13, నవంబర్ 2025, గురువారం

Yenugu tondam ghatikachalam movie review !!!

 

ఏనుగు తొండం ఘటికాచలం Etv win OTT లో అందుబాటులో ఉంది రవి బాబు నటించి దర్శకత్వం వహించిన సినిమా సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!

ఏనుగు తొండం ఘటికాచలం (నరేష్) కుటుంబానికి పెద్ద తనకు ఇద్దరు కొడుకులు వాళ్లకు పెళ్లిళ్లు చేసి కోడళ్లు మనవళ్ల తో రెంట్ ఇంటిలో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తుంటారు అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఘటికాచలం పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తారు ఇద్దరు కొడుకులు అసలు ఏ పని చేయకుండా ఆ వచ్చిన డబ్బులతో ఇంటిని గడుపుతుంటారు

అయితే తనకు వచ్చే పెన్షన్ డబ్బుల గురించి ఆలోచించటం తప్పు తనను ఎవరు పట్టించుకోవటం లేదని ఒంటరి జీవితాన్ని భరించలేక పోతున్నానని ఒక రోజు ఘటికాచలం వాళ్ళ కుటుంబం తో తను అదే ఇంటిలో పనిచేసి పని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన్ని చెప్పి అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకుంటాడు 

అయితే తన నాన్నకు పెళ్లి అయితే వచ్చే పెన్షన్ డబ్బులు కూడా తమకు రావని ఇద్దరు కొడుకులు , వాళ్ళ భార్యలు ఆలోచించి ఘటిక చలానికి ఇన్స్యూరెన్స్ చేయించి తరువాత తనని చంపేసి ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులతో హాయిగా బ్రతకవచ్చు అనుకుంటారు 

అయితే వాళ్ళిద్దరూ కొడుకులు అన్నట్టుగానే జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ డబ్బు కోసం మనిషి ఎంత నీచానికి అయినా దిగజారుతాడు అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ దర్శకుడు రవి బాబు స్టైల్ లో కామెడీ టచ్ ఇచ్చి ఫినిష్ చేయటం జరిగింది 

రొటీన్ కథే చెప్పుకోవటానికి ఏమి లేదు కామెడీ కోసం ఒక సారి ట్రై చేయవచ్చు !!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈషా సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈషా సినిమా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది ఇది ఒక హారర్ కథాంశంతో వచ్చిన సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఒక ఇ...