31, అక్టోబర్ 2023, మంగళవారం

పెద కాపు -1 సినిమా పై నా అభిప్రాయం !!!


 శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అంటే కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు అనే ఒక ముద్ర ఉండేది ఇప్పుడు దానిని చెరిపేస్తూ మాస్ సినిమాలు వైపు పయనం సాగిస్తున్నట్లు ఉంది 

ఇంకా ఈమధ్యనే విడుదల అయిన పెద కాపు సినిమా అమెజాన్ prime OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !

గోదావరి చుట్టుపక్కల ఒక గ్రామం 1982 లో అప్పటికి ఆ ఊరిలో బయ్యన్న, సత్తి రంగయ్య అనే ఇద్దరు అధికారం కోసం పాకులడుతూ ఉంటారు అయితే వారి కింద ఉండే మనుషులు చనిపోతుంటారు ఆ వూరి రాజకీయాలు వాళ్ళిద్దరూ మధ్యే ఉండేటట్లు ఉంటుంది అక్కడ రాజకీయం అయితే 

సత్తి రంగయ్య దగ్గర హీరో వాళ్ల అన్నయ పనిచేస్తుంటారు వాళ్ల వాళ్ల రాజకీయాలకు హీరో వాళ్ల అన్నయ్య కనపడకుండా పోతాడు అప్పటికి ఒక కొత్త పార్టీ ఆ ఊరిలోకి ప్రవేశిస్తుంది అక్కడి రాజకీయలను హీరో ఎలా ఎదిరించి నిలబడ్డాడు ఆ కొత్త పార్టీ టిక్కెట్ ఎవరు ఇచ్చింది ఒక సామాన్యుడు రాజకీయం ఎలా ఉంటుంది అన్నది మిగిలిన సినిమా కథ 

Cinema  సాగుతుంది అంతే ఇందులో డైలాగ్స్ పట్టి పట్టి చూస్తే వింటేనే కానీ మనకు అర్థం కాదు అన్నట్టు ఇందులో అడ్డాల శ్రీకాంత్ సత్తి రంగయ్య కొడుకు కన్నబాబు గా నటిస్తాడు కుర్చికే పరిమితమైన పాత్రలో విలనిజం పండించాడు అంతగా ఏమి లేదు ఒక ఊరిలో జరిగే రాజకీయ పరిణామాలు వాటికి సామాన్యులు ఎలా బలి అవుతారు అన్నది సినిమా కథ !!!

30, అక్టోబర్ 2023, సోమవారం

షారుఖ్ ఖాన్ " Jawan" OTT విడుదల ?

 బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన సినిమా Atlee డైరెక్షన్ లో వచ్చిన సినిమా Jawan cinema థియేటర్ లలో సందడి చేసింది అయితే ఇప్పుడు ఇప్పుడు OTT లోకి స్ట్రీమింగ్ కానుంది 

ఇంకా ఈ సినిమా Netflix OTT లో November 2 నుండి స్ట్రీమింగ్ కానుంది థియేటర్ లలో మిస్స్ అయిన వారు OTT లో చూసి ఎంజాయ్ చేయండి !!!

28, అక్టోబర్ 2023, శనివారం

సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన" పెద కాపు "OTT విడుదల ?

 శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సినిమా పెద కాపు సినిమా సెప్టెంబర్ 29 థియేటర్ లలో విడుదల అయినది ఈ సినిమా పబ్లిసిటీ ఉంది కానీ సినిమా అంతగా ఎవరికి ఎక్కలేదు ఈ సినిమా ఇప్పుడు OTT లోకి అందుబాటులోకి వచ్చింది 

అమెజాన్ prime లో అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!

ఆహా OTT లో విడుదల అయిన "ఆపరేషన్ అల వెలమ్మ" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో సైతాన్ వెబ్ series లో నటించిన రిషి ఇందులో హీరో పాత్ర  ఇందులో హీరో ఒక అనాధ కూరగాయలు మార్కెట్ లో పనిచేస్తుంటారు అయితే ఏ పెళ్ళి కానీ అమ్మాయిని చూసిన పెళ్లి కూతురు లాగా కనిపిస్తుంది అయితే హీరోయిన్ ఒక బట్టల షాప్ లో కనపడుతుంది తనను మొదటి సారి చూసినప్పుడు ప్రేమలో పడతాడు ఇది ఇలా జరుగుతుండగా 

మరోవైపు హీరోయిన్ టీచర్ కింద చేసే స్కూల్ లోనే జాన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు జాన్ వాళ్ల నాన్న పెద్ద business man తనని 25 లక్షలు అడుగుతారు కిడ్నాపర్లు అయితే పోలీస్ ఈ case నీ ఒక ఆఫీసర్ కి అప్పచెబుతాడు 

కిడ్నాపర్లు ఒక చోట 25 లక్షలు తోక బ్యాగ్ లో పెట్టుకుని తీసుకురమ్మని చెబుతారు అయితే ఆ బ్యాగ్ హీరో కంటపడుతుంది అది బ్రాండెడ్ బ్యాగ్ అని దానిని ముట్టుకుందాం అనుకుంటాడు ఇంతలో పోలీస్ లు వచ్చి పట్టుకుంటారు

కానీ హీరో తనకు ఏమి తెలియదని చెబుతాడు అయిన పోలీస్ లు చిత్ర హింసలు పెడతారు అయితే అసలు ఆ కిడ్నాపర్లు ఎవరు ? హీరో కథ చివరకు ఏమైనది అన్నది మిగిలిన కథ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది

అదే సినిమాకు హైలైట్ just average time pass కి బాగుంది మధ్యలో కొంచెం బోరింగ్ గా ఉంటుంది క్లైమాక్స్ లో కొద్దిగా మార్పు అంతే !!!

24, అక్టోబర్ 2023, మంగళవారం

విజయ్ "లియో" సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ హీరో విజయ్,లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన సినిమా లియో మూవీ అక్టోబర్ 19 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో ఒక కాఫీ షాప్ తో జీవిస్తుంటారు అయితే కొంతమంది 

రౌడీలు తన కాఫీ షాపులోకి వచ్చి అందులో పని చేసే అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు వాళ్ళని హీరో తుపాకీతో కాల్చి చంపుతారు ఆ. వార్త మొత్తం పేపర్ లో పడుతుంది ఆ విషయం ఆంటోనీ దాస్ అనే వ్యక్తికి తెలుస్తుంది హీరో నీ చూసి తన కొడుకు లియో లాగా ఉన్నాడు అని అక్కడకు వస్తాడు

అయితే హీరో నేను లియో కాదు పర్తిబాన్ అని చెబుతాడు అయిన వినకుండా వాళ్ల కుటుంబాన్ని విలన్ బాడిస్తుంటాడు అయితే చివరికి ఆ లియో ఎవరు పర్టిబాన్ కి లియో కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ 

ఇది చాలా సార్లు చూసిన సినిమా అంతగా ఏమి లేదు just average అంతే అంతగా ఏమి లేదు సినిమా లో హీరో elevation తప్ప bgm కూడా పరవాలేదు బాగానే ఉంది అంతగా ఏమి లేదు సినిమా !!!

లోకేష్ కనకారాజ్ ఏదో మాయ చేస్తాడు అనుకున్నాను కానీ ఆశించినంత లేదు సినిమా !!!

23, అక్టోబర్ 2023, సోమవారం

రామ్ "స్కంద" మూవీ OTT విడుదల ఎప్పుడు ?

 బోయపాటి, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సినిమా స్కంద మూవీ సెప్టెంబర్ 28 థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా OTT లో విడుదల అవుతుంది డిస్నీ +hotstar లో అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

20, అక్టోబర్ 2023, శుక్రవారం

డిస్నీ hotstar లో విడుదల అయిన mansion 24 Web series పై నా అభిప్రాయం !!!


 వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన webseries Mansion 24 డిస్నీ+hotstar లో అందుబాటులో ఉంది ఇంకా ఈ వెబ్ series కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

వరలక్ష్మి వాళ్ల నాన్న సత్యరాజ్ పురావస్తు శాఖలో పనిచేస్తుంటారు అయితే ఒక పురాతన భవనం లో కి వెళతాడు అక్కడ నుండి అతడు కనిపించకుండా పోయాడు అయితే హీరోయిన్  తల్లి అనారోగ్యంతో మంచాన పడుతుంది  అయితే హీరోయిన్ వాళ్ల నాన్న ఒక మోసం చేశారని ఆ భవనంలో ఒక విలువైన సంపద ఉందని దానిని తీసుకుని పరారి అయ్యాడని అందరు అనుకుంటారు అయితే అసలు నిజం ఏమిటి కనుక్కుందాం అని అక్కడికి వెళ్తుంది 

అయితే ఆ పురాతన భవనం దగ్గర ఒక watch man రావు రమేష్ ఉంటాడు అసలు ఆ భవనం లో జరిగిన కొన్ని కథల్ని చెబుతూ ఉంటాడు తన తండ్రి అసలు ఏమయ్యడో తెలుసుకుందాం అని కూతురు తిరిగి ఆ భవనం నుండి ఎలా బయట పడింది వాళ్ల నాన్న ను చివరకు కనిపెట్టిందా అన్నది కథ 

అంతగా ఏమి లేదు సో సో గా ఉంది అక్కడక్కడ కొంచెం భయం ఇంకొక session వున్నట్టు ఉంది చివరకు కొద్దిగా క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ వున్నట్టు వుండి వెబ్ series

18, అక్టోబర్ 2023, బుధవారం

జయం రవి " God" సినిమా పై నా అభిప్రాయం !!!

 జయం రవి ,నయన తార జంటగా వచ్చిన సినిమా god సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో పోలీస్ అయితే పట్టణంలో వరుసగా అమ్మాయిలు హత్యలు జరుగుతుంటాయి వాటిని ఎవరు చేస్తున్నారు అన్నది సినిమా కథ హీరోకి అసలు భయం అంటే ఏమిటో తెలియదు ఇందులో హీరో కి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతను కూడా పోలీస్ హీరోయిన్ అతడి చెల్లెలు నయన తార 

విలన్ పట్టుకునే నేపద్యంలో హీరో ఫ్రెండ్ చనిపోతాడు ఆ తరువాత ఆ మరణాలు కి కారణం విలన్ బ్రహ్మ అని తెలుస్తుంది అయితే ఆ బ్రహ్మ పోలీస్ కాల్పుల్లో చనిపోతాడు కానీ ఆ హత్యలు జరుగుతూనే ఉంటాయి బ్రహ్మ చనిపోయిన తరువాత కూడా ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అన్నది హీరో ఆ విలన్ నీ ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా కథ

ఈ కథ ప్రతి సైకో కథ స్టోరీ లానే రోటీన్ గా ఉంది అంతగా ఏమి లేదు సినిమా మామూలుగానే ఉంది !!!

16, అక్టోబర్ 2023, సోమవారం

సుధీర్ బాబు మామ మశ్చింద్ర సినిమా OTT ?

 సుధీర్ బాబు హీరో గా వచ్చిన సినిమా మామ మాశ్చింద్ర సినిమా అక్టోబర్ లోనే theatre లలో విడుదల అయింది ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 20 న అమెజాన్ prime లో ఆహా OTT లో అందుబాటులోకి రానుంది !!!

11, అక్టోబర్ 2023, బుధవారం

విశాల్ మార్క్ ఆంటోనీ ott విడుదల ఎప్పుడో తెలుసా ?

 విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా ఇప్పుడు OTT లో అందుబాటులోకి వస్తుంది Amazon prime లో ఈ నెల 13 తేదీ నుండి Amazon prime లో అందుబాటులో ఉంది !!!

9, అక్టోబర్ 2023, సోమవారం

ముత్తయ్య మురళీధరన్ "800" సినిమా పై నా అభిప్రాయం !!!

 800 సినిమా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ యొక్క ఎవరికి తెలియని అతని జీవిత విషయాలు గురించి తీసిన సినిమా అసలు కథ ఏమిటంటే మురళీధరన్ వాళ్ల ఫ్యామిలీ తమిళ్ ఫ్యామిలీ కాకపోతే వారు జీవించటానికి చెన్నై వెళ్తారు అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యలు

అసలు మురళీధరన్ క్రికెట్ లోకి ఎలా వచ్చాడు అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్ లు ఎలా తీశాడు అసలు అతను క్రికెట్ లోకి రావటానికి ముందు అతను ఎదుకొన్న పరిస్థితులు అవమానాలు, అన్ని ఈ కథలో చెప్పడం జరిగింది 

క్రికెట్ లో తనది మంచి బౌలింగ్ action లేదని విమర్శించారు అతను ఎదుర్కొన్న పరీక్షలు ఇవన్నీ చెప్పటం చివరకు తన రిటైర్ మెంట్ గురించి కూడా ఇందులో చెప్పటం జరిగింది !!!

7, అక్టోబర్ 2023, శనివారం

The great Indian suiside సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన the great Indian suiside సినిమా విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ లో పెద్ద మనిషి కార్ ఏక్సిడెంట్ లో చనిపోతాడు వాళ్ల ఫ్యామిలీ లో ఉండే హీరోయిన్ వాళ్ల కుటుంబంతో కలిసి అందురు ఆత్మ హత్య చేసుకుందాం అనుకుంటారు అయితే అనుకోకుండా ఒక కాఫీ షాప్ ఓనర్ హీరోయిన్ ప్రేమలో పడతాడు తనని ప్రేమిస్తున్నానని చెబుతాడు కానీ హీరోయిన్ ఒప్పుకోదు 

ఆ తరువాత ఒప్పుకుంటుంది తనని పెళ్ళి చేసుకుంటాడు వాళ్ల ఫ్యామిలీలో ఒకడు అవుతాడు పెళ్లి అయిన తరువాత హీరోయిన్ ఫ్యామిలీ లోకి వెళతాడు ఆ ఫ్యామిలీ కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది ఫ్యామిలీ అంతా వింత అచారాలుతో ఉంటుంది చివరికి హీరో ఆ ఫ్యామిలీ మొత్తం చేసుకునే ఆత్మ హత్యలు ఆపడా లేదా అసలు ఎందుకు అందరు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు అన్నది మిగిలిన సినిమా కథ 

ఈ కథ ALREADY TAMANNA తొ వచ్చినా AKHARI SACH WEB SERIES లో ఉంది ఆ స్టోరీ చూసి నట్టే ఉంది కాకపోతే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తీసినట్టున్నరు !!!

3, అక్టోబర్ 2023, మంగళవారం

చంద్ర ముఖి 2 సినిమా పై నా అభిప్రాయం !!!

 చంద్ర ముఖి సినిమా అంటే దాదాపు చాలా సంవత్సరాలు దాటింది ఈ సినిమా ఇప్పుడు చంద్ర ముఖి 2 గా రాఘవ లారెన్స్ హీరో గా వచ్చింది ఇక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

రాధిక శరత్ కుమార్ పెద్ద కుటుంబం అయితే వాళ్ల కుటుంబంలో ఎప్పుడు నష్టం,చికాకులు గా ఉంటాయి అయితే వాళ్ల గురువు ఇంటిలో అందరు కలిసి వాళ్ల కుల దైవం దురమ్మ తల్లి పూజ చేయాలని అంటాడు అయితే అది వేట పాలెం లో ఉంటుంది ఆ ఊరికి దగ్గరగా ఉన్న ఒక బంగళా ఉంటుంది అందులోనే ఉంటారు అందరు రాధిక కుటుంబంలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు అంటే వెళ్లకు ఇష్టం ఉండదు 

కానీ కుల దేవత గుడిలో పూజ అందరు చేయాలి కాబట్టి వాళ్ళను కూడా తీసుకు రమ్మంటారు వాళ్ళని చూసుకోవటానికి రాఘవ లారెన్స్ కూడా వస్తాడు ఆ ఇంటికి 

ఆ ఇంటికి వచ్చిన తరువాత ఆ ఇంటిలో చంద్ర ముఖి ఉంటుంది దక్షిణ వైపు ఉండే గదిలో చంద్ర ముఖి ఉంటుంటి ఆ ఇంటికి వచ్చిన వారిలో ఒక అమ్మాయిని ఆ చంద్ర ముఖి ఆవహిస్తుంది 

ఎప్పుడో వెళ్లి పోయిన చంద్ర ముఖి మరల తిరిగి ఎలా వచ్చింది అసలు తరువాత మిగిలిన కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

చంద్ర ముఖి ఉన్నంత ఆసక్తి గా అయితే ఈ సినిమా లేదు చాలా డల్ గా ఉంటుంది కథ అంతగా ఏమి లేదు అన్నట్టు చంద్ర ముఖి గా కంగనా రనౌత్ నటించింది

వేటయ్య గా రాఘవ Lawrence నటించాడు just average !!!


1, అక్టోబర్ 2023, ఆదివారం

నవీన్ పోలిశెట్టి "miss శెట్టి mister పోలిశెట్టి సినిమా OTT విడుదల ?

 నవీన్ పోలిశెట్టి,అనుష్క నటించిన శెట్టి పోలిశెట్టి సినిమా థియేటర్ లలో సందడి చేసింది ఇప్పుడు OTT లోకి వస్తుంది అక్టోబర్ 5 నుండి Netflix OTT లోకి వస్తుంది !!!

మేటి మాట !!!