10, మే 2025, శనివారం

ETV Win OTT లో విడుదల అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పై నా అభిప్రాయం !!!


 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమా టైటిల్ చూస్తే మనకు ముందుగా గుర్తొచే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఆయన అభిమాని అదే anchor ప్రదీప్  హీరో గా నటించిన  సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో సివిల్ ఇంజినీర్ చిన్నప్పటి నుండి తను ఎవరికి అయిన సహాయం చేస్తే తిరిగి అది తల కి చుట్టుకుంటుంది అని ఎవరికి సహాయం చెయ్యడు 

అయితే ఇంకా హీరోయిన్ పరిస్థితికి వస్తె తమిళనాడు దగ్గరలో మన ఆంధ్ర చిట్టా చివరి గ్రామం ఒకటి ఉంటుంది ఆ ఊరిలో అందరికీ దాదాపు 60 మంది అబ్బాయిలు పుడతారు అయితే ఒక వ్యక్తి కి మాత్రం అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పుట్టడంతో ఆ ఊరు లో వర్షాలు పడి సుభిక్షం గా ఉంటుంది ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరి లో పుట్టిన ఆడపిల్ల వేరే ఊరికి వెళ్లకుండా ఆ అమ్మాయి పెద్దయ్యాక ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తన ఆస్తిని, తన సర్పంచ్ పదవిని ఇస్తానని మాట ఇస్తాడు

అయితే సివిల్ ఇంజినీర్ అయిన మన హీరో ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆక్కడ ఆ అమ్మాయిని మన హీరో ప్రేమించాడా ? దానికి ఆ ఊరి జనం ఏమి చేశారు అన్నది మిగిలిన కథ పరవాలేదు కానీ ఎందుకో ఎక్కడ కొద్దిగా తేడా అనిపించింది మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించింది అయితే మీరు ప్రదీప్ ఫ్యాన్ అయితే ఒకసారి చూసే దైర్యం చేయవచ్చు ఆ తరువాత మీ ఇష్టం !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...