27, సెప్టెంబర్ 2021, సోమవారం

"లవ్ స్టొరీ "సినిమా పై నా అభిప్రాయం !!!

 లవ్ స్టొరీ నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్ గా నటించిన శేఖర్ కమ్ముల direction లో వచ్చిన సినిమా లవ్ స్టొరీ september 24 థియేటర్ లో విడుదల అయ్యింది ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం 

హీరో రేవంత్ (నాగ చైతన్య ) ఒక బలహీన వర్గం కులంలో పుడతాడు చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూ హైద్రాబాద్ లో ఒక డాన్సింగ్ fitness సెంటర్ లో నడుపుతూ ఉంటాడు ఆ ఇంటి పక్కింటిలో మౌనిక ( సాయి పల్లవి ) తన ఫ్రెండ్ ఇంటిలోకి ఉద్యోగం కోసం అక్కడికి వస్తుంది అక్కడ పక్కనే అందరికి డాన్స్ లు నేర్పిస్తుంటాడు అలా వారిద్దరికీ పరిచయం పెరుగుతుంది చివరికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది

ఇద్దరిది ఒకే ఊరు కానీ మౌనిక ఉన్నత కులం, రేవంత్ డి లేని కులం వాళ్ళ ఇంటిలో అసలు ఒప్పుకోరు అయితే చివరకు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారా లేదా అన్నది సినిమా కథ

ఈ సినిమా బాగానే ఉంది కాని క్లైమాక్స్ అంతగా బాగోలేదు కానీ ఓవర్ expertation తో సినిమా చూడొద్దు సాయి పల్లవి డాన్స్ బాగా చేసింది, నాగ చైతన్య కూడా డాన్స్ బాగా చేసాడు 

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఫ్యామిలీ తో పాటు చూసే సినిమా లే ఉంటాయి ఇది కూడా అంతే బాగుంది సినిమా చూడ వచ్చు !!!

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

" Thittam irandu" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన Thittam irandu సినిమా sony liv ott లో విడుదల అయింది ఈ సినిమా సస్పెన్స్ కాదు ట్విస్ట్ లతో కూడుకున్న సినిమా ఇక ఈ సినిమా కథ గురించి మాట్లాడుదాం !!!

ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ ఐస్వర్య రాజేష్ ఈ సినిమా లో పోలీస్ పాత్రలో నటించింది ఐస్వర్య, తన స్నేహితురాలు దీప సూర్య చిన్ననాటి స్నేహితులు college చేరిన తరువాత ఇద్దరు విడిపోతారు అయితే ఐస్వర్య పోలీస్ ఆఫీసర్ అవుతుంది దీప సూర్య పెళ్లి చేసుకుని settle అవుతుంది అయితే ఒక రోజు దీప సూర్య మిస్సింగ్ అవుతుంది ఆ కేస్ విచారణ ఐస్వర్య తీసుకుంటుంది 

అలా ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా ఒక ప్రమాదం లో దీప సూర్య చనిపోయింది అని తెలుస్తుంది ఐటీఐ విచారణ లో పూర్తిగా చేస్తే అసలు చనిపోయింది సూర్య కాదని ఎవరో అమ్మాయి అని తెలుస్తుంది 

అయితే చివరి దీప సూర్య బ్రతికి ఉందా, లేదా అసలు ఏమైనట్టు అన్నది సినిమా కథ 

ఈ కథ చెప్పటం కంటే చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది బాగానే ఉంది సినిమా అసలు మామూలుగానే సాగుతుంది అనుకుంటాం కానీ సినిమా ట్విస్ట్ లు క్లైమాక్స్ ట్విస్టుతో మొత్తం కథ తెలుస్తుంది

సినిమా అయితే ఒకసారి చూడ వచ్చు బాగుంది సినిమా !!!

25, సెప్టెంబర్ 2021, శనివారం

ఆకాశవాణి సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆకాశవాణి సినిమా sony liv ott లో విడుదల అయింది సంద్రఖని తప్ప మిగతా వారందరూ కొత్త నటులే ఇక ఈ సినిమా గురించి చూద్దాం 

ఒక అటవీ ప్రాంతంలో నివాసం ఉండే గిరిజన ప్రజలు వాళ్ళకి బయట ప్రపంచం గురించి అసలు తెలియదు ఆ ప్రాంతంలో వాళ్ళను బానిసలుగా చేసుకుని వారిని పాలించే ఒక దొర వాళ్ళను బానిసలుగా కాకుండా వారికి ఆ దొర దేవుడిగా వాళ్లకు మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు ఆ దొరకి ఎదురు తిరిగినవారని దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి వాళ్ళని చంపిస్తాడు

ఒక ఊరిలో టీచర్ ఉద్యోగం చేస్తుంటాడు సముద్ర ఖని అయితే పట్టణానికి బదిలీ అవుతాడుఅప్పుడు తన కుమారుడు దగ్గర ఉన్న పాత రేడియో ని బయట పడేస్తాడు అయితే అది మారి, మారి చివరకు ఆ అటవీ ప్రాంతంలో గిరిజనులు ఉండే ప్రాంతానికి చేరుకుంటుంది అయితే ఆ రేడియో ని వాళ్ళు కొత్త దేవుడిగా పూజిస్తారు 

ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి ఇది ఒక వెరైటీ కథ చూడటానికి హాస్యం గా ఉన్న ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాగే జరుగుతుంది ఏమో బహుశా కానీ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు

పేద్ద బడ్జెట్ కాకుండా బాగానే ఉంది మంచి ప్రయోగం !!!

18, సెప్టెంబర్ 2021, శనివారం

నితిన్ " మాస్ట్రో " సినిమా పై నా అభిప్రాయం !!!

 నితిన్ నటించిన మాస్ట్రో సినిమా డిస్నీ hotstar ott లో నిన్న విడుదల అయింది ఇక ఆ సినిమా కథ గురించి చూద్దాం !!!

నితిన్ ఈ సినిమాలో కళ్ళు లేని అంధుడు పాత్రలో నటిస్తాడు కానీ నితిన్ కి కళ్ళు కనిపిస్తాయి పియానో వాయిస్తూ ఉంటాడు 

అయితే తమన్నా, నరేష్ భార్య భర్తలు నరేష్ ఒకప్పటి హీరో తరవాత తమన్నాని పెళ్లి చేసుకుంటాడు ఒక రెస్టారెంట్ లో పియానో వాయిస్తున్న నితిన్ చూసి తరువాత రోజు తన marriage anniversary అని తన ఫ్లాట్ కి రమ్మంటాడు 

ఆ మరుసటి రోజు హీరో నరేష్ వాళ్ల ఇంటికి వెళ్తాడు నితిన్ అయితే అక్కడ తమన్నా ఉంటుంది నరేష్ ని హత్య చేస్తారు కానీ నితిన్ కి మర్డర్ కనిపిస్తుంది కానీ తాను blind కాబట్టి ఆ విషయం బయటకు చెప్పకూడదు ఆ మర్డర్ తమన్నా చేస్తుంది 

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది చూడాలి చూడటానికి ఇంట్రెస్టిటింగ్ గా ఉంది ఇందులో హీరోయిన్ నభ natesh రెస్టారెంట్ ఓనర్ కూతురు పాత్రలో చేస్తుంది తనకి కథలో పెద్ద ఇంపోర్టెన్స్ లేదు కానీ సినిమా పర్వాలేదు 

ఒకసారి చూడ వచ్చు !!!

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

" పాగల్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 పాగల్ విశ్వక్ సేన్ హీరో గా చేసిన పాగల్ సినిమా గురించి తెలుసుకుందాం !!!

ప్రేమ్ ( విస్వక్ సేన్) చిన్నప్పటి నుండి తన అమ్మ (భూమిక) చాలా ఇష్టం కానీ కాన్సర్ తో వాళ్ళ అమ్మ చనిపోతుంది అయితే అప్పటి నుండి తనను తన అమ్మలాగా ప్రేమించే అమ్మాయి కోసం తాను ప్రతి అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే ప్రతి అమ్మాయి తనని రిజెక్ట్ చేస్తుంది

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగతా కథ చివరకు తనను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ఆ తరువాత తన జీవితంలో ఏమి మార్పులు జరిగాయి అన్నది మిగతా కథ 

మరీ అంత దారుణంగా లేదు సినిమా బాగానే ఉంది సినిమా ఒక సారి చూడవచ్చు  ఫస్ట్ హాఫ్ అంత కామెడీ బాగానే ఉంది కాని expectations తో సినిమా చూడొద్దు జస్ట్ బాగుంది అంతే !!!

" టక్ జగదీష్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 టక్ జగదీష్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

థియేటర్ లోకాకుండా ott లో విడుదల అయిన సినిమా టక్ జగదీష్ ఒక అందమైన భూదేవిపురం అనే ఊరు ఆ ఊరిలో ఒక రెండు కుటుంబాల మధ్య గొడవలు అందులో ఒక కుటుంబం లోని వ్యక్తి జగదీష్ (నాని) అవతల కుటుంబం విలన్ కుటుంబం ఎప్పుడు ఊరిలో ఉన్న పొలాలన్ని ఆక్రమించి గొడవలు పడుతుంటారు అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏమి హీరో వల్ల కుటుంబం లో కూడా ఆస్తిలో వాటల్లో మనస్పర్థలు వస్తాయి 

ఇందులో హీరో నాని అన్నయ్య గా జగపతి బాబు నటించారు హీరో వాళ్ళ నాన్న నాజర్ చనిపోయేదాక మంచిగా నటిస్తూ తరువాత ఆస్తి మొత్తం తన పేరుకు మర్పించు కుంటాడు 

హీరో వాళ్ళ అన్నయ్య ని తన కుటుంబంలో వచ్చిన ఆస్తి తగదాలును అలాగే విలన్ చేసే అకృత్యాలు ఎలా పరిష్కరించాడు అన్నది సినిమా కథ

ఇందులో కొత్తగా చెప్పుకోవాటినికి ఏమి లేదు నాని తన సినిమాలు మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటాడు కానీ ఈ సినిమా థియేటర్ లో ఎందుకు విడుదల కాకపోవడం మంచిది అయింది

మరి అంత ఓవర్ expectations తో సినిమా చూడొద్దు జస్ట్ average అంతే సినిమా 

కానీ ఫామిలీ మొత్తం చూడవచ్చు !!!

11, సెప్టెంబర్ 2021, శనివారం

" నెట్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన zee5 ott లో వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన సినిమా నెట్ ఇక ఈ సినిమా కథ ఎలాగ ఉందొ చూద్దాం ?

మనిషికి వ్యసనం రోజువారీ దినచర్య గా మారితే అది చెడు వ్యసనం అయితే ఎలా జీవితం మారుతుందో తెలిపే సినిమా

ఒక apartment లో ఒక couple జీవనం. సాగిస్తుంటారు అలాగే ఒక మధ్య తరగతి భర్త (రాహుల్ రామకృష్ణ ) ఒక భార్య ఉంటారు రాహుల్ ఆ ఊరిలో మొబైల్ షాప్ నిర్వాహిస్తుంటాడు 

ఫోన్ లో ఆశ్లేల చిత్రాల చూడటం రాహుల్ కి అలవాటు అలాగే ఒక సారి bathroom లో ఆ నీలి చిత్రాలు చూస్తుంటాడు అనుకోకుండా ఆ సైట్ నుండి లైవ్ టెలికాస్ట్ అయ్యే సైట్ ఓపెన్ అవుతుంది 

అది ఆ apartment లో ఉండే ఆ couple ఇలాగ ప్రతిరోజు వాళ్ళ జీవితంలోఎమి జరుగుతుందా అని చూస్తుంటాడు

తన దగ్గర డబ్బులు కాకుండా అప్పు తెచ్చి మరి వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో చూస్తుంటాడు అయితే వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి 

ఆ తరువాత ఏమైంది అన్నది మిగతా కథ ఫోన్, నెట్ ప్రపంచం మనిషిని ఏ స్థాయి కి తీసుకెళ్తుందో చెప్పే సినిమా మంచి ఆసక్తిగా ఉంది 

సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు రాహుల్ రామకృష్ణ బాగా నటించాడు !!!

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయక చవితి శుభాకాంక్షలు !!!

 వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అని తేడా లేకుండా సంబరాలు లో మునుగుతుంటారు వినాయకుడు అంటే అంత ఇష్టం అలాంటి వినాయక చవితి ఈ రోజు

ఆ గణనాథుడు ఆశీస్సులు మనందరికీ అందాలని ఆసిస్తూ కుటుంబమంతా ఆనందంగా వుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు !!!

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

" Family Man " session 2 వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది సెషన్ 1 లో ఎంత ఇంట్రెస్ట్ ఉందొ సెషన్ 2 లో కూడా ఏమాత్రం తీసిపోకుండా బాగా తీశారు సెషన్ 1 లో కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులను ఎలా తిప్పి గొట్టారో సెషన్2 లో తమిళ్ నాడు లోని కొంతమంది శ్రీ లంక రెబల్స్ ఉగ్రవాద  గురించి చూపటం జరిగింది

సెషన్ 2 లో ముఖ్యంగా తమిళ్ నాడులో శ్రీ లంక టెర్రరిస్ట్ లు మన భారత దేశ ప్రధాని పై దాడికి ప్రయత్నిస్తారు దానిని ఎలా తిప్పికొట్టారు అన్నది సెషన్ 2 లో ముఖ్యంగా సమంత కీలక పాత్రలో కనిపించారు

కానీ యాక్షన్ మాత్రం సెషన్2 లో చాలా బాగుంది సెషన్2 మొత్తం 9 ఎపిసోడ్ లు ఉన్నాయి 3 సెషన్ కూడా ఉంటుంది అనుకుంటా సెషన్ 2 లో 3 వ సెషన్ కి సంబంధించి లీడ్ వదిలారు 

కానీ మంచి ఇంట్రెస్టిటింగ్ ఉంది వెబ్ సిరీస్ బాగుంది 👌👌👌

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...