30, జూన్ 2021, బుధవారం

" బాలా " పరదేశి సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ డైరెక్టర్ బాలా సినిమా చూడాలంటే ఒక విధమైన ఆర్ట్ ఉండాలి నిజంగా నిజాన్ని తనదైన శైలిలో ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు

జీవితాలను కళ్లెదుటే కట్టినట్టు చూపిస్తాడు ఇక 2013 వ సంవత్సరంలో విడుదల అయిన పరదేసి సినిమా ఒక అద్భుతం

ఇక కథ విషయానికి వస్తే స్వాతంత్ర్య రాక ముందు బానిస బతుకులు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం దక్షిణ భారతదేశంలో సాలూరు అనే ఒక ఊరిలో కొండ జాతి ప్రజలు నివాసిస్తుంటారు 

వారికి డబ్బులు, ఆశ చూపి ఒక దళారి టీ ఎస్టేట్ లో రాళ్లు రప్పలతో కూడిన ప్రదేశాలు చదును చేయటం ఆ ఎస్టేట్ లోకి వస్తే పైకి పోవటం తప్పించి బయట పడలేం అదే ఈ సినిమా కథ

నిజంగా డైరెక్టర్ బాలా గారికి హ్యాట్సాఫ్ cheppali commercial సినిమాలు చూసి చూసి విసిగి చెందినవారికి బాలా సినిమాలు చూపించాలి

జీవితం నిజంగా ఇంత దుర్భరంగా ఉంటుందా అని  పిస్తుంది బాలా సినిమాలు ,శివ పుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని , ఇలా చాలా సినిమాలు ఉన్నాయి 

ఈ సినిమాలు చూసినప్పుడు ఆ రోజు లేదా రెండు రోజులు ఆ సినిమా కథ గురించి ఆలోచిస్తాం అలా ఉంటాయి మరి సినిమాలు 

ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది చూడవలసిన వారు ఒక సారి చూడండి !!!

29, జూన్ 2021, మంగళవారం

" jeepers creepers " సినిమా పై నా అభిప్రాయం !!!

 Jeepers creepers సినిమా హాలీవుడ్  సినిమా హార్రర్ సినిమా 

ఇక కథ విషయానికి వస్తే అడవి దారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని చంపేసే ఒక నర హాంతకుడి కథ హంతకుడు మనిషి కాదు గబ్బిలంగా ఉంటాడు ఆకారం దీనిని పార్ట్ పార్ట్ లుగా తీశారు

చూడటానికి సస్పెన్సు థ్రిల్లర్ గా బాగుంది సినిమా హార్రర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది

మంచి థ్రిల్ ఉన్న సినిమా బాగుంది చూడండి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి ఈ సిరీస్

మొదటి పార్ట్ కొనసాగింపుగా 2 వ పార్ట్ కూడా ఉంటుంది 3వ పార్ట్ కూడా ఉంది !!!

ఆనందయ్య మందు వాడే పద్దతి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !!!

 కరోనా నివారణకు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందని ఆ నోటా ఈ నోటా పాకీ వార్తల్లో వింటూ చివరికి మా ఊరు వచ్చింది ఆ మందు ఇవాళ ఉదయం వేసుకున్నాను

గోంగూర పచ్చడి మాదిరి పుల్ల పుల్లగా ఉంది ఇక దానికి సంబంధించి వాడే పద్దతి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీటి లో ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం !!!

1. మందు "బఠాని గింజంత" తీసుకుని నాలుకపై పెట్టుకుని చప్పరించి తరువాత మంచి నీరు తాగాలి,

2.ఉదయం ,రాత్రి 2 రోజులు వాడాలి

3.మందు వేసుకునే ముందు ఒక గంట ఏమి తిన రాదు,త్రాగ రాదు

వేసుకున్న తరువాత 1 గంట ఏమి తిన రాదు, త్రాగ రాదు

4.ఒక ప్యాకెట్ మందు ఐదుగురు కి సరిపోతుంది 

5.మందు తీసుకునే రెండు రోజులు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి, పల్చటి మజ్జిగ త్రాగాలి, మాంసాహారం తీసుకోరాదు

6.7 సంవత్సర లోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, మెన్సస్ సమయంలో స్త్రీలు వాడ రాదు

7.మందు ఫ్రిడ్జ్ లో ఉంచరాదు , అలాగే 3 రోజులు మించి నిలువ ఉంచారాదు

8.వేరే జబ్బులున్నవారు ఆ మందులకు ఈ ముందుకు కనీసం 1 గంట సమయం వ్యవధి ఉండాలి

9 మందు ప్యాకెట్ నుండి తీసి ఎండలో కానీ,గాలిలో గాని అరబెడితే మంచిది

10. ఈ రెండు రోజులు టీ, కాఫీ లు త్రాగ రాదు

  ఈ పద్ధతులు పాటిస్తే మంచిది అని చీటిలో రాసి ఉంది ఏది ఏమైనా ఉచితంగా వస్తుంది కాబట్టి ఏ పుట్టాలో ఏమి పాము ఉందొ తెలియదు కాబట్టి ఒకసారి ప్రయత్నిస్తే తప్పు లేదు ఏమంటారు ?

27, జూన్ 2021, ఆదివారం

ఆస్కార్ అవార్డ్ కి ఎంపిక అయిన " విచారణ" సినిమా పై నా అభిప్రాయం !!!

 విచారణ ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ మూవీ ఈ కథ ఒక ఆటో డ్రైవర్ రాసిన నవల నుండి తీసింది ఈ సినిమా చూస్తే మీకు పోలీస్ ఇంత దారుణంగా ఆలోచిస్తారా అనిపిస్తుంది అసలు కథ ఇప్పుడు చూద్దాం

పని కోసం పొరుగు రాష్ట్రం నుండి 4 గురు యువకులు వచ్చి పనిచేస్తుంటారు అయితే వారికి ఉండటానికి ఇల్లు ఉండదు పార్క్ లో పడుకుని అక్కడే స్నానము చేసి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తారు అయితే అనుకోకుండా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు చేస్తారు ఒక దొంగతనం కేస్ లో వాళ్ళని ఇరికిద్దామని అయితే ఎంత చిత్ర హింసలు పెట్టిన వాళ్ళు ఒప్పుకోరు 

ఆ తరువాత వల్ల జీవితాలు ఎలా మారాయి అన్నది కథ చూస్తున్నంత సేపు పోలీస్ లు వాళ్ల స్వార్థం కోసం సామాన్యుల జీవితాలతో ఇలా ఆడుకుంటారా అనిపిస్తుంది 

ఈ కథ నిజంగా జరిగినట్టుంది చివరిలో చూపిస్తాడు డైరెక్టర్ !!!

మేటి మాట !!!


 

25, జూన్ 2021, శుక్రవారం

దండుపాళ్యం 1,2,3, సినిమా లపై నా అభిప్రాయం !!!

 దండుపాళ్యం మొదటి పార్ట్ చూసినప్పుడు ఎప్పుడో 2013 లో చూసాను దండుపాళ్యం 2,3 సినిమాలు ఈ రెండు రోజుల్లో చూసాను

ఎప్పుడో వచ్చిన సినిమాలు కానీ ఇప్పుడు చూసాను ఏమి సినిమాలు రా బాబు మైండ్ పోతుంది లోపల 😱 మొదటి పార్ట్ లో అసలు దొంగతనాలు, రేప్ లు ఎలా చేసేవారు అని చూపించారు నిజంగా మొదటి పార్ట్ చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే భయంవేసింది నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అని మొదటి పార్ట్ లో వారిని పోలీస్ ఆఫీసర్ వాళ్ళను పట్టుకుంటాడు

ఇక రెండవ పార్ట్ లో వాళ్ళకి ఉరి శిక్ష పడేలా చేస్తాడు ఇంతలో ఒక జర్నలిస్ట్ వాళ్ళను అమాయకులు ను చేసిపోలీసులు వారిని ఇరికించారు అని వల్ల దగ్గర అసలు  జరిగింది ఏమిటి అని వాళ్ళని అడుగుతుంది వాళ్ళు మేము అమాయకులు అని కథలు చెబుతారు వాళ్ళను నమ్మి జర్నలిస్ట్ వాళ్ళ మీద సానుకూలంగా క్రైమ్ స్టోరీ రాస్తోంది

ఇక మూడవ పార్ట్ లో అసలు ఈ హంతకులు ఎవరు వీళ్ళ పుట్టుపూర్వోత్తలు గురించి ఆ జర్నలిస్ట్ చెబుతాడు పోలీస్ ఆఫీసర్ 

మొత్తానికి సినిమా మొదటి పార్ట్ చూసినవారికి రెండు, మూడు పార్ట్ లు పెద్ద భయంగా లేవు కానీ ఈ సినిమా పెద్దవారు మాత్రమే చూడాలి !!!


22, జూన్ 2021, మంగళవారం

ధనుష్ " జగమే తంత్రం " సినిమా పై నా అభిప్రాయం !!!

 ధనుష్ సినిమా అంటే ఒక రక మైన సినిమాలకు పెట్టింది పేరు ఇక netflix లో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు ఎలాగా ఉందొ చూద్దాం !!!

సుర్లి (ధనుష్) ఒక మీడియం రేంజ్ డాన్ అక్కడ జరుగుతున్న చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అయితే అక్కడి నుండి కొన్నాళ్ళు దూరంగా వెల్దామని అనుకుంటాడు

ఇంతలో అనుకోకుండా లండన్ లో నుండి పిలుపు వస్తుంది అక్కడకు ప్రయాణమవుతాడు అక్కడ కూడా చిన్న చిన్న గ్యాంగ్ వార్ లతో మొదలైన తన జీవితం స్థిరపడలనుకుంటాడు అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది అయితే అనుకోకుండా అక్కడ ఇతర దేశాలు నుండి వచ్చిన శరణార్థులు హక్కులు కోసం పోరాటం చేసే శివ దాస్ ధనుష్ వల్లనే చనిపోతాడు అయితే ఆ విషయం తెలుసుకున్న మారుతాడు 

ఆ తరువాత ఏమి జరిగింది అన్నది కథ మొత్తం సినిమా నిడివి 2 గంటల 38 నిమిషాలు ఒక రొటీన్ కథే కొత్తగా చెప్పటానికి ఏమి లేదు 

సదా సీదా సినిమా బోర్ కూడా కొడుతోంది సినిమా !!!

19, జూన్ 2021, శనివారం

ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు !!!

 ఏపీలో ఉదయం 6 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సమయాన్ని పెంచింది జూన్ 20 తరువాత ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చారు

అయితే దుకాణాలన్ని సాయంత్రం 5 గంటలకు మూసివేసి 6 గంటల నుండి కర్ఫ్యూ అమలులో ఉంటుంది అయితే ఈ సమయం మార్పులు జూన్ 30 వరకు అమలులో ఉంటుంది 

తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి 2 గంటలు వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు ఎందుకంటే అక్కడ పొజిటివిటీ రేటు ఎక్కువుగా ఉన్నందువల్ల 

ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం regular  టైమింగ్స్ అమలువుతాయి !!!

18, జూన్ 2021, శుక్రవారం

"ష్ ఏమి రేట్లు రా బాబు !!!

 నిద్ర లేచినప్పటునుండి తిరిగి నిద్ర పోయేంత వరకు మనిషికి ఎన్నో పనులు, మరెన్నో ఖర్చులు ,కొన్ని పలకరింపులు, కొన్ని చీత్కరాలు, ఇలా ఎన్నో మరెన్నో మనిషి జీవితంలో ప్రతి రోజు ఏదొక అసంతృప్తి

ఇప్పుడు అయితే ఇంకా దారుణం రేట్లు చూస్తే గుండె గుబేలు అవుతుంది పెట్రోల్ మంట, నూనె రేటుల మంట, కరెంట్ బిల్లుల మోత, గ్యాస్ బండ రేటు, ఇలా ఒకటేమిటి మనిషి ఇంటి నుండి అడుగు బయటకు పెట్టినప్పటి నుండి తిరిగి ఇంటి కొచ్చే వరకు ఎన్నో ఖర్చులు, మరెన్నో వ్యయాలు కాస్తో కూస్తో ఆస్తి పరులు అయితే పర్వాలేదు

అసలు పూట గడవటం వారి పరిస్థితి ఏమిటి ఏమి లేక పోయినా పర్వాలేదు కానీ మధ్య తరగతి జీవితాలు అటు పైకి ఎగరలేక,ఇటు కిందకి దిగ జారక  ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియదు !!!

16, జూన్ 2021, బుధవారం

" ఫియర్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఫియర్ అంటే తమిళ్ డబ్బింగ్ సినిమా ఒక థ్రిల్లర్ సినిమా ఇక కథ విషయానికి వస్తే

హీరో ఒక రైటర్ అతని భార్య ఒక కంపెనీ లో జాబ్ చేస్తుంటుంది అయితే హీరో ఏమి జాబ్ చెయ్యడు హీరో తాను రాస్తున్న కథలు ప్రచురించడానికి పబ్లిషర్స్ అంతగా ఇష్టం చూపించరు అందుకే హీరో ని ఒక థ్రిల్లర్ కథతో రమ్మని చెబుతారు

హీరో కథ కోసం అరకు వాలీ వెళ్తాడు అయితే అనుకోకుండా అక్కడ తాను రాస్తున్న కథకు సంబంధించి ఒక సైకో తనను హత్య చేయటానికి ప్రయత్నిస్తాడు 

ఇంతలో హీరోయిన్ కూడా అక్కడకు వస్తుంది తన మీద కూడా హత్య ప్రయత్నం జరుగుతుంది ఇంతకీ ఆ హంతకుడు ఎవరు వాళ్ళిద్దరిని ఎందుకు చంపుతున్నాడు అన్నది మిగిలిన కథ

అంతగా బోరింగ్ గా ఏమి ఉండదు అలాగని మరి అంతా ఆసక్తిగా ఉండదు పరవాలేదు ఒక సారి చూడొచ్చు సినిమా కానీ మరీ అంత expertation పెట్టుకోకండి

ఓ లుక్ వెయ్యండి

అన్నట్టు ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అది ఇప్పుడు మీకు చెబుతున్న కథను మొత్తం మారి పోతుంది

కానీ సినిమా రౌటీన్ కి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా !!!

11, జూన్ 2021, శుక్రవారం

"అర్థ శతాబ్దం " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా ott లో విడుదల అయిన అర్థ శతాబ్దం సినిమా ఈ రోజు విడుదల అయ్యింది c/o కంచర పాలెం ఫేమ్ కార్తీక రత్నం హీరో గా విడుదల అయిన సినిమా 

ఇక ఈ సినిమా కథ ఎలాగా ఉందొ ఇప్పుడు చూద్దాం అది 2003 వ సంవత్సరం స్వాతంత్య్రం వచ్చి దాదాపు 50 సంవత్సరాలు దాటినా ఒక ఊరిలో కులాల కుమ్ములాటలు, ఘర్షణలు మధ్య ఒక ప్రేమ కథ 

హీరో వాళ్ళ ఊరిలో కరెంట్ పని చేస్తూ దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి వాళ్ళ అమ్మని, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు

ఇంతలో ఆ ఊరిలో ఉన్న హీరోయిన్ తో చిన్నప్పటి నుండి ప్రేమలో ఉంటాడు ఆ విషయం హీరోయిన్ కి చెబుదామని అనుకుంటాడు కానీ కుదరదు 

ఒక చిన్న గొడవ వల్ల ఆ ఊరి మొత్తం కులాలు గురించి దెబ్బలెడుకుంటరు అయితే చివరికి వల్ల ప్రేమ నెగ్గిందా, లేదా ఏమి జరిగిందా అన్నది సినిమా కథ

చూడటానికి రొటీన్ గా ఉన్న కథ పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు మరి అంతా దారుణంగా లేదు !!!

10, జూన్ 2021, గురువారం

" Iru dhuruvam" వెబ్ సిరీస్ సీజన్ 1 పై నా అభిప్రాయం !!!

 ఈ వెబ్ సిరీస్ నిడివి 3 గంటల 30 నిమిషాలు  కానీ ఇక్కడ ఎక్కడ బోర్ అనిపించదు క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి నచుతుంది

సీరియల్ కిల్లర్ కి, పోలీస్ ఆఫీసర్ కి మధ్య జరిగే డ్రామా చాలా బాగుంటుంది

అసలు ఎందుకు చంపుతున్నాడు అన్నది సస్పెన్స్ తో చివరికి చంపేది ఒకడు కాదు ఇద్దరు అనేది లాస్ట్ సస్పెన్సు తో 2 పార్ట్ రాబోతుంది 

చూడటానికి బాగుంది మీరు చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్సైట్మెమెంట్ట్ బాగుంది చూడండి !!!

7, జూన్ 2021, సోమవారం

"కాలా" సినిమాపై నా అభిప్రాయం !!!

 ఇది ఆహా ott లో విడుదల అయ్యింది మలయాళం డబ్బింగ్ సినిమా ఇది tavino thomos హీరోగా నటించాడు ఇక కథ గురించి తెలుసుకుందాం

హీరో , అతని భార్య, హీరో తండ్రి , ఒక కొడుకు ఈ నలుగురు ఒక ఇంటిలో ఉంటారు ఆ ఇంటి చుట్టూ తోటలు ఉంటాయి హీరో తోటలోకి కొంతమంది పనికి వస్తారు వాళ్లలో ఒకడు హీరో ని చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే అలా ఎందుకు జరిగిందంటే

హీరో ఒక సారి మాంసపు ముద్దలో నాటు బాంబ్ పెట్టి ఒక కుక్కను చంపుతాడు ఆ కుక్క తన మీద హత్య ప్రయత్నం చేసినా వ్యక్తిది 

మిగిలిన కథ అంత వాళ్లిద్దరూ కొట్టుకోవడం సరిపోతుంది చివరికి ఏమైంది అన్నది కథ ఒక పిచ్చ సినిమా ఇది అంటే ఒక సైకో మూవీ ఇది

సినిమా అంతా ఆ ఇంటి చుట్టూ, తోటలోనే జరుగుతుంది ఫైటింగ్ చాలా natural గా ఉంటాయి కానీ బోర్ కొడుతున్నది సినిమా !!!

6, జూన్ 2021, ఆదివారం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చెయాలి ( వీడియో)

 వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఫస్ట్ డోస్ వేసిన తరువాత రెండోవ డోస్ ఎస్టీమషన్ date తో ఒక సర్టిఫికెట్ ఇస్తారు 

దానిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో లో చూడండి 👇👇👇

వారానికి ఒక రోజు సరదాగా సెలవు !!!

 మనం ఏ పని చేసిన వారాంతపు సెలవు ఖచ్చితంగా ఉండి తీరాలి లేదంటే అలసట, కోపం మాములుగా ఉండదు మరి

ఉద్యోగంలో చికాకులు, ఒత్తిళ్లు, టార్గెట్ లు ఒకటేమిటి అలాగే వ్యాపారంలో కూడా వారాంతంలో ఖచ్చితంగా ఒక రోజు సెలవు ఉండాలి 

లేదంటే రిలీఫ్ ఉండదు చేసే పని మీద ఆసక్తి కూడా తగ్గుతుంది ఆశించిన స్థాయిలో పని చేయలేము 

ఏదొక పని మీద ఆసక్తి కూడా అవసరమే అంటే మన hobbies గురించి నేను చెప్పేది పెయింటింగ్స్ వేయటం,సినిమాలు చూడటం, పాటలు వినటం, బుక్స్ చదవటం లాంటివి 

ఇవి మనకు కొంచెం ఉప సమానాన్ని కల్గిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే రోజువారీ పని మీద అప్పుడప్పుడు విరామం కూడా ఉండాలి !!!

3, జూన్ 2021, గురువారం

"ఏక్ మినీ కథ" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది ఈ సినిమా దర్శకుడు మెర్లపాక గాంధీ కథను అందించారు 

చిన్న సినిమా కానీ పెద్ద విషయం సినిమా అందరూ చూడలేరు కానీ అందరూ చూసే సినిమా ఇక కథ గురించి తెలుసుకుందాం

సంతోష్ అనే అబ్బాయికి తన అంగం చిన్నది అనే   భయంతో అతడు ఎదుర్కువున్న పరిస్థితులు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎలా సంతోష పరచాలి అనే ఆలోచనతో సినిమా కథ నడుస్తుంది 

ఇందులో చూడటానికి బూతు గా ఉన్న సినిమా మంచి message ఇచ్చాడు డైరెక్టర్ బాగుంది సినిమా కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడలేము కానీ సినిమా పెద్దవారు చూస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం

తాను ప్రేమించిన అమ్మాయి కోసం తన అంగాన్ని పెంచుకోవడానికి surgery, వన ములికలుతో కూడా ప్రయత్నిస్తుంటాడు

చివరికి ఏమి జరిగింది అన్నది కథ volgar గా ఉన్న కూడా బాగుంది కామెడీ కూడా బాగుంది !!!

1, జూన్ 2021, మంగళవారం

చీకటి సినిమా పై నా అభిప్రాయం !!!

 చీకటి సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా మొన్న ఆదివారం జీ తెలుగు లో ప్రసారం అయినట్టుంది నేను నెట్ లో డౌన్లోడ్ చేసుకుని చూసాను 

ఇక సినిమా కథ విషయానికి వస్తే  అది తమిళ్ నాడు లోని ఒక కొండ పరివాహక గ్రామము ఆ ఊరిలో అకస్మాత్తుగా ఊరంతా చీకటి పడి కొంతమంది గ్రామస్తులు చనిపోతారు అసలు ఆ గ్రామంలో ఎందుకు అలాగా జరుగుతుంది 

అలా ఎందుకు చనిపోతున్నారు అసలు ఆ గ్రామం చీకటిగా ఎందుకు మారుతుంది అని కొత్తగా ఆ ఉరిలోకి వచ్చిన ఇన్స్పెక్టర్ హీరో సుందర్.సి అసలు మర్మం ఎంటో తెలుసుకుందాం అని ఫ్యామిలీతో పాటు ఆ ఊరికి వెళ్తాడు

అయితే అక్కడ ఎదుర్కువున్న పరిస్థితులు ఆ ఊరిలో ఎందుకు అలాగా జరుగుతుంది అని తెలుసుకుంటాడా  దానికి పరిష్కారం ఏమిటి అన్నది సినిమా కథ 

చూడటానికి రొటీన్ గా ఉన్న సినిమా చూసే కొద్ధి ఆసక్తిగా బాగానే ఉంది సినిమా హార్రర్ సినిమాలు ఇష్టపడేకారు ఒక సారి చూడ వచ్చు బాగుంది !!!

మీ బ్యాంక్ అకౌంట్ నుండి మే నెలలో 330 కట్ అయ్యాయా ఎందుకో తెలుసా !!!

 మనలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లు ఉన్నాయి మే నెలలో చాలా మందికి 330 రూపాయలు డెబిట్ అయినట్టు messsage వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది తెలియని వారి కోసం 

2015 వ సంవత్సరంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పధకం ప్రారంభించారు అంటే ఇది ఇన్సూరెన్స్ లాంటిది ప్రతి సంవత్సరం అకౌంట్ నుండి 330 డెబిట్ అవుతాయి 

ఒక వేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రమాద శాత్తూ మరణిస్తే ఆ2 లక్షల రూపాయలు నామినీ పేరు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి వస్తాయి !!!

Telugu quotes !!!