3, జనవరి 2023, మంగళవారం

"డ్రైవర్ జమున " సినిమా పై నా అభిప్రాయం !!!

డ్రైవర్ జమున సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

తన తండ్రి డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే కొంతమంది తన తండ్రిని అతి దారుణంగా చంపేస్తారు అయితే అప్పటినుండి తన తల్లి డిప్రెషన్ లోకి వెళ్లి మానసిక స్థితి బాగోదు అయితే తన తండ్రి చేసిన డ్రైవర్ ఉద్యోగాన్ని హీరోయిన్ చేస్తూ ఉంటుంది కథ ఇలా ముందుకు వెళ్తుంది 

అయితే కొంతమంది రౌడీ లు ఒక రాజకీయ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తారు అయితే వాళ్లు వెళ్ళే కారులో ప్రమాదంలో పడి ఆగిపోతుంది అయితే అక్కడ వాళ్ళు క్యాబ్ ను బుక్ చేసుకుంటారు ఆ కారు హీరోయిన్ దే 

మొదట వాళ్ళు మొహాలు చూసి రైడ్ కు రాను అంటుంది కానీ వాళ్ళు ఏలాగొలా ఒప్పించి తీసుకువెళతారు అక్కడ కొంత దూరం ప్రయాణించిన తరువాత వాళ్లు ఎవరినో చంపడానికి వెళ్తున్నారు అని తనుకు తెలుస్తుంది అయితే అలాంటి సమయంలో తను ఎటువంటి నిర్ణయం తీసుకుంది చివరకు హీరోయిన్ వాళ్ళను ఏమి చేసింది అన్నది మిగిలిన కథ 

సస్పెన్స్ తో కూడిన సినిమాలు ఇష్టపడేవారు కి నచ్చుతుంది ఈ సినిమా బాగుంది గంటన్నర సినిమా మాత్రమే బాగుంది చూడ వచ్చు !!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!