Hotstar లో విడుదల అయిన parachute సినిమా అంటే సినిమా కాదు వెబ్ సిరీస్ అని చెబుదాం అంటే సినిమాకు ఉండే నిడివి 2 గంటలు 30 నిమిషాలు మాత్రమే ఉంది ఇంక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇది తమిళ్ డబ్బింగ్ తెలుగులో అందుబాటులో ఉంది అసలు కథ ఏమిటంటే ఒక మధ్య తరగతి కుటుంబం తండ్రి గ్యాస్ బండ డెలివరీ చేసే పని చేస్తుంటాడు తల్లి హౌస్ వైఫ్ మందుల షాపు లో మందుల ప్యాకింగ్ చేసి వాటిని మందుల షాప్ కి సప్లై చేస్తుంటుంది వాళ్లకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ పరవాలేదు కానీ వాళ్ళ నాన్న పిల్లలపై కఠినంగా ఉంటాడు అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే కర్రతో కొడుతుంటాడు ఆ అబ్బాయి పాపం భయంతో లాగులోనే టాయిలెట్ పోసుకుంటాడు
అమ్మాయి బాగా చదువుతుంది అబ్బాయి అంతగా చదవడు అయితే ఒక రోజు వాళ్ళ ఆఫీసు లో పనిచేసే ఆయన కొడుకు చనిపోతాడు గ్యాస్ బండలు డెలివరీ చేసే బండి ఇంటి దగ్గర ఉంచి తనను చూడటానికి వెళ్తాడు ఆ రోజు వాళ్ళ అమ్మాయి పుట్టిన రోజు తన చెల్లి కోసం ఆ అబ్బాయి ఇంటిలో వాళ్లకు తెలియకుండా బండి వేసుకుని బయటకు వెళ్తాడు ఒక షాప్ దగ్గర చాక్లెట్ లు కొనుక్కుని తెలిసిన అతనికి పంచి పెడదామని వెళ్తాడు తిరిగి వచ్చి చూసేసరికి బండి ఉండదు
ఇంకా ఇద్దరు పిల్లలు కంగారు పడి పోతుంటారు ఆ ఇద్దరు పిల్లలు ఇంటికి వస్తారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద అరుస్తుంటాడు అది చూసి ఇద్దరు పిల్లలు ఆ బండిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తారు
అయితే చివరికి కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ పిల్లలకి చిన్నప్పటి నుండి భయం చెప్పాలి కానీ పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పుని చెప్పుకోవటానికి కనీసం అవకాశం కల్పించాలి
లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారు అన్నది ఈ సినిమా లో చూపించటం జరిగింది ఇంతకీ parachute అంటే ఏమనుకున్నారు అది వాళ్ళు వాడే బండి
simply superb బాగుంది సినిమా చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి