3, ఏప్రిల్ 2025, గురువారం

కష్టాలు మన మంచికే !!!

 కష్టాలు_మన_మంచికే


ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు... ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు?


శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు... నేనో చిన్నకథ చెప్తాను వింటావా?

తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు...


ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు.  దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుక గా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు.. 


ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రం లోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.


తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను..


ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే, దాని శరీరం లోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది. కాని అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు.


అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది..


అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.


సర్వేజనా సుఖినోభవంతు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...