21, ఏప్రిల్ 2025, సోమవారం

ETV Win OTT లో విడుదల అయిన టుక్ టుక్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

ETV Win OTT లో ఈ సినిమా అందుబాటులో దాదాపు నెల రోజులు అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా చూడటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు సరదా జీవితం గడుపుతుంటారు కొమరం దశ నుండి యవ్వనం వయసులోకి వచ్చే దశలో ఉండే  కుర్రాళ్ళు అయితే వాళ్ళకి ఒక కెమెరా కొని దానితో షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటారు అయితే దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అయితే దగ్గరలో వినాయక చవితి ఉండటంతో వినాయక చవితి వచ్చిన చందాలతో ఆ కెమెరాను కొనాలని అనుకుంటారు అయితే వినాయక చవితి అయిన తరువాత నిమజ్జనం కోసం వాళ్లకు బండి దొరకదు అయితే వాళ్లకు దగ్గరలో ఒక పాత chetak బండి దానిని కొంచెం మార్పులు చేర్పులు చేసి వినాయక నిమజ్జనం చేస్తారు 

అయితే ఒక రోజు ఆ chetak బండిలో మార్పులు కనిపిస్తాయి ఆటోమేటిక్ గా ఆ బండిలో లైట్స్ వెళ్ళటం బండి హ్యాండిల్ అటు ఇటు తిరగటం అయితే బండి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ  

అయితే ఆ బండిలో ఆ ముగ్గురు కుర్రాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటారు ఇంతకు అందులో ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది ఆ అమ్మాయి కథ ఏమిటి ఆ అమ్మాయి ఆత్మ ఆ బండిలోకి ఎలా వచ్చింది అన్నది మిగిలిన కథ బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...