8, నవంబర్ 2021, సోమవారం

పెద్ద నోట్ల రద్దు నేటితో 5 సంవత్సరాలు పూర్తి ?

 అది నవంబర్ 8 తారీఖు 2016 వ సంవత్సరం నాకు తెలిసి నేను అప్పడే జీతం తీసుకున్నాను మధ్య తరగతి జీవితాలలో జీతం తీసుకున్న రోజే పండగ అసలైన పండగ ఎంతో సంతోషంగా ఉన్నాను

అప్పుడు పడ్డాది అసలైన పిడుగు నేను తీసుకున్న జీతం మొత్తం 500, 1000 రూపాయల కాగితాలు ఆ రోజు నుండి పెద్ద నోట్లు రద్దు అని ప్రకటన చేశారు కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయింది ఆ తరువాత బ్యాంక్ లు చుట్టూ తిరిగి ఎలాగైతే ఏం ఆఖరికి పని అయ్యింది కానీ బ్యాంక్ లు చుట్టూ తిరిగి, తిరిగి నిజంగా ఒక రకం అంతే 

నేను అంత పెద్ద మేధావిని కాదు గాని అసలు నోట్లు రద్దు వల్ల ఇబ్బంది పడింది మాత్రం సామాన్య ప్రజలు నిజముగా ఇది నిజం

నేటితో ఆ పీడ కలకి 5 సంవత్సరాలు అయ్యింది అప్పుడు చూడాలి పాత 500, 1000 రూపాయలు నోట్లు గురించి హాస్య ఛలోక్తులు, ఫన్నీ వేషాలు నిజంగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది నిజంగా

చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆరోజుల్లో నేను అనే కాదు బహుశా జీతం మీద ఆధారపడి బ్రతికే ప్రతివాడు నాలాగే బాధ పడుంటాడు😞😞😞

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!