30, జూన్ 2021, బుధవారం

" బాలా " పరదేశి సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ డైరెక్టర్ బాలా సినిమా చూడాలంటే ఒక విధమైన ఆర్ట్ ఉండాలి నిజంగా నిజాన్ని తనదైన శైలిలో ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు

జీవితాలను కళ్లెదుటే కట్టినట్టు చూపిస్తాడు ఇక 2013 వ సంవత్సరంలో విడుదల అయిన పరదేసి సినిమా ఒక అద్భుతం

ఇక కథ విషయానికి వస్తే స్వాతంత్ర్య రాక ముందు బానిస బతుకులు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం దక్షిణ భారతదేశంలో సాలూరు అనే ఒక ఊరిలో కొండ జాతి ప్రజలు నివాసిస్తుంటారు 

వారికి డబ్బులు, ఆశ చూపి ఒక దళారి టీ ఎస్టేట్ లో రాళ్లు రప్పలతో కూడిన ప్రదేశాలు చదును చేయటం ఆ ఎస్టేట్ లోకి వస్తే పైకి పోవటం తప్పించి బయట పడలేం అదే ఈ సినిమా కథ

నిజంగా డైరెక్టర్ బాలా గారికి హ్యాట్సాఫ్ cheppali commercial సినిమాలు చూసి చూసి విసిగి చెందినవారికి బాలా సినిమాలు చూపించాలి

జీవితం నిజంగా ఇంత దుర్భరంగా ఉంటుందా అని  పిస్తుంది బాలా సినిమాలు ,శివ పుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని , ఇలా చాలా సినిమాలు ఉన్నాయి 

ఈ సినిమాలు చూసినప్పుడు ఆ రోజు లేదా రెండు రోజులు ఆ సినిమా కథ గురించి ఆలోచిస్తాం అలా ఉంటాయి మరి సినిమాలు 

ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది చూడవలసిన వారు ఒక సారి చూడండి !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!