28, మే 2021, శుక్రవారం

అహలో విడుదల అయిన "అనుకోని అతిధి" సినిమాపై నా అభిప్రాయం !!!

 అనుకోని అతిధి మలయాళం డబ్బింగ్ సినిమా సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, ఫహాద్ ఫాసిల్ నటించిన చిత్రం

ఆహా ott లో ఈ రోజు విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం

హీరో ఫహాద్ ఫాసిల్ ఒక పురాతనమైన మెంటల్ హాస్పిటల్ కి inspection కోసం వెళ్తారు అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గ్రహిస్తాడు ఈ సినిమాలో హీరో కి వాయిస్ ఓవర్ ఇచ్చింది హీరో తరుణ్ అక్కడ ఆ హాస్పిటల్ లో సాయి పల్లవి ఒక మానసిక రోగి గా ఉంటుంది 

అయితే అక్కడ సమస్యల్ని ఎలా పరిష్కరించాడో అదే సినిమా కథ చాలా బాగుంది సినిమా చివరిలో ట్విస్ట్ ఉంటుంది సినిమా చాలా బాగుంది 

సాయి పల్లవి acting బాగుంది అందరూ బాగా నటించారు !!!

27, మే 2021, గురువారం

"శుక్ర "సినిమా పై నా అభిప్రాయం !!!

 శుక్ర సినిమా  ఏప్రిల్ 20 న విడుదల అయిన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదల అయిన సినిమా ఇవాళ ఆ సినిమా చూసాను ఇక ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం

విల్లీ (హీరో ) ఒక బిసినెస్ మాన్ వైజాగ్ ఒక దొంగల ముఠా ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటారు విల్లీ వైజాగ్ కు వస్తాడు తన భార్యతో పాటు అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక రాత్రి పార్టీ చేసుకుంటారు అయితే అక్కడ కొన్ని మర్డర్స్ జరుగుతాయి

అసలు ఆ మర్డర్స్ ఎలా జరిగాయి అసలు కథ ఏంటి అన్నది కథ సినిమా కొంచెం పిచ్చ, పిచ్చగా గా ఉంది ఒకసారి చూస్తే అర్థం కాదు రెండవ సారి చూసే సినిమా కాదు జస్ట్ average అంతే !!!

25, మే 2021, మంగళవారం

ఆహా లో విడుదల అయిన "play back " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా ott లో play back సినిమా విడుదల అయ్యింది ఇది చిన్న సినిమా కానీ గతానికి, వర్తమాననికి, భవిష్యత్ కి సంబంధించిన సినిమా

ఇందులో హీరో ఒక న్యూస్ జర్నలిస్ట్  ఒక ఇంట్లో  ఉంటాడు ఆ ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది ఆ ల్యాండ్ లైన్ కి కనెక్షన్ ఉండదు కానీ ఫోన్ వస్తుంటుంది

ఆ ఫోన్ చేసేది ఎవరోకాదు హీరో చిన్నప్పుడు తనను పెంచుకున్న అమ్మ ఇలా ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఉంటాయి సినిమాలో చిన్న సినిమా అయినా కథ నేపధ్యం బాగుంది సినిమా చూడండి మంచి సినిమా బోరింగ్ గా ఉన్న కానీ ఊహించని మలుపులతో బాగానే సాగింది సినిమా !!!

ఐతే తన తల్లిని హీరో వర్తమానంలో భవిష్యత్లో ఎలా కలిసాడో అదే కథ బాగుంది సినిమా !!!

23, మే 2021, ఆదివారం

" హోస్ట్ " ఇంగ్లీష్ హార్రర్ మూవీ పై నా అభిప్రాయం !!!

 హోస్ట్ సినిమా హార్రర్ మూవీ గా ఉందని చూసాను అయితే ఆ కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం !!!

కరోనా వైరస్ వచ్చిన మొదట్లో లోక్డౌన్ దాదాపు అన్ని దేశాల్లో విధించారు ఒక ఫారెయిన్ country లో లోక్డౌన్ విధించిన సమయంలో కొంతమంది అమ్మాయిలు కలిసి ఎవరికి వారింట్లో జూమ్ app లో ఆత్మలును పిలుస్తారు

అయితే అసలు ఆత్మలు వచ్చాయా లేదా అన్నది సినిమా చూడాలి నాకు తెలిసి ఈ స్టోరీ నిజంగా జరిగింది అనుకుంటున్నాను సినిమా అయ్యిన తరువాత నిజంగా జూమ్ కాల్ చేసిన వాళ్ళని చూపిస్తారు

నన్ను అడిగితే అంత భయంకరంగా లేదు ఒక సదా సీదాగా ఉంటుంది సినిమా !!!

22, మే 2021, శనివారం

తమన్నా నటించిన " నవంబర్ స్టోరీ " పై నా అభిప్రాయం !!!

 తమన్నా నటించిన నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ మొత్తం అన్ని ఎపిసోడ్ లు కలిపి 4 గంటలు 32 నిమిషాలు నిడివి

  ఆ వెబ్ సిరీస్ ఎలాగ ఉందొ చూద్దాం ఒక క్రిమినల్ స్టోరీ రైటర్ కూతురు తమన్నా అనుకోకుండా తన తండ్రి ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు అయితే తమన్నా తండ్రికి మతిమరుపు వ్యాధి వస్తుంది 

ఇలాంటి పరిస్థితిలో తమన్నా తన తండ్రిని ఎలా కాపాడుకుంది అన్నది సినిమా కథ చూడటానికి కాసింత ఓపిక ఉండాలి మంచి ఇంట్రెస్ట్ గానే ఉంది చూడటానికి ఈ వెబ్ సిరీస్ డిస్నీ hotstar Ott లో విడుదల అయ్యింది

చూడటానికి మంచి టైం పాస్ బాగానే ఉంది ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూడ వచ్చు !!!




18, మే 2021, మంగళవారం

" ఆండ్రాయిడ్ కట్టప్ప " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆండ్రాయిడ్ కట్టప్ప టైటిల్ కొత్తగా ఉంది కదూ కథ కూడా బాగుంటుంది ఇది ఆహా ott లో అందుబాటులో ఉంది మీకు నచ్చితే ఒక సారి చూడండి

సినిమా కథ విషయానికి వస్తే ఇది మలయాళం సినిమా తెలుగులో ఆహా ott లో విడుదల అయ్యింది కథ 

ఒక ఊరిలో తండ్రి , కొడుకులు ఇద్దరే ఉంటారు తండ్రి బాగా ముసలివాడు కొడుకు రోబోటిక్ ఇంజనీరింగ్ చదువుతాడు విదేశాలలో చాలా జాబ్ లు వస్తాయి కానీ ముసలి తండ్రిని వదిలి విదేశాలకు వెళ్ళటం ఇష్టం ఉండదు

ఒకసారి ఏదోలా తండ్రిని ఒప్పించి తనను చూసుకోవటానికి ఒక పని పనిషి ని ఇంట్లో ఉండమని తాను జపాన్ కు జాబ్ కు వెళ్తాడు

కానీ ఆ ముసలి తండ్రికి కొంచెం చాదస్తం ఎక్కువ ఇంటిలో అసలు మిషన్ పరికరాలు ఏమి ఉండటం ఇష్టం ఉండదు అంటే మిక్సీ, గ్రైండర్ వంటివి అయితే ఆ తండ్రి మిషన్ తో తయారు చేసిన వంటకాలు కూడా తాను తినడు చేతితో చేసిన వంటకాలు మాత్రమే తింటాడు

ఇలాంటి చదస్తపు ముసలి వాడితో పడలేక ఆ పని మనిషి వెళ్లి పోతుంది మళ్ళీ కొడుకుని ఇండియాకి రమ్మంటాడు

దీనికి బాగా పరిష్కారం ఆలోచించి తన కంపెనీ లోని రోబో తయారు చేసి తన తండ్రికి ఇస్తాడు అసలు మిషన్ అంటే ఇష్టం ఉండని ఆ ముసలి తండ్రికి ఆ రోబోకి ఎలా సన్నీ హిత్యం పెరిగింది అన్నది సినిమా కథ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా చాలా బాగుంటుంది

సినిమా చూసినంత సేపు ఆసక్తిగా చాలా బాగుంటుంది !!!

16, మే 2021, ఆదివారం

రామ్ గోపాల్ వర్మ " D -Company " సినిమాపై నా అభిప్రాయం !!!

 రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక పెద్ద మిస్టరీ ఆయన తీసిన సినిమాలు మరొక ఎత్తు అంతే ఇక విషయానికి వస్తే రాం గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం D-Company సినిమా ఈ రోజు చూసాను ఇక ఆ సినిమా గురించి ఒక చిన్న మాట

ఈ సినిమా underworld డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర అని సినిమా ఎంతో ఆతృతగా చూసాను కానీ నాకు ఈ సినిమా అసలు దావూద్ ఇబ్రహీం దేనా అని అనిపించింది ఎదో సోసో గా సాగింది వర్మ టేకింగ్ గురించి తెలిసిందేగా

ముంబై లో 1980 లో దావూద్ ఇబ్రహీం ఒక చిన్న రౌడి నుండి ఒక డాన్ గా ఎలా ఎదిగడో చూపించాడు మరి అండర్ వరల్డ్ డాన్ గా ఎలా ఎదిగాడో అన్నది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాడు అంటా అదే ట్విస్ట్ చివరికి

చాలా ఓపికతో చూసాను గాని సినిమా చివరికి నిరాశే మిగిలింది!!!

15, మే 2021, శనివారం

" బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా పై నా అభిప్రాయం !!!

 నేను ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకున్నాను కానీ కానే కాదు తెలుగు సినిమానే కొంచెం కామెడీ, కొంచెం ట్రాజెడీ అదే ఈ సినిమా 

కథ ఏమిటంటే బట్టలు వ్యాపారం చేద్దామనుకునే ఒక సాధారణ వ్యక్తికి అనూహ్యంగా ఒక పెళ్లి అవుతుంది ఆ పెళ్లి కూతురు చెల్లితో మరొక పెళ్లి అవుతుంది ఇలా వివిధ కారణాలతో మొత్తం 3 పెళ్లిళ్లు అవుతాయి

ఆ తరువాత జరిగిన సంఘటనలు, పరిస్థితులు చివరికి ఆ ముగ్గురు పెళ్ళాలతో ఎలా జీవనం సాగించాడు అన్నది సినిమా కథ 

నాకు తెలిసి ఈ సినిమా పెద్ద హాస్యంగా కూడా లేదు ఎదో సోసో గా ఉంది

పెద్దగా ఏమి బాగోలేదు పెద్ద సినిమా కాదు కాబట్టి మనం అంతగా ఆశించకూడదు !!!


14, మే 2021, శుక్రవారం

" సినిమా బండి" సినిమా పై నా అభిప్రాయం !!!

 సినిమా బండి సినిమా netflix ott లో ఈ రోజు విడుదల అయ్యింది చిన్న సినిమా కానీ మంచి వినోదాన్ని పంచింది మంచి కాలక్షేపం నా దృష్టి లో సినిమా అంటే మనం ఉన్న పరిసరాల్ని మైమరచి ఆ సినిమా లోకంలోకి తీసుకువెళ్లేదే అసలైన సినిమా

ఇక కథ విషయానికి వస్తే ఒక మారుమూల గ్రామంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి కి ఒకరోజు ఆటో లో ఒక విలువైన కెమెరా దొరుకుతుంది 

ఆ కెమెరాను తన స్నేహితుడు ఫోటో స్టూడియో నడుపుతున్న వ్యక్తికి చూపిస్తాడు అయితే కెమెరాని బాడు గకి ఇవ్వమని సలహా ఇస్తాడు 

కాకపోతే హీరో కి అలా ఇష్టం ఉండదు ఎలాగైనా దానితో ఒక మంచి సినిమా తీయాలని ఆ సినిమాతో మంచి పేరు, డబ్బు సంపాదించాలని ఆ ఊరిని బాగు చేయాలని అని ఆశ పడతాడు

అయితే ఆ తరువాత హీరో కోరుకున్నది జరిగిందా, అసలు సినిమా తీశారా అన్నది మిగతా కథ 

ఈ సినిమా కథ మొత్తం ట్రయిలర్ లొనే reveal చేశారు కొన్ని సినిమాలు కథలు ట్రయిలర్ లొనే తెలిసిపోతాయి ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా మీద ఎదో ఆసక్తి పెరిగింది ఎలాగైతే సినిమా ను ఒక పట్టు పట్టేసాను

సినిమా అయితే సూపర్ బాగుంది చాలా natural గా ఉంటుంది ఇందులోని పాత్రలు చాలా బాగుంది మీక అవకాశం వస్తే ఒక లుక్ వెయ్యండి !!!

13, మే 2021, గురువారం

నరకం అంటే ఇదేనేమో ?

 స్వర్గం, నరకం అంటే ఎక్కడో ఉంటాయి అది మనం కాలం చేసిన తరువాత తెలుస్తుంది అనుకున్నాం కానీ స్వర్గం, నరకం అంటే మనం బ్రతికే బ్రతుకే దానిని నిర్ణయిస్తుంది

అవును నిజం ఇప్పటి పరిస్థితి చూస్తే అలానే ఉంది నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగినవారే ఈ రోజు మనకు దూరం అవుతున్నారు కనీసం చివరి చూపులు కూడా నోచుకు పోవటం లేదు 

అంతా ఈ మాయదారి మహమ్మారి కరోనా వల్లే ఎప్పుడు ఇరగడు అవుతుందో ఏమో గాని చాలా మంది జీవితాల్ని నాశనం చేస్తుంది కొందరికి ఆరోగ్యం, కొందరికి ఆర్థిక పరిస్థితి, ఇలా చెప్పు కుంటూపోతే చాలానే ఉన్నాయి

కానీ ఇలాంటి పరిస్థితిలో ఓపిక ,సహనం, ధైర్యం ప్రతి మనిషికి చాలా అవసరం 

ఈ మహమ్మారి ఖచ్చితంగా ప్రతి మనిషిని తాకే వెళుతుంది కాకపోతే రోగ నిరోధక శక్తి ఉన్నవారు ఉండగలరు ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్త చాలా అవసరం !!!😢😢😢


12, మే 2021, బుధవారం

జెస్సి సినిమా పై నా అభిప్రాయం !!!

 జెస్సి సినిమా ఎప్పుడో 2019 లో విడుదల అయ్యింది ఎప్పటి నుంచో చూద్దామని నిన్న డౌన్లోడ్ చేసుకుని ఇవాళ చూసాను 

ఇక సినిమా కథ చూద్దాం ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక బంగాళలో ఉంటారు అయితే వాళ్లిద్దరూ లో ఒకరికి దెయ్యం పడుతుంది అయితే ఆ దెయ్యాన్ని ఎలా వదిలించారో అదే సినిమా కథ

ఈ కథ cheppatam కంటే చూడటం బెటర్ గా ఫీల్ అవుతారు సినిమా అయితే చాలా బాగుంది ఈ కథలో ట్విస్ట్ లు కూడా ఉన్నాయి ఆ ట్విస్ట్ చెప్పేస్తే సినిమా ఇంట్రెస్ట్ ఉండదు

కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలలో హార్రర్ గా సినిమా అయితే బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

9, మే 2021, ఆదివారం

" thankyou Brother"సినిమా పై నా అభిప్రాయం !!!

 Thankyou brother సినిమా ఆహా ott లో నిన్న విడుదల అయ్యింది అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది

ఇక సినిమా కథ విషయానికి వస్తే ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన అబ్బాయికి బాధ్యతలు తెలియక విచ్చల విడిగా తిరుతుంటాడు

అయితే అబ్బాయి తన బాధ్యతను తెలుసుకోవటానికి మందలిస్తుంది దానితో ఆ అబ్బాయి ఇంటి నుండి బయటకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు

ఇక అనసూయ కారెక్టర్ వచ్చే సరికి భర్త పోయి ఓ మధ్య తరగతి గృహిణిగా నెలలు నిండిన గర్భవతిగా ఉంటుంది

అయితే వీరిద్దరు యాదృచ్చికంగా ఒకే apartment లో లిఫ్ట్ లో కలుసుకుంటారు అయితే అనుకోకుండా లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుంది 

అనసూయకు పురిటి నొప్పులు మొదలవుతాయి ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డారో అదే సినిమా కథ అంతకుముందు వారిద్దరికీ ఎటువంటి సంబంధం ఉండదు 

పర్వాలేదు మంచి టైం పాస్ సినిమా ఒకసారి చూడవచ్చు !!!

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !!!


 

7, మే 2021, శుక్రవారం

"Welcome Home" సినిమా పై నా అభిప్రాయం !!!

 Welcome home అయ్యా బాబోయ్ ఏమి సినిమా రా బాబు ఇది మైండ్ పోతుంది లోపల

ఈ సినిమా అసలు ఇలా ఉంటుంది అని అనుకోవలేదు ఇది హిందీ డబ్బింగ్ సినిమా 

ఇక అసలు కథకు వస్తే ఊరికి సంబంధం లేని ఇక ఇల్లు ఆ ఇంటిలో మనుషులు అసలు చాలా క్రూరంగా ఉంటారు

ఈ సినిమాలో హీరోయిన్ ఒక స్కూల్ లో  గవర్నమెంట్ టీచర్ అయితే జనాభా లెక్క ల కోసం ఆ ఊరి చివరన ఉన్న ఆ ఇంటికి వేరొక లేడీ టీచర్ తో కలిసి వెళ్తారు వారిద్దరూ అయితే అక్కడ అంత మామూలుగానే ఉంటుంది 

ఆ తరువాత ఎందుకో doubt వచ్చి వారు అప్పుడు వెళ్లి ఆ తరువాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు ఆ ఇద్దరు అక్కడికి వెళ్లిన తరువాత  వాళ్లకు ఎదురైన పరిస్థితులు అబ్బో ఒక రకంగా లేదు హింస చిత్ర హింసలు, వాళ్ళు ఆ ఇంటి నుండి ఎలా బయటపడ్డారో అదే మిగిలిన కథ

ఇది కూడా నాకు తెలిసి 18+ సినిమా చాలా క్రూరంగా చాలా voilence గా ఉంది సినిమా సస్పెన్సు సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది ఈ సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

6, మే 2021, గురువారం

" Kadakh " సినిమా పై నా అభిప్రాయం !!!

Kadakh సినిమా హిందీ డబ్బింగ్ తెలుగు లో చూసాను ఇది పెద్దవారు అంటే 18+ చూడవలసిన సినిమా నాకంటే 18 దాటి చాలా సంవత్సరాలు అయ్యింది కాబట్టే నేను చూసాను 
ఇక అసలు విషయానికి అదే కథకి వస్తే తన భార్య యొక్క అక్రమ సంబంధం తెలుసుకుని తన భార్య తో సంబంధం పెట్టుకున్న వ్యక్తి యొక్క ఫ్లాట్ కు వెళ్తాడు అక్కడ అనూహ్యంగా ఇద్దరి మధ్య చిన్న గోడవగా మరి చివరి ఆ భర్త చనిపోతాడు 
తన ఫ్లాట్ లో చనిపోయిన భర్త శవాన్ని తన ఫ్లాట్ లో ఎలా దాచాడు ఆ రోజే దీపావళి అందరూ కలిసి ఆ ఫ్లాట్ లొనే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు
అయితే వారెవరు కంట పడకుండా ఆ శవాన్ని ఎలా దాచాడో అదే సినిమా చివరికి ఆ శవాన్ని ఏమి చేశారు అన్నది కథ
సినిమా చూసిన కొద్దిసేపటికే కథ అర్థమైంది కానీ చూడటానికి మంచి ఆసక్తిగా, కామెడీ గా బాగుంది ఈ సినిమా !!!

సందీప్ కిషన్ "A1 Express" సినిమా పై నా అభిప్రాయం !!!

 సందీప్ కిషన్ నటించిన latest సినిమా A1 express ఈ సినిమా March నెలలో విడుదల అయినట్టుంది ఎలాగో ap లో మధ్యాహ్నం 12 గంటలు వరకే 

మధ్యాహ్నం నుండి ఖాళీగా ఇంట్లో ఉండటం ఎందుకని ఏమి సినిమాలు ఉన్నాయి అని చూసా A1 express అనే సినిమా కనిపించింది

ఒక మారు చూసా బాగుంది ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా స్పోర్ట్స్ backdrop లో నడుస్తుంది అది హాకీ ఆట

పూర్వం మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఒక హాకీ గ్రౌండ్ వాళ్ళు ఎలాగైనా స్వాధీన పర్చు కోవాలని చూసే వారు ఆ క్రమంలో వారికి మన తెలుగు వారికి ఒక హాకీ ఆట పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లదే ఆ గ్రౌండ్ అప్పుడు ఒక చిట్టిబాబు అనే ఆయన ఆ ఆటను దగ్గరుండి గెలిపిస్తాడు అందుకే ఆ గ్రౌండ్ కి చిట్టి బాబు అనే పేరు పెడతారు

ఆ తరువాత స్వాతంత్రం వచ్చిన తరువాత కొంతమంది రాజకీయ నాయకులు దృష్టి ఆ గ్రౌండ్ మీద పడింది మళ్ళీ మ్యాచ్ నెగ్గితేనే ఆ గ్రౌండ్ వాళ్లకు సొంతం అవుతుంది అప్పుడు హీరో ఎలాగా గెలిపిస్తాడు 

ఆ తరువాత ఏమి జరిగింది అన్నది మిగతా కథ స్పోర్ట్స్ backdrop లో సినిమా కొంచెం ఉత్కంఠ భరితంగా ఉంటాయి కాబట్టి సినిమా పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు

ఈ సినిమాలో అందరి పేర్లు వారి యొక్క సొంత పేర్లే సినిమా అయితే బాగుంది కాలక్షేపం !!!

రేలంగి మంటలమ్మ తల్లి చిన్న, పెద్ద సేవ వీడియో !!!

 ఈ కరోనా వల్ల ఒక పండగ లేదు, ఒక జాతర లేదు, ఒక ఊరేగింపు లేదు అసలు ఇది ఎప్పుడు అంతం అవుతుందో తెలియటం లేదు 

ఒక విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం రేలంగి గ్రామ దేవతలు చిన్న మంటలమ్మ, పెద్ద మంటలమ్మ జాతరలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి 

గత సంవత్సరం ఈ సంవత్సరం అసలు జాతర లేదు ఆ జాతర కు ప్రతి సంవత్సరం ఆ అమ్మవార్లకు చిన్న సేవ, పెద్ద సేవ జరుపుతారు అంటే కాకుండా జాతర కూడా జరుపుతారు ప్రతి సంవత్సరం 

చిన్న సేవకు, పెద్ద సేవకు కావిడలతో అమ్మవారికి పానకం నైవేద్యంగా అమ్మవారి గుడికి తీసుకెళ్తారు

ఈ సంవత్సర సదా సీదా గా జరిగింది 

ఆ అమ్మవారి చిన్న సేవ, పెద్ద సేవ వీడియో లు కింద ఉన్నవి గమనించగలరు 

4, మే 2021, మంగళవారం

కరోనా కంటే దాని జాగ్రత్తలు కలవరపెడుతున్నాయి !!!

 అవును ఈ కరోనా ఏమో గాని జాగ్రత్తలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు ఒకరు ఆవిరి పట్టమని, మరొకరు ఆవిరి వద్దని, ఒక్కరు చద్దన్నం తినమని, మరొకరు నిమ్మరసం తాగమని, మరొకరు బిళ్ళలు వేసుకోమని 

ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతూ వెళ్తున్నారు అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు 

ఏమి పరిస్థితులు రా బాబు ఇంట్లో టి వి న్యూస్ చానెల్స్ చూడాలంటే భయం, బయటకు ఎక్కడికి వెళ్లాలన్న భయం అసలు ఈ స్థితి నుండి ఎప్పుడు బయట పడతామో ఏమో ఎంత ధైర్యం తెచుకుందామన్న ఎదో తెలియని భయం !!!

ఈ పుకార్లు విరుగుడు కార్యక్రమాలు ఇవన్నీ ఎంత వరకు పని చేస్తాయో తెలీదు జబ్బు కన్నా ముందు భయం చంపేస్తుంది మనుషుల్ని 

అవును నాకు తెలిసి చాలామంది భయంతోనే చనిపోతున్నారు !!!

ఎప్పుడు మంచి పరిస్థితులు వస్తాయో ఏమో అసలు అర్థం కావటం లేదు 😢😢😢

1, మే 2021, శనివారం

అసలు ప్లాస్మా అంటే ఇప్పుడు ఈ మాట ఎక్కువ వింటున్నాం ?

కరోనా వచ్చి దాని నుండి బయటపడి పూర్తి ఆరోగ్య వంతులుగా తయారు అయ్యిన తరువాత వారిలో ఆ రోగానికి సంబంధించి యాంటీబాడీలు శరీరం లో తయారు అవుతాయి 

ఆ యాంటీబాడీలు ప్లాస్మా లొనే ఉంటాయి అందుకే దీనిని సంజీవని అంటారు

అసలు ప్లాస్మా  అంటే మన రక్తంలో నీటిమాదిరిగా ఉండే పసుపు పచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు

ఈ ప్లాస్మా కోసం చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి ప్లాస్మా ఇస్తే మనకు మళ్ళీ కరోనా వస్తాది ఏమో నని మనిషి మరల కరోనా బారిన పడతాడు ఏమో అని చాలా అపోహలు ఉన్నాయి 

కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్లాస్మా మరో జన్మని ప్రసాదిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు !!!

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు !!!

 కార్మికులు శ్రమను గౌరవిద్దాం, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు !!!

కార్మిక హక్కుల పోరాటానికి ఒక రోజు అదే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు !!!

The Goat life Movie Review !!!

 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ...