నా గురించి నేను చెప్పుకోవడానికి పెద్ద ఏమి లేదు కానీ నా మనసులో మాట చెప్పుకోవడానికి దొరికిన చిన్న అవకాశం
నా పేరు సుబ్రమణ్యం నేను చదివింది డిగ్రీ బికామ్ అది ఆంధ్ర university దూర విద్య విధానం ద్వారా చదువుకున్నాను నాకు 30 సంవత్సరాలు వయసు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు ఒక చిన్న పాపా కూడా ఉంది నేను చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు
ఎందుకంటే అప్పుడెప్పుడో దాదాపు 12 సంవత్సరాలు క్రితం ఒక బ్రాండెడ్ మొబైల్ షాప్ లో చేసాను అప్పుడు ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సరిగ్గా చదువుకోలేదు అలాగే ప్రైవేట్ గానే కడుతూ డిగ్రీ పరీక్షలు రాసాను సాధారణ మార్కులతో పాస్ అయ్యాను ఇప్పుడు అదే పని
వేరే మొబైల్ షాపులో చేస్తున్నాను చాలి చాలని జీతంతో, మీకు ఇది చదివిన తరువాత ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అని మీకు సందేహం రావచ్చు
కానీ నా అలచనలు పంచుకుంటున్నాను అంతే కాని ఒక్కటి మాత్రం నిజం ఎవరి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా మారుతుంది ఆ మార్పు కోసమే ప్రతి మనిషి ఆరాటం, ప్రతి రోజు పోరాటం !!😢😢😢☺️☺️☺️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి