27, మే 2023, శనివారం

బూ " సినిమా పై నా అభిప్రాయం !!!

విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేద పెతురజ్,మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా బూ 

జియో సినిమా ott  అందుబాటులో ఉంది హర్రర్ సినిమా ఇది సినిమా కదా ఏంటో ఇప్పుడు చూద్దాం!!!

రకుల్ ప్రీత్ సింగ్ తన ముగ్గురు స్నేహితురాలతో కలిసి తన ఇంట్లో పార్టీ చేసుకుంటుంది అయితే తనకి దెయ్యాల మీద ఇంట్రెస్ట్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి Hallowen పార్టీ చేసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర ఒక అలవిన్ స్టోరీస్ పార్టీ బుక్ ఉంటది. అయితే అందులో రకరకాల దెయ్యాల స్టోరీలు ఉంటాయి అయితే అవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి వాటితో వాళ్ళ ఫ్రెండ్స్ ని భయపెట్టాలని చూస్తుంది

నిజంగానే జరిగినట్టు తన చుట్టూ ఉన్న మనుషుల చేత నాటకం ఆడిపిస్తుంది కానీ నిజానికి అక్కడ జరుగుతుంది వేరు ఆ నిజం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే

ఇంగ్లీష్ హారర్ మూవీస్ చూసేవారికి ఈ సినిమా అంతగా ఏమి అనిపించదు కానీ ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు ట్విస్ట్ లు మీద ట్విస్టుల ఉంటాయి గానీ అంతగా అనిపించింది సినిమాలో జస్ట్ యావరేజ్ అంతే!!!
 

25, మే 2023, గురువారం

బిచ్చ గాడు 2 సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా పెద్ద విజయం సాధించింది దానికి బిచ్చగాడు 2 సినిమా మొన్న విడుదల మే 19 న విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఇందులో ఒక కోటీశ్వరుడు ఉంటాడు అతడిని చంపేసి అలాగే ఉన్నమరోక వ్యక్తి ఉంటాడు అతడు బిచ్చ గాడు  అతడి శరీరం లోకి ఒక బిచ్చగాడు మెదడుని మారుస్తారు ఆ కోటీశ్వరుడు డబ్బంతా ఒక ముగ్గురు పంచుకోవాలని దురాశ తో మెదడుని మారుస్తారు 

అయితే ఆ బిచ్చ గాడికి ఒక చెల్లి ఉంటుంది చిన్నప్పటి నుండి చాలా ప్రాణంగా చూసుకుంటున్న చెల్లిని తనని ఒక ముసలి వాడు ఒక దొంగ ముఠా కి అమ్మేసారు అప్పటి నుండి బిచ్చగాడు డ్రగ్స్ case లో అరెస్ట్ అవుతాడు అయితే తన చెల్లిని తిరిగి ఎలా పొందగలిగాడు కోటీశ్వరుడు రూపంలో ఉన్న తను ఆకలి తో ,ఆరోగ్యం బాగోలేక ఉన్న వారికి ఈ విధంగా సహాయం చేశాడు అన్నది మిగిలిన కథ బిచ్చ గాడు 1 తో పోలిస్తే మరి అంతగా ఏమి లేదు సినిమా జస్ట్ average అంతే

సెకండ్ హాఫ్ మొత్తం సిస్టర్ సెంటిమెంట్, ఉన్నవాళ్లు లేనివాళ్లు తక్కువ ధరలో వస్తువులు అమ్మ వచ్చు అన్నది చూపించటం జరిగింది !!!

21, మే 2023, ఆదివారం

స్వప్న సుందరి సినిమా పై నా అభిప్రాయం!!!

 డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమా స్వప్న సుందరి కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!

హీరోయిన్ ఒక మద్య తరగతి అమ్మాయి బంగారం షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. తండ్రి ఆరోగ్యం బాగోలేక మంచాన్ని పడి ఉంటాడు అమ్మ ,మూగ అక్క ఉంటారు అన్న ఉంటారు గాని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తాడు ఇంట్లో పద్ధతి  నచ్చక బయటికి వెళ్ళిపోతాడు అయితే బంగారు షాప్ లో పనిచేస్తున్న హీరోయిన్ కి వాళ్ళ అన్నయ్య  తెలియకుండా కొంతమంది దగ్గర కమీషన్ తీసుకుని బంగారు నగలు కొనిస్తాడు వాళ్ళు ఒక లక్కీ కూపన్ వస్తుంది అది తన చెల్లికి తెలిసి అడుగుతుంది అయితే వెంటనే ఆ  కూపన్  తన చెల్లి మొహం మీద కొడతాడు అయితే దానిమీద హీరోయిన్ తన పేరు రాసి బాక్స్ లో వేస్తుంది

 అనుకోకుండా ఆ కూపన్ కి 10 లక్షల విలువ చేసే కారు బహుమతిగా వస్తుంది

ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి ఆ కారు వాళ్ళ జీవితాలను ఎలా మలుపు తెప్పింది అన్నది మిగిలిన కథ

ఐశ్వర్య రాజేష్ సినిమాలు బాగానే ఉంటాయి దురాశ దుఃఖానికి చేటు అనేది సినిమా రూపంలో ఈ కథలో మనకు తెలియజేయడమైనది

ఆ కారు వచ్చిన తర్వాత  వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అన్నది మిగిలిన కథ కామెడీగా బానే ఉంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒకసారి చూడవచ్చు!!!

(స్వప్న సుందరి మూవీ రివ్యూ)

17, మే 2023, బుధవారం

The Kerala Story సినిమా పై నా అభిప్రాయం !!!

 The Kerala story సినిమా ఈ మధ్యే థియేటర్ లలో విడుదల అయింది ఇందులో ఆద శర్మ కేరళలో జరిగిన నిజమైన సంఘటనలు ఆధారంగా సినిమా తీయడం జరిగింది ఈ సినిమా వివాదాలు మీద విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది 

అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

కేరళలో హిందూ కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ,మరొక క్రిస్టియన్ అమ్మాయి, మరొక ముస్లిం అమ్మాయి మొత్తం నలుగురు ఒకే హాస్టల్ లో ఒక రూం లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు అయితే అందులో ముస్లిం అమ్మాయి తన ఇస్లాం మతం గొప్పదని తన దేవుడు అల్లా గొప్ప దేవుడని చెప్పి వాళ్ళని ఎలాగైనా తన మతం లోకి మార్చి వేయాలని చూస్తుంది దానికోసం కొంతమంది ముస్లిం అబ్బాయిలను ఆ అమ్మాయిలని ఎలాగైనా తమ మతం లోకి మార్చాలని వాళ్లకు చెబుతుంది ప్రణాళిక ప్రకారం వాళ్ళు కూడా ఇద్దరు హిందూ అమ్మాయిల్ని వాళ్ళ వలలో వేసుకుంటారు అందులో ఒక అమ్మాయి pregnent అవుతుంది ఎలాగోలా వాళ్ళను ట్రాన్స్ చేసి వాళ్ళ మతం లోకి మార్చేస్తారు 

అలా మార్చేసిన వారిని సిరియా వంటి gulf దేశాలకి తీసుకెళ్ళి చాలా కష్టాలు పెడతారు అందులో శాలిని అనే అమ్మాయిని మాత్రమే వాళ్లు తీసుకువెళతారు మిగతా హిందూ అమ్మాయి ఇండియా లోనే   చని పోతుంది క్రిస్టిన్ అమ్మాయి మాత్రం మతం మారదు వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేస్తారు

అయితే చివరికి కథ ఎలా ముగిసింది అసలు వాళ్ళు మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు దాని వెనుక కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ ఈ సినిమా పెద్దవారికి మాత్రమే కొన్ని కొన్ని సీన్స్ హింసాత్మకంగా ఉన్నాయి నిజంగా చాలా దారుణంగా జరిగినట్టు ఉంటుంది కథ  !!!

15, మే 2023, సోమవారం

Farhana సినిమా పై నా అభిప్రాయం !!!


ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ విలన్ గా Theatre లో విడుదల అయిన సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

హీరోయిన్ ఒక ముస్లిం కుటుంబం కట్టుబాట్లు ఎక్కువ అయితే వాళ్ళ కుటుంబం లో ఎవరు ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేయరు అలాంటిది హీరోయిన్ బయటకు వచ్చి జాబ్ చేయానుకుంటుంది ఎందుకంటే ఇంటిలో పరిస్తితి అంతంత మాత్రం ఉంటుంది అందుకే ఇంటిలో ఎలాగైనా ఒప్పించి ఒక కాల్ సెంటర్ లో జాబ్ వస్తుంది హీరోయిన్ కి అంతకుముందే పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు అందులో చిన్న పాపకి operation చేపించాలి డబ్బులు కోసం call సెంటర్ జాబ్ నుండి వేరొక మొబైల్ చాట్ call సెంటర్ లో పనిచేస్తుంది అందులో కస్టమర్ లు రక రకాలుగా మాట్లాడుతారు చాలా అసభ్యంగా మాట్లాడుతారు అందులో ఒకరు మొదట్లో బాగా మాట్లాడుతూనే ఆ తరువాత వ్యక్తిగత విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేయటం చేస్తాడు అయితే ఇలాంటి పరిస్థితుల్ని హీరోయిన్ ఎలా ఎదుర్కొంది అన్నది మిగిలిన సినిమా కథ 

ఆడవాళ్ళు జాబ్ చేస్తే ఏటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది సినిమా కథ బాగానే ఉంది సినిమా చూడ వచ్చు !!!

10, మే 2023, బుధవారం

"నత్త రామేశ్వరం నీటిలో ఉండే ఏడాది కి ఒకసారి మాత్రమే దర్శనం ఇచ్చే అరుదైన శివాలయం దర్శనం (వీడియో)!!!

 పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామం లోని ప్రసిద్ధ శివాలయం ఏడాది కి ఒక నెల మాత్రమే దర్శన భాగ్యం కలిగే అరుదైన శివలింగం దర్శనం మీకోసం వీడియో చూడండి !!!


7, మే 2023, ఆదివారం

Disney hotstar లో విడుదల అయిన Save The tigers Web series పై నా అభిప్రాయం !!!


ప్రియ దర్శి,మరికొంతమంది  నటి నటులతో డిస్నీ hotstar లో విడుదల అయిన save the tigers అనే webseries స్ట్రీమింగ్ లో ఉంది ముగ్గురు భర్తలు వాళ్ళ భార్యలతో పడే ఇబ్బందులు భార్య భర్తలు మధ్య ఉండే చిన్న, చిన్న గొడవలు కామెడీ గా చూపిస్తూనే అసలు కథ ఏమిటో చెప్పటం జరిగింది 

అక్కడక్కడ కొన్ని చోట్ల బోర్ కొట్టింది కానీ మీ దగ్గర time ఉంటే మాత్రం ఒకసారి చూడ వచ్చు 

సిల్లీ గా సాగుతుంది కథ !!!

6, మే 2023, శనివారం

అఖిల్ "ఏజెంట్ సినిమా ott release ఎప్పుడో తెలుసా !!!

 అక్కినేని అఖిల్  నటించిన ఏజెంట్ సినిమా సురేందర్  రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా  ఏప్రిల్ 28 Theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా మే 19 తేదీన సోనీ లివ్ ott లోకి రాబోతుంది 

విడుదల అయిన 20 రోజులకే ott లోకి రాబోతుంది !!!

Agent movie ott release

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...