16, నవంబర్ 2021, మంగళవారం

"Scam 1992 " webseries పై నా అభిప్రాయం !!!

 Scam 1992 ఇది జరిగినప్పుడు బహుశా నాకు 2 లేదా 3 సంవత్సరాలు ఉంటాయి అప్పట్లో మనకు ఏమి తెలియదు కాని 2005 ,2006 ఆ టైం లో అనుకుంటా వార్తల్లో అడపా, దడపా స్కాం 1992 గురించి, హర్షద్ మెహతా గురించి వార్తల్లో వచ్చేది ఇక ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం !!!

Sensex అసలు ఇది ఏమిటో ఎన్ని సార్లు అర్థం చేసుకోవాలని చూసినా ఇది ఒక puzzle ల ఉండేది ఇప్పుడు అంతే ఇక విషయానికి వద్దాం హర్షద్ మెహతా ఒక గుజరాతీ అయితే వ్యాపార నిమిత్తం బొంబాయి లో ఉంటారు అయితే దిగువ మధ్య తరగతి కుటుంబం వీరిది శాంతి లాల్ మెహతా కి ఇద్దరు కొడుకులు ఒకరు హర్షద్ మెహతా, మరొకరు అశ్విన్ మెహతా అయితే శాంతి లాల్ మెహతా బట్టల వ్యాపారం చేసి మోసపోయి దివాళా తీసి ఉన్నాడు అపుడు ఇంటికి పెద్ద కొడుకు హర్షద్ మెహతా  బంగారం వ్యాపారం చేసేవాడు అలా కాదు అని నిర్ణయించుకుని 

Bombay stock exchange గురించి తెలుసుకుని ఎలాగోలా. అందులో మెళకువలు నేర్చుకుంటాడు హర్షద్, అశ్విన్ ఇద్దరు మెల్లగా స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు

అలా హర్షద్ మొత్తానికి షేర్ మార్కెట్ కింగ్ అవుతాడు ఆ తరువాత మరో మనీ మార్కెట్ లోకి కూడా అడుగు పెడతాడు మొత్తానికి బాగానే సంపాదిస్తాడు

అది చూపి బ్యాంక్ లో లోన్ తీసుకుని వాటిని బ్యాంక్ ఖాతాలలో చూపకుండా చేస్తాడు ఇది మీకు చెబితే అర్థం కాదు మీరు చూడాలి 

ఇందులో వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు కాని సిరీస్ అయితే బాగుంది

అసలు హర్షద్ మెహతా ఎలా షేర్ మార్కెట్ లోకి ప్రవేశించాడు, ఎలా బ్యాంక్ లని మోసం చేసాడు, హర్షద్ మెహతా వెనుక ఎవరు ఉన్నారు,ఈ మోసం ఎలా బయట పడింది చివరకు హర్షద్ మెహతా ఎలా చనిపోయాడు అన్నది కథ బాగుంది మొత్తం 8 గంటలు పైనే ఉంది కాని బాగుంది !!!👍👍👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!