Skip to main content

" Most eligible బ్యాచ్ లర్" సినిమాపై నా అభిప్రాయం !!!

అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలెజిబుల్ బ్యాచ్ లర్ సినిమా పూజ హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం అన్నట్టు ఈ సినిమా ఆహా ott లో విడుదల అయ్యింది 
అమెరికాలో జాబ్ చేస్తుంటాడు అఖిల్ ఇండియాలో పెద్ద కుటుంబం తనకు 20 పెళ్లి సంబంధాలు ను చూస్తారు వాటిలో తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లి అమెరికాలో settle అవుదామని అనుకుంటాడు 
పెళ్లి చూపులు చూడటానికి అమెరికా నుండి ఇండియా కి వస్తాడు ఆ 20 మంది అమ్మాయిలలో ఒక అమ్మాయి పూజ హెగ్డే ఉంటుంది అయితే జాతకాలు కలవు లేవని ఆ ఫోటో తిరిగి ఇచ్చేయటానికి వెళ్తాడు అయితే అనుకోకుండా ఆ ఫోటో మిస్ అవుతుంది వాళ్ల నాన్న ఆ ఫోటో కోసం చాలా గొడవ పెడతాడు
ఈ క్రమంలో హీరోయిన్ ని కలుస్తాడు హీరోయిన్ ఆటిట్యూడ్ కి హీరో ఫిదా అయిపోతాడు అప్పటి నుండి ఎన్ని సంబంధాలు చూసిన నచ్చవు
పెళ్లి కి ముందు కాదు పెళ్లి తరువాత కాపురాలు ఏ విధంగా ఉంటాయి  అసలు పెళ్లి అయిన తరువాత భార్య భర్తలు మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే కథాంశం తో తీశారు ఈ సినిమా 
ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది avereage సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

Comments

Popular posts from this blog

కలర్ ఫోటో సినిమాపై నా అభిప్రాయం !!!

 ప్రేమ కధలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి అలాగే మన చుట్టూ పక్కల జరిగే వాస్తవ సంఘటన లాగే ఉంటాయి ప్రేమ కు రంగుతో, కులంతో,మతంతో పనిలేదు దానికి ఎటువంటి హద్దులు ఉండవు ఇక సినిమా విషయానికి వస్తే ఒక గొప్పింటి అమ్మాయి,ఏమి లేనటు వంటి కనీసం అందంగా కూడా లేనటువంటి అబ్బాయికి జరిగిన పేమ కథే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చూసిఉంటాము కానీ ఈ సినిమాలో హీరో చివరికి చనిపోతాడు  అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ సినిమా పాత రోజుల్లో తీసినటువంటి సినిమా కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు !!!

"లవ్ స్టొరీ "సినిమా పై నా అభిప్రాయం !!!

 లవ్ స్టొరీ నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్ గా నటించిన శేఖర్ కమ్ముల direction లో వచ్చిన సినిమా లవ్ స్టొరీ september 24 థియేటర్ లో విడుదల అయ్యింది ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం  హీరో రేవంత్ (నాగ చైతన్య ) ఒక బలహీన వర్గం కులంలో పుడతాడు చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూ హైద్రాబాద్ లో ఒక డాన్సింగ్ fitness సెంటర్ లో నడుపుతూ ఉంటాడు ఆ ఇంటి పక్కింటిలో మౌనిక ( సాయి పల్లవి ) తన ఫ్రెండ్ ఇంటిలోకి ఉద్యోగం కోసం అక్కడికి వస్తుంది అక్కడ పక్కనే అందరికి డాన్స్ లు నేర్పిస్తుంటాడు అలా వారిద్దరికీ పరిచయం పెరుగుతుంది చివరికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది ఇద్దరిది ఒకే ఊరు కానీ మౌనిక ఉన్నత కులం, రేవంత్ డి లేని కులం వాళ్ళ ఇంటిలో అసలు ఒప్పుకోరు అయితే చివరకు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారా లేదా అన్నది సినిమా కథ ఈ సినిమా బాగానే ఉంది కాని క్లైమాక్స్ అంతగా బాగోలేదు కానీ ఓవర్ expertation తో సినిమా చూడొద్దు సాయి పల్లవి డాన్స్ బాగా చేసింది, నాగ చైతన్య కూడా డాన్స్ బాగా చేసాడు  శేఖర్ కమ్ముల సినిమా అంటే ఫ్యామిలీ తో పాటు చూసే సినిమా లే ఉంటాయి ఇది కూడా అంతే బాగుంది సినిమా చూడ వచ్చు !!!

"జాతి రత్నాలు" సినిమా పై నా అభిప్రాయం !!!

 జాతి రత్నాలు మొన్న శివరాత్రి సందర్భంగా విడుదల అయిన సినిమా జాతి రత్నాలు ఈసినిమా ఎలాగా ఉందంటే జాతి రత్నాలు ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటునుండి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చూసాను తీరా విడుదల అయ్యాక ఉత్సాహంతో సినిమా చూస్తే అదంతా ఆవిరి అయిపోయింది ముగ్గురు ట్రేండింగ్ లో ఉన్న మంచి కామెడీ రన్ చేయగల యాక్టర్స్ కాకపోతే సినిమా కథ విషయం లొనే ఎదో తేడా కొట్టిందేమోనని నా డౌట్ ఇక కథ విషయానికి వస్తే జోగి పేట్ లో ఉండే 3 అబ్బాయిలు పని పాట లేకుండా బేవర్సు గా తిరుగుతుంటారు అందులో ఒకడు హీరో ఖాళీ గా తిరిగితే అందరూ తిడుతున్నారని హైద్రాబాద్ లో ఏమైనా జాబ్ చేద్దామని బయలుదేరతాడు అతనితో పాటు ఆ మిగిలిన ఇద్దరు కూడా హైద్రాబాద్ వెళ్తారు అయితే అక్కడ అనుకోకుండా ఒక మినిస్టర్ మర్డర్ attempt కేస్ లో వీరిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత వారు దాని నుండి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ నేను ముందు అన్నట్టుగా ఎంతో క్యూరియాసిటీ తో సినిమా చూసాను కామెడీ బాగుంటదేమో అని ఏమి పెద్దగా అనిపించలేదు  సాదా సీదగా నడిచింది సినిమా అంతా పెద్దగా ఆకట్టుకోలేదు అనుకోవచ్చు సినిమా !!!