31, మార్చి 2021, బుధవారం

అరణ్య సినిమా పై నా అభిప్రాయం !!!

 అరణ్య రానా నటించిన సినిమా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా లో రానా నటించలేదు జీవించాడు అని చెప్పాలి

ఒక అందమైన అడవి ఆ అడవిని నాశనము చేసి అక్కడ ఒక అందమైన టౌన్ షిప్ తయారుచేసి కోట్లు సంపాదించాలని చూసే ఒక దుర్మార్గపు మంత్రి దానిని ఎలాగ అయిన అడ్డుకోవాలని చూసే ఒక ప్రకృతి ప్రేమికుడు గా రానా ఈ సినిమాలో నటించాడు

సినిమా అయితే మామూలుగానే ఉంది కాని రానా కోసం సినిమా ఒకసారి చూడవచ్చు

ఇందులోని విష్ణు విశాల్ కూడా నటించాడు ఏనుగులు బాగా చూపించాడు ప్రభు సాల్మన్ అడవిని కూడా బాగుంది

సినిమా అయితే ఒకసారి చూడొచ్చు !!!

30, మార్చి 2021, మంగళవారం

పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మొబైల్ ద్వారా ఎలా లింక్ చేయాలి !!!

 ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొబైల్ ద్వారా ఏ విధంగా లింక్ చేయాలి అన్నది ఈ కింద వీడియో లో వివరించటం జరిగింది March 31 లోపు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయకపోతే 1000 రూపాయలు ఫైన్

వీడియో 


28, మార్చి 2021, ఆదివారం

"రంగ్ దే "సినిమా పై నా అభిప్రాయం !!!

 రంగ్ దే నితిన్, కీర్తి సురేష్ నటించిన సినిమా ఏ రోజు ఈసినిమా చూసాను 

ఈ సినిమా ఎలా ఉందంటే హీరో హీరోయిన్లు పక్క పక్క ఇంటిలో ఉంటారు వారి చిన్నప్పటి నుండి వారిద్దరి కుటుంబాలు కలిసే ఉంటాయి 

అయితే హీరో నితిన్ కి హీరోయిన్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం ఉండదు ఎందుకంటే హీరో వల్ల నాన్న చిన్నప్పటి నుండి జులాయి గా తిరుగుతుంటాడు హీరోయిన్ అంటే హీరో వాళ్ల నాన్నకి ఇష్టం ఎందుకంటే హీరోయిన్ బాగా చదువుతుంది కాబట్టి అందుకే హీరోయిన్ అంటే హీరో కి ఇష్టం ఉండదు

కానీ హీరోయిన్ మాత్రం హీరోని ప్రేమిస్తుంది హీరోయిన్ కి ఎలాగైనా పెళ్లి చేద్దామని అనుకుని నితిన్ పెళ్లి చేద్దామనుకుంటాడు కానీ తాను పెళ్లి మండపంలో అందరి ముందు హీరో కి ముద్దు పెడుతుంది 

దానితో చివరికి నితిన్, హీరోయిన్ ని తప్పనిసరి పరిస్థితులలో పెళ్లి చేసుకుంటాడు ఆ తరువాత కథ ఏమైంది అనేది మిగతా కథ

సినిమా కథ అంతా రొటీన్ గానే ఉంది కాని పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!


హోళీ శుభాకాంక్షలు !!!


 

25, మార్చి 2021, గురువారం

" షాది ముబారక్ "సినిమా పై నా అభిప్రాయం !!!

 షాది ముబారక్ ఈ సినిమా ఈ రోజు చూసాను ఇందులో చూసాను అసలు ఎప్పుడు వచ్చింది ఈ సినిమా అనుకుంటున్నారా వచ్చిందండి నేను అమెజాన్ ప్రైమ్ లో ఉంది థియేటర్ లో కూడా విడుదల అయినట్టుంది

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు మొగలిరేకులు ఫేమ్ R. K. నాయుడు అలియాస్ సాగర్ హీరోగా నటించాడు కథ ఏమిటంటే ఏముంది మాములే ఒక ఆస్ట్రేలియా పెళ్లి కొడుకు పెళ్లి కోసం ఇండియాకి వస్తాడు 

పెళ్లి సంబంధాలు చూసే ఒక ఆవిడ తనకు గాయం తగలటంతో తన కూతుర్ని పెళ్లి సంబంధాలు చూపించడానికి పంపుతుంది ఆ అమ్మాయి మూడు పెళ్లి సంబంధాలు చూపెడుతుంది అయితే చివరికి పెళ్లి సంబంధాలు చూపించే అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు హీరో ఇదే కథ కొద్దిగా మధ్య మధ్య లో కొన్ని డ్రామాతో కూడిన కథను కొద్దిగా హాస్యం తో కుడినదిగాను మనకు చూపించాడు 

అయితే చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అన్నది కథ రొటీన్ కథే కానీ సినిమా  time pass కి చూడ వచ్చు అంతగా ఆసక్తి అయితే ఏమి లేదు 

నాకైతే ఫస్ట్ హాఫ్ లొనే కథ అంతగా ఆసక్తి లేదు అనిపించింది !!!

24, మార్చి 2021, బుధవారం

'పుత్రికోత్సాహం "

మార్చి 22 నా జీవితంలోకి ఒక అద్భుతమైన ఆనందకరమైన రోజు మా ఇంటి మహాలక్మి మా జీవితంలోకి ప్రవేశించిన రోజు ఆనందం మాటల్లో చేప్పలేనిది 
చాలా సంతోషం !!! 🤗🤗🤗

22, మార్చి 2021, సోమవారం

"చావు కబురు చల్లగా" సినిమా పై నా అభిప్రాయం !!!

 చావు కబురు చల్లగా సినిమా ఈ రోజు చూసాను గీత ఆర్ట్స్ 2 పతాకంపై విడుదల అయ్యింది కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్ గా నటించారు అయితే ఈ సినిమా కథ ఎలాగా ఉందొ చూద్దాం

హీరో ఒక శవాలు బండి నడిపే డ్రైవర్ హీరోయిన్ అంటే అంతకుముందే పెళ్లి అవుతుంది కానీ హీరోయిన్ మొగుడు చనిపోతాడు ఆ శవాన్ని తీసుకెళ్లే సమయంలోనే హీరోయిన్ చూసి ప్రేమలో పడతాడు ఆ తరువాత జరిగిన కధ ఏమిటి అన్నది కథ

కథలో ఒక్క ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి కూడా లేదు

సినిమా అయితే జస్ట్ average అంతే !!!

19, మార్చి 2021, శుక్రవారం

" శ్రీ కారం సినిమా పై నా అభిప్రాయం !!!

 శివరాత్రి సందర్భంగా విడుదల అయిన శ్రీ కారం సినిమా మొత్తానికి ఖాళీ చేసుకుని చూసాను శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించాడు ఈ విషయం నాకు తెలుసు అంటారా అయితే అసలు పాయింట్ కి వచ్చేద్దాం అదే కథ విషయానికి

 ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ హీరోది వాళ్ళ కుటుంబం ఒక సాధారణ రైతు కుటుంబం అయితే కష్టపడి చదివించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని చేస్తాడు వల్ల నాన్న 

హీరో వాళ్ళ ఊరిలో పొలాలు పంటలు పండక ఆ పొలాలు అమ్ముకుని బ్రతుకు తెరువు కోసం పట్నం వస్తారు అందరూ వాళ్ళను పట్నంలో చూసి అసలు విషయం తెలుసుకుంటాడు హీరో 

అయితే అక్కడ చేస్తున్న ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తానని ఆ ఊరికి బయలుదేరతాడు అసలు వ్యవసాయం చేయాలని ఆలోచన హీరోకి ఎందుకు వచ్చింది ఆ ఊరిలో వ్యవసాయం ఎలా చేసాడు అన్నది కథ

చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు కథలో అంత రొటీన్ అసలు హీరోయిన్ పాత్ర ఎందుకు ఉందొ తెలియదు పరవాలేదు సినిమా అయితే expectation తో మాత్రం సినిమా చూడొద్దు

జస్ట్ average అంతే సినిమా కథ  వ్యవసాయం అనే సెంటిమెంట్ తో ప్రేక్షకులని  కనెక్ట్ చేయాలని చూసాడు డైరెక్టర్ కానీ అంతగా వర్కౌట్ కాలేదు 

సినిమా అంతా సో సో గా ఉంది !!!

మేటి మాట !!!


 

16, మార్చి 2021, మంగళవారం

సోషల్ మీడియా లో షేర్, లైక్, కామెంట్ వల్ల ఉపయోగం ఏంటి !!!

 స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుండి మనిషి ప్రతి కదలిక ప్రపంచానికి తెలిపే అత్యద్భుతమైన సాధనం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియా

సోషల్ మీడియా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఏమి పని చేస్తున్న దానికి సంబందించిన విషయాలు క్షణాల్లో మనకి తెలిసిపోతుంది

ఇక ఈ సోది అపి అసలు విషయానికి వస్తే ఫేస్బుక్, యూట్యూబ్,  లో మీకు లైక్, షేర్, కామెంట్ ఆప్షన్ లు ఖచ్చితంగా మీకు కనపడతాయి

వాటి వల్ల ఆ అకౌంట్ కి సంబందించిన యూట్యూబ్ ఒక ఛానల్ తీసుకుందాం మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి suggestion ఇవ్వాలంటే కామెంట్ చేయండి ,షేర్ చేయండి అని అడుగుతారు కదా అది వారి ఛానల్ ప్రమోషన్ కోసం వాళ్ళు అలా  చేస్తారు ఇది మాకు తెలుసు అంటారా ? 

తెలిస్తే పర్వాలేదు తెలియనివారికోసమే అలాగే ఫేస్బుక్ లో ఒక ఫోటో పెట్టి దీనిని షేర్ చేయండి శుభవార్త వింటారు అలాంటివి ఈ కోవకే చెందుతాయి వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీ, గ్రూప్ లు మీద్వారా మీ ఫ్రెండ్స్ లిస్టులోకి వెళ్తుంది వాళ్ల ద్వారా మరొకరికి

ఇలాగ వారి అకౌంట్ లకి publicity పెంచుకోవడానికి లైక్, కామెంట్, షేర్ లు !!!

14, మార్చి 2021, ఆదివారం

"జాతి రత్నాలు" సినిమా పై నా అభిప్రాయం !!!

 జాతి రత్నాలు మొన్న శివరాత్రి సందర్భంగా విడుదల అయిన సినిమా జాతి రత్నాలు ఈసినిమా ఎలాగా ఉందంటే

జాతి రత్నాలు ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటునుండి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చూసాను తీరా విడుదల అయ్యాక ఉత్సాహంతో సినిమా చూస్తే అదంతా ఆవిరి అయిపోయింది

ముగ్గురు ట్రేండింగ్ లో ఉన్న మంచి కామెడీ రన్ చేయగల యాక్టర్స్ కాకపోతే సినిమా కథ విషయం లొనే ఎదో తేడా కొట్టిందేమోనని నా డౌట్

ఇక కథ విషయానికి వస్తే జోగి పేట్ లో ఉండే 3 అబ్బాయిలు పని పాట లేకుండా బేవర్సు గా తిరుగుతుంటారు అందులో ఒకడు హీరో ఖాళీ గా తిరిగితే అందరూ తిడుతున్నారని హైద్రాబాద్ లో ఏమైనా జాబ్ చేద్దామని బయలుదేరతాడు అతనితో పాటు ఆ మిగిలిన ఇద్దరు కూడా హైద్రాబాద్ వెళ్తారు

అయితే అక్కడ అనుకోకుండా ఒక మినిస్టర్ మర్డర్ attempt కేస్ లో వీరిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత వారు దాని నుండి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ

నేను ముందు అన్నట్టుగా ఎంతో క్యూరియాసిటీ తో సినిమా చూసాను కామెడీ బాగుంటదేమో అని ఏమి పెద్దగా అనిపించలేదు 

సాదా సీదగా నడిచింది సినిమా అంతా పెద్దగా ఆకట్టుకోలేదు అనుకోవచ్చు సినిమా !!!

మేటి మాట !!!


 

13, మార్చి 2021, శనివారం

T. v షో లో కాంట్రవర్సీ T. R. P రేటింగ్స్ కోసం సెంటిమెంట్ ఆయుధం !!!

 ఉదయం నిద్ర లేచిన తరువాత మొదలయ్యేది t.v అందులో వచ్చే కార్యక్రమాలు, సీరియల్స్ అన్ని మనకు మరింత దగ్గరాయ్యాయి

సీరియల్స్ నుండి షో లు దాకా అన్ని సెంటిమెంట్ తో కొడుతున్నారు వారి వారి T. R. p రేటింగ్స్ కోసం

సెంటిమెంట్ అనేది మనిషిలోని బలహీనత ఆ బలహీనతే వారికి అతి పెద్ద ఆయుధం ప్రతి షో లో కాంట్రవర్సీ తో కూడిన సెంటిమెంట్ తో కొడుతున్నారు

ఈ రోజుల్లో అసలు వినోదం పంచె ఒక్క కార్యక్రమం కూడా లేదు 

అన్ని రొటీన్ రొట్ట కార్యక్రమాలు T. V చూడాలంటేనే విరక్తి కలుగుతుంది సినిమాలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు !!!

అప్పట్లో వచ్చే కార్యక్రమాలు వేరు ఈ టి వి లో వచ్చే పంచతంత్ర కథలు, జెమినీ లో వచ్చే అమృతం సీరియల్ మంచి వినోదం పంచేలా ఉండేవి

ఇప్పుడు ఉన్నవి ఎందుకు ఉన్నవో తెలియదు !!!


9, మార్చి 2021, మంగళవారం

ఏమి జీవితం రా బాబు ?

 ముప్పై సంవత్సరాలు వచ్చిన జీవితంలో నిల దొక్కుకునే  ఒక్క అవకాశం కూడా లేకుండా పోతుంది వ్యాపారం చేద్దాం అంటే మనీ లేదు పోనీ ఉద్యోగం చేస్తున్నామంటే చాలి చాలని జీతం 

రోజు రోజు కి పెరిగిపోతున్న ధరలు, వాటి వాతలు ఏమి చెయ్యాలో ఏమి తినాలో తెలియని పరిస్థితి ఈ సమస్య ప్రతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు మాములే

ఖర్చు చూస్తే భయం ఏది కొందమన్నా భయం సమయానికి అందని జీతాలు కేవలం జీతం డబ్బులు మీద ఆధారపడిన జీవితాలు చిత్రం వర్ణనాతీతం 

బండి మీద వస్తుంటే పెట్రోల్ మంట పోనీ ఆటోకి వద్దామంటే రాను పోను డబ్బులతో 2 రోజులు బండి మీద తిరగవచ్చు

నిత్యావసరాలు, మొబైల్ రీఛార్జి లు, కూరగాయలు, గ్యాస్ చార్జీలు, కరెంట్ బిల్లులు, డ్వాక్రా చెల్లింపులు, జీవితానికి ఆహా అనిపించే ఒక్క సందర్భం కూడా లేదు

ఇంకా ముందు ముందు ఎన్ని చిత్రాలు చూడాలో నిజంగా మరో జన్మ అంటూ ఉంటే దిగువ మధ్య తరగతి మనిషిగా అసలు జన్మించి కూడదు

తప్పు తప్పు అసలు మనిషిగా జన్మించకూడదు నిజంగా పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు కాదు గొప్ప చాలి చాలని జీతాలతో సంసారాన్ని ఈదుకు వస్తుంటారు వాళ్ళు గొప్ప వాళ్లే గొప్ప

మనం వాడే వస్తువు పోయిన తరువాత కూడా దాన్ని చిన్న చిన్న రిపైర్లు చేసి వాడుకుంటారు మరలా దాని ప్లేస్ లో కొత్తది కొనాలంటే భయం ఇలా చెబుతూ పోతే బోలెడు ఉంటాయి !!!

8, మార్చి 2021, సోమవారం

మహిళ దినోత్సవ శుభాకాంక్షలు !!!

 మనిషికి జన్మనిచ్చేది ,

  పెరిగి పెద్దయిన తర్వాత జీవితాన్ని పంచుకునేది ,

     తోబుట్టువు ప్రేమను,

          అక్కగాను, చెల్లి గాను, అమ్మగాను, అమ్మమ్మ గా

                 కూతురిగా 

                     ఇలాగా ఎన్నో రకాలుగా , ఎన్నో విధాలుగా

                           మనిషి జీవితానికి ఒక అర్థాన్ని

                               తీసుకుని వచ్చే ప్రతి మహిళకు

                                   మహిళ దినోత్సవ శుభాకాంక్షలు 


5, మార్చి 2021, శుక్రవారం

" మెర్క్యూరీ " సినిమా పై నా అభిప్రాయం !!!

 "మెర్క్యూరీ " ఈ సినిమాలో ప్రభు దేవా కీలక పాత్రలో పోషించాడు ఈ సినిమా 2018 సంవత్సరంలో విడుదల అయ్యింది

ఇవాళ రాష్ట్ర బంద్ కాబట్టి మా షాప్ సెలవు సరే ఖాళీగా ఏమి ఉంటాము అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి హార్రర్ సినిమాలు ఏమి ఉన్నాయి అని చూసాను 

అందులో మెర్క్యూరీ సినిమా కనిపించింది ఒక సారి చూసాను ఈ సోది అంతా ఎందుకులే గాని అసలు విషయానికి వస్తాను

ఈ సినిమా కథ విషయానికి వస్తే 4 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి ఇందులో ప్రధాన పాత్రలు వారికి వినపడదు, మాట్లాడలేరు వారందరూ కలిసి ఆ అమ్మాయి birthday పార్టీ ఒక గెస్ట్ హౌస్ లో చేసుకుంటారు 4 అబ్బాయిలలో ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ విషయం చెప్పటానికి బయటకు తీసుకెళ్లి చెబుతాడు 

వల్ల కారులో వెళుతుండగా 3 అబ్బాయిలు కూడా వాళ్ళతో పాటు కారులో వస్తారు అందరూ తాగేసి మద్యం మత్తులో ఉంటారు అబ్బాయి ప్రేమ విషయం అమ్మాయికి చెబుతాడు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది

ఇదంతా జరిగిన తరువాత తిరిగి వాళ్ళు గెస్ట్ హౌస్ కి వస్తుంటారు అక్కడ అనుకోకుండా ఒక accident జరుగుతుంది ఒక మనిషి చనిపోతాడు అతడే ప్రభుదేవా 

ఆ తరువాత కథ ఏమిటి అన్నది సినిమాలో చూడాలి చూడటానికి మంచి ఆసక్తికరంగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో పాత్రలు అసలు మాటలు లేవు కేవలం సైగలతో నడుస్తుంది ఈ సినిమా 

అప్పుడెప్పుడో వచ్చిన పుష్పక విమానం సినిమాలో లాగా ఒక మాట కూడా ఉండదు సినిమా అయితే బాగుంది

హార్రర్ సినిమాలు ఇష్టపడేవారు ఒక సారి చూడవచ్చు 

ఒక్క మాట లేకుండా కథను నడిపించడం అంటే నిజంగా దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్ప వచ్చు సినిమా అయితే బాగుంది !!౸

"అతడే శ్రీ మన్నారాయణ " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా కన్నడ సినిమా తెలుగులో ఈ రోజు  చూసాను ఏ సినిమా ఎలా ఉందంటే ?

ఒక నిధిని ఒక డ్రామా కంపెనీ వాళ్ళు దొంగిలించి ఒక చోట దాస్తారు ఆ ఊరిలో ఒక దొంగల ముఠా వారిని చంపేసి ఆ నిధిని చేజిక్కిచుకునేల చూస్తుంది 

ఇంతలో హీరో పోలీస్ వారిని అడ్డుకుని ఆ నిధిని ఎలా బయటకు తీసాడు ఆ నిధి ఉన్న స్థలాన్ని ఎలా కనిపెట్టాడు అన్నది సినిమా కథ

ఈ సినిమా నిడివి చాలా పెద్దది దాదాపు 2 గంటల 50 నిమిషాలు సినిమా నిడివి ఇంత చిన్న కథకి ఇంత సాగదీత అనవసరం

సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందో అని ఎదురుచుసాను అంతా బోర్ గా ఉంది సినిమా 

హీరో మాత్రం మంచి వెరైటీ నటన ప్రదర్శించాడు సినిమా అయితే అంతగా ఏమి లేదు ఒక ఆసక్తికరమైన సన్నివేశం కూడా లేదు 

బోర్ కొట్టింది సినిమా మొత్తం కానీ ఇంతసేపు చూసాను మరల క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని చివరి వరకు చూసాను  

సినిమా అయితే ఏమి నచ్చలేదు !!!

4, మార్చి 2021, గురువారం

నితిన్ " చెక్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 నితిన్ ఇప్పుడున్న తెలుగు యంగ్ హీరోలలో ఒకడు ఫిబ్రవరి 26 న విడుదల అయ్యింది ఆ సినిమా నిన్న చూసాను 

ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఒక నలుగురు టెర్రరిస్ట్ లతో నితిన్ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు పోలీస్లు బాంబు పేలుళ్లు కి తనకి ఎలాంటి సంబంధం లేదని వాదించిన ఎవరు పట్టించుకోరు

ఒక లాయర్ ని తనకు వాదించటానికి కోర్ట్ permission ఇస్తుంది అది రకుల్ ప్రీత్ సింగ్

ఈ కేస్ వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తుంది 

జైల్లో మిగతా ఖైదీ లతో కొట్లాటు లు సినిమా ఇంత ఇదే కాన్సెప్ట్ అలాగే జైల్లో చెస్ బాగా నేర్చుకుంటాడు నితిన్ జైల్లో నుండే చెస్ పోటీలో పాల్గొంటాడు

చివరికి అన్నింటిలో గెలుస్తాడు బాగా అడుతున్నాడని తెలిసి లాయర్ క్షమాభిక్ష కోరిన రాష్ట్రపతి దానిని తిరస్కరిస్తాడు

చివరికి నితిన్ ఆ ఉరి శిక్షా నుండి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా కథ

సినిమా అంతా రక రకాలుగా ఉంటుంది ఆ జైల్ లో చూస్తుంటే నిజంగా జైల్లో ఇన్ని సౌకర్యాలు ఉంటాయా అనిపిస్తుంది అలా ఉంటుంది అన్ని సౌకర్యాలు ఈ సినిమాలో 

సినిమా అయితే below average అని చెప్పాలి అసలు హీరో జైల్ ఎందుకు వెళ్ళాడు అనేది కూడా సినిమా చూస్తే తెలుస్తుంది 

ఈ సినిమా స్మాల్ బడ్జెట్ లో తీసుంటారు సినిమా అయితే అంతగా ఏమి బాగోలేదు !!!

3, మార్చి 2021, బుధవారం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన " వకీల్ సాబ్ " సినిమాలోని లిరికల్ వీడియో !!!

 పవన్ కళ్యాణ్ ఈ పేరుకి అభిమానులు కంటే భక్తులు అంటే సరిపోద్ది ఎప్పుడో ఆజ్ఞతవాసి సినిమా తరువాత దాదాపు 3 సంవత్సరాలు తరువాత వస్తున్న సినిమా 

ఫాన్స్ కళ్లలో ఆనందం చేప్పలేనిది వర్ణించలేనిది ఈ రోజు అనగా march 3  న సత్యమేవ జయతే అనే లిరికల్ వీడియో విడుదలైంది 

ఆ వీడియో 👇👇👇



ఈ సినిమా కి శ్రీ రామ్ వేణు డైరెక్షన్ చేయగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఇది అమితాబ్ నటించిన బాలీవుడ్ చిత్రం పింక్ అనే చిత్రానికి అనువాదం !!!

మేటి మాట !!!


 

2, మార్చి 2021, మంగళవారం

మేటి మాట !!!


 

గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం ఫోటోలు ,వీడియో !!!

 ఫిబ్రవరి 28 ఆదివారం కావటంతో మా కుటుంబం అంతా కలిసి శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దర్శించుకోవటం జరిగింది 

మేము ఇది 3 వ సారి అమ్మ వారిని దర్శించుకోవటం చుట్టూ అడవి , ఎత్తైన కొండలు, సన్నని వాగులు చూడటానికి చాలా బాగుంది 

మేము వెళ్లిన ముందు 3 రోజులు అమ్మవారి జాతర జరిగింది

చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం ఇక్కడ చూడటానికి అన్ని చెట్లు ఉంటాయి కానీ వేప చెట్టు ఎక్కడ కనిపించదు అలాగే కాకి కూడా ఏక్కడ కనిపించదు

అక్కడ తీసిన కొన్ని ఫోటోలు 


ఇక్కడ అమ్మవారి  కొత్త గుడి  ఉంది ఆ వీడియో ఇక్కడ ఉంది చూడండి







Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...