17, అక్టోబర్ 2025, శుక్రవారం
15, అక్టోబర్ 2025, బుధవారం
17, సెప్టెంబర్ 2025, బుధవారం
Kishkinda puri movie review !!!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుమప పరమేశ్వరన్ నటించిన సినిమా కిష్కింధ పురి సినిమా థియేటర్ లలో విడుదల అయింది వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ సినిమా మరి ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ,హీరోయిన్ ghost walking tour అనే కంపెనీ లో పనిచేస్తుంటారు అంటే దెయ్యాలు ఉండే భవనాలకు అవి అంటే ఆసక్తి ఉండే వారికి వాటిని చూపించి వాటి గురించి కథలు చెపుతూ ఉంటారు అదే వలే పని అయితే కొంతమందిని సువర్ణ మాయ అనే పురాతన పాడుబడ్డ రేడియో స్టేషన్ కి తీసుకెళ్తారు అయితే అక్కడి నుండి వచ్చిన 3 వ్యక్తులు చనిపోతారు
అయితే మిగిలిన వారిని హీరో ఎలా కాపాడాడు ఇంతకు ఈ హత్యలు ఏ దెయ్యం చేస్తుంది దాని వెనకున్న కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
పరవాలేదు ఒకసారి చూడ వచ్చు కథ కొత్తగానే ఉంది హార్రర్ కూడా పండింది విలనిజం కూడా బాగుంది బెల్లంకొండ అన్న అకౌంట్లోకి ఒక హిట్ పడినట్టే !!!
15, సెప్టెంబర్ 2025, సోమవారం
Mirai movie review in telugu !!!
హనుమాన్ సినిమా హిట్ తరువాత వచ్చిన mirai సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
అనగనగా అశోకుడు అనే రాజు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో తంత్ర విద్యల్ని సంపాదించి చివరకు దానిని 9 మహా గ్రంథాలలో బంధిస్తాడు అయితే 9 మహా గ్రంథాలు ఒక విలన్ సంపాదించాలని అనుకుంటాడు అయితే దానికి మన హీరో ఆ 9 మహా గ్రంథాలను విలన్ చేజిక్కించుకుండా హీరో ఎలా నిలువరించాడు
అసలు హీరో కథ ఏమిటి అన్నది మిగిలిన కథ ఇందులో హీరో తల్లిగా శ్రియ నటించింది ఆ విలన్ చాలా బలవంతుడు హీరో సామాన్య మనిషి అసలు ఈ mirai అంటే ఏమిటి
దానికి ఈ కథ కు ఏమిటి సంబంధం ఇదే ఈ కథ నాకు ఈ సినిమా కథ కొంచెం ఎక్కడో చూసినట్టు ఉంది కొన్ని కొరియన్, జపనీస్ సినిమా లో కలిపి చూసి నట్టుంది దానికి మన తెలుగు సెంటిమెంట్ కథ చెప్పినట్టుంది
సో మొత్తానికి ఒక సారి చూడ వచ్చు !!!
10, సెప్టెంబర్ 2025, బుధవారం
Su from so Movie review in telugu !!!
Su from so సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా ott లోకి విడుదల అయింది జియో hotstar లో streeming అవుతుంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అందరికీ పెద్ద రవి అన్న అని పిలుచుకునే ఒక ఆయన ఉంటాడు ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతుంది అందులో అందరూ మందు తాగి ఎంజాయ్ చేస్తుంటారు
అందులో ఒక వ్యక్తి తెగేసి ఒక వ్యక్తి ఇంటిలో ఉన్న బాత్రూమ్ లోకి తొంగి చూస్తాడు అయితే అతడిని పట్టుకుంటే అప్పటినుండి దెయ్యం పట్టినట్టు నటిస్తాడు ఆ దెయ్యాన్ని వదిలించటానికి ఎంత ప్రయత్నించిన వదలదు అన్నట్టు నటిస్తాడు
అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు మొదట దెయ్యని వదిలించినట్టు అనుకుంటారు కానీ ఎవరు నమ్మరు అయితే చివరకు ఈ కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ గా బాగానే ఉంది సినిమా క్లెయిమ్స్ అంతగా నాకు బాగా అని పించలేదు కామెడీ పరంగా ఒకసారి చూడవచ్చు !!!
9, సెప్టెంబర్ 2025, మంగళవారం
Little heart movie review !!!
Mouli సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే అబ్బాయి మొదటిసారి హీరోగా చేసిన సినిమా little heart movie తెలుగులో థియేటర్ లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా థియేటర్లలో ఎందుకు విడుదల చేశారో నాకు అర్థం కాలేదు OTT లో విడుదల చేయాల్సిన సినిమా ఇక పోతే అసలు కథ హీరో ఒక చిన్న కుటుంబం అమ్మ, నాన్న,తమ్ముడు, హీరో వాళ్ళ నాన్న ది గవర్నమెంట్ జాబ్ అయితే తన కొడుకుని బాగా చదివించి మంచి ఇంజనీర్ గా చూడాలని ఆశ అయితే కొడుకు జులాయిగా ఆకతాయిగా తిరుగుతుంటాడు అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది ఉన్న చదువు కాస్త ఆటకు ఎక్కుతుందిఇంకా తన తండ్రి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొమంటాడు అయితే అక్కడ అమ్మాయిని మన హీరో లవ్ చేస్తాడు అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఆ అమ్మాయి మనోడి కంటే 3 సంవత్సరాలు పెద్దది అయితే మన హీరో తరువాత స్టెప్ ఏమిటి అన్నది మిగిలిన కథ
సో సో గా ఉంది కదా దీనికన్నా 90s memories web series ఉంది కదా అదే బాగుంటుంది కాకపోతే ఇందులో కొంచెం కామెడీ ట్రాక్ కలిపారు అంతే
సో యావరేజ్ బొమ్మ అంతే !!!
7, సెప్టెంబర్ 2025, ఆదివారం
Netflix లో విడుదల అయిన inspector zende సినిమా పై నా అభిప్రాయం !!!!
ఈ సినిమా Netflix లో విడుదల అయింది ఇన్స్పెక్టర్ zinde సినిమా ఈ సినిమా కామెడీ కింద చూపించటం జరిగింది కానీ ఇది నిజంగా జరిగిన కథ అని ఈ సినిమా మొదట్లో చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక దొంగ జైలులో మత్తు మందు కలిపి అక్కడినుండి. తప్పించుకుని పారిపోతాడు అయితే అతడిని పట్టుకోవటానికి ఇన్స్పెక్టర్ zinde బయలు దేరుతాడు అయితే అతడిని పట్టుకుంది మొదలు కూడా ఇన్స్పెక్టర్ zinde అయితే చివరికి అతడిని మన హీరో పట్టుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ
ఈ సినిమా కామెడీ ట్రై చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు అనిపించింది అంతగా ఏమి బాగాలేదు ఫ్యామిలీ man web series లో నటించిన మనోజ్ వాజపేయి ఇందులో ప్రధాన హీరో పాత్రలో నటించటం జరిగింది అసలు కథలో కామెడీ అంతగా పండ లేదు జస్ట్ సో సో గా మాత్రమే ఉంది !!!
6, సెప్టెంబర్ 2025, శనివారం
శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమా పై నా అభిప్రాయం !!!
A.R మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శివ కార్తికేయన్ నటించిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
తమిళ నాడు లోని ప్రజలకు గన్ అలవాటు చేయటానికి అక్కడికి ఒక సిండికేట్ గ్యాంగ్ లో ఇద్దరు విరాట్, చిరాగ్ తమిళ నాడులోకి ప్రవేశిస్తారు అయితే వారిని ఎదుర్కోడానికి NIA ప్రయత్నిస్తుంది వాళ్లను అడ్డుకుంటారు విరాట్, చిరాగ్ అయితే అప్పుడే మన హీరో లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు
అప్పుడే ఒక NIA ఆఫీసర్ నీ హాస్పిటల్ లో కలుస్తారు హీరో తన ఆపరేషన్ కి ఎలాగో చనిపోవాలనుకుంటున్న హీరోని వాడు కోవాలనే అనుకుంటాడు అయితే హీరో కొంచెం మానసిక సమస్య తో బాధ పడుతుంటాడు ఇంతకీ హీరో ఎందుకు చని పోవాలనుకుంటాడు హీరో గతం ఏమిటో
NIA ఆఫీసర్ చేసిన ఆపరేషన్ లో హీరో భాగం ఏమిటి అన్నది మిగిలిన కథ నాకెందుకో మురుగదాస్ మార్క్ సినిమాగా అనిపించలేదు సినిమా ఏదో ఏదో లాగా ఉంది సినిమా
Expect చేసిన అంచనాలు అయితే దాటలేదు సినిమాలో దాదాపు 3 గంటలు ఉంది సినిమా అంతగా ఏమి లేదు అనిపించింది సినిమా లో !!!
4, సెప్టెంబర్ 2025, గురువారం
25, ఆగస్టు 2025, సోమవారం
ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ర్యాలీ గ్రామం !!!
ఆ విగ్రహం కాళ్ళు పాదాలు దగ్గర ఎప్పుడూ తడిగానే ఉంటుంది !!!
13, మే 2025, మంగళవారం
శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!
శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్తుంటాడు అయితే అతనికి ఒక ఫ్రెండ్ వెన్నెల కిషోర్ తను సింగిల్ లైఫ్ జీవితాన్ని ఒక అమ్మాయితో ముగిద్దామని అనుకుంటాడు అయితే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆ అమ్మాయి ఒక కార్లు షోరూం లో సేల్స్ లో పనిచేస్తుంది అయితే మన హీరో ఆ అమ్మాయిని ఇంప్రెస్స్ చేద్దామని అనుకుంటాడు
అనుకోకుండా మరొక అమ్మాయి మన హీరోని లవ్ చేస్తుంది ఈ ముక్కోణపు ప్రేమ కథ చివరకు ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ గా బాగానే ఉంది
ఈ తరహా ప్రేమ కథలు మనం ఒకానొక టైమ్ లో చూసినవే అయితే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తో కామెడీ మరింత బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు అయితే హీరో ముక్కోణపు ప్రేమ కథ ఎలా ముగిసింది దీనికి కొనసాగింపుగా సింగిల్ 2 కూడా వస్తున్నట్టు లాస్టులో చూపించటం జరిగింది !!!
11, మే 2025, ఆదివారం
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !!!
కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
ఈస్టర్కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు మాతృ దినోత్సవంను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరిపింది. జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది !!!
10, మే 2025, శనివారం
ETV Win OTT లో విడుదల అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పై నా అభిప్రాయం !!!
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమా టైటిల్ చూస్తే మనకు ముందుగా గుర్తొచే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఆయన అభిమాని అదే anchor ప్రదీప్ హీరో గా నటించిన సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో సివిల్ ఇంజినీర్ చిన్నప్పటి నుండి తను ఎవరికి అయిన సహాయం చేస్తే తిరిగి అది తల కి చుట్టుకుంటుంది అని ఎవరికి సహాయం చెయ్యడు
అయితే ఇంకా హీరోయిన్ పరిస్థితికి వస్తె తమిళనాడు దగ్గరలో మన ఆంధ్ర చిట్టా చివరి గ్రామం ఒకటి ఉంటుంది ఆ ఊరిలో అందరికీ దాదాపు 60 మంది అబ్బాయిలు పుడతారు అయితే ఒక వ్యక్తి కి మాత్రం అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పుట్టడంతో ఆ ఊరు లో వర్షాలు పడి సుభిక్షం గా ఉంటుంది ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరి లో పుట్టిన ఆడపిల్ల వేరే ఊరికి వెళ్లకుండా ఆ అమ్మాయి పెద్దయ్యాక ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తన ఆస్తిని, తన సర్పంచ్ పదవిని ఇస్తానని మాట ఇస్తాడు
అయితే సివిల్ ఇంజినీర్ అయిన మన హీరో ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆక్కడ ఆ అమ్మాయిని మన హీరో ప్రేమించాడా ? దానికి ఆ ఊరి జనం ఏమి చేశారు అన్నది మిగిలిన కథ పరవాలేదు కానీ ఎందుకో ఎక్కడ కొద్దిగా తేడా అనిపించింది మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించింది అయితే మీరు ప్రదీప్ ఫ్యాన్ అయితే ఒకసారి చూసే దైర్యం చేయవచ్చు ఆ తరువాత మీ ఇష్టం !!!
Jio hotstar లో విడుదల అయిన kull Web series పై నా అభిప్రాయం !!!
జియో hotstar లో విడుదల అయిన kull web series కథ kama మీషు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు 4.33 నిమిషాలు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!
రాజస్తాన్ లోని ఒక పెద్ద రాజా వంశం చుట్టూ పనివాళ్ళు ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు అయితే అక్కడ ఉన్న రాజుకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు, మరొక భార్య కొడుకు అయితే అందరూ ఆ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలని చూస్తుంటారుఇంతలో ఆ రాజు చని పోతాడు అయితే ఆ రాజు ఎలా చనిపోయాడు దానికి కారణం ఏమిటి ఆ రాజును ఎవరు చంపారు అన్నది మిగిలిన కథ సాగదీత గా ఉంది web series అంతగా ఆసక్తి లేదనిపించింది ఇంకా ఈ వెబ్ సిరీస్ కొద్దిగా స్లో నేరేషన్ తో నడుస్తుంది
మీకు టైమ్ ఉంటే చూడండి లేకపోతే అసలు ట్రై చేయవద్దు !!!
7, మే 2025, బుధవారం
Aha OTT లో విడుదల అయిన Gentle women సినిమా పై నా అభిప్రాయం !!!
Gentle women ఈ సినిమా ఆహా OTT లో విడుదల అయింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమాలో కొత్తగా పెళ్ళైన భార్య, భర్త ఇద్దరు ఉంటారు భార్య ముందు భర్త ఎంతో ప్రేమ గా ఉంటాడు భర్త lic company లో పని చేస్తుంటాడు ఇలా కథ ముందుకు వెళ్తుంది ఒక రోజు వాళ్ళ ఇంటికి భార్య తరపు బంధువు ఒక అమ్మాయి జాబ్ purpose కోసం వస్తుంది ఒకటి లేదా రెండు రోజులు ఉండటానికి అయితే ఆమెపై భర్త కన్ను వేస్తాడు ఒక రోజు భార్య పని మీద బయటకు వెళ్తుంది భర్త కూడా వెళ్తాడు కాకపోతే ఫోన్ ఇంటిలో మర్చి పోయానని చెప్పి ఇంటిలోకి వెళ్తాడు
భార్య ఆలస్యం అవుతుందని తన ఒకత్తే బయటకు వెళ్తుంది కొద్ది సేపటికి భర్త తలకు దెబ్బ తగిలి పడుకుని ఉంటాడు అప్పటివరకు తన భర్త శ్రీ రామ చంద్రుడు అనుకున్న భార్య అసలు బండారం అప్పుడే బయట పడుతుంది ఆ ఇంటికి వచ్చిన అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడని తను రెస్పాండ్ అవుతుంటే అప్పుడే అతను వెనక ఉన్న గోడకు తల తగిలి కిందికి పడిపోతాడు
ఆ భర్త బ్రతికి ఉన్న తన దగ్గర ఉన్న కత్తితో తన భర్త ను తానే చంపేస్తుంది భార్య తన భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తనుకు అర్థం అవుతుంది అక్కడి నుండి కథ ముందుకు ఎలా వెళ్ళింది అన్నది మిగిలిన కథ
తన భర్తను తనే చంపి పోలీసులకు దొరకకుండా ఎలా మేనేజ్ చేసింది మిగతా వాళ్లను ఎలా నమ్మించింది అన్నది మిగిలిన కథ పరవాలేదు ఒకసారి చూడ వచు !!!
4, మే 2025, ఆదివారం
హనుమంతుని పుట్టిన రోజు !!!
హనుమంతుని పుట్టినరోజుని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు .
ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ పుట్టినరోజు ను జరుపుటను కూడా ఉంది.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున కొంతమంది హనుమంతుని పుట్టినరోజు గా జరుపుకుంటారు . అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని పుట్టినరోజుగా చేసుకుంటారు.
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" కి జన్మ ఇచ్చింది.
హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు .
హనుమంతుడు హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది.హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు 🙏
హనుమంతునికి బాల్యమున అంజనా దేవి పెట్టిన పేరు ‘సుందర’ .సుందర పేరుకు అర్థము అందమైన.పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది. శంబసాధనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది .
ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.
అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ, ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.
రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.
హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు ప్రేమతో హనుమా అని పిలిచాడు వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజ రూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు " చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తూంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేరపిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.
వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.
రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.
వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశిని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుడిని చంపమని ఆజ్ఞపించగా విభీషణుడు అన్న అతిథిగా వచ్చిన వానరుడిని చంపితే పాపం తగుల్తుంది అని చెప్పగా రావణాసురుడు తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.
శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.
రావణుని శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించగా దానిని అడ్డుకోడానికి ప్రయత్నించి మూర్ఛిల్లిన లక్ష్మణుడుని చూసి రావణుడు రథం దిగి లక్షణుడిని లేపడానికి వస్తాడు విష్ణు అవతారం అయిన లక్ష్మణుడు భూమికి అతుక్కుపోయి బరువుగా అవుతాడు రావణుడు లేపడానికి వంగినప్పుడు అప్పుడే స్పృహలోకి వచ్చిన హనుమంతుడు వేగంగా వచ్చి కడుపులో ఒక గుద్దు గుద్దాడు అక్కడే మోకాళ్ళ మీద కూర్చున్నాడు రావణుడు. వెంటనే హనుమంతుడు లక్షణున్ని జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు .
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవనిని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.
మరుసటి రోజు రాముడు,రావణుడుల మధ్య పోటాపోటీగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురైనప్పుడు రావణుడి సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడికి స్మరిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది !!!
అక్షయ తృతీయ రోజునే సింహ చలం నరసింహ స్వామి చందనోత్సవం ఎందుకు ?
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. *ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?*
పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.
చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి.... తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.
ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ , మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు !!!
3, మే 2025, శనివారం
Amazon prime లో విడుదల అయిన khauf Web series పై నా అభిప్రాయం !!!
అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన khauf Web series తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇంకా web series కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 గంటలు పైనే ఉంటుంది ఇంకా ఇందులో మధు అనే అమ్మాయి గ్వాలియర్ నుండి ఢిల్లీ కి వస్తుంది ఆమె బాయ్ ఫ్రెండ్ ను కలుసుకుంటుంది అయితే ఆమె Delhi రావటానికి కారణం ఆమె గ్వాలియర్ లో ఆమెను కొంతమంది రేప్ చేస్తారు అయితే delhi లో ఏదైనా జాబ్ చేద్దామని వస్తుంది అయితే అక్కడ ప్రగతి వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఒక గదిలో అద్దెకు దిగుతుంది అయితే ఆ చుట్టుపక్కల రూమ్ లో అద్దెకు ఉండే అమ్మాయిలు మధు ను ఆ రూమ్ లో ఉండవద్దు అందులో ఒక అమ్మాయి చనిపోయింది అని చెబుతారు కానీ ఆ అమ్మాయి మాటలు వినిపించుకోలేదు అయితే ఆ గదిలో ఒక అదృశ్య శక్తి ఉంటుంది
ఇంకో విషయం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల గదులలో ఉండే అమ్మాయిలు ఆ హాస్టల్ ను వదిలి బయటకు రారు ఒక వేళ వస్తె వాళ్లకు ప్రమాదం జరుగుతుంది ఇంతకు ఆ హాస్టల్ లో ఏముంది మధుని రేప్ చేసిన వారిని పట్టుకుని శిక్షించిందా ? అలాగే ఒక వ్యక్తి అమ్మాయిల్ని నరబలి ఇస్తుంటాడు వాడి కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఏది ప్రత్యేకంగా 18 + వాళ్లకు మాత్రమే అక్కడక్కడ బూతులు, కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పవచ్చు
ఒక రకంగా చెప్పాలంటే మొదట కొద్దిగా బోరింగ్ గా ఉంది ఉండే కొద్ది బాగుంది సిరీస్ మీకు కలిగ ఉంటే చూడండి లేక పోతే స్కిప్ చేయండి !!!
ETV Win OTT లో విడుదల అయిన ముత్తయ్య సినిమా పై నా అభిప్రాయం !!!
ముత్తయ్య సినిమా ఈటీవీ win OTT లో విడుదల అయిన సినిమా ఇందులో బలగం సినిమాలో కొమరయ్య పాత్ర చేసిన సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ముత్తయ్య ఒక మారుమూల పల్లెటూళ్లో ఉండే ఒక ముసలాయన ఆయనకు ఒక కొడుకు, కోడలు,మనవడు ఉంటారు అయితే ముత్తయ్య ఎక్కువగా తన పొలంలో పాక లోనే జీవిస్తుంటారు అయితే అతనికి అదే ఊరిలో ఉండే మల్లి అని ఒక కుర్రాడితో అతను సైకిల్ పంక్చర్ లు వేస్తూ జీవనం సాగిస్తుంటాడు
అయితే ముత్తయ్య కి నాటకాలు వేయటం అంటే ఇష్టం ఆ ఇష్టం తోటి మల్లి ని ఫోన్ లో వీడియోలు తీయమని అడుగుతుంటాడు అయితే మల్లిగాడు ఒక సారి వీడియో లు తీస్తాడు కానీ దానిని అనుకోకుండా డిలీట్ చేస్తాడు అన్నట్టు మల్లి కి ఒక లవర్ కూడా ఉంటుంది
ముత్తయ్యకి , మల్లికి మధ్య గొడవ అవ్వుది మరల కలుసుకుంటారు అయితే ఈ సారీ ముత్తయ్య ఒక షార్ట్ ఫిలిం తీయలుకుంటాడు అయితే దానికి లక్ష్ రూపాయలు అవుతుంది అని చెబుతాడు డైరెక్టర్ తన దగ్గర ఉన్న పొలం అమ్మాలనుకుంటాడు ముత్తయ్య అయితే తన కొడుకుకి ఇష్టం ఉండదు
అయితే ముత్తయ్య ఆ వయసులో షార్ట్ ఫిలిం చేశాడు తద్వారా తన కొడుకు దూరం అయ్యాడా తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ మొదట కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది చూడగా పరవాలేదు అనిపించింది మరి అంతగా కాదు జస్ట్ below average !!!
నాని Hit 3rd case సినిమా పై నా అభిప్రాయం !!!
Hit 1 విశ్వక్సేన్, hit 2 అడవి శేష్,Hit 3 నాని డా " శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన hit 3rd case మే నెలలో 1 తారీకున విడుదల అయింది ఇంకా సాలు సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
అర్జున్ సర్కార్ ఒక ఎవరి మాట వినని ఒక పోలీస్ ఆఫీసర్ తనకు తప్పు అనిపించించింది మెంటల్ గా చేస్తుంటాడు అయితే హత్యలు వరుసగా జరుగుతాయి చనిపోయే వ్యక్తి నీ వేలాడదీసి పీక కోస్తూ చంపుతూ ఉంటాడు అయితే ఆ హత్యలు చేస్తుంది మన హీరోనే అసలు ఆధారాలు దొరక్కుండా హత్యలు ఎందుకు చేస్తున్నాడు అన్నది కథ
అసలు అర్జున్ సర్కార్ ఎవరు అంతకుమందు పని చేసిన చోట హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనందరికీ తెలియని డార్క్ వెబ్ గురించి అందులో ఉండే సైకో లు అమాయకులని హత్యలు చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మన హీరో కూడా హత్యలు చేస్తుంటాడు ఈ సినిమా మొత్తం రక్తపాతమే నరకటం,నరకటం,నరకటం ఇదే ఈ సినిమా
హిట్ 1 చూసాను బాగుంది సినిమా హిట్2 కూడా చూసాను అంతగా అనిపించకపోయినా పరవాలేదు అనిపించింది hit 3 మాత్రం అంతగా బాగోలేదు అన్నట్టు ఇందులో ఇందులో అడవి శేష్ కూడా కనిపిస్తాడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి 4 పార్ట్ అదే hit 4 కూడా ఉంది
అందులో కార్తి acp వీరప్పన్ కనిపించ నున్నాడు !!!
28, ఏప్రిల్ 2025, సోమవారం
సారంగ పాణి జాతకం సినిమా పై నా అభిప్రాయం !!!
ప్రియ దర్శి హీరో గా చేసిన సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో కి జాతకం మీద నమ్మకం ఎక్కువ ఒక కారు షోరూం లో సేల్స్ మెన్ గా పనిచేస్తుంటాడు అయితే అదే షోరూం లో మేనేజర్ గా పనిచేస్తున్న మైథిలి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే ఆ విషయం ఒక మంచి రోజు చూసుకుని మైధిలికి చెబుదామనుకునే అనే టైంలో ఆ మైథిలి తిరిగి i love you చెబుతుంది ఇంకా కథ సుఖాంతం అయ్యే టైంలో ఒక చేయిని చూసి జాతకం చెప్పే అవసరాల శ్రీనివాస్ హీరో చెయ్యి చూస్తాడు అయితే తన జీవితం అంతా బాగానే ఉంటుంది కానీ పెళ్లి జరుగుతుంది కానీ ఒక murder చేస్తావు అని చెబుతాడు అప్పటి నుండి హీరో తన ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తాడు
అయితే చివరికి murder చేశాడా ? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అన్నది కథ ఏదో కామెడీ గా ట్రై చేసారు ఒక సారి చూడ వచ్చు !!!
21, ఏప్రిల్ 2025, సోమవారం
ETV Win OTT లో విడుదల అయిన టుక్ టుక్ సినిమా పై నా అభిప్రాయం !!!
ETV Win OTT లో ఈ సినిమా అందుబాటులో దాదాపు నెల రోజులు అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా చూడటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు సరదా జీవితం గడుపుతుంటారు కొమరం దశ నుండి యవ్వనం వయసులోకి వచ్చే దశలో ఉండే కుర్రాళ్ళు అయితే వాళ్ళకి ఒక కెమెరా కొని దానితో షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటారు అయితే దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అయితే దగ్గరలో వినాయక చవితి ఉండటంతో వినాయక చవితి వచ్చిన చందాలతో ఆ కెమెరాను కొనాలని అనుకుంటారు అయితే వినాయక చవితి అయిన తరువాత నిమజ్జనం కోసం వాళ్లకు బండి దొరకదు అయితే వాళ్లకు దగ్గరలో ఒక పాత chetak బండి దానిని కొంచెం మార్పులు చేర్పులు చేసి వినాయక నిమజ్జనం చేస్తారు
అయితే ఒక రోజు ఆ chetak బండిలో మార్పులు కనిపిస్తాయి ఆటోమేటిక్ గా ఆ బండిలో లైట్స్ వెళ్ళటం బండి హ్యాండిల్ అటు ఇటు తిరగటం అయితే బండి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ
అయితే ఆ బండిలో ఆ ముగ్గురు కుర్రాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటారు ఇంతకు అందులో ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది ఆ అమ్మాయి కథ ఏమిటి ఆ అమ్మాయి ఆత్మ ఆ బండిలోకి ఎలా వచ్చింది అన్నది మిగిలిన కథ బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!
18, ఏప్రిల్ 2025, శుక్రవారం
Sony LIV OTT లో విడుదల అయిన Rekha chitram సినిమా పై నా అభిప్రాయం !!!
Rekha chitram సినిమా ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో sony LIV OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో రెండు మాటల్లో !!!
ఈ సినిమా లో హీరో asif ali ఒక పోలీస్ ఆఫీసర్ అయితే సస్పెండ్ అయ్యి ఆ రోజు డ్యూటీలో జాయిన్ అవుతాడు అయితే అనుకోకుండా ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఒక చోట కూర్చుని మందు తాగుతూ ఫోన్ లో లైవ్ లో రికార్డు చేస్తూ తను ఇంకా ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక అమ్మాయిని తను కూర్చొన్న చోటు లోనే తనను పాతి పెట్టమని ఆ పాపం తనను వెంటాడుతుందని గన్ తో షూట్ చేసుకుని చనిపోతాడు
అయితే ఆ కేసు మన హీరో ఆ కేసు ను ఎలా పరిష్కరించాడు అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ ఇది మలయాళం డబ్బింగ్ సినిమా కాబట్టి మొదట్లో కొంచెం బోరింగ్ గా మొదలవుతుంది ఉండే కొలది బాగుంది సస్పెన్స్ సినిమాలు ఇలాగే ఉంటాయి
హీరోయిన్ అవుదామనుకుని వచ్చిన అమ్మాయిని ఎవరు చంపారు ఆ నలుగురు వ్యక్తులకు ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి అన్నది మిగిలిన కథ !!!
14, ఏప్రిల్ 2025, సోమవారం
Netflix లో విడుదల అయిన Perusu సినిమా పై నా అభిప్రాయం !!!
Perusu movie review ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ తెలుగులో అందుబాటులో netflix OTT లో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమాలో పరంధామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు తనకు ఇద్దరు కొడుకులు, భార్య తో ఉంటాడు అయితే ఆ ఊరిలో ఒక కుర్రాడిని అడ్వాళ్లు స్నానం చేస్తుండగా చూస్తున్నాడని ఆ కుర్రాడిని కొడతాడు ఆ కుర్రాడు అది మనసులో పెట్టుకుని ఎలాగైన ఆ పరంధామయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు అయితే ఇంటికి వెళ్ళిన తరువాత అనూహ్యంగా చనిపోతాడు ఆ పరంధామయ్య అయితే ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది అది ఏమిటంటే తను చనిపోయిన తరువాత తన అంగం అలాగే లేచి ఉంటుంది అయితే అది ఫ్యామిలీ మెంబెర్స్ మొదట కంగారు పడతారు అయితే ఆ విషయం బయట జనాలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని ఆ వచ్చిన చుట్టాలతో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు
ఇలాంటి సినిమా అసలు ఎందుకు తీసారో తెలియదు పిల్లలతో ,కుటుంబంతో అసలు చూడలేము కొద్దిగా అసహ్య భావనతో చూడవలసి వచ్చింది సినిమా ఏదో కామెడీగా ట్రై చేసారు కానీ చూడటానికి కొంచెం ఎబ్బెట్టు గా ఉంది మరి నేనెందుకు చూసాను అనకండి అది నా పిచి సినిమా పిచ్చి !!!
12, ఏప్రిల్ 2025, శనివారం
Sony liv OTT లో విడుదల అయిన pravinkoodu shoppu సినిమా పై నా అభిప్రాయం !!!
బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన pravin koodu shoppu సినిమా మలయాళం డబ్బింగ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది సోనీ లైవ్ ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో బేసిల్ జోసెఫ్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు ఒక ఊరిలో ఒక కళ్ళు దుకాణం ఉంటుంది అయితే అక్కడ ఒక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు అయితే అక్కడే కొంతమంది పేకాట ఆడుతూ ,కళ్ళు తాగుతూ ఉంటారు అయితే ఆ హత్య ఎవరు చేసారు అన్నది మిగిలిన కథ
ఈ కథ కొద్దిగా బోరింగ్ గా మొదలవుతుంది చివరకు చూడగా చూడగా బాగుంటుంది అసలు ఆ హత్య ఎవరు చేసారు ఎందుకు చేశారు అన్నది హీరో అదే పోలీస్ ఆఫీసర్ బేసిల్ జోసెఫ్ ఎలా ఆ కేసు ను పరిష్కరించాడు అన్నది కథ బాగానే ఉంది కాకపోతే మరి అంత ఆసక్తి అయితే అనిపించలేదు నాకు
ఈ సినిమా కేవలం బేసిల్ జోసెఫ్ కోసం మాత్రమే చూసాను !!!
5, ఏప్రిల్ 2025, శనివారం
Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!
మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
సిద్దార్థ్ ఒక క్రికెటర్ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం ఆ ఆట కోసం ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇష్టం అయితే చెన్నై లో జరిగే అంతర్జాతీయ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో తను ఒక ప్లేయర్ అయితే అదే అతని చివరి మ్యాచ్ అని అందరూ అనుకుంటారు అయితే తన భార్య మీరా జాస్మిన్ ఒక కొడుకు ఉంటాడు
మరో పక్క మాధవన్, నయన తార భార్య భర్తలు 30 సంవత్సరాలు పైబడిన పిల్లలు పుట్టారు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతారు దానికి కూడా చాలా డబ్బులు కావాలి అయితే మాధవన్ ఒక సైంటిస్ట్ తను తయారు చేసిన ప్రాజెక్ట్ ప్రభుత్వ అనుమతి కోసం ఎన్ని సార్లు ట్రై చేసిన విఫలం అవుతాడు అయితే 50 లక్షలు ఉంటే ఆ ప్రాజెక్ట్ ok చేస్తానని చెబుతాడు అంతకు ముందు కూడా అప్పు చేస్తాడు మరల 50 లక్షలు అంటే ఎలా అని ఆలోచిస్తాడు
అయితే ఇందులో మాధవన్ కి, సిద్దార్థ్ కి అసలు సంబంధం ఏమిటి ఆ చెన్నై లో జరిగే టెస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అన్నది మిగిలిన కథ
మనిషి కి డబ్బు ఉంటేనే మనిషిని మనిషి గుర్తిస్తుంది ఈ సమాజం ఇందులో మంచివారు , చెడ్డవారు అని ఏమి ఉండదు డబ్బు ఆడే నాటకంలో అందరూ నటులే
ఈ సినిమా మొదట కొంచెం స్లో గా మొదలవుతుంది ఇదేమి సినిమా రా బాబు అనుకునేంతల తరువాత అసలు కథ మొదలవుతుంది డ్రామా గా మొదలవుతూ క్రైమ్ థ్రిల్లర్ గా నడుస్తుంది
మీకు సమయం ఉంటేనే చూడండి లేకపోతే స్కిప్ చేయండి !!!
4, ఏప్రిల్ 2025, శుక్రవారం
Home Town web series పై నా అభిప్రాయం !!!
హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది
90s వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు దానిలాగ ఇది కూడా అంటే ఈ కథ 2003 నుండి కథ మొదలవుతుంది ఇందులో రాజీవ్ కనకాల ఒక మధ్య తరగతి కుటుంబం తనకు భార్య, కొడుకు, కూతురు ఉంటారు అయితే తన లాగా తన పిల్లలు భవిష్యత్ మధ్య తరగతిలోనే కాకుండా valla భవిష్యత్ మరి ముఖ్యంగా కొడుకు విదేశాలకు పంపి మంచి భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటాడు అందుకోసం అబ్బాయి పేరు మీద పాలసీ తీసుకుంటాడు
అయితే యుక్త వయసులో ఉన్న కుర్రాడికి ఎలాంటి ఆలోచనలు, చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో అలా ఉంటాడు అసలు చదువు అబ్బదు అమ్మాయి బాగా చదువుతుంది కానీ తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు
అయితే చివరికి కొడుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ మొత్తం 2 గంటలు పైనే ఉంది
నేను 90 s web సిరీస్ చూసాను ఈ హోమ్ టౌన్ web series చూసాను రెండిటిలో నాకు 90 s వెబ్ సిరీస్ బాగుంది
ఇందులో మొత్తం 5 ఎపిసోడ్ లు ఉన్నాయి పరవాలేదు ఒకసారి చూడ వచ్చు !!!
3, ఏప్రిల్ 2025, గురువారం
కర్మ ఫలం !!!
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.
కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.
ఆ బస్సురెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
ఆ బస్సులో వున్న ఒక పెద్దయన ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి ,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి
మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.
చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు.
చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ ..బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు...కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!!
ఆ బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి
ఆ బస్సులో ఉండడం వల్లనే ...ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల..... ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల ,.. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం మారంత మృత్యువాత పడడం జరిగింది
"#కర్మ ఫలం"(పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు ...
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అని అనుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం మన
తల్లిదండ్రులది కావచ్చు!
జీవిత భాగస్వామిది కావచ్చు!
పిల్లలది కావచ్చు!
తోబుట్టువులది కావచ్చు!
మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది #పుణ్య ఫలితం, #ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు.
ఒక సినిమాలో చెప్పినట్లుగా…”బాగుండడం” అంటే 'బాగా'.. ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా కలసి ఉండడం అని అర్థం !!!
కష్టాలు మన మంచికే !!!
కష్టాలు_మన_మంచికే
ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు... ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు?
శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు... నేనో చిన్నకథ చెప్తాను వింటావా?
తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు...
ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుక గా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు..
ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రం లోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.
తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను..
ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే, దాని శరీరం లోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది. కాని అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు.
అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది..
అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.
సర్వేజనా సుఖినోభవంతు !!!
అన్నదానం మహిమ !!!
#అన్నదాన_మహిమ 🙏
పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తనయింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినాసరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక, ఒకనాడాయనకు అన్నదానంవల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.
ఒకాయన ఏమన్నాడంటే, " అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.
అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.
ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు.
దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై 'నీకేం కావాలి?' అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, " అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు " అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.
అప్పుడు దేవి అతనితో “నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు , అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబు తాను, విను:
హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయనదగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషిoచి, ' బాబూ మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, 'నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ' అని ' చెప్పు. 'ఇంతేగదా ?' అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని 'అన్నదానంవల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?' అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.
బ్రాహ్మణుడు 'సరే' అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పి పోయాడు. దారితెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అని ఆత్రముతో అడిగాడు.
హేమవత పర్వతం దగ్గరికి పోవాలి' అన్నాడు బ్రాహ్మడు.
"బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్ర మయిపోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి” అన్నాడు బోయవాడు.
బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లేడు.
చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్తకుoడ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు.
బ్రాహ్మడు, 'నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో' అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.
బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కిందపడుకోబోకండి. పులులు వస్తాయి ' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.
బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడనుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది.
బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తనమూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బాహ్మణునితో “స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను , నడవండి" అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది.
ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. ' పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాల'ని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు.
రాజు గారి భార్య తొమ్మిది నెలలు మోసి, చందమామ లాంటి పిల్ల వాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్ల వాణ్ణి, ' అన్న దానంవల్ల కలిగే ఫలమేమిటో చెప్పు ' అని అడిగేడు.
అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్ద వానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో యిలా అన్నాడు . “ పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చార పప్పూ, పురిషెడు తేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండీ ! ఈమాత్రపు దానానికే ఈ రాజు గారికి కుమారుడైయి పుట్టి, రాజ్య మేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు, నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి."
ఇలా చెప్పేసి, ఆ పిల్లవాడు మరుక్షణం లోనే ఏమీ ఎరుగని పసిపాపలాగ 'తువ్వా, కువ్వా' అని ఏడవడం ఆరంభించాడు.
బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి, తన వూరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పేడు. ఆ దంపతులు అప్పటినించి విడవకుండా అన్న దానం చేస్తూ ధన ధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు !!!
ఛత్రపతి శివాజీ వర్ధంతి నేడు !!!
#చత్రపతి_శివాజీ_వర్ధంతి 🙏
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శివాజీ సా.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది.
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు !!!
14, మార్చి 2025, శుక్రవారం
Ponman సినిమా పై నా అభిప్రాయం !!!
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయికి పెళ్లి కుదురుతుంది వాళ్ళ అన్నయ్య ఇంటి విషయాలు పట్టించుకోకుండా పార్టీ కోసం బలాదూర్ గా తిరుగుతుంటాడు అయితే పెళ్ళికొడుకు ఫ్యామిలీ పెళ్లి కూతురుకి 25 సవర్లు బంగారం అడుగుతారు అయితే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తి ద్వారా ఆ బంగారం ఇప్పిస్తాడు అయితే అయితే ఆ పెళ్ళిలో వచ్చిన చదివింపులు ద్వారా వచ్చిన డబ్బుతో ఆ 25 సవర్లు బంగారం చెల్లుబాటు అయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంటారు అయితే పెళ్లి జరుగుతుంది
ఆ పెళ్లి అయిన తరువాత వచ్చిన చదివింపులు 12 సావర్లు మాత్రమే ఉంటాయి మిగిలిన 13 సవార్లు బంగారం వాళ్ళు ఇవ్వరు అయితే వాటిని తిరిగి ఎలా సంపాదించాడు అన్నది మిగిలిన కథ
చాలా సింపుల్ గా ఉంటుంది కానీ బాగుంది బంగారం మనిషిని ఎంత దిగజారుస్తుంది అన్నది ఈ సినిమా లో చూపించడం జరిగింది !!!
హోలీశుభాకాంక్షలు !!!
12, మార్చి 2025, బుధవారం
బల్లి పాడు శ్రీ మదన గోపాలస్వామి రథోత్సవం,మందు కాల్పు మహోత్సవం వీడియో !!!
ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని బల్లి పాడు గ్రామంలో శ్రీ మదన గోపాల స్వామి రథోత్సవం, మరియు మందు కాల్పూ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన వీడియో మీ కోసం !!!
Chava సినిమా పై నా అభిప్రాయం !!!
చావా సినిమా ఇది హిందీ సినిమా అయినప్పటికీ అన్ని భాషలలో విడుదల అవ్వాల్సిన సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అయ్యింది అనుకోండి అసలు ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!
ఛత్రపతి శివాజీ మరణం తరువాత మరాఠా సామ్రాజ్యం అంతా తన అధీనంలోకి వచ్చేస్తుంది అనుకుంటాడు ఔరంగా జెబ్ అయితే అప్పుడు వస్తాడు శంభజి మహారాజ్ తన అధీనంలో ఉన్న అన్ని రాజ్యాలు కోసం పొరడతాడు ఛత్రపతి శివాజీ ఔరంగ్ జేబ్ తో ఎంత యుద్ధం చేస్తాడో అలాగే శంబాజీ మహారాజ్ కూడా యుద్ధం చేస్తాడు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు అయితే శంభజీ మహారాజ్ నీ ఔరంగజేబు ఎలా పట్టుకున్నాడు
అలా పట్టు కోవటానికి కారణం ఎవరు ? ఆ తరువాత ఔరంగజేబు షాంబాజీ మహారాజ్ నీ ఎన్ని చిత్ర హింసలు చేశాడు అన్నది మిగిలిన కథ !
మతం మారమని ఎంత ప్రయత్నించినా మార లేదు గోళ్ళు పీకి, ఎర్రగా కాల్చినా చువ్వలతో కంటిలో పొడిచి,నాలుక పీకి ఇంకా చాలా రకాలుగా హింసిస్తాడు అయిన మార లేదు నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండటం చాలా అదృష్టం మతం అంటే అమ్మ తో సమానం అని తను పుట్టిన మతం నుండి వేరొక మతంలోకి మారలేదు
అయితే యూట్యూబ్ వీడియో లలో అక్కడే తల నరికి తన శరీరాన్ని ముక్కలు ముక్కలు గా నరికి చెరువులో పడవేశారు అని చూపెట్టడం జరిగింది నిజంగా ప్రతి హిందువు తప్పక చూడవలసిన సినిమా బాగుంది !!!
Kingston సినిమా పై నా అభిప్రాయం !!!
A.R. రెహమాన్ మేనల్లుడు g.v prakash kumar నటించిన సినిమా కింగ్స్టన్ తమిళ్ సినిమా తెలుగులో మార్చ్ 7 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లాసయం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇది హార్రర్ కథాంశం తో నిండిన కథగా ఈ సినిమా నడుస్తుంది ఇందులో హీరో వాళ్ళు చేపల పట్టి జీవనం సాగిస్తుంటారు అయితే అనూహ్యంగా హీరో చిన్నప్పటి నుండి వాళ్లకు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు చనిపోతుంటారు అయితే అప్పటినుండి ఆ ప్రాంతంలో ఎవరు చేపలు పట్టటానికి వెళ్ళరు అయితే హీరో ఆ ఊరిలో ఉండే ఒక రౌడీ దగ్గర పనిచేస్తుంటాడు అయితే రౌడీ స్మగ్లింగ్ చేస్తుంటాడు ఆది తెలియక హీరో బృందంలో ఒకరు చని పోతాడు అప్పుడు హీరో తెలుస్తుంది అది డ్రగ్స్ అని ఆ రౌడీ తో గొడవపడి బయటకు వచ్చేస్తాడు హీరో అయితే వాళ్ళ దగ్గర ఉన్న సముద్రం తీర ప్రాంతంలో చేపలకు వెళ్లినవారు ఎందుకు చనిపోతున్నారు అని తెలుసుకోవటానికి హీరో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్తాడు అయితే అక్కడికి వెళ్లిన తరువాత హీరో ఎలాంటి పరిస్థితులు ఎదురుకొన్నాడు
నిజంగా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయా అసలు ఈ పని ఎవరు చేస్తున్నారున్నది మిగిలిన కథ ఫస్ట్ ఆఫ్ అనత సో సో గా నడుస్తుంది 2nd హాఫ్ నుండి కొద్దిగా పరవాలేదు అనిపించింది సినిమా మొత్తానికి టైం నీ పాడు చేసుకుని చూడవద్దు సినిమా వన్ టైం వాచబుల్ అది కూడా ఏ సినిమా ఖాళీ లేకపోతే చూడండి అంతే ?
8, మార్చి 2025, శనివారం
3, మార్చి 2025, సోమవారం
భగవద్గీత ఎందుకు చదవాలి ?
భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?
ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న
తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు.
రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న
బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటాడు.
మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…
పొద్దున పూట తాతలానే తానూ
భగవద్గీత చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…
ఒకరోజు ’తాతా.. నువ్వు చదివినట్టు
నేనూ భగవద్గీతను చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే మర్చిపోతున్నాను. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి?
ఏంటి ప్రయోజనం’ అని తాతని
అడిగాడు మనవడు.
పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి..
‘కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..’ అని చెప్పారు.
‘సరే తాతా..’ అని మనవడు బుట్ట తీసుకెళ్ళి నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…
అది చూసి తాతగారు…’ఓరి మనవడా ఇంకొంచెం వేగం పెంచు...
ఇంటికి రావటంలో’ అని సలహా చెప్పారు!
సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు. ‘బుట్ట ఖాళీ తాతా! బుట్టలో
నీళ్ళు ఎలా నిలుస్తాయి? నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు.’
తాత చెప్పాడు…’లేదు లేదు బుట్టతోనే
నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…
ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని
అవ్వచ్చు.’ అని మనవడిని
ప్రోత్సహించారు…
మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….
ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..’ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…’అని…!
మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది…!
తాతగారు చెప్పారు…’భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధంలో మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయంలో.. ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…
ఇవన్నీ అనుభవపూర్వకంగా..
ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు…’
అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు
తాతగారు !!!
2, మార్చి 2025, ఆదివారం
తణుకు చరిత్ర తెలుసుకో ?
తణుకు...
స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాంతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుతుంది. ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని, అలాగే చాలా గ్రామాలకు పేర్లు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్రపురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు. ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉండడం గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది. అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు, పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు), చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం), వడ్లూరు అప్పటి ధాన్యాగారం, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం), ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు. అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది.
గోస్తని నది పుణ్య జలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
తణుకులోని కేశవరాయ దేవాలయంలోని మండపంలోని ఒక స్తంభంపై తెలుగులో వ్రాసిన శాసనం ఒకటి బయటపడింది.1443 శకం ఫిబ్రవరి 24న చెక్కినట్లుగా గుర్తించారు.
మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది !!!
పులిహోర చరిత్ర ?
పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో.. దాని వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకోండి..
పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఈ విషయం మనకు పురాణ కథలు,చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది.
కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు. కుళుత్తుంగ చోళుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టటం ఒక ఆచారంగా ఉండేదట. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ఈ పద్దతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచటం ప్రారంభం అయింది.
పులిహోరలో శుభానికి,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒక వైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతుంది. హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పటంతో కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది. పులిహోర అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టటం మనం చూస్తూనే ఉంటాం.
తిరుమల తిరుపతి లో పులిహోరను రాశి గా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు !!!
27, ఫిబ్రవరి 2025, గురువారం
తేతలి రాజేశ్వర స్వామి దేవాలయ వీడియో !!!
పశ్చిమ గోదావరి జిల్లా లోని తేతలి గ్రామంలో వెలసిన శ్రీ రాజేశ్వర స్వామి వారి దేవాలయం శివరాత్రి సందర్భంగా !!!
నత్త రామేశ్వరం రథం ఊరేగింపు వీడియో !!!
మహా శివరాత్రి సందర్భంగా 26/02/2025 నత్త రామేశ్వరం గ్రామంలో రథం ఊరేగింపు జరిగింది దానికి సంబంధించిన వీడియో మీ కోసం
మహా శివ రాత్రి శుభాకాంక్షలు !!!!!!
#మహాశివరాత్రి 🙏
_*శివరాత్రి అంటే ? శివరాత్రి పూజావిధానం ఎలా చేయాలి
_వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
*☘శివరాత్రులు ఎన్ని ?☘*
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
నిత్య శివరాత్రి ,
పక్ష శివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే 'శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే !
అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా – ‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’
అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.
☘ఉపవాసం అంటే ఏమిటి ?☘
దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘
విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”
వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.
అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.
శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
☘ప్రదక్షణ విధులు☘
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.
☘బిల్వ దళం ప్రాముఖ్యత:☘
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది !!!
24, ఫిబ్రవరి 2025, సోమవారం
అన్నదాత సుఖీ భవ !!!
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్న్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం ఇచ్చినా యెంతో పుణ్యదాయకం.
ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో..!! యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలిగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు.
నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో..!!
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున , “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్క కు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది !!!
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...





.jpeg)











.jpeg)







.jpeg)