29, డిసెంబర్ 2022, గురువారం

"ఇట్లు మరెడుమిల్లి ప్రజానీకం" సినిమా పై నా అభిప్రాయం !!!


ఈ సినిమా theatre లలో విడుదల అయింది ఇప్పుడు ప్రస్తుతం zee 5 Ott లో అందుబాటులో ఉంది అల్లరి నరేష్ హీరోగా చేసిన సినిమా ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో అడవిలో నివసించే ఒక తెగ ప్రజలకు సంబంధించి వాళ్ళకి సరి అయిన ఆస్పత్రి లు, చదువుకోవటానికి బడులు ఏమి ఉండవు అయితే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిన వాగ్దానాలు ఇస్తారు తప్ప ఎవ్వరూ సహాయం చెయ్యరు 

ఇందులో హీరో ఒక తెలుగు టీచర్ అయితే తనుకు ఎలక్షన్స్ duty పడుతుంది అది ఆ అడవి ప్రాంతంలో అక్కడకు హీరో వెళ్తాడు కానీ వాళ్ళు ఓటు వేయటానికి ఎవరు ముందుకు రారు అయితే హీరో వాళ్ళను ఒప్పించి ఓటు వేయిస్తారు అయితే ఓటింగ్ పూర్తి అవుతుంది హీరో వాళ్ళు ఇంటికి బయలు దేరుతారు అయితే అనుకోకుండా హీరో నీ కిడ్నాప్ చేసి తమకు కావాల్సిన హాస్పిటల్, స్కూల్ కడితెనే వడులుతానని లేకపోతే చంపేస్తానని చెబుతారు 

ఆ తరువాత కథ ముందుకు ఎలా సాగింది అన్నది మిగిలిన కథ రోటీన్ గానే ఉంది అల్లరి నరేష్ కోసం ఒకసారి చూడ వచ్చు !!!

27, డిసెంబర్ 2022, మంగళవారం

నయన తార connect సినిమా పై నా అభిప్రాయం !!!

 నయన తార, సత్య రాజ్ ,ప్రధాన పాత్రలో మొన్న విడుదల అయిన కనెక్ట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇంగ్లీష్ సినిమా ఒక గుర్తుకు వచ్చింది ఇక అసలు కథ చూద్దాం ఇందులో ఇద్దరు భార్య భర్తలు ఉంటారు వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది కరోనా నేపథ్యంలో ఉంటుంది ఈ సినిమా ఆ అమ్మాయికి music అంటే ఇష్టం తనకి అమెరికా లో చదవటానికి అక్కడ సీట్ వస్తుంది అయితే తన తండ్రి ఒక డాక్టర్ కరోనా రోగులకు చికిత్స చేస్తూ మరణిస్తాడు అయితే ఆ అవిషయం తెలుసుకున్న అమ్మాయి ఎలాగైనా చనిపోయిన తన తండ్రి తో ఎలాగైనా మాట్లాడాలని ఆత్మలతో మాట్లాడానికి ప్రయత్నిస్తుంది అయితే అది వికటించి ఒక ప్రేతాత్మ ఆ అమ్మాయి శరీరం లోకి ప్రవేశిస్తుంది అయితే ఆ తరువాత వాళ్ళ అమ్మ నయనతార ఏమి చేసింది నయన తార వాళ్ళ నాన్న సత్య రాజ్ ఎలా ఆ పాపను కాపాడారు అన్నది సినిమా కథ పరవాలేదు కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి రోటీన్ గా అనిపిస్తుంది 

తెలుగులో కొత్త ట్రై చేద్దాం అనుకున్నారు ఒక సారి చూడ వచ్చు !!!

24, డిసెంబర్ 2022, శనివారం

The teacher సినిమా పై నా అభిప్రాయం !!!


Netflix లో విడుదల అయిన అమలా పాల్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా ఒక ఇద్దరు భార్య భర్తలు ఉంటారు భర్త హాస్పిటల్ లో పని చేస్తుంటాడు భార్య స్కూల్ లో అథ్లెటిక టీచర్ గా పని చేస్తుంది అయితే అంతా సాఫీ గా సాగుతున్న కథలో ఒక సారి టీచర్ కి మత్తు మందు కలిపి తనని కొంతమంది రేప్ చేస్తారు అయితే ఈ విషయం తనకు తెలియదు 

ఆ తరువాత కొన్ని రోజులకు తను pregnent అవుతుంది అప్పటి  నుండి తనకు అనుమానం ఉంటుంది ఆ తనను రేప్ చేసిన వారు ఎవరు వాళ్ళను ఎలా కనిపెట్టి చివరికి ఏమి చేసింది అన్నది సినిమా కథ పరవాలేదు ఒక సారి చూడ వచ్చు కానీ కుటుంబం మొత్తం చూసేలా ఉండదు సినిమా !!!


22, డిసెంబర్ 2022, గురువారం

"మసూద " సినిమా పై నా అభిప్రాయం !!!

మసూద సినిమా నెల క్రితం theatre లలో విడుదల అయ్యింది నిన్న ఆహా ott లోకి అందుబాటులోకి వచ్చింది ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అది 1998 సం తో ఒక ముస్లిం కుటుంబంలో ఆ కుటుంబం లోని కొందరిని ఒక దెయ్యం చంపేయాలని చూస్తుంది  దాని తరువాత కథ ప్రస్తుతం లోకి వస్తుంది 

ఇందులో హీరో ఒక కంపెనీ లో పనిచేస్తుంటారు అయితే తను ఉంటున్న అపార్టమెంట్ లో తన పక్కన ఉన్న ఫ్లాట్ లో ఒక స్కూల్ టీచర్, తన కూతురు కాలేజ్ అమ్మాయి ఉంటారు ఇలా కథ ముందుకు సాగుతుంది 

అయితే అనుకోకుండా ఆ అమ్మయి వింత వింత గా ప్రవర్తిస్తుంది అయితే వాళ్ళ అమ్మ భయపడి హీరోని సాయం కోసం పిలుస్తుంది అయితే ఆ అమ్మాయి కి దెయ్యం పట్టింది అని తెలుస్తుంది 

అయితే వీళ్ళు ఆ దెయ్యం ఆ అమ్మాయి నుండి ఎలా విడిపించారు అసలు ఆ దెయ్యం కథ ఏమిటి అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా సస్పెన్స్ తో కూడిన హార్రర్ బాగుంది
హార్రర్ సినిమాలు ఇష్టపడేవారు  నచ్చుతుంది !!!




21, డిసెంబర్ 2022, బుధవారం

Ezra సినిమా పై నా అభిప్రాయం !!!


 ఈ సినిమా వచ్చి చాలా కాలం అయింది అయితే ఇప్పుడు వరకు చూడలేదు ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా ఇందులో పృధ్వీ రాజ్ సుకుమార్, తవినో తమస్ ,ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలో వచ్చిన హార్రర్ సినిమా ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక కంపెనీ లో పనిచేస్తుంటారు అయితే హీరోకి ముంబై నుండి కొచ్చి tranfer అవుతుంది అయితే అక్కడకు తన భార్యతో కలిసి అక్కడ ఉండటానికి వెళ్తాడు అయితే అక్కడ నివాసం ఉండటానికి ఒక ఇల్లును కూడా చూసుకుంటారు అయితే అక్కడికి వెళ్లిన తరువాత తన భార్య ఒక పాత కాలపు బాక్స్ ఒకటి ఒక షాప్ లో కోంటుంది అది తను ఉండే ఇంటికి తీసుకు వెళ్తుంది అక్కడ ఆ బాక్స్ నీ ఓపెన్ చేయగానే ఆ తరువాత తన భార్య ప్రవర్తనలో మార్పు వస్తుంది 
అసలు ఆ బాక్స్ ఏంటి చివరకు ఆ బాక్స్ లో ఏముంది ఆ బాక్స్ అక్కడికి ఎలా వచ్చింది అందులో ఆత్మ ఉందా అన్నది సినిమా కథ చివరి వరకు కొద్దిగా ఊహించినట్టుగానే ఉంటుంది కథ కానీ చివరిలో అసలు ఆ ఆత్మ ఎవరిని పట్టుకున్నది అన్నది ట్విస్ట్ బాగుంది సినిమా హారర్ సినిమాలు ఇష్టపడేవారు చూడ వచ్చు !!!

Beast of banglore document series పై నా అభిప్రాయం !!!

Netflix లో విడుదలైన వెబ్ సిరీస్ ఇది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 

కర్ణాటక చుట్టూ పక్కల 1996 జరిగిన మహిళలపై దాడులు నేపథ్యంలో సాగిన కథ ఉమేష్ రెడ్డి అనే ఒక సైకో కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలలో మహిళలపై చేసిన దాడులు ఏ విధంగా వాళ్ళని దాడి చేశాడు పోలీసులకు దొరికినట్టే దొరికి పారిపోయే వాడు

  చివర కి వాడిని ఎలా పట్టుకున్నారు అన్నది కథ చాలా స్లో గా ఉంటుంది crime నిజంగా జరిగింది ఆ ప్రాంతాలు యొక్క పనిచేసే పోలీస్ ఆఫీసర్ ల చెప్పిన వివరాలు ఆధారంగా ఈ డాక్యుమెంట్ సీరీస్ ఉంటుంది !!!

20, డిసెంబర్ 2022, మంగళవారం

సత్య దేవ్ "గుర్తుందా శీతాకాలం " సినిమా పై నా అభిప్రాయం !!!

 సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వచ్చిన సినిమా గుర్తుందా శీతాకాలం సినిమా ఇక ఈ కథ గురించి ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా చుస్తున్నంత సేపు నాకు నాగ చైతన్య ప్రేమ సినిమా గుర్తుకు వచ్చింది చిన్న వయసులోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది అది విఫలమవుతోంది తరువాత కాలేజ్ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు దాని తరువాత ఆ అమ్మాయిని ఎలాగోలా పెళ్లి చేసుకుందాం అని banglore లో జాబ్ తరువాత కానీ అది కూడా కొన్నాళ్ళు తరువాత విఫలం అవుతుంది దాని మూడవది తమన్నా కూడా తమ దగ్గర అవుతుంది ఇలా ఇద్దరు దగ్గర అవుతున్న వేళ మరల 2 వ అమ్మాయి  కూడా మరల దగర అవుతుంది ఇలా కథ ముందుకు ఎలా సాగింది అన్నది మిగిలిన సినిమా కథ రోటీన్ గ ఉంది సినిమా !!!

18, డిసెంబర్ 2022, ఆదివారం

ఉదయ నిధి స్టాలిన్ kalaga thalivan సినిమాపై నా అభిప్రాయం !!!


ఉదయ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన cinemaee సినిమా తమిళ్ లో విడుదల అయింది తెలుగులో Netflix OTT లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక పెద్ద కంపెనీ తను చేసే ప్రయోగాలలో ఎంతో కాలుష్యం వెలువడుతుంది అయితే ఆ కంపెనీ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది చనిపోయారు అందులో హీరో కుటుంబం ఒకటి అయితే ఆ కంపెనీ చేస్తున్న అరాచకాలు బయటకు రాకుండా చూస్తారు అయితే ఆ కంపెనీ యొక్క అసలు నిజ స్వరూపం బయట పెడతాడు హీరో అసలు కంపెనీ యొక్క రహస్యాలు బయటకు ఎలా వెళ్తున్నాయి దాని వెనుక ఎవరు ఉన్నారు అన్నది కనుగొనటానికి ఒక టీమ్ నీ అప్పాయింట్ చేస్తారు 

అయితే వీరి నుండి హీరో ఎలా బయట పడ్డాడు అసలు హీరో గతం ఏమిటి అన్నది మిగిలిన కథ హీరోయిన్ పాత్ర పెద్దగా ఏమి ఉండదు  పరవాలేదు బాగానే ఉంది చూడ వచ్చు !!!

14, డిసెంబర్ 2022, బుధవారం

పంచతంత్రం సినిమాపై నా అభిప్రాయం !!!


 పంచతంత్రం బ్రహ్మానందం,కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా పంచతంత్రం ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఇందులో బ్రహ్మానందం,కలర్స్ స్వాతి తండ్రి కూతుర్లు బ్రహ్మానందం ఒక రిటైర్డ్ అల్ ఇండియా రేడియో ఎంప్లాయ్ అయితే తన పదవి విరమణ తరువాత ఒక ఒక సంస్థ నిర్వహించే పోటీలో పాల్గొంటాడు అందులో standup story లో 5 కథలు చెబుతాడు అయితే ఒక కథకి మరొక కథ కి అసలు సంబంధము ఉండకూడదు కానీ ఆ కథలు ఒక దానికి ఒకటి లింక్ అయి ఉండాలి 

అలాంటి 5 కథలు చెబుతాడు పంచెద్రియలు అంటారు అలాగ అన్న మాట 

మొదటి కథలో ఒక వ్యక్తి బీచ్ నీ చూడాలనుకుంటాడు అది దృశ్యం 

రెండవ కథ ఒక వ్యక్తి చిన్నపుడు రుచి చూసే వస్తువును తను పెద్దయ్యాక రుచి చూడాలనుకుంటాడు అది రుచి 

మూడోవ కథ ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి తనకు వాసన వస్తుంది అది రక్తపు వాసన అని తెలుసుకుంటాడు అది అది వాసన

నల్గోవ కథ ఇద్దరు ప్రేమించి పెళ్ళిచేసుకుని ఉంటారు అయితే ఇంతలో ఆ అమ్మాయికి క్యాన్సర్ అని తెలుస్తుంది తను pregnent కూడా అయితే తన బిడ్డను ప్రసవించిన తరువాత ఒక సారి ముట్టుకుంటుంది అది touch 

ఇక ఐదవది ఒక చిన్న అమ్మాయి తనకు నచ్చిన కథలని వింటు ఉంటుంది అది శ్రవణం ఐదవది 

వినటన్నిటికి ఒకొక్క కథ ఉంటుంది ఇదే సినిమా అన్ని బాగానే connect అవుతాయి 5 కథలు తెరపైకి ఎలా చూపించాడు అన్నది అసలు కథ బాగుంది అక్కడక్కడ స్లోగా నడుస్తుంది కానీ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!








12, డిసెంబర్ 2022, సోమవారం

Zee5 Ott లో విడుదల అయిన "మాచర్ల నియోజకవర్గం" సినిమా పై నా అభిప్రాయం !!!

నితిన్, కృతిసెట్టి హీరో హీరోయిన్ లుగా వచ్చిన మాచర్ల నియోజక వర్గం సినిమా నెల రోజులు పైన విడుదల అయింది theatre లలో అయితే మొన్న జీ5Ott లోకి వచ్చింది ఇక సుట్టిలేకుండా సూటిగా కథ ఎలా ఉందో చూద్దాం !!!

మాచర్ల లలో  సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతాడు అతని కొడుకు రాజప్ప తన తండ్రి స్థానంలో తనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు అందుకుని తన మీద పోటీ చేసే వాళ్ళని దానికి అడ్డం వచ్చిన వాళ్ళని చంపేస్తాడు అందులో హీరోయిన్ వాళ్ళ అన్నలు కూడా ఉంటారు 30 సంవత్సరాలుగా అసలు మాచర్లలో ఎలక్షన్స్ జరగకుండా చూస్తాడు 

హీరో సివిల్స్ రాసి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటాడు వైజాగ్ లో అయితే హీరోయిన్ అక్కడకు వస్తుంది తనను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు అయితే హీరోయిన్ మరల మాచర్ల వెళ్ళిపోతుంది అక్కడికి హీరో కూడా వెళతాడు అక్కడికి వెళ్ళిన హీరో అక్కడ రాజప్ప చేసే అన్యాయాలు హీరోయిన్ కోసం ఫైట్ చేస్తాడు అయితే అక్కడే తనకు పోస్టింగ్ వస్తుంది ఆ తరువాత కథ ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ 

పెద్దగా చేపుకోవటానికి ఏమి లేదు కథ రోటీన్ గానే ఉంది ఇందులో విలన్ సముద్ర కని dual role లొ కనిపిస్తాడు జస్ట్ సో సో అంతే !!!





9, డిసెంబర్ 2022, శుక్రవారం

భయ పెట్టడానికి వస్తున్న నయన తార " Connect" ట్రైలర్ చూసారా ?

 నయన తార ప్రధాన పాత్రలో, సత్య రాజ్, అనుపమ ఖేర్ నటించిన సినిమా connect ట్రైలర్ ఈ కింద ఇవ్వబడింది ఈ ట్రైలర్ చూస్తే ఏదో ఇంగ్లీష్ సినిమా చూసిన అనుభూతి కల్గుతుంది మీరు ఒక లుక్ వేయండి 



5, డిసెంబర్ 2022, సోమవారం

" HIT the second case సినిమా పై నా అభిప్రాయం !!!


 అడవి శేష్ హీరోగా వచ్చిన సినిమా Hit 2 Nd case మొదటి సినిమా విస్వక్ సేన్ హీరోగా 2020 లో వచ్చింది ఇదే రెండవ సినిమా ఆ సినిమా బాగుంటుంది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో అడవి శేష్ ఒక  HIT  పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ జరుగుతుంది దానికి సంబంధించి నేరస్తుడిని వెంటనే పట్టుకుంటాడు అయితే మీడియా ముందు కొంచెం ఓవర్ గా ఫీల్ అవుతారు అయితే వెంటేనే కొన్ని రోజుల తరువాత మరొక అమ్మాయి మర్డర్ జరుగుతుంది అయితే ఆ అమ్మాయి తల మొండెం, కాళ్ళు, చేతులు వేరే వేరే మనిషులవి అయితే ఆ హత్య చేసింది ఒక కుర్రాడు అని అతడిని జైళ్లో వేస్తారు కానీ అక్కడ హత్య చేసింది ఆ కుర్రాడు కాదని తెలిసే లోపు ఆత్మ హత్య చేసుకుంటాడు ఇంతలో హీరో కొంచెం ఫీల్ అవుతాడు అయితే అప్పుడే హీరోయిన్ ని కూడా ఆ సైకో కిడ్నాప్ చేస్తాడు అయితే అసలు ఇదంతా చేస్తుంది ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఆడవాళ్ళను చంపుతున్నడు అన్నది సినిమా కథ మొదటి భాగం ఆసక్తిగా సాగుతుంది కానీ రెండవ భాగం నుండి అంత గా ఆసక్తిగా ఏమి సాగదు జస్ట్ అలా అలా వెళ్ళిపోతుంది 

Hit మొదటి సినిమా సస్పెన్స్ తో చాలా బాగుంటుంది hit రెండవ భాగం అంతగా ఏమి లేదు అని చెప్పాలి జస్ట్ average అంతే సినిమా !!!

2, డిసెంబర్ 2022, శుక్రవారం

అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చూసొద్దాం రండి !!!

 ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి గ్రామంలోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య దేవాలయం లోని షష్ఠి జాతర నవంబర్ 29 తేదీన అంగ రంగా వైభవంగా జరిగింది ఆ ఉత్సవం సంబంధించి వీడియో మీ కోసం !!!


Love today సినిమా పై నా అభిప్రాయం !!!

లవ్ today సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో కూడా విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఈ సినిమా యూత్ కి మంచి ట్రీట్ ఇచ్చే సినిమా అని చెప్ప వచ్చు ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు ఈ విషయం హీరోయిన్ వాళ్ళ నాన్నకు తెలుస్తుంది అయితే హీరోని ఇంటికి రమ్మని ఒక రోజు హీరోయిన్ ఫోన్, హీరోకి హీరో ఫోన్ హీరోయిన్ ఇద్దరు మార్చు కోమని చెబుతాడు ఆ తరువాత ఇద్దరు మార్చు కున్న తరువాత 

వారి పరిస్థితులు యేల మారాయి వాళ్లిద్దరూ genune కదా అని మిగిలిన కథ బాగుంది సినిమా యూత్ కి బాగా నచ్చు తుంది 

ఇద్దరు ప్రేమికుల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో అన్ని విషయాలు share చేసుకున్నారా లేదా అన్నది చిన్న కథ తో మొదలై దర్శకుడు చూపించాడు బాగుంది సినిమా !!!

26, నవంబర్ 2022, శనివారం

"Chup" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది హిందీ సినిమా Zee 5 ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇందులో దుల్కర్ సల్మాన్,ప్రధాన పాత్రలో చేసిన నెగిటివ్ రోల్ లో చేసిన సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

సినిమా చూసి రివ్యూ రాసే వారి హత్యలు జరుగుతుంటాయి అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నది పోలీస్ వాళ్లకు అంతుపట్టదు అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక ఫ్లవర్ షాప్ నడుపుతుంటారు అయితే హీరోయిన్ ఒక మీడియాలో రిపోర్ట్ గా పనిచేస్తుంది అయితే వీళ్ళిద్దరికీ ప్రేమలో పడతారు ఆయితే ఒక పక్కన మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి అయితే ఈ హత్యలు చేస్తుంది మాత్రం దుల్కర్ సల్మాన్ అయితే సినిమా రివ్యూ లు రాసే వారిని ఎందుకు చంపుతున్నారు అన్నది మిగిలిన సినిమా కథ కొంచెం ఆసక్తిగా సాగిన లాస్ట్ లో రోటీన్ గ ఉంటుంది అసలు ఇలా ఎందుకు అందరినీ చంపుతూ సైకో గా మారి చంపుతున్నారు అసలు దుల్కర్ గతం ఏమిటి అన్నది సినిమా చివరిలో తెలుస్తుంది బాగానే ఉంది ఒక సారి ట్రై చేయవచ్చు !!!
 

22, నవంబర్ 2022, మంగళవారం

Amazon prime లో విడుదల అయిన "డేజావు"సినిమా పై నా అభిప్రాయం !!!

పేరు కొత్తగా ఉంది కదా అని నేను చూసాను ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉందని సినిమా చూసాను అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! అన్నట్టు ఈ సినిమా తమిళ్ డబ్బింగ్

పోలీస్ స్టేషన్ కి ఒక ఆయన వస్తాడు మందు తాగి అయితే తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతాడు అయితే తను ఒక కథ రచయిత అని తను రాసుకున్న కథ లో నుండి పాత్రలు వచ్చి తనను బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ ఆ కంప్లైంట్ లైట్ తీసుకుంటారు

ఆ మరుసటి రోజే ఒక అమ్మాయి తను ఆపదలో ఉన్నట్టు ఒక కాల్ వస్తుంది అందులో ఈ రచయిత పేరు చెబుతుంది అయితే పోలీస్ లకు అసలు అర్థం కాదు ఆ తరువాత ఆ రచయితని అరెస్ట్ చేయటానికి పోలీస్ లు వెళ్తారు కని అక్కడ ఉండే చుట్టూ పక్కలు వారు అరెస్ట్ చేస్తే గొడవ చేస్తారు దానితో పోలీస్ లు అక్కడి నుండి వెళ్ళిపోతారు అయితే కథ అంతా ఆ రచయిత రాసిందే జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది కథ 

మొదట్లో ఆసక్తిగా సాగిన కథ సెకండ్ హాఫ్ నుండి కొద్దిగా మెల్లగా సాగుతుంది మొత్తానికి బాగుంది సినిమా కథ ఒక సారి ట్రై చేయవచ్చు కానీ ఎక్స్పర్టేషన్స్ తో సినిమా చూడ వద్దు !!!

 

అయినవిల్లి సిద్ది వినాయక స్వామి దేవాలయం చూసారా ?

 ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలోని అయినవిల్లి లో ఉండే శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం చూసారా ఈ వీడియో మీకోసం 


17, నవంబర్ 2022, గురువారం

"ఓరి దేవుడా" సినిమా పై నా అభిప్రాయం !!!


Viswaksen హీరో గా వచ్చిన సినిమా ఓరి దేవుడై సినిమా థియేటర్ లో ఇలా వచ్చి అలా వెళ్ళి పోయింది ఇప్పుడు ఈ సినిమా ఆహా ott లొ అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ సోది లేకుండా సూటిగా చెబుతాను !!!

ఇందులో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో హీరో, హీరోయిన్ ,ఇంకొక ఫ్రెండ్ ఐతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు అయితే హీరోయిన్ హీరో కి ప్రపోజ్ చేస్తుంది మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని  హీరో మొదట ఆలోచిస్తాడు కానీ చివరికి ఒప్పుకుంటాడు అలా వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది కానీ ఫ్రెండ్స్ గా ఉండి పెళ్లి చేసుకుంటే ఆ ఫీలింగ్స్ రావు అయితే అప్పుడే హీరో జీవితంలోకి హీరో కాలేజ్ సీనియర్ వస్తుంది 

వాళ్లిద్దరూ ఇంకా రిలేషన్ షిప్ లో లేక వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అయితే వాళ్లకు చివరకు విడాకులు తీసుకుందాం అనుకుంటారు అప్పుడే హీరోకి దేవుడు రూపంలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తాడు హీరో తన జీవితంలో జరిగిందంతా తీసివేసి మరలా మరొక ఛాన్స్ ఇస్తాను అంటాడు 

అలా మరొక ఛాన్స్ తో హీరో ఏమి చేశాడు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ ఏదో సో సో గా ఉంది కథ జస్ట్ below average అంతే !!!
 

16, నవంబర్ 2022, బుధవారం

Netflix లో విడుదల అయిన " మోనికా ఓ మై డార్లింగ్ " సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది బాలీవుడ్ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో రోబో కంపెనీ లో పనిచేస్తుంటారు అయితే ఆ కంపెనీ ఎండీ కి హీరో అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి కష్టపడి పైకి వస్తాడు అందుకే హీరోని కంపెనీ బోర్డు మెంబర్ గా నియమిస్తాడు  ఎండీ కూతురు కూడా హీరో అంటే ఇష్టం ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉంటారు అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న మోనికా తో అఫైర్ ఉంటుంది హీరోకి అయితే హీరో ఎండీ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి హీరోని బ్లాక్ మెయిల్ చేస్తుంది

హీరోనే కాకుండా కొంతమందిని ఆ కంపెనీలో పనిచేసేవారినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది వీళ్లంతా కలిసి మోనికా నీ చంపేయాలని అనుకుంటారు అయితే ఆ తరవాత కథఎలా మలుపు తిరిగింది ఆ మౌనిక నీ చంపారా లేదా అన్నది మిగిలిన కథ ok పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!
 

"బ్రహ్మాస్త్రం" సినిమా పై నా అభిప్రాయం !!!


 బ్రహ్మాస్త్రం బాలీవుడ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లొ విడుదల అయిన సినిమా,అమితాబ్ బచ్చన్,నాగార్జున,షారుఖ్ ఖాన్ ,రన్బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన మొదటి భాగం డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

బ్రహ్మాస్త్రం మూడు ముక్కలై ముగ్గురి వ్యక్తులు దగ్గర ఉంటాయి హీరో ఇందులో dj గా పని చేస్తుంటాడు ఒక పండగలో హీరోయిన్ కనిపిస్తుంది చూసిన వెంటనే ప్రేమలో పడతాడు హీరో హీరోయిన్ తోటి అయితే హీరోకి అప్పుడప్పుడు బ్రహ్మాస్త్రం తాలూకు జ్ఞాపకాలు వస్తుంటాయి అసలు బ్రహ్మాస్త్రం కి హీరోకి సంబంధం ఏమిటి అసలు ఎందుకు బ్రహ్మాస్త్రం జ్ఞాపకాలు తన కలలోకి ఎందుకు వస్తున్నాయి అన్నది సినిమా కథ ఇది మొదటి భాగం మాత్రమే
బ్రహ్మాస్త్రం మూడు ముక్కలై ఒకటి షారుఖ్ ఖాన్ దగ్గర ఉంటుంది షారుఖ్ ఖాన్ నుండి మౌని రాయ్ ముఠా దానిని తీసుకుంటుంది మరొక ముక్క నాగార్జున దగ్గర ఉంటుంది నాగార్జున దగ్గర ఉంటుంది నాగార్జున దగ్గర నుండి కూడా తీసుకుంటుంది అయితే ఈ ముఠా కి బ్రహ్మాస్త్రం కి ఏమిటి సంబంధం అన్నది కథ
సినిమాలో అంతా గ్రాఫిక్స్ తప్ప ఏమి కనపడలేదు లవ్ ట్రాక్ పరమ boaring గా ఉంది ఏదో సో సో గా ఉంది సినిమా గ్రాఫిక్స్ మధ్యలో కథ నడుస్తుంది తప్ప కథలో గ్రాఫిక్స్ ఉన్నట్టుగా లేదు అంతగా ఏమి లేదు సినిమా !!!

13, నవంబర్ 2022, ఆదివారం

యశోద సినిమా పై నా అభిప్రాయం !!!

యశోద సమంత ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా మొన్న శుక్రవారం theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో సమంత సరోగాసి ద్వారా పిల్లల్ని కని  విదేశాలలో ఉండే ధనవంతుల ఇంట్లోకి ఆ పిల్లల్ని ఇవ్వలనుకుంటూది అందుకు ఆమె ప్రతిఫలంగా డబ్బును తీసుకుంటుంది దీనికి ఒక హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ ప్రెగ్నెన్సీ అవుతుంది అయితే మూడు నెలలు తరువాత అక్కడి నుండి వెరో మరొక చోట ఉంచి అసలు బయట ప్రపంచం తెలియకుండా అలాగే అక్కడ కొంతమంది కూడా సరొగసి ద్వారా పిల్లలు కనటానికి వస్తారు 

అయితే వాళ్ళు నెలలు నిండిన తరువాత వాళ్ళను ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళి అక్కడినుండి వాళ్ళను ఎక్కడకి తీసుకెళ్తారు వాళ్ళు ఏమి అవుతారో ఎవరితెలియదు

ఇదంతా సమంత కని పెడుతుంది అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని తెలుస్తుంది అయితే అసలు అక్కడ ఏమి జరుగుతుంది అక్కడి నుండి సమంత ఎలా బయట పడింది అన్నది సినిమా కథ 

సినిమా అయితే బాగుంది కొత్త కాన్సెప్ట్ సరోగశి గురించి అసలు అందులో ఉన్న చీకటి కోణాలు గురించి బాగుంది సినిమా !!!

 

12, నవంబర్ 2022, శనివారం

భయ పెట్టడానికి వస్తున్న మసూద" ట్రైలర్ చూసారా ?

 Horror సినిమాలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది మన తెలుగులో త్వరలో విడుదల అవుతున్న సంగీత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హార్రర్ సినిమా మసూద సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి !!!


Disney hotstar లో విడుదల అయిన Rorschach సినిమా పై నా అభిప్రాయం !!!

మలయాళం లో హిట్ అయిన సినిమా డిస్నీ hotstar లో అందుబాటులో ఉంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

మమ్ముట్టి హీరోగా ఇందులో చేశాడు ఒక ఊరిలోకి హీరో వస్తాడు రాగానే తనకు accident అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య కనబడటం లేదని కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ వాళ్లు ఎంత వెదికినా తన భార్య ఎవరికి కనపడదు హీరో మాత్రం అక్కడే ఉంటాడు అయితే హీరోకి అక్కడే ఉంటున్న ఒక ఆయన అక్కడ ఒక ఇల్లు ఉందని అది తన పెద్ద కొడుకు ది అని చెప్పి హీరోకి అమ్మెస్తాడు 

ఆ తరువాత ఆ ఇల్లు అమ్మిన డబ్బులతో ఆయన ఎక్కడికో వెళ్లి పోతాడు కానీ చనిపోతాడు అసలు హీరో అక్కడికి ఎందుకు వచ్చాడు అసలు హీరో భార్య ఉందా లేదా ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది కథ బాగుంది సస్పెన్స్ కూడిన థ్రిల్లర్ సినిమా అక్కడక్కడ కొద్దిగా slow గా ఉన్న మొత్తానికి బాగుంది కథ ఒక చోట నుండి మలుపులు తిరుగుటూ ఉంటుంది మొత్తానికి బాగుంది ఒక్కసారి చూడ వచ్చు !!!

 చాలా ఓపిక గా చూడాలి సినిమా కొంచెం తిక మక గా ఉంటుంది ఒకసారి చూస్తే కథ అర్థం అవుతుంది !!!

10, నవంబర్ 2022, గురువారం

" బుజ్జి ఇలా రా" సినిమా పై నా అభిప్రాయం !!!

ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి చాలా కాలమైంది అయితే ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లోకి స్ట్రీమింగ్ అయింది చిన్న సినిమా కథ ఏముంటుంది అనుకుని సినిమా చూసాను కానీ బాగుంది ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఈ సినిమాలో ధనరాజ్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తాడు తను ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది చిన్న పిల్లలు కిడ్నాప్ అవుతారు అయితే అలా కిడ్నాప్ అయిన వల్లును ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అన్నది కథ అంతే అనుకుంటే పొరపాటే రోటీన్ గా సాగుతుంది అనుకున్నంత సేపే ట్విస్ట్ ఉంటుంది కథలో మొత్తం చెప్పటానికి కుదరదు కానీ సినిమా అయితే ఒక సారి తప్పకుండా try చేయ వచ్చు 

ఇందులో సునీల్ కూడా పోలీస్ పాత్రలో చేస్తాడు ఈ సినిమా చూస్తేనే గానీ థ్రిల్ ఉండదు చిన్న సినిమా అయిన బాగా తీశాడు అని చెప్ప వచ్చు !!!
 

" తగ్గేదిలే" సినిమా పై నా అభిప్రాయం !!!

 తగ్గేదిలే సినిమా థియేటర్ లలో విడుదల అయింది నవీన్ చంద్ర main lead లో దండు పాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా తగ్గేది లే సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో నవీన్ చంద్ర పెళ్లికి ముందు ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు అయితే తన ఊరిలో అమ్మ,నాన్న హీరో వాళ్ళ అక్క కూతురుతో పెళ్లి ఫిక్స్ చేస్తారు కానీ ఆ పెళ్ళికి ఒప్పుకుంటాడు అంత బాగా జరుగుతున్న సమయంలో హీరోజీవితంలోకి అంతకుముందు పరిచయం అయిన అమ్మాయి వస్తుంది తనను బ్లాక్ మెయిల్ చేస్తుంది 

దండుపాళ్యం సినిమాలో ఆ హంతకులు, ఆ పోలీస్ ఆఫీసర్ ఇందులో కూడా వుంటారు అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి మరణ శిక్ష విధిస్తుంది వాళ్ళను అక్కడకు తీసుకెళ్తుండగా దారిలో ఒక డాబా వద్ద పోలీస్ ఉంటాడు అయితే ఆ హంతకులు వాళ్లు వస్తున్న వ్యాన్ నుండి తప్పించుకుని ఎలాగైనా ఆ పోలీస్ ఆఫీసర్ నీ చంపాలనుకుంటున్నారు అయితే చివరికి కథ ఏమిటి అన్నది చూడాల్సింది హీరో నవీన్ చంద్ర కి,పోలీస్ ఆఫీసర్ కి ఏమిటి సంబంధం అన్నది చూడాలి సినిమా

బాగా వయోలెన్స్ తో కూడుకున్న సినిమా దండు పాల్యం సినిమా లాగా చివరికి చాలా హింసాత్మకంగా ఉంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు 2 nd half నుండి హింస ఎక్కువుగా ఉంది అంతగా ఏమి లేదు సినిమాలో !!!

8, నవంబర్ 2022, మంగళవారం

"పరుగో పరుగు" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా యోగిబాబు , కరుణాకరన్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా ఇక అసలు కథ ఏమిటో చూద్దాం !!!

ఇది మూఢ నమ్మకాల చుట్టూ నడుస్తుంది ఈ కథ కరుణాకరన్ తన కుటుంబం లోని సమస్యలు కు భయపడి చని పోవాలని అనుకుంటాడు అప్పుడు ఇద్దరు తనని కాపాడతారు తన కుటుంబం లో సమస్యలు వలన తను చనిపోతున్నా అని చెబుతాడు కాపాడిన వారిలో ఒకరు ఒక స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్తాడు అయితే అక్కడ స్వామీజీ ఒక పరిహారం చెబుతాడు అది చేసి వస్తుండగా అన్ని మంచి విషయాలు జరుగుతాయి అప్పుడు ఉన్నట్టుండి ఒక పంది వాళ్లకు అడ్డు వస్తుంది మరల చెడు సంఘటనలు జరుగుతాయి 

మరల స్వామీజీ దగ్గరకు వెళ్తారు అప్పుడు ఆ పందిని మరల ఒకసారి గుద్దమని చెబుతాడు అయితే ఆ పంది కోసం వెతుకుతూ ఉంటారు

Yogi Babu అవ్వక అవ్వక లేట్ వయసులో పెళ్లి అవుతుంది పెళ్లి సంప్రదాయం ప్రకారం ఒక పంది పిల్లని 10 రోజులు పాటు దానికి ఏమి జరగకుండా కాపాడుకుంటూ రావాలి ఆ పంది కరుణాకరన్ వాళ్ళు గుద్దిన పంది 

ఆ పంది కరుణా కరణ్ వాళ్ళ కంట పడుతుంది వీళ్ళిద్దరికీ ఆ పంది గురించి గొడవలు పడుతుంటారు అయితే చివరికి కథ ఎలా మలుపు తిరిగింది అన్నది కథ

ఈ సినిమా sun NXT లో అందుబాటులో ఉంది కామెడీ గానే ఉంది పర్వాలేదు ఒక చూడ వచ్చు !!!


 

"like share ,subscribe సినిమా పై నా అభిప్రాయం !!!


సంతోష్ శోబాన్ హీరోగా, మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక యూట్యూబ్ ట్రావెల్ vlogger హీరోయిన్ కూడా ట్రావెల్ vlogger హీరో అరుకులో అందమైన ప్రదేశాలు కోసం వెళ్తాడు అయితే అనుకోకుండా అక్కడకు హీరోయిన్ కూడా వస్తుంది ఇంతలో వీళ్ళిద్దరికీ కొద్దిగా లవ్ tarck నడుస్తుంది అయితే ఇంతలో వీళ్ళని ఒక మావోయిస్ట్ గాంగ్ కిడ్నాప్ చేస్తుంది హీరోయిన్ ఎవరో కాదు మావోయిస్ట్ లు చంపాలని అనుకుంటున్న డీజీపీ కూతురు 

ఐతే చివరకు కథ ఏమైంది అన్నది కథ చెప్పుకోవటానికి పెద్ద గా ఏమి లేదు అసలు కామెడీ లేదు ఏదో ఉన్నట్టుగా లేనట్టుగా ఉంటుంది అసలు బాగోలేదు సినిమా !!!

3, నవంబర్ 2022, గురువారం

కాంతారా Ott రిలీజ్ ఎప్పుడో తెలుసా మీకు

 సూపర్ హిట్ కన్నడ సినిమా కాంతారా  ott రిలీజ్ డేట్ నవంబర్ 24 తేదినుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది కాకపోతే తెలుగులో ఆహా ott లోకి వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే చూద్దాం !!!

2, నవంబర్ 2022, బుధవారం

కార్తీ "సర్దార్" సినిమా పై నా అభిప్రాయం !!!


కార్తీ సర్దార్ సినిమా దీపావళి సందర్భంగా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో కార్తీ రెండు పాత్రల్లో చేశాడు తండ్రి మరియు కొడుకు కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ తను ఎక్కడున్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని అనుకుంటాడు కానీ వాళ్ళ తండ్రి ఒక దేశ ద్రోహి అని అందరూ అనుకుంటారు అలాంటి హీరో తన తండ్రి నిజంగా దేశ ద్రోహి లేక ఏమిటి అన్నది కథ అసలు హీరో వాళ్ళ నాన్న కథ ఏమిటి ఎందుకు దేశ ద్రోహిగా అందరూ అనుకుంటున్నారు అన్నది కథ 

ఇంకా చెప్పొచ్చు కానీ అదంతా చెబితే సినిమా చూసే థ్రిల్ ఉండదు అందుకే చెబుతున్న p.s mitran ఈ సినిమాలో కూడా ఒక సామాజిక అంశం ఉండేలా చూసాడు మొత్తానికి బాగుంది సినిమా చూడ వచ్చు !!!
 

God father ott release ఎప్పుడో తెలుసా ?

 మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా god father cinema October 5 న విజయ దశమి సందర్భంగా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా Netflix ott lo November 19 న అందుబాటులోకి రానుంది !!!

26, అక్టోబర్ 2022, బుధవారం

ఆహా లో విడుదల అయిన స్వాతి ముత్యం సినిమా పై నా అభిప్రాయం !!!


 బెల్లం కొండ గణేష్ హీరోగా వచ్చిన సినిమా స్వాతి ముత్యం సినిమా థియేటర్ లలో ఇలా వచ్చి అలా ott లోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా లో హీరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు హీరో ఒక పెళ్లి చూపులకి వెళ్తాడు కానీ అది cancel అవుతుంది ఆ తరువాత హీరో హీరోయిన్ మాత్రమే ఒక restaurent లో పెళ్లి చూపులు జరుగుతాయి అయితే హీరోయిన్ అలోచించుకుని చెబుతాను అంటుంది అయితే ఇందులో హీరో కొంచెం అమాయకుడు గా ఉంటాడు ఆ తరువాత కొన్ని రోజుల తరువాత హీరోయిన్ పెళ్లికి ok చెబుతుంది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది హీరో పెళ్లికి అందరూ సిద్ధ పడుతుంటారు అప్పుడు అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పటి నుండి కథ వేరేలా ఉంటుంది అది హీరో పెళ్లికి ముందు తన ఫ్రెండ్ డాక్టర్ వెన్నెల కిషోర్ హీరో యొక్క వీర్యం కావాలని అడుగుతాడు అయితే హీరో ఒప్పుకొడు కానీ ఎవరికో పిల్లలు లేకపోతే చివరికి ఒప్పుకుంటాడు 

సరోగసి ద్వారా ఒక అమ్మాయి ఒక బాబుని కంటుంది ఆ పిల్లాడిని తీసుకుని కళ్యాణ మండపం కి వస్తుంది ఆ తరువాత కథ ఏమిటి అన్నది పరవాలేదు అంతగా ఏమి లేదు average అంతే !!!

24, అక్టోబర్ 2022, సోమవారం

మెగాస్టార్ "వాల్తేర్ వీరయ్య" టీజర్ చూసారా ?

 మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ సినిమా టీజర్  దీపావళి సందర్భంగా విడుదల అయింది ఈ సినిమా టీజర్ మీరు చూడండి !!!

23, అక్టోబర్ 2022, ఆదివారం

Amazon prime లో విడుదల అయిన "అమ్ము" సినిమా పై నా అభిప్రాయం !!!

 Amazon prime లో మొన్న విడుదల అయిన అమ్ము సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన సినిమా అమ్ము ఈ కథ మామూలుగా హీరో నవీన్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే తనకు పెళ్లి జరుగుతుంది కథ అంత సదా సీద గా జరుగుతుంది అయితే పెళ్ళైన కొన్ని రోజుల తరువాత హీరో తన భార్యను హింస పెట్టడం చేస్తాడు అసలు హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని భార్య అనుకుంటుంది ఆ విషయం తన పై అధికారులకు చెప్పాలని అనుకుంటుంది కానీ అది జరగదు 

అయితే చివరకు తన భర్త ఏ విధంగా డీల్ చేసిందో అదే సినిమా కథ ఇందులో బాబీ సింహ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపిస్తాడు అంతగా ఏమి లేదు సినిమాలో ఒక సైకో మొగుడు నుండి భార్య ఎలా ఎలా తప్పించుకోగలిగింది అన్నది సినిమా కథ !!!

రోటీన్ గానే ఉంది కథ !!!







20, అక్టోబర్ 2022, గురువారం

"palthu janwar" సినిమా పై నా అభిప్రాయం !!!


Palthu janwar మలయాళీ డబ్బింగ్ సినిమా ఇది తెలుగులో కూడా ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !

మలయాళీ సినిమా చాలా natural గా ఉంటాయి ఇక కథ ఏమిటంటే ఒక ఊళ్ళోకి ఒక పశువులు డాక్టర్ అసిస్టెంట్ లాగా వస్తాడు మన హీరో తనకు ఆ ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు కానీ వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల తనకు ఆ ఉద్యోగం వస్తుంది అలా ఇష్టం లేకుండా చేస్తున్న ఉద్యోగం లో ఎన్ని అవమానాలు, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురు అయ్యాయి అన్నది సినిమా కథ చాలా సహజ సిద్దంగా ఉంటుంది కథ 

పరవాలేదు ఒక సారి ట్రై చేయవచ్చు !!!

17, అక్టోబర్ 2022, సోమవారం

కాంతర సినిమా పై నా అభిప్రాయం !!!


 కంతారా సినిమా కన్నడ సినిమా తెలుగులో theatre లలో అక్టోబర్ 15 న విడుదల అయింది రిషబ్ సెట్టి హీరోగా సొంత డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి అన్ని ఉన్న కూడా మనశ్శాంతి గా ఉండేవాడు కాదు ఎదొక లోటు మనశ్శాంతిగా నిద్ర పోయేవాడు కాదు అందుకని తన మనశ్శాంతి కోసం దేశ సంచారం చేసేవాడు ఒక అటవీ ప్రాంతంలో ఒక దేవత రాయి ఒకటి కనబడుతుంది అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలకు ఆ దేవత రాయి తనకు ఇస్తే దానికి బదులుగా తన ఆస్తిలో అడవిలో ఉన్న స్థలాన్ని వాళ్ళకి రాసి ఇస్తానని చెబుతాడు దానికి వాళ్ళు ఒప్పుకుంటారు ఆ దేవత వాళ్ళలో ఒకరికి పూని అలాగే అని చెబుతుంది 

కొన్ని సంవత్సరాలు తరువాత హీరో వాళ్ళ ఉండే ఒక అటవీ ప్రాంతంలో కబ్జా చేయటానికి ఆ రాజు వారసుడు ప్రయత్నిస్తాడు దానిని హీరో ఎలా అడ్డుకున్నాడు అన్నది అసలు కథ దీనిలో  ముఖ్యంగా కొలం ఆచారం గురించి ఈ సినిమాలో చెప్పటం జరిగింది మొత్తానికి బాగుంది సినిమా క్లైమాక్స్ బాగుంది !!!


9, అక్టోబర్ 2022, ఆదివారం

కన్నడ సూపర్ హిట్ సినిమా కంతరా తెలుగు ట్రైలర్ చూసారా ?

 కన్నడ లో సూపర్ హిట్ అయిన కంటార సినిమా తెలుగులో అక్టోబర్ 15 న theatre లలో విడుదల అవుతుంది దీనికి సంబందించిన ట్రైలర్ కూడా విడుదల అయింది గీత ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తుంది ఈ సినిమాని మీరూ ఒక లుక్ వేయండి !!!

7, అక్టోబర్ 2022, శుక్రవారం

God father సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా god father సినిమా దసరా సందర్భంగా October 5 న విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది మోహన్ లాల్ Lucifer సినిమా చూసిన వారికి సుపరిచితమే అయితే కథ చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తరువాత ఆ తరువాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్తబ్దత ఏర్పడుతుంది  ఆ ముఖ్య మంత్రి pkr అతని తరువాత వారసుడు ఎవరు అన్నది తన అల్లుడా లేదా pkr కి అత్యంత సన్నిహితుడు అయిన బ్రహ్మ ( చిరంజీవి ) అన్నది 

ప్రభుత్వాన్ని ఎలాగైనా తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తాడు pkr అల్లుడు దానికి హీరో అడ్డుపడతాడు అయితే చివరికి ఎవరిది గెలుపు అన్నది మిగిలిన కథ నయన తార pkr కుతురుగా బాగానే నటించింది అల్లుడిగా సత్య దేవ్ యాక్టింగ్ బాగుంటుంది సునీల్ బాగా చేశాడు కానీ Lucifer సినిమా చూసిన తరువాత ఈ సినిమాలో కొద్ది కొద్ది మార్పులు చేశారు సల్మాన్ ఖాన్ Lucifer సినిమాలోని పృధ్వీ రాజ్ సుకుమార్ పాత్ర ఇందులో పోషించటం జరిగింది మొత్తానికి బాగుంది సినిమా elevation తోనే నడుస్తుంది కథ !!!


1, అక్టోబర్ 2022, శనివారం

విక్రమ్ "కోబ్రా" సినిమా పై నా అభిప్రాయం !!!

విక్రమ్ అంటే డిఫరెంట్ సినిమాలకు మారు పేరు అయితే ఇటీవల theatre లలో విడుదల  అయిన కోబ్రా సినిమా ott లోకి కూడా వచ్చింది ఇక ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా మొత్తం నిడివి 3  గంటలు పైనే ఉందీ అసలు కథ ఏమిటంటే కొంతమంది ప్రముఖ వ్యక్తులు చనిపోతుంటారు వాళ్ళను వివిధ రూపాలలో హీరో చంపేస్తుంటడు హీరో ని పట్టుకోవటానికి ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రముఖ పాత్రలో చేయటం జరిగింది ఇంతకీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు దీని వెనుక కథ ఏమిటి అన్నది అసలైన కథ 

ఫస్ట్ హాఫ్ లో కథ కొంచెం బాగానే ఉన్న 2 nd half నుండి కథ చాలా దారుణంగా ఉంటుంది 3 గంటలు అసలు కథ ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తుంది తెలియదు అంతగా బాగోలేదు కథ 

విక్రమ్ నుండి ఇలాంటి సినిమా అసలు ఆశించలేదు !!!




29, సెప్టెంబర్ 2022, గురువారం

మెగస్టార్ చిరంజీవి నటించిన "God father" ట్రైలర్ చూసారా ?

 ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమా god father దసరా సందర్భంగా అక్టోబర్ 5 న విడుదల అవుతుంది దీనికి సంబంధించి ట్రైలర్ నిన్న విడుదల చేశారు మీరు ఒక లుక్ వేయండి 

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

బబ్లీ బౌన్సర్ సినిమా పై నా అభిప్రాయం !!!


తమన్నా ప్రధాన పాత్రలో చేసిన బబ్లీ బౌన్సర్ డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఢిల్లీ లో ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అందరూ పబ్ లో బౌన్సర్ లాగా పనిచేస్తుంటారు ఆ ఊరి దానికి ప్రసిద్ది అయితే ఆ బౌన్సర్ లను తయారు చేసే వ్యక్తి హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే హీరోయిన్ చిన్నప్పటి నుండి ఢిల్లీ లో పనిచేయాలని ఉండేది వల్లనాన్న పెళ్లి చేయాలని అనుకుంటాడు 

అప్పుడే ఆ ఊరిలోకి హీరోయిన్ తమన్నా వాళ్ళ టీచర్ వాళ్ళ అబ్బాయి వస్తాడు తను మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంది అందుకని వచ్చిన సంబంధాలు కుదరకుండ చేస్తుంది 

చివరకు సంబంధాలు చెడిపోతున్నయి అని ఢిల్లీ లో జాబ్ చేయాలని తనకి పెళ్లి అప్పుడే వద్దని చెబుతుంది చివరకు ఢిల్లీ వెళ్తుంది అక్కడ టీచర్ వాళ్ళ అబ్బాయిని చూస్తుంది తన ప్రేమ విషయం చెప్పిందా తను బౌన్సర్ గా ఎందుకు మారింది అసలు లేడీ బౌన్సర్ పబ్ లో అవసరం ఏమిటి అన్నది కథ బాగుంది సినిమా !!!




24, సెప్టెంబర్ 2022, శనివారం

Netflix లో విడుదల అయిన "జోగి" సినిమా పై నా అభిప్రాయం !!!


 జోగి Netflix లో అందుబాటులో ఉంది ఇది నిజంగా జరిగిందో లేదో తెలియదు అసలు కథ ఏమిటో సూటిగా సుత్తి లేకుండా చూద్దాం !!!

ఢిల్లీలో ఒక ప్రాంతంలో సిక్కు కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి అప్పుడు అనూహ్యంగా వాళ్ళ మీద కొంత మంది దొరికిన వారిని దొరినట్టు చంపుతూ ఉంటారు అందులో ఉండే మన హీరో జోగి 

మన హీరో కూడా సిక్కులు కుటుంబానికి చెందిన వాడు అయితే ఆ సిక్కులునును మన హీరో ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ  

బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు!!!

22, సెప్టెంబర్ 2022, గురువారం

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా పై నా అభిప్రాయం !!!

సుధీర్ బాబు,కృతి సెట్టీ హీరో హీరోయిన్ లుగా వచ్చిన ఈ సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక  famous director అయితే తన సినిమా కొత్త వాళ్ళతో తీద్దామని అనుకుంటాడు ఇంతలో ఒక చిన్న కార్ ఏక్సిడెంట్ లో హీరోయిన్ నటించిన ఒక వీడియో క్లిప్ దొరుకుతుంది అయితే ఆ వీడియో లో నటించిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు హీరో అంతలో హీరోయిన్ ఒక డాక్టర్ అని తెలుస్తుంది తనకు అసలు సినిమా లు నచ్చవని చెబుతుంది ఎలాగైతే ఇద్దరు కలుస్తారు అప్పుడు చెబుతుంది హీరోయిన్ ఆ వీడియో తనది కాదని వాళ్ళ అక్కది అని తను ఇద్దరు కవల పిల్లలు అని 

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ పర్వాలేదు ఇంటర్వల్ లో మంచి కథలోకి వెళ్తాం ఒక సారి చూడ వచ్చు !!!

Expertation s తో చూడ వద్దు జస్ట్ టైం పాస్ !!!
 

Vikrant Rona సినిమా పై నా అభిప్రాయం !!!

 కన్నడ స్టార్ సుదీప్ హీరోగా వచ్చిన Vikrant Rona సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక అటవీ ప్రాంతం పక్కన ఉన్న ఊరు ఆ ఊరిలో హత్యలు జరుగుతుంటాయి దానిని solve చేయటానికి హీరో అక్కడకు వెళ్తాడు అయితే అక్కడ ప్రాంతం లోకి ఎవరు వెళ్ళకూడదు వెళితే మరణమే అని అక్కడ వారు చెబుతారు 

అయితే అక్కడకు హీరో వెళ్తాడు కానీ ఏమి కాదు ఇదే కథ రోటీన్ గా ఉన్న కానీ విలన్ ఎవరు అన్నది మనకు చివరిలో అర్థం అవుతుంది బాగుంది సినిమా చూడ వచ్చు !!!

తరువాత ఏమి జరుగుతుందో అన్న సస్పెన్స్ తో నడుస్తుంది బాగుంది సినిమా !!!





18, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఆహా లో విడుదల అయిన " కిరోసిన్" సినిమా పై నా అభిప్రాయం !!!

కిరోసిన్ సినిమా ఆహా ott లో మొన్న శుక్రవారం నుండి అందుబాటులో ఉంది అసలు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ కథ ఒక అడివికి అనుకుని ఉన్న ఒక గిరిజన ప్రాంత గ్రామం ఆ గ్రామంలో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా కిరోసిన్ పోసి చంపేస్తారు దానిని ఆ ప్రాంతంలో ఉండే పోలీస్ లు తప్పుడు సాక్ష్యాలు తో వేరొక వ్యక్తి నీ అరెస్ట్ చేస్తారు కానీ అది చేసింది అతను కాదు అప్పుడు హీరో రంగ ప్రవేశం చేస్తాడు ఇందులో హీరో A.C.P ఆ ఊరు వచ్చిన వెంటేనే తప్పుడు సాక్ష్యాలు తో కేసును తప్పు దోవ పట్టించినందుకు ఆ ఇన్స్పెక్టర్ నీ సస్పెండ్ చేస్తాడు అయితే అలాంటి హత్యలే ఇంతకుముందు జరిగినాయి అని తెలుస్తుంది ఇంతకీ ఈ హత్యలు చేస్తుంది ఎవరు అన్నది మిగతా కథ అంతగా ఏమి లేదు కథలో అంతా రోటీన్ గానే ఉంటుంది !!!


13, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఓకే ఒక జీవితం సినిమా పై నా అభిప్రాయం !!!

శర్వానంద్,అక్కినేని అమల ప్రధాన పాత్రలో విడుదల అయిన ఓకే ఒక జీవితం సినిమా theatre లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో హీరో కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు హీరోకి సంగీతం అంటే ఇష్టం మరొక ఫ్రెండ్ కి హౌస్ బ్రోకర్ గా పని చేస్తుంటాడు అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇలా కథ ముందుకు వెళ్తుంటే ఒక సెంటిస్ట్ ఇల్లు అద్దెకు కావాలని హీరో ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు ఊరి చివర్లో ఇల్లు ఉండాలని అంటాడు అలాగే ఇల్లును చూపిస్తాడు తనతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్తాడు అప్పుడు ఆ సైంటిస్ట్ తను ఒక టైం ట్రావెల్ మిషన్ కనిపెట్టనని చెబుతాడు అప్పుడు వాళ్ళ ముగ్గురు వారి ఆశలు తీర్చుకోవటానికి a time mission లో ట్రావెల్ చేస్తారు అక్కడ వాళ్ళ చిన్నపాటి కాలానికి వెళ్తారు హీరో కి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం వాళ్ళ అమ్మను కలుసుకోవటం కోసం వెళ్తాడు అయితే అక్కడకు వెళ్ళిన తరువాత ఏటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ 

బాగుంది సినిమా చూడ వచ్చు ఒకసారి !!!!



 

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఆర్య captain సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆర్య తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు వారికి పరిచయం ఇక తను నటించిన లేటెస్ట్ సినిమా captain తెలుగులో theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో హీరో ఒక అనాధ కష్టపడి చదువుకుని మిలటరీ కెప్టెన్ పదవిలో ఉంటాడు తనతో పాటు తన సభ్యులు 4 ఉంటారు ఇలా మిలటరీ లో ఎన్నో రిస్క్ ఆపరేషన్స్ తన సభ్యులతో పూర్తి చేస్తాడు ఇలా కథ ముందుకు నడుస్తుంది అక్కడ ఒక అడవిలో ఒక స్పెక్టర్ ఉంటుంది అక్కడకు వెళ్ళిన ఆర్మీ వాళ్లు చనిపోతుంటారు ఎందుకంటే అక్కడ విచిత్రమైన జంతువులు ఉన్నాయని అక్కడికి హీరో బృందం వెళ్తుంది ఈ బృందంలో సిమ్రాన్ డాక్టర్ పాత్రలో చేస్తుంది అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమి చూశారు అక్కడినుండి వాళ్ళు ఎలా బయట పడ్డారు అన్నది కథ 

కథలో కొత్తదనం ఏమీ లేదు హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా అంతగా ఏమి నచ్చదు గ్రాఫిక్స్ కూడా అంతగా ఏమి లేదు !!!






7, సెప్టెంబర్ 2022, బుధవారం

సీతా రామం సినిమాలో deleted సీన్ మీకోసం !!!

 

 
లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా సీత రామం సినిమాలోని deleted వీడియో మీ కోసం అందుబాటులో ఉంది చూడండి అమెజాన్ prime లో సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

"first day First Show" సినిమా పై నా అభిప్రాయం !!!

 

 
ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా theatre లలో విడుదల అయింది కొత్త వాళ్ళ తోటి హీరో హీరోయిన్ లు కొత్త వాళ్ళు దీనికి కథ అందించింది జాతి రత్నాలు డైరెక్టర్ ఇక అసలు కథ ఏమిటో చూద్దాం !!!
నారాయణ్ ఖేడ్ అనే ఊరిలో ఒక హీరో ఉంటాడు ఈ కథ ఖుషి సినిమా విడుదల అయ్యేటప్పటికి పరిస్థితులు  హీరోకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చా ఫ్యాన్ అన్నమాట పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్నామాట అదే ఊరిలో హీరోయిన్ కూడా ఉంటుంది ఆ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని హీరోకి చెబుతుంది ఖుషి సినిమాకి ఎలాగైనా టికెట్ లు సంపాదించాలని హీరోకి చెబుతుంది అయితే హీరో ఆ కాలంలో టిక్కెట్లు అది ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు సంపాదించటం కష్టం కదా అయితే చివరకు కథ ఏమి జరిగింది చివరకు టికెట్ సంపాదించడా లేదా అన్నది కథ 
కొద్దిగా కామెడీ తో అక్కడక్కడ బోర్ కొడుతుంది చాలా సింపుల్ గా ఉంటుంది కానీ సినిమాలో అంతగా ఏమి లేదు !!!

5, సెప్టెంబర్ 2022, సోమవారం

సీత రామం ott విడుదల ఎప్పుడో తెలుసా !!!

 Dulkar సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించిన సీత రామం సినిమా ott లో సందడి చేయబోతోంది ఇక ఈ సినిమా Amazon prime లో సెప్టెంబర్ 9 నుండి అందుబాటులోకి రానుంది !!!

3, సెప్టెంబర్ 2022, శనివారం

Hello world వెబ్ సెరిస్ పై నా అభిప్రాయం !!!

 Hello world వెబ్ సెరిస్ జీ 5 ott లో అందుబాటు లో ఉంది ఆర్యన్ రాజేష్,సదా ప్రముఖ పాత్రలో చేసిన వెబ్ series అసలు కథ ఏమిటో తెలుసుకుందాం!!!

ఈ సీరీస్ మొత్తం software employes కి సంబంధించి ఉంటుంది ఎక్కడెక్కడో ఉన్న ఇంజినీర gradute లకు తమకు జాబ్ జాబ్ లోకి సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది అందరూ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోకి ఒకరికి ఒకరు పరిచయం అవుతారు అయితే అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎన్ని రకాల ఒత్తిడులు టార్గెట్లు, tension లు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ వస్తే దానికి సంబంధించి వాళ్ళు ఎలా కష్టపడతారు అన్నది ఈ వెబ్ series ప్రధాన కథ 

Firstlo కొంచెం సో సో అనిపించిన చివరకు పర్వాలేదు బాగానే ఉంది ఒకసారి చూడవచ్చు 

మనం చేసే ప్రతి పని వెనుక ఎంత కష్టం ఉంటుంది సాఫ్ట్వేర్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఈ వెబ్ series chuste వాళ్లు ఇంత కష్టపడతార అనిపించింది !!!

30, ఆగస్టు 2022, మంగళవారం

కళా పురం సినిమా పై నా అభిప్రాయం !!!

 సత్యం రాజేష్ హీరోగా వచ్చిన సినిమా కళా పురం ఇక లేట్ లేకుండా ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం !!!

హైదరాబాద్ లో సినిమాలో డైరెక్టర్ అవ్వటానికి ప్రత్నిస్తుంటాడు హీరో ఆ క్రమంలో హీరోయిన్ పరిచయం అవుతుంది హీరోయిన్ నీ ప్రేమిస్తాడు కానీ మోసం చేసి వెళ్ళిపోతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా డైరెక్షన్ ఛాన్స్ రాదు 

చివరకు ఒక్ వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తాను అని ముందుకు వస్తాడు షూటింగ్ తన ఊరిలోనే చేయాలని షరతు పెడతాడు హీరో అక్కడికి వెళ్తాడు కానీ అక్కడ ఏమి జరిగింది అన్నది కథ 

అంతగా కామెడీ అయితే ఏమి లేదు జస్ట్ సో సో గా సాగుతుంది కథ పెద్దగా ఆసక్తిగా చూసే విధంగా ఏమి లేదు సినిమా !!!

27, ఆగస్టు 2022, శనివారం

Liger సినిమాపై నా అభిప్రాయం !!!

 లైగర్ పురి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా ఆగస్ట్ 25 న విడుదల అయింది ఇక సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఈ సినిమాలో హీరో బాక్సింగ్ ఫైటర్ కావాలని ఉంటుంది అలాగే హీరో కి కొంచెం నత్తి ఉంటుంది ఎలాగైనా మంచి ఫైటర్ కావాలని కరీంనగర్ నుండి వాళ్ళ అమ్మతో ముంబై కి చేరుకుంటాడు అక్కడే చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంటారు 

అక్కడే ఉంటున్న హీరోయిన్ కి పరిచయం అవుతాడు హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుంది అయితే చివరికి ఏమి అయింది హీరో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడా లేదా అన్నది మిగిలిన కథ ముంబై లో అక్కడే ఒక కోచ్ దగ్గర జాయిన్ అవుతాడు కానీ తన దగ్గర డబ్బులు లేవని అంటాడు 

ఈ సినిమా చూస్తున్నంత సేపు రవి తేజ అమ్మ,నాన్న, ఓ తమిళ్ అమ్మాయి సినిమాయే గుర్తుకు వస్తుంది సేమ్ అలాగే ఉంది సినిమా కథని కొద్దిగా అటు ఇటు మార్చినట్టు ఉంది 

నాకైతే అంతగా ఏమీ లేదు అనిపించింది కథలో !!!



25, ఆగస్టు 2022, గురువారం

"Tamil rockerz"వెబ్ series పై నా అభిప్రాయం !!!

తమిళ్ rockers ఈ పేరు  అప్పట్లో ఈ పేరు మారుమోగుతు ఉండేది సినిమా ఇండస్ట్రీ కి ఇదొక పీడ కల అలాంటిది తమిళ్ రాకర్స్ పేరుతోనే వెబ్ సేరీస్ వచ్చింది ఇక ఈ వెబ్ series ఎలా ఉందో చూద్దాం !!!

అసలు కథ ఏమిటంటే ఒక 300 కోట్ల బడ్జెట్ సినిమా ను theatre లో విడుదల కు ముందే తమిళ్ rockers లో upload చేస్తాం అని బెదిరిస్తారు అప్పుడు నిర్మాత హీరో అయినటువంటి పోలీస్ ఈ గండం నుండి బయట పడేయాలని కోరుకుంటాడు అసలు ఎవరు ఈ తమిళ్ rockers అసలు ఎలా పుట్టుకు వచ్చింది మొత్తం సినిమా ఇండస్ట్రీ నీ ఎందుకు బయ పెట్టింది అన్నది మిగిలిన ఏదో అశతో చూసాను కానీ అంతగా ఏమి బాగోలేదు 

చాలా ఇంటరెస్ట్ గా సాగుతుంది అనుకున్నాను కానీ అంతగా ఏమి లేదు !!!
 

23, ఆగస్టు 2022, మంగళవారం

నాగ చైతన్య Thankyou సినిమా పై నా అభిప్రాయం !!!

 అక్కినేని నాగ చైతన్య హీరో గ వచ్చిన సినిమా thankyou మనం ఎవరి దగ్గర సహాయం పొందితే వారికి కచ్చితంగా thank you చెబుతాం అలాంటిది మనం మన జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే దానికి మనకు సహాయం చేసిన వారికి thankyou చెబుతాం ఇక అసలు కథ ఏమిటో చూద్దాం !!!

ఒక చిన్న పల్లెటూరు లో ఉండే ఒక హీరో అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికా చేరుకుంటాడు అక్కడ ఒక app ను dovelop చేసి మంచి పేరును సంపాదిస్తాడు అయితే ఈ విజయానికి కారణం తాను ఒక్కడినే వల్లే సాధ్య పడుతుందని కొద్దిగా అహంకారం తో ఉంటాడు ఈ ప్రయాణంలో హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది అసలు చివరికి హీరో తన తప్పు తెలుసుకున్నాడ లేదా అన్నది మిగిలిన కథ జస్ట్ below average సినిమా అంతగా ఏమి లేదు సినిమాలో !!!

15, ఆగస్టు 2022, సోమవారం

కార్తికేయ 2 సినిమా పై నా అభిప్రాయం !!!

నిఖిల్ హీరో గా వచ్చిన కార్తికేయ మంచి హిట్ సాధించింది ఆ సినిమాకు సీక్వెల్ గా  కార్తికేయ 2 మొన్న 13 తారికున విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

కార్తికేయ 1 లో ఎంబీబీఎస్ స్టూడెంట్ గా కనిపించిన హీరో ఇందులో డాక్టర్ అవుతాడు తన తల్లి మొక్కు కారణంగా ద్వారక వెళతాడు అక్కడ జరుగుతున్న అసలు కృష్ణుడు ఎవరు అయితే అక్కడికి వెళ్ళిన తరువాత తన మీద హత్య ప్రయత్నాలు జరుగుతాయి అది చేస్తుంది ఎవరు  ఇందులో హీరోయిన్ ఒక పురావస్తు శాస్త్రవేత్త మనవరాలు కొంతమంది విలన్లు తన తాత ను చంపేస్తారు అయితే కృష్ణుడు గురించి హీరో కు ఏదో చెబుతూ చనిపోతాడు అసలు ఆయన చెప్పింది ఏమిటి అన్నది కథ 

బాగానే ఉంది సినిమా అసలు కృష్ణుడు అంటే ఎవరు ఆయన లోకానికి ఏ విధంగా సహాయ పడ్డాడు అన్నది సినిమా కథ బాగుంది తప్పకుండా చూడవలసిన సినిమా కానీ నాకెందుకో కార్తికేయ 1 లో ఉన్నంత సస్పెన్స్ ఇందులో లేదనిపించింది

మొత్తానికి బాగుంది సినిమా !!!






9, ఆగస్టు 2022, మంగళవారం

"సీత రామం" సినిమా పై నా అభిప్రాయం !!!



 

 
దుల్కర్ సల్మాన్ హీరో గా హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సీత రామం ఈ సినిమా మొన్న శుక్రవారం విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం !!!
ఇందులో హీరో ఒక ఆర్మీ ఆఫీసర్ తనకంటూ ఎవరూ లేరు ఒక అనాధ ఉగ్రవాద దాడి జరగకుండా ఆపినందుకు all india radio నుండి ఒకావిడ హీరో ఇంటర్వ్యూ కి వస్తుంది అప్పడు హీరో తన గురించి అందరికీ చెబుతాడు తను ఒక అనాధ అని తనకు ఎవరు లేరు అని అప్పటి నుండి తనకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు అందులో సీత మహాలక్ష్మి తన భార్యనని ఉత్తరం రాస్తుంటుంది 
ఐతే కథ ఇక్కడినుండి కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత చూపిస్తాడు
ఇందులో రష్మీక మందన్న పాకిస్తానీ గా నటిస్తుంది అయితే తన తాత సీతామహాలక్ష్మి కి వెళ్లాల్సిన ఉత్తరం వాళ్ళ తాత దగ్గర ఉంటుంది ఐతే వాళ్ళ తాత దగ్గరికి వెళితే ఆ ఉత్తరం సీత మహాలక్ష్మి కి అందిస్తే తన తాత చివరి కోరిక కోసం హీరో, సీతామహాలక్ష్మి కోసం హైదరాబాద్ కు వస్తుంది  ఆ తరువాత అసలు రామ్, సీత లు గురించి ఏమి తెలుసుకుంది అన్నది మిగతా సినిమా కథ బాగుంది సినిమా 👍👍👍 
కథ కొంచెం ముందుకు వెనకకు వెళ్తుంది కానీ ఓవరాల్ గా బాగుంది సినిమా !!!

8, ఆగస్టు 2022, సోమవారం

బింబిసార సినిమా పై నా అభిప్రాయం !!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా వచ్చిన బింబిసార సినిమా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

బింబిశారుడు త్రిగర్తల సామ్రాజ్యం రాజు మహా క్రూరుడు తన కన్ను పడితే ప్రతి రాజ్యాన్ని తన చేజిక్కించుకునేవాడు తన స్వార్థం కోసం రాజ కాంక్ష తో సొంత తమ్ముడిని చంపే ప్రయత్నం చేశాడు తన తమ్ముడు దేవదత్తుడు వీరిద్దరూ కవల పిల్లలు కానీ ఎలాగోలా దేవదత్తుడు తప్పించుకుని తనకు ఒక మాయ దర్పణం ఒక రాక్షసుడు బహుమానం గా ఇస్తాడు దానిని దేవదత్తుడు తన అన్న అయిన బింబీ మీద ప్రయోగిస్తాడు అప్పుడు బీంబి సరుడు ఆ మాయ దర్పణం ప్రభావంతో భూలోకంలో వస్తాడు 

భూలోకంలో వచ్చిన తరువాత బింబి సారుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు భూలోకంలో విలన్ కి బింబి సారుడికి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు బాగుంది సినిమా !!!




7, ఆగస్టు 2022, ఆదివారం

నిఖిల్ కార్తికేయ 2 ట్రైలర్ చూసారా ?

 చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన కార్తికేయ 2 సినిమా త్వరలో రాబోతుంది దానికి సంబందించిన ట్రైలర్ విడుదల అయింది మీరు ఒక లుక్ వేయండి !!!


3, ఆగస్టు 2022, బుధవారం

"రామారావు on duty" సినిమాపై నా అభిప్రాయం !!!

 మాస్ మహరాజ్ రవితేజ హీరో గా వచ్చిన సినిమా రామారావు ఆన్ duty సినిమా థియేటర్ లలో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం!!!

ఇందులో హీరో నీతి నిజాయతీ గల ఒక డిప్యూటీ కలెక్టర్ తన చుట్టూ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు కానీ ఇతని వాలకం మిగతా అధికారులకు, రాజకీయ నాయకులకు నచదుఅందుకే హీరోని మాటి మాటికి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అలా చివరికి హీరో తన సొంత ఊరికి వస్తాడు అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు miss అవుతారు ఇలా ఎందుకు జరుగుతుంది 

అసలు చివరకు ఏమి జరిగింది అన్నది కథ జస్ట్ ok అంతే సినిమా !!!

30, జులై 2022, శనివారం

ఆహా లో విడుదల అయిన "షికారు" సినిమాపై నా అభిప్రాయం !!!


ఇది చిన్న పిల్లల సినిమా కాదు అలాగని పెద్దగని అలాంటి సన్నివేశాలు ఏమి లేవు అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!

 కాకినాడలో college లో ఒక నలుగురు కుర్రోళ్ళు చదువుకుంటూ ఉంటారు అందులో ఒక అబ్బాయికి ఒక పెళ్లి అయిన అమ్మాయి తన మొగుడికి తెలియకుండా చదువుకుంటూ ఉంటుంది అక్కడ పరిచయం అవుతారు ఇద్దరు 

ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పోలీస్ si అయితే తనను సరిగ్గా పట్టించుకోడు అందులో ఒక అబ్బాయికి బాగా దగ్గరవుతోంది ఇంట్లో వాళ్ళ ఆయన లేనప్పుడు ఇంటికి ఆ అబ్బాయిని రమ్మంటోంది ఇంటిలో ఇద్దరు ఉండగా ఇంతలో వాళ్ళ ఆయన వస్తాడు 

ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ చివరకు ఆ అబ్బాయి బయటకు వచ్చాడా ఆ అబ్బాయి స్నేహితులు హీరో బయటకు రావటానికి ఎలాంటి హెల్ప్ చేశారు అన్నది మిగిలిన కథ అక్కడక్కడ బోర్ కొడుతుంది సినిమా average అంతే!!!





28, జులై 2022, గురువారం

Rocketry The Mumbi effect సినిమా పై నా అభిప్రాయం !!!

బయోపిక్ సినిమాలు మరుగున పడిన కొంతమంది గొప్ప వ్యక్తులు గురించి తెలుస్తుంది అలాంటిదే ఈ సినిమా నిజంగా బాగుంది సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

నంబి నారాయణ్ ఒక రాకెట్ సైంటిస్ట్ అయితే ఆయన మన దేశానికి రాకెట్ స్వతంత్రంగా తయారు చేసి అంతరిక్షంలోకి పంపాలని  అనుకుంటాడు దాని కోసం తన ఫ్యామిలీ నీ వదులుకుని దేశం కోసం పాటు పడుతుంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో అతడిని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేస్తారు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అదోగతి చెందుతారు ఆ తరువాత అసలు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

26, జులై 2022, మంగళవారం

"పరంపర session 2" వెబ్ సెరీస్ పై నా అభిప్రాయం !!!

 నవీన్ చంద్ర,శరత్ కుమార్, జగపతి బాబు, ప్రధాన పాత్రలో చేసిన పరంపర session 1 కొనసాగింపుగా session 2 Disney+hotstar లో అందుబాటులో ఉంది session 1 లో శరత్ కుమార్ నవీన్ చంద్ర ని అరెస్ట్ చేయిస్తాడు అక్కడి నుండి 2వ పార్ట్ మొదలవుతుంది నవీన్ చంద్ర జైలుకు వెళతాడు అక్కడ మాజీ ias officer ఒక కుంభకోణం విషయంలో అరెస్ట్ అయ్యి జైల్ శిక్ష అనుభవిస్తాడు రవి వర్మ అయితే నవీన్ చంద్ర బెయిల్ పై బయటకు రావటానికి సహాయపడతాడు రవి వర్మ 

ఇక్కడి నుండి శరత్ కుమార్, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కథ కొంచం బాగానే ఉంటుంది అయితే చివరకు ఎవరు విజయం సాధించారు అన్నది కథ session 1 ముగించినట్టే session 2 కూడా మంచి సస్పెన్స్ తో ముగించారు 

Session 1 చూస్తేనే గానీ session 2 అర్థం కాదు పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!




21, జులై 2022, గురువారం

ఆహా ott లో విడుదల అయిన "సమ్మతమే" సినిమా పై నా అభిప్రాయం


 కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరో, హీరొయిన్ గా ఇటీవలే theatre లో విడుదల అయ్యి రెండు వారాలకే ott కి వచ్చిన సినిమా సమ్మతమే ఇక కథ ఏమిటో తెలుసుకుందాం 

ఇందులో హీరో వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది హీరో చిన్నప్పటి నుండి ఇంటిలో ఒక ఆడ మనిషి ఉంటే ఇల్లంతా కళ గా ఉంటుంది అని వాళ్ళ నాన్న అంటాడు అప్పటి నుండి తనకు పెళ్ళైతే ఒక అమ్మాయి తన జీవితంలోకి తన ఇంటిలోకి వస్తుందని నమ్ముతాడు ఎలాగైనా కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు అలాగే తనకి మంచి ఉద్యోగం దొరుకుతుంది 

హైద్రాబాద్ లో జాబ్ చేస్తుంటాడు అక్కడే హీరొయిన్ పరిచయం అవుతుంది ఇద్దరు ఫ్యామిలీ లో ఒప్పుకుంటారు అయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి మళ్ళీ కలుస్తారు హీరోయిన్ ఎక్కువుగా abaddalu ఆడుతుంది ఇది హీరో కి నచ్చదు అలాగే హీరోయిన్ తనకు తానే ఫ్రీడమ్ గా ఉండటం కూడా నచ్చదు ఐతే చివరకు ఏమి జరిగింది అన్నది సినిమా కథ
అంతగా ఏమి బాగోలేదు అని చెప్పాలి చెప్పుకోవడానికి కూడా ఒక సీన్ కూడా లేదు రొటీన్ గానే ఉంది 

20, జులై 2022, బుధవారం

రాయకుదురు శ్రీ మావుళ్ళమ్మ, మహాలక్ద్మీ అమ్మవారి గుడి వీడియో

 

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి గుడి వీడియో మీకోసం 

ఈ గుడికి ఒక కథ ఉంది భీమవరం మావుళ్ళమ్మ ముందర ఇక్కడ వెలిసినట్టు ఈ ఊరి గ్రామ ప్రజలను రోజుకోకరి చొప్పున నర బలి కోరుతున్నట్టు ఒక అబ్బాయి ఒక  కొరడతో కొట్టడం వలన ఈ గుడికి ఉన్న చిన్న రంద్రం ద్వారా బయటకు వెళ్లి పోయినట్టు ఒక పురాణ కథ ఉంది !!!

17, జులై 2022, ఆదివారం

మా నీళ్ల ట్యాంక్" వెబ్ సిరీస్ నా అభిప్రాయం!!!

అక్కినేని సుశాంత్ హీరో గా వచ్చిన వెబ్ సిరీస్ జీ5 ott లో అందుబాటులో ఉంది మొన్న జులై15 తేదీ నుండి అందుబాటులకి వచ్చింది ఇక కథ ఎలా ఉందో చూద్దాం !!!

అది రాయలసీమ ప్రాంతంలోని ఒక గ్రామం ఆ ఊరిలో నీటికి బాగా కరువు ఆ ఊరి సర్పంచ్ అబ్బాయి ఆ ఊరి లోని హీరోయిన్ ని లవ్ చేస్తాడు కానీ హీరోయిన్ కి అతను అంటే ఇష్టం ఉండదు అందుకు సర్పంచు అబ్బాయి ఆ ఊరి వాటర్ ట్యాంక్ ఎక్కి అందరిని బెదిరిస్తాడు ఎందుకంటే ఆ హీరోయిన్ వాడితో పెళ్లి ఇష్టం లేక అక్కడినుండి వెళ్లిపోతుంది తనని ఎలాగైనా తీసుకువచ్చి తనతో marriage చేయాలని లేదంటే అక్కడి నుండి దూకేస్తానని బెదిరిస్తాడు చేసేది ఏమిలేక సర్పంచు ఆ ఊరి si అంటే హీరోకి ఆ వర్క్ చెబుతాడు ఇదంతా జరుతున్న సమయంలో ఆ ఊరిలో కొన్ని రాజకీయాలు జరుగుతాయి ఇంతకీ హీరో, హీరోయిన్ ని తీసుకు వచ్చాడా అసలు ఈ కథ కి వాటర్ ట్యాంక్ కి ఏమిటి సంబంధం అన్నది సినిమా కథ 

అంతగా ఇంట్రెస్ట్ గా ఏమి లేదు వెబ్ సిరీస్ boaring గా ఉంది వెబ్ సిరీస్ !!!

15, జులై 2022, శుక్రవారం

సాయి పల్లవి " గార్గి" సినిమాపై నా అభిప్రాయం !!!

 


సాయి పల్లవి గార్గి సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా లో కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో సాయి పల్లవి ప్రధాన పాత్రలో చేసింది !!!
సాయి పల్లవి ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటుంది తన తండ్రి ఒక apartment లో వాచ్ మెన్ గా జాబ్ చేస్తుంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో ఒక రోజు ఎంత టైం అయినప్పటికీ తన తండ్రి ఇంటికి రాడు అసలు ఏమి జరిగింది అని చెప్పి ఆ apartment కి వెళ్లి చూసేసరికి అక్కడ తన తండ్రిని పోలీస్ లు అరెస్ట్ చేసారని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అక్కడ తన తండ్రి ఒక చిన్న పాపా మీద అత్య చారం చేసాడని అందుకే తన తండ్రిని అరెస్ట్ చేసారని తెలుస్తుంది తన తండ్రి అలాంటి వాడు కాదని ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోరు చివరకు కోర్ట్ కు వెళ్తుంది అక్కడ ఎవరు తన తండ్రి తరపున వాదించే వారు ఉండరు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేసింది చివరకు తన తండ్రికి న్యాయం జరిగిందా అన్నది సినిమా కథ 
బాగుంది సినిమా చూడ వచ్చు సాయి పల్లవి మంచి కథనే ఎన్నుకుంది 👍👍👍

12, జులై 2022, మంగళవారం

అహలో విడుదల అయిన " గుల్తు" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది కన్నడ సినిమా ఆహా ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్లిపోదాం !!!

ఈ కథ లో హీరో ఒక అనాధ చదువులో బాగా చదివేవాడు hacking చేయటం లో దిట్ట  ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తూనే ఒక కాఫీ షాప్ లో జాబ్ చేస్తుంటాడు హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతని పేరు ఆస్తి అయితే తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఒక అమ్మాయి పిలిచింది అని ఒక ఫ్లాట్ లోని అమ్మాయిని కలవడానికి వెళ్తాడు అయితే ఆ ఫ్లాట్ పక్కన ప్లాట్ లో ఒక హత్య జరుగుతుంది అయితే ఆ కేస్ ఆస్తి మీదకు వస్తుంది ఆస్తి, హీరో ఒకే రూమ్ లో కలిసి ఉంటారు పోలీస్ లు వారిని అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడతారు కానీ వాళ్లకు ఏమి తెలియదు అంటారు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది హీరో మొత్తం దేశంలోని అందరి ఆధార్ కార్డ్ లు స్కాం చేస్తాడు

దానిని నిరూపించడానికి హీరోయిన్ మొదట్లో ఇన్స్టిట్యూట్ లో టీచర్ గా జాయిన్ అవుతుంది ఆ ఆతరువాత హీరోని అరెస్ట్ చేసిన తరువాత తెలుస్తుంది హీరోయిన్ స్పెషల్ సైబర్ క్రైమ్ ఆఫీసర్ అని ఇంతకీ హీరో అందరి ఆధార్ కార్డ్ స్కాం చేశాడా అసలు ఎందుకు చేయాల్సి వచ్చినది అన్నది మిగతా కథ 

పర్వాలేదు బాగానే ఉంది ఒక సారి చూడవచ్చు కాకపోతే కథ అంతగా ఇంట్రెస్టిటింగ్గ్ గా ఉండదు సో స్లోగా వెళ్తుంది కథ !!!

11, జులై 2022, సోమవారం

"జై బజరంగీ" సినిమా పై నా అభిప్రాయం !!!

శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన కన్నడ సినిమా బజరంగీ సినిమా ఆహా ott లో అందుబాటులో ఉంది

 ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో రెండు పాత్రలు చేసాడు మొదటిది అంజి పాత్ర వాళ్ళ అక్కని కలుసుకోవడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు అక్కడే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు వాళ్ళ అక్క కూడా లవ్ marrige చేసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి జీవిస్తారు  అంత కథ సుకాంతం అనుకునే టైం లో ఒక విలన్ ఆ ఊరిలో ఉన్న జనాల్ని అందరిని తన స్థావరనికి బందీలుగా తీసుకెళ్లి పోతాడు అప్పుడు హీరో అడ్డు పడిన సరే హీరోని కొట్టి మరి తీసుకెళ్లిపోతాడుచివరకు హీరో ఆ ఊరి దేవుడి ముందు ప్రాణాలు వదిలేస్తాడు 

అప్పుడే ఒక స్వామీజీ అసలు కథ ఏమిటో చెబుతాడు హీరో అంజి కంటే ముందు బజరంగీ అనే ఒకాయన ఉండేవాడు అడవి ప్రాంతంలో ధన్వంతరి వంశస్తులు కొంతమంది ని తమ ఆయుర్వేద వైద్యంతో నయం కానీ ఎన్నో జబ్బుల్ని నయం చేస్తుంటారు వాళ్ళందరిని ఒక విలన్ చేతిలో  నుండి వారిని కాపాడి వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండేలా చేస్తాడు అది నచ్చని ఆ విలన్ కొడుకు బజారంగిని విషం పెట్టి చంపేస్తాడు 

అయితే ఈ కథలో అసలు అంజికి, బజరంగీ ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ మరి అంత బాగుంది అని చెప్పలేము బాగోలేదు అని చెప్పలేము average గా ఉంది సినిమా !!!

Anya's Tutorial వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!!!

ఆహా ott లో విడుదల అయిన anyas Tutorial వెబ్ సిరీస్ హార్రర్ కథాంశంతో విడుదల అయింది ఇక కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇది కరోనా లాక్ డౌన్ టైం లో జరిగినట్టు చూపించారు ఒక అమ్మ, ఇద్దరు కూతుళ్లు పెద్ద అమ్మాయి మధు, రెండవ అమ్మాయి లావణ్య అదే అన్య అయితే వీళ్లిద్దరి మధ్య చిన్నప్పటి నుండి గొడవలు జరుగుతుండేవి అయితే అనుకోకుండా చిన్న అమ్మాయి వేరే ఫ్లాట్ చూసుకుని వెళ్ళిపోతుంది అక్కడే ఉంటుంది అక్క ఫోన్ చేసి పిలిచిన రాదు అక్కడే సోషల్ మీడియా లో వీడియోలు అప్లోడ్ చేస్తూ follwers ని పెంచుకుంటుంది అయితే ఆ వీడియోలు తను ఉండే ఫ్లాట్ లో దెయ్యం ఉందని అందరిని నమ్మించి మోసం చేస్తుంది ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే అది చివర క్లైమాక్స్ లో చూడాలి పర్వాలేదు కానీ మరి ఓవర్ expectationsతో చూడొద్దు ఒక సారి చూడ వచ్చు కాకపోతే అక్కడక్కడ కొద్దిగా స్లో గా నడుస్తుంది కథ !!!

7, జులై 2022, గురువారం

మయోన్ సినిమాపై నా అభిప్రాయం !!!

 

మయోన్ సినిమా బాహుబలి కట్టప్ప తనయుడు సిబి సత్యరాజ్ హీరోగా వచ్చిన సినిమా ఈ రోజు విడుదల అయింది ఇంతకుముందు దొర సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఇప్పుడు మయోన్ సినిమా లో తెలుగులో కూడా విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!
ఇందులో హీరో పురాతన శాఖ లో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు అందరితోనూ పురాతన వస్తువులు మనం కాపాడుకోవాలని చెప్పి అందులోని విలువైన వస్తువుల్ని విదేశాలకు అమేస్తుంటాడు ఆలా వస్తువులు అమ్మే మరొక వ్యక్తి తో కలిసి వస్తువులు విదేశాలకు అమ్ముతుంటాడు
ఇలా కాలం జరుగుతున్న క్రమంలో మయోన్ అనే ఆలయం వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం అందులో అపారమైన నిధులు ఉన్నాయి అని వీళ్లిద్దరూ అక్కడకు వెళ్తారు అయితే అక్కడ ఏమి జరిగింది అసలు ఆ గుడిలో ఏమి ఉంది అన్నది మిగతా కథ ట్రైలర్ చూసి బాగానే ఉంటుంది అని చూసా బట్ average అంతే గ్రాఫిక్స్  అంతగా ఏమి లేదు సోసోగా ఉంటుంది ఎదో ఉందని ఊహించుకుని మాత్రం సినిమా చూడొద్దు జస్ట్ టైం పాస్ కోసం చూడండి అంతే !!!

3, జులై 2022, ఆదివారం

" పక్కా కమర్షియల్" సినిమా పై నా అభిప్రాయం !!!

 గోపి చంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్ లుగా మారుతి డైరెక్షన్ లో థియేటర్ లలో విడుదల అయిన పక్కా కమర్షియల్ సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

మారుతి సినిమాలు కామెడీ పరంగా బాగుంటాయి ఇందులో హీరో వాళ్ళ నాన్న సత్య రాజ్ మంచి పేరున్న జడ్జి అయితే తాను ఇచ్చిన ఒక తీర్పు వలన ఒక అమ్మాయి చనిపోతుంది అయితే ఆమెకు సరి అయిన న్యాయం చేయలేక పోయానని జడ్జి పదవికి రాజీనామా చేస్తాడు సత్యరాజ్ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు అయితే ఇందులో హీరో గోపి చంద్ పక్కా కమర్షియల్  డబ్బు కోసం ఎలాంటి కేస్ నైన టేక్ up చేస్తాడు ఇందులో హీరో లాయర్ అయితే తన తండ్రి సత్యరాజ్ కి రావు రమేష్ కి కేస్ ని హీరో టేక్ up చేస్తాడు 

అయితే ఇందులో ఎవరు గెలిచారు హీరో నా తన తండ్రి సత్య రాజ్ ఎవరు గెలిచారు ఇంతకీ సత్య రాజ్ కి, రావు రమేష్ కి ఏమిటి గొడవ ఆ కేస్ ని గోపి చంద్ డబ్బు కోసం తన తండ్రి కి ఎందుకు వ్యతిరేకంగా వాదిస్తున్నాడు అన్నది మిగిలిన సినిమా కథ !!!

29, జూన్ 2022, బుధవారం

కమల్ హాసన్ " విక్రమ్" ott విడుదల ఎప్పుడో తెలుసా మీకు !!!

 లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన విక్రమ్ సినిమా మంచి విజయం సాధించింది

కమల్ హాసన్ కి మంచి విజయాన్ని అందించింది లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా విక్రమ్ అయితే ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ott లో అందుబాటులో కి జులై 8 తేదీనుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!

28, జూన్ 2022, మంగళవారం

"Nenjuku Needhi" సినిమాపై నా అభిప్రాయం !!!

nenjuku needhi ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా ఉదయ నిధి స్టాలిన్ హీరో గా చేసిన సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో police Asp అయితే తనని కులాలు గురించి గొడవలు పడుతూ ఉంటారు అలాటి ఊరిలోకి హీరో వెళ్తాడు అయితే అప్పుడే ఒక ముగ్గురు తక్కువ కులంలో పుట్టిన ముగ్గురు అమ్మయిలు కనబడకుండా పోతారు అయితే అందులో ఇద్దరిని ఉరి వేసి చెట్టుకు వెలాడు తీస్తారు అయితే ఆ మూడో అమ్మాయి ఏమైనది అసలు ఆ ఊరిలో ఉన్న ప్రజలే కాకుండా పోలీసుల్లో కూడా కులాలు గురించి హెచ్చు తగ్గులు చూపిస్తారు ఇలాంటి పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కువున్నాడు

అక్కడ ఉన్న పరిస్తుతుల్ని ఎలా సరిదిద్దాడు అన్నది మిగిలిన కథ పరవాలేదు బాగానే ఉంది average !!!

26, జూన్ 2022, ఆదివారం

చోర్ బజార్ సినిమా పై నా అభిప్రాయం !!!

 చోర్ బజార్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన సినిమా చోర్ బజార్ మొన్న శుక్రవారం థియేటర్ లలో విడుదల అయినది ఇక ఈ సినిమా కథ క్లుప్తంగా చూద్దాం !!!

 చోర్ బజార్ ఇది మనం ఎక్కడో విన్నట్టు ఉంది కదా ఇది సినిమాలో చోర్ బజార్ ఉంటుంది దానిని మన హీరో కంట్రోల్ లో ఉంటుంది అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది చిన్నప్పటి నుండి ప్రేమిస్తాడు తనకు మాటలు రావు ఇలా కథ జరుగుతుండగా ఒక మ్యూజియం లో ఒక 200 కోట్లు విలువ చేసే ఒక వజ్రం అపహరణకు గురవుతుంది  

అసలు ఆ వజ్రం ఎవరు కొట్టేశారు ఆ వజ్రానికి హీరో కి సంబంధం ఏమిటి చివరకు కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథలో కొత్తదనం ఏమి లేదు జస్ట్ బీలో average అంతే ఈ సినిమా !!!

25, జూన్ 2022, శనివారం

అంటే సుందరానికి Ott Release ఎప్పుడో తెలుసా ?

 Natural స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి విడుదలై 15 రోజులు అవుతుంది అయితే ఈ సినిమా జులై మొదటి వారంలో ott netflix లోఅందుబాటులో ఉంటుంది !!!

24, జూన్ 2022, శుక్రవారం

జీ5 ott లో విడుదల అయిన " రెక్కీ" వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 

ఇది జీ5 ott లో అందుబాటులో ఉందిఇక ఈ వెబ్ సిరీస్ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

తాడి పత్రి లో మున్సిపల్ చైర్మన్ వరదరాజులు ఉంటాడుఅదే ఊరిలో si లెనిన్ ఉంటాడు అయితే ఈ వెబ్ సిరీస్ మొదటలో ఒక వ్యక్తికి ఆ వరద రాజులుని చంపడానికి మరొక వ్యక్తి సూపరి ఇస్తాడు అయితే ఒక మున్సిపల్ చైర్మన్ చంపడం అంత easy కాదు కదా అందుకే ఆ వ్యక్తి తో పాటు చంపడంలో మంచి నైపుణ్యం ఉన్న మరో నలుగుర్ని చూసుకుంటారు

మొత్తం ఈ నలుగురు వరద రాజులుని చంపడానికి రెక్కీ మొదలు పెడతారు ఒక  సందర్భం లో చంపడానికి స్కెచ్ వేస్తారు కానీ అది మిస్ అవుతుంది అప్పుడే అర్థం అవుతుంది 

వరద రాజులుని చంపమని చెప్పింది సూపరి ఇచ్చింది వరద రాజులు కొడుకు చలపతి అని అసలు తన కన్న కొడుకు వరద రాజులుని ఎందుకు చంపాలనుకున్నాడు అయితే చివరికి వరద రాజులుని చంపేస్తారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది చలపతి కూడా ఒక 6 నెలలు తరువాత చనిపోతాడు 

ఈ కేస్ ని si లేనిని సాల్వ్ చేస్తాడు పరవాలేదు బాగానే ఉంది చూడ వచ్చు 3 గంటలు పైనే ఉంది బోర్ కొట్టదులే బాగానే ఉంది వెబ్ సిరీస్ 👍!!!

20, జూన్ 2022, సోమవారం

" అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన సుజల్ వెబ్ సిరీస్ పి నా అభిప్రాయం !!!

ఇది తమిళ్ డబ్బింగ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 గంటలు పైనే ఉంది ఇక అసలు కథ ఏమిటో చూద్దాం !!!

ఒక ఊరిలో అమ్మవారి జాతర జరుగుతుంది అలాగే ఆ ఊరిలో ఒక ఫ్యాక్టరీ లో ఫైర్ accident జరిగి మొత్తం కాలిపోతుంది ఆ ఫ్యాక్టరీ లో పనిచేసే union  leader షణ్ముగం తమ తోటి కార్మికులు కోసం పోరాడుతుంటాడు అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో షణ్ముగం చిన్న కూతురు కనబడకుండా పోతుంది 

ఆ ఊరిలోని రెజినా అనే పోలీస్ ci పనిచేస్తుంటుంది తన కింద si చక్రవర్తి పనిచేస్తుంటాడు అతడే హీరో అసలు ఆ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం ఎవరు చేశారు, షణ్ముగం చిన్న కూతురు ఏమైంది, అసలు కథ ఏమిటి అన్నది చాలా ఆసక్తి గా బాగానే ఉంది మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్  ఒక వెబ్ సిరీస్ పై 6 గంటలు చడాలంటే ఎంత గ్రిప్పింగ్ గా ఉండాలి కథ అలాగే ఉంది బాగుంది మీరు కూడా చూడండి !!!

17, జూన్ 2022, శుక్రవారం

సత్య దేవ్ " గాడ్సే " సినిమా పై నా అభిప్రాయం !!!

 సత్య దేవ్ టాలీవుడ్ నటులలో ఒక విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తుంటాడు ఒక మంచి నటుడు ఇక సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమా ఇవాళ విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో మూడు ముక్కల్లో చెప్పుకుందాం !!!

మీకు నారా రోహిత్ ప్రతినిధి సినిమా చూసారా same కాకపోయినా కొద్దిగా అలాగే ఉంటుంది సినిమా కొంతమంది రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని kidnap చేస్తాడు హీరో ఈ కేస్ ను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువువంటి హీరోయిన్ కి అప్ప చెబుతారు అయితే తాను ఇంతకుముందు టేక్ up చేసిన కేస్ లో ఒక గర్భిణీ చనిపోతుంది అప్పటి నుండి ఉద్యోగం మానేస్తుంది  ఆ తరువాత మరలా ఇదే కేస్ టేక్ up చేస్తుంది అయితే హీరో ఎందుకు ఇలాగ ప్రముఖుల్ని kidnap చేసాడు అసలు అతని లక్ష్యం ఏమిటి అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ఎందుకు ఇలా తయారు అయ్యాడు 

ప్రస్తుతం మన సమాజంలో రాజకీయ నాయకులు నిరుద్యోగులుతో ఎలా అడ్డుకుంటున్నారు అన్నది సినిమా కథ పరవాలేదు బాగానే ఉంది  expectations తో వద్దు మాములుగా చూడండి సినిమా !!!

"Innale vare" సినిమా పై నా అభిప్రాయం !!!

Innale vare మలయాళ డబ్బింగ్ సినిమా సోనీ లివ్ ott లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పడు చూద్దాం !!!
ఒక హీరో ఉంటాడు బయట అప్పుడప్పుడే సినిమాలో ఎదుగుతున్న హీరో కానీ అతడు చేసిన కొన్ని సినిమాలు సరిగ్గా ఆడక అప్పులు బాధలు ఎక్కువ అవుతాయి కాకపోతే అవి బయట ఎవరికి తెలియవు ఇలా హీరో తన వ్యక్తిగత విషయాలు జరుగుతాయి కానీ అప్పుడే హీరోని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా తెలివిగా kidnap చేస్తారు తనను విడుదల చేయాలంటే తమకు ఒక కోటిన్నర ఇవ్వాలని హీరోకి చెబుతాడు 
తన దగ్గర డబ్బులు లేవన్న సరే వాళ్ళు వినరు 
చివరకు వాళ్ళ దగ్గర నుండి హీరో ఎలా బయట పడ్డాడు అసలు ఆ హీరోనే ఎందుకు kidnap చేశారు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ ఫస్ట్ లో స్లో గా ఉన్న తరువాత జరిగే కొద్దీ కథ మంచి ఆసక్తిగా ఉంటుంది మొత్తానికి పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

 

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...