో హీరోయిన్ చేయి చూసి జ్యోతిషం చెబుతాడు తనది జీవితం అంతా బాగానే ఉంటుంది కానీ హీరోయిన్ కి ఆరోగ్య సమస్యలు వల్ల 2,3 నెలలు కంటే ఎక్కువ బ్రతకదు అని చెబుతారు 
ఇలాంటి సమయంలో హీరో జ్యోతిష్యం ఫలించిందా లేదా హీరోయిన్ బ్రతికిందా అసలు తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన సినిమా 
అంతగా ఏమి బాగోలేదు సినిమా జస్ట్ లవ్ స్టొరీ అంతే ఒక ఫైట్ కూడా ఉండదు అంతా సో సో గా వెళ్లి పోతుంది ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది సెకండ్ హాఫ్ అంతగా అనిపించదు !!!

ఉగాది శుభాకాంక్షలు !!!

 మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

జీవితం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు సంతోషాలు, సరదాలు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు !!!💐💐💐

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...