30, డిసెంబర్ 2018, ఆదివారం

ఆంగ్ల సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి ?

ఆంగ్ల సంవత్సరం వచ్చిందంటే చాలు బిర్యానీలు, కేకులు ఏమ క్రేజ్ పెరుగుతుంది అలాగే మరొకటి ఉంది అదే మత్తు పానీయాలు సెలబ్రేషన్ పేరుతో ఆ ఒక్క రోజు మనిషి ఏ విధంగా ఉంటాడో అందరికి తెలిసిందే
ఆరోజు ముందు  రాత్రి జరిగే ప్రమాదాలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు
ఇది ప్రతి సంవత్సరం జరిగే విషయం ముఖ్యంగా యువత మరి మితి మీరిన వేగంతో వాహనాలు నడుపుతారు దానికి సరైన క్రమంలో వచ్చే వాహనదారులు ఇబ్బంది పడతారు అంతే కాకుండా ఒక్కసారి వారి జీవితానికి మరలా కోరుకోలేని దెబ్బ తగులుతుంది

29, డిసెంబర్ 2018, శనివారం

జీవితానికి ఒక లెక్క ఉంది ?

మనం నిద్ర లేచిన మొదలు ప్రతి రోజు ఎదో ఒక లెక్క ఉంటుంది మొదట పాల వాడి దగ్గర లెక్క మొదలై, సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే కూరగాయలు వాడి దాకా ప్రతి రోజు ప్రతి మనిషికి ఈ లెక్కతోటే ముడి పడి ఉంటుంది
ఆహా ఈ తొక్కలో లెక్కతో మనకు పనేంటి అనుకుంటున్నారా ! లెక్క అనేది ఎక్కడకక్కడ పరిష్కారం చేసుకోవాలి మన బద్దకంతో, లేదా మనకున్న బాద్యలతతో దానిని నిర్లక్ష్యం చేస్తే తిరిగి దాన్ని సరి చూసుకునేటందుకు చేటంత అవుతుంది
అలాగే ఈ రోజుల్లో ప్రతిదీ లెక్కగానే చూస్తున్నారు ఏదైనా పెళ్లికి, వెళ్లిన మరేదైనా ఫంక్షన్ కి వెళ్లిన ఎదో మొక్కుబడిగా కాసేపు కూర్చుని చదివించాల్సింది చదివించి భోజనం చేసి వచ్చేస్తున్నారు
పలకరింపు కూడా ఏదో ఒక లెక్కగానే చేస్తున్నారు మనం వారిని పాలకరించగా వారు మనకు ఎదో సందర్భంలో మనల్ని పలకరిస్తారు అని ఇలా చూసుకుంటూ పోతే ప్రతిదానికి లెక్క అందుకే జీవితమే ఒక లెక్క క్రింద తయారయ్యింది !!!

25, డిసెంబర్ 2018, మంగళవారం

ఆంగ్ల సంవత్సరాది మన ఆలోచనలు మారాలి !!!

మన సంస్కృతి, సంప్రదాయాలు మన నుండి కొద్దీ, కొద్దిగా దూరం అవుతున్నాయి మన సంవత్సరాది ఉగాది కానీ దానికన్నా ముందు ఆంగ్ల సంవత్సరాది మనం గొప్పగా జరుపుకుంటున్నాం
ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ నెల మాత్రమే మారుతుంది అదే మన తెలుగు సంవత్సరాది ఉగాదికి కాలంలో కూడా మార్పులు వస్తాయి అదే అసలైన సంవత్సరాది
ఇలా చెప్పటం అంటే ఇంకా పాత తరంలోనే ఉన్నారు అనుకుంటారు కొందరు కానీ ఇది ఒకరి మనోభావాలు దెబ్బతీయటానికి చెప్పేవి కాదు
మన పండగలు, మన సంస్కృతి అనేది మనం కాపాడుకోకపోతే మన తరువాత తారలు వారికి పండగ అంటే ఎదో ఒక ఫార్మాలిటీగా చేసే విధంగా రోజులు మారుతాయి
సాధ్యమైనంత వరకు ప్రతి పండగ యొక్క అర్దాన్ని, దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలి తరువాతి తారలు వారికి తెలిసేలా ఉండాలి !!!

24, డిసెంబర్ 2018, సోమవారం

డిసెంబర్ 29 తరువాత ఛానెల్స్ రావా?

ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో ఛానెల్స్ గురించి ఎదో ఒక అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది ఒక సంవత్సరం సెటప్ బాక్స్ లు పెట్టుకోమని, మరొక సంవత్సరం Hd సెట్ బాక్స్ లు పెట్టుకోవాలి అని
ఈ సంవత్సరం పే ఛానెల్స్ రేట్లు బాగా పెరిగాయని యాడ్స్ కూడా వస్తున్నాయి
దీని గురించి తెలియాలంటే డిసెంబర్ 29 వరకు ఆగాల్సిందే !!!

23, డిసెంబర్ 2018, ఆదివారం

బయోపిక్ ల కాలం !!!

బయోపిక్ ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలకు తెరపై చూపే దృశ్యం ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి ఎంత కృషి చేస్తే, ఎన్ని గొప్ప పనులు చేస్తే ఆ స్థాయికి వచ్చారో తెలియని వారికి తెలియచెప్పే ఒక అద్భుతమైన ఆలోచన బయోపిక్
 మహానటి సావిత్రి మన తెలుగులో వచ్చిన మొదటి బయోపిక్ అంతకు ముందు ఇప్పుడు సినిమాలకు ఇదే కొత్త ట్రెండ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు
ఇకముందు మనకు తెలుగు జాతి గౌరవాన్ని చాటిన అన్న ఎన్టీఆర్ , వైస్సార్ , ఇంకా ఎన్నో బయోపిక్ లు మనముందుకు రాబోతున్నాయి !!!

20, డిసెంబర్ 2018, గురువారం

మీడియా ముందు తడబడితే సోషల్ మీడియాలో ట్రోల్స్ ?

సోషల్ మీడియా అనేది కాలక్షేపానికి, సరదాకి వాడుతుంటారు కానీ ఉండేకొద్ది సోషల్ మీడియా హద్దుని దాటుతుంది అది కూడా కొద్దిమంది పని కల్పించుకుని మరి మనోభావాలు దెబ్బతినేలా వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో చేస్తున్నారు
ఇది సరదాగా ఉన్నంత వరకు పర్వాలేదు వ్యక్తిగతనికి వెళితే సమస్య అన్నది మరి పెరుగుతుంది !!!

19, డిసెంబర్ 2018, బుధవారం

సెల్ఫీలతో చెలగాటం ?

సెల్ఫీ నేడు ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి తెల్సిన పదం అయితే ఈ సెల్ఫీ అనేది సరదాగా మనకు మనము తీసుకునే ఫోటో సరదాగా మనకు ఇష్టమైన వ్యక్తిని కల్సినప్పుడో, మనకు ఇష్టమైన ప్రదేశాన్ని సందర్శించినప్పుడో మనకు ఆ గుర్తును జ్ఞాపకంగా ఉంచుకోవటానికి తీసుకునేది
  ఈ సెల్ఫీ అనేది మనకు సరదాయే కాదు సమస్యల్ని తెచ్చిపెట్టేవిధంగా నేడు తయారైంది చాలామంది ఈ సెల్ఫీ సరదాలతో ఒక విధంగా చెప్పాలంటే పిచ్చితో  ఈ సెల్ఫీ ప్రాణానికే ప్రమాదకరమైన పరిసరాలలో తీసుకోవటం జరుగుతుంది
సరదా అనేది ఎప్పుడు హద్దులోనే ఉండాలి లేకపోతే జీవితం నాశనము అయిపోతుంది !!!

17, డిసెంబర్ 2018, సోమవారం

స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేమా?


బయటకు వెళ్లాలంటే పర్సు లేక పోయినా పర్వాలేదు గాని ఫోన్ లేకపోతే వెళ్లలేము అంతగా ముడిపడి పోయింది మన జీవితాలకు ఈ ఫోన్
ఫోన్ అంటే కేవలం మనకు దూరంగా ఉండే వారితో మాట్లాడటానికి ఉపయోగించేవారు కానీ నేడు ఫోన్ లేకపోతే ఆ ఊహే ఉహించుకోలేము అది స్మార్ట్ కు అలవాటు పడ్డవారు ఒక్క గంట కాదు ఒక 15 నిమిషాలు కూడా ఉండలేరు

1, డిసెంబర్ 2018, శనివారం

బ్లాగ్, యూట్యూబ్ మనలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియచేసే సాధనాలు ?

ఒక్కప్పుడు మనలో ప్రతిభ ఉంటే అది ఇతరులకు తెలియటానిక చాలా సమయం పట్టేది కాని ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి జరిగింది దానికి తోడు ఇంటర్నెట్ పై అవగాహన కూడా అందరికి ఉపయోగపడుతుంది

 బ్లాగ్ :  మనకు నచ్చింది మనం రోజూ ఆచరించేది మనకు తెలిసింది, మనలో ఉన్న భావాలు, అభిప్రాయాలు మన ఆలోచనలు, మన సలహాలు అన్ని బ్లాగ్ అనేది మన గురించి మనకు తెలియచేసేది

అంతే కాకుండా మనకు తెలిసిన విషయాలు అందరికి తెలిసేలా చెప్పేది బ్లాగ్ ఏ విద్య అయిన పంచుకుంటే పెరుగుతుంది 


యూట్యూబ్ : దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎందుకంటే మనం ఇంటర్నెట్ వాడకం ఈ రోజుల్లో బాగా ఎక్కువైంది ప్రతిరోజు ఖచ్చితంగా మనం వీడియోస్ చూస్తుంటాం మనలో ఉన్న ప్రతిభను చెప్పటం కంటే చూపించటం వల్ల ఎదుటివారికి తేలికగా అర్థం అవుతుంది మనలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ ప్రపంచానికి చాలా త్వరగా చూపించేది యూట్యూబ్ !!!

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...