7, మే 2022, శనివారం

కీర్తి సురేష్ " చిన్ని" సినిమా పై నా అభిప్రాయం !!!

కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలో చేసిన చిన్ని సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది నిన్న విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇది ఒక పేద కులంలో పుట్టిన ,పేరు పలుకుబడి ఉన్న కుటుంబంలో పుట్టిన వారికి జరిగే కథ ఇందులో కీర్తి ఒక పేద కులంలో పుట్టి  తన భర్తని, కూతుర్ని పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది అయితే వాళ్ల భర్త పనిచేసే రైస్ మిల్ లో చిన్న గొడవ జరుగుతుంది తక్కువ కులం అని చెప్పి అతడిని హేళన చేస్తూ ఉంటారు యజమానులు అయితే వాళ్ళతో గొడవ పడి ఉద్యోగం మానేస్తాడు అయితే మరలా వెళ్లి బతిమాళితే తన భార్య గురించి తప్పుగా మాట్లాడుతారు 

ఆ గొడవ పెద్దయి చివరకు వారిని చంపే వరుకు వెళ్తుంది కీర్తి ఇందులో చిన్ని పాత్రలో చేస్తుంది తనని ఒక చోటకీ రమ్మని తన మీద రేప్ చేస్తారు చాలా చిత్ర హింసలు పెడతారు తన భర్తని, కూతుర్ని బ్రతికుండగానే ఇంటిలో కిరోసిన్ పోసి కాలేచేస్తారు

అయితే వాళ్ళ మీద చిన్నీ ఎలా పగ తీర్చుకుంది సెల్వ రాఘవన్ కి చిన్ని ఏమిటి సంబందం అన్నది మిగతా కథ పగ, ప్రతికారాలు చుట్టూ తిరుగుతుంది కథ అంతా హింస చాలా ఎక్కువుగా ఉంది సినిమాలో రొటీన్ సినిమాల కాకుండా హింస తో కూడిన సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!