28, జూన్ 2020, ఆదివారం

శక్తి (హీరో) సినిమా పై నా అభిప్రాయం !!!

అభిమన్యుడు సినిమా తరువాత p. S మిత్రన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం శివ కార్తికేయన్ నటించిన చిత్రం శక్తి యాక్షన్ కింగ్ అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు
నేటి మన విద్య వ్యవస్థకు విధి విధానాలకు అద్దం పట్టేలా ఉంది
అలాగే విద్యార్థి యొక్క ఆసక్తి ఏంటో తెలుసుకోకుండా వారిని మూస పద్దతిలో ఉండే ఎలాగ ఉంటుందో ఈ చిత్రంలో తెలుస్తుంది
మన విద్య వ్యవస్థ గురించి చక్కగా చూపించారు ఈ చిత్రంలో ఒక్క విద్యార్థి లో ఉన్న నైపుణ్యాలను బట్టి దానికి మెరుగు పరిస్తే ఎలా రాణిస్తారో తెలుస్తుంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడవాల్సింది

మేటి మాట !!!


21, జూన్ 2020, ఆదివారం

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు !!!

యోగ మనిషి యొక్క ఆరోగ్యానికి ,మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు, ఆత్మ స్టిర్యాన్ని పెంచటానికి యోగ అనేది ఒక ఉత్తమమైన మార్గం

ప్రపంచానికి యోగ పరిచయం చేసింది మన భారత దేశం దీనికి మనమందరం ఎంతో గర్వపడాలి

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు !!!

పితృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

నాన్న అంటే నమ్మకం
నాన్న అంటే నడవడిక
నాన్న అంటే గౌరవం
నాన్న అంటే ఇష్టం
నాన్న అంటే మన గమ్యానికి దిశ నిర్దేశం చేసే మార్గదర్శి
నాన్న అంటే త్యాగానికి రూపం
నాన్న అంటే నన్ను ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి
   మంచి సంస్కారం, నడివాడికలను నేర్పే ప్రతి నాన్నకు పితృ దినోత్సవ శుభాకాంక్షలు !!!

20, జూన్ 2020, శనివారం

ఏపీ లో పది తరగతి పరీక్షలు రద్దు

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మరితో పోరాడుతుంది చిన్న,పెద్ద తేడా లేదు ఉన్న వాడ, లేనివాడ అనే తారతమ్యం లేదు ప్రతి ఒక్కరినీ కబళించేస్తుంది
చిన్న పిల్లలకు, వృద్దులకు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని మనకు తెలుసు
   ఇలాంటి తీవ్ర పరిస్థితులలో చదువు అంటే చిన్న పిల్లలకు మరింత కష్టం అలాంటిది పరీక్షలు అంటే అది కత్తి మీద సాము లాంటిదే ముందు ప్రాణాలు దక్కితే పరీక్షలు తరువాత అయిన రాసుకోవచ్చు
ఎంతైనా పిల్లల గురించి ఆలోచించి మంచి పని చేసింది గవర్నమెంట్ ఇది చాలా మంచి నిర్ణయం !!!

19, జూన్ 2020, శుక్రవారం

పెంగ్విన్ సినిమా పై నా అభిప్రాయం !!!

దాదాపు 3 నెలలు నుండి ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పని చేయటం లేదు ఇంకా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో సమస్యలు ఉన్నా సగటు మనిషికి వినోదం అందించే ఏకైక మార్గం సినిమా
  ఆ సినిమా థియేటర్లలు కూడా మూతపడే ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లలో సినిమాలు విడుదల చేస్తున్నారు ఇంకా ఇవాళ విడుదల అయిన పెంగ్విన్ చిత్రం సస్పెన్సు థ్రిల్లర్గ మన ముందుకు వచ్చింది అయితే సినిమా అంతా కొద్దీ నెమ్మదిగా నడుస్తుంది
ఈ సినిమాలో కీర్తి సురేష్ తప్ప మిగతా వారు కొత్తవారు
బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది
సినిమా రెండవ భాగంలో కీర్తి సురేష్ నటనకు స్కోప్ ఉంది ధైర్యవతురాలైన గర్భవతిగా మంచి నటన చేశారు
కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు కానీ సినిమా ఒక్కసారి చూడొచ్చు
కథ మాత్రం రొటీన్ గానే, నెమ్మది గానే సాగుతుంది 

18, జూన్ 2020, గురువారం

కరోనా పై పోరులో మన భద్రత మనదే ?

ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న , భయపడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది కరోనా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా , తన పని తాను చేసుకుంటూ పోతుంది
ప్రభుత్వాలు కూడా ఎంతవరకు చెయ్యాలో అంత చేసింది
కానీ లోక్డౌన్ నుండి సడలింపులో భాగంగా మన జాగ్రత్త, మన భద్రత మనమే చూసుకోవాలి

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, భౌతిక దూరం పాటించటం, వ్యక్తిగత శుభ్రత పాటించటం ఇవే మన దగ్గర ఉన్న ఆయుధాలు 

అందుకే అవసరానికి , తప్ప బయట తిరగటం తగ్గించుకోవాలి 

17, జూన్ 2020, బుధవారం

మేటి మాట !!!


చైనా ను దెబ్బ కొట్టలేమా ?

చైనా ఈ పేరు వింటే ప్రతి భారతీయుడికి ఒళ్ళు మండిపోతుంది చైనా వస్తువులను బహిష్కరించటం ప్రతి భారతీయుడు చేయవలసిన మొదటి పని ప్రపంచం మొత్తం మీద చైనా వస్తువులను వినియోగం ఎక్కువ భారత దేశంలోనే ఉంటుంది
కాబట్టి సాధ్యమైనంతవరకు చైనా వస్తువులను బహిష్కరించటం
చైనా వైరస్ కోవిడ్ 19 తో బాధ పడుతుంటే మరల సరిహద్దు కవ్వింపు చర్యలు దానికి తోడు పాకిస్తాన్ కూడా వత్తాసు పాడుతోంది
అందుకే చైనా వస్తువులను బహిష్కరిద్దాం వారి ఆర్థిక మూలాల పై దెబ్బ కొట్టాలి !!!
జై హింద్

14, జూన్ 2020, ఆదివారం

కనులు కనులు దోచయంటే సినిమా పై నా అభిప్రాయం !!!

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే విధంగా మోసాలు కూడా జరుగుతున్నాయి సినిమా అంటే ఒక ఆలోచనకు అందమైన రూపం ఇవ్వటం
ఈ సినిమాలో ముఖ్యంగా ఆర్డర్ పెట్టిన వస్తువులు విడి భాగాలు తీసి దానిలో పాత భాగాలను పెట్టి మళ్ళీ వాపస్ ఇవ్వటం జరుగుతుంది
కానీ ఈ సినిమా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అద్దం పట్టేలా ఉంటాయి 
ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు

8, జూన్ 2020, సోమవారం

మేటి మాట !!!

మూగ జీవాలపై ఇంత పైశాచికత్వమా ??

మొన్న కేరళలో జరిగిన సంఘటన మానవత్వం అనేది రోజు రోజుకి దిగజారి పోయేలా చేస్తుంది మూగ జీవాలపై అంత చిన్న చూపు ఎందుకు వాళ్ళు మనుషుల లేక రాక్షసుల మరి ఇంత దారుణమా 
మళ్ళీ అది చూసి ఆవు కు కూడా ఆ విధంగా చేశారు ఉండగా ఉండగా అసలు మనవత్వమే నశించి పోయేలా ఉంది
మనిషి బాధ వచ్చిన, సంతోషం వచ్చిన చెప్పుకుంటారు కానీ మూగ జీవులు వాటి భావాలను ఎలా వ్యక్త పరుస్తాయి
ఈ సంఘటన చాలా దారుణం !!!

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...