30, అక్టోబర్ 2021, శనివారం

Zee 5 ott లో విడుదల అయిన "afat e ishq " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా పేరు నోరు తిరగటం లేదు, రాద్దామన్న తప్పుగానే వస్తుంది కానీ ఈ సినిమా zee 5 ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా కథ కొంచెం confuse గానే ఉంటుంది లల్లు అనే ఒక అమ్మాయి ఒక పెద్ద వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది తన చిన్నప్పుడే లల్లు వల్ల అమ్మ, నాన్న వదిలేసి వెళ్ళిపోతారు అయితే చిన్నప్పటి నుండి అక్కడే పెరుగుతుంది

తనకి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం దొరుకుతుంది అందులో రెడ్ ఫెయిరీ అనే దేవకన్య గురించి చదువుతుంది అప్పటి నుండి తన నిజముగా ప్రేమించేవారు కాకుండా ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళు చనిపోతారు 

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నట్టు ఇందులో చనిపోయిన ఆత్మ ఒకటి తనకు మాత్రమే కనిపిస్తుంది

చివరకు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నది కథ నిజంగానే రెడ్ ఫెయిరీ ఉందా ఏమిటి అన్నది సినిమా చూడాలి

నేను ఏదో హార్రర్ మూవీ అనుకుని చూసాను కానీ నాకు అలాగా ఏమి అనిపించ లేదు !!!


27, అక్టోబర్ 2021, బుధవారం

" గల్లీ రౌడి" సినిమా పై నా అభిప్రాయం !!!

 గల్లి రౌడి సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా కామెడీ లైనప్ తో విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా కథ అంటే రోటీనగానే మొదలవుతుంది వైజాగ్ లో సందీప్ కిషన్ ఫ్యామిలీ మొత్తం రౌడీలు కానీ కొంచెం మంచి రౌడిలు వాళ్ళ తాత, నాన్న సందీప్ కిషన్ చిన్నప్పుడే చనిపోతాడు వాళ్ళ తాత కూడా తిరిగే బైరాగి అనే రౌడి సందీప్ కిషన్ వల్ల తాతకి ఎదురు తిరిగి వాళ్ళ తాతను అవమానిస్తాడు అప్పటి నుండి వాళ్ళ తాత పక్కన ఉండే పోసాని ఎలాగైనా తన మనవడ్ని పెద్ద రౌడి ని చేసి ఆ బైరాగిన చంపి చాలని చూస్తాడు 

సందీప్ చదువును మధ్యలోనే అపి వేసి ఒక రౌడి లాగా తయారుచేస్తాడు అదే టైంలో హీరోయిన్ ఫామిలీ కూడా బైరాగి వల్ల ఇబ్బందులు పాలు అవుతారు అయితే బైరాగి హీరోయిన్ వల్ల స్థలాన్ని kabza చేస్తాడు బైరాగి

అయితే హీరోయిన్ కోసం , వాళ్ల తాత కోసం సందీప్ ఆ బైరాగి ని కిడ్నప్ చేద్దాం అనుకుంటారు కానీ అంతలోనే ఎవరో బైరాగిని షూట్ చేసి చంపేస్తారు

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు అంతా రొటీన్ గానే ఉంటుంది

చిన్న సినిమా కొద్దిగా టైం పాస్ అంతే !!!

23, అక్టోబర్ 2021, శనివారం

Heads & Tales సినిమా పై నా అభిప్రాయం !!!

 Zee5 ott లో విడుదల అయిన heads & tails సినిమా సునీల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చెప్పుకోదగ్గ సినిమా ఏమి కాదు చిన్న సినిమా  ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!

సునీల్ కారెక్టర్ ఇందులో ఒక దేవుని కారెక్టర్ లో ఉంటుంది ఒక దేవుడ్ని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంటాడు అప్పడు ఆ దేవుడు అదే సునీల్ ముగ్గురు అమ్మాయిల జీవితాలు వారికి తెలియకుండా వారి మధ్య సంబంధం ఏమిటి అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు కథ ఏమిటి అన్నది కథ ఈ సినిమా లో సుహాస్ ఒక పాత్రలో కనిపిస్తాడు

చెప్పుకోవడానికి పెద్ద కథ ఏమి లేదు మామూలుగానే ఉంది మళ్ళీ దీనికి 2 వ పార్ట్ కూడా ఉంది అని చివర చూపిస్తారు 

పెద్దగా కథ అయితే ఏమి లేదు ఒక నైట్ లో ముగ్గురు అమ్మాయిల కథ వాళ్ళు ఉన్న పరిస్థితి నుండి ఎలా బయట పడ్డారు అన్నది కథ !!!


20, అక్టోబర్ 2021, బుధవారం

" Cold Case " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా ott లో విడుదల అయిన Cold case సినిమా హార్రర్ suspence కూడిన సినిమా ఇది మలయాళం డబ్బింగ్ సినిమా 

ఒక చెరువులో ఒక పుర్రె దొరుకుతుంది దానికి సంబంధించి ఆ మనిషి ఎవరు ఎలా చెరువులో చనిపోయింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆఫీసర్ పృద్వి రాజ్

అటువంటి పరిస్థితులలో మిర్రర్ అనే ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఒక ఇంటికి అద్దెకు దిగుతోంది అయితే అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి 

ఆ పోలీస్ ఆఫీసర్ కి, ఈ జర్నలిస్ట్ కి ఏమిటి సంబంధం వారిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేసేది చివరికి ఆ చనిపోయిన  ఆ వ్యక్తి ఎవరు అన్నది సినిమా కథ

కథ మొత్తం చెప్పేస్తే ఏముంటుంది అందుకే అందులో ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పటం జరిగింది నాకెందుకో ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రెస్టిటింగ్ గా ఉంది 2 హాఫ్ కొద్దిగా డల్ అయ్యింది 

కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు బాగానే ఉంది !!!

15, అక్టోబర్ 2021, శుక్రవారం

" విజయ దశమి " శుభాకాంక్షలు !!!

 మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ జగన్మాత ఆశీస్సులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ "విజయ దశమి "శుభాకాంక్షలు !!!

12, అక్టోబర్ 2021, మంగళవారం

రాజ రాజ చొర సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజ రాజ చొర సినిమా శ్రీ విష్ణు హీరో గా నటించిన సినిమా ఇక ఈ సినిమా గురించి అదే కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

హీరో శ్రీ విష్ణు ఒక xerox షాప్ లో పనిచేస్తుంటాడు అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తనకు మాత్రం తను software ఇంజినీర్ అని చెప్పి మోసం చేస్తుంటాడు ఇదిలా ఉండగా రాత్రులు దొంగతనం కూడా చేస్తాడు అయితే తనకి అంతకుముందే పెళ్లి అవుతుంది ఒక బాబు కూడా ఉంటాడు 

అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడుఅన్నది మనకు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు

బాగానే ఉంది సినిమా !!!

5, అక్టోబర్ 2021, మంగళవారం

" నూటొక్క జిల్లాల అందగాడు " సినిమాపై నా అభిప్రాయం !!!

 అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా నూటొక్క జిల్లాల అందగాడు ఈ సినిమా ఇటీవల విడుదల అయింది 

అయితే ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం ఇందులో చెప్పటానికి ఏమి లేదు ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల బట్ట తలతో ఉంటాడు అయితే దానిని కవర్ చేయటానికి విగ్ ని వాడతాడు ఇంటిలో కూడా టోపి పెట్టుకుని తిరుగుతాడు 

అసలు విగ్ లేకుండా బయటకు రాడు అలాంటిది తాను పని చేస్తున్న కంపెనీ లో ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది తనని పరిచయం చేసుకుని ప్రేమిస్తుంది అయితే హీరోది సొంత జుట్టు కాదని విగ్ అని తెలిసిపోతుంది 

అయితే ఆ తరువాత హీరోయిన్ ఏమి చేసింది తిరిగి హీరో ని ప్రేమించిందా లేదా అన్నది సినిమా కథ అవసరాల శ్రీనివాస్ సొంత కథ అనుకుంటా చూడటానికి ok one time watch మూవీ !!!

4, అక్టోబర్ 2021, సోమవారం

"సిండ్రెల్లా " సినిమా పై నా అభిప్రాయం !!!

 బహుశా ఈ చిన్న సినిమా కి రివ్యూ రాసేవాడు నేనె అనుకుంటా ఎందుకంటే ఈ సినిమా విడుదల ఎప్పుడు అయిందో ఎవరికి తెలియకపోవచ్చు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు గాని కథ ఎలాగ ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం !!!

రాయ్ లక్ష్మీ సినిమాలో హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి అడవిలోని ఒక ప్రత్యేకమైన పక్షులు అరుపులు రికార్డ్ చేయటానికి వెళ్తుంది అయితే అక్కడ ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో వుంటారు వారందరూ అయితే అక్కడ అనుకోకుండా కొన్ని హత్యలు జరుగుతాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఆ హత్యలు రాయ్ లక్ష్మీ చేసినట్టు ఆధారాలు లభిస్తాయి అయితే తనకు ఆ హత్యలకు సంబంధం ఉండదు

అయితే ఆ హత్యలు ఎందుకు జరిగాయి ఎవరు చేశారు అన్నది సినిమా కథ అంత సినిమా టైటిల్ లొనే ఉంది మీకు సిండ్రెల్లా కథ గుర్తుందా చిన్నప్పుడు చదివే ఉంటారు కథ 

ఒక ధనిక కుటుంబంలో ఒక అందమైన అమ్మాయి పని మనిషిలాగా పని చేస్తుంది అయితే ఆ ధనిక కుటుంబంలోని వారు ఆమెను హింసలు పెడుతుంటారు ఆ ధనిక కుటుంబంలో  ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానకి వచ్చిన యువరాజు సిండ్రెల్లా ని చూసి ప్రేమలో పడతాడు అదే ఈ సినిమా కథ 

ఆ సిండ్రెల్లా కథ ఈ సినిమా కి ఎలా మ్యాచ్ అయింది అన్నది కథ !!!

3, అక్టోబర్ 2021, ఆదివారం

ముప్పై దాటితే ముగిసిపోయినట్టేనా ?😢😢😢

 వయసు ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని తీసుకువస్తుందో ఎవరికి తెలియదు పెళ్లి కావాలన్న, మంచి ఉద్యోగం పొందలన్నా, జీవితంలో settle అవ్వాలన్న ఏదైనా సరే 30 సంవత్సరాలురాకముందే జరిగిపోవాలి లేదంటే వింత మనుషుల్ని, చూసినట్టు చూస్తున్నారు జనం

ఈ విషయం మనం అంటే నేను ముప్పై లోకి అడుగుపెట్టిన తరువాత తెలిసింది చేస్తున్న జాబ్ లో డబ్బులు రానప్పుడు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినప్పుడు నీకు ముప్పై దాటింది కాబట్టి ఉద్యోగం రావటం కష్టం, దేవుడి దయ వల్ల పెళ్లి 2 సంవత్సరాల క్రితమే లేదంటే ముప్పై లో అవ్వటం చాలా కష్టం అంటే లైఫ్ మంచి ఉద్యోగం పొందినవారికి ఇది సులువు కానీ నాలాంటి వర్షాకాలం చదువులు చదివి ఎదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ పాసయ్యను అది దూర విద్య విధానంలో

కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది పిల్లలు వారి భవిష్యత్ ను తలుచుకుంటేనే భయమేస్తోంది చాలి చాలని జీతాలు ఆశగా ఎదురు చూసే చూపులు ఏదైనా అద్భుతం జరగక మనదా అని చూసే చూపులు ఇలా ప్రతి అంశంలో నిరాశే మిగులుతుంది ఎప్పుడు మారుతుందో జీవితం

ఎదురు చూడటం తప్ప మనం చేసేది ఏమి లేదు కానీ ఒక్కటి మాత్రం సీరియస్ గా చెప్పగలను మనం తీసుకునే ఏ నిర్ణయం అయిన మన భవిష్యత్ ని నిర్ణయిస్తుంది ఇది మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను !!!

The Goat life Movie Review !!!

 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ...