29, జూన్ 2021, మంగళవారం

ఆనందయ్య మందు వాడే పద్దతి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !!!

 కరోనా నివారణకు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందని ఆ నోటా ఈ నోటా పాకీ వార్తల్లో వింటూ చివరికి మా ఊరు వచ్చింది ఆ మందు ఇవాళ ఉదయం వేసుకున్నాను

గోంగూర పచ్చడి మాదిరి పుల్ల పుల్లగా ఉంది ఇక దానికి సంబంధించి వాడే పద్దతి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీటి లో ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం !!!

1. మందు "బఠాని గింజంత" తీసుకుని నాలుకపై పెట్టుకుని చప్పరించి తరువాత మంచి నీరు తాగాలి,

2.ఉదయం ,రాత్రి 2 రోజులు వాడాలి

3.మందు వేసుకునే ముందు ఒక గంట ఏమి తిన రాదు,త్రాగ రాదు

వేసుకున్న తరువాత 1 గంట ఏమి తిన రాదు, త్రాగ రాదు

4.ఒక ప్యాకెట్ మందు ఐదుగురు కి సరిపోతుంది 

5.మందు తీసుకునే రెండు రోజులు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి, పల్చటి మజ్జిగ త్రాగాలి, మాంసాహారం తీసుకోరాదు

6.7 సంవత్సర లోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, మెన్సస్ సమయంలో స్త్రీలు వాడ రాదు

7.మందు ఫ్రిడ్జ్ లో ఉంచరాదు , అలాగే 3 రోజులు మించి నిలువ ఉంచారాదు

8.వేరే జబ్బులున్నవారు ఆ మందులకు ఈ ముందుకు కనీసం 1 గంట సమయం వ్యవధి ఉండాలి

9 మందు ప్యాకెట్ నుండి తీసి ఎండలో కానీ,గాలిలో గాని అరబెడితే మంచిది

10. ఈ రెండు రోజులు టీ, కాఫీ లు త్రాగ రాదు

  ఈ పద్ధతులు పాటిస్తే మంచిది అని చీటిలో రాసి ఉంది ఏది ఏమైనా ఉచితంగా వస్తుంది కాబట్టి ఏ పుట్టాలో ఏమి పాము ఉందొ తెలియదు కాబట్టి ఒకసారి ప్రయత్నిస్తే తప్పు లేదు ఏమంటారు ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!