11, డిసెంబర్ 2021, శనివారం

"కొండ పొలం " సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఉప్పెన సినిమా మంచి విజయం సాదించింది ఆ సినిమా తర్వాత హీరో vishnav తేజ్ హీరోగా చేసిన రెండవ సినిమా కొండ పొలం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, క్రిష్ జాగర్లమూడి direction లో వచ్చిన సినిమా ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

ఈ కథ ఒక నవల ఆధారంగా తీసిన సినిమా అని మొదటి టైటిల్స్ లో చెప్పటం జరిగింది హీరో సివిల్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కి వెళ్తాడు అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం బాగా చెప్తాడు అయితే అక్కడ నీ గురించి చెప్పు అనేకడికి హీరో తన కథ గురించి చెప్పటం జరుగుతుంది

హీరో వాళ్ళ కుటుంబం గొర్రెల మేపుకునే కుటుంబం వాళ్ళ గ్రామం ఎక్కడో అడవులు దగ్గర ఉంటుంది అయితే వర్షాలు సరిగ్గా పడక ఆ ఊరిలో గొర్రెలు మేపుకునేవారు కొన్నాళ్ళు పాట గొర్రెలని అడవులలోకి కొడలపైకి తొలికెళ్తారు మరల వాన వచ్చి అంతా సక్క బడ్డక వస్తారు అయితే వాళ్ళ కుటుంబం లో అందరికంటే హీరో ఎక్కువ చదువుకుంటాడు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు 

హీరో వాళ్ల తాత హీరో ని వాళ్ల నాన్నతో పాటు తోడు వెళ్ళమని చెబుతాడు ఆ వెళ్ళేవారిలో హీరోయిన్ కూడా ఉంటుంది అయితే ఆ అడవిలో గొర్రెలు మెపే వారి కష్టాలు గురించి దొంగలు, గొర్రెల మందులను పెద్ద పులి నుండి కాపాడటం ఇది commercial సినిమా కాదు మన చుట్టూ ఉండే పరిసరాలను మనం కపడుకోకపోతే మన మనుగడకు ముప్పు ఎలా వస్తుంది అన్నది కథ


అయితే హీరో ఈ కథ నుండి ఏమి తెలుసుకున్నాడు అన్నది కథ హంగులతో, ఆర్భాటలు గురించి చూసే సినిమా కాదు ఇది వర్షం పడక, అసలు పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అడవులు ఇష్టం వచ్చినట్టు నరికేయటం వల్ల ఏమి జరుగుతుంది అని చెప్పే కథ !!!



 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!