9, డిసెంబర్ 2021, గురువారం

" స్కైలాబ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 


స్కైలాబ్ సినిమా డిసెంబర్ 4 తేదీన విడుదల అయింది మన పెద్ద వాళ్ళు చెప్పేవారు కదా ఒకప్పుడు అదేదో స్కైలాబ్ అని ఆకాశం నుండి భూమి మీదకి పడిపోతుంది అని అప్పట్లో కోళ్లు, మేకలు కోసుకుని తినేసేవారు అని అదే కధాంశంతో వచ్చింది ఈ సినిమా ట్రైలర్ చూడటానికి ఆసక్తి గా ఉంది ఇక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

 అది బండ లింగంపల్లి అనే పల్లెటూరు ఆ ఉరిలోకి చిన్న మెడికల్ క్లినిక్ పెట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు సత్య దేవ్ అదే ఊరిలో ఉండే ఒకప్పుడు బాగా బతికిన రాహుల్ రామ కృష్ణ ఊరిలో అంత అప్పులు చేసి అందరూ చేత తిట్టులు తిడుతుండేవారు ఇక వీళ్లిద్దరూ కలిసి ఎలాగైనా క్లినిక్ పెడతాం అనుకుంటారు 

హీరోయిన్ నిత్యా మీనన్ పత్రికలకు ఏవో పిచ్చి కథలను పంపించి ఎలాగైనా మంచి రచయిత్రి కావాలని అనుకుంటుంది  అప్పుడే 1979 వ సంవత్సరం అప్పుడు స్కైలాబ్ ఉరి మీద పడింది అని చెప్పి రేడియో లో వినిపిస్తుంది 

అదే సమయంలో స్కైలాబ్ పడుతుంది అన్న వార్త విని ఆ ఊరిలో అందరూ కంగారు పడుతుంటారు సినిమా తీసుకున్న కథ బాగానే ఉంది కాని తీయటం లో ఎక్కడో ఏదో మిస్ అయింది 

స్క్రీన్ మీద అంతా ఆసక్తిగా అయితే లేదు అలా స్లో గా నడుస్తుంది అయితే చివరకు స్కై లాబ్ ఏమి అయింది అన్నది సినిమా కథ

జస్ట్ average అంతే పెద్ద సినిమా ఏమి బాగోలేదు మామూలుగానే ఉంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!