26, అక్టోబర్ 2022, బుధవారం

ఆహా లో విడుదల అయిన స్వాతి ముత్యం సినిమా పై నా అభిప్రాయం !!!


 బెల్లం కొండ గణేష్ హీరోగా వచ్చిన సినిమా స్వాతి ముత్యం సినిమా థియేటర్ లలో ఇలా వచ్చి అలా ott లోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా లో హీరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు హీరో ఒక పెళ్లి చూపులకి వెళ్తాడు కానీ అది cancel అవుతుంది ఆ తరువాత హీరో హీరోయిన్ మాత్రమే ఒక restaurent లో పెళ్లి చూపులు జరుగుతాయి అయితే హీరోయిన్ అలోచించుకుని చెబుతాను అంటుంది అయితే ఇందులో హీరో కొంచెం అమాయకుడు గా ఉంటాడు ఆ తరువాత కొన్ని రోజుల తరువాత హీరోయిన్ పెళ్లికి ok చెబుతుంది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది హీరో పెళ్లికి అందరూ సిద్ధ పడుతుంటారు అప్పుడు అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పటి నుండి కథ వేరేలా ఉంటుంది అది హీరో పెళ్లికి ముందు తన ఫ్రెండ్ డాక్టర్ వెన్నెల కిషోర్ హీరో యొక్క వీర్యం కావాలని అడుగుతాడు అయితే హీరో ఒప్పుకొడు కానీ ఎవరికో పిల్లలు లేకపోతే చివరికి ఒప్పుకుంటాడు 

సరోగసి ద్వారా ఒక అమ్మాయి ఒక బాబుని కంటుంది ఆ పిల్లాడిని తీసుకుని కళ్యాణ మండపం కి వస్తుంది ఆ తరువాత కథ ఏమిటి అన్నది పరవాలేదు అంతగా ఏమి లేదు average అంతే !!!

24, అక్టోబర్ 2022, సోమవారం

మెగాస్టార్ "వాల్తేర్ వీరయ్య" టీజర్ చూసారా ?

 మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ సినిమా టీజర్  దీపావళి సందర్భంగా విడుదల అయింది ఈ సినిమా టీజర్ మీరు చూడండి !!!

23, అక్టోబర్ 2022, ఆదివారం

Amazon prime లో విడుదల అయిన "అమ్ము" సినిమా పై నా అభిప్రాయం !!!

 Amazon prime లో మొన్న విడుదల అయిన అమ్ము సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన సినిమా అమ్ము ఈ కథ మామూలుగా హీరో నవీన్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే తనకు పెళ్లి జరుగుతుంది కథ అంత సదా సీద గా జరుగుతుంది అయితే పెళ్ళైన కొన్ని రోజుల తరువాత హీరో తన భార్యను హింస పెట్టడం చేస్తాడు అసలు హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని భార్య అనుకుంటుంది ఆ విషయం తన పై అధికారులకు చెప్పాలని అనుకుంటుంది కానీ అది జరగదు 

అయితే చివరకు తన భర్త ఏ విధంగా డీల్ చేసిందో అదే సినిమా కథ ఇందులో బాబీ సింహ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపిస్తాడు అంతగా ఏమి లేదు సినిమాలో ఒక సైకో మొగుడు నుండి భార్య ఎలా ఎలా తప్పించుకోగలిగింది అన్నది సినిమా కథ !!!

రోటీన్ గానే ఉంది కథ !!!







20, అక్టోబర్ 2022, గురువారం

"palthu janwar" సినిమా పై నా అభిప్రాయం !!!


Palthu janwar మలయాళీ డబ్బింగ్ సినిమా ఇది తెలుగులో కూడా ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !

మలయాళీ సినిమా చాలా natural గా ఉంటాయి ఇక కథ ఏమిటంటే ఒక ఊళ్ళోకి ఒక పశువులు డాక్టర్ అసిస్టెంట్ లాగా వస్తాడు మన హీరో తనకు ఆ ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు కానీ వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల తనకు ఆ ఉద్యోగం వస్తుంది అలా ఇష్టం లేకుండా చేస్తున్న ఉద్యోగం లో ఎన్ని అవమానాలు, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురు అయ్యాయి అన్నది సినిమా కథ చాలా సహజ సిద్దంగా ఉంటుంది కథ 

పరవాలేదు ఒక సారి ట్రై చేయవచ్చు !!!

17, అక్టోబర్ 2022, సోమవారం

కాంతర సినిమా పై నా అభిప్రాయం !!!


 కంతారా సినిమా కన్నడ సినిమా తెలుగులో theatre లలో అక్టోబర్ 15 న విడుదల అయింది రిషబ్ సెట్టి హీరోగా సొంత డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి అన్ని ఉన్న కూడా మనశ్శాంతి గా ఉండేవాడు కాదు ఎదొక లోటు మనశ్శాంతిగా నిద్ర పోయేవాడు కాదు అందుకని తన మనశ్శాంతి కోసం దేశ సంచారం చేసేవాడు ఒక అటవీ ప్రాంతంలో ఒక దేవత రాయి ఒకటి కనబడుతుంది అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలకు ఆ దేవత రాయి తనకు ఇస్తే దానికి బదులుగా తన ఆస్తిలో అడవిలో ఉన్న స్థలాన్ని వాళ్ళకి రాసి ఇస్తానని చెబుతాడు దానికి వాళ్ళు ఒప్పుకుంటారు ఆ దేవత వాళ్ళలో ఒకరికి పూని అలాగే అని చెబుతుంది 

కొన్ని సంవత్సరాలు తరువాత హీరో వాళ్ళ ఉండే ఒక అటవీ ప్రాంతంలో కబ్జా చేయటానికి ఆ రాజు వారసుడు ప్రయత్నిస్తాడు దానిని హీరో ఎలా అడ్డుకున్నాడు అన్నది అసలు కథ దీనిలో  ముఖ్యంగా కొలం ఆచారం గురించి ఈ సినిమాలో చెప్పటం జరిగింది మొత్తానికి బాగుంది సినిమా క్లైమాక్స్ బాగుంది !!!


9, అక్టోబర్ 2022, ఆదివారం

కన్నడ సూపర్ హిట్ సినిమా కంతరా తెలుగు ట్రైలర్ చూసారా ?

 కన్నడ లో సూపర్ హిట్ అయిన కంటార సినిమా తెలుగులో అక్టోబర్ 15 న theatre లలో విడుదల అవుతుంది దీనికి సంబందించిన ట్రైలర్ కూడా విడుదల అయింది గీత ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తుంది ఈ సినిమాని మీరూ ఒక లుక్ వేయండి !!!

7, అక్టోబర్ 2022, శుక్రవారం

God father సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా god father సినిమా దసరా సందర్భంగా October 5 న విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది మోహన్ లాల్ Lucifer సినిమా చూసిన వారికి సుపరిచితమే అయితే కథ చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తరువాత ఆ తరువాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్తబ్దత ఏర్పడుతుంది  ఆ ముఖ్య మంత్రి pkr అతని తరువాత వారసుడు ఎవరు అన్నది తన అల్లుడా లేదా pkr కి అత్యంత సన్నిహితుడు అయిన బ్రహ్మ ( చిరంజీవి ) అన్నది 

ప్రభుత్వాన్ని ఎలాగైనా తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తాడు pkr అల్లుడు దానికి హీరో అడ్డుపడతాడు అయితే చివరికి ఎవరిది గెలుపు అన్నది మిగిలిన కథ నయన తార pkr కుతురుగా బాగానే నటించింది అల్లుడిగా సత్య దేవ్ యాక్టింగ్ బాగుంటుంది సునీల్ బాగా చేశాడు కానీ Lucifer సినిమా చూసిన తరువాత ఈ సినిమాలో కొద్ది కొద్ది మార్పులు చేశారు సల్మాన్ ఖాన్ Lucifer సినిమాలోని పృధ్వీ రాజ్ సుకుమార్ పాత్ర ఇందులో పోషించటం జరిగింది మొత్తానికి బాగుంది సినిమా elevation తోనే నడుస్తుంది కథ !!!


1, అక్టోబర్ 2022, శనివారం

విక్రమ్ "కోబ్రా" సినిమా పై నా అభిప్రాయం !!!

విక్రమ్ అంటే డిఫరెంట్ సినిమాలకు మారు పేరు అయితే ఇటీవల theatre లలో విడుదల  అయిన కోబ్రా సినిమా ott లోకి కూడా వచ్చింది ఇక ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా మొత్తం నిడివి 3  గంటలు పైనే ఉందీ అసలు కథ ఏమిటంటే కొంతమంది ప్రముఖ వ్యక్తులు చనిపోతుంటారు వాళ్ళను వివిధ రూపాలలో హీరో చంపేస్తుంటడు హీరో ని పట్టుకోవటానికి ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రముఖ పాత్రలో చేయటం జరిగింది ఇంతకీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు దీని వెనుక కథ ఏమిటి అన్నది అసలైన కథ 

ఫస్ట్ హాఫ్ లో కథ కొంచెం బాగానే ఉన్న 2 nd half నుండి కథ చాలా దారుణంగా ఉంటుంది 3 గంటలు అసలు కథ ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తుంది తెలియదు అంతగా బాగోలేదు కథ 

విక్రమ్ నుండి ఇలాంటి సినిమా అసలు ఆశించలేదు !!!




The Goat life Movie Review !!!

 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ...