13, డిసెంబర్ 2021, సోమవారం

" మా ఊరి పొలిమేర " సినిమా పై నా అభిప్రాయం !!!

 

మా ఊరి పొలిమేర ఈ సినిమా డిస్నీ hotstar ott లో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం ఇందులో గెటప్ సీను, సత్యం రాజేష్, బాలదిత్య ప్రధాన పాత్రలో చేశారు ఇక కథ ఎలా ఉందో చూద్దాం !!!

రాజేష్, బాలదిత్య అన్నదమ్ములు, గెటప్ శీను కూడా వీళ్ళతో పాటు కలిసే పక్క పక్కనే ఉంటారు ఇక చిన్న పల్లెటూరు అయితే ఆ ఊరిలో కొందరు చనిపోతుంటారు అయితే అక్కడక్కడ చేత బడి చేసినట్టు నిమ్మకాయలు, ముగ్గులు, పుర్రెలు ఇవన్నీ కనిపిస్తాయి

అయితే ఈ సినిమా కొన్ని సన్నివేశాలు పెద్దలకు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన వారు చూడాలి ఈ సినిమా అదే ఊరిలో ఒక గర్భవతి కూడా చనిపోతుంది రాజేష్ ని అనుమానించి అతడిని ఆ చితిలోనే వేసి చంపేస్తారు ఇంతకీ ఆ చేతబడులు చేసేది సత్యం రాజేష్ అని అతడిని చంపేస్తారు

బాలదిత్య పోలీస్ కానిస్టేబుల్ తన అన్నయ్య చావుకు కారణం ఏమిటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అందులో నిజాలు తెలుసుకుంటాడు ఇంతకీ ఆ ఊరిలో చేతబడులు చేసేది వాళ్ళ అన్నయ్య రాజేష్ కానీ పైకి మాత్రం మంచివాడిలా నటిస్తాడు అసలు ఎందుకు ఇలా చేసాడు అన్నది చూడాలి సినిమా దీనికి కోన సాగింపుగా 2 పార్ట్ కూడా ఉంది క్లైమాక్స్ లో చూపిస్తాడు వాళ్ళ అన్నయ్య బ్రతికే ఉంటాడు అది కూడా కేరళలో చూపిస్తాడు పర్వాలేదు చిన్న సినిమా అయినా బాగానే డీల్ చేశారు over Expertation తో కాకుండా మాములుగా కళాక్షేపం కోసం ఒక సారి చూడవచ్చు 

కొన్ని scene లు మాత్రం పెద్దవారికి మాత్రమే !!!

1 కామెంట్‌:

మేటి మాట !!!