31, మార్చి 2023, శుక్రవారం

Nani దసరా సినిమా పై నా అభిప్రాయం !!!


Natural star నాని నటించిన సినిమా దసరా నిన్న శ్రీ రామ నవమి రోజున theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది సింగరేణి ప్రాంతంలో వీరపల్లి అనే గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు హీరో నాని, సూరి ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు అయితే హీరో తన స్నేహితుడి కోసం తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడు అయితే ఊరిలో జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఇద్దరు సవతి బిడ్డలు పోటీ చేస్తుంటారు అందులో సముద్రకని, సాయి కుమార్ అయితే సముద్రఖని కొడుకు పరమ దుర్మార్గుడు ఎలాగైనా సర్పంచ్ పదవిని దక్కించుకుంటాడు అయితే హీరోకి సముద్రఖని కొడుకి గొడవలు జరుగుతాయి హీరో అతని ఫ్రెండ్ సాయి కుమార్ నీ ఎన్నికలలో గెలుపొందేల చేస్తారు ఇది జీర్ణించుకోలేని సముద్రఖని కొడుకు వాళ్ళని చంపాలని చూస్తాడు అయితే హీరో ఫ్రెండ్ చనిపోతాడు ఆ తరువాత హీరో ఎలా పగ తీర్చుకున్నాడు హీరో ఫ్రెండ్ నీ చంపటానికి గల కారణం ఏమిటి అన్నది సినిమా కథ 

మొదట్లో కొద్దిగా slow గా నడిచిన కథ ఇంటర్వెల్ ముందుకు అసలు కథ లోకి వెళ్తుంది చివరకు క్లైమాక్స్ కొద్దిగా పరవలేదనిపించింది మొత్తానికి నాని ఊర మాస్ సినిమా అని చెప్పుకోవచ్చు

ఒక సారి చూడవచ్చు పరవాలేదు !!!

24, మార్చి 2023, శుక్రవారం

బలగం సినిమా ott లోకి ఇవాళ నుండి ఏ ott తెలుసా ?

 బలగం సినిమా తెలంగాణ సంప్రదాయాలు తో నిండిన కమెడియన్ వేణు దర్శకత్వం లో వచ్చిన సినిమా మార్చ్ 24 నుండి అనగా ఇవాళ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది !!!

23, మార్చి 2023, గురువారం

కాజోల్ ghosty సినిమా పై నా అభిప్రాయం !!!


కాజోల్ ghosty సినిమా ఉగాది నిన్న విడుదల అయింది కామెడీ హార్రర్ జానర్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో కాజోల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక ఖైదీ జైల్ నుండి తప్పించుకుని తనని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్లందరినీ చంపేస్తాను అంటాడు ఆ ఖైదీని పట్టుకోవటానికి హీరోయిన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది దానికి తోడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నీ ఒక ముగ్గురు తమ సినిమాలో యాక్ట్ చేయమని అడుగుతారు అయితే వాళ్ళు చనిపోతారు చనిపోయిన కూడా తన వెంట పడుతుంటారు చివరికి హీరోయిన్ ఏమి చేసింది అన్నది కథ అంతా తిక మక గా ఉంటుంది అసలు అర్థం కాలేదు సినిమా అంత పిచ్చి పిచ్చి గా గందర గోళం లాగా ఉంది అంతగా ఏమి బాగోలేదు సినిమా !!!

16, మార్చి 2023, గురువారం

ధనుష్ sir movie OTT release ఎప్పుడో తెలుసా !!!

 ధనుష్ ఇటీవలి కాలంలో విడుదల అయి theatre లలో ఉన్న సినిమా sir movie Netflix OTT లో మార్చ్ 17 నుండి స్ట్రీమ్ అవుతుంది !!!

15, మార్చి 2023, బుధవారం

Iratta సినిమా పై నా అభిప్రాయం !!!


ఇది మలయాళం సినిమా Netflix లో అందుబాటులో ఉంది సస్పెన్స్ thriller తో కూడిన సినిమా ఇక అసలు కథ ఏమిటో  ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కార్యక్రమం జరుగుతుంది అయితే అక్కడే అనూహ్యంగా తుపాకీ కాల్పులు చప్పుడు అవుతుంది అక్కడే వినోద్ అనే ASI చనిపోతాడు అక్కడి అసలు కథ మొదలవుతుంది
చనిపోయిన పోలీస్ dsp కి తమ్ముడు అయితే వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతుంటాయి తన అన్నతోనే కాకుండా చాలామంది తో గొడవలు జరుగుతాయి అంత మంచోడు కాదు 
అయితే ఆ హత్య ఎవరు చేశారు అన్నది సస్పెన్స్ చాలా ఆసక్తిగా సాగుతుంది కథనం అయితే క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు ఇలా కూడా జరుగుతుందా అని మొత్తానికి సస్పెన్స్ ఇష్టపడేవారు కి నచ్చుతుంది !!!


12, మార్చి 2023, ఆదివారం

Disney hotstar లో విడుదల అయిన run baby run cinema పై నా అభిప్రాయం !!!


 Rj Balaji,ishwarya Rajesh ప్రధాన పాత్రలో నటించిన సినిమా run baby run Disney hotstar లో ఈ సినిమా విడుదల అయింది ఇలా లేట్ చేయకుండా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక బ్యాంక్ ఉద్యోగి తనతో పెళ్లి ఖాయం అయిన అమ్మాయికి ఒక గిఫ్ట్ కానీ తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు కారులో బయటకు తీసుకెళ్తాడు అయితే అనుకోకుండా అందులో ఐశ్వర్య రాజేష్ ఆ కారులో వెనుక సీట్ లో కింద కూర్చుని ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది హీరో అది గమనించి తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి ఇంటికి వెళ్తాడు అయితే ఆ కారులో ఉన్న అమ్మాయిని నువ్వు ఎవరు నా కారు ఎందుకు ఎక్కావు అని ప్రశ్నించగా నన్ను కొందరు తరుముతూ న్నారు వల్లనుండి కాపాడుకోవటానికి మీ కారు ఎక్కనని చెబుతుంది అయితే హీరో వాళ్ళ రూం లో కొన్ని గంటలు ఉంటాను తనకు కావాల్సిన వారు వచ్చి తనను తీసుకెళ్తారు అని చెబుతుంది మొదట్లో హీరో ఒప్పుకొడు అయితే చివరికి ఒప్పుకుంటాడు 

ఆ మరుసటి రోజు ఉదయం హీరో లేచి చూసే సరికి ఆ అమ్మాయి చని పోయి ఉంటుంది ఇంతకీ తన నీ ఎవరు చంపారు హీరో ఎలా బయట పడ్డాడు అన్నది మిగిలిన కథ ఆసక్తిగా బాగానే ఉంది సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి నచ్చుతుంది సినిమా ఒక సారి చూడండి !!!



10, మార్చి 2023, శుక్రవారం

Disney hotstar లో విడుదల అయిన Anger tales webseries పై నా అభిప్రాయం !!!


ఇది మొత్తం 4 episode లు మొదటి episode లో ఒక అభిమాని తన హీరో కోసం ఫ్యాన్స్ benfit షో టికెట్స్ అమ్ముతాడు ఫ్యాన్స్ కొంటారు కానీ చెప్పిన టైం కి షో పడదు అయితే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎలాగైతే షో పడుతుంది కానీ అక్కడ ఉన్న ఒక చిన్న పొలిటికల్ లీడర్ కి తనకు మాట మాట పెరిగి సినిమా హిట్ అవ్వక పోతే తనని ఏమైనా చేసుకోమని చెపుతాడు అనుకున్నట్టే సినిమా ఫ్లాప్ అవుతుంది ఆ కథ ఎలా ముగిసింది అన్నది
  ఇక రెండవ భాగం లో ఒక అపార్ట్మెంట్ లో ఎవరు మాంసాహారం తినకూడదు అని రూల్ పెట్టుకుంటారు అయితే ఒక అమ్మాయి దాని బ్రేక్ చేస్తుంది
3 వది అద్దె ఇంట్లో ఉండేవారు కష్టాలు గురించి ఈ ఎపిసోడ్ లో చెప్పటం జరిగింది
4వది 32 సంవత్సరాల కుర్రాడికి తనకు బట్ట తల ఉండటం వల్ల పెళ్లి కాదు అయితే అతడి ఉద్యోగం కూడా చదువుకు సంబందించిన ఉద్యోగం ఉండదు ఇలా 4 జీవితాలను వారి ఎదుర్కొన్న పరిస్థితులు గురించి ఇందులో చూపటం జరిగింది
మొత్తని 2 వ ఎపిసొడ్ తప్ప మిగతావన్నీ ఒక సారి చూడ వచ్చు నిడివి కూడా 2 న్నర గంటలు !!!

8, మార్చి 2023, బుధవారం

బలగం సినిమా పై నా అభిప్రాయం !!!

 జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో వచ్చిన సినిమా బలగం సినిమా దిల్ రాజు నిర్మాణం లో వచ్చిన సినిమా ప్రియదర్శి హీరో గా వచ్చిన సినిమా మార్చ్ 3 న విడుదల అయింది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అది తెలంగాణ లో ఒక మారుమూల పల్లెటూరు హీరో కి పెళ్లి కుదురుతుంది వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తాడు అది దెబ్బతింటుంది దానితో ఊరిలో ఒకరి దగ్గర అప్పు చేస్తాడు వాళ్ళు ఆ అప్పు తీర్చమని అడుగుతారు తనకు పెళ్లి ఖాయమైంది అని తన పెళ్ళికి 15 లక్షలు కట్నం వస్తుంది అని అది రాగానే అప్పు తీర్చేస్తనని చెబుతాడు అయితే ఉన్న పళంగా వాళ్ళ తాత చనిపోతాడు 

అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది హీరో తన పెళ్లి అవదని ఆ అప్పు ఎలా తీర్చాలని అలోచిస్తాడు వాళ్ళ తాత చావుకు పలకరించటానికి హీరో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది కానీ అక్కడ చిన్న గొడవ జరిగి పెళ్లి cancel అవుతుంది అప్పుడు హీరో వాళ్ళ మేనత్త వాళ్లు కూడా వస్తారు వాళ్లకు ఒక కూతురు ఉంటుంది వాళ్ళ మేనత్త కూతురు నీ పెళ్లి చేసుకుంటే తన అప్పు తీరుతుందని అలోచిస్తాడు కానీ వాళ్ల మావయ్యకి వాళ్ళ నాన్నకి గొడవలు జరిగి అసలు తన పుట్టింటికి వచ్చి దాదాపు 20 సంవత్సరం లు అవుతుంది వాళ్ళ నాన్న కి మావయ్య కి గొడవలకు అసలు కారణం ఏమిటి హీరో ఇటువంటి పరిస్తితి లో ఏమి చేశాడు అన్నది కథ 

చాలా బాగుంది సినిమా ఒక మరణం కూడా విడిపోయిన కుటుంబాలను, బంధాలను ఎలా కలిపింది అన్నది బాగా చూపించాడు  మొత్తానికి బాగుంది సినిమా చూడ వచ్చు చిన్న సినిమా యే గానీ చాలా బాగా డీల్ చేశాడు అంత తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది సినిమా పాటలు కూడా అదే మాదిరి లో ఉంటాయి బాగుంది సినిమా చివరికి క్లైమాక్స్ చాలా సెంటిమెంట్ తో ముగింపు ఇచ్చాడు బాగుంది 👍👍👍

6, మార్చి 2023, సోమవారం

" The great Indian kitchen Review సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఈ సినిమా మలయాళం సినిమా దీనిని తమిళ్, తెలుగు,కన్నడంలో రీమేక్ చేశారు ఈ సినిమా జీ5 ott లో అందుబాటులో ఉంది సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 
ఇందులో ఐశ్వర్య రాజేష్, రాహుల్ రామ చంద్రన్ ప్రముఖ పాత్రలో చేశారు ఇందులో హీరోయిన్ స్వతంత్ర భావాలు కల్గిన వ్యక్తి అయితే రాహుల్ కి తనకి పెళ్లి జరుగుతుంది పెళ్లి అయినప్పటి నుండి తన జీవితం వంట గదికే పరిమితం అవుతుంది వాళ్ళది చాలా చాదస్తపు కుటుంబం వాళ్ళ మామ గారికి వంట కట్టెల పొయ్య మీద చేయాలి చేతితోనే చట్నీలు, చేయాలి వాళ్ళ అత్తగారు తను కలిసి కిచెన్ లో పనిచేసుకుంటూ ఉండేవారు అయితే అత్తగారి కూతురికి డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో అక్కడికి వెళ్తుంది ఇంటి పని మొత్తం కోడలి పైనే పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కొంది అన్నది మిగిలిన కథ 
సాధారణంగా ప్రతి ఇంటిలో జరిగే పరిణామాలు ఆడవాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు అన్నది సినిమా కథ మధ్యలో కొద్దిగా వంట గది అస్తమానూ చూపించడంతో బోర్ గా ఉంది కానీ మొత్తానికి బాగుంది సినిమా నిడివి కూడా తక్కువే 1 గంట 30 నిమిషాలు లోపే ఉంది సినిమా !!!

5, మార్చి 2023, ఆదివారం

"Jaya Jaya Jaya Jaya he" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది మలయాళం డబ్బింగ్ తెలుగులో డిస్నీ hotstar లో అందుబాటులో ఉంది ఇక late చేయకుండా అసలు కథ లోకి వెళ్దాం  
జయ అనే అమ్మాయి ఒక మధ్య తరగతి కుటుంబంలో పుడుతుంది అయితే తనే పెరిగి పెద్దదవుతుంది అయితే వాళ్ళింట్లో అమ్మాయికి కొన్ని నిబంధనలు మీద పెంచుతారు వాళ్ళ అన్నయి కన్న ఎక్కువ మార్కులు వచ్చిన తనని వేరే ఊరు కాలేజ్ కి పంపటానికి తల్లి తండ్రులు ఇష్టపడరు అయితే ఎలాగోలా ఆ కాలేజ్ లో చేరుతుంది కానీ అక్కడ ఒక టీచర్ తో ప్రేమలో పడుతుంది అది పెద్దవారికి తెలిసి  కాలేజ్ మానిపించేస్తారు వెంటనే ఒక పెళ్లి సంబంధం తెచ్చి పెళ్లి చేసేస్తారు అయితే అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ళ ఆయన చాలా చాదస్తం కింద ఉంటాడు చాలా కోపం ఎక్కువ ప్రతి దానికి పెళ్ళాం పై చెయ్యి చేసుకుంటాడు అయితే తన భర్త తనని కొడుతున్నారని భరిచలేక కరాటే నేర్చుకుంటుంది 
ఒక తన భర్తను కొడుతుంది అయితే అది చివరికి విడాకులు వరకు వెళ్తుంది ఇలా కథ ముందుకు ఎలా వెళ్ళింది చివరికి ఇద్దరు జీవితాలు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా  చూడ వచ్చు !!!

2, మార్చి 2023, గురువారం

" Farzi" వెబ్ series పై నా అభిప్రాయం !!!


 Amazon prime లో విడుదల అయిన  farzi web series Shahid Kapoor, విజయ్ సేతుపతి , రాశి ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ series family man web series తీసిన వారే ఈ వెబ్ series ను తీశారు ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఏ బొమ్మనైన చూసింది చూసినట్టు వేస్తాడు వాళ్ళ తాత క్రాంతి అనే పత్రిక నడుపుతుంటారు అయితే అది సరిగ్గా నడవక అప్పులు పాలు అవుతాడు అయితే తన తాతని ఎలాగైనా అప్పులు బాధ నుండి కాపాడాలని హీరో దొంగ నోట్లు అదే ప్రెస్స్ లో ముద్రిస్తుంటాడు 

అయితే మరోపక్క విజయ సేతుపతి స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ దొంగ నోట్లు ముద్రించే మసుర్ అనే వ్యక్తి నీ పట్టుకుంటాడు కానీ ఎలాగోలా తప్పించుకుంటాడు చివరికి masoor హీరో నీ కిడ్నాప్ చేసి తనకు దొంగ నోట్లు తయారు చేయమని చెబుతాడు హీరో తయారు చేసే దొంగ నోట్లు అసలు duplicate అని కనిపెట్ట లేరు అయితే చివరికి కథ ఎలా ముగిసింది అన్నది ఈ వెబ్ series చూడాలి బాగానే ఉంది అక్కడక్కడ కొద్దిగా boaring గా ఉంది 

మొత్తానికి అయితే ఖాళీగా ఉంటే మాత్రం చూడ వచ్చు !!!

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...