30, మార్చి 2022, బుధవారం

పుతిన్ రాజ్ కుమార్ " జేమ్స్" సినిమా పై నా అభిప్రాయం !!!

 జేమ్స్ సినిమా కన్నడ పవర్ స్టార్ పుతిన్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

జేమ్స్ సినిమా పుతిన్ రాజ్ కుమార్ చివరి సినిమా కథ ఒకసారి చూద్దాం ఒక ముగ్గురు పెద్ద బిసినెస్ మాన్ వారి వారి పనులలో ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ ఉంటారు అందులో ఒక పెద్ద బిసినెస్ మాన్ ని మిగతా వాళ్ళు చంపేస్తారు వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ వాళ్ళ ఫామిలీ కి కూడా వాళ్లనుండి ముప్పు ఉంటుంది అయితే శ్రీకాంత్ ఫ్యామిలీకి ఒక డేరింగ్ డాషింగ్  సెక్యూరిటీని. నియమిస్తారు

అతడే జేమ్స్ (పుతిన్ రాజ్ కుమార్ ) వాళ్ళను శత్రువులు నుండి కాపాడతాడు అంత బాగా జరుగుతున్న సమయంలో జేమ్స్ శ్రీకాంత్ వాళ్లకు ఎదురు తిరుగుతాడు అయితే ఎందుకు ఇలా చేస్తాడు శ్రీకాంత్ వాళ్లకు ఎందుకు తిరుగుతాడు అసలు అతడి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అన్నది సినిమా కథ 

నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు గోపిచంద్ ఆక్సిజన్ సినిమా,చాలా సినిమాలు గుర్తుకు వచ్చాయి 

కన్నడ సినిమాలు చూడటం చాలా తక్కువ గాని పుతిన్ రాజకుమార్ గురించి చూసాను సినీమా !!!

28, మార్చి 2022, సోమవారం

"RRR" సినిమా పై నా అభిప్రాయం !!!

బాహుబలి తరువాత రాజమౌళి నుండి వచ్చిన చిత్రం  ఇద్దరు మాస్ హీరోలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఈ సినిమా అటు ఫాన్స్ కి, ఇటు సినీ వర్గాలకు అంచనాలు ఆకాశాన్ని దాటాయి 

ఎన్నో వాయిదాలు తరువాత march 25 విడుదల అయింది RRR సినిమా ఇక ఈ కథ ఏమిటో చూద్దాం !!!

ఈ కథ ఇద్దరు నిజమైన వ్యక్తులు నుండి తీసుకోబడిన కల్పిత కథ అని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు

ఈ కథ 1920 లో బ్రిటిషు వారి కాలంలో జరిగిన కథ గా చూపించాడు ఒక గిరిజన చిన్న అమ్మాయిని బ్రిటిష్ రాణి పచ్చ బొట్టు వేస్తుంది అయితే ఆ పచ్చ బొట్టు వేసే శైలి ఆ చిన్న అమ్మాయి  బ్రిటిష్ రాణి కి నచ్చటంతో ఆ చిన్న పిల్లను తన బంగ్లాకి తీసుకువెళ్లి పోతారు

ఆ అమ్మాయిని తరిగి తన ప్రాంతానికి తీసుకురావడానికి భీం ఎన్టీఆర్ ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి మారు వేషంలో వెళ్లి అక్కడ పనిచేస్తుంటాడు

అయితే అక్కడే రామ్ చరణ్ బ్రిటిష్ సైన్యంలో పోలీస్ గా పని చేసాడు అల్లూరి సీత రామరాజు ఐతే అక్కడ జరిగిన చిన్న ప్రమాదంలో చిన్న అబ్బాయిని కాపాడటానికి ఇద్దరు సాహసం చేసి ఆ అబ్బాయిని కాపాడతాడు అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అవుతారు

ఆ పిల్లను విడిపించటానికి భీం, బ్రిటిష్ వారి ఆజ్ఞలు అమలు చేసే రాం రాజు ఆ పిల్లని బీమ్ నుండి ఎలా కాపాడాడు ఇద్దరు చివరకు ఏమి జరిగింది ఇద్దరు స్నేహితులు కాస్త వారి వారి కర్తవ్యాన్ని ఎలా చేశారు అన్నది మిగిలిన సినిమా కథ

సినిమా మొత్తం నిడివి 3 గంటలు ఉంది అంత సేపు ప్రేక్షకుడిని సీట్ లో కూర్చోబెట్టడం అంటే ఎక్కడ బోర్ అవ్వకూడదు ఆ విషయం రాజా మౌళి కి బాగా తెలుసు కానీ సెకండ్ హాఫ్ నుండి సినిమా మొత్తం రామ్ చరణ్ వైపు హైలెట్ గా చూపించటం జరుగుతుంది 

ఇది ఎన్టీఆర్ ఫాన్స్ కి కొంచెం బాధ గా అనిపిస్తుంది మొత్తానికి పర్వాలేదు వన్ టైం వాచ్ చేయొచ్చు గ్రాఫిక్స్ కూడా రాజమౌళి నుండి ఆశించినంత ఏమి లేదు !!!

27, మార్చి 2022, ఆదివారం

అజిత్ వాలిమై సినిమా పై నా అభిప్రాయం !!!

 

వలిమై ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!

వైజాగ్ లో ఒక ముఠా చైన్ స్నాటచింగ్ చేస్తూ ముర్డర్లు,డ్రగ్స్ చేస్తూ ఉంటారు అయితే దీనిని ఆపడానికి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవసరం ఉంటుంది అయితే అతడే అజిత్ విజయవాడ లో ఉంటాడు అయితే తన కుటుంబ పరిస్థితులు వల్ల విశాఖపట్నం వస్తాడు హీరో తమ్ముడు ఇంజనీరింగ్ చదివి ఏ ఉద్యోగం దొరకక చాలామంది తో అవమానలు ఎదురు అవుతాయి 

అయితే ఆ ముఠా ని ఎలాగైనా పట్టుకోవాలని అజిత్ చూస్తుంటాడు అయితే ఆ ముఠా లో వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు అయితే చివరకు ఏమి జరిగింది తన తమ్ముడిని ఎలా కాపడుకున్నాడు 

ఆ ముఠా ని ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా ఈ సినిమా ఏమి కొత్తగా కనిపించలేదు పాత కథే కాకపోతే దీనిలో కొంచెం యాక్షన్ సీన్స్ తో తీశారు 

అంతగా ఏమి లేదు సినిమా జస్ట్ below average అంతే !!!

19, మార్చి 2022, శనివారం

దుల్కర్ సల్మాన్ సెల్యూట్" సినిమా పై నా అభిప్రాయం !!!

దుల్కర్ సల్మాన్ తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు ఉన్న నటుడు ఇక సోనీ లివ్ ott లో విడుదల అయిన సెల్యూట్ సినిమా ఎలా ఉందో చూద్దాం !!!

హీరో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ అన్నయ్య కూడా పోలీస్ డీజీపీ పని చేస్తుంటాడు అయితే వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక హత్య జరుగుతుంది ఆ హత్య కు సంబంధం లేని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతడిని హింసిస్తారు అయితే ఆ విషయం హీరోకి నచ్చదు ఎలాగైనా ఆ నిజమైన హాంతకుడిని పట్టుకునే దాకా లాంగ్ లీవ్ తీసుకుంటాడు హీరో

అయితే చివరకు ఏమైంది అసలు హాంతకుడిని పట్టుకున్నారా లేదా అన్నది సినిమా కథ చెప్పు కోవడానికి ఏమి లేదు జస్ట్ average అంతే సినిమా 

రాజకీయ ఒత్తిళ్లు తల వంచి ఒక హత్య కేస్ ను ఒక అమాయకుడు మీద ఎలా తీసుకెళ్లారు అసలు నెరస్తున్ని పెట్టుకోకుండా పోలీసులు ఎలా తారు మారు చేశారు అన్నది సినిమా కథ !!!

18, మార్చి 2022, శుక్రవారం

Beemla nayak ott లోకి వచ్చేది ఎప్పుడంటే !!!

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా beemla nayak సినిమా ఫిబ్రవరి 25 న విడుదల అయ్యింది అయితే కరెక్ట్ గా నెల రోజులు అనగా march 25 తేదీన ఆహా ott లో విడుదల అవుతుంది !!!

15, మార్చి 2022, మంగళవారం

" FIR " సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ డబ్బింగ్ సినిమా విష్ణు విశాల్ హీరోగా చేసిన సినిమా FIR ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!

వైజాగ్ లో కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగ ప్రయత్నం లో ఉంటాడు హీరో వాళ్ళ అమ్మ పోలీస్ హీరో వాళ్ళ కుటుంబం ముస్లిం కుటుంబం  ఒక ప్రసిద్ధ వ్యక్తి దగ్గరికి హీరో వెళ్తాడు అయితే అప్పటికి ఆ వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆ వ్యక్తి ని తమ రహస్యంగా గమనిస్తుంటుంది ఎందుకంటే అతడు  ఉగ్రవాద నికి ఎదో సంబంధం ఉందని వాళ్ల అనుమానం

అయితే అక్కడికి హీరో వెళ్ళితే వాళ్ల అనుమానం హీరో మీద పడుతుంది అక్కడి నుండి వాళ్ళు హీరోని ఫాలో అవుతాడు

హీరో వేసే ప్రతి అడుగు వాళ్లకు అనుమానంగా కనిపిస్తుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు వెతికే అబుల్ బక్కర్ అబ్దుల్లా అనే ఉగ్రవాది అతడే ఏమో అని అనుమానం చివరికి అతడిని అరెస్ట్ చేస్తారు

అయితే ఆ తరువాత ఏమి జరిగింది అన్నది మిగిలిన కథ నిజంగా ఇంటెలిజెన్స్ వెతుకుతున్న ఉగ్రవాది హీరోనా, లేక పోతే ఇంకా ఎవరు అసలు అబుల్ బక్కర్ అబ్దుల్లా ఎవరు అన్నది సస్పెన్సు తో కూడుకున్న సినిమా బాగుంది సినిమా ఒక సారి చూడవచ్చు !!!

11, మార్చి 2022, శుక్రవారం

సెబాస్టియన్ pc524 సినిమా పై నా అభిప్రాయం!!!

 కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ పీసీ524 సినిమా శుక్రవారం విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

కిరణ్ అబ్బవరం 3 సినిమా ఇది కథ ఏమిటంటే రేచికటి తో ఉండే హీరోకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది అయితే తనకు రేచికటి అని తెలిస్తే తన జాబ్ పోతుంది అని రేచికటి ని ఎలా manage చేసాడు

ఒక రోజు స్టేషన్ లోని పోలీస్ అందరూ వేరే సెక్యురిటి కోసం వెళ్లారు ఆ స్టేషన్ లో హీరో ఒక్కడే ఉంటాడు అయితే కొన్ని ఫోన్ లు వస్తాయి కానీ తనకు రాత్రి పూట కనిపించదు కాబట్టి ఎవరి ఫోన్ ఎత్తిన పక్కన పెట్టేస్తాడు అయితే అప్పుడే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది తన ఫోన్ కూడా లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తాడు

ఆ రాత్రి అలా గడిచిపోతుంది కానీ ఆ మరుసటి రోజు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక అమ్మాయి హత్య జరుగుతుంది ఇది తన వల్లే జరిగింది అని చెప్పి సస్పెండ్ చేస్తారు

ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ రేచికటితో ఎలా manage చేసాడు ఆ హత్య ఎవరు చేశారు అసలు ఈ విషయం అందరికి తెలిసిందా లేదా అన్నది సినిమా 

సినిమా అయితే జస్ట్ average పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

10, మార్చి 2022, గురువారం

విశాల్ సామాన్యుడు సినిమా పై నా అభిప్రాయం !!!

సామాన్యుడు తమిళ్ డబ్బింగ్ విశాల్ హీరోగా చేసిన సినిమా ఈ మధ్యనే విడుదల అయ్యింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!
హీరో విశాల్ ఒక మధ్య తరగతి కుటుంబం నాన్న పోలీస్ కానిస్టేబుల్ తాను కూడా పోలీస్ అవ్వాలనుకుని ప్రయత్నిస్తాడు
కానీ కొన్ని అనుకోని  కారణాలు వల్ల తన చెల్లిని ఎవరో చంపేస్తారు తన్న చెల్లిని చంపిన వారిని ఎలా పట్టుకున్నాడు చివరకు పోలీస్ అయ్యాడా లేదా అన్నది సినిమా కథ 
రొటీన్ గానే ఉంటుంది సినిమా నిడివి కూడా 2 గంటల 30 నిమిషాలు పైనే ఉంది సాగదీత ఎక్కువుగా ఉంది  సినిమా మొత్తం విశాల్ సినిమాలలో ఇదివరకు ఉన్న కంటెంట్ ఇప్పుడు ఉండటం లేదు 
జస్ట్ average అంతే సినిమా !!!

7, మార్చి 2022, సోమవారం

వరుణ్ సందేశ్ " ఇందువదన " సినిమా పై నా అభిప్రాయం !!!


 వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో మన అందరకు పరిచయమే తరువాత కథల ఎంపికలో తడబడుతూ అంతగా అడలేని సినిమాలు చేస్తూ వచ్చాడు ఇక ఈ మధ్య విడుదల అయిన ఇందువదన సినిమా పై నా అభిప్రాయం !!!

ఇందులో హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసెర్ అయితే అక్కడ ఉంటున్న ఒక గిరిజన అమ్మాయిని ప్రేమిస్తాడు అక్కడి వారి అందరిని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు కానీ హీరో ఇంటిలో వారు దానికి అంగీకరించారు

వారిది సంప్రదాయ కుటుంబం వారిద్దరిని ఊరి నుండి వెలివేస్తారు 

కొన్నాళ్ళకు తన డ్యూటీ లో జాయిన్ అవుతాడు ఆ అమ్మయిని ఒంటరిగా అక్కడే వదిలేసి అయితే తిరిగి కొన్నాళ్ళకు ఆ ఊరు వస్తాడు అంతా మామూలుగానే ఉంటుంది

కానీ ఊరిలో మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇంతకు ఏమి జరిగిందంటే ఆ అమ్మాయిని చెంపేస్తారు ఆ అమ్మాయిని చంపింది ఎవరు హీరో ఏమి చేశాడు అన్నది కథ

ఈ సినిమా కథ కొత్తదనం ఏమీ లేదు

అసలు బాగోలేదు సినిమా !!!

5, మార్చి 2022, శనివారం

" గాడ్ ఫాథర్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 

 

గాడ్ ఫాథర్ సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా చిన్న సినిమా ఇక ఈ కథ గురించి చూద్దాం !!!!

 ఒక middle క్లాస్  ఉండే ఒక ఫామిలీ ఫ్లాట్ లో ఉంటారు సాధారణ జీవితం గడుపుతుంటారు అదే క్రమంలో ఆ ఊరిలో ఉండే ఒక రౌడి కొడుకు గుండెకు సంబంధించిన వ్యాధి తో బాధ పడుతుంటాడు 

Same అదే బ్లడ్ గ్రూప్ తో అదే వయసులో ఉన్న హీరో కొడుకుకి ఉంటుంది తన కొడుకుని ఎలాగైనా బతికించుకోవాలని హీరో కొడుకుని చంపేసి తన కొడుకుని బతికించుకోవాలని చూస్తాడు రౌడి

అయితే చివరకు ఏమి జరిగింది హీరో  తన కొడుకుని రౌడి నుండి ఎలా కాపడుకున్నాడు అన్నది సినిమా కథ 

పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు బాగానే ఉంది !!!

4, మార్చి 2022, శుక్రవారం

"Beemla nayak " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది మలయాళీ సినిమా అయ్యప్పన్ కోశీయుమ్ సినిమాకు రీమేక్ సినిమాగా పవన్ కళ్యాణ్ తో తెలుగులో ఫిబ్రవరి 25 విడుదల అయినది ఇక ఈ సినిమా కథ చాలా మందికి తెలుసు కానీ ఒక సారి చూద్దాం !!!

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు అయితే డానియల్ శేఖర్ పాత్రలో రానా మలయాళం సినిమాలో ఇద్దరి పాత్రలకు స్కోప్ ఉండేలా చేశారు కానీ ఈ సినిమాలో కథ పవన్ కళ్యాణ్ కె మొగ్గు చూపింది

ఒక రాత్రి మద్యం bottle తో కారులో వస్తాడు అక్కడే డ్యూటీలో ఉన్న హీరో  అక్రమంగా మద్యం తీసుకువస్తున్నాడు అని రానా ని అరెస్ట్ చేస్తాడు అయితే అక్కడి నుండి రానా కి, పవన్ కళ్యాణ్ కి ఇద్దరి మధ్య గొడవలు ఒకరిది అహం, ఒకరిది ఆత్మాభిమానం, ఇలా జరుగుతుంది కథ

అయితే అసలు కథ చివరకు ఎలా సద్దు మనిగింది గెలుపు ఎవరిది అన్నది మిగిలిన కథ అంత పవన్ తుపాన్ అంతే సినిమా !!!👍👍👍

1, మార్చి 2022, మంగళవారం

జీ5 Ott లో విడుదల అయిన "సంకెళ్లు" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 ఇది తమిళ్ వెబ్ సిరీస్ తెలుగులో జీ 5 ott లో అందుబాటులో ఉంది ఇక ఈ webseries ఎలాగ ఉందొ చూద్దామా ?

ఈ వెబ్ సిరీస్ కథ ఒక అడవిలో ఒక శవం కనబడుతుంది ఇన్వెస్టిగేషన్ కు వెళ్లిన పోలీసులకు మొదట శవం పూర్తిగా ఉంటుంది కానీ పోలీస్ వారి పై అధికారి వచ్చేటప్పటికిఈ అందరూ అక్కడకు వెళ్తారు అలా వెళ్లి వచ్చేటప్పటికి ఆ శవం తల ఉండదు కేవలం మొండెం మాత్రమే ఉంటుంది

అసలు ఆ తల ఎవరు తీసుకెళ్లారు, అసలు ఆ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది ఈ వెబ్ సిరీస్ కథ

చూడటానికి బాగుంది వెబ్ సిరీస్ తమిళ్ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కదా ఈ వెబ్ సిరీస్ కూడా అలాగే ఉంది క్రైమ్ సిరీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది

మొత్తం 4 గంటలు పైనే ఉంది వెబ్ సిరీస్ బాగుంది మీకు సమయం దొరికితే చూడండి !!!

ఆలియా భట్ " గంగూ భాయ్" సినిమా పై నా అభిప్రాయం !!!

గంగూ భాయ్ సినిమా బాలీవుడ్  అలియా భట్ నటించిన సినిమా సంజయ్ లీలా భన్సాలి చేసిన సినిమా direction లో వచ్చిన సినిమా గంగుభాయ్ ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!
 ఇందులో హీరోయిన్ అలియా భట్ గంగా తనని హీరోయిన్ చేస్తానని చెప్పి నమ్మించి ఒక వేశ్య గృహానికి తనని అమ్మేస్తాడు 
అయితే అప్పటినుండి తాను అక్కడినుండి తన జీవితం ఎలా మారింది వేశ్య గృహంలో పడ్డ ఇబ్బందులు చివరకు తాను ఏ విధంగా ఎదుర్కొని నిలబడింది అసలు ఏమిటి కథ అన్నది చూడాలి 
సినిమా జీవిత కథ ఆధారంగా చేసినట్టు ఉన్నది సంజయ్ లీల భన్సాలి సినిమాలు అన్ని జీవిత కథ ఆధారంగానే ఉంటాయి
కానీ సినిమా పర్వాలేదు బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు !!!

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...