30, జులై 2022, శనివారం

ఆహా లో విడుదల అయిన "షికారు" సినిమాపై నా అభిప్రాయం !!!


ఇది చిన్న పిల్లల సినిమా కాదు అలాగని పెద్దగని అలాంటి సన్నివేశాలు ఏమి లేవు అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!

 కాకినాడలో college లో ఒక నలుగురు కుర్రోళ్ళు చదువుకుంటూ ఉంటారు అందులో ఒక అబ్బాయికి ఒక పెళ్లి అయిన అమ్మాయి తన మొగుడికి తెలియకుండా చదువుకుంటూ ఉంటుంది అక్కడ పరిచయం అవుతారు ఇద్దరు 

ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పోలీస్ si అయితే తనను సరిగ్గా పట్టించుకోడు అందులో ఒక అబ్బాయికి బాగా దగ్గరవుతోంది ఇంట్లో వాళ్ళ ఆయన లేనప్పుడు ఇంటికి ఆ అబ్బాయిని రమ్మంటోంది ఇంటిలో ఇద్దరు ఉండగా ఇంతలో వాళ్ళ ఆయన వస్తాడు 

ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ చివరకు ఆ అబ్బాయి బయటకు వచ్చాడా ఆ అబ్బాయి స్నేహితులు హీరో బయటకు రావటానికి ఎలాంటి హెల్ప్ చేశారు అన్నది మిగిలిన కథ అక్కడక్కడ బోర్ కొడుతుంది సినిమా average అంతే!!!





28, జులై 2022, గురువారం

Rocketry The Mumbi effect సినిమా పై నా అభిప్రాయం !!!

బయోపిక్ సినిమాలు మరుగున పడిన కొంతమంది గొప్ప వ్యక్తులు గురించి తెలుస్తుంది అలాంటిదే ఈ సినిమా నిజంగా బాగుంది సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

నంబి నారాయణ్ ఒక రాకెట్ సైంటిస్ట్ అయితే ఆయన మన దేశానికి రాకెట్ స్వతంత్రంగా తయారు చేసి అంతరిక్షంలోకి పంపాలని  అనుకుంటాడు దాని కోసం తన ఫ్యామిలీ నీ వదులుకుని దేశం కోసం పాటు పడుతుంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో అతడిని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేస్తారు మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అదోగతి చెందుతారు ఆ తరువాత అసలు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

26, జులై 2022, మంగళవారం

"పరంపర session 2" వెబ్ సెరీస్ పై నా అభిప్రాయం !!!

 నవీన్ చంద్ర,శరత్ కుమార్, జగపతి బాబు, ప్రధాన పాత్రలో చేసిన పరంపర session 1 కొనసాగింపుగా session 2 Disney+hotstar లో అందుబాటులో ఉంది session 1 లో శరత్ కుమార్ నవీన్ చంద్ర ని అరెస్ట్ చేయిస్తాడు అక్కడి నుండి 2వ పార్ట్ మొదలవుతుంది నవీన్ చంద్ర జైలుకు వెళతాడు అక్కడ మాజీ ias officer ఒక కుంభకోణం విషయంలో అరెస్ట్ అయ్యి జైల్ శిక్ష అనుభవిస్తాడు రవి వర్మ అయితే నవీన్ చంద్ర బెయిల్ పై బయటకు రావటానికి సహాయపడతాడు రవి వర్మ 

ఇక్కడి నుండి శరత్ కుమార్, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కథ కొంచం బాగానే ఉంటుంది అయితే చివరకు ఎవరు విజయం సాధించారు అన్నది కథ session 1 ముగించినట్టే session 2 కూడా మంచి సస్పెన్స్ తో ముగించారు 

Session 1 చూస్తేనే గానీ session 2 అర్థం కాదు పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!




21, జులై 2022, గురువారం

ఆహా ott లో విడుదల అయిన "సమ్మతమే" సినిమా పై నా అభిప్రాయం


 కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరో, హీరొయిన్ గా ఇటీవలే theatre లో విడుదల అయ్యి రెండు వారాలకే ott కి వచ్చిన సినిమా సమ్మతమే ఇక కథ ఏమిటో తెలుసుకుందాం 

ఇందులో హీరో వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది హీరో చిన్నప్పటి నుండి ఇంటిలో ఒక ఆడ మనిషి ఉంటే ఇల్లంతా కళ గా ఉంటుంది అని వాళ్ళ నాన్న అంటాడు అప్పటి నుండి తనకు పెళ్ళైతే ఒక అమ్మాయి తన జీవితంలోకి తన ఇంటిలోకి వస్తుందని నమ్ముతాడు ఎలాగైనా కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు అలాగే తనకి మంచి ఉద్యోగం దొరుకుతుంది 

హైద్రాబాద్ లో జాబ్ చేస్తుంటాడు అక్కడే హీరొయిన్ పరిచయం అవుతుంది ఇద్దరు ఫ్యామిలీ లో ఒప్పుకుంటారు అయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి మళ్ళీ కలుస్తారు హీరోయిన్ ఎక్కువుగా abaddalu ఆడుతుంది ఇది హీరో కి నచ్చదు అలాగే హీరోయిన్ తనకు తానే ఫ్రీడమ్ గా ఉండటం కూడా నచ్చదు ఐతే చివరకు ఏమి జరిగింది అన్నది సినిమా కథ
అంతగా ఏమి బాగోలేదు అని చెప్పాలి చెప్పుకోవడానికి కూడా ఒక సీన్ కూడా లేదు రొటీన్ గానే ఉంది 

20, జులై 2022, బుధవారం

రాయకుదురు శ్రీ మావుళ్ళమ్మ, మహాలక్ద్మీ అమ్మవారి గుడి వీడియో

 

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి గుడి వీడియో మీకోసం 

ఈ గుడికి ఒక కథ ఉంది భీమవరం మావుళ్ళమ్మ ముందర ఇక్కడ వెలిసినట్టు ఈ ఊరి గ్రామ ప్రజలను రోజుకోకరి చొప్పున నర బలి కోరుతున్నట్టు ఒక అబ్బాయి ఒక  కొరడతో కొట్టడం వలన ఈ గుడికి ఉన్న చిన్న రంద్రం ద్వారా బయటకు వెళ్లి పోయినట్టు ఒక పురాణ కథ ఉంది !!!

17, జులై 2022, ఆదివారం

మా నీళ్ల ట్యాంక్" వెబ్ సిరీస్ నా అభిప్రాయం!!!

అక్కినేని సుశాంత్ హీరో గా వచ్చిన వెబ్ సిరీస్ జీ5 ott లో అందుబాటులో ఉంది మొన్న జులై15 తేదీ నుండి అందుబాటులకి వచ్చింది ఇక కథ ఎలా ఉందో చూద్దాం !!!

అది రాయలసీమ ప్రాంతంలోని ఒక గ్రామం ఆ ఊరిలో నీటికి బాగా కరువు ఆ ఊరి సర్పంచ్ అబ్బాయి ఆ ఊరి లోని హీరోయిన్ ని లవ్ చేస్తాడు కానీ హీరోయిన్ కి అతను అంటే ఇష్టం ఉండదు అందుకు సర్పంచు అబ్బాయి ఆ ఊరి వాటర్ ట్యాంక్ ఎక్కి అందరిని బెదిరిస్తాడు ఎందుకంటే ఆ హీరోయిన్ వాడితో పెళ్లి ఇష్టం లేక అక్కడినుండి వెళ్లిపోతుంది తనని ఎలాగైనా తీసుకువచ్చి తనతో marriage చేయాలని లేదంటే అక్కడి నుండి దూకేస్తానని బెదిరిస్తాడు చేసేది ఏమిలేక సర్పంచు ఆ ఊరి si అంటే హీరోకి ఆ వర్క్ చెబుతాడు ఇదంతా జరుతున్న సమయంలో ఆ ఊరిలో కొన్ని రాజకీయాలు జరుగుతాయి ఇంతకీ హీరో, హీరోయిన్ ని తీసుకు వచ్చాడా అసలు ఈ కథ కి వాటర్ ట్యాంక్ కి ఏమిటి సంబంధం అన్నది సినిమా కథ 

అంతగా ఇంట్రెస్ట్ గా ఏమి లేదు వెబ్ సిరీస్ boaring గా ఉంది వెబ్ సిరీస్ !!!

15, జులై 2022, శుక్రవారం

సాయి పల్లవి " గార్గి" సినిమాపై నా అభిప్రాయం !!!

 


సాయి పల్లవి గార్గి సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా లో కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో సాయి పల్లవి ప్రధాన పాత్రలో చేసింది !!!
సాయి పల్లవి ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటుంది తన తండ్రి ఒక apartment లో వాచ్ మెన్ గా జాబ్ చేస్తుంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో ఒక రోజు ఎంత టైం అయినప్పటికీ తన తండ్రి ఇంటికి రాడు అసలు ఏమి జరిగింది అని చెప్పి ఆ apartment కి వెళ్లి చూసేసరికి అక్కడ తన తండ్రిని పోలీస్ లు అరెస్ట్ చేసారని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అక్కడ తన తండ్రి ఒక చిన్న పాపా మీద అత్య చారం చేసాడని అందుకే తన తండ్రిని అరెస్ట్ చేసారని తెలుస్తుంది తన తండ్రి అలాంటి వాడు కాదని ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోరు చివరకు కోర్ట్ కు వెళ్తుంది అక్కడ ఎవరు తన తండ్రి తరపున వాదించే వారు ఉండరు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేసింది చివరకు తన తండ్రికి న్యాయం జరిగిందా అన్నది సినిమా కథ 
బాగుంది సినిమా చూడ వచ్చు సాయి పల్లవి మంచి కథనే ఎన్నుకుంది 👍👍👍

12, జులై 2022, మంగళవారం

అహలో విడుదల అయిన " గుల్తు" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది కన్నడ సినిమా ఆహా ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్లిపోదాం !!!

ఈ కథ లో హీరో ఒక అనాధ చదువులో బాగా చదివేవాడు hacking చేయటం లో దిట్ట  ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తూనే ఒక కాఫీ షాప్ లో జాబ్ చేస్తుంటాడు హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతని పేరు ఆస్తి అయితే తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఒక అమ్మాయి పిలిచింది అని ఒక ఫ్లాట్ లోని అమ్మాయిని కలవడానికి వెళ్తాడు అయితే ఆ ఫ్లాట్ పక్కన ప్లాట్ లో ఒక హత్య జరుగుతుంది అయితే ఆ కేస్ ఆస్తి మీదకు వస్తుంది ఆస్తి, హీరో ఒకే రూమ్ లో కలిసి ఉంటారు పోలీస్ లు వారిని అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడతారు కానీ వాళ్లకు ఏమి తెలియదు అంటారు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది హీరో మొత్తం దేశంలోని అందరి ఆధార్ కార్డ్ లు స్కాం చేస్తాడు

దానిని నిరూపించడానికి హీరోయిన్ మొదట్లో ఇన్స్టిట్యూట్ లో టీచర్ గా జాయిన్ అవుతుంది ఆ ఆతరువాత హీరోని అరెస్ట్ చేసిన తరువాత తెలుస్తుంది హీరోయిన్ స్పెషల్ సైబర్ క్రైమ్ ఆఫీసర్ అని ఇంతకీ హీరో అందరి ఆధార్ కార్డ్ స్కాం చేశాడా అసలు ఎందుకు చేయాల్సి వచ్చినది అన్నది మిగతా కథ 

పర్వాలేదు బాగానే ఉంది ఒక సారి చూడవచ్చు కాకపోతే కథ అంతగా ఇంట్రెస్టిటింగ్గ్ గా ఉండదు సో స్లోగా వెళ్తుంది కథ !!!

11, జులై 2022, సోమవారం

"జై బజరంగీ" సినిమా పై నా అభిప్రాయం !!!

శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన కన్నడ సినిమా బజరంగీ సినిమా ఆహా ott లో అందుబాటులో ఉంది

 ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో రెండు పాత్రలు చేసాడు మొదటిది అంజి పాత్ర వాళ్ళ అక్కని కలుసుకోవడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు అక్కడే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు వాళ్ళ అక్క కూడా లవ్ marrige చేసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి జీవిస్తారు  అంత కథ సుకాంతం అనుకునే టైం లో ఒక విలన్ ఆ ఊరిలో ఉన్న జనాల్ని అందరిని తన స్థావరనికి బందీలుగా తీసుకెళ్లి పోతాడు అప్పుడు హీరో అడ్డు పడిన సరే హీరోని కొట్టి మరి తీసుకెళ్లిపోతాడుచివరకు హీరో ఆ ఊరి దేవుడి ముందు ప్రాణాలు వదిలేస్తాడు 

అప్పుడే ఒక స్వామీజీ అసలు కథ ఏమిటో చెబుతాడు హీరో అంజి కంటే ముందు బజరంగీ అనే ఒకాయన ఉండేవాడు అడవి ప్రాంతంలో ధన్వంతరి వంశస్తులు కొంతమంది ని తమ ఆయుర్వేద వైద్యంతో నయం కానీ ఎన్నో జబ్బుల్ని నయం చేస్తుంటారు వాళ్ళందరిని ఒక విలన్ చేతిలో  నుండి వారిని కాపాడి వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండేలా చేస్తాడు అది నచ్చని ఆ విలన్ కొడుకు బజారంగిని విషం పెట్టి చంపేస్తాడు 

అయితే ఈ కథలో అసలు అంజికి, బజరంగీ ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ మరి అంత బాగుంది అని చెప్పలేము బాగోలేదు అని చెప్పలేము average గా ఉంది సినిమా !!!

Anya's Tutorial వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!!!

ఆహా ott లో విడుదల అయిన anyas Tutorial వెబ్ సిరీస్ హార్రర్ కథాంశంతో విడుదల అయింది ఇక కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇది కరోనా లాక్ డౌన్ టైం లో జరిగినట్టు చూపించారు ఒక అమ్మ, ఇద్దరు కూతుళ్లు పెద్ద అమ్మాయి మధు, రెండవ అమ్మాయి లావణ్య అదే అన్య అయితే వీళ్లిద్దరి మధ్య చిన్నప్పటి నుండి గొడవలు జరుగుతుండేవి అయితే అనుకోకుండా చిన్న అమ్మాయి వేరే ఫ్లాట్ చూసుకుని వెళ్ళిపోతుంది అక్కడే ఉంటుంది అక్క ఫోన్ చేసి పిలిచిన రాదు అక్కడే సోషల్ మీడియా లో వీడియోలు అప్లోడ్ చేస్తూ follwers ని పెంచుకుంటుంది అయితే ఆ వీడియోలు తను ఉండే ఫ్లాట్ లో దెయ్యం ఉందని అందరిని నమ్మించి మోసం చేస్తుంది ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే అది చివర క్లైమాక్స్ లో చూడాలి పర్వాలేదు కానీ మరి ఓవర్ expectationsతో చూడొద్దు ఒక సారి చూడ వచ్చు కాకపోతే అక్కడక్కడ కొద్దిగా స్లో గా నడుస్తుంది కథ !!!

7, జులై 2022, గురువారం

మయోన్ సినిమాపై నా అభిప్రాయం !!!

 

మయోన్ సినిమా బాహుబలి కట్టప్ప తనయుడు సిబి సత్యరాజ్ హీరోగా వచ్చిన సినిమా ఈ రోజు విడుదల అయింది ఇంతకుముందు దొర సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఇప్పుడు మయోన్ సినిమా లో తెలుగులో కూడా విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!
ఇందులో హీరో పురాతన శాఖ లో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు అందరితోనూ పురాతన వస్తువులు మనం కాపాడుకోవాలని చెప్పి అందులోని విలువైన వస్తువుల్ని విదేశాలకు అమేస్తుంటాడు ఆలా వస్తువులు అమ్మే మరొక వ్యక్తి తో కలిసి వస్తువులు విదేశాలకు అమ్ముతుంటాడు
ఇలా కాలం జరుగుతున్న క్రమంలో మయోన్ అనే ఆలయం వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం అందులో అపారమైన నిధులు ఉన్నాయి అని వీళ్లిద్దరూ అక్కడకు వెళ్తారు అయితే అక్కడ ఏమి జరిగింది అసలు ఆ గుడిలో ఏమి ఉంది అన్నది మిగతా కథ ట్రైలర్ చూసి బాగానే ఉంటుంది అని చూసా బట్ average అంతే గ్రాఫిక్స్  అంతగా ఏమి లేదు సోసోగా ఉంటుంది ఎదో ఉందని ఊహించుకుని మాత్రం సినిమా చూడొద్దు జస్ట్ టైం పాస్ కోసం చూడండి అంతే !!!

3, జులై 2022, ఆదివారం

" పక్కా కమర్షియల్" సినిమా పై నా అభిప్రాయం !!!

 గోపి చంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్ లుగా మారుతి డైరెక్షన్ లో థియేటర్ లలో విడుదల అయిన పక్కా కమర్షియల్ సినిమా ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

మారుతి సినిమాలు కామెడీ పరంగా బాగుంటాయి ఇందులో హీరో వాళ్ళ నాన్న సత్య రాజ్ మంచి పేరున్న జడ్జి అయితే తాను ఇచ్చిన ఒక తీర్పు వలన ఒక అమ్మాయి చనిపోతుంది అయితే ఆమెకు సరి అయిన న్యాయం చేయలేక పోయానని జడ్జి పదవికి రాజీనామా చేస్తాడు సత్యరాజ్ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు అయితే ఇందులో హీరో గోపి చంద్ పక్కా కమర్షియల్  డబ్బు కోసం ఎలాంటి కేస్ నైన టేక్ up చేస్తాడు ఇందులో హీరో లాయర్ అయితే తన తండ్రి సత్యరాజ్ కి రావు రమేష్ కి కేస్ ని హీరో టేక్ up చేస్తాడు 

అయితే ఇందులో ఎవరు గెలిచారు హీరో నా తన తండ్రి సత్య రాజ్ ఎవరు గెలిచారు ఇంతకీ సత్య రాజ్ కి, రావు రమేష్ కి ఏమిటి గొడవ ఆ కేస్ ని గోపి చంద్ డబ్బు కోసం తన తండ్రి కి ఎందుకు వ్యతిరేకంగా వాదిస్తున్నాడు అన్నది మిగిలిన సినిమా కథ !!!

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...