31, జులై 2021, శనివారం

సారపట్టు పరంపర సినిమా పై నా అభిప్రాయం !!!

 సర్పట్టు పరంపర తమిళ్ డబ్బింగ్ సినిమా ఆర్య ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇక కథ విషయం గురించి చూద్దాం

స్వాతంత్రం వచ్చిన తరువాత తమిళ్ నాడులోని మద్రాస్ లో కొంతమందికి ఆంగ్లేయులు తమ సరదా కోసం బాక్సింగ్ నేర్పించే వారు అలాగే కొంతమంది ఆ ఇష్టంతో అలాగే తమ తరువాతి తరాలు వారికి నేర్పించేవారు

చిన్న ఊళ్ల మధ్య పోటీలు జరుగుతాయి అలాంటి చిన్న ఊరు సారపట్టు పరంపర ఎన్నో బాక్సింగ్ యుద్దాలు చేసి ఓటమి పాలు అయ్యేవారు అప్పుడు హీరో ఆర్య ఎంతో ఇష్టం బాక్సింగ్ అంటే కానీ వాళ్ళ అమ్మ కి ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న బాక్సింగ్ లోకి వెళ్లి తరువాత రౌడి అయ్యి చంపేసారని తనని బాక్సింగ్ వైపు వెళ్లకుండా చూసేది 

కానీ హీరో ఆర్య ఎలాగైతే బాక్సింగ్ లో స్తానం సంపదిస్తాడు ఆ తరువాత అతను ఎదురొకొన్న పరిస్తుతులు అవన్నీ మిగతా కథ నిజంగా మంచి కిక్ ఇచ్చే సినిమా చాలా బాగుంది 

నిజంగా బాక్సింగ్ గురించి చాల బాగా చూపించారు !!!👌👌👌

30, జులై 2021, శుక్రవారం

"UIlu " OTT లో విడుదల అయిన " Tandoor " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం.!!!

 Ullu  ott బహుశా ఇది పెద్దవారికి మాత్రమే అని చెప్పా వచ్చు ఇక tandoor సిరీస్ గురించి మాట్లాడుకుందాం !!!

Tandoor అవును ఈ మాట వినగానే మీకు గుర్తుకు వచ్చేది చికెన్ tandoor గుర్తుకు వస్తాది ఈ కథ కూడా 

ఇందులో హీరో, హీరోయిన్ ని చంపేసి ఆ శవాన్ని ఒక డాబా లోని tandoor చేసే స్థలంలో తగల పెట్టేస్తారు దానితో అక్కడ పెద్ద మంట వస్తుంది దానిని చూసి పోలీస్ లకి ఎలాగో అక్కడికి చేరుకుని అక్కడ శవం కాలుస్తున్నారని తెలుసుకుని అక్కడ ఉన్న డాబా సెర్వెంట్ ని అరెస్ట్ చేస్తారు

కానీ అప్పటికే అక్కడి నుండి హీరో పరారీలో ఉంటాడు ఆ  తరువాత పోలీస్ లు అతన్ని ఎలా పట్టుకున్నారు అన్నది అసలు అతను ఎందుకు చంపాడు అన్నది సినిమా కథ 

చూడటానికి బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!

27, జులై 2021, మంగళవారం

ఆహా ott లో విడుదల అయిన నీడ సినిమా పై నా అభిప్రాయం !!!

 నీడ డబ్బింగ్ సినిమా సస్పెన్సు thriiler జోనర్ లో విడుదల అయ్యింది ఇక ఈ సినిమా ఇప్పుడు ఎలాగ ఉందొ చూద్దాం 

నీడ సినిమా కథ హీరో ఒక జడ్జి అయితే అతనికి ఫ్రెండ్ అమ్మాయి చైల్డ్ psychlogy  డాక్టర్

 ఒక అబ్బాయి 8 సంవత్సరాలు ఉంటాయి అతడు క్రైమ్ స్టోరీ లు చెబుతాడు కాకపోతే అవి నిజంగా జరుగుతుంటాయి అసలు ఆ 8 సంవత్సరాల అబ్బాయికి ఆ క్రైమ్ స్టోరీ లు ఎలాగ తెలుసు పైగా అవన్నీ నిజంగా జరిగిన కథలుగా దర్శనం ఇస్తాయి 

అలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగతా సినిమా కథ అయితే ఇందులో ఆ బాబు తల్లి పాత్రలో నయనతార నటించింది

చూడటానికి బాగానే ఉంది మంచి టైం పాస్ స్టోరీ కొత్తగా ఉంది ఇందులో హీరోకి ఓపెనింగ్ scene లో accident  జరుగుతుంది అయితే అప్పటి నుండి అతనికి వర్షం రాకపోయినా వర్షం పడినట్టు అనిపిస్తుంది చూడటానికి కథ కొత్తగా ఉంటుంది 

బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!

25, జులై 2021, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన హీరో సినిమా పై నా అభిప్రాయం !!!

 ఇది కన్నడ డబ్బింగ్ సినిమా హీరో రిషిబ్ శెట్టి అంటే మనకు ఆ హీరో కొత్త ఎప్పుడు చూడలేదు ట్రైలర్ చూసాను ఎదో కాలేక్షేపం కోసం మూవీ చూసాను ఇప్పుడు ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం

కథ ఏమిటంటే సింపుల్ హీరో హీరోయిన్ ని ప్రేమిస్తాడు అయితే హీరోయిన్ హీరో ని కాకుండా అనుకోని విలన్ ని పెళ్లి చేసుకుంటుంది అయితే ఆ బాధతో హీరో హీరోయిన్ పై పగ పెంచుకుని ఎలాగైనా చంపేద్దాం అనుకుంటాడు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటాడు

అయితే విలన్ ఒక అడవిలో ఒక అద్బుతమైన బంగ్లాలో ఉంటాడు ఎలాగైనా హీరోయిన్ ని చంపేద్దాం అనుకుని హీరో ఆ బంగ్లా లోకి సవరం చేసే వాడిలాగా ఆ బంగ్లా లోకి వెళ్తాడు అయితే అక్కడ హీరోయిన్ ఆనందంగా ఉంది అనుకుని ఎలాగైనా చెంపేద్దాం అనుకుంటాడు కానీ అక్కడ హీరోయిన్ విలన్ చేత దెబ్బలు తింటుంది అది ఆ దెబ్బలు తట్టుకోలేక హీరోయిన్ విలన్ ని చంపేస్తుంది అప్పుడే హీరో ఆ బంగ్లా లోకి ప్రవేశిస్తాడు 

ఆ తరువాత ఏమి జరిగింది అన్నది సినిమా కథ కొంచెం కామెడీ, కొంచెం డ్రామా అదే సినిమా కథ జస్ట్ average సినిమా !!!

21, జులై 2021, బుధవారం

" నారప్ప" సినిమా పై నా అభిప్రాయం !!!

 నారప్ప విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇది తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి రీమేక్ 

ఇక ఈ సినిమా ఎలాగ ఉందొ ఇప్పుడు చూద్దాం బహుశా వెంకీ మామా సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ చేసిన సినిమా అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చింది 

కథ ఏమిటంటే నారప్ప ,తన భార్య సుందరమ్మ 

( ప్రియమణి) , మని కర్ణ, చిన్నప్ప, చిన్న పాపా, వాళ్ళ మావయ్య సాంబయ్య (రాజీవ్ కనకాల) ఒక ఊరిలో తమకున్న 3 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు అయితే ఆ ఊరిలో భూస్వామి పండు స్వామి ఆ ఊరిలో ఉన్న పొలాలన్ని తీసుకుని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచిస్తాడు 

దానికి నారప్పకు ఉన్న 3 ఎకరాలు కూడా ఇవ్వమని అడుగుతాడు కానీ దానికి ఒప్పుకోడు నారప్ప దానితో వారిద్దరికీ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి 

నారప్ప పెద్ద కొడుకు మనికర్ణ ఆవేశ పరుడు తన తండ్రిని నారప్పని అవమానించారని పండు స్వామి ని చెప్పు తో కొడతాడు దానిని జీర్ణించుకోలేని పండు స్వామి మని కర్ణ ని చంపిస్తాడు 

ఆ తర్వాత మని కర్ణ తమ్ముడు మని కర్ణ తమ్ముడు చిన్నప్ప పండు స్వామి ని చంపేస్తాడు అంతే ఆ తరువాత కథ ఏమిటన్నది చూడాలి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు నారప్ప గతం ఎలాంటిది అనేది సినిమా కథ

రాయల సీమ భాషలో అడ్డాల శ్రీకాంత్ మాస్ చాలా బాగా డీల్ చేసాడు వెంకటేష్ తన నటనా చాలా బాగుంది

ఓవరాల్ గా సినిమా బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

20, జులై 2021, మంగళవారం

" The Family man " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 The Family man వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది బహుశా 2019 లో విడుదల అయ్యింది అనుకుంటా నేను మొత్తం 7 గంటల పైనే నిడివి ఉంది అంత ఓకేసారి చూడలేము కాబట్టి అప్పుడప్పుడు చూసాను 

ఇక ఈ వెబ్ సిరీస్ session 1 లో ఎలా మొత్తం 10 పార్ట్ లుగా ఉంది  నేను ఫ్యామిలీ మాన్ అంటే కుటుంబ బాధ్యతలు కు సంబంధించిన కథ ఏమో అనుకున్నాను కానీ ఇది ఎంత మాత్రం కాదు

కథ విషయానికి వస్తే శ్రీకాంత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ తన భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే శ్రీకాంత్ తన పని ఏమిటంటే ఉగ్రవాదులు కదలికలు గురించి దేశాన్ని ఎలా కాపాడాలి అదే విధంగా తన కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడనేది సినిమా కథ 

ఉగ్రవాదులు మన దేశంపై చేస్తున్న కుట్రలను ఎలా తిప్పి కొట్టడానేది నిజంగా చాలా బాగా చూపించారు నిజంగా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది ఇందులో సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు 

ఉగ్రవాదులు తమ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి తో ఎలా దేశాన్ని న్యూ ఢిల్లీ నగరాన్ని అంతం చేయాలని చూసారో అనే ముగింపు తో మొదటి సెషన్ ఎండ్ అవుతుంది

రెండో session కూడా వచ్చింది అది చూసిన తరువాత దాని గురించి మాట్లాడుకుందాం హీరో భార్యగా ప్రియమణి చాలా బాగా యాక్ట్ చేశారు 

ఓవరాల్ గా వెబ్ సిరీస్ చాలా బాగుంది ఆ లొకేషన్ లు కూడా పాకిస్తాన్ చాలా natural గా చూపించారు కానీ మంచి కిక్ వస్తుంది వెబ్ సిరీస్ చూసినప్పుడు ఇది మాత్రం నిజం !!!

18, జులై 2021, ఆదివారం

అలవాటు పడితే అంతే మరి !!!

 అవును మనం ఒక సారి దేనికైనా అలవాటు పడితే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం నేను దేని గురించి చెబుతున్నానో మీకు తెలుసు కోవాలంటే చదవండి

మే మొదటి వారం నుండి అనుకుంటా ఏపీలో కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటలవరకు విధించారు దాదాపు 2 వారాలు హాయిగా మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలు మూసివేసి హాయిగా ఇంటికి వెళ్లి ఉండేవాళ్ళం ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలు దాకా పొడిగించారు

అది 2 వారాలు సాగింది ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు వరకు వెసులుబాటు ఇచ్చారు ఆ ఆతరువాత ప్రస్తుతం రాత్రి 9 గంటలు దాకా ఉంది ఆ 12, 2, 5 గంటలు అలవాటు అయ్యి రాత్రి 9 గంటలు దాకా ఉండాలి అంటే నిజంగా చాలా కష్టంగా ఉంది

ఎంతైనా ఒకసారి సుఖానికి అలవాటు పడినవారు తమ అలవాటును పోదు

14, జులై 2021, బుధవారం

" State of siege Temple attack " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా zee5 ott లో విడుదల అయ్యింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన దేశ సైనికులకు జరిగే ఒక కథ కొంతమంది పాకిస్తానీ టెర్రరిస్ట్లు మన ఇండియా లోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయంపై దాడి చేసి చాలామంది భక్తుల్ని చంపేసి , మరికొంత మందిని కిడ్నాప్ చేసి మనదేశంలో ఉన్న తమ టెర్రరిస్ట్ విడుదల కోసం ప్రయత్నం చేస్తారు

అయితే ఈ సమస్య నుండి మన సైనికులు వాళ్ళను ఎలా కాపాడారు అన్నది కథ చూడటానికి రౌటీన్ అయిన కథ బాగుంది 

ఈ సినిమా చూస్తున్నంత సేపు నాగార్జున హీరోగా నటించిన గగనం సినిమా గుర్తుకు వచ్చింది కానీ సినిమా బాగుంది ఒక సారి చూడవచ్చు !!!

12, జులై 2021, సోమవారం

ఏపీలో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు !!!

 కొన్ని జిల్లాలకు మాత్రమే మినహాయింపులు ఇచ్చిన ఇప్పుడు ఏపీలో అన్ని జిల్లాలకు ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటలకు వరకు సడలింపులు ఇచ్చారు

రాత్రి 10 గంటలు నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలిఅని లేని యెడల 100 రూపాయలు ఫైన్  !!!

10, జులై 2021, శనివారం

విజయ్ సేతుపతి " విక్రమార్కుడు " సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ సేతుపతి తమిళ్ లో మంచి follwing ఉన్న హీరో ఇక ఆయన నటించిన విక్రమార్కుడు సినిమా ఆహా ott లో విడుదల అయింది ఇక ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

జుంగా (విజయ సేతుపతి) ఒక బస్ కండక్టర్ అయితే ఒక చిన్న ప్రేమ కథ వల్ల కొంతమంది ఆకతాయిల చేతిలో దెబ్బలు తింటాడు 

ఆ తరువాత వాళ్ళని జుంగా కొడతాడు దెబ్బలు తిని ఇంటికి వెళ్లిన జుంగా కి వాళ్ళ అమ్మ జుంగా వల్ల నాన్న, తాత పెద్ద డాన్ అని చెబుతుంది

అప్పట్లో చెన్నైలో జుంగాకి పూర్వీకులకి ఒక థియేటర్  ఉండేది అప్పట్లో దానిని తక్కువ రేట్ కి రెడ్డి కి అమ్మేస్తాడు వాళ్ళ నాన్న ,తాత

అయితే దానిని తిరిగి జుంగా ఎలాగ సంపాదించాడు అన్నది కథ అంత routeen గా ఉంటుంది కథలో కొత్తదనం ఏమి లేదు కానీ కామెడీ గా బాగుంది సినిమా 

అయితే విజయ్ సేతుపతి తగ్గ సినిమా అయితే కాదు ఒక సాధారణ సినిమా !!!

9, జులై 2021, శుక్రవారం

" crrush"సినిమా పై నా అభిప్రాయం (పెద్దలకు మాత్రమే ) !!!

 Crrush సినిమా టీనేజ్ వయసులో వచ్చే  ఫీలింగ్స్ గురించి చెప్పే సినిమా అడల్ట్ కామెడీ 

ఇక కథ విషయానికి వస్తే పై చదువులకు అమెరికా వెళ్లే ముగ్గురు టీనేజ్ యువకులు అక్కడ చదువుకుంటున్న ఒక అబ్బాయి అక్కడి పరిస్థితులు అక్కడ సెక్స్ కు సంబంధించి అక్కడ టీనేజర్స్ అసలు సెక్స్ లో చిన్న వయసులోనే పాల్గొంటారని ఇక్కడి నుండి వచ్చే ఇండియన్స్ కి సెక్స్ అవగాహన ఉండదని మీరు ఇక్కడ ఆ అనుభూతి పొంది అక్కడకు అమెరికా కు వస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు

అయితే ఆ తరువాత ఆ ముగ్గురు సుఖం కోసం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కువున్నారు అన్నది సినిమా కథ ఇది కేవలం పెద్దలకు మాత్రమే  

అడల్ట్ కామెడీ సినిమా పెద్దలకు మాత్రమే ఈ సినిమా కామెడీ బాగుంది కొన్ని సీన్లు రవి బాబు అల్లరి సినిమా గుర్తొస్తుంది !!!

మేటి మాట !!!


 

7, జులై 2021, బుధవారం

" Thaen" సినిమా పై నా అభిప్రాయం !!!

 Thaen సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా ఏ సినిమా కథ బాగుంది మంచి ఆర్ట్ ఉన్న సినిమా 

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక అందమైన అడవి అడవి చుట్టూ అందమైన కొండలు ఆ కొండలలో నివాసిస్తుంటారు అక్కడ కొంతమంది ప్రజలు అందులో హీరో తేనె తీసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తాడు

హీరోయిన్ ఒక పేదింటి కుటుంబంలో సాధారణ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుంటుంది అయితే వారిద్దరు మనసులు కలిసి పెళ్లి చేసుకుంటారు అయితే అనుకోకుండా హీరోయిన్ ఆరోగ్యం పాడు అవుతుంది అక్కడ నుండి సినిమా చూడాలి 

ఎందుకంటే అక్కడి నుండి సినిమా అసలు కథ మనుషులు తమ స్వార్థం కోసం ఎటువంటి తప్పుడు పనులు చేస్తారు అన్నది సినిమా కథ

చాలా బాగుంది కథ ఒకసారి మాత్రం చూడొచ్చు !!!

5, జులై 2021, సోమవారం

Ap లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు !!!

 కరోనా కేస్ లు క్రమేపి తగ్గుతుండటంతో కర్ఫ్యూ వేళల్లో సమయాన్ని పెంచుతుంది అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 7 గంటలు వరకు వెసులుబాటు ఇచ్చింది

అయితే దుకాణాలన్ని సాయంత్రం 6  మూసివేసి 7 గంటలకు కర్ఫ్యూ మొదలవుతుంది మిగతా జిల్లాలకు మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటల వరకు తెరుచు కోవచ్చును 

ఈ వేళలు జులై 7 తారీకు నుండి అమలు లోకి వస్తాయని తెలిపారు !!!

Netflix " బేతాల్ " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 బేతాల్ వెబ్ సిరీస్ netflix లో అందుబాటులో ఉంది ఇక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

కథ విషయానికి వస్తే ఒక కాంట్రాక్టర్ తన స్వార్థం కోసం ఒక పురాతనమైన సొరంగ మార్గం తవ్వటానికి ప్రయత్నిస్తాడు అయితే అక్కడున్న ప్రజలు దానికి అడ్డుపడుతారు

అయితే మిలట్రీ ఫోర్స్ ని దింపి వల్ల చేత అక్కడున్న ప్రజల్ని చంపించి ఆ సొరంగ మార్గం తెరుస్తారు తెరిచినప్పుడే తరువాత తెలుస్తుంది అక్కడ ఒక  బ్రిటిష్ కాలం నాటి ప్రేతాత్మ అందరిని చంపేస్తుంది

అయితే అసలు ఆ ప్రేతాత్మ అక్కడకు ఎలా వచ్చింది ఆ సొరంగంలో ఎలా ఉంది వాళ్ళు దాని నుండి బయట పడ్డారా లేదా అన్నది కథ

హార్రర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు ఇది ముగింపు కాదు ఇంకా సెషన్ లు ఉన్నాయి 

ఆ ప్రేతాత్మ లు హాలీవుడ్ జాంబీ లను పోలి ఉంటాయి😂😂😂

బాగుంది మంచి టైం పాస్ !!!

3, జులై 2021, శనివారం

తాప్సి నటించిన "హసీనా- దీలరుబా " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా netflix విడుదల అయ్యింది తెలుగులో కూడా ఉంది 

ఇక కథ విషయానికి వస్తే హీరో జ్వాలాపూర్ అనే ఊరిలో ఇంజినీర్ గా పని చేస్తుంటాడు హీరో కొంచెము మెతక గా ఉంటాడు హీరోయిన్ తాప్సి మోడరన్ గర్ల్ స్పీడ్ గా ఉంటుంది అయితే వీరిద్దరి పెళ్లి జరుగుతుంది అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ మాన్స్పర్థలతో దూరంగా ఉంటారు

ఇంతలో హీరో వాళ్ళ పిన్ని కొడుకు నీల్ అక్కడకు వస్తాడు అతడు ప్రవర్తన స్పీడ్ చూసి హీరోయిన్ కి అతను మీద మనసు పడుతుంది తప్పుకుడా జరుగుతుంది

అయితే శారీరకంగా ఇద్దరు కలుసుకున్నా తరువాత నీల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే హీరోయిన్ నీల్ వెళ్లి పోయిన సంగతి తెలుసుకుని తన భర్త తో మొత్తం విషయం చెబుతుంది

ఆ తర్వాత కథ ఏమి జరిగింది అని సినిమా చూడాలి సినిమా ఓపెనింగ్ ఒక బాంబ్ బ్లాస్టింగ్ తో మొదలవుతుంది

తన భర్తను తానే చంపింది అని హీరోయిన్ ని పోలీస్ లు విచారిస్తుంటారు అయితే సినిమా బాగుంది భర్త తనతో సరిగ్గా ఉండటం లేదని వేరే మగాడిని కోరుకుంటే ఏమి జరుగుతుంది అన్నది కథ

బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!👍👍👍

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...