30, నవంబర్ 2024, శనివారం

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ మూవీ పై నా అభిప్రాయం !!!


 ఆహా OTT లో విడుదల అయిన ఈ సినిమా ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమా ప్రియ దర్శి సినిమా అంటే minimum కామెడీ ఎక్సపెక్ట్ చేసి చూసాను సినిమా ఇంక లేట్ చేయకుండా అసలు కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేస్తాడు అక్కడి నుండి పారిపోవటానికి ఒక కార్ ఎక్కుతాడు అయితే ఆ కార్లో ఉండే డ్రైవర్ నీ బెదిరించి తనకు కావాల్సిన చోట దింపమంటాడు అయితే బ్యాంకులో ఎవరో ఒక వ్యక్తి తుపాకీ కాల్చడం వలన ఆ దొంగ కొద్దిగా గాయపడతాడు

కొంచెం దూరం వెళ్ళిన తరువాత దొంగ స్పృహ తప్పుతాడు అతడు దగ్గర ఉన్న డబ్బును ఎలాగైనా దొంగిలించాలని అనుకుంటాడు డ్రైవర్ దొంగ దగ్గర ఉన్న తుపాకీ లాక్కుంటాడు ఇంతలో దొంగకు మెలుకువ వస్తుంది ఇద్దరు కొంచెం సేపు దెబ్బలాడుకుంటారు ఇంతలో డ్రైవర్ చేతిలో ఉన్న గన్ పేలి దొంగకు తగుల్తుంది 

డ్రైవర్ భయపడి hospital కి తీసుకుని వెళ్దాం అనుకుంటాడు కానీ దొంగ ఏదైనా హోటల్ రూం తీసుకెళ్ళమంటాడు డ్రైవర్ ఒక హోటల్ రూం కి తీసుకెళ్తాడు

అక్కడ ఒక రూం తీసుకుంటారు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వీళ్ళ యవ్వారం చూసి ఆ డబ్బు ఉన్న bag నీ కాజేస్తుంది ఇంతకీ మనహీరో priyadarsi ఎక్కడ అనుకుంటున్నారా ఆగండి చెబుతాను మన హీరో ది వేరే కథ తను ప్రేమించిన అమ్మాయి డబ్బు సమస్య వాళ్ళ నాన్న డబ్బు కోసం వేరే అబ్బాయితో పెళ్లి కాయం చేస్తాడు హీరోయిన్ హీరో నీ పెళ్ళి చేసుకోవాలంటే 50 లక్షలు కావాలి అని చెబుతుంది హీరో ఆ డబ్బు కోసం ప్రయత్నం చేస్తాడు 

ఇప్పుడు మళ్ళీ మొదటి కథలోకి వెళితే ఆ రిసెప్షనిస్ట్ తిరిగి ఆ డ్రైవర్ కి, దొంగకి దొరుకుతుంది వీళ్ల ముగ్గురు దొంగలే చెప్పాలంటే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారు అయితే కథ చివరికి ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ మీలో చాలా మందికి తెలిసి పోయే ఉంటుంది అది కథ ఇందులో చెప్పుకోవటానికి ఏమి లేదు చాలా బోరింగ్ గా నడుస్తుంది కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...